'డీకే అరుణ భర్త అరాచకాలు సృష్టిస్తున్నారు' | DK Aruna Husband accused of power abuse | Sakshi
Sakshi News home page

'డీకే అరుణ భర్త అరాచకాలు సృష్టిస్తున్నారు'

Published Wed, Oct 23 2013 6:19 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

'డీకే అరుణ భర్త అరాచకాలు సృష్టిస్తున్నారు'

'డీకే అరుణ భర్త అరాచకాలు సృష్టిస్తున్నారు'

మహబూబ్‌నగర్‌: గ్రూప్‌ పరీక్షలు జోన్‌లు వారీగా నిర్వహించాలని బీజేపీ నాయకుడు నాగం జనార్దన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యారంగ విషయంలో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కోరారు. బీజేపీ ముఖ్యమైన పాత్ర పోషిండం వల్లే తెలంగాణపై కాంగ్రెస్‌ ముందడుగు వేస్తోందని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి డీకే అరుణ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమె భర్త భరతసింహారెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని నాగం ఆరోపించారు.

తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని  నాగం జనార్దనరెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేసినా తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తనపై పోటీ చేసే సత్తా లేకే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారని నాగం ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement