Real estate sector
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
తయారీకి బంగారు భవిష్యత్
న్యూఢిల్లీ/సిడ్నీ: భారత్‌లో తయారీ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు 2014 సెపె్టంబర్ 25న ప్రారంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతోపాటు. తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. వ్యాపార సులభతర నిర్వహణ, అవినీతిని ఉపేక్షించకపోవడం, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాలపై దృష్టి సారించడం ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) విజయవంతం అయ్యేలా చేసినట్టు ప్రకటించారు. ఇది దేశంలో స్థానిక, విదేశీ పెట్టుబడులు ఇతోధికం కావడానికి సాయపడినట్టు చెప్పారు. భారీ పెట్టుబడుల ప్రణాళికలను చూస్తున్నామంటూ.. వీటి రాకతో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ పాత్ర మరింత పెరుగుతుందని సిడ్నీ పర్యటనలో ఉన్న గోయల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితం.. స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల సెంటిమెంట్ బలహీనంగా ఉన్న తరుణంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు చేపట్టినట్టు మంత్రి గోయల్ గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట కొంత క్షీణించింది. బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొనేవారు. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పొందేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. ఒకటే దేశం ఒకటే పన్ను – జీఎస్టీ, ఐబీసీ, పారదర్శకంగా గనుల వేలం తదితర ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసేపేత నిర్ణయాలతో అది సాధ్యపడింది’’అని మంత్రి గోయల్ వివరించారు. స్థిరమైన, స్పష్టమైన విధానాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడేలా చేసినట్టు చెప్పారు. ఈ చర్యలతో వ్యాపార సులభతర నిర్వహణలో భారత్ స్థానం 14 స్థానాలు మెరుగుపడి 190 దేశాల్లో 63కు చేరినట్టు తెలిపారు. 2020లో పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించి, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత నాటి చర్యల ఫలితాలను చూస్తున్నాం. భవిష్యత్‌పై ఉత్సాహంతో ఉన్నాం. మొబైల్స్ తయారీలో ఎంతో పురోగతి సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్స్ తయారీ కేంద్రంగా ఉన్నాం’’అని వివరించారు. టెక్స్టైల్స్, సిరామిక్స్, ఆట»ొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో దేశీ సామర్థ్యాలు నుమడించాయన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా సాయపడినట్టు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్సీ సంక్షోభాల్లోనూ దేశ జీడీపీలో తయారీ రంగం వాటా యాథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్పారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ అంతరిక్షం, బొగ్గు తవ్వకం, ఈ–కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీ ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇందులో 90 శాతం ఆటోమేటిక్ మార్గంలోనే వచి్చందన్నారు.ఆర్బీఐ దృష్టికి రియల్టర్ల నిధుల సమస్యలురియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను ఆర్బీఐ దృష్టికి తీసుకెళతానని మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో (మున్సిపాలిటీలు) మాట్లాడతానని భరోసా ఇచ్చారు. రెరా చట్టం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచి్చనట్టు చెప్పారు. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల పరంగా వాటా.. ఇలా రియల్ ఎస్టేట్ రంగం గొప్ప పాత్ర పోషిస్తోందని మంత్రి మెచ్చుకున్నారు. -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్‌ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్‌ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
‘రియల్’ అభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంగ్లండ్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్‌లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. భట్టిని కలిసిన వారిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు మేకా విజయసాయి, కె.శ్రీధర్‌రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్‌రెడ్డి, చలపతిరావు, భూపాల్‌రెడ్డి, మారోజు శ్రీధర్‌రావు, అశోక్, రామిరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ బృందం ప్రతిపాదనలివీ.. ♦ భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్ట్గేజ్ విధానాన్ని ఎత్తేయాలి. ♦ అధికంగా ఉన్న రిజి్రస్టేషన్ చార్జీలను తగ్గించాలి. జీఓ 50ని ఎత్తేయాలి. ♦ పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. ♦ రంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న టీఎస్ బీ–పాస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి. ♦ రాష్ట్రంలో గత 6 నెలలు ఖాళీగా ఉన్న పర్యావరణ కమిటీని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలి. ♦ భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లపై యూనిట్‌కు వసూలు చేస్తున్న రూ. రూ. 14ను తగ్గించేలి. వెల్త్ క్రియేటర్లను ఇబ్బంది పెట్టం.. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చే వెల్త్ క్రియేటర్లను ఇబ్బందిపెట్టబోమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రియల్ ఎస్టేట్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. మూసీ నది శుద్ధితో సుందరీకరణ జరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండ్రస్టియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని భట్టి చెప్పారు. ‘ధరణి’పై చేసే సూచనలను తాను పరిశీలించడంతోపాటు ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానని తెలిపారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
హైదరాబాదా మజాకా! విలాసానికి 'సై'.. లగ్జరీ గృహాల ధరల్లో అత్యధిక వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ.100 కోట్లు.. మోకిలాలో గజానికి రూ.1,0,5000 ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలోనూ మరో మైలురాయి సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. విలాసవంతమైన ఇళ్లలో ఇలా... హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా, 2023 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర మాత్రమే పెరిగాయి. కరోనా తర్వాత నుంచే లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,210గా ఉండగా, ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది. రెండోస్థానంలో హైదరాబాద్ ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.3,750గా ఉండగా, ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.4 వేలుగా ఉంది. మధ్యతరగతిలోనూ మనమే టాప్ ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.6,050లుగా ఉండగా, ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.5,780గా ఉంది. దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2023 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే, విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధిగా నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 2018లో 12,400గా ఉండగా, 2023 నాటికి 15,350కి పెరిగింది. -
‘గృహ ప్రవేశం’ ఎన్నికల తర్వాతే
ఎడతెరిపిలేని వర్షాలు, ఎన్నికల వాతావరణం, వడ్డీ రేట్ల ప్రభావం, ఐటీ ఉద్యోగుల లే–ఆఫ్‌లు, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కారణాలేవైనా హైదరాబాద్ స్థిరాస్తి రంగం మందగమనంలోకి జారిపోయింది. అపార్ట్మెంట్లే కాదు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఆఫీసు స్పేస్ అన్ని లావాదేవీల్లోనూ ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి– మార్చి మధ్యకాలం (క్యూ1)తో పోలిస్తే ఏప్రిల్–జూన్ (క్యూ2) నాటికి అన్ని విభాగాల విక్రయాల్లోనూ తగ్గుదల నమోదయింది. –సాక్షి, హైదరాబాద్ కరోనా తర్వాత రెండేళ్లూ ఓకే.. కరోనా తర్వాత రెండేళ్ల పాటు స్థిరాస్తి రంగం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మార్కెట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ప్రతి సార్వత్రిక ఎన్నికలకు 6–8 నెలల ముందు నుంచే స్థిరాస్తి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏ ప్రభుత్వం వస్తుందో? కొత్త ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వ అభివృద్ధి పనులను కొనసాగిస్తుందో లేదో, పాత ప్రభు త్వమే వస్తే మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వెంటాడుతుంటాయి. ఇటీవల డెవలç³ర్లు అనూహ్యంగా అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. రూ.50 లక్షల లోపు ధర ఉండే మధ్యతరగతి గృహాలు విక్రయాలు లేక చాలావరకు ఖాళీగా ఉన్నాయి. గృహ విక్రయాలలో తగ్గుదల.. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల సరఫరా, విక్రయాలు రెండింట్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది క్యూ2లో హైదరాబాద్‌లో 10,470 గృహాలు ప్రారంభమయ్యాయి. అదే క్యూ1లో చూస్తే 14,620 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 నెలల వ్యవధిలో గృహ సరఫరాలో 28 శాతం తగ్గుదల నమోదయ్యిందన్న మాట. ఇక విక్రయాలు చూస్తే.. క్యూ1లో 14,280 ఇళ్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 13,570 యూనిట్లకు పడిపోయాయి. అంటే 5 శాతం తగ్గాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. ఆఫీసు స్పేస్‌లోనూ క్షీణతే.. నివాస సముదాయాల్లోనే కాదు ఆఫీసు స్పేస్ లావాదేవీల్లోనూ తగ్గుదల నమోదయింది. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో 24 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల లీజు లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 23 లక్షల చ.అ.కు పడిపోయాయి. అంటే 3 నెలల్లో 4 శాతం క్షీణత చోటు చేసుకుందన్న మాట. దేశీయ, బహుళ జాతి కంపెనీల విస్తరణ నిర్ణయాల్లో జాప్యం, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు క్షీణతకు ప్రధాన కారణమని రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 1.39 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లూ అంతే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1.47 లక్షల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల దరఖాస్తులు వచ్చాయని ధరణి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చిన దరఖాస్తులే 40 వేల వరకుంటాయి. అంటే లక్ష డాక్యుమెంట్లు మాత్రమే క్రయవిక్రయాలకు సంబంధించి జరిగాయి. అదే గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయిస్తే.. 1.51 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే 50 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయన్న మాట. ఎన్నికల తర్వాతే మార్కెట్‌కు ఊపు హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల వాతావరణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. కాబట్టి 3–6 నెలలు మార్కెట్ ప్రతికూలంగానే ఉంటుంది. ఎన్నికల తర్వాతే స్థిరాస్తి మార్కెట్జోరందుకుంటుంది. – టీవీ నర్సింహారెడ్డి, స్పేస్‌విజన్ గ్రూప్ -
రియల్ రంగంలోకి ‘సుడా’
సాక్షి, సిద్దిపేట : రియల్ ఎస్టేట్ రంగంలోకి ‘సుడా’ (సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ) అడుగు పెడుతోంది. గతేడాది డిసెంబర్ 9న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 234 ప్రకా రం సిద్దిపేట పట్టణ శివారులోని మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్తో మోడల్ లే అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఓ వైపు పర్యాటకంగా, మరోవైపు సాగు జలాలు, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా రానుంది. పట్టణ శివారులో ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు వెంచర్లు చేసి విక్రయిస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్ పెరిగింది. శనివారం సుడా మోడల్ టౌన్షిప్పై సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 10 మంది రైతులు.. 14 ఎకరాలు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో అసైన్డ్ భూములు కలిగిన పది మంది రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమి కోల్పోతున్న రైతుకు డెవలప్ మెంట్ చేసిన టౌన్షిప్లో 800 గజాల స్థలం ఇస్తారు. 14 ఎకరాల భూమిలో 67,760 గజాల భూమి తేలింది. ప్రధాన రోడ్డు 60 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లతో నిర్మా ణాలు చివరి దశలో ఉన్నాయి. రోడ్లకు 23,907 గజాలు, పార్కులకు 6,098 గజాలు, ఇతర మౌలిక సదుపాయాలకు 2,391 గజాలు వినియోగిస్తున్నారు. దీంతో 35,360 గజాల స్థలం మిగిలింది. దీనిని 161 ప్లాట్లుగా విభజించారు. అందులో 10 మంది రైతులకు 50 ప్లాట్లు, 111 ప్లాట్లు సుడాకు మిగులుతాయి. స్ట్రీట్ లైట్లు, పార్కులు, మొక్కల పెంపకం,తాగునీటి సౌకర్యం.. ఇలా సకల సౌకర్యాలతో మోడల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నారు. నేడు ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 29న తొలి విడతలో 101 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రీబిడ్ మీటింగ్‌ను శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాట్లు కొనుగోలు చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వ ధరగా రూ.8 వేలు నిర్ణయించారు. ఆ ధర నుంచి సుడా అధికారులు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలి. కాగా, ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడతారు. సకల సౌకర్యాలతో లే అవుట్ –రమణాచారి, సుడా వైస్ చైర్మన్ (19ఎస్డీపీ12) జీఓ 234 ప్రకారం రాష్ట్రంలోనే తొలి సారిగా అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం. వేలంపాట ద్వారా ప్లాటు దక్కించుకున్న వారు వారంరోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలి. మిగతా డబ్బులు 60 రోజుల్లో చెల్లించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విశాలమైన అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, పార్కుల వంటి సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తాం. -
దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ అభిప్రాయపడింది. ఏడాదికి 6-7 బిలియన్ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లతోపాటు రీట్స్ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇతర విభాగాలకూ రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్ఈ చైర్మన్(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. సరఫరా చైన్ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్ సప్లై చైన్ రంగంలో ఇండియా మార్కెట్ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్ ఎస్టేట్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన ) నగరాల ముందంజ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) 2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం! ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు 2023-24పై ఇండియా రేటింగ్స్ 2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022–23లో క్రమబద్ధమైన అప్డ్రెంట్లో ఉంది. టాప్ 8 రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్గేజ్ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది. అందుబాటు ధరలు.. అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
యువత‘రంగం’ రియల్ ఎస్టేట్.. సర్వేలో ఆసక్తికర అంశాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన పట్నాల నగేష్ వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల వ్యాపారంలో వచ్చిన లాభాలను స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యాపారిగా ప్రతి పైసాకు లెక్క వేసే తాను రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. ‘బ్యాంకు వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అందువల్లే వాటిలో పెట్టుబడి పెట్టడంలేదు. చాలా మంది స్టాక్ మార్కెట్ బాగుందంటున్నా, దానిపై నాకు అంతగా అవగాహన లేదు. అందుకే వచ్చిన లాభాలను స్థిరాస్థి రంగంలోనే పెడుతున్నా’ అని నగేష్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మేలని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కవులూరి ఆదిత్య అంటున్నారు. ‘గతంలో మా నాన్నగారు నా పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఈ మధ్యనే నాకు బాబు పుట్టాడు. నేనూ డిపాజిట్లు పెడతామని అనుకున్నా. పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్తే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుంటే వాటిపై రాబడి లేకపోగా నష్టపోతున్నామనిపించింది. అందుకే రిస్క్ ఉన్నా మా బాబు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రతి నెలా సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా’ అని వివరించారు. – సాక్షి, అమరావతి వీరిద్దరూ చెప్పింది వాస్తవమే. స్థిరాస్తి రంగం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకే నేటి యువత ప్రాధాన్యతనిస్తోంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దేశ యువత పెట్టుబడి తీరులో వచ్చిన స్పష్టమైన మార్పుకు ఇది నిదర్శనమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు రిస్క్ (నష్ట భయం) ఉండే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటి ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), అన్‌రాక్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో వివిధ ఆదాయ తరగతులకు చెందిన 5,500 మందిపై ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెలుగు చూశాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులు తగ్గాయని, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయని సర్వే తెలిపింది. ‘రియల్’నే నమ్ముతున్నారు యువత పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్‌దే అగ్రస్థానమని సర్వే వెల్లడించింది. 59 శాతం మంది రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. 28 శాతం మంది స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి చూపించారు. కోవిడ్ వచ్చిన సంవత్సరం 2020 జనవరి – జూన్ మధ్య రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య 48 శాతం ఉండగా, ఈ ఏడాది జనవరి – జూన్ మధ్య 11 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. అత్యధికంగా 33 శాతం మంది సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం స్థిరాస్తి కొంటున్నట్లు తెలిపారు. 22 శాతం మంది అత్యవసర సమయాల్లో స్థిరాస్తి అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. 17 శాతం మంది భవిష్యత్తులో వ్యాపారం మొదలు పెట్టడానికి ముందస్తుగా ఇన్వెస్ట్ చేస్తుంటే, 15 శాతం మంది రిటైర్మెంట్ తర్వాత అండగా ఉంటుందని భావిస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులు కోవిడ్ ఏడాదికి, ఈ ఏడాదికి 3 శాతం పెరిగి 25 శాతం నుంచి 28 శాతానికి చేరినట్లు తేలింది. ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు 18 శాతం నుంచి 7 శాతానికి పడిపోగా, బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 9 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. వడ్డీరేట్లు తగ్గి కనిష్ట స్థాయికి చేరడం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణంగా వెల్లడైంది. ఇప్పుడు మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాగే బంగారం ధరలు కూడా గరిష్ట స్థాయిలో ఉండటంతో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని సర్వేలో వెల్లడైంది. -
రియల్ రంగంలో హైదరాబాద్ టాప్
