సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, కుల గణన అంశం రాష్ట్రంలో కీలకంగా మారనుంది.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇవ్వడం జరుగుతంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారనే దిల్ రాజుకు కార్పోరేషన్ పదవి ఇచ్చాం. తెలంగాణ తల్లిని విమర్శించడం అంటే తెలంగాణను విమర్శించడమే అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment