arrival
-
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. కొత్తగా మరో టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సదుపాయాల విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టెర్మినల్ మొదటి దశలో భాగంగా తూర్పు వైపు కొత్తగా 15,742 చదరపు మీటర్ల టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మరో నెల రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం ఉంది. తాజాగా పూర్తి చేసిన విస్తరణతో ఎయిర్‌పోర్టు టెర్మినల్ వైశాల్యం 3,79,370 చదరపు మీటర్లకు పెరిగింది. సాలీనా సుమారు 3.4 కోట్ల మంది ప్రయాణీకుల సామర్థ్యానికి వీలుగా ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా తొలి దశ టర్మినల్ విస్తరణలో కొంత భాగం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదనంగా పలు సౌకర్యాలు.. ఏటా కోటి 20 లక్షల మంది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌పోర్టులో 2019 నాటికి ప్రయాణికుల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ ఇంటెరిమ్ డిపార్చర్ టెర్మినల్, ఇంటెరిమ్ డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. విస్తరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్‌తో 149 చెక్ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పయర్ భవనాల్లో మరిన్ని లాంజ్‌లు, రిటైల్ అవుట్లెట్లు ఉంటాయి. అలాగే 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. (క్లిక్: ఫలించిన పరి‘శ్రమ’.. టీఎస్ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు) రన్‌వే సామర్థ్యం పెంపు... రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా నాలుగు రాపిడ్ ఎగ్జిట్ టాక్సీ వేలను ఏర్పాటు చేశారు. దీంతో విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుంచి ట్యాక్సీ ఆఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. రన్‌వే ఆక్యుపెన్సీ సమయం కూడా తగ్గి, సామర్థ్యం పెరుగనుంది. అలాగే సెకెండరీ రన్ వేను ఉపయోగించుకునే సందర్భంలో సమర్థవంతమైన ఆపరేషన్ కోసం మరో కొత్త సమాంతర ట్యాక్సీవేను కూడా అభివృద్ధి చేశారు. కొత్తగా మూడు ఎయిరోబ్రిడ్జిలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం 6 ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం అన్ని సదుపాయాలతో కూడిన రెండు బేబీ కేర్ రూములు, 2 ఫ్యామిలీ రూమ్‌లను నిర్మించారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. (క్లిక్: నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!) -
రేపు సీఎం చంద్రబాబు రాక
అనంతపురం టౌన్ : ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు లేదా బుక్కపట్నం మండలాల్లో ఏర్పాటు చేసే సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. సీఎం పాల్గొనే గ్రామాన్ని మంగళవారం ఖరారు చేయనున్నారు. -
నేడు ముఖ్యమంత్రి రాక
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5.45 గంటలకు అనంతపురం వస్తారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8.30 గంటల వరకు అధికార కార్యక్రమాలు ఏమీ లేవు. ఈ సమయంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం అవుతారని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా కొత్తూరు అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. 15న ఉదయం 8.57 గంటలకు పోలీసు శిక్షణ కళాశాల మైదానం చేరుకుని స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొం టారు. 11 గంటలకు కార్యక్రమం మగిస్తారు. అనంతరం తేనీటి విందులో పాల్గొంటారు. 12 గంటలకు బయలుదేరి వెళతారు. -
నేడు, రేపు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు ఎయిర్‌పోర్టుకు జగన్మోహన్రెడ్డి రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లాకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం వస్తున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సోమవారం వెల్లడించారు. -
27న జగన్ రాక
సజీవ సమాధి మృతుల కుటుంబాలకు పరామర్శ సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తూ మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు 27న జగన్మోహన్రెడ్డి గుంటూరు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజ శేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. -
నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రాక
హైదరాబాద్: శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ కు స్వాగతం పలకనున్నారు. ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి కూడా రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. -
ప్రధాని రాక నేపథ్యంలో భారీ బందోబస్తు
-
పాలమూరు బస్తీకి సీఎం
18న జిల్లాకేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 18న జిల్లాకేంద్రానికి రానున్నారని పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ వెల్లడించారు. సీఎం రెండురోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉందని, మురికివాడల్లో పర్యటించి మౌలిక వసతులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శ్రీనివాసగౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యటించే మురికివాడల జాబితాను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల ముఖ్యఅధికారులతో గురువారం జిల్లాకేంద్రంలో పర్యటించి జిల్లా కేంద్రంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, మార్కెట్, పెద్ద చెరువు, బైపాస్ వంటి సమస్యలపై నివేదిక తయారుచేసి 18న సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. మౌలిక వసతుల కల్పనతోపాటు జిల్లా కేంద్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలమూర్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వాటర్‌గ్రిడ్‌ను జిల్లా కేంద్రానికి కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా తమ నిజాయితీ పాలనకు నిదర్శనమన్నారు. వచ్చే జీహెచ్ఎంసీలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమావ్యక్తం చే శారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకు ల రాజేశ్వర్‌గౌడ్, రామన్‌గౌడ్, సుధాకర్‌రె డ్డి, వెంకటయ్య, శివకుమార్, ప్రతాప్‌రెడ్డి, రాశేద్, శివరాజు, విక్రమ్‌దేవ్ పాల్గొన్నారు. -
మోదీ పర్యటనకు ముందు జమ్మూలో కాల్పులు
జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు జమ్మూకాశ్మీర్ సరిహద్దున హింస చెలరేగింది. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం మోదీ జమ్మూ రానున్నారు. ఆ రాష్ట్ర రెండో విడత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు. గురువారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్నియా వద్ద ఉగ్రవాదులు భారత స్థావరాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించారు. -
రేపు జిల్లాకు చంద్రబాబు రాక
ఏలూరు, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదివారం తెలిపారు. 26న ఉదయం 9గంటలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి చించినాడ బ్రిడ్జి వద్ద జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశిస్తారని చెప్పారు. నరసాపురం, పాలకొల్లు, భీమవ రం నియోజకవర్గాల్లోని తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తాని వివరించారు. అనంతరం ఆకివీడు మీదుగా కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తారు. పర్యటన రూట్ మ్యాప్‌ను సోమవారం పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేయనున్నట్టు సీతారామలక్ష్మి వెల్లడించారు.