మాదాపూర్: రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో–2022ను ఆయన నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) ను ప్రారంభించినప్పటి నుంచి 5299 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని, అతి త్వరలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటామని చెప్పారు. నగరంలో నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండడంతో ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం అంతరించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రియల్ రంగంలో హైదరాబాద్ టాప్‌గా నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు, మ్యాండేట్ ఎండీ బిస్వజిత్ పట్నాయక్, రాంకీ ఎండీ నందకిషోర్, కాన్సెప్ట్ అంబెన్స్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్, క్రెడాయ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహీంద్రా లైఫ్‌స్పేస్ @ బిలియన్ డాలర్ల మార్కెట్
న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
రియల్టీ: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
కరోనాతో కుదేలైన దేశ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందా? రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని కూడా అధిగమించి పురోగమిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవునని చెప్పవచ్చు. అలాగే కాదని కూడా! ఏళ్లుగా ఆగిన నిర్మాణాలు మళ్లీ గాడిన పడటం శుభ సూచకమైతే కొత్త వెంచర్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడం, పూర్తయిన వాటిల్లోనూ అమ్మకాలు మందగతిన సాగుతూండటం ఇబ్బంది పెట్టే అంశం! అయితే కరోనా బారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావం కనిపిస్తోంది. కంచర్ల యాదగిరిరెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థ చురుకుదనానికి, పురోగతికి ప్రధాన సూచికల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. అది పురోగమిస్తోందంటే స్టీలు, సిమెంటు వంటి కీలక పరిశ్రమలూ వృద్ధి బాటలో ఉన్నట్టే. కూలీలు, మేస్త్రీలు, అనుబంధ వృత్తుల వారికి భారీగా ఉపాధి లభిస్తుంది కూడా. దేశం మొత్తమ్మీద సుమారు ఏడు కోట్ల మందికి రియల్ ఎస్టేట్ ఉపాధి కల్పిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రంగం ద్వారా 2018లో 7.6 కోట్ల మందికి ఉపాధి లభిస్తే తర్వాత క్రమేపీ తగ్గుదల నమోదైంది. 2019లో 6.21 కోట్లకు పరిమితమైంది. 2020లో కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో 21 లక్షల మందికి పని లేకుండా పోయింది. గతేడాది రియల్టీ ఉపాధి 5.37 కోట్లకు తగ్గింది! ఏడు నగరాలు, రూ.4.48 లక్షల కోట్లు! ఈ ఏడాది మే ఆఖరు నాటికి దేశం మొత్తమ్మీద ఏడు ప్రధాన నగరాల్లో 4.8 లక్షల యూనిట్ల నిర్మాణం స్తంభించిపోయి ఉంది. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లు. 2021 ఆగస్టు నుంచి ఈ మే దాకా దేశవ్యాప్తంగా 1.49 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో లక్షకు పైగా యూనిట్లు ఎన్సీఆర్, ముంబై మెట్రో రీజియన్లలోవే! 15,570 యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. అయ్యో హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో రియల్టీ పుంజుకుంటున్న సంకేతాలుంటే హైదరాబాద్‌లో మాత్రం అంత సానుకూల పరిస్థితులు లేకపోవడం విశేషం. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు హంగూఆర్భాటాలతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. ‘‘మేమెప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా రోజుకు సగటున పది నుంచి 12 ఫ్లాట్లు బుక్కయేవి. కానీ ఇప్పుడు వారమంతా కలిపి పది బుకింగులే గగనంగా ఉంది’’ అని నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎండీ అన్నారు. కొత్త ప్రాజెక్టు ప్రకటన ఇచ్చిన వెంటనే రోజుకు 25 నుంచి 30 బుకింగ్‌లు చేసే వాళ్లమని, ఇప్పుడు నెలంతా కలిపినా అన్ని చేయలేకపోతున్నామని మరో ప్రముఖ కంపెనీ వర్గాలు వాపోయాయి. మంచి శకునములే... గతేడాది చివరి వరకూ రెండు, మూడో దశల కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న భారత్ ఈ ఏడాదే కాస్త తెరిపిన పడింది. రియల్టీ రంగంలోనూ ఇదే ధోరణి కన్పిస్తోంది. 2014, అంతకుముందే మొదలై పలు కారణాలతో 5.17 కోట్ల యూనిట్ల (అపార్ట్మెంట్లు/విల్లాల) నిర్మాణాలు ఆగిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదు నెలల్లోనే వీటిల్లో 37 వేల యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మకాలకు సిద్ధమవడం మారిన పరిస్థితికి సూచికగా నిలుస్తోంది. పూర్తయిన యూనిట్లలో 45 శాతం (16,750) ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, పరిసరాల్లో 5,300, బెంగళూరులో 3,960 యూనిట్ల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్‌లో మాత్రం 11,450 పెండింగ్ యూనిట్లకు కేవలం 1,710 యూనిట్ల నిర్మాణమే పూర్తయింది. చెన్నైలో అతి తక్కువ పెండింగ్ యూనిట్లు (5,190) ఉండగా వాటిలోనూ 3,680 యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది జనవరి, మే మధ్య పూర్తయింది! ‘‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డెవలపర్లు పట్టుదలతో ఉన్నారు. ఇన్పుట్ ధరలు బాగా పెరిగినా, ఇతర ప్రతిబంధకాలున్నా గత ఐదు నెలల్లో వేల యూనిట్ల నిర్మాణం పూర్తవడం శుభ పరిణామం. మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించే లక్ష్యంతో 2019లో కేంద్రం రూ.25 వేల కోట్లతో మొదలు పెట్టిన ఫండ్, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సాయంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి’’ – ప్రశాంత్ ఠాకూర్, సీనియర్ డైరెక్టర్, హెడ్ రీసెర్చ్, అనరాక్ గ్రూప్ -
రియల్టీలో టెక్నాలజీకి డిమాండ్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇది ప్రాప్‌టెక్ సంస్థలకు అవకాశాలను విస్తృతం చేయనుంది. ఈ దృష్యా పెట్టుబడులకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. 2025 నాటికి ఈ కంపెనీల్లో వార్షిక పెట్టుబడులు బిలియన్ డాలర్లకు (రూ.7,700 కోట్లు) చేరుకోవచ్చని సీఐఐ, కొలియర్స్ సంస్థలు అంచనా వేశాయి. 2020లో ప్రాప్ టెక్నాలజీ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు 551 మిలియన్ డాలర్లు(రూ.4,242 కోట్లు)గా ఉన్నాయి. సీఐఐ, కొలియర్స సంయుక్తంగా ‘రియల్ ఎస్టేట్ 3.0: టెక్నాలజీ లెడ్ గ్రోత్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. కరోనా మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు దారితీసినట్టు తెలిపింది. ఈ టెక్నాలజీ సాయంతోనే ఉన్న చోట నుంచే రిమోట్‌గా పనిచేసేందుకు వీలు పడిందని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు.. ‘‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కరోనాకు పూర్వం వినియోగించారు. అయితే ఈ తరహా టెక్నాలజీల వినియోగం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టితో స్మార్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, వాయు నాణ్యతను ఆటోమేటెడ్‌గా ఉంచే సిస్టమ్స్ వినియోగం పెరిగినట్టు తెలిపింది. ఏఐ, వీఆర్, ఐవోటీ, బ్లాక్ చైన్ రియల్ ఎస్టేట్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ మరింత సమర్థవంతగా మారుతుందని పేర్కొంది. భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని టెక్నాలజీ మరింత పారదర్శకంగా మారుస్తుందని అంచనా వేసింది. ఆవిష్కరణలు ఘనం.. ప్రాపర్టీ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. ప్రణాళిక దగ్గర్నుంచి, డిజైన్, నిర్మాణంగ టెక్నిక్‌లు, వసతుల నిర్వహణ, పాపర్టీ నిర్వహణ వరకు అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినట్టు తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ప్రాప్‌టెక్ బాగా వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. కాకపోతే గోప్యత, డేటా భద్రత, కొనుగోలుదారులు, నిర్మాణదారులపై పడే వ్యయాలు, విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీల అమలుకు ఉన్న సవాళ్లుగా పేర్కొంది. ‘‘మాన్యువల్‌గా కార్మికులకు డిమాండ్ తగ్గడంతో కొందరికి ఉపాధి నష్టం కలగొచ్చు. అదే సమయంలో ప్రత్యేకమైన కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది’’అని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో టెక్నాలజీ వినియోగం వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఆస్తి విలువ పెరుగుతుందని రెలోయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అన్నారు. -
ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు నైట్ ఫ్రాంక్ నరెడ్కో సర్వేలో వెల్లడైంది. వచ్చే ఆరు నెలల కాలానికి సైతం బుల్లిష్‌గా ఉన్నట్టు డెవలపర్లు వెల్లడించారు. ఇళ్లకు, వాణిజ్య ప్రాజెక్టులకు డిమాండ్ బలంగా ఉండడంతో ప్రస్తుత, భవిష్యత్తు సెంటిమెంట్ ఇండెక్స్ నూతన రికార్డు స్థాయికి చేరినట్టు నైట్‌ఫ్రాంక్–నరెడ్కో విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్’ తెలియజేసింది. ప్రస్తుత సెంటిమెంట్ (డెవలపర్ల వైఖరి) నూతన గరిష్ట స్థాయి 68కి చేరుకోవడం డెవలపర్లు వారి ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలియజేస్తోందని ఈ సర్వే నివేదిక తెలిపింది. భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు కూడా రికార్డు స్థాయిలో 75కు చేరింది. వచ్చే ఆరు నెలల కాలానికి కూడా డెవలపర్లు, ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 50కు పైన స్కోరును ఆశావాదంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థంగా, 50కు దిగువన నిరాశావాదంగా పరిగణిస్తారు. రానున్న రోజుల్లో మరింత జోరు ‘‘ప్రస్తుత సెంటిమెంట్ స్కోరు 2021 నాలుగో త్రైమాసికంలో 65గా ఉంటే, 2022 మొదటి మూడు నెలల్లో 68కి పెరిగింది. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ మంది భాగస్వాములకు గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో సానుకూలంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూడో విడతను అధిగమించింది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి ప్రభావాలేవీ రియల్ ఎస్టేట్ మీద చూపించలేదు’’అని ఈ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తుతో స్తబ్దుగా మారిన వాణిజ్య రియల్ ఎస్టేట్ కూడా వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది. కరోనా ప్రొటోకాల్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసినందున రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ మంచి జోరు చూపించొచ్చని నివేదిక అంచనా వేసింది. ‘‘నివాస గృహాల మార్కెట్లో వృద్ధి ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ రంగం అంతటా సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. చాలా కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బజాజ్ తెలిపారు. -
