
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రతీసారి ముస్లింలు, మజ్లీస్ మాత్రమే అంటూ కాలయాపన చేయడమే తప్పా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి.. ఒక కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు మహేష్ కుమార్‌గౌడ్,
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా పోటీకి దిగడాన్ని తప్పుబట్టారు. బలం లేనప్పుడు పోటీకి దిగి మిగతా పార్టీలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘ప్రతీ ఎన్నికల్లో ఏదో ఓక పార్టీ అండతో గెలుస్తారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో తెలంగాణ కు పైసా రూపాయి లాభం అయినా జరిగిందా?, ముస్లిం, మజ్లీస్ తప్ప కిషన్ రెడ్డి నుంచి మరో మాట రాదు.
బలం లేకున్నా ఏ ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఎవరి ప్రేమ కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. మాకు బలం లేదు కాబట్టే పోటీ చేయలేదని మేము ప్రకటించాం. బీజేపీ, బిఆర్ఎస్ మధ్య ప్రేమ చిగురించింది’అంటూ ధ్వజమెత్తారు.ఏరోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసారా?, పూర్వ కాలంలో కిషన్ రెడ్డి, ఓవైసీ అన్నదమ్ములు అయ్యి ఉంటారు.
రజాకార్ల అంటె కిషన్ రెడ్డికి ప్రేమ ఎందుకు?, ... పదే పదే రజాకార్ల ప్రస్తావన కిషన్ రెడ్డి ఎందుకు తెస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో బండి సంజయ్ కి తెలుసా?, ఇతర రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్