
సాక్షి,హైదరాబాద్:బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి 18) ఈ విషయమై డీకే అరుణ సాక్షి టీవీతో మాట్లాడారు.‘బీసీలపై ప్రేముంటే సీఎం పదవికి రేవంత్‌రెడ్డిని రాజీనామా చేయించి తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేయాలి.
కులగణన సర్వేలో రాజకీయ ప్రస్తావన ఎందుకు ?కులగణనలో కుటుంబ వివరాలు మాత్రం ఇవ్వడానికి నేనే సిద్ధమే. ఇతర వివరాలు కావాలంటే నా ఎన్నికల అఫిడవిట్ చూసుకోండి. నన్ను సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ ఎవరు ?
రేవంత్‌రెడ్డినే తెలంగాణ నుంచి బహిష్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేషన్ కార్డులపై ఖచ్చితంగా ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందే’అని డీకే అరుణ స్పష్టంచేశారు.