land issue
-
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
కడప (సెవెన్ రోడ్స్): భూసమస్య పరిష్కారం కోసం ఓ అన్నదాత రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. సమస్య పరిష్కరించాలంటే లంచమివ్వాలని అధికారులు డిమాండ్ చేయడంతో ప్రజాప్రతినిధులకు గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. అక్కడా పట్టించుకోకపోవడంతో మూడుసార్లు కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న్యాయం జరక్కపోవడంతో విసిగిపోయిన రైతు కలెక్టర్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డబ్బాలో డీజిల్ నింపుకుని సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కడప కలెక్టరేట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు నేపథ్యమిదీ.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామానికి చెందిన గడిమె సుధాకర్‌కు తండ్రి ద్వారా మూడు ఎకరాల పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన పొలంలో రెండెకరాలను రెవెన్యూ అధికారులు రికార్డుల నుంచి తప్పించారు. ఈ విషయం తెలిసిన సుధాకర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తప్పును సరిచేసేందుకు సర్వేయర్, వీఆర్వో చెరో రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ని కలిసి డబ్బు ఇచ్చుకోలేనని, న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదు. కాగా.. భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లిన రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ఎవరూ స్పందించలేదు. కలెక్టర్‌కు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మూడుసార్లు గ్రీవెన్స్ సెల్లో అర్జీలు సమర్పించినా ఫలితం కనిపించలేదు. దీంతో సోమవారం డీజిల్ నింపిన క్యాన్ పట్టుకుని కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కలెక్టర్ సమక్షంలోనే వంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవాలనుకున్నాడు. పోలీసులు అడ్డుకోవడంతో.. అయితే, గత వారం కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైతు సుధాకర్‌ను ప్రధాన ద్వారం వద్దే నిలిపి తనిఖీ చేయగా అతడి వద్ద ప్లాస్టిక్ కవర్లో తెచ్చిన డీజిల్ క్యాన్ బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు డీజిల్ క్యాన్ని లాక్కుని ఆయన్ను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వద్దకు రైతును తీసుకొచ్చారు. డీఆర్వో ఎదుట సుధాకర్ గోడు వెళ్లబోసుకుంటూ.. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. వారిలో ఒకరు దివ్యాంగురాలని చెప్పారు.తన భూమిని రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో, సర్వేయర్ రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. రాజకీయ నాయకులు మొదలు అందరి అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించకపోవడంతో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడితే సమస్య పరిష్కారమై,, తన కుటుంబమైనా బాగుపడుతుందని ఆశించి వచ్చానంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందించిన డీఆర్వో బి.మఠం తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. -
పోలీస్ స్టేషన్లోహోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఘట్కేసర్: ఓ హోంగార్డు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పరుశురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా , మక్త అనంతారం గ్రామానికి చెందిన మహ్మద్ ఘని హైమద్ చెర్లపల్లి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 258, 268లో 30 గుంటల భూమి ఉంది. దాయాదులు అఫ్జల్, జబ్బార్ తన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. అయినా తనకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి లోనైన మహ్మద్ ఘని బుధవారం సాయత్రం బాటిల్లో డీజిల్ తీసుకుని స్టేషన్‌కు వచ్చాడు. నేరుగా ఇన్స్పెక్టర్ క్యాబిన్లోకి వెళ్లిన అతను ఆయన ఎదుటే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్, ఇతర పోలీసులు అతడి నుంచి డీజిల్ బాటిల్‌ను లాక్కున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భూములు లాక్కోడానికి నీ అయ్య జాగీరు కాదు: రేవంత్‌పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని తెలిపారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేసిందన్న ఈటల.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారని ప్రస్తావించారు. అయితే ఫోర్త్ సిటీ పేరుతో ఆ 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.కొడంగల్‌లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా.. బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని గుర్తు చేశారు. లగచర్ల చుట్టూ పక్కల గ్రామాల సమస్య మాత్రమే కాదని, ప్రతీ రైతు తమ దగ్గరకు సమస్య వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. రైతులు నక్సలైట్లు కాదని, వాళ్లు వేరే వాళ్ళ భూములు అడగడం లేదని పేర్కొన్నారురేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారని ఈటల పేర్కొన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. రేవంత్‌లా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదని తెలిపారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా.. ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.రేవంత్.. నీ స్థాయి ఎంత?రేవంత్. నీ స్థాయి ఎంత?. హారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు. ఈ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నాలుగు వేల రూపాయలు నెలనెలా ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని స్వయంగా కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు సవాల్ స్వీకరిస్తున్నా..హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు. మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు.. 420 హామీలపై చర్చిద్దాం.’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
ఖర్గే ట్రస్ట్‌కు ఏరో స్పేస్ పార్కు భూమి కేటాయింపు.. బీజేపీ విమర్శలు
బెంగళూరు: బెంగళూరు సమీపంలోని డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై కర్ణాటక రాజకీయాల్లో వివాదం రాజుకుంది. సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు స్థలాన్ని మంజూరు చేయడాన్ని బీజేపీ ఖండించింది.ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని బీజేపీ ఐటీసెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా మండిపడ్డారు. కేవలం బంధుప్రీతి వల్లే భూమి కేటాయించారని దీనిపై ఖర్గే సమాధానం చెప్పాలని మాల్వియా డిమాండ్ చేశారు.After Chief Minister Siddaramaiah, now Congress President Mallikarjun Kharge and family are embroiled in a land scam in Karnataka…It has come to light from a news report, backed by documents that a trust (Siddhartha Vihara Trust) run by Mallikarjun Kharge's family, has been… https://t.co/SbhMjcQ8pC— Amit Malviya (@amitmalviya) August 27, 2024 మరోవైపు కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబికులు ఏరోస్పేస్ రంగంలో ఎప్పుడు పారిశ్రామికవేత్తలు అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ సిరోయ ప్రశ్నించారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాలను ఎస్సీ కోటాలో ఈ ట్రస్టుకు ఎలా కేటాయించారని విమర్శించారు. ఈ అక్రమ భూముల కేటాయింపుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.When did the Kharge family become aerospace entrepreneurs to be eligible for KIADB land? Is this about misuse of power, nepotism, and conflict of interest? My statement. 1/6@PMOIndia @AmitShah @JPNadda @BJP4India @BJP4Karnataka @INCIndia @INCKarnataka @RahulGandhi @kharge pic.twitter.com/7lwitXtzuP— Lahar Singh Siroya (@LaharSingh_MP) August 25, 2024 కాగా ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్ కులం (ఎస్సీ) కోటా కింద మంజూరు చేశారు. దీనికి ఖర్గే, ఆయన అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు.అయితే.. భూముల కేటాయింపును రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించుకున్నారు. సిద్దార్థ విహార ట్రస్టుకు నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయించామని అన్నారు. అక్కడ పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించామని తెలిపారు. రాహుల్ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఉందన్నారు. పరిశోధనా కేంద్రాలకు అనుకూలంగా ఉండాలనే ఆ భూమిని కేటాయించామని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చాణక్య యూనివర్సిటీకి పారిశ్రామికవాడలో కేవలం రూ.50 కోట్లకు 116 ఎకరాల భూమిని కేటాయించిందని, దీనిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. -
సంస్కరణలకు, తప్పులకు తేడా తెలీదా?
సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలపై చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా నిందలు మోపుతోంది. భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమనే దిక్కుమాలిన వాదనను సీఎం మొదలు టీడీపీ కింది స్థాయి నేతలంతా వినిపిస్తున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా కూడా ఇదే పాట పాడడం అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది. భూ సంబంధిత అంశాలపై ఎప్పటి మాదిరిగానే విజ్ఞాపనలు వస్తున్నా, టీడీపీ ప్రభుత్వం కావాలని వాటిని భూతద్దంలో చూపిస్తోంది. వచి్చన వినతుల్ని పరిష్కరించకుండా తప్పించుకునేందుకు భూ సమస్యలు కావడం వల్ల ఏమీ చేయలేకపోతున్నామనే పలాయనవాదాన్ని వినిపిస్తోంది. చంద్రబాబు, మంత్రులు చెప్పినట్లు వచి్చన వినతుల్లో 80 శాతం భూములకు సంబంధించినవే అయితే అందుకు గల కారణాలను వెలికి తీయవచ్చు. కానీ అలా చేయకుండా కేవలం గత ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. నిజానికి వైఎస్ జగన్ హయాంలో భూములకు సంబంధించి అనేక సంస్కరణలు జరిగాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన భూముల వ్యవహారాలపై నిర్ణయాలు వెలువడడంతో సహజంగానే కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి. వాటితోపాటు ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి భారీగా వినతులు వచి్చనా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంది. అప్పట్లోనూ సివిల్ వ్యవహారాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చేవి. అందుకనుగుణంగా వాటి పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా వాటిపై రాజకీయాలు చేస్తోంది. భూ సంస్కరణలు తెచి్చంది జగనే భూ సమస్యలను పరిష్కరించడానికి సాహసోపేతంగా అడుగులు వేసి అనేక సంస్కరణలు తీసుకువచి్చంది గత వైఎస్ జగన్ ప్రభుత్వం కాగా, అసలు భూ సమస్యల గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అనేక భూ వివాదాలకు కారణమైంది గత చంద్రబాబు ప్రభుత్వం. 2017లో చుక్కల భూముల చట్టం తెచ్చి ఆ భూముల సమస్యను పరిష్కరించకపోగా వివాదాస్పదంగా మార్చింది. స్వాతం్రత్యానికి ముందు నుంచి హక్కులు ఉన్న షరతుల గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వేలాది మంది రైతుల కడుపు కొట్టింది. అనా«దీనం భూముల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసింది. వీటన్నింటినీ పరిష్కరించేలా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2 లక్షల ఎకరాల చుక్కల భూములను 22ఎ జాబితా నుంచి బయట పడేయడంతో వాటిని సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. షరతులు గల భూములపైనా ఆంక్షలు లేకుండా చేయడంతో 50 వేల మంది రైతులకు మేలు జరిగింది. పేదలకు 46 వేల ఎకరాలు పంచడం కనిపించలేదా? చంద్రబాబు తన పాలనలో ఎప్పుడూ ఒక్క పేద వాడికి భూమి ఇచి్చన పాపాన పోలేదు. వైఎస్ జగన్ తన హయాంలో 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతులకు పంపిణీ చేశారు. దానిపై టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులతో ఫిర్యాదులు చేయిస్తూ పంపిణీపై నిందలు మోపుతున్నారు. భూమిని పొందిన వారిలో వైఎస్సార్సీపీ వారున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పేద వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అర్హత ప్రకారం భూములు పొందడాన్ని వక్రీకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులిస్తే విషం కక్కుతారా? చరిత్రాత్మక రీతిలో రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి మార్గం చూపడాన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ వికృతానందం పొందుతోంది. దశాబ్దాల క్రితం భూములు పొందిన వారికి ఆ భూములపై హక్కులు కలి్పంచడాన్ని నేరంగా చిత్రీకరిస్తోంది. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక, అసైన్డ్ రైతులు ఎన్నో బాధలు పడినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల కోరికను తీర్చడం కోసం.. ప్రభుత్వం నుంచి పొందిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములపై వారికి సంపూర్ణ అధికారాలు ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల 27 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అందులో 9 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూములను సాగు చేసుకుంటున్న లక్షల మంది రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు లభించాయి. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అందులో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. హక్కులు వచ్చాక 25 వేల ఎకరాలను అమ్ముకున్నారని అసైన్డ్ భూములపై అమలైన సంస్కరణను తప్పుదోవ పట్టిస్తోంది. వీటితోపాటే 1.79 లక్షల ఎకరాల సరీ్వస్ ఈనాం భూములను 22ఏ నుంచి తొలగించారు. ఆంక్షల చెరలో ఉండి ఎటూ కాకుండా ఉన్న లక్షల మంది రైతుల భూములపై వారికి హక్కులివ్వడాన్ని ఏమనాలి? రాజధాని పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టి వారికి అన్యాయం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో అసైన్డ్ రైతులందరికీ మేలు జరిగేలా అమలైన సంస్కరణను తప్పుగా వక్రీకరించి రాజకీయం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం మెప్పు కోసం సిసోడియా అత్యుత్సాహంరెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెప్పు కోసం పడిన పాట్లు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేశాయి. తాను ఎప్పుడూ చూడని స్థాయిలో భూములపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే కారణమని ఆయన సెలవిచ్చారు. భూ సమస్యలు రావడానికి ఆయన రెవెన్యూ శాఖలో పని చేసింది ఎప్పుడు? ఎప్పుడో కలెక్టర్‌గా చేసిన కొద్దికాలం తప్ప ఆ తర్వాత ఆయన రెవెన్యూ శాఖలో పని చేయనేలేదు. గత పదేళ్లుగా ఆయన కీలక శాఖల్లో పని చేసేందే లేదు. ఎడ్డెమంటే తెడ్డెం అనే వైఖరి.. తానే గొప్పవాడిననే అహంభావి కావడంతో ఆయనకు మంచి పోస్టింగ్ దక్కలేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. కాలం కలిసి వచ్చి ఇప్పుడు అనుకోకుండా రెవెన్యూ కార్యదర్శి పోస్టు వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఏం చెప్పినా చేసి, ఆయన్ను ఎంతైనా పొగిడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిపోదామనే ఆశ తప్ప ఆయన మాట్లాడేదాంట్లో అర్థం లేదని సీనియర్ అధికారులు చర్చించుకుంటున్నారు. అందుకే మదనపల్లి ఫైల్స్ దహనం కేసును అధికార పార్టీ రాజకీయం చేస్తే, అందులో సిసోడియా కూడా దూరిపోయి డప్పు వాయించేస్తున్నారు. కాలిపోయిన రెవెన్యూ రికార్డులన్నీ రీట్రైవ్ అయ్యాయని చెబుతూనే ఫోర్జరీ చేశారు కాబట్టే కాల్చేశారనే వితండ వాదాన్ని వినిపిస్తున్నారు. తాను ఐఏఎస్ అధికారిననే విషయాన్ని మరిచిపోయి పోస్టుల కోసం ఇంత దిగజరడం తగదని సాటి అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. భూముల రీ సర్వేతో కలిగిన ప్రయోజనాలు తెలియవా? దేశంలోనే మొట్టమొదటిసారిగా వందేళ్ల తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన భూముల రీ సర్వే అద్భుతమని కేంద్రం కితాబిచి్చంది. భూ వివాదాల పరిష్కారానికి ఏకైక మార్గం రీ సర్వే కావడంతో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొని 7 వేల గ్రామాల్లో గత ప్రభుత్వం సర్వే పూర్తి చేసింది. దాన్ని కొనసాగించాల్సింది పోయి రాజకీయ కారణాలతో అభాండాలు వేయడాన్ని రెవెన్యూ యంత్రాంగం తప్పు పడుతోంది. రీ సర్వేపై విషం చిమ్మే క్రమంలో రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్ వెల్ సెటిల్డ్ అంశమని, బ్రిటీష్ హయాంలో చాలా సిస్టమాటిక్‌గా ల్యాండ్ రికార్డులు నిర్వహించారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పడం చూసి ఐఏఎస్ అధికారులు విస్తుపోయారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల డిజిటలైజేషన్ జరగాలని, అందుకు రీ సర్వే తప్పనిసరి అని చెబుతుంటే ఎన్డీయేలోనే ఉన్న చంద్రబాబు అందుకు విరుద్ధంగా సొంత వాదనలు వినిపించడం విడ్డూరం. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం బ్రిటీష్ హయాంలో రికార్డులు కచ్చితంగా ఉంటే భూ వివాదాలు కుప్పలు తెప్పలుగా ఎందుకు వస్తున్నాయి? తన రాజకీయాల కోసం ఎలాంటి అబద్ధాలైనా ఆడడంలో చంద్రబాబును మించిన వారు లేరని రీ సర్వేపై ఆయన చేస్తున్న అడ్డగోలు వాదనలే నిదర్శనం. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకురావడానికి ఐదేళ్లపాటు రెవెన్యూ యంత్రాంగం కష్టపడి చేసిన సాహసోపేతమైన కార్యక్రమంపై బురదజల్లడం విజనరీ చంద్రబాబుకే సాధ్యం. రీ సర్వే ద్వారా ప్రతి గ్రామానికి ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకు భూ హక్కు పత్రం, భూములకు జియో హద్దులు వంటి అనేక ప్రయోజనాలున్నాయి. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. ఇదంతా మంచి కాదా? గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు చేసే కార్యక్రమం మొదలైంది. వీటన్నింటినీ కాదని మళ్లీ వివాదాస్పద పాత భూముల వ్యవస్థనే తీసుకువస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఏమనాలి? -
మియాపూర్ లో తగ్గిన ఉద్రిక్తత, అమలులో 144 సెక్షన్
-
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్..
సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
సుభాష్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.మా భూమిని ఆక్రమించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్‌గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. -
పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదుస్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. -
భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్
భూవివాదంలో జూ.ఎన్టీఆర్.. ఏకంగా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం సడన్‌గా ఈ న్యూస్ బయటకొచ్చింది. పలు వెబ్ సైట్స్‌తో పాటు మీడియా ఛానెల్స్‌లోనూ ఇది వచ్చింది. దీంతో అసలేం జరిగిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో తారక్ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు ఈ గొడవతో ఇతడికి సంబంధమే లేదని తేల్చి చెప్పింది.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)అసలేం జరిగింది?జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లోని ఓ ఫ్లాట్‌ని ఎన్టీఆర్ 2003లో కొన్నాడు. గీత లక్ష్మి అనే మహిళ దీన్ని విక్రయించింది. అయితే 1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల్లో గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎన్టీఆర్‌కి అమ్మేశారు. కానీ ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే లోన్ ఉందని చెప్పి, దాన్ని క్లియర్ చేసిన తర్వాత తారక్‌కి భూమి తాలుకూ పేపర్లు తీసుకున్నారు.అయితే ఆ ఫ్లాట్ తనఖా పెట్టి లోన్ తీసుకుని, చెల్లించని కారణంగా ఆ భూమిపై హక్కులు తమవే అని పలు బ్యాంకులు నోటీసులిచ్చాయి. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ(రుణ వసూళ్లు ట్రైబ్యునల్) తీర్పిచ్చిందని.. ఈ ఆదేశాల్ని రద్దు చేయాలని ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అయితే తారక్ కోర్టుకెళ్లారనేది నిజం కాదని, అలానే ఆ ఫ్లాట్ 2013లోనే తారక్ అమ్మేశారని ఇప్పుడు అతడి పేరు ఉపయోగించొద్దని చెబుతూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే ఈ ల్యాండ్ తో ఎన్టీఆర్ కి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్.. తన పుట్టినరోజుని విదేశాల్లోనే కుటుంబంతో కలిసి జరుపుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్ ల బాగోతం
-
సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్ ప్లానేంటి?
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భూ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది?. ఫార్మా సిటీ వస్తుందని తెలిసి ముందుగానే భూములు కొనుగోలు చేశారా?. ఆయనతో పాటు భూములు కొనుగోలు చేసిన ఇతర అధికారుల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోందా? అక్కడ భూములు అమ్ముకున్న రైతులు ఏమనుకుంటున్నారు? ఫార్మా సిటీ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందా?. రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా సిటీపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు.. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టారు. యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమనగల్లు మండలాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12వేల ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తి చేశారు. దాదాపుగా 500కు పైగా విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్రొడక్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. అయితే, దీనికి దగ్గరలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 25ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25ఎకరాల 19గుంటల భూమి తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు మూడు కోట్లకు పైగానే ఉంది. ధరణి పోర్టల్‌లో ఖాతా నెంబర్ 5237 ద్వారా సర్వే నెంబర్ 249/అ1లో 8 ఎకరాల భూమి, 249/ఆ2లో 10 ఎకరాల భూమి, 260/అ/1/1లో 7.19 ఎకరాల భూమి మొత్తం 25ఎకరాల 19 గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి నుంచి సెల్ డీడ్ ద్వారా భూమిని జ్ఞానముద్ర కొన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2018లో తన సతీమణి జ్ఞానముద్ర పేరుతో నిబంధనల మేరకే కొనుగోలు చేసినట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి టీవీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్లో కేటాయించిన నివాసస్థలంలోని ఇంటిని విక్రయించి.. కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భూమి కొనుగోలుపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఫార్మా సిటీ సమాచారం ముందుగానే తెలుసుకుని ఈ భూములు తక్కువ ధరకే కొనుగోలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాగుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలకు పైగా సోమేశ్ కుమార్ లబ్ధిపొందారు. ఈ భూమి కొనుగోలు చేసిన విధానంపై ఈడీ, విజిలెన్స్ విభాగాలకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అక్రమాస్తులు కూడకట్టుకున్నారని, ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సోమేశ్ కుమార్‌పై వస్తున్న భూ ఆరోపణలు.. ఎటువైపు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ భూములు కొన్న అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ చుట్టూ భూ కొనుగోళ్లపై విచారణ చేయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఐపీఎస్ అధికారి ఫార్మా సిటీ దగ్గర్లో మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి, నక్కర్తిమేడిపల్లి గ్రామాల రైతులను భయాందోళనకు గురి చేశారట. అడ్డగోలు ధరకే రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. ►సదరు ఐపీఎస్ అధికారి తమపై అక్రమంగా కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కంటతడి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ►ఫార్మా సిటీ భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు తాడిపర్తి గ్రామస్తులు, భూదాన్ ట్రస్టులో ఉన్న భూమిని కొందరు రియాల్టర్లు ఫార్మా సిటీకి అమ్ముకుని వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే భూమి కోసం చాలా ఏళ్లుగా ఆ ఊరి ప్రజలంతా న్యాయపోరాటం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ►ఫార్మాసిటీలో భూ సేకరణ వ్యవహారంలో ఓ వైపు గందరగోళం నెలకొనగా.. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులు ముందుగానే సమాచారం తెలుసుకుని రైతుల నుంచి అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారు. మొత్తంగా ఫార్మాసిటీ చుట్టూ భూములు కొన్నవాళ్ల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్ సీఐ శ్రీధర్ మంగళవారం హస్తాల్పూర్ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. -
తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా!
సమస్య ఏర్పడింది టీడీపీ ప్రభుత్వ హయాంలో. తప్పు చేసింది ఆనాటి పాలకులు. కానీ సిరా నిండా విషాన్ని నింపుకున్న ఈనాడు మాత్రం నాటి ప్రభుత్వ ప్రస్తావన లేకుండానే భూ సమస్యలంటూ కథనాన్ని అచ్చేసింది. భావనపాడు, దేవునల్తాడ, మర్రిపాడు గ్రామాల్లో ఇదే తరహా సమస్యలను పరిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌపడలోనూ అందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంటే.. అంతలోనే వింత వాదనను జనంపైకి రుద్దే ప్రయత్నం చేసింది. నౌపడలో భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయంటూ అసలు దొంగలను దాచేసి విషపు రాతలను జనం ఇంటికి పంపించింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భూకుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టీడీపీ అమరావతి తరహాలోనే మన జిల్లాలోనూ తన ప్రతాపం చూపించేందుకు విఫలయత్నం చేసింది. 2015 సంవత్సరంలో భావనపాడు పోర్టు పేరుతో వేలాది ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగా 2015 ఆగస్టు 28వ తేదీన భావనపాడు పోర్టు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 5798.02 ఎకరాల భూములను నిషేధిత ఖాతాలోకి మళ్లించింది. దీంతో భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూక్రయవిక్రయాలు జరక్క ఇక్కట్లు పడ్డారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుని 2022 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆ భూములకు విముక్తి కలిగించారు. నౌపడ పంచాయతీ గ్రామ కంఠంలోని 35 ఎకరాల భూమిని కూడా టీడీపీ ప్రభుత్వంలో 2017 జూలైలో నిషేధిత ఖాతాలోకి మళ్లించారు. 418–1లో 2 ఎకరాలు, 418–2లో 33 ఎకరాలు గ్రామకంఠంలో ఉన్నాయి. కానీ వీటిని నిషేధిత ఖాతాలో పెట్టేశారు. భావనపాడు పోర్టుకు కేంద్ర బిందువు నౌపడ కావడం వల్ల ఇక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరగడంతో అమ్మకం.. కొనుగోలు జరగకుండా టీడీపీ నేత వ్యూహాత్మకంగా దేవదాయ శాఖ భూముల పర్యవేక్షణ పేరుతో వీటిపై ఆంక్షలు విధించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. కానీ పచ్చ పత్రిక ‘ఈనాడు’ అంతలోనే రోత పుట్టించే కథనాన్ని వండి వార్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మింది. నాటి అవినీతి మకిలిని ఇప్పటి ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేసింది. భూములకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతులు, పేదల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లింది. వాస్తవంగా గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో పెట్టిన భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ భూ సమస్యను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కరించింది. నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు సర్వహక్కులు కల్పించింది. దీంతో ఆ రైతులు ఆనందంతో ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో నిషేధిత జాబితాలోకి వెళ్లిన నౌపడ గ్రామకంఠం భూముల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఉన్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఇక్కడి సమస్యను కూడా పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందన్నట్టుగా ఈనాడు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సమస్య పరిష్కరిస్తాం నౌపడ గ్రామంలో గ్రామకంఠం సర్వే నంబర్లపై భూములను దేవదాయ అఽధికారుల సమక్షంలో సబ్ డివిజన్ చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. – చలమయ్య, తహసీల్దార్, సంతబొమ్మాళి. ఇబ్బందులు పడ్డాం భావనపాడు పోర్టుతో పేరుతో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 5798 ఎకరాల రైతుల భూమిని నిషేధిత ఖాతాలో పెట్టింది. చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడ్డాం. భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడుకు రైతులంతా విన్నవించినా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విముక్తి కలిగింది. – బి. మోహన్ రెడ్డి, సర్పంచ్ భావనపాడు. స్పందనలో ఫిర్యాదు చేశాక.. నౌపడలో నాకు ఇళ్లకు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయి. దీంతో రుణం కోసం బ్యాంకుకు వెళితే స్థలం నిషేధిత ఖాతాలో ఉందని చెప్పారు. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో స్పందనలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాను. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఈ భూములను నిషేధిత ఖాతాలో చేర్చిందని అధికారుల ద్వారా తెలిసింది. – పరపటి మురళీ, నౌపడ -
నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: రాజకీయ కుట్రలో తన కుమార్తె తుల్జాభవానిరెడ్డి పావుగా మారిందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మూర్ఖులు, దౌర్భాగ్యులు, అధర్ములు తన బిడ్డను రోడ్డు పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటామని, చిల్లరగాళ్లకు తగిన గుణపాఠం చెబతానని తెలపారు. బంగారుతల్లి లాంటి తన కూతురుపై కేసు పెట్టలేదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం తన ప్రజా జీవితానికి ఆటంకం కల్పిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేని వారే తన బిడ్డను తనపై ఉసిగొల్పారన్నారు. అలా చేయడం మంచిది కాదని, వారికే అరిష్టంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజలు క్షమించరని, తిప్పికొడతారని పేర్కొన్నారు. తాను ప్రజాసేవకుడిని, ప్రజాసేవలో ఉంటానని.. శక్తి ఉంటే ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో గెలువాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. కాగా అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారంటూ కుమార్తె తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డిలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముత్తిరెడ్డి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది. చదవండి: ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ.. -
సర్వే నంబరే మార్చేశారు.. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు. ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా? ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్‌లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరోసారి హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో ముత్తిరెడ్డిపై కూతురు భవానీ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయామే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో, ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తుల్జా భవానీ రెడ్డి ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్నారు. అనంతరం.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మున్సిపాలిటికి అప్పగిస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నాపేరు మీద రాశారు. అక్రమంగా తండ్రి సంపాదించిన 1402సర్వే నెంబర్లో ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ స్థలం మళ్లీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు. దీనిపై చేర్యాల ప్రజలు క్షమించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
జనగామలో రిటైర్డ్ ఎంపీడీఓ సుపారీ హత్య!?
బచ్చన్నపేట/జనగామ: జనగామ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) దారుణ హత్యకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. అయినా మృతదేహం ఆచూకీ లభించలేదు. మూడు రోజులుగా మిస్టరీకి తెరపడినట్లు పోలీసులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో... వరంగల్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్య సమాచారం శనివారం సాయంత్రం బయటకు వచ్చింది. జనగామ మండలం సరిహద్దు చినరామన్‌చర్ల–పెదరామన్‌చర్ల శివారు చెరువు వద్ద మృతదేహం ఉన్నట్లు మొదటగా పుకార్లు వినిపించగా... ఆ తర్వాత చంపక్‌హిల్స్ క్రషర్ సమీపంలోని లోయ(చెరువు) వద్ద ఉందని తెలిసింది. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రాత్రి వరకు ఆరా తీశారు. దీనిపై అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో... మృతదేహం ఆచూకీ లభ్యమైనప్పటికీ పోలీసులు గోప్యత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా విచారణ బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నల్లా రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ.. ఆర్టీఏ కార్యకర్తగా యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. అతను ఈ నెల15న మధ్యాహ్నం మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రామకృష్ణయ్య సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. సెల్ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ జిల్లా ప్రజా ప్రతినిధి భర్తతోపాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్‌నకు పాల్పడింది అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని బాధితులు ఫిర్యాదు చేయడంతో.. సీపీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. టాస్క్‌ఫోర్స్ టీం సీఐతోపాటు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి లోతుగా విచారణ జరిపిస్తున్నారు. ఆయన హత్యకు ముందస్తు ప్లాన్ వేసి, సుపారీ గ్యాంగ్‌కు పెద్దఎత్తున ముట్టజెప్పినట్లు భావిస్తున్నారు. హత్యకు దారితీసిన ఉదంతం? ఇటీవల గోపాల్‌నగర్ శివారులోని ఓ సర్వే నంబర్లోని భూమిలో నిరుపేదలు గుడిసెలు వేశారు. తన భూమిలో గుడిసెలు ఎలా వేస్తారని ఓ బీఆర్ఎస్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు భూమి ప్రభుత్వ/అసైన్డ్ పరిధిలో ఉందని రామకృష్ణయ్య వారికి భరోసా ఇస్తుండడంతో.. గుడిసెలు వేశారని సదరు బీఆర్ఎస్ నేత అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. పోలీసులు పట్టించుకోలేదు.. తమ తండ్రి రామకృష్ణయ్యను కిడ్నాప్ చేసిన రోజు నే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, దర్యాప్తు ఆలస్యం చేయడంతోనే ఇంతపని జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త, బీఆర్ఎస్ నేత అంజయ్యనే హత్య చేయించారని కుమారులు అశోక్, శ్రావణ్, భరత్ తెలిపారు. ఎమ్మెల్యే కూడా వెనకుండి నడిపించారని ఆరోపించారు. -
‘మంచిప్ప’లో బాధిత రైతుల ఆందోళన... మా భూమి మాకిచ్చేయండి
మోపాల్: మంచిప్ప రిజర్వాయర్ సర్జిఫుల్ వద్ద పరికరాలు, సామగ్రి, కంపెనీ కార్యాలయం కోసం వినియోగించుకుంటున్న భూమి ఇచ్చేయాలని బాధిత రైతులు శనివారం ఆందోళన చేట్టారు. ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న కంపెనీ రైతులతో 2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఆ ఒప్పందం గత నెలతో ముగిసింది. తిరిగి ఒప్పందం చేసుకుందామంటే రైతులు ముందుకు రావడంలేదు. భూమి ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈక్రమంలో రైతులు కంపెనీకి నోటీసు అందజేశారు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. రైతుల డిమాండ్ మేరకు రెండెకరాలను ఇచ్చేస్తామని చెప్పారు. మరో రెండెకరాలకు ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితులు మంచిప్పలోని చింతకుంట రాములు, గూండ్ల సాయిలు, నరేందర్, యమున అనే రైతులు 2016, 2018 సంవత్సరంలో నాలుగెకరాల భూమిని పనుల కోసం ఒప్పందం మేరకు కౌలు (పరిహారం)పై ఇచ్చారు. ఒప్పందం చేసుకున్న రైతుల్లో ఇద్దరు మృతి చెందారు. రెండేళ్లుగా మంచిప్ప రిజర్వాయర్ పనులను నిర్వాసితుల కమిటీ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో పనులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తున్నారు. తాజాగా ఒప్పందం ముగియడంతో మా భూమి మాకు కావాలని పట్టుబట్టారు. శనివారం బాధిత రైతులు కు టుంబసభ్యులు, గ్రామస్తులతో అక్కడికి చేరుకుని చనిపోయిన రైతులు ఫొటోలతో ఆందోళన, ధర్నా చేపట్టారు. చింతకుంట రాములు బ్యాచింగ్ ప్లాంట్ వద్ద సిమెంట్ సైలో ఎక్కి నిరసన తెలియజేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సమక్షంలో చర్చలు భూమి ఇచ్చేయాలని బాధిత రైతులతో ఆందోళనకు దిగగా, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి చర్చలు జరిపారు. రాములు మినహా మిగతా వారి భూమి ఇచ్చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కానీ రాములుకు చెందిన 2.02 ఎకరాల భూమిని ఆరు నెలల తర్వాత ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడాదికి రూ.1.30లక్షలు కౌలు చెల్లిస్తుండగా, అది పెంచి రూ.1.70 లక్షలు చెల్లించి ఒప్పందం గడువు పెంచుకుందామని ఆఫర్ ఇవ్వగా, ఆయన ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ముంపు నిర్వాసితుల కమిటీ, రైతులు, కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులు, పోలీసుల సమక్షంలో చర్చలు జరిగాయి. సుమారు రెండు గంటలకుపైగా జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మా భూమి మాకు కావాలని రైతులు చెప్పి వెళ్లిపోయారు. చర్చల్లో ప్రాజెక్ట్ డీఈ బాల్‌రాజ్, నవయుగ కంపెనీ ఏజీఎం కాశీ గోవింద్రావు, ఏఎస్సై రమేష్, ఉపసర్పంచ్ జగదీష్, ముంపు కమిటీ ప్రతినిధులు రాజేష్, భాస్కర్, బాధిత రైతులు పాల్గొన్నారు. -
వీడియో: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!
