తూర్పుగోదావరిలా పాలమూరు | Palamuru as East Godavari says KCR | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలా పాలమూరు

Published Thu, Mar 30 2017 3:09 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

తూర్పుగోదావరిలా పాలమూరు - Sakshi

తూర్పుగోదావరిలా పాలమూరు

18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం: కేసీఆర్‌
- పాలమూరు ఎత్తిపోతల కట్టితీరుతాం
- ఖరీఫ్‌ నాటికి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- ముఖ్యమంత్రిని కలసిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు


సాక్షి, హైదరాబాద్‌: సమైక్య పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు కొత్త, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందించడం ద్వారా మహబూబ్‌నగర్‌ పాత జిల్లాను తూర్పుగోదావరి జిల్లాకు ధీటు గా తయారు చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఆ జిల్లా ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యేలు డి.కె.అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ చంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తదితరులు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై చర్చించారు. పాలమూరు జిల్లా కున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్‌ తదితర అంశాలను సీఎం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెం టేషన్‌ ద్వారా వివరిం చారు. రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను కాపాడటమే తమ అభిమతమని అన్నారు. ‘‘గోదావరిలో 3000, కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్విని యోగం చేసుకుంటే చాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాను. 

పాలమూరు జిల్లాకు  నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్‌ చేశాం. ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా అపెక్స్‌ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం. పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తవు తాయి. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిలా ్లకు కూడా నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.  శ్రీశైలం వద్ద వంద టీఎంసీల లభ్యత ఉంది. అక్కణ్నుంచి ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ఇన్‌టేక్‌ ప్లాన్‌ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల నిర్మా ణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధా న్యమిచ్చింది. తుమ్మిళ్ల, గట్టు లిఫ్టు పనులు త్వరగా పూర్తయ్యే ట్లు చూస్తాం..’’ అని సీఎం చెప్పారు.

గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ అత్యవసరం
‘‘గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైన్‌ అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల íపీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం వెల్లడించారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలసి రావాలని నేతలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement