సాక్షి, మహబూబ్‌నగర్: మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పదహారు ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రంతిప్పుతా అంటున్న కేసీఆర్.. ప్రస్తుతం 15 సీట్లుంటే ఏం సాధించారని ప్రశ్నించారు. తన మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. పూర్తిస్థాయి మెజార్టీ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఎందుకు పెట్టారని అరుణ ప్రశ్నించారు.
సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల కోసం కేంద్రంలో జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. సుస్థిర పాలన, దేశ రక్షణ బీజేపీతో సాధ్యమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా డీకే అరుణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పదహారు స్థానాలను గెలుస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని అన్నారు. తెలంగాణలో స్థిరమైన పాలన ఉండాలని కేరుకునే కేసీఆర్ కేంద్రంలో మాత్రం హంగ్‌రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment