భూ ఆక్రమణ : టీడీపీ నేత అరెస్ట్
విశాఖపట్టణం: భూ ఆక్రమణ కేసులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మధురవాడ తెలుగుదేశం పార్టీ నాలుగో వార్డు అధ్యక్షుడు గొల్లగాని సన్యాసిరావును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ భూములలో ఉన్న బోర్డులను తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.