-
‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్‌తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్‌కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్‌లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్‌కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు. -
కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో విషాదం
-
రూ.కోట్ల విలువైన ఆ భూమి సర్కారుదే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం ఫతేనగర్ సర్వే నంబర్ 78, 79లోని దాదాపు 11.5 ఎకరాల (46,538 చదరపు మీటర్లు) భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో గతేడాది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో వందలకోట్ల విలువైన భూమి సర్కార్కే దక్కింది. వివరాలు... ఈసీఈ ఇండస్ట్రీస్ అక్కడ ఫ్యాక్టరీ నిర్మించడంతో ప్రభుత్వం 1982లో సర్వే నంబర్ 78, 79లోని కొంతభూమికి మినహాయింపు ఇచ్చింది. తర్వాత అధికారులు లెక్కలు వేసి, ఈసీఈ ఇండస్ట్రీస్ వద్ద సర్వే నంబర్ 74/పీ, 75/పీ, 76/పీలో 11.5 ఎకరాల మిగులు భూమి ఉన్నట్లు నిర్ధారించారు. ఆ భూమిని అర్బన్ సీలింగ్ ల్యాండ్(యూఎల్సీ)గా ప్రకటించి వెనక్కు తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈసీఈ ఇండస్ట్రీస్ 2009, 2010లో హైకోర్టు లో రెండు పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు. అది యూఎల్సీ అని బాలానగర్ తహసీల్దార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు 1965 నుంచి తమకు సేల్‌డీడ్ ఉందని ఈసీఈ ఇండస్ట్రీస్ పేర్కొంది. వాదనలు విన్న న్యాయమూర్తి రిట్ పిటిషన్లను అనుమతిస్తూ 2022లో ఉత్తర్వులు జారీచేశారు. యూఎల్సీ చట్టాన్ని రద్దు చేసే నాటికి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, చట్టప్రకారం జారీ చేసిన నోటీసులు పాతవేనన్నారు. చట్టాన్ని రద్దు చేసిన తర్వాత అధికారులు కార్యాలయంలో పంచనామా చేశారన్నారు. ఇప్పటికీ భూమి ఈసీఈ ఇండస్ట్రీస్ అధీనంలోనే ఉన్నందున వారికే చెందుతుందని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సవాల్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. వాదనల అనంతరం తీర్పునిస్తూ సింగిల్‌జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా పాత తేదీతో నోటీసులిచ్చారని సింగిల్‌జడ్జి పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని సమర్థించింది. పంచనామా నిర్వహించి భూములను స్వాధీనం చేసుకోవడం చట్టపరమైన అంశమేనని, దీన్ని ఆమోదించాల్సిందేనని పేర్కొంది. 2008లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. -
భూ సమస్య పరిష్కారం కోసం దంపతుల ఆత్మహత్యయత్నం
-
పనులు వేగిరం.. పరిహారం దూరం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మద్దూరి శ్రీనివాసరావు. చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీ పరిధిలో 36 గుంటల భూమే ఈయనకు జీవనాధారం. ఈ స్థలం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతోంది. దీంతో పరిహారంగా రూ.7.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఒక్క పైసా అందలేదు. సదరు భూమి శ్రీనివాసరావు తల్లి పేరు మీద ఉండటం, ఆమె గతేడాది చనిపోవడంతో.. పట్టాపై ఉన్న భూయజమాని లేరనే కారణంతో పరిహారం నిలిపేశారు. ఈయన చీకటి కిశోర్. సీతమ్మసాగర్ కింద ఇతని కుటుంబానికి సంబంధించిన భూమి ముంపునకు గురవుతోంది. దీంతో ఏడాది క్రితమే రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలం పట్టా కిశోర్ తండ్రి శాంతయ్య పేరిట ఉంది. ఆయన ఇటీవల మరణించారు. శాంతయ్య లేడనే కారణంతో ఆ కుటుంబానికి నేటికీ పరిహారం అందించలేదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. దీనివల్ల ఇటు దుమ్ముగూడెం, చర్ల, అటు మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు 3,267 ఎకరాలు మంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు రూ.160 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కోర్టు వివాదాలు, పట్టా పుస్తకం ఎవరి పేరుతో ఉందో ఆ భూ యజమానులు మరణించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 100 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు. సమస్యలు పరిష్కరించి ముంపు బాధితులకు పరిహారం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో భూమి సాగు చేసేందుకు వీలుకాక, మరోవైపు పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఇటీవల సీతమ్మసాగర్ బ్యారేజీ, ఫ్లడ్‌బ్యాంక్, వరద కాలువ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిహారం చెల్లించిన భూముల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు తిరిగేందుకు వీలుగా పొలాల్లో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. ఎక్కడిక్కడ కందకాలు తీశారు. దీంతో చాలా పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పరిహారం అందని రైతుల భూములు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ను రైతులు నష్టపోగా ఇప్పుడు రబీ సీజన్లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు రైతులు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బుధవారం చర్లలో బ్యారేజీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, అలాగే సంబంధిత వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా నేటికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. పరిహారం అందకపోయినా ఇన్నాళ్లూ భూములు సాగు చేస్తూ జీవించామని, ఇప్పుడు పనులు మొదలు కావడంతో సాగుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోవడంతో కడుపు నింపుకునేందుకు కూలీ పనులకు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచనిస్థితిలో కొందరు రైతులు పట్టణాలకు వలస వెళ్తుంటే, ఆసరా కోల్పోయిన వృద్ధులు ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు వారాల్లో నష్ట పరిహారం పెండింగ్‌లో ఉన్న పరిహారం ఫైళ్లు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ముంపు బాధితులకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – భరణిబాబు, తహసీల్దార్, చర్ల -
అమరావతిలో భూములు అమ్మారు..
ఆదిలాబాద్ టౌన్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆదిలాబాద్‌లోని రాణిసతీజి కాలనీలో ఉన్న పత్తి వ్యాపారి సచిన్ ఇంటి ఎదుట సోమవారం ఉదయం నుంచి బైఠాయించారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేసి గేటు ఎదుట పడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన 32మంది రైతులు అమరావతి రాజధానిగా ఏర్పడిన సమయంలో తమ భూములను విక్రయించారు. వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేశారు. బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుండటంతో స్థానిక వ్యాపారి లిల్లి మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్‌కు చెందిన సచిన్‌కు రెండున్నర రూపాయల వడ్డీతో రూ.6కోట్లు అప్పు ఇచ్చారు. ఈ మేరకు రూ.2కోట్ల నగదు చేతికివ్వగా రూ.4కోట్లు బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేశారు. రెండు నెలల్లోనే అప్పు తీర్చేస్తానని సచిన్ హామీ ఇచ్చి దాదాపు ఏడాదిన్నరవుతున్నా స్పందించడం లేదు. 2021 ఆగస్టులో డబ్బులు ఇచ్చామని, పలుమార్లు కలువగా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరయ్యారు. అందుబాటులో లేని వ్యాపారి.. కాగా సదరు వ్యాపారి అందుబాటులో లేరని కుటుంబీకులు తెలిపారు. ఓ న్యాయవాదితో మధ్యవర్తిత్వం చేయించినట్లు రైతులు చెబుతున్నారు. 45 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేలా చూస్తానని న్యాయవాది వారికి చెప్పగా.. చెక్కులు, నోట్లు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తామని తెలిపారు. అందుకు న్యాయవాది ఒప్పుకోలేదని అంటున్నారు. రైతులకు సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వ్యాపారి డబ్బులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతోపాటు ఇక్కడే బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆగని ‘మాస్టర్‌ప్లాన్’ మంటలు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్ – 2041 మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయభూములను రిక్రి యేషన్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్జోన్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్‌ప్లాన్ ప్రకటించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు. తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్ శివారులోని జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళారైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకున్నారు. మాస్టర్‌ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు పురుగుమందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు. -
భూమి కోల్పోయాననే ఆవేదనతో..
ఇల్లెందురూరల్: ప్రభుత్వ శాఖల సమన్వయలోపం వల్లే తనకు భూ సమస్య ఏర్పడిందని ఓ మాజీ నక్సలైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన కొడెం సమ్మయ్య పీపుల్స్‌వార్‌లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ సమయంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పునరావాసం కింద 1.20 ఎకరాల భూమినికి అతడికి కేటాయించారు. ఆ భూమిని వైటీసీ నిర్మాణానికి మళ్లీ అధికారులు స్వా ధీనం చేసుకుని, సుభాష్‌నగర్ గురుకులం వెనుక ఇచ్చారు. అయితే ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నేత ఆక్రమించుకోవడంతో న్యాయంకోసం సమ్మయ్య కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక రెవెన్యూ అధికారుల సూచనతో అతడికి కేటాయించిన భూమిలో గుడిసె వేసుకుంటే, సదరు నేత ఫిర్యాదుతో పోలీసులు సమ్మయ్యను అడ్డుకుంటున్నారు. అధికారికపత్రం లేకుండా సమ్మయ్యను భూమి జోలికి వెళ్లొద్దని పోలీసులు చెబుతుండగా..మరోవైపు భూమిహక్కుకు సంబంధించి రెవెన్యూ అధికారులు స్పష్టమైన పత్రాలు ఇవ్వకపోవడంతో వారిపై న్యాయపోరాటం చేసేందుకు అతడికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనపై తహసీల్దార్ కృష్ణవేణి స్పందిస్తూ రెండు రోజుల్లో సమ్మయ్యకు భూమి అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రైతు ఆత్మహత్యతో ఉద్రిక్తత
కామారెడ్డి టౌన్: తన మూడు ఎకరాల భూమి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో, ఆ భూమిని అమ్ముకోవడానికి వీలుపడక మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు (42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాలు పంట భూమి ఉంది. కాగా, ఇటీవల మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో అక్కడి భూములన్నీ ఇండస్ట్రియల్ జోన్లోకి చేర్చా రు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకురాక మనస్తాపంతో రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు మృతితో రైతులు గ్రామంలో కాసేపు ఆందోళన చేశా రు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తరలివచ్చారు. అయితే కామా రెడ్డి కొత్త బస్టాండ్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తర్వాత రాము లు మృతదేహాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ సమయంలో 2 గంటల పాటు రోడ్డుపైనే ట్రాక్టర్ లో మృతదేహం అలానే ఉంది. తర్వాత పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తన భర్త మృతదేహాన్ని తన అను మతి లేకుండా ఆస్పత్రికి తరలించినందుకు రాములు భార్య.. తన కుటుంబ సభ్యులు, ఇతర రైతులతో కలసి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడం దారుణమన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు భార్య శారద కోరారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి కుటుంబ సభ్యులతో కలసి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. రాములు మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ
సాక్షి, వికారాబాద్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని ఓ వ్యక్తి బుధవారం మీడియా ఎదుట ఆరోపించాడు. ఇందుకు సంబంధించి అతడి వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్ 20లో పదెకరాల భూమిని గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో తామే కబ్జాలో ఉన్నామని చెప్పాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దొరసాని రాములమ్మ నుంచి తమ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. 2004 వరకు సదరు భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరునే నమోదై ఉందని తెలిపారు. అయితే 2005లో దొరసాని సంబంధీడైన నర్సింహారెడ్డి అప్పటి తహసీల్దార్ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన కడీలను నగర మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తొలగించేయిస్తున్నారని, అడిగితే చంపేస్తామని గన్‌తో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్ -
మున్సిపల్ అధికారుల చేతివాటం.. 12కోట్ల విలువైన ల్యాండ్..
సాక్షి, రంగారెడ్డి: తట్టిఅన్నారంలో మున్సిపల్ అధికారులు చేతవాటం చూపించారు. కబ్జాదారుడు కేవీ సత్యనారాయణ రెడ్డితో అధికారులు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. కేవీ సత్యనారాయణతో చేతులు కలిపిన మున్సిపల్ అధికారులు వివాదాస్పద ప్రైవేటు భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపించారు. రూ.12 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు క్రుట చేశారు. ఈ క్రమంలో స్థానికులు వారిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ఆపేశామని చెప్పి తెల్లారేసరికి రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం అడ్డుకున్న బాధితున్ని కబ్జాదారుడు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ప్రతీరోజు ప్రైవేటు గూండాలను పెట్టి పహరా కాస్తున్నట్టు తెలిపారు. దీంతో, పోలీసులు సత్యనారాయణరెడ్డిపై హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. -
ఉద్రిక్తత: భూమి విషయంలో గొడవ.. కొట్టుకున్న రెండు గ్రామాల రైతులు
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుడికిల, నార్లాపూర్ గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం పదిమందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాలకు ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమది అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. -
స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ రామచంద్రస్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో వెలుగుచూసిన ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సర్కారు.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయశాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీతారామస్వామి... సీతారామరెడ్డి అయ్యాడు! దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. ఈ భూములన్నీ 55 నుంచి 63, 639–641, 656, 657, 660–682, 686–718, 736 సర్వే నంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతారాములుగా.. మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. రికార్డులు స్పష్టంగా ఉన్నా... ఆ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి? వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారు ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు క్లీన్చిట్.. పదోన్నతులు ఈ భూములను ’కబ్జా’లో ఉన్నవారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ, దీనిపై నియమించిన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. ఆలయ మేనేజర్ చంద్రమోహన్, సహాయ కమిషనర్ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని నివే దికలో పేర్కొంది. విజిలెన్స్, ఏసీబీ కూడా వీరితోపాటు నాటి దేవాదాయ కమిషనర్ వెంకటేశ్వర్లు, ముఖ్యకార్యదర్శి జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్ రామకృష్ణకుమార్, ఉపకమిషనర్ మోహనాచారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ, అప్పటి ప్రభుత్వం వారికి క్లీన్చిట్ ఇచ్చింది. ఆపై పదోన్నతులు కూడా కల్పించిందన్న ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్ శివారులోని ఈ 1,350 ఎక రాలు దేవాదాయ శాఖవేనని కమిటీ తేల్చ డంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌సహా వారి బంధువుల భూములు ఉన్నాయన్న నేపధ్యంలో కక్ష సాధింపునకే ప్రభుత్వం విచారణ చేపట్టిందని పలువురు విమర్శించారు. -
హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత!
సాక్షి, శ్రీకాకుళం: మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్ల హత్యయత్నం కేసులో టీడీపీ నేత కొట్ర రామారావే ఏ-1 నిందితుడిగా ఉన్నాడు. జిల్లాలో టీడీపీ నేతల అండతో కొట్ర రామారావు రెచ్చపోయాడు. దగ్గరి బంధువు దాలమ్మ, ఆమెక కూతురును వేధింపులకు గురిచేశాడు. బాధితులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఆక్రమించుకునేందుకు పలుమార్లు శారీరకంగా వారిని శారీరకంగా హింసించాడు. కాగా, 2017 నుంచి బాధితులైన తల్లీకూతుళ్లు.. రామారావు అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావు అండతో రామారావు కేసును నీరుగార్చేలా చేశాడు. ఇక, అడ్డగోలు అబద్ధాలతో చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్లో అబద్ధాలు చెబుతూ పోస్టులు పెట్టడం గమనార్హం. నిందితులు వైఎస్సార్సీపీ నేతలుగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ, స్థానికులు మాత్రం టీడీపీ నేతలే నిందితులని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇదీ జరిగింది.. హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర(గులకరాళ్లతో కూడిన మట్టి) పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజీ కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు. ఈ తరుణంలో సోమవారం వివాదం మరింత ముదిరింది. రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనుక ఉన్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు కూరుకపోవడంతో వారు పెద్దగా రోదించారు. వీరి కేకలు విన్న చుట్టు పక్కల వారు పారలతో కంకరను తీసి మహిళలను బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. -
బతికుండగానే చనిపోయినట్లు చూపి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయికోడ్: బతికుండగానే మరణించినట్లు చూపి 27.34 ఎకరాల భూమిని వేరొకరి పేర పట్టా చేసిన వ్యవహారంలో రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య సస్పెండ్ అయ్యారు. ఈ భూమిపై క్రయవిక్రయాలు అసలైన పట్టాదారులకు కనిపించకుండా ధరణి వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం ఉన్న ప్రైవసీ మోడ్‌లో పెట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇలా ప్రైవసీ మోడ్‌లో పెడితే సదరు భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరిగినా ధరణిలో కనిపించవు. అసలు ఉదంతమిదీ.. రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. హన్మంత్‌రెడ్డి గతేడాది మరణించడంతో ఆ భూమిని ఆయన భార్య శివమ్మ సక్సేషన్ (వారసత్వం కింద) పట్టా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటున్నారు. అయితే శివమ్మ కూడా మరణించిందని రికార్డుల్లో చూపిన తహసీల్దార్ రాజ య్య ఆ భూమిని ఈనెల 19న అంజమ్మ పేర మార్చారు. లావాదేవీలు ధరణి వెబ్సైట్లో కనిపించకుండా ప్రైవసీ మోడ్‌లో పెట్టారు. అనుమానం వచ్చిన శివమ్మ కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరాతీయగా తన తల్లి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేర మార్చారని చేసిన ట్లు తేలింది. దీంతో ఆయన కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు గురువారం విచారణ చేపట్టగా రాజయ్య బాగోతం బయటపడింది. ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్.. తహసీల్దార్ రాజయ్యతోపాటు, ఆర్ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం స్లాట్ బుకింగ్... పట్టా మార్పిడికి 3 నెలల క్రితమే స్లాట్ బుక్‌చేయడం గమనార్హం. సాధారణంగా స్లాట్ బుక్‌చేసిన నిర్ణీత వ్యవధిలోనే పట్టా మార్పిడి చేయాలి. అయితే తహసీల్దార్ మూడు నెలల అనంతరం పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారంలో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఆర్ఐగా పనిచేసిన శ్రీకాంత్.. అసలైన పట్టాదారు శివమ్మకు వారసురాలు అంజమ్మనే అంటూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి పౌతీమార్పు వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. శివమ్మ ఫిర్యాదు మేరకు.. ఆమె వియ్యంకురాలు అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్‌రెడ్డి, మనవడు రాజశేఖర్‌రెడ్డి, భూ బదలాయింపులో సాక్షులుగా ఉన్న టి.మల్లేశం, బి.నర్సింలుపై కేసు నమోదు చేశారు. -
సూర్యాపేటలో గిరిజనుల భారీ ర్యాలీ
భానుపురి (సూర్యాపేట): గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల పెంపుతోపాటు గిరిజన బంధు, పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చర్చి కాంపౌండ్ రోడ్డు, పొట్టిశ్రీరాములు సెంటర్, పూలసెంటర్, కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తా మీదుగా రైతుబజార్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు డీజే మోతలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య
సాక్షి, మోపాల్(నిజామాబాద్‌రూరల్): తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ గ్రామానికి చెందిన కర్రోళ్ల పెద్దబ్బయ్య (64), కర్రోళ్ల నడిపి సాయిలు (54) అన్నదమ్ముళ్లు. పెద్దబ్బయ్య ముగ్గురు కొడుకులు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లారు. రెండో కొడుకైన సతీష్ ప్రవర్తనలో తేడా రావడంతో.. కంపెనీ ప్రతినిధులు నాలుగేళ్ల క్రితం స్వగ్రామానికి పంపించారు. ఇక్కడ తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అప్పటినుంచి పనీపాటా లేకుండా తిరుగుతూ, తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇటీవల తానే పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్పాడు. చదవండి: (జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’) ఆడపెళ్లివారు ఆగస్ట్ 14న ఇంటికి వస్తారని గురువారం రాత్రి చెప్పాడు. గల్ఫ్‌లో ఉన్న అన్నదమ్ములతో మాట్లాడిన తర్వాత రమ్మని చెబుదామని కొడుకుని తండ్రి వారించాడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్నాన సాయిలు వచ్చి సతీష్‌కు నచ్చజెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మళ్లీ గొడవ మొదలైంది. వెంటనే కోపోద్రిక్తుడైన సతీష్ ఆవరణలో పనిచేస్తున్న తండ్రిని కర్రతో కొట్టడానికి వెళ్లగా, నడిపి సాయిలు అడ్డుకున్నాడు. వెంటనే సతీష్ అక్కడే ఉన్న పారతో నడిపి సాయిలు తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు. పెద్దబ్బయ్య అరుస్తూ తమ్ముడి వద్దకు రాగానే, తండ్రిని కూడా బలంగా మోదాడు. ఇద్దరి తలలపై పారతో మరోసారి బాది చనిపోయారని నిర్ధారణకు వచ్చాక నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నరహరి, ఎస్ఐ మహేష్, సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్య తరువాత తులసిచెట్టుకు పూజ తల్లి, వదినను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. తల్లి బయటికి పరుగెత్తి, వదిన ఇంట్లో గొళ్లెం పెట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారని స్థానికులు తెలిపారు. ఇద్దరిని హత్య చేసిన తర్వాత నిందితుడు తులసి చెట్టు చుట్టూ తిరిగి పూజలు చేశాడని వెల్లడించారు. పెద్దబ్బయ్య చితికి భార్య లక్ష్మీ, నడిపి సాయిలు చితికి కుమార్తె నిప్పంటించారు. సాయిలు కుమారుడు గల్ఫ్‌లో ఉండగా, భార్య మూడేళ్ల క్రితమే క్యాన్సర్‌తో మృతి చెందింది. చదవండి: (అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..) -
టాలీవుడ్ నటుడుకి కత్తులు, గన్‌తో బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం కేరవెళ్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 14, 15, 16, 17, 18, 19లలో 29.19 ఎకరాల పొలాన్ని హైదరాబాద్‌కు చెందిన నటుడు రణధీర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈయన పేరున ధరణి పట్టాదారు పాస్‌బుక్కులు సైతం వచ్చాయి. కొనుగోలు చేసిన పొలంలో పంటలు వేశారు. అందులో చుట్టూ కంచె వేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమద్ పనులను అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా తనవద్ద ఉన్న గన్ తీసి బెదిరించాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు సైతం కత్తులతో రణధీర్‌రెడ్డిని భయబ్రాంతులకు గురిచేశారు. గతంలోనూ హైమద్ రైతులను బెదిరించి ఇక్కడ ఓ షెడ్ నిర్మించాడు. గుంపులుగా గుర్రాలపై తిరుగుతూ తమతో పాటు ఇక్కడ భూములను కొనుగోలు చేసిన వారిని భయపెడుతూ.. కబ్జాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైమద్ తన అనుచరులతో వచ్చి గన్, కత్తులతో తమను బెదిరించాడని రణధీర్‌రెడ్డి చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్ స్వాధీనం.. సుల్తాన్ హైమద్ వద్ద గన్ ఉన్నది వాస్తవమేనని.. అది లైసెన్సుడ్ గన్ అని చన్గోముల్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. నటుడు రణధీర్‌రెడ్డి 29.19 ఎకరాలు కొనుగోలు చేశాడని, అతని వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయని చెప్పారు. హైమద్ మాత్రం తన పూర్వికులకు సంబంధించిన భూమి అని కబ్జాలో ఉన్నాడన్నారు. అతని నుంచి గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: Dhanush: నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు -
అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. కేశినేని నాని దుర్మార్గుడు.. తన సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తన గోడును పట్టించుకోవడం లేదంటూ నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) -
భూ పంపిణీయే పరిష్కార మార్గం!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా దేశంలో అసమానతల్లో పెద్దగా మార్పేమీ కనిపించడంలేదు. పేదల కోసం పోరాడే వారంతా ఒక గొడుగు కిందకు వచ్చి ఆర్థిక పోరాటాలు చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఇప్పుడు పీడిత వర్గాలకు దళితులు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. వేలాది జిగ్నేష్ మేవానీలు, కన్హయ్య కుమార్‌లు, ఉమర్ ఖాలీద్‌లు పుట్టుకు రావాలి. అప్పుడే ఈ బహుజనుల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిజానికి ఈ ప్రజల మౌలిక సమస్య – భూమి సమస్య. అంబేడ్కర్ మేధావి, మానవతావాది, ఆర్థికవేత్త, తత్త్వవేత్త. ఆయన ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ఈ వర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ప్రజలకు అన్నంపెట్టే కీలక రంగమైన వ్యవ సాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించారు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యావసాయిక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ వ్యావసాయిక క్షేత్రాలను సమష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలనీ, ఉత్పత్తిని సమష్టిగా పంచుకోవాలనీ అన్నారు. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదనీ, సమష్టి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి పెట్టుబడి, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చాలనీ; తద్వారా ఉత్పాదకతను పెంచాలనీ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించారు. లేకుంటే ఆర్థిక అసమానతలు పుడతాయని చెప్పారు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలు పక్కనపెట్టాయి. ఎప్పటికో, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 ఏళ్ల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకొన్నారు. దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామ సీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్న జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. ‘నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తు న్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేక పోయాను’ అంటూ ఆవేదన చెందారు అంబేడ్కర్. (క్లిక్: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయా ధారిత దేశంలో భూమికీ, సామాజిక న్యాయానికీ ఉన్న సంబంధం ఇదే. ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు. వీరు భూమి సంబంధాలన్నింటినీ మార్కెట్ సంబంధాలుగా మార్చారు. మార్కెట్ ఎప్పుడూ లాభం కోసమే వెంపర్లాడుతుంది కానీ ప్రజా సంక్షేమం దానికి పట్టదు. అందుకే వ్యవసాయాన్ని దండగమారి వృత్తిగా చిత్రించి, రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని కుప్ప కూల్చారు. దీంతో కార్పొరేట్లకు భూములను అమ్ము కొని రైతులు పట్టణాల్లో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. వ్యవసాయం మీదే ఆధారపడి కూలీలుగా బతికే బహుజనులదీ అదే దారయింది! (క్లిక్: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - షేక్ కరిముల్లా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
భూమి కబ్జా చేశారంటూ..
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన భూమిలో కొందరు అక్రమంగా ఉంటూ కొట్టం నిర్మిస్తున్నారని, తన చేను తనకు దక్కేలా చూడాలని కోరుతూ దరఖాస్తు రాసుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడకు చెందిన కొమ్ము నాగమ్మ ప్రజావాణికి వచ్చింది. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలసి అర్జీ అందజేసింది. అది చదివిన కలెక్టర్ ‘మీ భూమిని మీరే కాపాడుకోవాలి..’అని చెప్పి పంపించారు. దీంతో నిరాశకు లోనైన నాగమ్మ బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ తన సమస్య తెలిపింది. ఆమెతో వచ్చిన మరో ఇద్దరు కూడా నాగమ్మ సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఇక్కడే చనిపోయేందుకు పెట్రోల్ బాటిల్ తెచ్చుకుందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నాగమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమ్మ తన సమస్యను పూర్తిగా వివరించింది. ‘నాకు ఖానాపూర్ శివారులో సర్వే నంబర్ 68/93లో 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి శిరీష అనే మహిళ అధీనంలో ఉండేది. 2021 జూన్‌లో శిరీష చనిపోయింది. ఆమె బతికి ఉన్నప్పుడే ఈ భూమిని నాకు ఇచ్చేసింది. నేను భూమి పట్టా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నా. అయితే శిరీష బంధువులు పోయిన డిసెంబర్లో నా భూమిని కబ్జా చేసుకున్నరు. అక్రమంగా కొట్టం కడుతున్నరు. నేను చేనుకాడికి పోతే చంపుతామని బెదిరిస్తున్నరు. నా భూమి నాకు ఇప్పించుండ్రి’ అని నాగమ్మ వివరించింది. సమస్యను గుర్తించిన కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం..
నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. బ్రిటీష్ హయంలో లీజుకు తీసుకుని తరతరాలుగా అనుభవిస్తున్న సాగుభూములకు వారికే అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నరసాపురం: నరసాపురం మండలం దర్భరేవు కంపెనీ భూములను ప్రస్తుతం అనుభవిస్తున్నవారికే రూ.100 నామమాత్రపు కనీస ధరకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. 1754 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1485 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. త్వరలో నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఈ పంపిణీ జరుగుతుంది. 1921లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న 1814 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ది అగ్రికల్చర్ సొసైటీ కంపెనీతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 1,814 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. మళ్లీ ఓ ఐదేళ్ల తరువాత అదే బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేపట్టి కాలువలు, డ్రెయిన్ల తవ్వడం కోసం 1,814 ఎకరాల్లో 60 ఎకరాలు అవసరమని తీసుకుంది. మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని సాగుభూములుగా మార్చుకున్నారు. కోట్లు దండుకున్న టీడీపీ ప్రభుత్వం గత టీపీపీ ప్రభుత్వం ఈ భూములపై కన్నేసింది. 2019లో అమలు సాధ్యంకాని జీవో హడావుడిగా తీసుకొచ్చింది. ఎకరాకు రూ.1000 నామమాత్రం ధర తీసుకుని సాగుదారులకు కంపెనీ భూముల పట్టాలిస్తున్నామని మభ్యపెట్టారు. తీరా ఎకరాకు రూ.1000 కాకుండా స్థానిక టీడీపీ నాయకులు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు తాము మోసపోయిన వైనాన్ని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి, అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో నరసాపురం సబ్‌కలెక్టర్‌తో విచారణ చేయించారు. అవకతవకలు జరిగినట్టు అప్పటి సబ్ కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై సీఐడీ విచారణ సాగుతుంది. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ప్రభుత్వ ముదునూరి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సాగుదారులగా ఉన్న కొందరి రైతుల చేతుల్లో 10, 12 ఎకరాలు కూడా ఉన్నాయి. నిబంధనల మేరకు రెండున్నర ఎకరాలకు మించి ప్రభుత్వ భూములు పంచడానికి వీలులేదు. భూముల్లో అసలు సాగుదారుల ఎవరు అనే అంశంపై సర్వే చేయించి, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులకే భూముల పంపిణీ దర్బరేవు కంపెనీ భూముల సమస్య చెప్పగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములు పంచుతాం. గత ప్రభుత్వంలో ఈ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సాగుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
భూమి కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు తమ భూములను ఇవ్వబోమంటూ ఐదారు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన అన్నదాతలు శుక్రవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు. మరోవైపు హన్వాడకు చెందిన రైతు బొక్కి మాసయ్య హైదరాబాద్‌కు వెళ్లి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గతంలోనే అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా హన్వాడలో 718 సర్వే నంబర్లో 3,100 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని అధికారులు గుర్తించారు. మొదటి విడతగా రెవెన్యూ అధికారులు 240 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అయితే, 50 ఏళ్ల క్రితమే ఈ భూమిలో కొంత భాగాన్ని అధికారులు అసైన్మెంట్ కింద దళిత, బీసీ రైతులకు కేటాయించారు. ఇప్పటికే 718 సర్వే నంబర్లో 144 మంది రైతులు 86.28 ఎకరాలు, పక్కనే ఉన్న 456 సర్వే నంబర్లో సుమారు 30 మంది రైతులు 60 ఎకరాల మేర సాగుచేసుకుంటున్నారు. పోలీస్ పహారాలో సేకరణ యత్నం..: తహసీల్దార్ బక్క శ్రీనివాసులు శుక్రవారం రెవెన్యూ బృందంతో కలిసి 718, 456 సర్వే నంబర్లో సర్వేకు వెళ్లారు. అదే సమయంలో పోలీస్ బలగాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. భూమికి సరిపడా సాగుకు యోగ్యమైన భూమి ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని తహసీల్దార్‌ను రైతులు నిలదీశారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు భూమికి బదులుగా వేరే చోట కేటాయిస్తామని తహసీల్దార్ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం తహసీల్దార్‌కు ఫోన్ చేసి భూమిని కోల్పోతున్న ప్రతి రైతుకు సాగుకు యోగ్యమైన భూమితోపాటు ఇంటిస్థలానికి పట్టా లివ్వాలని, ఈ మేరకు ప్రొసీడింగ్స్ తీసుకోవాలని, తర్వాతే భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. మేము ఎటెళ్లాలి: ఆంజనేయులు, రైతు, హన్వాడ మాకు 4 ఎకరాలుంది. వంశపారం పర్యంగా సాగు చేసుకుంటున్నాం. భూమిని రూ.2 లక్షలు పెట్టి చదును చేసుకున్నాం. మరో రూ.2 లక్షలు వెచ్చిం చి మూడు బోర్లు వేయించాం. భూమిని వదిలిపెట్టాలని అధికారులు చెబుతున్నారు. మేం ఎటెళ్లాలి. భూసేకరణకు ముందుగా పొజిషన్ చూపించి పట్టాలు ఇవ్వాలి. రాజ్యసభకు హన్వాడ దళితరైతు నామినేషన్ తమకు కేటాయించిన భూములను లాక్కుంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసేందుకు హన్వాడకు చెందిన సుమారు 15 మంది రైతులు గురువారంరాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో దళితరైతు బొక్కి మాసయ్య శుక్రవారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మాసయ్యకు 718 సర్వే నంబర్లో 1.17 ఎకరాల భూమి సాగులో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటులో తన భూమిని కోల్పోతుండటంతో నిరసనగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర
సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్‌గౌడ్(58) పాదయాత్ర ప్రారంభించాడు. ఫ్లెక్సీపై వివరాలు రాసి మెడకు తగిలించుకుని కాలినడకన మంచిర్యాల నుంచి శుక్రవారం బయల్దేరాడు. మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులో శ్రీనివాస్‌గౌడ్‌కు 15ఎకరాల భూమి ఉంది. 1992 వరకు పట్టా భూమిగా, తర్వాత లావుణి పట్టాగా పహానిలో నమోదైంది. 2016 భూ ప్రక్షాళనలో 15 ఎకరాలకు బదులు 13.2 ఎకరాలుగా 2018లో పాస్‌బుక్‌లు ఇచ్చారు. తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలుమార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఎండలో నడవడానికి వయసు సహకరించకున్నా రెవెన్యూ శాఖ తప్పిదాలను ఎత్తి చూపేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నాడు. ఈ విషయమై మందమర్రి ఎమ్మార్వో సంపతి శ్రీనివాస్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, గతంలోనే ఆయనకు అసైన్మెంటు కింద పట్టా జారీ అయిందని, ఇప్పుడు మార్చడం వీలుకాదని తెలిపారు. -
కొన్నది ఎకరం.. కొట్టేసింది 4.35 ఎకరాలు.. వాహనం ఆపి సోదా చేయగా..
సాక్షి, మోమిన్‌పేట(వికారాబాద్): ఓ మహిళా రైతును మోసం చేసి.. ఆమెకు తెలియకుండా 4.35 ఎకరాల భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన సంఘటన మోమిన్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. దేవరంపల్లికి చెందిన మ్యాదరి అంజమ్మకు గ్రామంలోని సర్వే నంబర్లు 97, 99లో ఐదెకరాల 35గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఒక ఎకరా భూమిని చీమల్‌దరి గ్రామానికి చెందిన గొర్లకాడి క్రాంతికుమార్, అతని స్నేహితులకు విక్రయించింది. ఎకరం కొనుగోలు చేసిన కాంత్రికుమార్.. అంజమ్మ పేరున ఉన్న 5.35 ఎకరాల మొత్తం భూమిని డిసెంబరు 10, 2020 రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎకరా అమ్మగా వచ్చిన డబ్బును తన కూతుళ్లకు సమానంగా ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించుకుంది. మిగిలిన నాలుగెకరాల భూమిని కుమారులకు పంచాలని భావించింది. అయితే తన పాసు పుస్తకంలోని మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే మోసాన్ని ఆలస్యంగా గుర్తించి.. సదరు వ్యక్తులను నిలదీసింది. చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు ఈ విషయమై కొంతమంది సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో అంజమ్మ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసేందుకు కాంత్రికుమార్, అతని స్నేహితులు ఒప్పుకొన్నారు. కాలం గడుస్తున్నాకొద్ది విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇక లాభం లేద నుకున్న అంజమ్మ తనకు జరిగిన అన్యాయంపై ఇటీవల పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రాంతికుమార్ గురువారం మధ్యాహ్నం మేకవనంపల్లి వైపు వెళ్లున్నట్లు సమాచారం తెలుసుకొన్న సీఐ వెంకటేశం, ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తమ సిబ్బందితో వెళ్లి కారును చేజ్ చేసి పట్టుకున్నారు. వాహనాన్ని ఆపి సోదా చేయగా రూ.3.08లక్షలు నగదుతో పాటు ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్ ఎందుకు ఉపయోగిస్తున్నావని ప్రశ్నించగా.. తాను భూముల క్రయవిక్రయాలు చేస్తుంటానని, ప్రాణ రక్షణ కోసం కారులో తల్వార్ పెట్టుకున్నానని సీఐకి చెప్పాడు. దీంతో అతనిపై అక్రమంగా మారణాయుధాలు కలిగిన నేరంతో పాటు మోసం చేసిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరచరిత్రే.. క్రాంతికుమార్‌పై గతంలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. 2007, 2013, 2020లో మూడు, 2022లో రెండు కేసులు బుక్ అయ్యాయి. ఇందులో అక్రమంగా భూమి క్రయవిక్రయాలు, మర్డర్ కేసు, ప్రస్తుత చీమల్‌దరి సర్పంచుపై బెదిరింపులకు పాల్పడటం వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
సైన్యానికి హీరో సుమన్ 117 ఎకరాల భూమి విరాళం ఇచ్చారా?
ప్రముఖ నటుడు సుమన్ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భూమిని విరాళంగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సుమన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. '117 ఎకరాల భూమిని తాను భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో ఉంది. వివాదం పరిష్కారం అయిన వెంటనే స్వయంగా తానే అందరికీ తెలియజేస్తాను' అంటూ అంటూ చెప్పుకొచ్చారు. -
తన పేరిట పౌతి చేయడం లేదని..
సాక్షి, డిండి(నల్లగొండ): తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని పౌతి చేయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. వివరాలు.. మండల పరిధిలోని కాల్యతండాకు చెందిన ఆంగోతు చత్రునాయక్‌కు బొగ్గులదొన గ్రామ శివారులోని 113 సర్వే నంబర్లో 2.28 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో నుంచి 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన దంజ్యనాయక్‌కు 28 గుంటల భూమిని విక్రయించాడు. కానీ 28 కుంటలకు సంబంధించి ప్రొసీడింగ్, పాత పట్టా పాసుపుస్తకం జారీ అయినప్పటికీ ధరణిలో మాత్రం వివరాలు నమోదు కాలేదు. చత్రునాయక్ మరణించడంతో ప్రస్తుతం అతడి కుమారులు తన తండ్రి పేరు మీద ఉన్న 2.28 ఎకరాలు పౌతి చేయాలని స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దంజ్యానాయక్ గతంలో తనకు విక్రయించిన 28 గుంటల భూమి తనకే చెందుతుందని, అందుకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని, సదరు పౌతిని నిలిపివేయాలని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉంచినట్లు తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. కాగా తన తండ్రి పేరు మీదన్న పొలాన్ని పౌతి చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చత్రునాయక్ కుమారులలో ఒకరైన భద్యానాయక్ పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోచయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. -
జమునా హేచరీస్ కేసు: కొనసాగుతున్న భూసర్వే..
సాక్షి, మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా అచ్చంపేటలో భూసర్వే కొనసాగుతుంది. జమునా హేచరీస్‌కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, 130 సర్వే నెంబర్లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుంది. దీనిపై ఇప్పటికే 11 మంది రైతులకు నోటిసులు ఇచ్చినట్లు ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ తెలిపారు. -
తల్లిని చంపిన తనయుడు ..
సాక్షి, వర్ని(నిజామాబాద్) : పొలం మార్పిడి చేయలేదనే కోపంతో కన్న తల్లిని కొడుకు హతమార్చిన విషాద ఘటన చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో జరిగింది. పొలం తన పేరిట మార్పిడి చేయాలని తల్లి సాయమ్మ (50)తో కుమారుడు నారాయణ కొన్ని నెలలుగా ఒత్తిడి తెచ్చినా స్పందించలేదనే కోపంతో గొంతు నులిమి హతమార్చి సాధారణ మరణంగా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్మాపూర్ గ్రామానికి ముక్కెర సాయమ్మకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయమ్మ కుమారుడు, కోడలితో కలిసి ఉంటోంది. ఆస్తిలో కూతుళ్లకు కూడా వాట ఇస్తుందనే అనుమానంతో తల్లిని వేధించే వాడు. నారాయణ భార్య కాన్పుకోసం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. బుదవారం అర్థరాత్రి తల్లితో గొడవ పడి ఆవేశంతో హత్య చేశాడు. ఆ తర్వాత డ్రైనేజీలో పడి మృతి చెందిందని ఒక సారి, విద్యుత్ షాక్‌తో మృతి చెందిందని బంధువులకు ఫోన్ చేసి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోధన్ ఏసీపీ రామారావ్, రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, వర్ని ఎస్సై అనిల్ రెడ్డి ఘటన స్థలానికి పరిశీలించారు. హతురాలి కుమార్తె శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
జూబ్లీహిల్స్: కోట్ల విలువైన ఇంటిని అమ్ముతానని నమ్మించి.. చివరికి!
సాక్షి, బంజారాహిల్స్: స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని నమ్మించి ఇంటిని అమ్ముతానని అడ్వాన్స్ తీసుకొని ముఖం చాటేసిన ఇద్దరు ఎన్ఆర్ఐ తండ్రీకొడుకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీకి చెందిన మామిడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు మామిడి హరీష్‌రెడ్డి యూఎస్ఏలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండే చంద్రశేఖర్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.2లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో తన కుమారుడు హరీష్ పేరు మీద ఉన్న 500 గజాల స్థలంలోని ఇంటిని అమ్ముతానంటూ ఫిలింనగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి వట్టి్టకూటి శ్రీకాంత్‌ను నమ్మించాడు. చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క తన కుమారుడు పేరుతో ఉన్న ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేవని, తనకు జీపీఏ ఉందని బ్యాంకుల్లో కూడా రుణాలు లేవని, క్లియర్ టైటిల్‌తో ఉందని నమ్మించాడు. ఇందుకోసం రూ.7.75 కోట్లకు బేరం కుదుర్చుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వాన్స్‌గా రూ.25 లక్షలను కుమారుడి ఖాతాలో వేయించుకున్నాడు. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీకాంత్ ఆరా తీయగా సదరు ఇంటిపై బ్యాంకులో రుణంతో పాటు పలు కేసులు కూడా ఉన్నాయని తేలింది. తాను మోసపోయినట్లు గుర్తించి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా తండ్రీకొడుకులు ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా ఇదే ఇంటిని రాజేష్‌రెడ్డి అనే వ్యక్తికి అధిక ధరకు అమ్మేందుకు నిబంధనలకు విరుద్ధంగా మరో ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా రూ.2 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని తేలడంతో తండ్రీకొడుకులు ఉద్దేశపూర్వకంగానే తనను మోసం చేశారంటూ గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్‌రెడ్డి, హరీష్‌రెడ్డిలపై పోలీసులు ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
48 గంటల్లో మా భూమిని మాకు అప్పగించారు
కడప రూరల్: పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మా భూమిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 48 గంటల్లో ఇప్పించారని, ఆయన తమ కుటుంబానికి దేవుడి కంటే ఎక్కువ అని వైఎస్సార్ జిల్లా దవ్వూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అక్బర్‌బాషా, ఇతని భార్య అఫ్సానా, సోదరుడు ఎంఏ అజీబ్లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు కడపలోని వైఎస్సార్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి తాను ఫేస్బుక్లో పెట్టిన వీడియోకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎంఓ కార్యాలయం స్పందించిన తీరు అద్భుతమని అక్బర్ బాషా పేర్కొన్నారు. జిల్లా అధికారులు.. పార్టీ నేతలతో మాట్లాడి న్యాయం చేశారన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, వరికూటి ఓబుల్‌రెడ్డి అందరినీ సమన్వయం చేసి ఎలాంటి షరతులు లేకుండా తమ భూమి తమకు వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల నాయకులు, మత పెద్దలు, మీడియాకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోణంలో చూసి దీన్ని రాద్ధాంతం చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తాను తిరుపాల్‌రెడ్డిపై ఆరోపణలు చేసినప్పటికీ, ఆయన పెద్ద మనసుతో స్పందించి తనకు న్యాయం చేశారన్నారు. -
మాచనపల్లెలో భూ వ్యవహారం వివాదాస్పదం.. స్పందించిన సీఎం ఆఫీస్
దువ్వూరు/కడప అర్బన్/చాగలమర్రి: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మాచనపల్లెలోని సర్వే నంబర్ 325/1లో ఉన్న 1.50 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశమైంది. ఈ భూమికి సంబంధించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన మిద్దె అక్బర్ బాషా శుక్రవారం రాత్రి ఫేస్బుక్లో తన కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీ వీడియో పెట్టాడు. అందులో.. దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన తన భార్య అఫ్సానాకు తన మేనత్త ఖాసీంబీ 2009లో ఎకరా 50 సెంట్లు దాన విక్రయం కింద ఇచ్చిందని తెలిపారు. కొంత కాలంగా ఆ భూమి సాగు చేసుకుంటున్నానని, అయితే ఇప్పుడు ఆ భూమిలో కొందరు అక్రమంగా నాట్లు వేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వైఎస్సార్సీపీ నాయకులు ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి, ఆయన కుమారుడు విశ్వేశ్వరరెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నారని.. మైదుకూరు రూరల్ సీఐ వెంకట కొండారెడ్డి వారికి మద్దతు తెలుపుతూ ఎన్కౌంటర్ చేస్తామని తనను బెదిరిస్తున్నాడని చెప్పాడు. తమకు న్యాయం చేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్బర్‌బాషా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సీఎంవో వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను ఆదేశించింది. ఆయన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, దువ్వూరు ఎస్ఐ చప్పలరాజులకు సమాచారం ఇచ్చారు. వారు తమ సిబ్బందితో హుటాహుటిన చాగలమర్రిలో ఉన్న మిద్దె అక్బర్ బాషా కుటుంబం వద్దకు నిమిషాల వ్యవధిలో చేరుకుని వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఇదే విషయమై శనివారం కడప మేయర్ సురేష్‌బాబు అక్బర్ కుటుంబంతో కలిసి కడప జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఎస్పీని కలిసిన అనంతరం పోలీసు కార్యాలయం ఆవరణలో అక్బర్ బాషా మీడియాతో మాట్లాడారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న అక్బర్‌బాషా, ఆయన భార్య అఫ్సానా తన భార్యకు దాన విక్రయం కింద ఇచ్చిన భూమి రిజిస్టర్‌ను ఖాసీంబీ 2011 ఆగస్టు 20న రద్దు చేయించి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కుమారుడు విశ్వేశ్వరరెడ్డి పేరు మీద (డాక్యుమెంట్ నంబర్ 251/2012) తిరిగి రిజిష్టర్ చేయించిందన్నారు. ఈ విషయమై మైదుకూరు సివిల్ కోర్టులో దావా వేయగా తమకు తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యాజ్యం కోర్టులో నడుస్తుండగానే.. విశ్వేశ్వరరెడ్డి దువ్వూరు మండలం సంజీవరెడ్డి పల్లెకు చెందిన పెద్ద పుల్లారెడ్డి కుమారుడు వీర లక్ష్మిరెడ్డికి ఆ భూమిని అమ్మి (డాక్యుమెంట్ నెంబర్ 5/2019) రిజిస్టర్ చేయించారన్నారు. ఆపై వారిద్దరూ రాజకీయ పలుకుబడితో తమ కుటుంబాన్ని బెదిరిస్తూ భూమిని సాగు చేయిస్తున్నారని చెప్పారు. ఈ విషయం ఎస్పీకి వివరించామని, వారం రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ కడప మైనార్టీ నేత ఎస్ఎండీ షఫీ, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ను అభాసుపాలు చేసేందుకే.. మిద్దె అక్బర్ బాషా వైఎస్సార్సీపీ కార్యకర్త అని, అతడిని బెదిరించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరానని కడప నగర మేయర్, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న వారు వైఎస్సార్సీపీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. అక్బర్‌బాషా కుటుంబానికి అండగా వుంటామన్నారు. ఎక్కడో ఒక సంఘటన జరిగితే సీఎం వైఎస్ జగన్ వైఫల్యమని సామాజిక మాధ్యమాల్లో రావడం బాధాకరమన్నారు. సువర్ణ పాలన అందిస్తున్న వైఎస్ జగన్‌ను, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆ భూమిని 2012లోనే కొన్నాం ఈ విషయంపై డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను వివరణ కోరగా ఖాసీంబీ 2012లో తమ వద్దకు వచ్చిందని.. తన కూతురు, అల్లుడు మోసం చేశారని.. రద్దు చేసిన దాన విక్రయ పత్రాలను చూపించిందన్నారు. తమకు ఒక ఎకరాను రూ.6 లక్షలకు అమ్మిందని తెలిపారు. చట్ట ప్రకారం ఆ భూమి తమకే చెందుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ సర్వే నంబర్లో 13 మంది రైతుల పేర్లు ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ విషయం తన దృష్టికి రావడంతో దగ్గరలో ఉన్న పోలీసులను 20 నిమిషాల్లో బాధితుడి ఇంటికి పింపి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆపామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ చెప్పారు. ఈ విషయమై బాధితులకు న్యాయం చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మైదుకూరు రూరల్ సీఐ వెంకటకొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు వెంకట కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు వెల్లడించారు. భూమి వద్దకు వస్తే అల్లుడే చంపుతామంటున్నాడు.. అక్బర్ అత్త ఖాసింబీ ఆవేదన కడప రూరల్: ఏకాకినైన తనను భూమి వద్దకు వస్తే చంపుతామని అక్బర్ బెదిరిస్తున్నాడని వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం యర్రబల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తద్ది ఖాసింబీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమకు సంతానం లేదని, తన భర్త మరణించినందున ఏకాకిగా ఉంటున్నానని తెలిపారు. గతంలో తాను చాగలమర్రిలోని తన సొంతింటికి వెళ్లినప్పుడు.. కొన్ని రోజులకు తన తమ్ముడి కొడుకు అక్బర్, కోడలు అఫ్సానాలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. దీంతో జీవనాధారం కోసం అర ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే అక్బర్.. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అండతో భూమి వద్దకు వస్తే చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తన నుంచి ఒక ఎకరా భూమిని కొలుగోలు చేసిన వారిని కూడా పొలంలోకి దిగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. దీంతో తాను ఆత్మ రక్షణ కోసం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. వారి నుంచి తన ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జి.ఖాసీం, సమానుల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఆర్మీ మాజీ ఉద్యోగి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): భూ వివాదంలో ఇద్దరిని తుపాకీతో విచక్షణరహితంగా కాల్చి చంపిన ఆర్మీ మాజీ ఉద్యోగిని మాచర్ల రూరల్ పీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు రూరల్ ఏఎస్పీ ఎన్వీఎస్ ప్రసాద్ తెలిపారు. అతని నుంచి ఒక తుపాకీ, బుల్లెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, మాచర్ల రూరల్ పీఎస్ సీఐ పి.భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ ఆర్.ఆదిలక్ష్మితో కలిసి బుధవారం ఏఎస్పీ మీడియాతో మాట్లాడారు. మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన మట్టా సాంబశివరావు ఆర్మీ మాజీ ఉద్యోగి. చదవండి: ప్రభుత్వ భూముల మ్యుటేషన్.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ అతనికి స్వగ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. 12 ఏళ్లుగా సాంబశివరావుకు సమీప బంధువులైన మట్టా బాలకృష్ణ, మట్టా శివ అలియాస్ శివాజి మధ్య పొలం గట్ల విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో సాంబశివరావుపై సమీప బంధువులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి వారిపై అతను కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సాంబశివరావును అతని తండ్రి చెన్నయ్య రెచ్చగొట్టేవాడు. నువ్వు ఆర్మీ రిటైర్డు ఉద్యోగివి కదా, ఒక తుపాకీ కొనుగోలు చేసి తీసుకొస్తే అవకాశం వచ్చినప్పుడు వారిని తుపాకీతో కాల్చేయ్.. ఏమికాకుండా చూసుకుంటానని చెప్పేవాడు. గత నెల 29న సాయంత్రం సాంబశివరావే కావాలని మట్టా బాలకృష్ణ, శివతో పాటు వారి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సాంబశివరావు తనవద్దనున్న తుపాకీతో విచక్షణరహితంగా మట్టా బాలకృష్ణ, మట్టా శివతో పాటు మట్టా వీరాంజనేయులును కాల్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలకృష్ణ, శివ మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలైన వీరాంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు బాలకృష్ణ భార్య శివపార్వతి ఫిర్యాదుతో మాచర్ల రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది. నాగార్జునసాగర్రోడ్డులోని కొత్తపల్లి జంక్షన్ వద్ద బుధవారం ఉదయం మట్టా సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో సాంబశివరావు తండ్రిని అరెస్ట్ చేయాల్సిఉందన్నారు. తుపాకీ, బుల్లెట్లు సీజ్.. సాంబశివరావు 2013లో ఆర్మీ నుంచి రిటైరయ్యారు. అప్పట్నుంచి తన తుపాకీ లైసెన్స్ రెన్యువల్‌ను ప్రతి మూడేళ్లకు ఒకసారి జమ్మూకశ్మీర్‌లో చేయించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 29న జరిగిన భూవివాదంలో అతను 13 బుల్లెట్లను ఉపయోగించగా, 11 బుల్లెట్లు దొరికాయి. 2 బుల్లెట్లు దొరకలేదు. అతని వద్ద మొత్తం 29 బుల్లెట్లు ఉండగా 13 వాడటంతో మిగతా 16 బుల్లెట్లను పోలీసులు సీజ్ చేశారు. చదవండి: విషాదం: ఏమైందో తెలియదు.. తరగతి గది నుంచి బయటకి వచ్చి.. -
భూమి విషయం లో 2 రోజుల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ
-
‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’
సాక్షి, గూడూరు(వరంగల్): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు వాయిల్‌బంధం సమీపంలోని పోడు భూములను పరిశీలించడానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఆ సాగు భూముల వివరాలను నాయకులు, అక్కడి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో తన కారులోని టిఫిన్ బాక్సును తీసుకునిరా అని డ్రైవర్‌కు చెప్పాడు. అక్కడే ఉండి ఎమ్మెల్యే మాటలు వింటున్న మహిళా రైతులు కొందరు ‘అయ్యా..ఫారెస్టో ల్లు మా భూములు గుంజుకొని మాకు బువ్వ లేకుండా చేయాలని చూస్తుర్రు, మీకైతే ఎక్కడ బడితె అక్కడికి బువ్వొస్తుంది. మా గతేంటి’ అని వాపోయారు. ఆ మాటలను విన్న ఎమ్మెల్యే.. మహిళలను చూస్తూ ‘అవ్వా..ఓ తల్లులూ..మీ భూములు ఎటూ పోవు, ఇప్పించే బాధ్యత నాది. ఇగరాండి’...అంటూ పిలిచారు. ‘మీకు భూములప్పిస్తా...బువ్వ తినిపిస్తా’నంటూ ఎమ్మెల్యే తన టిఫిన్ బాక్సులోని అనాన్ని ముద్దలు కలిపి తినిపించారు. ఈ సంఘటను అక్కడున్న నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు. -
‘మా తాత పేరుపై ఉన్న భూమి మాకు ఇప్పించండి సారూ’
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ‘మా తాత బూరెడ్డిపల్లి నాగయ్య పేరుపై ఉన్న భూమిని మాకు ఇప్పించండి..’ అని ఎనుగొండకు చెందిన యాదయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ వెంకట్రావ్‌కు వినతి పత్రం సమర్పించారు. తమ భూమిని ఇప్పించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తు కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలోని 92 సర్వే నెంబర్లో మా తాతకు 2 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని మాకు తెలియకుండా ఎనుగొండకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా తమకు చెందిన భూమిని పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి అర్డర్ ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ చేయకుండా అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వెంటనే విచారణచేసి భూమి ఇప్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సక్కనిరాయిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో సెల్ టవర్‌ను ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కోఆప్షన్‌సభ్యురాలు జ్యోతిశివరాజు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ వెంకట్రావ్‌కు వినతిపత్రం సమర్పించారు. -
భూముల వేలంలో అక్రమాలు జరిగాయి : రేవంత్ రెడ్డి
-
భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి,నాగర్‌కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు. -
భూతగాదాలతో ముగ్గురి హత్య
-
స్టేషన్ ఎదుట కలకలం.. రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం చోటుచేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన కలకలం రేపింది. కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండో ఆత్మహత్యాయత్నం ఘటన కావడం గమనార్హం. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబీకులు సుమారు 50 ఏళ్ల కిందట తమ మేనమామ పింగిళి శ్రీరాంరెడ్డి నుంచి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1.17 ఎకరాల భూమిని చందుపట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ భర్త చందుపట్ల సరోత్తంరెడ్డి అండతో వీరి మేనత్త పింగిళి శ్రీమతిదేవి ఆక్రమించుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీమతిదేవి ఆ భూమిలో వరి నాట్లు వేయగా శ్రీనివాస్‌రెడ్డి అడ్డుకున్నాడు. దీనిపై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 24వ తేదీన కేసు నమోదైంది. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే బుధవారం శ్రీమతిదేవి సంబంధీకులు వెళ్లడంతో సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవద్దని, రెవెన్యూ అధికారులు లేదా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డిని ఎస్ఐ పరమేశ్ బెదిరింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదనే శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎస్ఐ జె.పరమేశ్ వెంటనే శ్రీనివాస్‌రెడ్డిని కమలాపూర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి కోలుకుంటున్నాడని, ఆయన ఆత్మహత్యాయత్నానికి పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఇలాంటి సంఘటన కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండోది. -
హైకోర్టు ముందు హాజరైన సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఓ భూవ్యవహారం కేసులో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకో ర్టు ఎదుట హాజరయ్యారు. తాము ఆదేశాలు జారీ చేసినప్పుడు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ ప్రస్తుతం సీఎస్ అయినా ఇంకా అమలు కాలేదంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 6 నెలలు గడువు ఇస్తే ఆదేశాలు అమలు చేస్తామని సీఎస్ నివేదించగా ధర్మాసనం నిరాకరించింది. ఆరు వారాల్లో ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించింది. షేక్‌పేట మండలంలోని సర్వే నంబర్లు 20, 21, 25లోని 59.18 ఎకరాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని, ఈ భూమి యజమానుల వారసులకు సంబంధించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని 2016లో న్యాయమూర్తి.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో మీర్ ఖుర్షిద్ అలీతోపాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. -
భూ వివాదం..రైతు దారుణ హత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): భూ వివాదం ఓ రైతుని బలితీసుకుంది. సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌కు చెందిన కస్తూరి కరుణాకర్ రెడ్డి (40)కి వరుసకు బావ అయిన చిన్నరాములు మధ్య పదిహేనేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఇద్దిరి పొలాల మధ్య దారి విషయంలో పంచాయితీలు జరిగాయి. ఇదిలా ఉండగా ఏడాది కాలంగా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో ఆదివారం కరుణాకర్‌రెడ్డి తన పొలంలో పనిచేస్తుండగా చిన్నరాములు, అతని తనయులు వెంకటేశ్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పొలం ఒడ్డు చెక్కవద్దని కరుణాకర్‌రెడ్డితో గొడవ పడ్డారు. గొడ్డలి, పారలతో దాడి చేసి అతన్ని హతమార్చారు. ఇది గమనించిన మృతుడి సోదరి పద్మ కేకలు వేస్తూ అక్కడికి చేరుకోగా ఆమెను చంపుతామని బెదిరించి, పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ సర్వర్, ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. కరుణాకర్‌రెడ్డికి కుమారుడు పవన్‌రెడ్డి ఉన్నాడు. తన భర్తను హత్య చేసిన చిన్నరాములు, అతని కుమారులను కఠినంగా శిక్షించాలని మృతుడి రేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్యలో తండ్రీకుమారులతోపాటు మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..!
సాక్షి, ఎల్కతుర్తి(వరంగల్ అర్బన్) : ఆ తల్లి పేగు తెంచుకుని జన్మించిన కుమారుడే ఆమె అంత్యక్రియలను అడ్డుకున్నాడు. తల్లి పేరిట ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య–రాజమ్మ(70) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సారయ్యతో పాటు పెద్ద కుమారుడు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కుమారుడు జంపయ్య, చిన్న కుమారుడు రవీందర్ ఉన్నారు. వీరికి గతంలోనే ఆస్తుల పంపకాలు పూర్తి కాగా, తల్లి రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది. వృద్ధా ప్యంతో రాజమ్మ బుధవారం రాజమ్మ మృతి చెందింది. తల్లికి సంప్రదాయం ప్రకారం చిన్నకుమారుడు రవీందర్ కర్మకాండలు నిర్వహించాల్సి ఉండగా.. అతడు అంగీకరించలేదు. తల్లి పేరిట ఉన్న భూమిని తనకు రాసిస్తేనే తలకొరివి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో తల్లి మృతదేహం పక్కనే కొడుకులిద్దరూ గొడవకు దిగారు. గ్రామస్తులు, పోలీసులు చెప్పినా కూడా రవీందర్ వినలేదు. దీంతో రెండో కుమారుడు జంపయ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు. -
రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెలో కుల బహిష్కరణ కలకలం రేపింది. గ్రామంలోని ఒక స్థల వివాదంలో నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి తలదూర్చుతున్నాడనే కారణంతో గ్రామస్తులు అతనిపై బహిష్కరణ ప్రకటన చేశారు. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన ఆయన కొడుకు పెళ్లికి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. కరోనా కాలంలో బయటి వ్యక్తులు గ్రామంలోకి గ్రామంలోని వ్యక్తులు బయటికి వెళ్లవద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేశారు. దీంతో గ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. -
కుల బహిష్కరణ కలకలం
-
పరిస్థితి ఉద్రిక్తం.. ఎమ్మెల్యే ఫైరింగ్
సాక్షి, చెన్నై : స్థల వివాదం కత్తి పోట్లకు దారి తీయడంతో తన చేతిలో ఉన్న తుపాకీతో డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ ఇష్టానుసారంగా ఫైరింగ్ చేయడం తిరుప్పోరూర్‌లో కలకలం రేపింది. ఇరువర్గాలు వీరంగం సృష్టిస్తూ వాహనాలను తగులబెట్టాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఇదయవర్మన్‌ను అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో అన్నాడీఎంకే నేత తాండవ మూర్తి బంధువుగా పేర్కొంటున్న అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్ 350 ఎకరాల స్థలాన్ని చౌకగా కొనుగోలు చేసి ఉన్నారు. ఈ స్థలంలోకి వెళ్లేందుకు దారి లేదు. ఇక్కడ ప్లాట్లు వేసి రియల్ వ్యాపారం చేయడానికి సిద్ధమైన కుమార్ రోడ్డు కోసం తన బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు దీనన్ని అడ్డుకుంటూ వచ్చారు. గ్రామ ఆలయానికి సంబంధించిన స్థలం మీదుగా ప్రత్యేక రోడ్డును తన స్థలంలోకి వేయడానికి సిద్ధమయ్యాడు. దీన్ని కూడా అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తుడైన కుమార్ చెన్నై నుంచి శనివారం సాయంత్రం ఓ యాభై మంది కిరాయి ముఠాను ఆ గ్రామంలోకి వెంట బెట్టుకు వెళ్లాడు. కత్తులతో వీరంగం..ఫైరింగ్ వచ్చీరాగానే కిరాయి ముఠా సినీ తరహాలో చేతిలో కత్తులు, దుడ్డు కర్రలను చేతబట్టి దిగడంతో ఆగ్రామస్తులు భయంతో వెనక్కు తగ్గారు. ఇదే అదునుగా ప్రొక్లైయినర్లను రంగంలోకి దించిన కుమార్ అనుచరులు, ఆలయ స్థలం మీదుగా రోడ్డు మార్గానికి తగ్గ పనుల వేగాన్ని పెంచాడు. ఈ సమాచారం అందుకున్న డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ తండ్రి లక్ష్మీపతి అక్కడకు చేరుకుని కుమార్‌ను నిలదీశాడు. లక్ష్మీపతికి మద్దతుగా గ్రామస్తులు ఏకం కావడంతో వివాదం ముదిరింది. కిరాయి ముఠా దుడ్డు కర్రలతో గ్రామస్తుల మీద దాడులు చేస్తూ, కత్తులతో వీరంగం సృష్టించారు. (కాయ్ రాజా కాయ్.. కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు) తన తండ్రి మీద దాడి సమాచారంతో ఆగమేఘాల మీద అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఇదయ వర్మన్ పరిస్థితి చూసి తన వాహనంలో ఉన్న సింగిల్ బేరల్ గన్ను అందుకున్నాడు. కాల్పులు జరిపే పనిలో పడ్డాడు. అక్కడున్న జనం, కిరాయి ముఠా అందరూ భయంతో పరుగులు తీశారు. సినీ తరహాలో ఈ కాల్పులు సాగుతున్న సమయంలో, కుమార్ అనుచరులు ఎదురు దాడికి దిగడంతో తన నడుం భాగంలో దాచి పెట్టి ఉన్న మరో తుపాకీని తీసుకుని ఎమ్మెల్యే ఫైరింగ్ చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే చేతిలోని తుపాకీ నుంచి వచ్చిన తూటాలు కుమార్ కారు అద్దాలను చీల్చడం గమనార్హం. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడమే కాదు, అక్కడున్న నాలుగైదు వాహనాలను తగులబెట్టేశారు. చెంగోడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు వచ్చిన సమాచారంతో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్బృందం ఉరకలు తీసింది. అంతలోపు ఇరు వర్గాలు తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎమ్మెల్యే టార్గెట్ ఆ గ్రామంలో పరిస్థితిని సమీక్షించి, ఉద్రిక్తత మళ్లీ చోటు చేసుకోకుండా భద్రతా బలగాల్ని ఎస్పీ కన్నన్రంగంలోకి దించారు. అక్కడి నుంచి ఆయన తిరుప్పోరూర్ స్టేషన్‌కు వచ్చేలోపు ఇరు వర్గాలు జారుకున్నాయి. ఇరువర్గాలు ఫిర్యాదుల్ని పరిగణించిన ఎస్పీ, నలుగురు డీఎస్పీల నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే తూటా దెబ్బకు అటు వైపుగా వెళ్తున్న శ్రీనివాసన్ అనే వ్యక్తి గాయపడి ఉండడంతో కేసు మరింత బలంగా నమోదైంది. అదే సమయంలో శ్రీనివాసన్‌ను ఆసుపత్రి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఇది ఎమ్మెల్యే పనిగా భావించారు. ముందుగా డీఎంకే ఎమ్మెల్యేను అరెస్టు చేయడం కోసం అధికార పక్షం నుంచి ఒత్తిడి వచ్చినట్టుంది. వేట ముమ్మరంగానే సాగింది. తనను పోలీసులు టార్గెట్ చేసిన సమాచారంతో తన తండ్రితో పాటుగా ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కాల్పులకు ఉపయోగించిన రెండు తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసం ఎమ్మెల్యే తుపాకీ వాడుతున్నట్టు తేలింది. అయినా, ఆయన్ను పట్టుకోవడం లక్ష్యంగా రాత్రంతా వేట సాగగా, ఆదివారం ఉదయం చెన్నై శివారు మేడవాక్కంలో ఆయన ఉపయోగించిన కారును గుర్తించారు. స్వయంగా ఎస్పీ కన్నన్రంగంలోకి దిగడంతో చెన్నై చుట్టూ ఉన్న నిఘా నేత్రాల మీద దృష్టి పెట్టగా, ఎమ్మెల్యే తప్పించుకు వెళ్లిన మార్గాలు దొరికాయి. చెన్నై నుంచి చెంగల్పట్టు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేసి తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు తరించారు. తాను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టుగా, తనకు లైసెన్స్ ఉందని ఇదయ వర్మన్ పేర్కొంటున్నారు. ఈ కేసులో సుమారు యాభై మందిని చేర్చారు. రియల్ యజమాని కుమార్, అతడి అనుచరుల కోసం కూడా వేట సాగుతోంది. డీఎంకే వర్గాల రూపంలో తుపాకీ సంస్కృతి మళ్లీ రాష్ట్రంలో తెర మీదకు వచ్చిందని మంత్రి జయకుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఇష్టానుసారంగా తుపాకీలతో జరిపిన కాల్పులకు సంబంధించి వీడియో ఆధారాలు ఉండబట్టే, పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. -
షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్‌లోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో అజయ్‌ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి : ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది) రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సుజాత విచారణ ఎదుర్కోంటుంన్నారు. -
ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది..
పట్నంబజారు(గుంటూరు): ఆస్తిని తనకు రాయకుండా.. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి రాస్తుందేమోనన్న అనుమానంతో తల్లిని హత్యచేసిన కుమార్తె, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు లో గురువారం ఎస్‌హెచ్‌వో వి.వెంకటరెడ్డి, ఎస్ఐ భాగ్యరాజులు వివరాలను మీడియాకు వెల్లడిం చారు. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్‌కు చెందిన ఆలపాటి లక్ష్మి (45).. కూరగాయల మార్కెట్లో ఓ దుకాణం నడుపుకొంటూ జీవి స్తోంది. భర్త గతంలో మృతిచెందాడు. కుమార్తె భార్గవిని 2007లో అచ్చంపేట మండలం పుట్లగూడేనికి చెందిన రామాంజనేయులుకిచ్చి వివాహం చేసింది. భార్యాభర్తలు అచ్చంపేటలోని ఓ హోటల్లో పనిచేస్తున్న క్రమంలో భార్గవికి శివరావుతో పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా తల్లి లక్ష్మి పేరుతో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న 17 సెంట్లు, కుంచనపల్లిలోని అరెకరం భూమిని తన పేర్న రాయాలంటూ భార్గవి తరచూ తల్లిని వేధిస్తూ ఉండేది. దీంతో పాటు తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో.. ఆస్తిని అతనికి రాస్తుందేమోనన్న ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న భార్గవి, శివరావులు గుంటూరు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా లక్ష్మి గొంతు నులిమి చంపేశారు. లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భార్గవి, శివరావులపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తమకు సంబంధం లేదని నిందితులు బుకాయించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితులు పరారయ్యారు. చివరికి తామే హత్య చేసినట్టు అంగీకరిస్తూ బుధవారం తహసీల్దారు కార్యాలయంలో లొంగిపోయారు. హత్యకు పరోక్షంగా భర్త రామాంజనేయులు కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. హత్యచేసిన రోజే లక్ష్మి మెడలోని బంగారు గొలుసు, రూ.39 వేలను నిందితులు తీసుకెళ్లగా.. పోలీసులు బంగారు గొలుసు, సెల్‌ఫోన్, రూ.7 వేలను స్వాధీనం చేసుకున్నారు. -
నా భూమి ఇవ్వకపోతే మళ్లీ నక్సలైట్‌నవుతా
సూపర్‌బజార్(కొత్తగూడెం): పునరావాసం కింద తనకిచ్చిన మూడు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని, తిరిగి తనకు ఆ భూమిని ఇప్పించాలని, లేనిపక్షంలో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్తానని జనశక్తి మాజీ మహిళా నక్సలైట్ ఇట్ల పుష్పకుమారి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో జనశక్తి అజ్ఞాతదళంలో పనిచేసి లొంగిపోయిన కారణంగా తనకు పునరావాసం కింద 3 సెంట్ల భూమిని మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీనగర్‌లో 2010లో కేటాయించారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక అక్కడ ఇల్లు కట్టుకోలేకపోవడంతో కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెండేళ్లుగా తన భూమిని తనకు ఇప్పించాలని మణుగూరు తహసీల్దార్‌తోపాటు భద్రాచలం ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విన్నవించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లానని, ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం కూడా ఇచ్చానని చెప్పారు. భర్త లేని తనకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు సరైన న్యాయం జరగకపోతే తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లడానికి సిద్ధమవుతానని వెల్లడించారు. పోలీసులు, కలెక్టరేట్ ఏఓ నాగేశ్వరరావు వచ్చి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించడానికి చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ తనకు కేటాయించిన స్థలాన్నే తనకు ఇవ్వాలి తప్ప వేరే స్థలాన్ని ఇస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూ ఆందోళనకు దిగింది. సాయంత్రం వరకు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సరైన హామీ లభించడం లేదని పేర్కొంటూ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మరోసారి కలెక్టర్‌కు తన ఆవేదనను వ్యక్తం చేస్తానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తిరిగి నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతానని నిరసన విరమించింది. -
పరారీలో ఏ1 నిందితుడు మాజీమంత్రి సోమిరెడ్డి
ఎప్పుడూ ఎదుటి వారికి నీతి సూత్రాలు వల్లించే మాజీమంత్రి సోమిరెడ్డి భూ వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. పోలీసుల విచారణకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులతో భూవివాదం కేసులో వెంకటాచలం పోలీసులు మొదటి నిందితుడిగా చేర్చి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన విచారణ నోటీసులను తీసుకున్న సోమిరెడ్డి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు నిబంధనల మేరకు సోమిరెడ్డి జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా సోమిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసును అంటించి వచ్చారు. మొత్తం మీద సోమిరెడ్డి అజ్ఞాత వాసిగా మారడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, నెల్లూరు: వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ సీఆర్పీసీ 160, 91 కింద నోటీసులు జారీ చేశారు. మొదటి సారి పోలీసులు నోటీసులతో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో వెనుదిరిగారు. రెండో పర్యాయం సోమిరెడ్డి నోటీసులు తీసుకొని ఈ నెల 9న వెంకటచాలం పోలీసుస్టేషన్లో విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే 9న విచాణకు ఆయన గైర్హాజరయ్యారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయి విచారణకు ఆయన తరఫున న్యాయవాదులను పంపించి పోలీసులకు డాక్యుమెంట్లు చూపించారు. అయితే ఈ కేసులో నేరుగా సోమిరెడ్డినే విచారించాల్సి ఉండడంతో పోలీసులు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమిరెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంకటాచలం పోలీసులు నోటీసులు సిద్ధం చేసి హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ కూడాలేకపోవడంతో ఇంటికి నోటీసు అతికించారు. సోమిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 9న విచారణకు హాజరవుతానని నోటీసులు తీసుకొని గైర్హాజరయ్యాడని, ఈ క్రమంలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని విన్నవించారు. కోర్టు 41ఏ నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. దీంతో సోమిరెడ్డి పార్టీ క్యాడర్‌కు కనీసం ఫోన్లో కూడా ఆందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
‘పంచ గ్రామాల’కు ప్రత్యేక కమిటీ
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక.. దేకుతున్న సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. మరోవైపు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపడమే కాకుండా.. తాజాగా అధ్యయన కమిటీ వేయడం ద్వారా తమది చేతల ప్రభుత్వమని నిరూపించారు. కమిటీ నివేదిక ఆధారంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, విశాఖ సిటీ: సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తారు. సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహదారు అజేయకల్లాం, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా సింహాచలం దేవస్థానం ఈవోను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న ఏ అధికారి అయినా, వ్యక్తి అయినా ఈ కమిటీకి సహకారం అందించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామని ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచార సమయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచగ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే ఈ సమస్యను ప్రస్తావించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా సమావేశమై సమస్య పరిష్కారానికి సహకరించాలని అభ్యర్థించారు. స్వామీజీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వెనువెంటనే మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా సమావేశమై అధికారులతో చర్చించారు. కాగా ఈ నెల 16న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఈ అంశాన్నిప్రస్తావించారు. దీనికి మంత్రి వెలంపల్లి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని..కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ అడ్వకేట్ జనరల్‌తో చర్చలు జరిపామని సమాధానం చెప్పారు. సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత గురువారం అధ్యయన కమిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. వంద రోజుల్లో అని ఊరించిన టీడీపీ దాదాపు 23 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఓట్ల రాజకీయం మాత్రమే చేసింది. 100 రోజుల్లో పరిష్కరిస్తామని తప్పుడు హామీలు గుప్పించి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్ల పాటు ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. మొన్నటి ఎన్నికలకు ముందు మళ్ళీ ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వరుస జీవోలు, కమిటీలు వేస్తూ హడావుడి చేసింది. అయితే ఆ పార్టీ నేతల కుయుక్తులు పసిగట్టిన ప్రజలు ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కనీసం 50 రోజులు కూడా పూర్తి కాకముందే ఈ సమస్య పరిష్కారానికి మార్గలను అన్వేషించింది. 100 శాతం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోంది. మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తూ ప్రజల ఆకాంక్షను అతిత్వరలో నెరవేర్చే దిశగా బలమైన అడుగులు వేస్తోంది -
సోన్‌భద్ర కాల్పులు : కీలక పత్రాలు మాయం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోన్‌భద్ర నరమేధానికి సంబంధించి సంచలన విషయం వెలుగు చూసింది. 10 మంది రైతుల మరణానికి కారణమైన ఈ వివాదంలో కీలకమైన ల్యాండ్ డీల్ ఫైలు మాయమైపోయిందన్న వార్త కలకలం రేపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భూమి బదిలీ వివరాలను కలిగి ఉన్న 1955 ఫైలు మిస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ అటవీభూమి ఒక ట్రస్ట్ కిందకు ఎలా పోయింది అనేది ప్రశ్నార్ధంగా మారిన నేపథ్యంలో ఈ పేపర్లు మాయం కావడం గమనార్హం. కాల్పుల ఉదంతం చోటు చేసుకున్న అయిదురోజుల తరువాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. జిల్లా రెవెన్యూ పత్రాల్లో దీనికి సంబంధించిన కీలక పత్రాలు లభించడం లేదని అధికారులు కూడా ధృవీకరించారు. డిసెంబర్ 17, 1955లో ఆదర్శ్ కోపరేటివ్ సొసైటీ పేరుతో రిజిస్టర్ అయిన పత్రాలు లభించడం లేదనీ, ఆరు దశాబ్దాల నాటి కేసుకు సంబంధించి తమ వద్ద1955 ఫైలు మినహా అన్ని పత్రాలు ఉన్నాయని సోన్‌భద్ర జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఘర్షణకు దారి తీసిన ఈ వివాదంలో 1950లో సుమారు 600 బిగాల భూమిని జమీందారీ నిర్మూలన , భూ సంస్కరణల చట్టం, బంజరు భూమిగా ప్రకటించారు. అనంతరం ఆ ప్రాంతంలోని ఆదివాసీలు (గోండ్లు) మూడు తరాలుగా ఆ భూమిని సాగు చేసుకొంటున్నారు. ఈ 600 బిగాల అధికారిక పత్రాలలో గ్రామ సభ భూమిగా నమోదు చేశారు. 1955లో, సుమారు 463 భిగాల భూమిని ఆదర్శ్ సహకారి సమితి అనే సమాజానికి బదిలీ చేశారు. బీహార్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి ప్రభాత్ కుమార్ మిశ్రా దీన్ని స్థాపించారు. ఈ సొసైటీలో తన మామ మహేశ్ మిశ్రాను ప్రెసిడెంట్‌గాను, అతిని భార్య, కూతురిని ఆఫీసు బేరర్లుగాను నియమించారు. 1989 లో సిన్హా మరణం తరువాత, సుమారు 200 బిగాల భూమిని సిన్హా కుమార్తె, మిశ్రా భార్య అయిన ఆశా మిశ్రా, మనువరాలు వినీత పేరుతో బదిలీ చేశారు. అయితే 2017లో ఈ భూమిని గ్రామ ప్రధాన్ యజ్ఞదత్తో పాటు మరో 10 మందికి రూ.2 కోట్లకు అమ్మారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా దత్ ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ భూమి తమదంటూ దత్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేంచిన గోండ్లు, 2017 ఒప్పందం చట్టవిరుద్ధమంటూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పలు కేసులు నమోదయ్యాయి. అయితే జూలై 6 న, 32 ట్రాక్టర్లు, 300 మందితో దత్ భూమికి మీదికి రావడంతో ఘర్షణ ముదిరింది. యజ్ఞదత్ మనుషులు నాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. ఇదిలావుండగా పదిమంది రైతుల హత్యపై నివేదిక సమర్పించాలని కోరుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సిఎస్‌టి) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసు జారీ చేసింది. కాగా మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్టు, ఎట్టకేలకు ఆమె బాధితులను కలవడంతోపాటు, కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రెవెన్యూ అధికారులే చంపేశారు
ఒంగోలు సబర్బన్/నాగులుప్పలపాడు: రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం రైతును బలితీసుకున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎలుకల మందు తిని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య (68) ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారులే కారణమని అతని కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీనివాసులు ఆరోపించారు. రైతు మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా, అతని కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన నడిపినేని రత్తయ్యకు భార్య వరమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో తమకు ఉమ్మడిగా ఉన్న 4.54 ఎకరాల పొలంలో రత్తయ్య వ్యవసాయం చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస కరువుతో పంటలు చేతికిరాక పెద్ద మొత్తంలో అప్పుల చేయాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా వర్షాలు లేక కనపర్తి ఎత్తిపోతల పథకం కింద మాగాణి సాగు నిలిచిపోయింది. గుండ్లకమ్మ ఎడమ కాలువ కింద గత నాలుగేళ్లలో అధికారులు చుక్క నీరు వదల్లేదు. దీంతో భూములు బీళ్లుగా మారాయి. దీంతో అప్పు తీర్చే దారి లేక ఉన్న ఇంటిని తెలిసిన వారి వద్ద రత్తయ్య తాకట్టు పెట్టాడు. అప్పుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు రూ.15 లక్షలు దాటడంతో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని అనుకున్నాడు. కానీ, ఆ పొలం ఆన్లైన్లో తన తండ్రి రంగయ్య పేరుతో ఉంది. వెబ్ ల్యాండ్ నమోదులో ఏర్పడిన పొరపాటును సరిదిద్దాలని నాగులుప్పలపాడు రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్లుగా రత్తయ్య ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించలేదు. అవినీతికి అలవాటుపడిన రెవెన్యూ అధికారులు.. రత్తయ్య నుంచి మామూళ్లు అందలేదన్న కారణంతో అతని పని గురించి పట్టించుకోలేదు. ఒకవైపు అప్పులోళ్ల ఒత్తిళ్లు.. మరోవైపు రెవెన్యూ అధికారుల వేధింపులు వెరసి చివరకు తనువు చాలించడమే పరిష్కారమార్గమని రత్తయ్య భావించాడు. గత సోమవారం రాత్రి పొద్దుపోయాక నాగులుప్పలపాడులోని మండల కార్యాలయాల సముదాయంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి రాగా, సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘాల నేతల డిమాండ్ రైతు రత్తయ్య ఆత్మహత్యకు కారణమైన నాగులుప్పలపాడు మండల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రిమ్స్‌లో రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లే రైతు రత్తయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. ఆన్లైన్ అక్రమాలతో రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రైతు సంఘాల నేతలు చుండూరు రంగారావు, వడ్డె హనుమారెడ్డి, చావల సుధాకర్, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బైరపనేని సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
జవాన్ స్వామి తండ్రి అదృశ్యం
సాక్షి, కామారెడ్డి: తన తండ్రి సాయిరెడ్డి మూడు రోజులుగా కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్ చేసుంటారని ఆర్మీ జవాన్ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేశారని ఇటీవల సోషల్ మీడియాలో స్వామి వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రి కనపడటం లేదన్న సమాచారంతో స్వామి ఈ రోజు హుటాహుటిన తన సొంతూరు కామారెడ్డిలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియాకువెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలో లేక దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండాలో తోచడం లేదని జవాన్ స్వామి ఆందోళన చెందుతున్నారు. -
దళితులనూ వదలని కే ట్యాక్స్
కష్టాల్లో తోడుండాల్సిన సొంత బంధువులే తోడేళ్లుగా మారి ఉన్న స్థలంపై కన్నేశారు. టీడీపీ నేతల అండదండలతో అక్రమంగా అమ్మేసుకున్నారు. పోలీసు స్టేషన్ మెట్లెక్కితే.. కోడెల కుటుంబంవైపు దారి చూపారు. అన్యాయం చేశారయ్యా.. మీరే ఆలకించండయ్యా అని కోడెల శివరామ్ వద్ద కాళ్లావేళ్లా పడితే కాదు పొమ్మన్నారు. కాసులిచ్చిన వారి వైపే త్రాసు తూచారు. దళితులను కులం పేరుతో దూషించారు. ఊళ్లో ఉంటే ఊపిరి కూడా ఉండదని బెదిరించారు. చట్టాలు అధికారపు మోచేతి కింద మోకరిల్లగా.. ఇక చేసేది లేక కన్న ఊరు, సొంత గూడు వదిలి కన్నీటితో కదిలిపోయారు ఆ దళితులు.. ప్రభుత్వం మారడంతో తమ వేదన ఆలకిస్తారనే ఆశతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇలా రోజురోజుకు కోడెల కుటుంబం అక్రమాలు, అన్యాయాలకు బలైన అనేక మంది పోలీసు గడప తొక్కుతున్నారు. నరసరావుపేట టౌన్: విలువైన స్థలాన్ని టీడీపీ నాయకుల సహాయంతో బంధువులు ఆక్రమించి అమ్ముకున్నారు.. న్యాయం చేయాలని కోడెల కుటుంబ సభ్యుల వద్దకు వెళితే బెదిరించి కులం పేరుతో దూషించారు.. ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా తిరిగి తమపైనే కేసులు పెడతామన్నారు.. భయంతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లి ఇతర ప్రాంతంలో బతుకుతున్నాం... ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని ఓ దళిత మహిళ శుక్రవారం పోలీసుల ఎదుట వాపోయింది. వివరాలు.. కందుకూరి బుజ్జి వెంకాయమ్మ కుమారుడు రాజేష్వర్మకు అతని తాత షాలెంనగర్ ప్రాంతంలో 2.5 సెంట్ల భూమిని సుమారు 17 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, వాస్తవాన్ని దాచి స్థలంలో సగ భాగం తనకు హక్కు ఉందని 2006లో వెంకాయమ్మ మరిది చంద్రశేఖర్ ఇతరులకు 1.25 సెంట్ల భూమిని విక్రయించాడు. మిగిలిన స్థలంలో ఉన్న ఇంటిపై పెద్ద బావ శ్రీనివాసరావు కన్నేసి తనదిగా చూపి అతని కుమారుడికి 2014లో రాసిచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకాయమ్మ ఇదేమిటని ప్రశ్నించించడంతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వెంకాయమ్మ వ్యతిరేక వర్గం టీడీపీ నాయకులు కుంపటి రవి, గుండాల రవీంద్రల్ని సంప్రదించగా వారి అనుచరులతో ఇంటి వద్దకు వెళ్లి ఖాళీ చేసి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడ్డారు. న్యాయం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి వద్దకు వెంకాయమ్మ వెళ్లింది. అయితే, కుంపటి రవి చెప్పినట్లు విని ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయం వివరించి ఫిర్యాదు చేసింది. అయితే. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోగా కోడెల శివరామ్ చెప్పినట్లుగా ఊరు విడిచి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. అలా కాదని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తుల్ని వదిలేసి వెంకాయమ్మ కుటుంబంతో సహా ఊరు విడిచి చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి వెళ్లి గత మూడేళ్లుగా అక్కడే జీవిస్తోంది. తెలుగుదేశం నాయకుల అవినీతి, అక్రమాలపై వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో బాధితురాలు ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందన్నా ఆశతో శుక్రవారం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ కేసు నమోదు కులం పేరుతో దూషించి తమ ఆస్తిని అక్రమంగా కాజేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి, వారి అనుచరులు అరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ.వి. బ్రహ్మం శుక్రవారం తెలిపారు. కాగా ఇప్పటికే కోడెల కుటుంబ సభ్యులపై 13 క్రిమినల్ కేసులు నమోదవ్వగా శుక్రవారం మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే కోడెల శివరామ్ వేధింపులతో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే దివ్యాంగుడు కృష్ణారావు ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరగా.. దళిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిన సంఘటన ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వచ్చాయి. -
భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య
భోపాల్ : రెండు కుటుంబాల మధ్య జరిగిన భూమి వివాదంలో ఐదుగురు హత్య చేయబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. హత్యకు గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. అందులో ఓ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ ఆహీర్వార్, సంజీవ్ ఆహిర్యార్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వారి కుటుంబం భోపాల్ నగరానికి ఈశాన్య ప్రాంతంలోని బినాటౌన్‌లో నివసిస్తున్నారు. వారి బంధువైన మనోహర్ ఆహీర్వార్ ఇంటిలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో తన మామ అయిన మనోజ్‌ను రహదారి కోసం రెండు అడుగుల భూమి అడగగా అతను నిరాకరించడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైనట్లు పోలీస్ అధికారి మౌర్య వెల్లడించారు. వారి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరడంతో మనోహర్ అతని ఇద్దరి కుమారులు ప్రవీణ్, ప్రశాంత్‌లతో కలిసి మనోజ్ కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్, సంజీవ్, అతని భార్య రాజకుమారి (30) వారి కుమారుడు యశ్వంత్ (12) అక్కడికక్కడే చనిపోగా సంజీవ్ మేనత్త తారాబాయ్ సాగర్ హస్పిటల్లో చికిత్స పోందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారకులైన ప్రశాంత్, ప్రవీణ్ పరారిలో ఉండగా మనోహర్ ఆహీర్వార్‌ను అదుపులోకి తీసుకోని అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సీఎం కేసీఆర్‌కు లేఖ.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వీఏఓ, వీఆర్వోల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను వేధించుకుతింటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. వీఆర్వో, వీఏవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లిలోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో పేర్కొన్నారు. తన చావుకు, పిల్లల చావుకు వీఏఓ, వీఆర్వోలే కారణమని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసి, తన మరణానంతరం ఆస్తిని తన తల్లి పేరు మీద రాసివ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా మల్లా రెడ్డి అదృశ్యం పట్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మల్లారెడ్డి ఆచూకి లభ్యం తార్నాకలో తన ముగ్గురు పిల్లలలతో మిస్సింగ్ అయిన మల్లారెడ్డి ఆచూకీని ఓయూ పోలీసులు కనుగొన్నారు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మల్లారెడ్డి ఆచూకి కనుగొన్న పోలీసులు.. ఆయనతో పాటు ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
అన్నను చంపిన తమ్ముడు
అమరచింత (కొత్తకోట): ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కొంకన్వానిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొంకన్వానిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద రాజు, చిన్నకుమారుడు చిన్న రాజు కలిసి వ్యవసాయ పనులతో పాటు గొర్ల మందను మేపేవారు. ఉమ్మడి కుటుంబంలో 200 పైచిలుకు గొర్రెల మందను పోషిస్తున్న ఇరువురు ఓ కాపరీని జీతానికి నియమించుకున్నారు. నెలసరి వేతనాలను చెల్లిస్తూ గొర్లను కాపాడుతూ వ్యవసాయ పనులను సాఫీగా కొనసాగిస్తూ వచ్చారు. గత రెండు నెలల క్రితం ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందను అన్నదమ్ములు ఇరువురు సమానంగా పంచుకున్నారు. దీంతో గొర్రెల కాపరికి చెల్లించా ల్సిన వేతనాన్ని అన్న ఇవ్వలేదని చిన్న రాజు తరచూ గొడవ పడేవాడు. హత్యకు దారితీసిన రూ.10వేలు ఇదిలాఉండగా, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తికి గొల్ల పెద్దరాజు ద్వారా రూ.10వేలు చెల్లించాల్సి ఉందని తమ్ముడు చిన్నరాజు తరచూ డబ్బుల విషయంలో తగువులాడేవాడు. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందలో ఎన్నో గొర్రెపిల్లలను అమ్ముకున్నావని అన్న చెప్పిన మాటలకు జీర్ణించుకోలేని చిన్నరాజు అన్నపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం నుంచి తిరిగివచ్చిన పెద్దరాజు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడే ఇంటికి వచ్చిన చిన్నరాజు ఇంట్లోకి వెళ్లి నిద్రమత్తులో ఉన్న గొల్ల పెద్దరాజు తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చిన్నరాజు ‘నా అన్నను చంపేశా..’ అంటూ అరుస్తూ పరారైనట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మకూర్ సీఐ బండారి శంకర్, అమరచింత ఎస్ఐ రామస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులు, కుటుంబసభ్యుల ద్వారా వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గొల్ల పెద్దరాజుకు భార్య మంజులతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా
కేసముద్రం: కడుపున పుట్టిన కొడుకే కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకే ఆస్తి కోసం తండ్రిపై దాడిచేసి హతమార్చిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మ తండాకు చెందిన భుక్యా మంగ్యా(53)–చంద్రమ్మ దంపతులకు కుమారుడు వీరన్న, మగ్గురు కుమార్తెలున్నారు. వారు తమకున్న 4ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నా రు. మంగ్యా ఇద్దరు కుమార్తెలతోపాటు, కొడుకు పెళ్లి చేశాడు. యేడాదిన్నర క్రితం చంద్రమ్మ అనారోగ్యంతో గురవడంతో చికిత్స చేయించా రు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల అప్పు తీసుకువచ్చారు. అనంతరం చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య ఖర్చు ల కోసం చేసిన రూ.7లక్షల అప్పును తీర్చడానికి భూమిని అమ్మాలంటూ తండ్రితో వీరన్న తరచు గొడవ పడుతున్నాడు. భూమిని అమ్మవద్దంటూ తండ్రి వాదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మళ్లీ భూమి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహనికి గురైన కొడుకు తండ్రిపై దాడిచేయడానికి ప్రయత్నించా డు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్తుండగా నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిన మంగ్యా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందా డు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కేకలు పెడుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగ్యాను లేపిచూడగా అప్పటికే మృతిచెంది నట్లు వారు గుర్తించారు. తాతయ్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని మనుమండ్లు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సై సతీష్‌లు ఆదివారం పరీశీలించారు. మృతుడి తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
సోషల్ మీడియా ఎఫెక్ట్.. యువరైతుకు కేసీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ఒక రైతును ముఖ్యమంత్రి దగ్గరకు చేర్చింది. ఆ రైతు సమస్యను ఒకే రోజులో పరిష్కరించేలా చేసింది. వ్యవసాయ భూమిని కోల్పొయిన యువ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్ ఇతరులకు పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్ చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. ఆ ఫేస్బుక్ పేజీని చూసిన సీఎం.. నేరుగా రైతుకు ఫోన్ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. అధికారులను ఆదేశించానని గంటలో మీ ఇంటికి వచ్చి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఆ రైతు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నందులపల్లిలో శరత్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భూమిని శరత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే రైతు బంధు కింద రూ.30,000 కూడా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. -
భూ వివాదం యువకుడు దారుణ హత్య
చందుర్తి(వేములవాడ): పాతకక్షలు యువకుడి ప్రాణం తీశాయి. పెద్దల మధ్య ఉన్న భూ వివాదంలో తలదూర్చిన పిల్లలు శత్రువులుగా మారారు. తరుచూ గొడవపడుతూ పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడ్ని తన ప్రత్యర్థి మాటువేసి వేటకొడవళ్లతో నరికి చంపాడు. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉన్న వ్యవసాయబావిలో పడేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మంగళవారం చోటు చేసుకోగా... బుధవారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెరుపుల హరీశ్(25) ఇంటర్మీడియెట్ మధ్యలో మానేశాడు. తండ్రికి చేదోడు.. వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మంగళవారం వ్యవసాయపొలం వద్దకు వెళ్లాడు. పశువులకు నీళ్లందించి బుచ్చయ్య అనే వ్యక్తితో తన స్కూటీపై తిరిగివస్తున్నాడు. గ్రామ చెరువు మత్తడి వద్ద మాటు వేసిఉన్న ఇదే గ్రామానికి చెందిన నేరెల్ల రమేశ్, నేవూరి బాబు స్కూటీకి అడ్డం తిరిగారు. తమవద్ద ఉన్న వేటకొడవళ్లతో హరీశ్ తలపై విచక్షణారహితంగా నరికారు. బుచ్చయ్య భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన హరీశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎవరూ గుర్తించొద్దని మృతదేహంతో పాటు స్కూటీని పక్కనే ఉన్న బావిలో పడేశారు. కొడుకు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం తెలిసిన పోలీసులు, హరీశ్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి అవడంలో వేకువజామున వరకు మోటార్ల సాయంతో నీటినితోడి బధవారం మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహంతో ఆందోళన.. హరీశ్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యా రు. శవాన్ని మంచంపై ఉంచి నిందితుడు నేరేళ్ల రమేశ్ ఇంటికి తీసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా... దాడిచేసేందుకు కూడా వెనకాడలేదు. పోలీసులు వెనక్కి తగ్గడంతో హరీశ్ మృతదేహాన్ని రమేశ్ ఇంట్లో ఉంచారు. అక్కడే దహనసంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ధాన్యం, రసాయన ఎరువులు, ఇంటిని ధ్వంసం చేశారు. పరిస్థితి విషమించడంతో చందుర్తి సీఐ విజయ్‌కుమార్, రుద్రంగి, కోనరావుపేట , వేములవాడ రూరల్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేశ్, శివకేశువులతో పాటు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని ఇక్కడే దహనం చేస్తామని చెప్పడంతో డీఎస్పీ సముదాయించారు. నిందితులకు కఠిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం హరీశ్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రధాననాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు బందోబస్తు నిర్వహించారు. భూ వివాదమే కారణమా...? హరీశ్ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. హరీశ్, రమేశ్ వ్యవసాయపొలాలు పక్కపక్కనే ఉంటాయి. హద్దుల విషయంలో ఇరువురి తండ్రులకు ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి పిల్లల వరకువెళ్లాయి. రమేశ్, హరీశ్ తరుచూ గొడవ పడేవారు. దసరానాడు కూడా ఇద్దరూ పరస్పద దాడులకు దిగారు. ఇటీవల సైతం తలెత్తిన గ్రూపు గొడవల నేపథ్యంలో రమేశ్ హరీశ్‌ను మట్టుబెట్టాలని చూశాడు. అదునుచూసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
హైకోర్టును ఆశ్రయించిన సినీనటుడు ప్రభాస్
-
బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు: ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సినీనటుడు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ఆయన బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. మరో ధర్మాసనం విచారణ జరుపుతోంది.. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయ మూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. ఈ మొత్తం వివాదం సివిల్ సూట్ (సీఎస్) 7, 14లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని వివరించారు. ఈ విషయా లతో తనకు సంబంధం లేదని, కావాలంటే కొద్దిసేపు విచారణను వాయిదా వేస్తానని, రిజిస్ట్రీ వద్దకు వెళ్లి విషయం తెలుసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరిగి ఈ కేసు విచారణకు రాగానే శరత్ స్పందిస్తూ.. సీఎస్ 7, 14లకు సం బంధించిన కేసులు మరో ధర్మాసనం ముందున్నాయని, ఈ విషయాన్ని రిజిస్ట్రీ సైతం నిర్ధారించిందని చెప్పారు. దీంతో న్యాయమూర్తి తన ముందున్న ప్రభాస్ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ప్రభాస్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ గురువారం జరిగేలా చూడాలని కోరారు. తాను అదే పని చేస్తున్నానంటూ న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేశారు. -
ఆస్తి కోసం మామను మట్టుబెట్టిన అల్లుడి
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : ఆస్తికోసం మామను మట్టుబెట్టిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ బాపూరెడ్డి, సీఐ పార్థసారథి, ఎస్ఐ మధుసూదన్ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని చెట్లకుంట్ల తండాకు చెందిన మేరావత్ లాలూనాయక్(60), సోని దంపతులకు నలుగురు కుమార్తెలు. ఈయన పేర 3 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. కాగా లాలూనాయక్ చిన్న కుమార్తె మమతకు దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామపరిధిలోని పత్లావత్ తండాకు చెందిన వడ్త్య శంకర్‌నాయక్‌తో ఏడాది క్రితం వివాహం చేశారు. కుమారులు లేకపోవడంతో శంకర్‌నాయక్ ఇల్లరికం తెచ్చుకున్నాడు. లారీడ్రైవర్‌గా పనిచేసే శంకర్‌నాయక్ ప్రతిరోజు మద్యం తాగివచ్చి ఆస్తినంతా తనపేరిట రాయాలని భా ర్య, అత్తామామలను వేధింపులకు గురిచేస్తున్నా డు. అల్లుని వేధింపులు తట్టుకోలేక లాలూనాయక్ బతుకుదెరువు కోసం భార్య సోనితో కలిసి ఐదు నెలల క్రితం మండలంలోని జూలూరు గ్రామానికి వచ్చి, స్థానిక అంబికా గార్డెన్స్ ఫంక్షన్‌హాలులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న, రాత్రి శంకర్‌నాయక్ తన భార్యకు ఫోన్ చేసి మీ నాన్నను చంపేస్తానని చెప్పాడు. అదే రోజు రాత్రి బైక్‌పై జూలూరుకు చేరుకొన్న అతను ఫంక్షన్‌హాలులో పడుకున్న మామ లాలూనాయక్‌పై గ్రైండర్రాయిని తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేసిన సీసీ పుటేజీని పరిశీలించగా శంకర్‌నాయక్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పత్లావత్ తండాలో తలదాచుకున్నాడని తెలుసుకొన్న పోలీసులు అతనిని పట్టుకొని అరెస్ట్ చేసి శుక్రవారం భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఆస్తికోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించిన హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ, సత్యం, హోమ్‌గార్డ్ సుధాకర్‌ను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అభినందించారని చెప్పారు. -
భగ్గుమన్న పాతకక్షలు
మోతె (కోదాడ) : నివురు గప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు భగ్గుమన్నాయి. బోరుబావి విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ తగాదాలు తండ్రి ప్రాణాలను బలిగొనగా తనయుడిని ఆస్పత్రి పాల్జేశాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాం పురం తండాకు చెందిన ఆంగోతు సైదులు, ఆంగోతు హేమ్లా (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తండా శివారులోనే పక్కపక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఏడాదిగా తగాదాలు ఆంగోతు సైదులు తన వ్యవసాయ భూమిలో ఏడాది క్రితం బోరు వేసుకున్నాడు. నీరు పుష్కలంగా ఉండడంతో అతడి భూమి పక్కనే వ్యవసాయ భూమి కలిగిన హేమ్లా కూడా ఆ బోరుకు సమీపంలోనే మరో బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటినుంచే రెండు కుటుంబాల మధ్య తగాదాలు సాగుతున్నాయి. అర్ధరాత్రి బోరు వేయాలని.. ఎలాగైనా సైదులు బోరుకు సమీపంలోనే మరో బోరు వేయాలని హేమ్లా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం కొబ్బరికాయతో బోరు వేసే పాయింట్‌ను గుర్తించారు. అది గమనించిన సైదులు అతడి కుమారులు రాములు, సురేష్ దానిని అడ్డుకునేందుకు అప్రమత్తమయ్యారు. అయితే హేమ్లా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తన కుమారుడు ఉపేందర్‌తో కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ అప్పటికే వ్యవసాయ భూమి వద్ద సైదులు అతడి కుమారులు మాటువేసి ఉన్నారు. బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్న హేమ్లా అతడి కుమారుడు ఉపేందర్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే సైదులు అతడి కుమారులు కలిసి రాడ్‌తో హేమ్లా తలపై బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో అడ్డువచ్చిన ఉపేందర్‌కు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి ఉపేందర్‌ను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రాంపురంతండాలో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ఐ సంతోష్ ఇతర సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వివాదానికి కారణమైన వ్యవసాయ భూములను పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హేమ్లా కుమారుడు రమేష్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఆంగోతు సైదులు, అతడి కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలిచి..
అనంతగిరి (కోదాడ) : భూ వివాదంపై ఓ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐ చితకబాదాడు. ఈ ఘటన అనంతగిరిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీనుకు తన తల్లి, చెల్లెలుతో జరుగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించాలని ఎస్పీ అనంతగిరి ఎస్ఐని ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఐ రామాంజనేయులు గంధం శ్రీనుని ఫోన్లో సంప్రదించి స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించాడు. దీంతో శ్రీను న కొడుకు మనోహర్‌తో కలిసి మంగళవారం రాత్రి ఎడున్నర గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లగానే.. స్టేషన్ లోపలికి వెళ్లగానే ఎస్ఐ తనపై దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. దుర్భాషలాడుతూ సిబ్బందితో కలిసి చిత్రహింసలు పెట్టారని తెలిపా డు. చివరకు బూటుకాలిని నాకించి అవమానానికి గురిచేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం చేయాలని.. తనపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకుని న్యా యం చేయాలని కోరుతూ బాధితుడు శ్రీను కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిం చాడు. సివిల్ కేసును కో ర్టుకు పంపకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించాడు. ఎస్ఐ రామాంజనేయులు తీరుతో తనకు ప్రాణ హాని ఉన్నదని పై న్యాయం చేయాలని వేడుకున్నారు. దాడి చేయలేదు : ఎస్ఐ గంధం శ్రీనుపై తాము దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ రామాంజనేయు తెలిపారు.శ్రీనుపై విచారణ చేపట్టాలంటూ ఎస్పీ ఆదేశాల మేరకు అతడిని పిలిపించామని తెలి పా రు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచా రించామని, ఆకేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆనోపణలు చేస్తున్నాడన్నారు. అనుమతి లేకుండా స్టేషన్ ఎదుట ఆందోళన చేసినందుకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
చేపా చేపా.. ఎందుకివ్వవు..
జిల్లా కేంద్రంలో ఓ స్థలం. చిత్తూరు నడిబొడ్డున ఉన్న దాని ధర రూ.కోట్లు పలుకుతోంది. దీన్ని ఉచితంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కట్టబెట్టాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుబట్టారు. చేపల పెంపకం.. మత్స్యశాఖ పరిపాలనకు సంబంధించి 1.20 ఎకరాల స్థలం ప్రస్తుతం టీడీపీ నేతల వలలో చిక్కుకుంది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న వాస్తవం. చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండు పక్కన.. రైల్వే గూడ్సుషెడ్డును ఆనుకుని మత్స్యశాఖకు చెందిన సర్వేనెంబరు 1/1బీ3లో 1.20 ఎకరాల స్థలం ఉంది. చేప పిల్లల పెంపకానికి సంబంధించి పది కుంటలతో పాటు మత్స్యశాఖ పరిపాలన భవనం కూడా ఇక్కడే ఉండేది. 2011లో కురిసిన భారీ వర్షాలకు మత్స్యశాఖ భవనం పూర్తిగా నేలమట్టమైంది. దీంతో తాత్కాలిక భవనాన్ని పాత కలెక్టరేట్‌కు మార్పు చేశారు. ఇంతటితో నగర నడిబొడ్డున మత్స్యశాఖ కార్యాలయ స్థలాన్ని అందరూ మరచిపోయారు. 2013లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మత్స్యశాఖ భవనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే పుకార్లు వచ్చాయి. కొద్ది రోజుల పాటు స్థలాన్ని చూసుకోవడానికి ఆ శాఖ అధికారులు ఇక్కడ కాపలాదారుడిని నియమించారు. కాలక్రమేణా అతన్ని విధుల నుంచి తప్పించారు. తరువాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నిత్యం ఇటువైపు తిరుగుతున్న టీడీపీ నేతల కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాగైనా దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసేసుకోవాలని పావులు కదిపారు. రూ.20 కోట్లకు పైనే... చిత్తూరు ఆర్టీసీ బస్టాండు వద్ద ఒక్క చదరపు అడుగు స్థలం రూ. 5 వేలు పలుకుతోంది. ఈ లెక్కన 1.20 ఎకరాలున్న మత్స్యశాఖ స్థలం దాదాపు రూ.20 కోట్లకు పైనే పలుకుతుంది. దీన్ని వీలైనంత వరకు ఎలాంటి నగదు చెల్లించకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి టీడీపీ కార్యాలయానికి ఉంచేసుకోవాలని చిత్తూరుకు చెందిన అధికారపార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో కార్యాలయ స్థలాన్ని టీడీపీ ఆఫీసుకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కలెక్టర్‌కు పంపాలని మునిసిపల్ అధికారులను నేతలు ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరు నగరంలోని సీఎంటీ రోడ్డులో జిల్లా టీడీపీ కార్యాలయం ఉన్నా.. విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం పేరిట కొట్టేసి, సీఎం వద్ద మెప్పు పొందడానికే ఆ పార్టీ నేతలుఉత్సుకత చూపుతున్నారన్నది వాస్తవం. కలెక్టర్ నిర్ణయమే.. మరోవైపు చిత్తూరులో మత్స్యశాఖ కార్యాలయ భవనం నిర్మించడంతో పాటు చేప పిల్లల పెంపక కుంటలు, మత్స్యకారులకు శిక్షణ ఇచ్చేందుకు సమావేశపు హాలు నిర్మించడానికి నిధులు విడుదలయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల (ఆర్డీఎఫ్) నుంచి రూ.1.50 కోట్లు విడుదలైతే భవనం ఎక్కడ నిర్మించాలో తెలి యక అధికారులు తల పట్టుకుంటున్నారు. టీడీపీ నేతల నుంచి వెళ్లిన ప్రతిపాదనలతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ తీర్మానం సైతం కలెక్టర్‌కు చేరింది. విలువైన స్థలాన్ని రాజకీయ పార్టీకి అప్పగించి విమర్శలు ఎదుర్కొంటారో..? గ్రామీణ ప్రాంతాల నుంచి రైళ్లలో, బస్సుల్లో చిత్తూరుకు వచ్చే రైతులకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో మత్స్యశాఖకే ఉంచుతారనే విషయం పూర్తిగా కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడుంది. -
ఏడు గుంటల భూమి కోసం.. గొడ్డలితో నరికి భర్త హత్య
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా బీరోలులో ఏడు గుంటల భూమి కోసం కట్టుకున్న భర్తనే కొడుకుతో కలసి రెండో భార్య గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. బుడిగె సీతారాములు(65) సోమలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు జన్మించాడు. తర్వాత సోమలక్ష్మి మృతి చెందడంతో సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కొడుకు జన్మించగా.. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ క్రమంలో సీతారాములుకు ఉన్న 15 గుంటల భూమిలో వాటా కోసం గొడవలు జరిగాయి. 7 గుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంపు పేపర్‌పై రాసి ఇచ్చినప్పటికీ, పట్టా మాత్రం అతని పేరునే ఉంది. దీంతో తన పేరు పట్టా చేయాలని ఆమె పట్టు బట్టడంతో సీతారాములు పట్టించుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న ఆమె.. కొడుకుతో కలసి శుక్రవారం అర్ధరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి హత్య చేసింది. -
భూవివాదంలో రౌడీషీటర్ల రంగప్రవేశం
కందుకూరు (రంగారెడ్డి): రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో వివాదాలు అంతే వేగంగా ప్రారంభమయ్యాయి. కందుకూరు మండలంలో దెబ్బడగూడ గేట్ సమీపంలోని సర్వే నంబర్ 460లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను అర్ధరాత్రి కొందరు దుండగులు కాపలాదారులపై దాడిచేసి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సర్వే నంబర్ 460లో హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన మొహినుద్దీన్, మోహిన్‌మర్ఫిది, ఎండీ హిదాయతుల్లాలకు 5.35 ఎకరాల భూమి ఉంది. అదే నంబర్లో ఎస్.సుగుణాకర్‌రెడ్డి, చండీశ్వర్‌కు చెందిన మరో ఎకరం భూమి ఉంది. ఈ భూముల చుట్టూ యజమానులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కాగా, అదే సర్వే నంబర్లో వారి భూమికి ఆనుకునే హైదరాబాద్‌కు చెందిన అస్లాంకు కొంత భూమి ఉంది. వీరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదివారం అర్ధరాత్రి డీసీఎం వాహనం, కార్లలో పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భూమి యజమాని అస్లాం రౌడీలతో తరలివచ్చి పొలంలో పని చేస్తున్న కాపలాదారుల్ని కత్తులతో బెదిరించి ఫెన్సింగ్‌ను కూల్చివేయించారు. దీంతో హడలిపోయిన వారు పోలీసులతో పాటు సంబంధిత యజమానులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీలు పరారయ్యారు. ఫెన్సింగ్ కూల్చివేతకు పాల్పడిన అస్లాంతో పాటు పలువురిపై సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అస్లాం తమను తరచూ భూవిషయమై బెదిరిస్తున్నాడని బాధిత భూ యజమానులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
భూవివాదం.. ఘర్షణ
సత్తుపల్లి/వేంసూరు: భూవివాదం చినికి చినికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేంసూరు మండలం కల్లూరుగూడెం లో ఆదివారం సాయంత్రం ఇది జరిగింది. బాధితుడు బండి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని తండ్రి బండి వెంకటరెడ్డి కొనుగోలు చేశాడు. ఈ భూమి తనదేనంటూ మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు ఆక్రమించాడు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ పొలం వద్దకు కల్లూరు ఆర్డీఓ టీఏవీ నాగలక్ష్మి వచ్చి విచారణ చేపట్టారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు ఎవ్వరూ ఆ భూమిలోకి వెళ్లవద్దని ఆదేశించారు. దీనిని మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు ఉల్లంఘించాడు. ఆయన ఆదివారం ఆ పొలం దున్నుతుండగా బండి శ్రీనివాసరెడ్డి, బండి వెంకటరెడ్డి అడ్డుకోబోయారు. దీంతో, వారిపై రాచూరి గంగరాజు, ఆయన కుమారుడు వంశీ, జంగా నరేష్, వీరవెంకి వెంకటేశ్వరరావు కలిసి కొడవళ్లతో దాడి చేశారు. బండి వెంకటరెడ్డికి తలపై, శ్రీనివాసరెడ్డికి చేయిపై తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజకీయ రంగు...! టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు వెల్ధి జగన్మోహన్రావు కలిసి పొలం పరిశీలించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగిందని బండి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దాడి వార్తతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు పెద్ద సంఖ్యలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. కల్లూరుగూడెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. క్షతగాత్రులను జిల్లా దిశ కమిటీ సభ్యుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ పరామర్శించారు. కేసును సత్తుపల్లి రూరల్ సీఐ మడత రమేష్‌గౌడ్ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి స్థలం కోసం మాజీ నక్సలైట్ దీక్ష
మణుగూరురూరల్ : తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అప్పగించాలని కోరుతూ మాజీ నక్సలైట్ ఈట్ల పుష్పకుమారి స్థానిక అంబెడ్కర్ సెంటర్లో దీక్ష ప్రారంభించారు. మంగళవారం రెండో రోజు ఆమె దీక్షకు పలు రాజకీయపార్టీల నేతలు మద్దుతు తెలిపారు. మూడు సంవత్సరాలు నక్సల్స్ గ్రూప్‌లో దళ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త నవీన్ సైతం అదే దళంలో పనిచేసి మృతి చెందాడు. ఆరోగ్య సరిగాలేని పుష్పకుమారి ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆమె లొంగిపోయిన సమయంలో మణుగూరు మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీనగర్ ప్రాంతంలోని 138 సర్వే నంబర్లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. ఆమె అక్కడ ఇల్లు నిర్మిచుకోకపోవడంతో స్థానికులు కొందరు అక్కడ సమ్మక్క ఆలయం ఏర్పాటు చేశారు. బాధితురాలు అనేక మార్లు కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తానని బాధితురాలు తెలిపారు. పుష్పకుమారి చేపట్టిన దీక్షకు మణుగూరు మండలంలోని సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు సంఘీభావం తెలిపారు. పుష్ఫకుమారికి న్యాయం జరిగేవరకు తాము అండగా నిలుస్తామన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో సీపీఎం నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, బండి రాజేష్, నైనారు నాగేశ్వరరావు, వంకాల రాజు, నర్సింహారావు, ఎన్డీ నాయకుడు ఆర్ మధుసూదన్‌రెడ్డిలు ఉన్నారు. -
ఆస్తికోసం తల్లిదండ్రుల గెంటివేత
సంగెం(పరకాల) : దేశమంతా ఫాదర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.. కనిపెంచిన వారి గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు.. ఇదే సమయంలో ఆస్తికోసం వృద్ధులైన తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేయడంతో పోలీసులను ఆశ్రయించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత దంపతుల కథనం ప్రకారం.. లోహిత గ్రామానికి చెందిన బొనగాని వీరమల్లు, కళమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరమల్లు కల్లుగీత వృత్తిపై, భార్య కూలినాలి చేసి కష్టపడి ఏడు ఎకరాల భూమి సంపాదించారు. ఆ భూమిలో రెండున్నర ఎకరాలు కళమ్మ పేరుతో, రెండు ఎకరాల పొలం చిన్న కొడుకు శ్రీనివాస్ పేరుతో, మరో రెండున్నర ఎకరాలు పెద్దకొడుకు వెంకటేశ్వర్లు పేరుతో పహాణీలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేశారు. ఈ క్రమంలో చిన్న కూతురుకు కట్నంతోపాటు పసుపు కుంకుమల కింద ఎకరం పొలం రాసిచ్చారు. మరో ఎకరం తమ వద్ద ఉంచుకుని మిగిలిన ఐదు ఎకరాలను ఇద్దరు కుమారులకు చెరి సగం పంచి ఇచ్చారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాస్ తన పేర పహాణీలో ఉన్న రెండు ఎకరాల పొలాన్ని ఇటీవల సాదాబైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. దీంతో చెల్లితోపాటు మా పరిస్థితి ఏంటని తండ్రి ప్రశ్నించగా కళమ్మ పేర ఉన్న భూమిని మీరే దున్నుకోండి అని చెప్పాడు. ఇటీవల ఆ చెల్కను ఇద్దరు కొడుకులు కలిసి దున్నుకుంటుండగా ‘పోలం తీసుకున్నారు. చెల్క కూడా తీసుకుంటే మేం ఎట్లా బతుకాలి’ అని అడ్డుకోబోయిన తండ్రిపై కొడుకులు దాడి చేసి చంపుతామని బెదిరించారు. దీంతో వీరమల్లు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌తోపాటు వెంకటేశ్వర్లును తీసుకురమ్మని ఎస్సై దీపక్ కానిస్టేబుల్‌ను శనివారం గ్రామానికి పంపాడు. కానిస్టేబుల్ ముందే ఇద్దరు కోడళ్లు అత్తమామలైన వీరమల్లు, కళమ్మను దుర్భాషలాడుతూ ఇంట్లోంచి గెంటివేసి తాళం వేసుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో గ్రామంలోని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుని ఆదివారం సర్పంచ్, ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంటి తాళం తీయకపోగా చంపుతామని కొడుకులు బెదిరించడంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వీరమల్లు, కళమ్మ మాట్లాడుతూ ‘కనీ పెంచి పెద్ద చేసినం.. పెళ్లిళ్లు చేసి చెరో ఇళ్లు కట్టించడంతో పాటు ఉన్న భూమి పంచి ఇచ్చినం.. మేమూ ఇల్లు కట్టుకుని వాళ్లమీద ఆధారపడకుండా బతుకుతున్నం. ఉన్న భూమి తీసుకొని చంపుతామని బెదిరిస్తున్నరు.. కొడుకుల నుంచి రక్షణ కల్పించి మా భూమి మాకు ఇప్పించాలి’ అని వేడుకున్నారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తల్లిదండ్రులను ఇంటికి తాళం వేసి వెళ్లగొట్టిన మాట వాస్తవమే అని.. ఇద్దరు కుమారులను పిలిచి మాట్లాడి వృద్ధులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
భూవివాదంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా
-
మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు మరువకముందే.. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
భూతగాదాలో తమ్ముడి హత్య
లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురంలో అన్నదమ్ముల భూమి తగాదాలో తమ్ముడు బడికె సత్తయ్య (65) హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యాపురంలో బడికె బుచ్చి ఎల్లయ్య, బడికె సత్తయ్య అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూమి పంచాయతీ సాగుతుంది. శుక్రవారం బుచ్చిఎల్లయ్య ట్రాక్టర్ తీసుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో దున్నేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సత్తయ్య అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు. ఈ సమయంలో అన్నదమ్ములు బుచ్చిఎల్లయ్య, సత్తయ్యల మధ్య వివాదం జరిగి ఘర్షణకు దిగారు. దీంతో సత్తయ్య కిందపడి స్త్పహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు సత్తయ్యను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బడికె మల్లేశ్, బడికె చంద్రయ్య, బడికె బుచ్చిఎల్లయ్య, పరశురాములు, చౌదరిపల్లి కరుణాకర్, రాగం నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. కాగా, మాణిక్యాపురంలో సత్తయ్య అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై బందోబస్తు నిర్వహించారు. -
సోలార్ పరిశ్రమ దిగ్బంధం
ఓర్వకల్లు : భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం శనివారం శకునాల గ్రామం వద్ద సోలార్ పరిశ్రమను దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. ముందుగా గని, శకునాల, దేవనూరు గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు, బాధిత రైతులు పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమ వద్దకు తరలి వెళ్లారు. పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పాణ్యం, కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయితే అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాక కదిలేదని రైతులు, కూలీలు భీష్మించి కూర్చున్నారు. అక్కడే టెంట్ వేసుకొని నాలుగు గంటల పాటు బైఠాయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని, స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్, ఓర్వకల్లు తహసీల్దార్ రజనీకుమారి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సోలార్ పరిశ్రమలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లింపులో నాలుగేళ్ల నుంచి జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ అంగీకరించారు. మొత్తం 980 ఎకరాలకు పరిహారం ఇవ్వడానికి రూ.81 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. ఇందులో మొదట జనరల్ అవార్డు కింద గుర్తించిన 210 ఎకరాలకు రూ.27 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం కారణంగా పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రెక్టిఫికేషన్ అవార్డు కింద గుర్తించిన మరో 230 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కాలయాపన జరుగుతోందన్నారు. పరిహార విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బోయ మద్దిలేటి కుటుంబానికి జాతీయ కుటుంబ యోజన పథకం(ఎన్‌ఎఫ్‌బి) కింద ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబంలో ఒకరికి సోలార్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక యువతకు అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ఈఈ సుధాకర్‌ను ఆర్డీఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన తర్వాత 15 రోజుల్లో రూ. 81 కోట్ల్ల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఆందోళనను విరమించుకున్నారు. సీపీఎం మండల కన్వీనర్ నాగన్న , రైతు సంఘం నాయకులు రామకృష్ణ , భూ నిర్వాసిత కమిటీ సభ్యులు చంద్రబాబు, చాంద్‌బాషా షంషీర్‌ఖాన్, జయరాముడు, మల్లమ్మ, రమాదేవి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలు, బాధిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హుసేన్ సాహెబ్ -
చంపేశారు!
‘‘భూమి ఉంది... భయం లేదు... కూతుళ్లకు పెళ్లిళ్లు ఘనంగా చేయాలని రోజూ అనేవాడివి.. ఇప్పుడు కదలకుండా పడి ఉన్నావు... మాకు దిక్కెవరయ్యా’’ మార్చురీ వద్ద ఇద్దరు కూతుళ్లు త్రివేణి, భారతిని పట్టుకుని కేశవనాయక్ భార్య శాంతమ్మ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ గిరిజన రైతు ఆరేళ్లుగా సాగుచేసుకుంటున్న పొలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. ఆన్లైన్లో వేరొకరి పేరు కూడా ఎక్కించారు. న్యాయం చేయాలని బాధిత రైతు కాళ్లావేళ్లాపడినా...అధికారులు కనికరం చూపలేదు. ఆందోళన చెందిన ఆ గిరిజనుడు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోగా.. అతనిపైనే ఆధారపడిన ఇద్దరు కూతుళ్లు, భార్య దిక్కులేని వారయ్యారు. ఆత్మకూరు : తమ భూమిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి పేరుపై ఆన్లైన్లో నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన ఆత్మకూరు మండలం వేపచెర్లతండాకు చెందిన రైతు కేశవనాయక్ (45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్, శాంతమ్మ దంపతులు కూలీలు. వీరికి ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కింద 507–2 సర్వే నంబర్లో 3.21 ఎకరాల పొలాన్ని శాంతమ్మ పేరు మీద పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఆ పొలంలో పంట సాగుచేసుకుంటున్నారు. ఆత్మకూరు సిండికేట్ బ్యాంకులో రూ.70 వేల పంట రుణం పొందారు. ఇదిలా ఉండగా నెల రోజుల కిందట శాంతమ్మ పేరిట ఉన్న 3.21 ఎకరాల భూమిని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణానాయక్ పేరిట ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేశవనాయక్ రెవెన్యూ అధికారులను సంప్రదించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. కానీ న్యాయం జరగలేదు. మరోవైపు పంట రుణం రెన్యూవల్ సమయం దగ్గరపడింది. రెన్యూవల్ చేయాలంటే బ్యాంకు అధికారులు రికార్డులు పరిశీలిస్తారు. అప్పుడు వేరే పేరు కనిపిస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళనకు గురైన రైతు కేశవనాయక్ ఆదివారం ఇంటి దగ్గరే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చక్రం తిప్పిన మారెక్క శాంతమ్మ భూమిని కృష్ణానాయక్ పేరిట మార్పు చేయించడంలో ఎంపీపీ మారెక్క హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీకి చెందిన కృష్ణా నాయక్ పేరుమీద మార్చాలని ఎంపీపీ రెవెన్యూ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెత్తినట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు ఆదివలారం సాయంత్రం పొలంలోనే అంత్యక్రియలు చేయటానికి సిద్ధమవగా కృష్ణానాయక్ బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కేశవనాయక్ అంత్యక్రియలు సజావుగా జరిగాయి. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాలపోతన్న, మాజీ సర్పంచు యల్లప్ప తదితరులు రైతు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. నోటీసులు ఇచ్చాం: తహసీల్దార్ నారాయణ సర్వే నంబర్507–2లోని 3.21 ఎకరాల భూమికి సంబంధించి ఆర్డీఓ ఉత్తర్వులు ప్రకారమే నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ నారాయణ చెప్పారు. సాగులో కృష్ణానాయక్ ఉండటం వల్ల వారికే ఆన్లైన్ చేశామన్నారు. ఈ భూమిని రద్దు చేసినది తాను కాదని, గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగరాజు అని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలి అనంతపురం న్యూసిటీ: రైతు కేశవనాయక్ (45) మృతికి కారణమైన ఆత్మకూరు తహసీల్దార్ నారాయణను తక్షణం సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సర్వజనాస్పత్రిలోని మార్చురీలో కేశవనాయక్ మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయవద్దని కేశవనాయక్ కుటుంబీకులు, వైఎస్సార్ సీపీ నేతలు మార్చురీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరావ్, ఆర్డీఓ మలోల మార్చురీ వద్దకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమ భూమి పోతే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయలేనని, తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు కేశవనాయక్ మొరపెట్టుకున్నా తహసీల్దార్ కనికరం చూపలేదన్నారు. రైతు మృతికి కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకుని, బాధితులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
మందు డబ్బాతో ఆందోళన
బెజ్జంకి(సిద్దిపేట): గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్ స్టేషన్ కోసం తీసుకున్న తమ మూడెకరాల భూమికి బదులు వేరే చోట భూమి ఇవ్వాలని కల్లెపెల్లికి చెందిన రైతు బిట్ల కనుకయ్య కుటుంబ సభ్యులతో కలిసి పురుగులు మందు డబ్బాతో మంగళవారం ఆందోళనకు దిగాడు. స్థానికులు జోక్యం చేసుకుని వారిని బుజ్జగించి ఆందోళనను విరమింపజేశారు. వివరాల ప్రకారం..గతేడాది గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువుగా ఉందని కనుకయ్యకు చెందిన 1.04 గుంటల భూమిని సబ్‌స్టేషన్‌కు అప్పగిస్తే ప్రభుత్వం నుంచి 3 ఎకరాల సాగుభూమిని ఇప్పిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. నిరుపేద అయిన కనుకయ్యకు నలుగురు కూతుళ్లు. సాగు చేసే భూమి పోవడంతో తమకు పూట గడిచే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య రాజేశ్వరి పేరున ప్రభుత్వం నుంచి 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ హద్దులు చూపించి కాస్తుకు ఇవ్వడంలేదని వాపోయారు. గతంలో భూమి పట్టాదారుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదని వారికి రిజిస్ట్రేషన్ చేసినా భూమిలోకి రానివ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సజావుగా సాగని చివరి మజిలీ..
విజయనగరం, వేపాడ: శ్మశానానికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న సంఘటన మండలంలోని చినగుడిపాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వేచలపు అప్పారావు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. దీంతో మృతదేమాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశానవాటికకకు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన శంకరవంశం సీతారామ్మూర్తిరాజు మృతదేహాన్ని తీసుకెళ్తున్న రస్తా తన సొంతమని, ఈ దారి గుండా మృతదేహాన్ని తీసుకెళ్లకూడదని అడ్డగించాడు. మృతుడి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మృతుడి కుటుంబీకులు గ్రామ పెద్దలు, పోలీస్, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ పెంటయ్య తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. స్థలం ఎవరిదైనా శవాన్ని అడ్డుకోవడం నేరమని.. అంత్యక్రియలు జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. దీంతో వీఆర్ఓ శ్రీను, హెచ్‌సీ శివకేశవరావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో సంప్రదింపులు చేసి సమస్య పరిష్కరించారు. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే స్థల హద్దులు గుర్తిస్తారని గ్రామపెద్దలకు చెప్పారు. అడ్డుకోవడం బాధాకరం మృతదేహాన్ని అడ్డుకోవడం బాధకరమని గ్రామ పెద్దలు లండఅప్పడు, రామ్మూర్తి, బాలిబోయిన పెదకోనారి, జీరంరెడ్డి జగ్గునాయుడు, తదితరులు అన్నారు. పూర్వం నుంచి గ్రామస్తులందరూ ఇదే రహదారిని వినియోగిస్తున్నారని చెప్పారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక హద్దులు గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
భూసమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తన భూ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు హెచ్చరించాడు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కిరోసిన్ డబ్బాతో వచ్చాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన ఈశ్వరయ్య తనకు ఉన్న ఏడు గుంటల భూమిని పక్క పొలానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కిరోసిన్ డబ్బాతో వచ్చి.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సిబ్బంది గుర్తించి కిరోసిన్ డబ్బా లాక్కొని సర్ది చెప్పారు. అనంతరం అతను కలెక్టర్ రొనాల్డ్ రోస్కు వినతిపత్రం సమర్పించగా.. ఆయన మిడ్జిల్ తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈశ్వరయ్యకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
వివాదంలో టీడీపీ పార్టీ కార్యాలయం
-
ఇద్దరు వీఆర్ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్ఏలపై నివాస్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
'మంత్రి దేవినేని నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమతో పాటు ఆయన అనుచరులు, విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన అట్లూరి ప్రవిజ ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసేందుకు లేదా హత్య చేసేందుకు ప్రయత్నాలు జరగొ చ్చని గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పిం చాలని కోరారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అమరావతి దగ్గర్లోని కంచికచర్ల మండలం చౌటుకల్లు గ్రామంలో తనకు రెండెకరాల స్థలం ఉందని, ఈ భూమి పంపకాల విషయంలో మంత్రి దేవినేని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్, చవలం శ్రీనివాసరావు, మన్నె నాయుడు, మంత్రి పీఏ చౌదరి, మరో పీఏ శివరావు, గన్‌మన్ ప్రసాద్, ఆయన క్లాస్మేట్ ఎనిగళ్ల రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్ కోగంటి విష్ణువర్ధన్‌రావు వేధిస్తున్నారని బాధితురాలు వాపోయారు. ‘వీరిపై గతేడాది జూన్ 21న విజయవాడ సీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశాను. మంత్రి దేవినేనితో పాటు ఆయన సోదరుడిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిం టుందని, కేసును వెనక్కి తీసుకోవాలంటూ నాపై మంత్రి కార్యాలయంతో పాటు పోలీసు లు ఒత్తిడి చేస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిపై గతేడాది సెప్టెంబర్ 19న మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశాను. ఏపీ డీజీపీకి హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. గత గురువారం కొందరు పోలీసులు విజయవాడలోని మా ఇంటికెళ్లి నా కదలికలపై ఆరా తీశారు. 2015 నవంబర్‌లో అప్పటి పట మట సీఐ దామోదర్ నన్ను కిడ్నాప్ చేసి గొల్లపూడిలోని మంత్రి ఇంటికి తీసుకెళ్లారు’అని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇచ్చింది చాలదు.. ఇంకా పట్రా
సాక్షి, బలిజిపేట: ఆన్లైన్ చేసేందుకు వీఆర్వోకి రూ.వెయ్యి ఇచ్చా. అయినా ఆన్లైన్ చేయలేదు. నిలదీస్తే ఇచ్చిన లంచం చాలదు. ఇంకా ఇస్తే ఆన్లైన్ చేస్తాను అంటూ తిప్పుతున్నాడు.. అంటూ మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మ వాపోయింది. ఆమె బుధవారం విలేకరులకు అందించిన వివరాల ప్రకారం.. మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మకు తండ్రి అక్కేన శివుడునాయుడి మరణానంతరం భూమి సర్వే నంబర్ 122–సబ్ డివిజన్ 2లోని 1.05 ఎకరాల భూమిని ఫోతీకేసు కింద ఆమె పేరున మార్చారు. భూమిని ఆన్లైన్ చేసేందుకు 5నెలల క్రితం వీఆర్వో సాంబమూర్తికి రూ.వెయ్యి చెల్లించారు. అప్పటినుంచి తిప్పుతున్న వీఆర్వో ఇచ్చిన డబ్బులు చాలవని.. మరికొంత ఇస్తే చేయిస్తానంటున్నాడు. దిక్కుమొక్కు లేని తన భూమిని తన పేరున వన్‌బీకి జారీ చేసేందుకు ఇన్ని ఇబ్బందులు పెడితే అధికారుల చుట్టూ ఎలా తిరుగుతానని నరసమ్మ కన్నీరుమున్నీరైంది. భూముల్ని ఆన్లైన్ చేయడంలో ఎకరాకు రూ.వెయ్యి వంతున బలిజిపేట రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెదపెంకి జన్మభూమి గ్రామ సభలో దత్తి మురళి అనే రైతు డబ్బులు ఇస్తే తప్ప ఆన్లైన్ కావడం లేదని ఆరోపించడం తెలిసిందే. ఆన్‌లైన్‌కు డబ్బులు ఇస్తే తప్ప చేయటం లేదని అజ్జాడ గ్రామ సభలో ఆరోపించారు. డబ్బులిస్తేనే ఆన్లైన్ నా తల్లి సన్యాసమ్మ పేరున ఉన్న భూమిని ఆన్లైన్ చేసేందుకు అజ్జాడ వీఆర్వో డబ్బులు ఇమ్మన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయరా? అని అడిగాను. డబ్బులిస్తేనే చేస్తానంటున్నారు. – ప్రదీప్, అజ్జాడ ఫిర్యాదు చేస్తే చర్య నా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంబంధిత వీఆర్వోపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాను. డబ్బు ఎవరు తీసుకున్నారో తెలిస్తే చర్యలుంటాయి. –బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
ఈ కాలనీ నాది!
దహెగాం(సిర్పూర్): మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్లో 13 ఎకరాల భూమి వివాదస్పదమైంది. 58 ఏళ్ల క్రితం ఇళ్ల కోసం స్థలాలు కొనుగోలు చేసి 120 కు టుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ ఓ వ్యక్తి ఈ స్థలమంతా తమదేనని హైకోర్టులో కేసు వేయడంతో వివాదం తలెత్తింది. దీంతో రెవెన్యూ అధికారులు అందరికీ నోటీసులు జారీ చేయగా బుధవారం గ్రామస్తులు ఆధారాలను తహసీల్ కార్యాలయంలో అందజేశారు. ఇవీ వివాదం.. దహెగాం మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్లో 13 ఎకరాల భూమి తమ తండ్రి దుమ్మెన బాపు పేరున ఉందని, ఈ భూమిని రెవెన్యూ అధికారులు తనకు విరాసత్ చేయడం లేదని కౌటాల మండలానికి చెందిన దుమ్మెన ఇస్తారి హైకోర్టులో కేసు వేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ నాలుగురోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఇళ్లకు సంబం«ధించిన పత్రాలతో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీంతో 240 సర్వే నంబర్లో ఇళ్లు నిర్మించికున్న వారంతా బుధవారం తహసీల్ కార్యాలయంలో హాజరయ్యారు. ఇళ్ల పత్రాలు, డాక్యూమెం ట్లను అధికారులకు అందజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు జూనియర్ అసిస్టెంట్ రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. పెద్దవాగు ఒడ్డున పాత దహెగాం ఊరు ఉండగా 1956లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకపోయింది. దీంతో 1960 సంవత్సరంలో దుమ్మెన బాపు వద్ద 240 సర్వే నంబర్లోని 13 ఎకరాల భూమిని చిలువేరు రత్నయ్య, పుప్పాల చిన్నన్న, కొమురవెల్లి శ్రీశైలం కొనుగోలు చేశారు. సాదాబైనామా కూడా రాసి ఇచ్చారు. కొనుగోలు చేసి న వారి పేరు మీద సాదాబైనామా చేయాలని అప్ప టి సిర్పూర్(టి)లోని రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. కానీ దూరభారం ఉండగా అంతగా పట్టించుకోలేదు. దహెగాం రెవెన్యూ కార్యాలయంలో «సాదాబైనామా కింద పేరు మార్పిడి కో సం దరఖాస్తు చేసుకోగా 2003లో తహసీల్ కార్యాలయంలోని రికార్డులను మావోయిస్టులు కాలబెట్టడంతో రికార్డులన్నీ కాలిపోయాయి. దీంతో పాత రికార్డులను పునరుద్ధరించడంతో ఆ భూమి కౌటాల మండలానికి చెందిన దుమ్మెన బాపు పేరు మీద ఉందన్నారు. గత 58 సంవత్సరాల నుంచి ఇళ్లు నిర్మించుకొని 120 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఇళ్లకు సంబంధించిన టాక్స్‌లు ప్రతీ సంవత్సరం గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నామని, ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న మాకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
కన్న తండ్రే కడతేర్చాడు
రాజాం: భూ విక్రయం విషయంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన మనస్పర్థలు హత్యకు దారితీశాయి. తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కలిపిండి సీతంనాయుడు రాజాం నగర పంచాయతీ పరిధిలోని నవ్యనగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె సుహాసిని వివాహ నిమిత్తం తనకున్న భూమిని సమీప బంధువులకు అమ్మాలని నిర్ణయించాడు. అయితే హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతడి కుమారుడు శ్రీకాంత్‌నాయుడు ఇందుకు నిరాకరించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారం కిందట శ్రీకాంత్ రాజాం వచ్చాడు. గురువారం రాత్రి అతడు నిద్రపోయిన సమయంలో తండ్రి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అతడి కేకలు విని పక్కగదిలో ఉన్న తల్లి సరోజిని బయటకు రాగా, ఆమెపైనా దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని శ్రీకాంత్నాయుడిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ రాత్రి 1 గంటకు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దళితుల మధ్య చిచ్చురేపిన భూవ్యవహారం
-
‘మంత్రి అనుచరులతో మాకు ప్రాణ హాని ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి అమర్నాథ్రెడ్డి అనుచరులతో ప్రాణ హాని ఉందని నారాయణపురానికి చెందిన పుణ్యవతి అనే మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మంత్రి అల్లుడితోపాటు, ఆయన అనుచరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారని ఆమె తెలిపింది. తమ రెండెకరాల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారని మహిళ తెలిపింది. అంతేకాక, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై మంత్రి అమర్నాథ్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. గత రాత్రి పొలం వద్ద ఉన్న సమయంలో మంత్రి అనుచరులు హతమర్చేందుకు ప్రయత్నాం చేశారని మహిళ చెప్పింది. మాకు ఏమైనా జరిగితే అందుకు మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుచరులే కారణమని పుణ్యవతి, ఆమె సోదరీమణులు ఆరోపించారు. -
నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు
సాక్షి, విశాఖ: విశాఖలో ఇంటి సందు, వీధి కోసం మహిళలు నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. జుత్తులు పట్టుకుని కొట్టుకోవడం కలకలం రేగింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న లక్ష్మీపురం కాలనీలో ఓ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవ కొనసాగుతోంది. ఈ క్రమంలో పద్మ, సత్యవతి అనే మహిళలు, పక్కంటిలో ఉండే సంతోషి అనే మహిళపై ఈ రోజు ఉదయం దాడి చేశారు. సంతోషి భర్త శివ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను ఇంట్లో లేని సమయంలో మహిళలు సంతోషి పైన దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న శివ ఇంటి వద్దకు చేరుకుని తన భార్యపై చేయి చేసుకున్న వారిని చితకబాదాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా సదరు మహిళలు కొట్టారని శివ దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన 3 గజాల స్థలం కోసం ఈ గొడవ జరిగనట్టు ఆటో డ్రైవర్ తెలిపాడు. గతంలో కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు. నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు -
మమ్మల్ని చావనివ్వండి..
సాక్షి, నాంపల్లి: తమ భూములను, ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో సామూహిక ఆత్మహత్యలకు అనుమతించాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా కొండ పోచమ్మ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. తమ భూములను రక్షించాలని కోరుతూ కమిషన్‌కు ఫిర్యాదు చేసినందున పోలీసుల నుండి బెదిరింపులు వస్తున్నాయన్నారు. భూములు, ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు సామూహిక ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వివరాల్లోకి వెళితే.. నగర శివార్లలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం, నాగపూర్ గ్రామంలో సర్వే నంబరు 832, 835లలో బి.కొండమ్మ, ఇ.గురువయ్య, పి.మల్లయ్య అనే వ్యక్తులకు భూములు ఉన్నాయి. ఈ భూమి సమీపంలో ఊషదీశ్వర్‌రెడ్డికి చెందిన భూములు ఉండటంతో ఆయన పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడికి సిద్ధిపేట డీసీపీ, చేర్యాల సీఐ సహకరిస్తున్నారని, డీసీపీ ప్రోద్బలంతో గుండాలతో తమపై దాడులకు పాల్పడ్డారన్నారు. పట్టా భూమిలో ఉన్న షెడ్లను కూల్చివేయడంతో బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు, గూండాల దౌర్జాన్యాలు మరింత పెరిగాయని, ఊషదీశ్వర్ రెడ్డి, అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పించలేని పక్షంలో సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ జనవరి 17లోగా నివేదికను అందజేయాలని కోరుతూ సిద్ధిపేట ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వీరికి యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు రాగం సతీష్ యాదవ్ తదితరులు బాధితులను పరామర్శించారు. -
భగ్గుమన్న భూకక్షలు.. ఒకరు మృతి
సాక్షి, పాలకుర్తి: రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు భగ్గుమనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జరిగింది. వివరాలివి.. వెంకటయ్య, రాజు అనే సోదరులపై బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన కొమురయ్యతో పాటు అతని సోదరులు ఐదుగురు గొడ్డళ్లతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రాజు అక్కడిక్కడే మృతి చెందగా వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రధాన నిందితుడు కొమురయ్య, మరో ఐదుగురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. క్షతగాత్రుడిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
నవీన్‌మిట్టల్‌కు మెమో
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ నానల్‌నగర్‌లోని భూములకు నకిలీ పత్రాల ఆధారంగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. ఎన్ఓసీ ఇచ్చిన కమిటీలోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయకపోవడానికి కారణమేమిటని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నిలదీసింది. బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీనాను స్వయంగా హాజరుకావాలన్న ఆదేశాల తర్వాతే అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్‌మిట్టల్‌కు మెమో ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. నిరభ్యంతర పత్రం ఇచ్చిన అప్పటి హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న ఎన్ఓసీ చైర్మన్ నవీన్‌మిట్టల్, సంయుక్త కలెక్టర్ దుర్గాప్రసాద్, అధికారులు వెంకటరెడ్డి, పి.మధుసూధన్‌రెడ్డి ఇతరులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్‌మిట్టల్, సయ్యద్ వేరువేరుగా అప్పీల్ పిటిషన్లు వేశారు. వీటిని ధర్మాసనం విచారించింది. సయ్యద్, మరో ఇద్దరిని ప్రాసిక్యూషన్ జరపాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశిస్తే.. కోర్టు తీర్పు ప్రతితో తహసీల్దార్ పోలీసులకు ఎలా ఫిర్యాదు చేస్తారని ధర్మాసనం తప్పుపట్టింది. దీంతో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. సయ్యద్ మరో ఇద్దరిపై ప్రాసిక్యూషన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపిన తండ్రి
అడ్డాకుల (దేవరకద్ర): సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు రేపిన చిచ్చుతో ఇంత దారుణానికి ఒడిగట్టారు. కన్న కొడుకన్న కనికరం లేకుండా హత్య చేసి శవాన్ని కృష్ణానదిలో పడేయాలని ఆటోలో తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో తండ్రికి సైతం నిప్పంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన అడ్డాకుల మండలం కందూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మద్యానికి బానిసై.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పరిగి రోడ్లో నివాసముండే రంగవల్లి రామస్వామిగౌడ్కు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు యాదగిరిగౌడ్(35)కు భార్య జ్యోతి, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. చిన్న కొడుకు శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కొడుకులు ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు యాదగిరిగౌడ్ మద్యానికి బానిపై కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. రెండేళ్ల క్రితం అతని భార్య కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి యాదగిరి ఇంటి వద్దే ఉంటూ ఆటోను నడుపుకొంటున్నాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఆస్థి విషయంలో తండ్రి, తమ్ముడితో గొడవ పడుతున్నాడు. పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు మాధవి పెళ్లి చేయాలని తండ్రి చేస్తున్న ప్రయత్నాలను పెద్ద కొడుకు అడ్డుకుంటున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో.. రామస్వామి భార్య, కుమార్తె పడుకున్న గదికి 11 గంటల సమయంలో బయటి నుంచి గడియ పెట్టారు. పక్క గదిలో ఉన్న యాదగిరితో కలహాలకు నీవే కారణమంటూ గొడవ పడ్డారు. ఇతంలోనే తండ్రి రామస్వామి కర్రతో యాదగిరి తలపై బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. వెంటనే చిన్న కొడుకు క్యాన్ తెచ్చి పెట్రోల్ పోయగా తండ్రి నిప్పటించాడు. మంటలకు తాళలేక యాదగిరి తనువు చాలించాడు. ఈ ఘటనలో తండ్రి రామస్వామి ముఖం, ఛాతి, కాళ్లకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. తండ్రిని కొట్టడంతో మనస్థాపం.. ఇంటిని తన పేర రాయాలని ఇటీవల యాదగిరి తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఇంటి వద్ద నిత్యం గొడవ జరుగుతుండటంతో రెండు నెలల క్రితం చిన్న కొడుకు శ్రీనివాసులు భార్య సైతం తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఇంటిని తన పేర రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రితో గొడవ పడిన యాదగిరి అందుకు నిరాకరించిన తండ్రిని చితకబాదాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్న కొడుకు తండ్రిని అన్న కొట్టిన విషయం తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలకు కారణమవుతున్న పెద్ద కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ట్రాలీ ఆటోలో వేసుకుని.. యాదగిరి మృతిచెందిన తర్వాత శవాన్ని కృష్ణానదిలో పడేయడానికి శ్రీనివాసులు నడిపే ట్రాలీ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో శాఖాపూర్ టోల్గేట్ మీదుగా వెళ్లకుండా కందూర్ వైపు వెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ అమర్నాథ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆటోను అనుమానంగా ఆపాడు. అందులో ఏముందని చూడగా శవం కనిపించడంతో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆర్.మధుసూదన్ ఘటనా స్థలానికి వెళ్లి తీవ్ర గాయాలపాలైన తండ్రిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్న కొడుకు శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం జడ్చర్ల టౌన్ సీఐ బాలరాజు వచ్చి విచారణ చేపట్టారు. అదే ఆటోలో శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శ్రీనివాసులును కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రశ్నించినందుకు ప్రాణం తీశారు!
► ఎద్దులు పొలంలో పడటంతో ఇరు వర్గాల ఘర్షణ ►భార్య, తండ్రితో కలిసి వృద్ధుడిపై పిడిగుద్దులు ►ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి.. మాడ్గుల: ఎద్దులు తన వ్యవసాయ పొలంలోకి వచ్చి మోటారు పైపులను తొక్కి ధ్వంసం చేశాయని, నీటి కుండలను పగలగొట్టాయని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పిడిగుద్దులకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సీఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని ఇర్విన్ దిల్వార్ఖాన్పకి చెందిన షేక్ ముస్తాఫా (65) తన పొలం వద్ద ఉన్నాడు. సాయంత్రం దాయాదుల ఎద్దులు తన పొలంలోకి ప్రవేశించి మోటారు పైపులను తొక్కి ధ్వంసం చేయడంతో పాటు నీటి కుండలను పగులగొట్టాయి. దీంతో ముస్తాఫా తన దాయాదులైన షేక్ ఫారూఖ్‌ను ఎద్దులు పొలంలోకి వదిలివేస్తే ఎలా.. పైపులు, కుండలు పగులగొట్టాయంటూ ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఇరు కుటుంబాల మధ్య భూవివాదం ఉన్న నేపథ్యంలో పాత కక్షలతో పెట్టుకున్న ఫారూఖ్ అతని భార్య గౌసియాభేగం, తండ్రి లాల్మహ్మద్లతో కలిసి ముస్తాఫాపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు. తీవ్ర గాయపడిన ముస్తాఫాను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమనగల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు అమీరుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ చంద్రకుమార్ చెప్పారు. -
రెండెకరాలు.. రెండు హత్యలు
► వీడిన జంట హత్యల కేసు మిస్టరీ ►బంధువులే నిందితులు ►ఏడుగురి అరెస్ట్, రిమాండ్ కనగల్: రెండెకరాల భూమి రెండు కుటుంబాల్లో చిచ్చురేపింది.. నివురుగప్పిన నిప్పులా మారిన పాతకక్షలు భగ్గుమని చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి.. కనగల్ మండలంలో ఇటీవల చోటు చేసుకున్న జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంధువులే ఘాతుకానికి ఒడగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. దారుణానికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు కనగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చండూర్ సీఐ రమేశ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. బతుకుదెరువు కోసం.. చండూరు మండలం నెర్మట నుంచి దశాబ్దం క్రితం యాదయ్య తన భార్య ముగ్గురు కొడుకులతో కలిసి కురంపల్లికి వచ్చాడు. యాదయ్య భార్య యాదమ్మ అమ్మమ్మ ఊరు కావడంతో మేనమామలు పాండరయ్యతో పాటు మరో ముగ్గురు మామల దాపులో ఉంటున్నారు. ఈ క్రమంలో పాండయ్య పెద్ద కొడుకు అక్కలయ్య కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో పాండరయ్య 2.5 ఎకరాల భూమిని కోడలు పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకవేళ విడాకులు తీసుకుని వెళ్లిపోతే భూమి పాండరయ్య కుటుంబానికి చెందే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కోడలు విడాకులు తీసుకుని వెళ్లిపోగా ఆమె పేరున ఉన్న భూమిని యాదయ్య కొనుగోలు చేయడంతో ఐదేళ్లుగా రెండు కుటుంబాల్లో వివాదం సాగుతోంది. కొడుకును కొట్టారని.. తమ భూమిని ఏ విధంగా కొనుగోలు చేశారని పాండరయ్య పెద్ద కుమారుడు అక్కలయ్య ఇటీవల యాదయ్య అతడిని కుమారులు దాసరి ఆంజనేయులు, అన్నమయ్యను నిలదీశాడు. దీంతో వారు అక్కలయ్యను చావబాదారు. విషయం తెలుసుకున్న పాండరి తమ భూమిని అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా కుమారుడిని కొట్టారని కక్ష పెంచుకున్నాడు. అదును చూసి.. యాదయ్య కుమారులు ఒంటరిగా ఎక్కడ దొరుకుతారని పాండరి అదును కోసం చూడసాగాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన దాసరి ఆంజనేయులు, అన్నమయ్యను అప్పటికే అక్కడ మాటు వేసిన దోటి పాండరయ్యతోపాటు ఆయన కొడుకులు అక్కలయ్య, మల్లేశ్, పాండరయ్య తమ్ముడైన వెంకటేశం ఆయన ముగ్గురు కొడుకులు సైదులు, భరత్, కిరణ్‌లు మారణాయుధాలతో దారుణంగా నరికి చంపారు. భూ వివాదంతోనే హత్యలు చోటుచేసుకున్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరి పారు. అప్పటికే పరారీలో ఉన్న పాండరిపై అతడి కుటుంబ సభ్యులను అనుమానించారు. శనివారం రేగట్టెలు ఉన్నారన్న సమచారం మేరకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని సీఐ వివరించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై డి. నర్సింహులు, రాజు, మధు, వెంకటయ్య, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
భూ ఆక్రమణ : టీడీపీ నేత అరెస్ట్
విశాఖపట్టణం: భూ ఆక్రమణ కేసులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మధురవాడ తెలుగుదేశం పార్టీ నాలుగో వార్డు అధ్యక్షుడు గొల్లగాని సన్యాసిరావును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూములలో ఉన్న బోర్డులను తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళల ఆందోళన
హైదరాబాద్: హబ్సిగూడలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిముందు మహిళలు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. గత పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక్ పురి అమ్ముగూడ వద్ద 15 సంవత్సరాల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి తీసుకుందామని వెళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేము అని చెప్పారు. దీంతో గత 15 సంవత్సరాలు గా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించకపోవడంతో భాదితులు గురువారం హబ్సిగూడలోని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
పెదవి విప్పితే టీడీపీకే నష్టం..
► మంత్రి సుజయ్ భూ దాహంపై నోరుమెదపని టీడీపీ ►నైతికంగా నవ్వులపాలవుతామేమోనన్న భయం ►ప్రత్యేకించి లోలోన సంబరపడుతున్న ఓ వర్గం ►అందుకేనా పార్టీ ఫిరాయించింది అంటూ సామాన్యుడి ఎద్దేవా ‘అవును.... ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత సమస్య. దానికి పదవినీ... పార్టీని అడ్డం పెట్టుకున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయమే.’ తెలుగుదేశం పార్టీలో ఎవరిని కదిపినా ఇదే వ్యాఖ్యానం. ‘అసలు మనమెందుకు దీనిపై మాట్లాడాలి. పూర్తి ఆధారాలతో సాక్షి ప్రచురించాక... ఇక చెప్పేదేం ఉంటుంది. ఏమైనా మాట్లాడితే అందులో మమ్మల్నీ జమకట్టేయరూ...’ ఇది కొందరి మనోగతం. ఇంకా కొందరైతే ఆయన బండారం బట్టబయలైందని సంబరపడుతున్నారు. ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది మరి... ఇప్పటికైనా అధిష్టానం దీనిపై స్పందిస్తే మంచిది’ అని పార్టీలోని ఇంకోవర్గం అభిప్రాయం. మొత్తమ్మీద మంత్రి సుజయ్‌కు... గిరిజనులకు మధ్య జరుగుతున్న వివాదం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ వారు చెప్పిందే వేదం... చేసిందే చట్టం అనుకున్నారు. అర్థ బలానికి అంగ బలం తోడైతే ఇక తమకు తిరుగే ఉండదని భావించారు. అందుకే అడ్డగోలుగా పార్టీ ఫిరాయించేశారు. ముఖ్యమంత్రితో బేరం కుదుర్చుకుని మంత్రి పదవిని కొట్టేశారు. ఇక ప్రణాళికా బద్ధంగా గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కునేందుకు పావులు కదిపారు. కానీ నిరుపేద గిరిజన రైతులను రోడ్డుపాలు చేయాలనుకునే ప్రయత్నం బెడిసి కొట్టినట్టయింది. టీడీపీ పరువు కాస్తా గంగలో పడేలా చేసింది. ఎప్పుడో ప్రభుత్వం పంచి పెట్టిన భూములను ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పి అన్యాయంగా వారి నుంచి లాగేసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ‘సాక్షి’ బయటపెట్టడం... దానికి విపక్షాలు గొంతు కలపడం... ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండించడం... సామాన్య మధ్యతరగతి ప్రజలైతే మంత్రుల నిజస్వరూపం ఇదా అని విమర్శించడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే పార్టీలో సైతం దీనిని ఖండించేందుకు... దీనిపై వ్యాఖ్యానించేందుకూ... మంత్రి తరఫున మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. పెదవి విప్పితే పార్టీకే నష్టం మంత్రికి, గిరిజనులకు మధ్య నడుస్తున్న వివాదంపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, అసలే గిరిజనులు, వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని ఎవరికి వారు కిక్కురుమనకుండా కూర్చుంటున్నారు. అదీగాక సుజయ్ కృష్ణ రంగారావు సొంత వ్యవహారం కావడంతో దీనిపై నోరువిప్పితే తర్వాత ఎదురయ్యే ప్రజా వ్యతిరేకత వల్ల మొత్తం తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుందని భావించి మౌనం వహిస్తున్నారు. ఇక టీడీపీలో మరో వర్గం మాత్రం ‘సాక్షి’ కథనాలు, విపక్షాల విమర్శలతో మంత్రికి తగిన శాస్తి జరిగిందంటున్నారు. కేవలం ఆస్తులు కాపాడుకునేందుకే తమ పార్టీలోకి వచ్చారన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. జనానికి ఎలా చెప్పాలో... తాము చేసింది తప్పు కాదనీ... కేవలం తమకు చెందిన భూములనే తీసుకుంటున్నామని... జనాన్ని నమ్మించడం ఎలాగో అర్థం కాక బొబ్బి లి రాజులు సతమతం అవుతున్నట్టు తెలిసింది. దీనిపై సుజయ్ తన తమ్ముడు బేబీ నాయనతో చర్చించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం వల్ల జనం వద్ద చులకనైపోతున్నామేమోనన్న బెంగ కూడా వారిలో పట్టుకుంది. ఒకవేళ వాస్తవాలు ఇవీ అని చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో ఉంటారా అన్నది వారి సందేహం. అలా అని ఇప్పు డు వెనకడుగు వేసేందుకు కూడా అహం అడ్డొస్తోంది. అందుకే దీనిపై బొబ్బిలి కోట లోనూ తర్జనభర్జనలు సాగుతున్నాయంట. అధికారులు బెంబేలు ఈ అన్యాయానికి ప్రత్యక్షంగా సహకరించినవారు... ఏకంగా పాత్రధారులైన అధికారుల్లో ‘సాక్షి’ కథనాలు వణుకు పుట్టించాయనే చెప్పాలి. మంత్రి కదా ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ప్రజల్లో, పత్రికల్లో చులకనైపోతున్నామని తెలిసినా ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక చివరకు ‘ఏం రాసుకుంటారో రాసుకోండి.. మేం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’ అని బొబ్బిలి తహసీల్దార్ కోరాడ సూర్యనారాయణ వ్యాఖ్యానించారంటే ఆయనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ ఈ వ్యవహారంపై ఎలా స్పం దిస్తే ఏమవుతుందోనని ఏకంగా తెలియదని చెప్పుకొచ్చారు. గిరిజన రైతులకు ఇచ్చిన డి పట్టా భూములను మంత్రి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి తనకు ఇంత వరకూ తెలియదనీ. దానికి సంబంధించిన ఫైలుగానీ, ఫిర్యాదులు గానీ తమ దగ్గరకు రాలేదనీ, తహసీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాననీ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇలా జిల్లా టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా మంత్రి సుజయ కృష్ణ రంగారావు వ్యవహారం రచ్చ రచ్చకావడంతో బెంబేలెత్తిపోతున్నారు. -
సెంటు భూమి లేకుండానే స్టంటు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు తెలుగు తమ్ముడు చకచకా పావులు కదుపుతున్నాడు. అది ప్రభుత్వ స్థలమని తెలిసినా అధికారం అండతో చెలరేగిపోతున్నాడు. కంచె వేసిన స్థలం సత్యవోలు పాపారావు కుమారుడు శేషగిరిరావుదంటూ బోర్డులు పెట్టారు. సర్వే నంబర్ 730/2సీ2లోని ప్రైవేటు స్థలంతోపాటు మరికొందరి స్థలాలు ప్రభుత్వం నగరపాలక సంస్థ పాఠశాల నిమిత్తం సేకరించిందని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వరుస కథనాలతో బయటపెట్టింది. ఇందులో సర్వే నం.730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతులకు చెందిన 3.69 ఎకరాలకు కూడా నోటిఫికేష¯ŒS జారీ చేసింది. సత్యవోలు సత్యవతి హైకోర్టును ఆశ్రయించడంతో వారి స్థలం 1.81 ఎకరాలు మినహా సత్యవోలు పాపారావు అతని కుమారులకు చెందిన 1.88 ఎకరాకు 1985 జూలై 30వ తేదీన అవార్డు (నంబర్ 6/85) ప్రకటించి, వారి తాలూకు ఎవ్వరూ రాకపోవడంతో రాజమండ్రి సబార్డినేట్ జడ్జి వద్ద జమ చేసింది. పాపారావుకు భూమి ఎక్కడ ఉంది? రికార్డుల్లో 4.29 ఎకరాల భూమి ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం అంత లేదు. సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి భార్య సత్యవతి 1950లో పంచుకునేందుకు జరిపిన సర్వేలో అక్కడ 3.54 ఎకరాలుంది. 1979లో ప్రభుత్వం సేకరించేందుకు చేసిన సర్వేలో 3.69 ఎకరాల భూమి ఉంది. ఇందులో సత్యవోలు పాపారావు అతని నలుగురు కుమారుల భూమి 1.81 ఎకరా సేకరించి అవార్డు కూడా ప్రకటించింది. సత్యవోలు సత్యవతి భూమి మాత్రం హైకోర్టు స్టే విధించడంతో సేకరణ నుంచి మినహాయించుకుంది. అయితే తాజాగా సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు పేరిట సర్వే నంబర్ 730/2సీ2 స్థలంలో ఆ భూమి తమదేనంటూ బోర్టులు పెట్టారు. ప్రభుత్వం సేకరించకముందు అది సత్యవోలు పాపారావు కుమారులదే. కానీ 1985లో సేకరణ అనంతరం అవార్డు ప్రకటించిన తర్వాత సత్యవోలు పాపారావు అతని కుమారులకు అక్కడ సెంటు భూమి లేదు. ఉన్న భూమి సత్యవోలు సత్యవతి, ప్రభుత్వానిది. అయితే ఆ భూమి తాను కొనుగోలు చేశానంటూ తెలుగుదేశం పార్టీ నేత రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు అక్కడ 50 ఏళ్లుగా ఉంటున్న పేదలను ఖాళీ చేయించి అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 3.69 ఎకరాలు వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ నిర్మాణం కోసం అప్పటి కమిషనర్ విజ్ఞప్తి మేరకు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/1డీ, 725/3ఏ,725/3ఈ, 730/2సీ2, 731/2లలో మొత్తం 5.87 ఎకరాలు సేకరించేందుకు సమాయత్తమైంది. మొత్తం భూమిలో సత్యవోలు కుటుంబానిదే సింహభాగం. సర్వే నంబర్ 730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతుల భూమి.3.69 ఎకరాలుగా పేర్కొంది. 1979 జూలై 20వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేసింది. 1985లో అప్పటి సబ్‌కలెక్టర్ ప్రదీప్‌చంద్ర అవార్డు ప్రకటించేందుకు ముందే సత్యవోలు సత్యవతి తరఫున వారి కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిని సేకరణ నుంచి మినహాయించేలా పిటీష¯ŒS వేయడంతో 1984 నంబర్ 5వ తేదీన కోర్టు స్టే విధించింది. సత్యవోలు పాపారావు వాటా 1.81 ఎకరాకు మిగిలిన వారితోపాటు అవార్డు ప్రకటించింది. మొత్తంమీద వివిధ కోర్టు తీర్పులు, ప్రభుత్వ సేకరణ ఉపసంహరణ తర్వాత ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసిన 5.87 ఎకరాలకుగాను 3.80 ఎకరాలు సేకరించింది. ఈ కేసులు 2001లో పూర్తవడంతో 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ స్థలంలో వాంబే గృహాలు కట్టేందుకు నిర్ణయించింది. ఏ నుంచి జీ వరకు బ్లాక్‌లను నిర్మించాలని నిర్ణయించి 2003లో ఏ బ్లాక్ నిర్మాణం ప్రారంభించింది. అసలు సర్వే నం. 730/2సీ2లో స్థలం ఎంత? టౌ¯ŒS సర్వే నంబర్ 730/2సీ2లో రికార్డుల ప్రకారం సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి దంపతులకు 4.29 ఎకరాల భూమి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రికార్డుల్లో ఉన్న భూమి లేదు. 1950 మే నెల 15వ తేదీన సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు భార్య సత్యవతి ఆ భూమిని పంచుకున్నారు. ఇందు కోసం ఉమ్మడిగా సర్వే జరిపించారు. ఇందులో సర్వే నంబర్ 730/2సీ2(అప్పట్లో 730)లో రికార్డుల ప్రకారం 4.29 ఎకరాలున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 3.54 ఎకరాలుగా ఉంది. దీనిని ఇద్దరు సమానంగా పంచుకున్నారు. మున్సిపల్ సర్వేయర్ కూడా 2010లో సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. -
లెక్క తేలుతోంది
బయటపడుతున్న భూబాగోతం నిడగల్లులోని 10.90ఎకరాల గుట్టురట్టు చేసే యత్నం వెలికి తీసే పనిలో రెవెన్యూ అధికారుల నిమగ్నం అడ్డుకట్ట వేసే పనిలో అధికార పార్టీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్న అధికారుల్ని సాగనంపే యత్నాలు సర్కారు భూమి పరిరక్షణకు అధికారులు సరైన నిర్ణయం తీసుకున్నారు. నిడగల్లులోని భూ బాగోతం మూలాలు వెలికితీసే పనిలో పడ్డారు. తీగలాగితే డొంక కదిలినట్టు మ్యూటేషన్కోసం ఒకరు చేసిన దరఖాస్తుతో అసలు విషయం వెలుగు చూసింది. కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు తెలుసుకున్న అధికారులు మొత్తం భూమి ఎలా అన్యాక్రాంతమైందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎవరి చేతిలో ఎంతెంత విస్తీర్ణంలో ఉండిపోయిందో లెక్కలు తేలుస్తున్నారు. పాలకపక్ష నేతల ఒత్తిళ్లను సైతం పక్కనబెట్టి... తమ విధులకు పూర్తి న్యాయం చేస్తున్నారు. అంతటితో ఆగని నేతలు అధికారులపై కక్షసాధింపులకు వ్యూహరచన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : సీతానగరం మండలం నిడగల్లులోని సర్వే నంబర్ 4లో గల 10.90ఎకరాల భూములు ఎండీఆర్(మాన్యువల్ డయాగ్నేట్ రిజిస్టర్)లోనూ, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్‌లోనూ గయ్యాలుగా ఉన్నాయి. కానీ, అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎలా చేతులు మారాయో తెలియదు గాని ఫైనల్ చెక్ ఆపరేషన్(ఎఫ్సీఓ)లో మాత్రం రైత్వారీ పుంజుగా ఎక్కింది. ఇదెలా జరిగిందన్నదే అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ప్రభుత్వ భూములు జిరాయితీగా ఎలా మారాయి? ప్రైవేటు వ్యక్తుల పేరున రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? వారి చేతికి పాసు పుస్తకాలు ఎలా వచ్చాయి? సబ్ డివిజన్ చేసి, రైత్వారీ పుంజుగా రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు? వీటిపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు బట్ట బయలు కానున్న గూడుపుఠాణీ లోతుగా పరిశీలన చేస్తే అక్రమాలకు పాల్పడిన వారంతా బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ భూములకు సంబంధించి లింకు డాక్యుమెంట్లు లేవు. కానీ, రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. పాసు పుస్తకాలు జారీ అయిపోయాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడేదో గూడుపుఠాణి జరిగినట్టు అన్పిస్తోంది. గత అధికారుల సహకారం లేకుండా జరిగే పని కాదని ప్రస్తుత అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదంతా వెలికి తీసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గ్రామంలో కూడా ఈ భూబాగోతం చిచ్చు రేపింది. క్రయ, విక్రయాలు చేసిన వారి మధ్య, బినామీల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రభుత్వ భూముల్ని ఎలా అమ్మారంటూ కొనుగోలు చేసిన వారు నిలదీస్తున్నారు. అమ్మకపోయి ఉంటే కొనేవాళ్లం కాదని కొనుగోలు దారులు గగ్గోలు పెడుతున్నారు. చివరి కొనుగోలు దారుడు ఓ సంస్థ ఏర్పాటు చేసేందుకు రుణం కోసమని మ్యూటేషన్ సర్టిఫికేట్ ప్రయత్నించడంతో ఈ భూదందా బయటపడింది. అధికారుల్ని వదులుతారా? రాజీపడకుండా వాస్తవాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారుల్ని టీడీపీ నేతలు వదలరనే వాదనలు ఉన్నాయి. ఆ అధికారులు ఇక్కడుంటే గుట్టు రట్టు అవుతుందని, అక్రమార్కులంతా బయటపడతారనే అభిప్రాయం గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని బదిలీపై సాగనంపితే వ్యవహారం వెలుగుచూడకుండా చెక్ పెట్టొచ్చన్న యోచనలో నేతలు ఉన్నట్టు తెలిసింది. ఆ దిశగా పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇప్పుడున్న తహసీల్దార్ ఎన్నాళ్లూ ఉండరనే వాదన మొదలయ్యింది. ఆ మేరకు ఆయనకు సంకేతాలు అందినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో గుట్టు రట్టు కాకుండా నేతలు చెప్పినదానికి ఉన్నతాధికారులు తలొగ్గుతారా? లేదంటే అక్రమాల బాగోతమంతా బయటపెట్టేందుకు ప్రస్తుత అధికారులకు సహకరిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. -
లక్షలు ఇచ్చినా భూములివ్వం
పెనుకొండ రూరల్ : కన్నతల్లి వంటి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. అలాంటి భూమిని ఎన్ని రూ.లక్షలు ఇచ్చినా ఇవ్వడానికి మేం సిద్ధంగా లేమని అమ్మవారుపల్లి సమీపంలో ఉన్న ఎర్రమంచి పొలాల రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి పక్కన మండలం అమ్మవారుపల్లి, కురుబవాండ్లపల్లి మధ్య 134–616 సర్వే నంబరులో ఉన్న 600 ఎకరాల భూమిని దక్షిణకొరియాకు చెందిన కియో కార్ల కంపెనీకి ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామానికి వెళ్లి సంబంధిత రైతులతో సమావేశమయ్యారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర అఖిలక్ష నాయకులు మాట్లాడుతూ నంబులపూలకుంటలో సోలార్ ఫ్యాక్టరీకి 7 వేల ఎకరాలు, లేపాక్షి హబ్‌కు భూసేకరణ చేశారు. ఎవరి కోసం చేశారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ తదితర రెవెన్యూ అధికారులను నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి రైతులతో చర్చించి చట్ట ప్రకారం రైతుల పక్షాన పోరాడుతామని యంగ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ బేడీ, ఏపీసీసీ కార్యదర్శి రమణ, అఖిల భారత కూలీ సంఘం నాయకులు నాగరాజు, ఓపీడీఆర్ శ్రీనివాసులు అన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తి మాట్లాడుతూ 600 ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారమే చేశామన్నారు. ఎకరా రూ.8 లక్షలతో «ప్రభుత్వం ధర‡ నిర్ణయించినట్లు రైతులకు తెలిపారు. తర్వాత జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఇదివరకే చాలా నష్టపోయాం. ఈప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ అసైన్డ్, డీకేటీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు ఎంత పరిహారం అడుగుతారో చర్చించడానికి వచ్చామన్నారు. ఇక్కడి రైతుల స్థితిగతులను పరిశీలించి మెరుగైన రీతిలో నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రైతులకు వివరించారు. దీనికి రైతులు ఆవేదనతో రగిలిపోయారు. సాగు చేస్తున్నఽ భూములను పరిశ్రమలకు ఇవ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జేసీ వెనుతిరిగాడు. అనంతరం ఆర్డీఓ వెళ్తున్న కారును రైతులు అడ్డగించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
పాత్రధారులే.. సూత్రధారులు
స్థలం రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో కొత్త ట్విస్ట్ స్థలం బండారు వెంకటరమణదని తెలిసీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు నాలుగోవాటా యజమాని నుంచి మొత్తం రిజిస్ట్రేష¯ŒSకు సంతకాలు తనకు తెలియదన్న నాలుగోవాటా యజమాని ఆదికేశవులనాయుడు పోలీసులకు రాతపూర్వకంగా విషయం వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సూరాబత్తులవీధిలోని 356 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వ్యవహారంలో సూత్రదారులే పాత్రదారులని వెల్లడైంది. ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసీ కూడా దాన్ని ఎలాగైనా కాజేయాలన్న కుట్రతో నిందితులు వ్యవహారించారా?, 1/4 స్థలం యజమానికి తెలియకుండా మొత్తం ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తన వాటా ఆస్తిని విక్రయించాలని తాము భావించామని, అయితే మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు తెలియదని నాలుగో వాటా యజమాని బి.ఆదికేశవులనాయుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలో ఉంటున్న ఆదికేశవులనాయుడు వద్దకు వెళ్లిన పోలీసులకు మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు వారు చెప్పలేదని ఆదికేశవులనాయుడు పేర్కొన్నారు. డాక్యుమెంట్లు తెలుగులో రాయించారని, తమకు తెలుగు చదవడం రాదని ఆదికేశవులనాయుడు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేష¯ŒS సూరాబత్తుల వీధిలోని స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసి నిందితులు కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారా? అనే అనుమానాలకు పోలీసులకు వెంకటరమణ చేసిన ఫిర్యాదులో ఉన్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాధితుడి ఫిర్యాదులో రాజమండ్రికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీ, ధవళేశ్వరానికి చెందిన దంగుడుబియ్యం నారాయణతో కలసి రావులపాలెంకు చెందిన సత్తార్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొన్నారు. ఇందులో లంకా వెంకట అప్పారావు స్థలం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారిగా ఉంటున్నారు. ఇతనికి, కె.బ్రహ్మాజీ, దంగుడుబియ్యం నారాయణకు ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానిదేన్న విషయం తెలుసు. అయితే స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు నాలుగోవాటా యజమాని వద్ద ఉండడంతో మొత్తం ఆస్తిని కాజేయాలనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానిని మళ్లీ దంగుడుబియ్యం నారాయణ, లంకా వెంకట అప్పారావు, ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, తలసెట్ల నాగరాజు, పోలాకి పరమేశ్వరరావు, మద్దు శ్రీనివాస్, మట్టా నరసింహరాజు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారిలో కూడా ఉండడంతో ఈ వ్యవహారంలో అందరూ భాగస్వాములైనట్లు స్పష్టమైంది. -
పాత కక్షలతోనే హత్యాకాండ
వాటికి స్థల వివాదం తోడు.. మధురపూడిలో పోలీసు పికెట్ భయాందోళనలో స్థానికులు మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో గురువారం రాత్రి 11 గంటలకు జరిగిన హత్యల ఘటన స్థానికంగా తీవ్రసంచలనం రేపింది. ఎయిర్ పోర్టు రోడ్డులో మద్దా చిన్ని(28), కొల్లపు వీర్రాజు(40)లను ప్రత్యర్థులు హత్యచేశారు. ఈ దాడిలో పాముల శ్రీను తలకు బలమైన గాయం కాగా. మద్దా అబ్బులుకు కడుపులోని పేగులు బయటకు రావడంతో ఇద్దరూ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అలాగే చిన్ని మేనత్త కేతా పార్వతికి బలమైన గాయాల య్యాయి. గొడవలు వద్దన్నందుకు బలైన వీర్రాజు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు సమీపంలో పాముల శ్రీను, అంబటి రమేష్ వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దారితీసింది. మద్దా చిన్ని వర్గీయులపై, అంబటి రమేష్, అంబటి వెంకటేశ్వరరావు, పిట్టా శేఖర్, పిట్టా ఆనంద్, చిన్నారి, సుబ్రహ్మణ్యం దాడి చేయడం సరైందికాదని విడదీయడానికి వెళ్లిన కొల్లపు వీర్రాజును ఛాతిలో, కడుపులో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న వీర్రాజు ఎవరికీ ప్రమాదం జరగకూడదన్న ఆలోచనతో తన కారును డ్రైవ్ చేస్తూ కోరుకొండ పోలీసు స్టేష¯ŒSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు అతనిని ఆస్పత్రికి వెళ్లమని సూచించారు తప్ప వారు తీసుకువెళ్లలేదు. అయినప్పటికీ మద్యంమత్తులో ఉన్న వీర్రాజు అదే కారులో రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్తుండగా పరిస్థితి విషమించి దారిలోనే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా దాడికి పాల్పడ్డ అంబటి వెంకటేశ్వర్లు, పిట్టా శేఖర్ తదితరులు సైతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిందిదీ.. అంబటి వెంకటేశ్వర రావుకు, పాముల శ్రీను కుటుంబాల మధ్య స్థల వివాదం ఉంది. ఆరు నెలల క్రితం కోరుకొండ పోలీసుస్టేçÙ¯ŒSలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చారు. రెండు నెలల క్రితం శ్రీనుపై దాడి చేయగా అతని కాలు, చేయి విరిగి క్రమేణా కోలుకున్నాడు. అనంతరం వ్యాన్ డ్రైవర్‌గా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇరు వర్గాలవీ పక్కపక్క ఇళ్లే కావడంతో గురువారం వారు మళ్లీ గొడవపడ్డారు. అది తారాస్థాయికి చేరి ఎయిర్‌పోర్టు సమీపంలో దాడికి దారితీసింది. పాత కక్షలే కారణం 25 సంవత్సరాల క్రితం మద్ధా చిన్ని తండ్రి ప్రకాశం పిట్టా సత్యనారాయణను హత్య చేశాడు. ఆ ఘటనలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడైన ప్రకాశం పరారై తర్వాత పోలీసులకు చిక్కి, ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి అంబటి రమేష్ వర్గీయులు, వారి బంధువులయిన పిట్టా శేఖర్ తదితరులు చాలా కాలంగా దాడి కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం పరిస్థితి అనుకూలించడంతో దాడికి దిగారు. గ్రామంలో పోలీసు పికెట్ మధురపూడిలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పోలీసు పికెట్ ఏర్పాటుచేసినట్టు ఎస్సై మురళీమోహన్ తెలిపారు. -
‘తెర’ పడేదెప్పుడు?
ఆదెమ్మదిబ్బ స్థలంపై వీడని చిక్కుముడి తాను కొనుగోలు చేశానన్న పిన్నమరెడ్డి ఈశ్వరుడు అమ్మిందీ లేదు.. కొన్న లేదన్న ‘సాక్షి’ చివరకు తెరపైకి సత్యవోలు శేషగిరిరావు తాము అభివృద్ధి చేయిస్తున్నామంటూ వివరణ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపని వైనం రాజమహేంద్రవరంలో రూ.కోట్ల విలువచేసే ఆదెమ్మదిబ్బ ప్రాంతంపై 20 రోజులుగా నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, అధికారుల్లో చర్చ సాగింది. తాజాగా సత్యవోలు శేషగిరిరావు ఈ స్థలం తనదంటూ విలేకర్ల సమావేశంలో చెప్పిన పలు వివరాలు స్థల యాజమాన్య హక్కుపై మరింత చిక్కుముడికి దారితీశాయి. – సాక్షి, రాజమహేంద్రవరం గత ఇరవై రోజులుగా ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించడం, వారికి నగదు ముట్టజెప్పడంతో దీనిపై అనేక అనుమానాలు రేకెత్తాయి. యాబై, ఆరవై ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఇప్పటికిప్పుడు ఎవరో వచ్చి ఈ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించడంతో కొందరు పేదలు మీడియాను ఆశ్రయించారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ స్థలంలో ఉంటున్నామని, ఇప్ప డు ఎవరో వచ్చి ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ఈ వ్యవహారాన్ని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అనంతరం వరుస కథనాలు ప్రచురించింది. 13వ తేదీ అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య స్థలా న్ని పరిశీలించారు. అక్కడ ఉన్న పేదలతో మాట్లాడారు. తమకు ఇళ్లు లేవని ఇక్కడే స్థలం ఇవ్వాలని పేదలు తహసీల్దార్‌కు విన్నవించారు. అదే విధంగా తహసీల్దార్ పోసయ్య అక్కడ గుడిసెలు ఖాళీ చేయిస్తున్న వ్యక్తిని ఈ వ్యవహారంపై ప్రశ్నిం చారు. అదే రోజు తహసీల్దార్ పోసయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆదెమ్మదిబ్బ స్థలం కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశారని తనకు చెప్పారని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా సాయంత్రం లేదా మరుసటి రోజు తీసుకుని వచ్చి చూపిస్తానన్నారని వివరించారు. మరుసటి రోజు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం నేతలు ఆ స్థలాన్ని పరిశీలించగా తాను ఈ స్థలం కొనుగోలు చేశానని వారితో పిన్నమరెడ్డి ఈశ్వరుడు పేర్కొన్నారు. వారికి కూడా డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడడంతో వారు వెనుదిరిగారు. వారం రోజులు గడుస్తున్నా డాక్యుమెంట్లు అధికారులకు, రాజకీయ పార్టీల నేతలకు చూపించలేదు. దీనిపై ఈ నెల 21న ‘కొన్నది లేదు.. అమ్మిందీ లేదు’ అన్న శీర్షికన పలు ప్రశ్నలు సందిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆ స్థలం సత్యవోలు పాపారావుదంటూ అక్కడ ఫ్లెక్సీపై రాయించి పెట్టారు. ఎవరి స్థలం సేకరించారు? ఫ్లెక్సీ పెట్టిన అనంతరం అక్కడ ఇళ్లను తొలగించడం కొనసాగించారు. అక్కడ నివసిస్తున్న పేదలకు పలు రకాల ప్రలోభాలు పెట్టడంపై కూడా ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. దీంతో సోమవారం సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం నిర్వహించి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730లో 4.19 ఎకరాల స్థలం తమ కుటుంబానిదని పేర్కొన్నారు. తన తండ్రి సత్యవోలు పాపారావు రెండు ఎకరాల 23 సెంట్లు, తన పినతండ్రి సత్యవోలు లింగమూర్తి ఎకరా 96 సెంట్లు లెక్కన పంచుకున్నారని వివరించారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని అక్కడ ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అయితే 1985లో ప్రభుత్వం పలు సర్వే నంబర్లలో దాదాపు 5 ఎకరాలు 20 సెంట్లు సేకరించింది. ఇందులో సర్వే నంబర్ 730లో సత్యవోలు లింగమూర్తి, సత్యవోలు పాపారావు కుంటుంబాలకు చెందిన సుమారు 3 ఎకరాల 25 సెంట్లు కూడా ఉంది. సేకరణ చేసిన భూమికి సంబంధించిన అవార్డును ప్రభుత్వం కొంతమందికి చెల్లించగా మరికొంత మంది అవార్డును కోర్టులో డిపాజిట్ చేసింది. అయితే సర్వే నంబర్ 730లో సేకరించిన భూమి, అవార్డుపై సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశంలో భిన్నరకాల సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం తమ భూమి సేరించిందని ఒకసారి, అది తమ పనితండ్రి వాటా అని మరోసారి, తమ వాటా అవార్డు తీసుకోలేదని, అస్సలు తమకు అవార్డుతో సంబంధంలేదని, ప్రభుత్వం నచ్చినట్లు రాసుకుందని, మరోసారి నగదులేక కోర్టులో జమ చేయలేదని, అవార్డు రద్దు చేశారని ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. చివరగా ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్, అర్బ¯ŒS తహసీల్దార్‌కు చూపించామని, డాక్యుమెంట్ల నకళ్లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. మీడియాకు కూడా డాక్యుమెంట్ల నకళ్లు ఇస్తామని విలేకర్ల సమావేశంలో పలుమార్లు చెప్పినా చివరకు ఇవ్వకుండానే ముగించారు. ఈ స్థలం సత్యవోలు పాపారావు, లింగమూర్తికి చెందినది అని అధికారులు పేర్కొన్నా అందులో ఎవరి స్థలం ప్రభుత్వం సేకరించిందన్న దానిపై సందిగ్ధం నెలకొంది. -
‘భూ’మంత్రం
దర్జాగా నగరపాలక సంస్థ స్థలం ఆక్రమణ ఆదెమ్మదిబ్బ స్థలంలో గుడిసెలు ఖాళీ ఆ పక్కనే సర్వే నం.275/3ఏలోని ప్రభుత్వ స్థలంలో కూడా పాగా గుడిసెలు పీకి, చదును చేస్తున్న కబ్జాదారులు కన్నెత్తిచూడని కార్పొరేష¯ŒS అధికారులు చారిత్రక రాజమహేంద్రవరంలో భూ ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, పైవేటు అనే తేడా లేకుండా, కంట్లోపడిన స్థలాన్ని కాజేస్తున్నారు. రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మదిబ్బ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ, కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఆసాముల కన్ను తాజాగా దాని పక్కనే వాంబే గృహాల కోసం సేకరించిన కార్పొరేష¯ŒS స్థలంపై పడింది. దీనిని కూడా కాజేసేందుకు అక్రమార్కులు కథ నడిపిస్తున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం సర్వే నంబర్ 370లో సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద తాను కొనుగోలు చేశానని చెప్పి ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న పేదలను కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి కొద్దిరోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 36, 38 డివిజన్ల పరిధిలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించారు. ఇక 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న 10 బ్రాహ్మణ కుటుంబాల వారినీ ఖాళీ చేయించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతున్నారు. ఇందతా ఒక ఎత్తయితే, తాజాగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మరో ఎత్తు వేశారు. ఈ స్థలానికి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్నీ కాజేసేందుకు వ్యూహం పన్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా ఉందన్న భరోసాతో ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. హోలీఏంజెల్స్ స్కూల్ వెనుక ప్రాంతమే.. ఆదెమ్మదిబ్బలో వాంబే గృహాలను ఆనుకుని హోలీఏంజెల్స్ స్కూల్ ఉంది. సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న ఈ పాఠశాల భవనం స్థలంపై నగరపాలక సంస్థకు, ఆ పాఠశాల యాజమాన్యానికి మధ్య వివాదం నెలకొని ఉంది. దీనిపై కోర్టుల్లో వాదోపవాదాలూ నడిచాయి. నగరపాలక సంస్థ పాఠశాల భవనం గోడ వెనుక భాగాన.. ఈ స్థలం తమదంటూ ఆక్రమించిన వారు శిక్షార్హులని రాయించింది. ప్రస్తుత కమిషనర్ వి.విజయరామరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాల పక్కనే 275/3ఏ సర్వే నంబర్లో ఉన్న హోలీఏంజెల్స్ స్కూల్ గోడౌ¯ŒSను కూల్చివేయించారు. పాఠశాల భవనం వెనుక ‘ఏ, బీ’ బ్లాకుల పేరుతో వాంబే గృహాలు నిర్మించారు. వాంబే గృహాలకు, పాఠశాలకు మధ్య నగరపాలక సంస్థ సీసీ రోడ్డు కూడా నిర్మించింది. హోలీఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక, గోడౌ¯ŒS పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ స్థలం తాము కొన్నామంటూ అక్రమార్కులు ఖాళీ చేయిస్తున్నారు. తాము ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని చెప్పినా, గుడిసెకు రూ.50 వేలు, రేకుల షెడ్డుకు రూ.70 వేల లెక్కన ఇస్తామని హామీ ఇస్తున్నారని పేదలు చెబుతున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం ఆదెమ్మదిబ్బ స్థలాన్ని ఆక్రమించేందుకు పేదలను ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలసి ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని తేల్చారు. మరుసటి రోజు రెవెన్యూ, నగరపాలక సంస్థ సర్వేయర్లు ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సర్వే నంబర్ 370లోని ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అందులో కొంత ప్రభుత్వం సేకరించిందని తేల్చారు. అప్పటినుంచి పట్టించుకోవడం మానేశారు. దీంతో వాంబే ఏ, బీ బ్లాక్‌లకు ఎదురుగా సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. అక్కడ గుడిసెలు, షెడ్లు తొలగిస్తున్నారు. -
అంతా..గంభీరం
భూవివాదంలో హతుల బంధువుల విచారణ మృతదేహాలను పోస్టుమార్టానికి తరలింపు ఏడుగురిపై కేసు నమోదు కలిగిరి : భూ వివాదంలో ముగ్గురి హత్యతో రణరంగమైన కలిగిరి పంచాయతీ పాపనముసిలిపాళెంలో శనివారం గంభీర వాతావరణం నెలకొంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనలో గ్రామానికి చెందిన వారు బయటకు రాలేదు. స్థానికంగా ఉన్న హతుల బంధువులు సంఘట స్థలానికి చేరుకున్నారు. వారిని కావలి డీఎస్పీ ఎస్ రాఘవరావు విచారించారు. సానా మహేంద్రరెడ్డి (38), కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), సానా సుబ్బారెడ్డి (45) మృతదేహాలను డీఎస్పీ ఎస్.రాఘవరావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం నుంచి నిందితులు హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం పొడి ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఏడుగురు నిందితులు గుర్తింపు హతుడు సానా మహేంద్రరెడ్డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవరావు తెలిపారు. పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, లక్ష్మీదేవమ్మ, సుబ్బమ్మ, పద్మ, రాజశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి హతుల కళ్లల్లో కారం చల్లి, కర్రతుమ్మ కర్రలతో కొట్టి చంపినట్లు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇలా.. తప్పించుకున్న ఇద్దరు ముసిలిపాళెం పొలాల్లో శుక్రవారం జరిగిన హత్యల ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకున్నారు. హతులు ముగ్గురు నెల్లూరులోని సత్యనారాయణపురానికి చెందిన అట్ల చినపెంచలరెడ్డిని తమ కారులో రాజుపాళెంలో పని ఉందని తీసుకువచ్చారు. అనంతరం కలిగిరిలోని పొలాల వద్దకు వెళ్లి వద్దామని శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బయలు దేరారు. మధ్యలో వీరారెడ్డిపాళెంలో మరో వ్యక్తిని ఎక్కించుకున్నారు. కారులో ఐదుగురు పొలాల వద్దకు చేరుకున్నారు. పొలంలోకి కారు వెళ్లకపోవడంతో కాలినడక బయలు దేరారు. ముందుగా హతులు ముగ్గురు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితులు వారిపై దాడి చేయడాన్ని దూరం నుంచి చూసిన పెంచలరెడ్డితో మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. పెంచలరెడ్డి పరారవుతూ పొలంలోకి వస్తున్న హతుల్లోని ఒకరి బావమరిది కాకునూరు మల్లికార్జున్‌కు దాడి విషయం చెప్పి వెళ్లిపోయాడు. ఇలా పెంచలరెడ్డి ప్రాణాలతో తప్పించుకుని శనివారం సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దాడిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు పాల్గొనడం చూశానని పోలీసులకు చెప్పాడు. పెంచలరెడ్డి నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణ : హత్యకు దారి తీసిన భూవివాదంపై తహసీల్దార్ రవీంద్రనాథ్‌తో కావలి డీఎస్పీ రాఘవరావు చర్చించారు. భూవివాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. భూమి వివరాల సమాచారాన్ని తీసుకున్నారు. ఆయన వెంట కావలి టౌన్, కావలి రూరల్, ఉదయగిరి సీఐలు ఏవీ రమణ, టి.అశోక్‌వర్దన్, జి. శ్రీనివాస్, ఎస్ఐలు ఖాదర్‌బాషా, రమేష్‌బాబు, ప్రతాప్, సిబ్బంది ఉన్నారు. -
ముగ్గురిని బలిగొన్న భూవివాదం
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు కలిగిరి : భూవివాదం చినికిచినికి గాలివాన మారి..ముగ్గురు వ్యక్తుల దారుణహత్యకు దారి తీసింది. జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధుల సమాచారం మేరకు.. మండలంలోని కుమ్మరకొండూరుకు సానా మహేంద్రరెడ్డి (38), వీరారెడ్డిపాళెంకు చెందిన కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన సానా సుబ్బారెడ్డి (40) నెల్లూరులో స్థిర పడ్డారు. పాపనముసిలిపాళెం సమీపంలో వెంకన్నపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1లో 36.64 పొలం ఉంది. ముసిపాళెం గ్రామస్తులు కొంత మంది అందులో 12.50 ఎకరాలు భూమిని కొన్నేళ్ల కింద విజయవాడకు చెందిన కంచర్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులకు విక్రయించారు. నాలుగేళ్ల క్రితం ప్రభాకర్ కుమారుడు జనార్దన్ ఆ భూమిని సానా మహేంద్రరెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిలకు విక్రయించాడు. ప్రస్తుతం 12.50 పొలం సానా మహేంద్ర, కొండ్రెడ్డి లక్ష్మీకాంతమ్మ పేర్లు మీద రిజిస్టర్ అయింది. అయితే ఆ పొలంపై తమకు కూడా హక్కులు ఉన్నాయని, పొలాన్ని తాము సాగు చేసుకుంటున్నామని పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంత కాలం వివాదాలు నడుస్తున్నాయి. కావలి ఆర్డీఓ కోర్టుతో పాటు సివిల్ కోర్టులోనూ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మహేంద్ర, సుబ్బారెడ్డి, తమ స్నేహితుడు సానా సుబ్బారెడ్డితో కలిసి పొలం వద్దకు చేరుకుని అక్కడ కర్రతుమ్మ చెట్ల తొలగింపు పనులను చేపట్టారు. దీంతో ముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, మరి కొందరు పొలం వద్దకు చేరుకుని సానా మహేంద్ర, సానా సుబ్బారెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి కళ్లలో కారం చల్లి, అక్కడతో ఉన్న కర్రతుమ్మ కర్రలతో తలలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. లొంగిపోయిన నిందితులు హత్య అనంతరం నిందితులు గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విషయం తెలియడంతో ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కావలి డీఎస్పీ ఎస్.రాఘవరావు, ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, కొండాపురం, వింజమూరు, జలదంకి ఎస్ఐలు రమేష్‌బాబు, ప్రతాప్, ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు కుటుంబాల్లో విషాదం : పొలం కొనుగోలు చేసి వృద్ధిలోకి వద్దామని ఆశ పడి ముగ్గురు హత్యకు గురి కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. హాత్యకు గురైన వారిలో సానా మహేంద్ర, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి మండల వాసులు కావడంతో పాటు సానా సుబ్బారెడ్డికి కూడా మండలంలో బంధువుత్వాలు ఉన్నాయి. హత్యకు గురైన ముగ్గురు బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించడానికి అక్కడి వారిని కలచి వేసింది. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. సానా మహేంద్ర బేల్దారి పనులు చేస్తూ కొండ్రెడ్డి సుబ్బారెడ్డి గోదెలతో కుటుంబ పోషణ జరుపుకుంటూ నెల్లూరులోని కిసాన్‌నగర్‌లో ఉంటున్నారు. సానా సుబ్బారెడ్డి కొత్తకాలువ సెంటర్లో ఉంటూ లారీని బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. సానా మహేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండ్రెడ్డి సుబ్బారెడ్డి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సానా సుబ్బారెడ్డికి భార్య ఉంది. కుటుంబాల పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాలు దిక్కులేని అవుతున్నాయని బందువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భూవివాదంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప
-
‘భూ’ నజరానా
టీడీపీ నేత భార్యకు ప్రభుత్వ భూమికి పొజిషన్ సర్టిఫికెట్ రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన తక్షణం రద్దు చేయాలని డిమాండ్ అనపర్తి(బిక్కవోలు) : రెవెన్యూ అధికారుల తీరుపై అనపర్తి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార టీడీపీ నాయకులకు నజరానాగా కట్టబెట్టి సామాన్య ప్రజలను వేధిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్నా పొజిషన్ పట్టా ఇవ్వడానికి సవాలక్ష అభ్యంతరాలు తెలిపే అధికారులు గ్రామ నడిబొడ్డున లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కనీసం ఒక్కరోజు కూడా నివాసం ఉండకపోయినా ఓ టీడీపీ నాయకుని భార్య పేరున స్వాధీన పత్రం ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతయింది. వివరాలివి... అనపర్తి జీబీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఇందిరానగర్ ప్రాంతంలోని 306, 308, 309 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మామిడిశెట్టి శ్రీదేవి పేర స్వాధీన పత్రం మంజూరు చేశారు. గతంలో అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద కర్రి గాంధీరెడ్డి, సబ్బెళ్ళ వీర్రెడ్డిలపై పెట్టిన అట్రాసిటీ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఈ స్థలాన్ని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి సిఫారస్సు మేరకు నజరానాగా ఇచ్చారని టీడీపీలోని మరో వర్గం బహిరంగంగానే ఆక్రోశం వెళ్ళగక్కుతోంది. ఇటీవల ఆ భూమిని సదరు వ్యక్తి రూ.20 లక్షలకు అమ్మకానికి పెట్టారని తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుని, పొజిషన్ పట్టాను రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు. ఓం శాంతి ఆశ్రమంపై రాజకీయ ఒత్తిళ్లు ఇదే రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్య థోరణితో ప్రవర్తిస్తున్నారని కుతుకులూరు ఓం శాంతి ఆశ్రమం సభ్యులు ఆరోపిస్తున్నారు. పదిహేనేళ్ళుగా కుతుకులూరులో ఓం శాంతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పి గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక సేవలందిస్తున్న తమను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకుందామని వెళితే గత ఎన్నికలలో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి ఇపుడు సాయం కోసం వస్తారా? అంటు ఎమ్మెల్యే తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తానంటు బెదిరంచారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వద్ద వారు వాపోయారు. తమకు ఓట్లు వేయలేదనే అపోహతోనే టీడీపీ నేతలు రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన చెందారు. ఆధ్యాత్మిక సేవలందిస్తున్న తమ ఆశ్రమాన్ని ఖాళీ చేయాలంటూ అధికారుల సహకారంతో ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఆశ్రమ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదం దాదాపు తుపాకీ కాల్పులవరకూ వెళ్లింది. ఈ ఘటన నగరంలోని హిమయత్ నగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తికి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కు మధ్య భూ వివాదాలు తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇద్దరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన రియల్టర్.. ఏకంగా తన వద్ద ఉన్న గన్ తో గొడవకు దిగిన అవతలి వ్యక్తిని కాల్చేందుకు యత్నించాడు. అయితే ఈ గొడవ గమనిస్తున్న స్థానికులు వెంటనే వారిద్దరిని వారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పర్రభూములకు ఎర
తమ్ముళ్ల ‘భూ’బాగోతం అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ముఖ్యనేతలు 12 ఎకరాల ట్రయల్ రన్ సక్సెస్ మిగిలిన 100 ఎకరాల భూమిపై ఇద్దరు నేతల కన్ను అవకతవకలకు సహకరించిన వెబ్‌ల్యాండ్ ఆర్డీఓ దర్యాప్తుతో బయటపడినా పైరవీలు పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపకు గాలం వెయ్యాలి. అదే సూత్రం భూముల హస్తగతానికి ఎంచక్కా వాడుకుంటున్నారు కాకినాడకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు. పదో, పాతిక ఎకరాలు కాదు ఏకంగా వంద ఎకరాలపై వీరి కన్ను పడింది. ఆ భూమిని ఆక్రమించి అధికారులు ముందు భంగపడేకన్నా అందులో ఉండే లొసుగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమందితో ముందస్తుగా ఆక్రమించజేసి ... పూర్వార్జితం పత్రాలు చూపించి రిజస్ట్రేషన్ సిబ్బందిని మభ్యపెట్టి ఆ తంతు ముగింపజేశారు. వెబ్‌ల్యాండ్ లొసుగులు ఆధారంగా అవినీతి ముసుగేసేశారు. ఇక అదే దారిలో మిగిలిన 100 ఎకరాలను బినామీల పేరుతో రిజస్ట్రేషన్లు చేయించాలని అనుకున్నారు. ఇంతలో తొలి గాలంపై ఫిర్యాదులు వెళ్లడంతో కాకినాడ ఆర్డీఓ దర్యాప్తు చేయడం, ఆక్రమణ, రిజస్ట్రేషన్లు అక్రమమైనవేనని నిర్ధారించడంతో సక్రమంగా మార్చే పనిలో ఈ నేతలు పడ్డారు. అంతా సర్దుబాటయ్యాక వంద ఎకరాలకు బాటలేసుకోడానికి పైరవీలు ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగు తమ్ముళ్లు సముద్ర తీరాన్నే మింగేస్తున్న వ్యవహారం బయటపడటంతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్‌తో అందినంతా దోచేసిన రిజిస్ట్రేషన్ శాఖాధికారులను కొమ్ము కాసేందుకు టీడీపీ నేతలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారం అండ చూసుకుని భూములనే కాదు చివరకు సముద్ర తీరాన్ని కబ్జా చేయడమే కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించేసుకున్నారు. వివరాల్లోకి వేళ్తే... కాకినాడకు కూతవేటు దూరంలో కరప మండల పరిధిలో ఉప్పలంక సముద్ర పర్ర భూములు తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిగా చూపించి ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్న వైనం ఇటీవల బయటపడింది. ఉప్పలంకలో ఉన్న 120 ఎకరాల పర్రభూముల్లో 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ అనేది ముందస్తు ట్రైల్ రన్‌గా కనిపిస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తవడంతో రెండో విడతలో అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధిలు మిగతా 108 ఎకరాలు కాజేయడానికి పావులు కదుపుతున్నారు. బయటపడిందిలా... కరప మండలం గురజనాపల్లిలో సుమారు 120 ఎకరాలు ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అందులో 12.50 ఎకరాల భూమిని కొంతమందితో ఆక్రమింపజేశారు. చట్టంలో లొసుగుల ఆధారంగా పూర్వార్జితంగా చూపి, దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేయింపజేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కాకినాడ ఆర్డీఓ అంబేడ్కర్ ఇటీవల విచారణ చేపట్టారు. అవి అక్రమ రిజిస్ట్రేషన్లుగా ప్రాథమికంగా తేల్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వీలుండడంతో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలకు తెరదీశారని తెలియవచ్చింది. ఇందులో వారి స్వా ర్థం లేకపోలేదు. తొలి విడతగా 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ విజయవంతంగా జరిగిపోవడంతో మిగిలిన భూమిని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. తొలుత జరిగిన తంతులో ఏ ఇబ్బందీ తలెత్తకపోతే మిగిలిన భూమి స్వాహా చేయడానికి భారీ కసరత్తు జరుగుతోంది. తొలిగాలం ఇలా... ఈ మొత్తం వ్యవహారానికి కాట్రేనికోన మం డలం పల్లం గ్రామం కేంద్రంగా మారింది. ఈ గ్రామంలోని కొంతమందిని తొలి గాలంగా వాడుకున్నారు. గురజనాపల్లి సర్వేనంబరు 106/1ఎలో పూరా 65.02 సెంట్లభూమిలో పల్లం గ్రామానికి చెందిని మల్లాడి పెదస్వామి(లేటు) కుమారుడు మల్లాడి సత్యం, మల్లాడి కాసులయ్య, మల్లాడి కాసురాజు, మల్లాడి సత్యం కుమార్తె బలుసుతిప్ప గ్రామానికి చెంది న పినపోతు ధనకుమారిలు పారీఖతు ్త(విడిపోయినట్టు) దస్తావేజు రాసుకున్నారు. వీరిలో ఒకరికి 10.50 ఎకరాలు (50,820 చదరపు గజా లు) మిగిలిన నలుగురికిS 0.50 సెంట్లు లేదా 2,420 చదరపు గజాలుగా రాసుకున్నారు. చదరపు గజానికి రూ.1,500లు విలువకట్టి దానిప్రకారం ఎవరి వాటాకు ఎంతో పేర్కొంటూ మొత్తం విలువ రూ.9,07,50,000లుగా చూపించి స్టాంపు డ్యూటీ రూ.1,45,200లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000లు, యూజర్ ఛార్జి రూ.1000లు...మొత్తంగా రూ.1,47,200లకు తాళ్లరేవు ఎస్బీఐలో చలానాతీసి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కరప తహశీల్దార్, కాకినాడ కలెక్టరేట్లో ఫిర్యాదుచేసిన నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది. వెబ్ ల్యాండ్ లొసుగుతో అవినీతి ముసుగు... భూమి కొనుగోలుచేసినా, పూర్వార్జితం ఆస్తిని పంచుకున్నా, దానం చేసినా ఆ భూమికి పాత దస్తావేజులు, పాస్ పుస్తకాలు, 1బీ అడంగళ్ వివరాలు చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసే భూమి వివరాలను వెబ్‌ల్యాండ్‌లో తనిఖీచేసి, అన్ని ఆధారాలు సరిచూసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఇందులో ఉన్న అనేక మతలబులు ఆధారంగా వీరు ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్నారు. మొదటి మతలబు వెబ్లాండ్. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వెబ్లాండ్ విధానం. వెబ్లాండ్లో ఈ 12 ఎకరాలు మెరకచేసిన ఇళ్ల స్థలాలుగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూమి అయితే ఈ సర్వేనంబర్ బ్లాక్ అయి ఉంటుంది. అలా లేదు కాబట్టే రిజిస్ట్రేషన్ చేశామని తాళ్లరేవు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తమ తప్పు లేదన్నట్టు చెప్పుకొస్తున్నారు. సహజంగా గ్రామకంఠం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటేlదస్తావేజులు, పాస్‌పుస్తకాలు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసే వెసలుబాటుంది. వ్యవసాయ భూమిని ఎకరాల్లో చూపిస్తే అందుకు డాక్యుమెంట్లు ఇవ్వాలి. అదే చదరపు గజాలలో చూపించి పంచుకున్నా, అమ్ముకున్నా లింక్ డాక్యుమెంట్లు, పాత దస్తావేజులు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ భూమి ఎలా సంక్రమించిందంటూ రిజిస్ట్రార్ అడిగినా పూర్వార్జితం, పాత దస్తావేజులు లేవని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించేసుకునే వెసలుబాటు ఉంది. వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రార్లపె ఉంటుంది. కానీ ఇవేమీ చూడకుండానే అధికారపార్టీ పెద్దలు వెనుక ఉన్నారనే ఏకైక కారణంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. అంతా సక్రమమేనండీ... ఉప్పలంకలోని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ పీఎస్ఆర్ మూర్తిని వివరణకోరగా నిబంధనలకనుగుణంగానే చేశామన్నారు. ప్రభుత్వ స్ధలమైతే వెబ్‌ల్యాండ్‌లో బ్లాక్‌గా చూపిస్తుందన్నారు. అలాకాకుండా ఇళ్ల స్ధలాలుగా ఉండటంతో నిబంధనలకు లోబడే రిజిస్ట్రేషన్ చేశామన్నారు. -
కత్తిపోట్లకు దారితీసిన భూ వివాదం
నెల్లిపాక : భూ వివాదం నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేందుకు దారితీసింది. ఘర్షణకు అడ్డు వచ్చిన వ్యక్తిని, తన కొడుకుని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చిన ఈ ఘటన ఎటపాక మండలం చింతలపాడు వలస ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సోడె ఉంగయ్య, సోడె దేవయ్య తండ్రీకొడుకులు. వీరి మధ్య సోమవారం రాత్రి వారి పోడుభూమి సాగు విషయంలో గొడవ జరిగింది. అది తీవ్రరూపం దాల్చి కత్తులతో దాడి చేసుకునే పరిస్థితి ఎదురైంది. అదే గ్రామానికి చెందిన మడకం భీమరాజు వారిని వారించేందుకు యత్నించాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉంగయ్య తన చేతిలో ఉన్న కత్తితో దేవయ్యతో పాటు భీమరాజును కూడా పొడిచాడు. దేవయ్యకు గుండెలో, కడుపుపై, భీమరాజుకు కడుపులో తీవ్ర గాయం కావడంతో వారిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస అందకపోవడంతో భీమరాజుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భీమరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. -
ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
పామిడి: భూ వివాదంలో చెలరేగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, నాగేంద్ర వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై ప్రత్యర్థులు దాడి
హుజూర్నగర్: భూవివాదం నేపథ్యంలో ఓ మహిళపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూరగడ్డ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సైదమ్మ (35) అనే మహిళకు పొలం సరిహద్దుల విషయంలో కొందరితో గత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పొలం దగ్గర ఉన్న ఆమెపై ప్రత్యర్థులు బ్లేడ్‌తో దాడి చేసి... గొంతు కోశారు. ఆమె హుజూర్నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి...ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సీపీఎం నేతలపై దుండగుల దాడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సుందరయ్యనగర్‌కు చెందిన సీపీఎం నేతలు ఆంజనేయులు, సతీష్‌పై మంగళవారం దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. గమనించిన స్థానికులు ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచ్చారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థల వివాదమే హత్యకు కారణమై ఉంటుందని తెలుస్తుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా సీపీఎం నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నాకి దిగారు. -
జెడ్పీటీసీ సభ్యుడి ఆత్మహత్యాయత్నం
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాండూరుకు చెందిన జెడ్పీటీసీ సురేష్‌బాబుకు, బెల్లంపల్లికి చెందిన వరలక్ష్మి అనే మహిళకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. అయితే, సదరు భూమిని తనకు దక్కుకుండా చేస్తున్నారనే ఆవేదనతో సురేష్‌బాబు తాండూరు తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. -
భోగాపురం ఎయిర్ పోర్టు వద్దు: మావోయిస్టుల లేఖ
శ్రీకాకుళం : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలను విరమించుకోవాలని ముగ్గురు టీడీపీ నేతలను ఈనెల 6న కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా మావోయిస్టుల లేఖతో రాజకీయవర్గాల్లో కలకలం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా కోరాపుట్ డివిజన్ కార్యదర్శి దయా పేరుతో వచ్చిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు భూసేకరణలో టీడీపీ నేతల భూములకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని అడిగారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతిలకు సంబంధించిన భూములను తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఈనెల 5న భోగాపురంలో వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటించి బాధితులకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. -
బెదిరింపుల కేసు.. ఇద్దరు ఎస్ఐల అరెస్టు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఇద్దరు ఎస్ఐలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక పోలీస్‌స్టేషన్ సార్లు మరో పోలీస్‌స్టేషన్‌లో నిందితులుగా మారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రావు... ఓ రియల్టర్. గత ఏడాది నిజామాబాద్ జిల్లా ఎస్ ఎస్‌నగర్ ఎస్ఐ ప్రతాప్‌లింగం, మెదక్ రూరల్ ఎస్ఐ వినాయక్రెడ్డితో పాటు మరో ఇద్దరికి కలిసి ఓ స్థలం అమ్మాడు. దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అయితే... అవి డబుల్ రిజిస్ట్రేషన్ కావటంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇద్దరు ఎస్ఐలతో పాటు... మిగతావాళ్లు శ్రీనివాస్‌రావును కోరారు. దానికి అప్పుడు... ఇప్పుడు అంటూ రియల్టర్ శ్రీనివాస్‌రావు తప్పించుకున్నాడు. దీంతో గురువారం రాత్రి ఇద్దరు ఎస్ఐలతో పాటు సుమారు 20 మంది రియల్టర్ ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై గొడవ పడ్డారు. విషయం పెద్దదిగా మారి ఎస్ఐలిద్దరూ కలిసి శ్రీనివాస్‌రావును వ్యాన్‌లో ఎత్తుకెళ్లారు. వచ్చింది ఎవరో, ఆయనను ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక రియల్టర్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అల్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్‌రావును తీసుకెళ్లిన వ్యాన్‌తో పాటు.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అల్వాల్ శివారులోని ఓ ఇంట్లో రియల్టర్‌ను గుర్తించారు. శ్రీనివాస్‌ను ఎత్తుకొచ్చిన ఇద్దరు ఎస్ఐలతో పాటు రఘు, లక్ష్మినారాయణ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే... రియల్టర్ శ్రీనివాస్‌రావు వాదన మరోలా ఉంది. ఎస్ఐలిద్దరూ కొనుగోలు చేసిన భూమి పక్కనే ఉన్న స్థలాన్ని కూడా తమకే అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారని, వాళ్లు అడిగిన విధంగా భూమి అమ్మకపోవడం వల్లే కిడ్నాప్ చేసి... సర్వీస్ రివాల్వర్‌తో బెదిరింపులకు దిగారని అన్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. రియల్టర్‌ను ఎత్తుకెళ్లిన ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్ఎస్ నగర్ ఎస్ఐ ప్రతాప్‌లింగం, మెదక్ రూరల్ ఎస్ఐ వినాయక్రెడ్డిపై వేటు పడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
గోల్కొండలో కాల్పుల కలకలం
గోల్కొండ: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూ వివాదానికి సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదం చివరకు బుల్లెట్ల వర్షం వరకు వెళ్లింది. టోలిచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాబేర్‌పటేల్ కొన్ని రోజుల కిందట గోల్కొండలో ఒక ఫ్లాట్ విషయంలో స్థానికులతో గొడవపడ్డాడు. ఈ విషయం ఆనోట ఈ నోట పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిచి సర్దుబాటు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి జాబేర్ పటేల్ గోల్కొండకు చెందిన ఫరీద్‌తో భేటి అయ్యాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన జాబేర్ తన తుపాకితో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. జాబేర్ పటేల్ జాతీయ మైనార్టీ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఎర్రబుగ్గ వాహనాన్ని వాడుతున్నట్టు స్థానికలు తెలిపారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమ్ముడి భార్యను కాలితో తన్ని దాడి..
-
'ఓర్వలేకనే నాపై ఆరోపణలు'
షాద్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే తరుచుగా అక్కడికి వస్తున్నట్టు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయం ముందు నాగులపల్లి గ్రామానికి చెందిన మహిళ చేసిన రాద్దాంతం గురించి సీఎం, డీజీపీ, రెవెన్యూ కమిషనర్, జిల్లా ఎస్పీ, స్థానిక సీఐకు ఫిర్యాదు చేశానన్నారు. భూములను కబ్జా పెట్టానని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వాటిని కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకున్నానని.. అందుకు సంబంధించిన ప్రతులను మీడియాకు అందచేశారు. తన దగ్గర డబ్బులు తీసుకొని కూడా కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు. -
కొలిక్కివచ్చిన కంబిరిగాం భూ వివాదం
పలాస: కంబిరిగాం భూ సమస్య కొలిక్కివచ్చింది. 150 ఏళ్లుగా రైతులకు, కంబిరిగాం భూ స్వామి పరశురాం చౌదరి కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్న వివాదానికి హైకోర్టు చెక్ చెప్పింది. చౌదరి కుటుంబ సభ్యులు వేసిన స్టేను రద్దుచేస్తూ ఇనాం యాక్టు 10(ఎ) కింద రైతులకు రెండు భాగాలు, భూస్వామికి ఒక భాగం భూమిని కేటాయించి పట్టాలు మంజూరు చేయాలంటూ ఏప్రిల్ 28న తీర్పు వెలువరించింది. దీంతో సుమారు 317 ఎకరాలను రైతులకు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలాస మండలం కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని భూములను జేసీ-1 వివేక్‌యాదవ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి రైతులను పిలిపించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు సాగు చేస్తున్నారో ఎంత భూమి ఉందని అనేది మరోసారి సర్వే చేయించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి ఎవరి వాటాకు చెందిన భూమిని వారికి కొద్దిరోజుల్లోనే అప్పజెపుదామని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు పాడి నారాయణ, పాడి సూర్యనారాయణ, కనగల ఫల్గుణరావు తదితరులు మాట్లాడుతూ న్యాయమూర్తులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. తాతముత్తాతల నుంచి నేటి వరకు సుమారు 150 ఏళ్ల పాటు ఈ భూములను నమ్ముకొని అనేక కష్టాలు అనుభవించామని వాపోయారు. సుదీర్ఘకాలంగా 33 కేసులు అనుభవించామని, ఒక్క ఆదివారం తప్ప మిగతా నెలలో అన్ని రోజులు కూడా కోర్టుల చుట్టూ తిరిగామన్నారు. సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల భూములను ముట్టితే ఓ కేసు, చేపలు పడితే మరోకేసు, రాలిన మామిడికాయ తీస్తే ఇంకో కేసు ఇలా ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా సోంపేట, శ్రీకాకుళం, పలాస కోర్టులు చుట్టూ పక్షుల్లా తిరిగామంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు కార్చారు. న్యాయమూర్తులు దయతలచి తమపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ రద్దు చేశారని, ఇప్పుడు భూమి కూడా ఇనాంయాక్టు కింద తమకు దాఖలు పర్చాలని చెప్పడం చాలా సంతోషకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చేతులెత్తి జోడించారు. దీనికి జేసీ వివేక్‌యాదవ్ స్పందిస్తూ ఇది చాలా మంచి తీర్పు అని, భూస్వామికి కూడా ఒక భాగం దక్కుతుందని, ఇరువర్గాలు కూడా రాజీపడి పరస్పరం సహకారంతో శాంతియుతంగా గ్రామంలో సహజీవనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వివేక్‌యాదవ్‌తో పాటు ఆర్డ్వీవో ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ గన్నవరపు సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ బి.పాపారావు, సర్వేయర్లు ఉన్నారు. 150 ఏళ్లుగా... కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల సర్వే నంబర్లలో 317.71 ఎకరాల భూమి ఉంది. ఇందులో పల్లం 216.67 ఎకరాలు కాగా, మెట్టు 37.63 ఎకరాలు, పోరంపోగు 63.41 ఎకరాలు. ఈ భూములను 1843 నుంచి కంబిరిగాం, కేదారిపురం, ఈదురాపల్లి రైతులు సాగు చేస్తున్నారు. ఇవే భూములపై 1915లో ఒడిశా చత్రపూర్ కోర్టులో భూస్వామి పరశురాంచౌదరి కుటుంబానికి, తర్లాకోట, పర్లాఖిమిడి రాజుల కు మధ్య కేసు నడిచింది. ఈ భూమిని బరంపురం బ్రాహ్మణులకు ఇనాం కింద తర్లాకోట, పర్లాఖిమిడి రాజులు దాఖలు పరచగా, వారి నుంచి పరశురాంచౌదరి కుటుంబీకులు సొం తం చేసుకున్నట్టు అప్పటి చరిత్ర చెబుతోంది. 1976లో భూ సంస్కరణల చట్టం ప్రకారం ఈ భూమి సాగుచేసిన రైతులకు దక్కాలి. అయితే, దీనిని పరశురాంచౌదరి కుటుంబీకులు అడ్డంపడ్డారు. ఎన్ని కేసులు పెడుతున్నా 1843 నుంచి నేటి వరకు ఆ భూములను సాగు చేస్తున్నది కేదారిపురం, ఈదురాపల్లి రైతులే. 1980లో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో పరశురాం కుటుంబీకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. 1984లో 90 మంది రైతులకు అనుకూలంగా కమిషనర్ ఆఫ్ లాండ్ రెవెన్యూ తీర్పు చెప్పింది. 1999లో సర్వే చేసి ప్రభుత్వం గజిట్ పబ్లికేషన్ కూడా చేపట్టింది. ఈ సర్వే పనికిరాదని పరశురాం కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 122 మంది రైతులు థర్డ్‌పార్టీగా చేరి హైకోర్టుకు వెళ్లారు. దీంతో 1999లో హైకోర్టు తీర్పు చెబుతూ 12 వారాల్లో ఈ భూములను సర్వే చేసి హక్కు కల్పించాలని ఆదేశించింది. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అండతో రైతులు సాగుకు ఉపక్రమించినా పోలీసుల అండతో భూ స్వామి పరశురాంచౌదరి కుటుంబీకులు సాగును అడ్డుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో అధికారులు దిగి వచ్చారు. జేసీ-1 వివేక్‌యాదవ్ ఇచ్చిన భరోసాతో రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. భూ పోరాటానికి ఒక పరిష్కారం లభిస్తుందని, ఇనాం యాక్టు కింద ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని ఇటు అధికారులు, అటు ప్రజలు ఆశిస్తున్నారు. -
త్వరలో భూ సమస్యలకు మోక్షం
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో దశాబ్దాల తరబడి భూ సమస్యలు తీరడం లేదు. భూమి ఒకరి పేరున ఉంటే వన్‌బీలో మరొకరి పేరు నమోదై ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరు కనిపిస్తుంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు, భూ యజమానులు ఏళ్ల తరబడి తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవవుతున్నారు. రేపురా... రెండు రోజులు పోయిన తరువాత చూద్దాం... అన్న సమాధానలతో రైతులు విసిగివేశారి పోతున్నారు. ప్రతీ ఏటా జమాబందీ నిర్వహిస్తున్నా రికార్డుల పై అట్టలు మాత్రమే మారుస్తున్నారనీ, సర్వే నంబర్లు, ఖాతా నంబర్లలో తప్పులు సవరించడం లేదని రైతులు ఏటా వాపోతునే ఉన్నారు. వీటన్నింటికీ పరిష్కారాన్ని కనుగొనేందుకు ‘‘ మీ భూమి-మీ చేతుల్లో ’’ అన్న కార్యక్రమాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న భూముల వివరాలను తహశీల్దార్ కార్యాలయాల నుంచి తీసుకుంటున్నారు. మండలాల వారీగా ఉన్న భూమి వివరాలను సీడీల రూపంలో తీసుకుని జిల్లా కేంద్రంలో వాటిని ప్రింట్లు తీసి పంపిణీ చేయనున్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ‘మీభూమి-మీచేతుల్లో’ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరిస్తారు. అనంతరం రైతులకు అందిన ఫారాలననుసరించి వివరాలు సక్రమంగా ఉంటే ఫారంలో పొందుపరచిన కాలమ్‌లో వివరాలు సరిపోయినవి అని ఉన్న చోట రైతు, సంబంధిత భూ యజమాని ఆమోదం తెలపాలి. లేకుంటే ఏఏ వివరాలు లేవన్న విషయాన్ని కూడా సంబంధిత కాలమ్స్‌లో పేర్కొనాలి. అనంతరం వెబ్‌ల్యాండ్‌లో వాటిని ధ్రువీకరించి తాజా పరుస్తారు. ఈ ప్రకారం మీ భూమి-మీ చేతుల్లో కాార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం భూ క్రయవిక్రయాలను నేరుగా వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేస్తారు. దీని వలన ప్రతీ సంవత్సరం రికార్డుల ప్రక్రియ తాజాగా నమోదవుతూ ఉంటుంది. తద్వారా భూ సమస్యలు, రికార్డుల తప్పొప్పులు జరిగే అవకాశం ఉండదు. పలుమార్లు రికార్డులను మార్చేందుకు అధికారులకు, రైతులకు ఇబ్బందులు కూడా ఉండవని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 12,76,720 ఎకరాలు. ఇందులో పల్లపు భూమి 3,08,904 ఎకరాలుండగా మెట్ట భూమి 5,08,787 ఎకరాలుంది. ప్రభుత్వానికి చెందిన భూమి 4,26,005 ఎకరాలుంది. ఇది కాకుండా 63,882 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు, ఇతర రిజర్వు స్థలాలు కలిపి 30,858 ఎకరాలుంది. ఈ భూ వివరాలను ఏటా తాజా పర్చాల్సి ఉన్నప్పటికీ ఆ పనిజరగడం లేదు. వ్యవసాయ సాగు భూమి (పల్లం, మెట్టు కలిపి)8,17,691 ఎకరాలుండగా ఇప్పటికి వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 4.20లక్షల ఎకరాలని నమోదైంది. కొత్త పద్ధతి ప్రకారం రైతుల నుంచి వచ్చే సవరణల ఆధారంగా ఈ జమాబందీ కార్యక్రమం సక్రమంగా జరిగే వీలుంటుందని చెబుతున్నారు. త్వరలో షెడ్యూల్ ప్రకటన ప్రస్తుతం మీ భూమి-మీ చేతుల్లో కార్యక్రమానికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయాల నుంచి భూ వివరాలున్న సీడీలు తీసుకుంటున్నాం. వాటిని ప్రింట్లు తీసి రైతులు, భూ యజమానులకు ఇచ్చి రికార్డులన్నీ తాజా పరుస్తాం. దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తాం. మండలాల్లో నిర్వహించాల్సిన గ్రామ సభల షెడ్యూల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం త్వరలోనే ప్రకటిస్తాం. ఆర్ శ్రీలత, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్, విజయనగరం. -
భూమికోసం వివస్త్రను చేసి మహిళపై దాడి
పాల్ఘర్: భూతగాదా నేపధ్యంలో పాలఘర్ లో 45 ఏళ్ల మహిళపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి హింసించి, లైంగికంగా వేధించి, దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడినవారిలో నరేశ్ దోడి అనే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిసర్ అనే మండలంలోని దాండి పాడా అనే గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు కొంత భూమి ఉంది. దీనిని డెవలప్ మెంట్ కు ఇవ్వాల్సిందిగా నరేశ్ దోడీ అడగగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపైనే అందరు చూస్తుండగా చిత్రహింసలు పెట్టారు. కర్రలతో బాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ఆరు నెలల కిందటే ఆ భూమిని నరేశ్ దోడీ నుంచి కొనుగోలు చేయగా దానిని తనకే అభివృద్ధి చేసేందుకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. -
'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం'
ఇబ్రహీంపట్నం(కృష్ణా) : ఈషా ఫౌండేషన్ అధినేత, యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ప్రభుత్వం కట్టబెట్టజూస్తున్న మూలపాడు అటవీ భూములను ఆయనకు దక్కనీయబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇందుకోసం తమ ప్రాణాలు పోయినా పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం స్థానిక సీపీఐ నాయకులతో కలసి మూలపాడు అటవీ భూములను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వనసంరక్షణ సమితి సభ్యులు, స్థానిక కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడవిలో వన సంరక్షణ, అటవీ ఫలసాయంతో ఇంతకాలం జీవనం సాగిస్తున్నామని, తమ పశుసంపద కూడా అడవులపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ కూలీలు గోడు వెళ్లబోసుకున్నారు. వేలకోట్ల రూపాయల విలువైన ఈ అటవీ భూముల్లోకి బాబాలు, చంద్రబాబు కాదుకదా వారి జేజమ్మలు దిగొచ్చినా అడుగుపెట్టనీయబోమన్నారు. తుళ్లూరు రాజధాని ప్రాంత రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సీఎం చంద్రబాబుకు మొట్టికాయలు వేసినప్పటికీ ఆయన తీరు మారలేదని విమర్శించారు. -
'ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదు'
విజయవాడ: తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో పార్థసారధి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలం జూపల్లిలో ఉన్న భూమిని 2012లో తన కుమారుడి పేరు మీద కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాళ్లపల్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి సదరు భూమిని కొనుగోలు చేశానని... అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పార్థసారధి వెల్లడించారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమన్నారు. సదరు భూమి విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తానని ఆయన చెప్పారు. తాను అక్రమంగా భూమి కొనుగోలు చేశానని కోర్టులో తేలితే సదరు భూమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పార్థసారధి ఈ సందర్భంగా ప్రకటించారు. -
భూ వివాదంలో లాయర్లు, రియల్టర్ అరెస్టు
గుంటూరు క్రైం: భూమి వ్యవహారంలో గుంటూరు జిల్లా పోలీసులు ఇద్దరు లాయర్లు సహా ఒక రియల్టర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు...నగరంలోని శ్యామలానగర్‌లోని భూమి విషయమై 2007 సంవత్సరం నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. భూమికి సంబంధించిన పత్రాలను దొంగతనం చేసి, వాటిని మార్చి తమను మోసగించారంటూ వి.వెంకట నరసమ్మ, జె.మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్బన్ ఏఎస్పీ జె.భాస్కర్‌రావు విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన ఆధారాల ఆధారంగా ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళలను 15 రోజుల క్రితం అరెస్టు చేశారు. తాజాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న న్యాయవాదులు లక్ష్మణ్‌కుమార్, డి.శ్రీనివాసరావుతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు. -
రాజధాని - భూములు: చర్చ Part - 3
-
''విచ్చలవిడిగా ప్రజల డబ్బు ఖర్చు''