సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC candidate)ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి పేరు చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్న మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ నేతలందరూ వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు వేస్తామన్న ఆయన.. పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పనిచేసిన నాయకులకే పదవులు వస్తాయని.. కార్పొరేషన్ పదవుల భర్తీ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
Comments
Please login to add a commentAdd a comment