
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణకు సీఎం(Telangana CM)గా ఉంటారని వ్యాఖ్యానించిన మహేష్ గౌడ్.. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని కూడా చూస్తామన్నాను. అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్(Bandi Sanjay).. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.
దశాబ్లాలు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో ఇప్పటివరకూ బీసీ వ్యక్తిని ఎందుకు ముఖ్యమంత్రిగా చూడలేకపోయామనే కోణాన్ని లేవనెత్తుతూ.. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. దీనికి బదులుగా టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తిని సీఎంగా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment