
మహబూబ్‌నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్‌రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు.
అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment