
విశాఖలో ఇళ్ల అమ్మకాలు నేలచూపులు
2024లో ఏకంగా 21 శాతం క్షీణించిన విక్రయాలు
దేశవ్యాప్తంగా ఇతర టైర్–2 నగరాల్లో పెరిగిన అమ్మకాలు
ప్రాప్ ఈక్విటీ సంస్థ స్థిరాస్తి నివేదికలో వెల్లడి
కూటమి పార్టీల విష ప్రచారంతో విశాఖలో దెబ్బతిన్న రియల్ రంగం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖలో ‘రియల్’ రంగం ఆటుపోట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! టీడీపీ కూటమి ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో అస్థిర వాతావరణం నెలకొంది. తింటే గారెలే తినాలి... కొంటే వైజాగ్‌లోనే ఇల్లు కొనాలనే పరిస్థితి నుంచి రాజకీయ కుట్రలకు బలవుతామేమోనన్న భయంతో కొనుగోలుదారులు ఇతర నగరాలవైపు చూస్తున్న పరిస్థితి తలెత్తింది.
గతేడాది దేశవ్యాప్తంగా టైర్–2 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినా విశాఖలో మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. గృహ విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ నివేదికలో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి.
అమ్మకాల్లో అట్టడుగున విశాఖ
దేశవ్యాప్తంగా 15 ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే నిర్వహించింది. టైర్–2 నగరాల్లో విశాఖలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గృహ విక్రయాలు బాగా పడిపోయిన నగరాల్లో విశాఖ సైతం టాప్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. విశాఖతో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, నాసిక్, జైపూర్, నాగపూర్, భువనేశ్వర్, మొహాలీ, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్, త్రివేండ్రంలో 2024లో ఇళ్ల అమ్మకాలు, నూతన గృహాల నిర్మాణాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వే చేపట్టింది.
విష ప్రచారంతోనే..
రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేలా అడుగులు వేసింది. నగరంలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపింది. గత ప్రభుత్వ కృషితో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే విశాఖపై కూటమి పారీ్టలతో పాటు ఎల్లో మీడియా అక్కసు పెంచుకుంటూ వచ్చాయి.
ఏటా సముద్ర మట్టం పెరిగి విశాఖ మునిగిపోతుందంటూ తప్పుడు కథనాలు వెలువరించాయి. నగరంలో భూ కబ్జాలు, హత్యాకాండలు అంటూ దు్రష్పచారానికి తెర తీశాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖలో ఒక్కసారిగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ఈ ప్రభావం ప్రధానంగా రియల్ ఎసేŠట్‌ట్ రంగంపై పడింది.
ఫలితంగా మిగిలిన టైర్–2 నగరాలతో పోలిస్తే విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 21 శాతం తగ్గాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మినహా కొత్తవి ఏవీ పట్టాలు ఎక్కకపోవడానికి విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కోయంబత్తూర్‌లో అత్యధికం
2024లో టైర్ 2 సిటీల్లో గృహ విక్రయాలు నాలుగు శాతం పెరగగా విలువ పరంగా 20 శాతం వృద్ధి కనిపించింది. 15 నగరాల్లో 1,78,771 యూనిట్లు విక్రయించగా వీటి విలువ రూ.1,52,552 కోట్లుగా ఉంది. 2023లో రూ.1,27,505 కోట్ల విలువైన 1,71,903 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
ఏకంగా 36 శాతం వృద్ధితో కోయంబత్తూర్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. అమ్మకాల విలువ పరంగా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే విక్రయాల విలువలో 47 శాతం వృద్ధి రేటును భువనేశ్వర్ నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో రూ.49,421 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2023లో రూ.42,063 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది.
ఏడాదిలో ఎంత తేడా
ఏడాదిన్నర క్రితం వరకూ రియల్ బూమ్‌తో ఉప్పొంగిన విశాఖ ఇప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అధికార పార్టీ నేతల భూ దందాలతో క్రయ విక్రయాలు సుప్తావస్థలోకి చేరుకున్నాయి. ఫలితంగా విశాఖలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 2023లో విశాఖలో 5,361 ఇళ్లు అమ్ముడు కాగా 2024లో ఇది 4,258కి పడిపోయింది.
ఇళ్ల నిర్మాణ విషయంలోనూ విశాఖలో తిరోగమనం కనిపించిందని ప్రాప్ ఈక్విటీ సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా విశాఖలో ఏటా సగటున 4,997 కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. గతేడాది మాత్రం దాదాపు 8శాతం తగ్గుదల నమోదైంది. అటు విక్రయాలతో పాటు ఇటు నిర్మాణాల్లోనూ విశాఖలో రియల్ రంగం తిరోగమనంలోనే సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment