
హెచ్‌యూసీ భూములపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంపై తెలంగాణ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్: హెచ్‌యూసీ భూములపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంపై తెలంగాణ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కావాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని.. హెచ్‌సీయూ నుంచి ఒక ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు.. వర్శిటీ భూమి వర్శిటీకే ఉంది.. కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు’’ అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఆ భూముల్లో చెరువు, రాక్‌ఫామ్‌లను కాపాడతామని.. జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని మంత్రి అన్నారు.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నాం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రభుత్వ పనికి అడ్డు తగిలితే ఉపేక్షించం’’ అని భట్టి హెచ్చరించారు.