వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో | TPCC chief Mahesh Kumar Goud released schedule on Wednesday sep 25th | Sakshi
Sakshi News home page

వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో

Published Tue, Sep 24 2024 6:13 AM | Last Updated on Tue, Sep 24 2024 6:13 AM

TPCC chief Mahesh Kumar Goud released schedule on Wednesday sep 25th

ఈ బుధవారం నుంచే కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో..

షెడ్యూల్‌ విడుదల చేసిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆ షెడ్యూల్‌లో వివరించారు. 

మంత్రుల షెడ్యూల్‌ ఇలా...
25 సెప్టెంబర్‌: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్‌:    శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్‌: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్‌: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్‌: సీతక్క, 16 అక్టోబర్‌: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్‌: కొండా సురేఖ, 23 అక్టోబర్‌: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్‌: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్‌: తుమ్మల నాగేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement