dk bharata simha reddy
-
మంత్రి డీకే అరుణ భర్తపై కేసు నమోదు
ఇటిక్యాల(మహబూబ్నగర్ జిల్లా): రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ భర్త, గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డిపై ఎట్టకేలకు పోలీసు కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నాయకుడు, ఇటిక్యాల మాజీ ఎంపీపీ జి.ఖగనాథరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై షేకుపల్లి సర్పంచ్ రవీందర్రెడ్డి గత నెలలో కోదండాపురం పోలీస్స్టేషన్లో భరతసింహారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకుడు ఖగనాథరెడ్డి ఇటీవల భరతసింహారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ గద్వాల కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు భరతసింహారెడ్డి, ఇటిక్యాల మండలానికి చెందిన జింకలపల్లి భీమేశ్వర్రెడ్డి, వీరాపురానికి చెందిన దండల రాముడు, మన్నెగౌడ్లపై 504, 506, 448, 307, ఐపీసీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్సై గౌసుద్దీన్ తెలిపారు. గురువారం ఎఫ్ఐఆర్ కాపీలను గద్వాల కోర్టుకు సమర్పించామన్నారు. -
డికె భరత్ సింహారెడ్డి అధికార దుర్వినియెగం
-
'డీకే అరుణ భర్త అరాచకాలు సృష్టిస్తున్నారు'
మహబూబ్నగర్: గ్రూప్ పరీక్షలు జోన్లు వారీగా నిర్వహించాలని బీజేపీ నాయకుడు నాగం జనార్దన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యారంగ విషయంలో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కోరారు. బీజేపీ ముఖ్యమైన పాత్ర పోషిండం వల్లే తెలంగాణపై కాంగ్రెస్ ముందడుగు వేస్తోందని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి డీకే అరుణ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమె భర్త భరతసింహారెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని నాగం ఆరోపించారు. తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్లో ఎవరికీ లేదని నాగం జనార్దనరెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేసినా తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తనపై పోటీ చేసే సత్తా లేకే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారని నాగం ఎద్దేవా చేశారు.