పాలమూరు బస్తీకి సీఎం
18న జిల్లాకేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 18న జిల్లాకేంద్రానికి రానున్నారని పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ వెల్లడించారు. సీఎం రెండురోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉందని, మురికివాడల్లో పర్యటించి మౌలిక వసతులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శ్రీనివాసగౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యటించే మురికివాడల జాబితాను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు.
అన్ని శాఖల ముఖ్యఅధికారులతో గురువారం జిల్లాకేంద్రంలో పర్యటించి జిల్లా కేంద్రంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, మార్కెట్, పెద్ద చెరువు, బైపాస్ వంటి సమస్యలపై నివేదిక తయారుచేసి 18న సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. మౌలిక వసతుల కల్పనతోపాటు జిల్లా కేంద్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలమూర్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వాటర్‌గ్రిడ్‌ను జిల్లా కేంద్రానికి కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా తమ నిజాయితీ పాలనకు నిదర్శనమన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమావ్యక్తం చే శారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకు ల రాజేశ్వర్‌గౌడ్, రామన్‌గౌడ్, సుధాకర్‌రె డ్డి, వెంకటయ్య, శివకుమార్, ప్రతాప్‌రెడ్డి, రాశేద్, శివరాజు, విక్రమ్‌దేవ్ పాల్గొన్నారు.