సోనియాపై పోటీకి సిద్ధం: నాగం | Ready to contest against Sonia Gandhi: Nagam Janardhan Reddy | Sakshi
Sakshi News home page

సోనియాపై పోటీకి సిద్ధం: నాగం

Published Tue, Oct 22 2013 6:47 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

సోనియాపై పోటీకి సిద్ధం: నాగం - Sakshi

సోనియాపై పోటీకి సిద్ధం: నాగం

హైదరాబాద్: తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేసినా తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తనపై పోటీ చేసే సత్తా లేకే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారని నాగం ఎద్దేవా చేశారు.

గడ్డిపోచను ఆపే శక్తి కూడా సీఎం కిరణ్కు లేదన్నారు. తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నాగం జనార్దన రెడ్డి డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాల నుంచి జీవోఎంకు తమ పార్టీ ఒకే నివేదిక ఇస్తుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను మంత్రి డీకె అరుణ, మల్లు రవి కలిశారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని దిగ్విజయ్ను వారు కోరారు. అలాగే గద్వాల్లో నిర్వహించనున్న జైత్రయాత్ర సభకు దిగ్విజయ్ని ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement