mahesh kumar goud
-
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ కి నూకలు చెల్లాయని, పదేళ్ల పాలనలో యథేచ్ఛగా నీళ్లు, నిధులు, భూములు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు 2023లో గద్దె దించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదు.. మొత్తం అన్యాయమేనని, దీనిపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.19న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం హనుమకొండకు విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ముందుగా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రా న్ని బీఆర్ఎస్ అప్పుల తెలంగాణగా మార్చిందని, ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్ర మే బంగారుమయం అయ్యిందని.. పేదలు అష్టకష్టాలు పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను నిర్వర్తించకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. తెలంగాణలో ఉనికి కోసం కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యతి్నస్తున్నదన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమా, కాదా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలన్నారు. కులగణనతో దేశానికే రోల్‌మోడల్.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు మహేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పది నెలల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నేపథ్యంలో నిర్వహించనున్న ఈ సభ చరిత్రాత్మకంగా నిలవబోతుందన్నారు. రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కులగణన చేపడుతోందని, కులగణనతో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నాడని, తాను జైలుకు పోవడం ఖాయమని కేటీఆర్‌కు తెలిసిపోయిందని చెప్పారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశీలించారు.సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ జిల్లాల టూర్
-
లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్... తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపు ‘కులగణన’ సదస్సుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన సాయంత్రం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కుల సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు పాల్గొని కులగణన సంప్రదింపుల సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ గంటపాటు అన్ని వర్గాలతో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కులగణన దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ నేతలు రోహిణ్‌రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
5న రాష్ట్రానికి రాహుల్, ఖర్గే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో తేదీ నుంచి నిర్వహించనున్న కులగణనపై మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే సమావేశానికి రాహుల్ హాజరవుతారని, ఇదే సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించామని చెప్పారు.వీలును బట్టి ఆయన కూడా హాజరవుతారని వెల్లడించారు. కులగణన కోసం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కనెక్ట్ సెంటర్‌ను పార్టీ నేతలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగం కావాలని పిలుపునిచ్చారు. కులగణనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కనెక్ట్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులగణన ఎక్కడా బ్రేక్ లేకుండా నిష్పక్షపాతంగా, సజావుగా జరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందని చెప్పారు.మహేశ్వర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, బీజేపీలో ఆయనకు కుర్చీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు అమలు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఎక్కడ అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
ధరణితో భూముల్ని దర్జాగా దోచేశారు : పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్: ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి పోర్టల్‌పై ఆయన మాట్లాడుతూ.. ఊరు పేరు లేని సంస్థలకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్,హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఎన్ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు చెప్పారు. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పొందంలో పేర్కొందని తెలిపారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం. వామపక్ష భావజాలంతో ఉండి..బీజేపీకి వెళ్ళింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కదా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటల ప్రధాని మోదీని అడగాలని సూచించారు. -
బీఆర్ఎస్,బీజేపీ రెచ్చగొడుతున్నాయి: పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్‌లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్‌గౌడ్ మండిపడ్డారు.ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి -
‘సమన్వయం’తో ముందుకు!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారంఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. తక్షణమే ఓటర్ల నమోదుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్‌లు కూడా జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
-
మీ మేనిఫెస్టోల్లో పెట్టలేదా?
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అందరూ గ్లోబల్ వారి్మంగ్ గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌కుమార్ విమర్శించారు. సోషల్‌మీడియా కోసం బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్‌ను బీఆర్ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్ఎస్ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు. తలో దిక్కు దోచుకున్నారు రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ మల్లన్నసాగర్ కట్టేందుకు సీఆరీ్పఎఫ్ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ చేసిన ట్రోలింగ్లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అసమ్మతిపై కాంగ్రెస్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.సమర్థుల కోసం అన్వేషణపీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఇవ్వొద్దని, ముఖ్యంగా అధికారుల పోస్టింగ్‌ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందువల్ల ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేసుకుంటే.. రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. మహేశ్‌గౌడ్ నియామకంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పారీ్టలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్‌సభ సీట్లు గెలిచాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో కచి్చతంగా అవకాశాలు వస్తాయి. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే మహేశ్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వచి్చంది. బీసీల కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన. ఆయన ఆలోచన మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సుప్రీం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ప్రజల్లో ఉండేవారికే డీసీసీల బాధ్యతలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ చెప్పారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఆ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని.. తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కలి్పస్తామని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు వస్తాయన్నారు. ఇన్చార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు తమ జిల్లాలో పర్యటించాలని సూచించారు. కార్యకర్తల రుణం తీర్చుకోవాలి: మహేశ్‌గౌడ్ తాను పీసీసీ అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తానని.. పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పీసీసీ చీఫమహేశ్కుమార్గౌడ్ తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమన్నారు. కార్యకర్తలు, నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేసినందుకే అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గుర్తించాలని.. ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలను గెలిపించుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తలను గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పదవుల్లో కూర్చోబెట్టాలన్నారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని.. కార్యకర్తలను సమాయత్తం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మహేశ్‌గౌడ్ చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ఖ జానాకు నెలకు సగటున రూ.18 వేలకోట్ల ఆదా యం వస్తోందని.. అందులో రూ.6 వేలకోట్లు ప్రభు త్వ ఉద్యోగుల జీతాలకే పోతాయని, మరో రూ.6 వేలకోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగతా రూ.6 వేలకోట్లలో రూ.3 వేలకోట్లు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఖర్చవుతున్నాయని, ఇంకో రూ.3 వేల కోట్లతో కొత్త పథకాల అమలు, ప్రభుత్వ నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉండటంతో దుబారా ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. ⇒ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ, ఫ్యామిలీ హెల్త్ కార్డుల అంశాలను ఎమ్మెల్యేలకు సుదీర్ఘంగా వివరించారు. పాత రేషన్‌కార్డులు తొలగించడం లేదని.. ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. ⇒ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ⇒ ఇక ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పరి్ణకారెడ్డి, అమీర్ అలీఖాన్ తదితరులు మాట్లాడారు.సీఎల్పీ సమావేశానికి ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు! ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హాజరవడం గమనార్హం. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాం«దీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి సీతక్క, ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనివార్య కారణాలవల్ల సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.గాంధీ నియోజకవర్గమనే వచ్చారు: మంత్రి శ్రీధర్‌బాబు పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ నేత అయినప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలకు.. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ఏదైనా నియోజకవర్గానికి సీఎం వచి్చనప్పుడు స్థానిక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమేనని చెప్పారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉందని.. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం కార్యక్రమం జరిగితే హరీశ్‌రావు వెళ్లరా? అని ప్రశ్నించారు. -
చీఫ్ కు పార్టీ నేతల ఫిర్యాదు..
-
కులగణన చేసి తీరుతాం
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కులగణనకు అంతా సిద్ధంగా ఉందని, దీనికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని, వెనువెంటనే బీసీ కమిషన్‌ను కూడా నియమించామని గుర్తు చేశారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఇదే పార్లమెంట్లో కులగణన తీర్మానం చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయేతరాలకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాటం, హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం గాం«దీభవన్‌లో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులరి్పంచారు. అనంతరం మహేశ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విలీనంలో పాత్ర లేని బీజేపీ.. కాంగ్రెస్ పారీ్టకి నీతులు చెప్పాల్సిన అవసరంలేదని హితవు పలికారు.స్వాతంత్య్రానంతరం అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌ను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కోరారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని, జనసంఘ్, బీజేపీల ఆచూకీ ఎక్కడా లేదన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించడం బీఆర్ఎస్కు తగదని మహేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీ కుటుంబాన్ని కించపరచడం బీఆర్ఎస్ నీతిమాలిన చర్యలకు పరాకాష్టఅని విరుచుకుపడ్డారు.తొమ్మిదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకలి్పంచామని చెప్పారు. హైదరాబాద్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మహేశ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, మత్స వరలక్షి్మ, కోట్ల శ్రీనివాస్, మిద్దెల జితేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు
-
టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
-
కార్యవర్గానికి.. కొంత సమయం!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పారీ్టకి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో పార్టీ పదవులు, టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినా కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, వారి సల హా మేరకు కమిటీలను కూర్చి, ఆ కమిటీలపై హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.పీసీసీ అధ్యక్షునిగా ఈనెల 15వ తేదీన మహేశ్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహేశ్‌గౌడ్ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని, అధ్యక్ష పదవి అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారని గాంధీభవన్‌వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీని నియమిస్తారా? టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో గతంలో ఉన్న మిగిలిన కమిటీలను కొత్తగా ని యమిస్తారా లేక వాటినే కొనసాగిస్తారా అనే చర్చ ప్రారంభమైంది. టీపీసీసీకి అనుబంధంగా ఏడెని మిది కమిటీలు పనిచేస్తుంటాయి. వీటిలో టీపీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమి టీ లాంటి వాటిని కొత్తగా ప్రకటిస్తారని గాం«దీభవ న్ వర్గాలంటున్నాయి. టీపీసీసీకి ప్రచార కమిటీని నియమిస్తే దానికి చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి పదోన్నతి కలి్పంచి ఆ పదవిలో నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.ఇక, జగ్గారెడ్డితో పాటు అంజన్‌కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డిలు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణల మేరకు గతంలో నియమించిన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల స్థానంలో కొత్త వారు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.వీరితో పాటు సీనియర్ ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేతలను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంత మంది ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అధికార ప్రతినిధుల జాబితాలో మాత్రం మార్పులు చేస్తారని సమాచారం. అన్ని పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే నెలలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. -
బీఆర్ఎస్ ఎదురుదాడి తిప్పికొడతా: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
సాక్షి,హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతానని, బీఆర్ఎస్ ఎదురు దాడిని ఎప్పటికప్పుడు తిప్పి కొడతానని తెలంగాణ నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాడర్‌ను సిద్ధం చేస్తానని చెప్పారు. పీసీసీ అధ్యకక్షునిగా నియామకమైన తర్వాత శనివారం(సెప్టెంబర్7) సాక్షిటీవీతో మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.‘పార్టీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం నా ముందు ఉన్న పెద్ద టాస్క్. ఆర్గనైజేషన్‌లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే పదవులు ఇస్తారని నన్ను చూస్తే తెలుస్తుంది. పార్టీలో చాలా పోటీ ఉన్నాబీసీకి పీసీసీ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. నాకు పదవి ఇచ్చింది. త్వరలోనే పార్టీ పదవుల భర్తీ ఉంటుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతా. -
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అద్భుతంగా పనిచేశారంటూ పార్టీ అధిష్టానం అభినందించింది. మహేష్‌కుమార్‌గౌడ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్విద్యార్థి నేత నుంచిబొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ 1980లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ద్వారా విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఎనిమిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై యూత్‌కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, కార్య దర్శిగా, ప్రధానకార్యదర్శిగా పలు హోదాల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమ యంలో ఏపీ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుౖలెన సమయంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా టీపీసీసీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండాలని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. విధేయతకు పెద్దపీట వేస్తూ తాజాగా అధిష్టానం ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిల తర్వాత అధ్యక్షుడు కానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పదోన్నతి కల్పించి పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పదోన్నతి కల్పించి అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.కరాటే ‘డాన్’....రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు ఇష్టమైన కరాటే పట్ల ఆసక్తిని మాత్రం తగ్గనివ్వలేదు. 2006లో కరాటే బ్లాక్‌బెల్ట్ 6వ డాన్ పూర్తి చేసిన ఆయన రాష్ట్రంలో కరాటే క్రీడ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీని బలోపేతం చేస్తా : మహేశ్కుమార్గౌడ్నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధితోపాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నెరవేరుస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకాలం నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.’అని ఆ ప్రకటనలో మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడి గా నియమించిన వార్త తెలియగానే గాంధీ భవన్లో టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం అ«ధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ⇒ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడికి ఫోన్ చేసిన రేవంత్ అభినందనలు తెలిపారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్టు వెల్లడించాయి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రొఫైల్పేరు: బొమ్మా మహేశ్కుమార్గౌడ్తండ్రి: గంగాధర్‌గౌడ్ (లేట్)పుట్టిన తేదీ: 24–02–1966జన్మస్థలం: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లావిద్యార్హత: బీకాంరాజకీయ ప్రస్థానం: నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1986–1990) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1990–98) యూత్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శి (1998–2000) పీసీసీ కార్యదర్శి (2000–2003), అధికార ప్రతినిధి (2012–2016) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (2016–2021) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2017–2024) -
టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సారథితోపాటు పశి్చమ బెంగాల్‌కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత పత్రంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలలుగా కసరత్తు.. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్ష నియామకంపై గడిచిన రెండు నెలలుగా కసరత్తు జరుగుతుండగా, వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పది రోజుల కిందటే మరో దఫాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గ నేతకే పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.బీసీల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మహేశ్‌గౌడ్‌తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ల అభ్యర్థిత్వాలపై చర్చించారు. వారి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియా గాం«దీకి కట్టబెట్టారు. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పారీ్టకి సేవలందిస్తూ రాష్ట్ర నేతలందరితో సన్నిహిత సంబంధాలుగల మహేశ్ గౌడ్ వైపు ఏఐసీసీ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏ క్షణమైనా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.