రియల్టీలోకి తగ్గిన పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల రాక తగ్గింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు (రూ.32,000 కోట్లు) పెట్టుబడులుగా వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో పీఈ పెట్టుబడులు 6.3బిలియన్ డాలర్లతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. ఈ మేరకు అనరాక్ క్యాపిటల్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2019–20లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు 5.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2018–19లో రూ.5.6 బిలియన్ డాలర్లు, 2017–18లో 5.4 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. కరోనా రెండో విడత వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో పీఈ పెట్టుబడులు తగ్గడానికి కారణమని ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ టీకాలను విస్తృతం గా ఇవ్వడానికితోడు, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతో రియల్టీలోకి పీఈ పెట్టుబడుల రాక పుంజుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోకి ఎక్కువ.. ‘‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మొత్తం పీఈ పెట్టుబడుల్లో 80 శాతం ఈక్విటీయే. 2021–22లో అత్యధికంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ పరిశ్రమ పీఈ పెట్టుబడులను ఆకర్షించింది. 38 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోకే వెళ్లాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 22 శాతం, నివాస గృహ ప్రాజెక్టులు 14 శాతం చొప్పున పెట్టుబడులు ఆకర్షించాయి. దేశీయ ఫండ్స్ పెట్టుబడులు 2020–21లో 290 మిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021–22లో 600 మిలియన్ డాలర్లకు పెరిగాయి. కరోనా ఇబ్బందుల తర్వాత నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ఫండ్స్ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి’’అని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. -
ఒకప్పుడు మాదాపూర్.. ఇప్పుడంతా నల్లగండ్ల వైపే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కరోనా మహమ్మారి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే కుదుటపడ్డట్టే కనిపిస్తుంది. కేసుల సంఖ్య తగ్గిపోవటం, వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో ప్రజలలో నమ్మకం పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు మార్కెట్లోకి తిరిగి వస్తున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే ధరలు స్థిరంగానే ఉండటంతో సమీప భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడటం ఖాయమని వెర్టెక్స్ ఎండీ వీవీఆర్ వర్మ అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలోనూ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో భవిష్యత్తులో నివాస విభాగానికి గణనీయమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు. మారిన అభిరుచులు కరోనా తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. విలాస, విశాలమైన అపార్ట్మెంట్లు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లతో పాటూ కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తుండటం, మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానంలో ఉండటంతో గృహ కొనుగోలుదారులు హోమ్ ఆఫీస్ వసతులు ఉన్న ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటూ సూపర్ స్టోర్, ఫార్మసీ, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఉన్న ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భిన్న ప్రాధాన్యతలు గృహ ఎంపికలో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు విభిన్నంగా ఉన్నాయి. కొంత మంది ఇంటికి చేరువలోనే ఆఫీసు, స్కూల్, ఆసుపత్రులు, మార్కెట్ వంటివి ఉండాలని కోరుకుంటుంటే... మరికొంత మంది రద్దీ జీవనానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాలు విద్యా సంస్థలు, పని ప్రదేశాలతో అనుసంధానించబడి ఉండాలని కోరుకుంటున్నారు. మధ్య తరహా గృహాలతో పాటూ అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నల్లగండ్ల, తెల్లాపూర్.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలోని ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్ వంటి ఏరియాలో పరిమిత స్థాయిలో స్థలాల లభ్యత కారణంగా కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాలు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్‌లో సరికొత్త నివాస కేంద్రాలుగా అవతరించాయి. కొంపల్లి, ఈసీఐఎల్ వంటి ఏరియాలు కూడా నివాస సముదాయ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. -
‘రియల్’ ఒప్పందాల స్టాంప్ డ్యూటీపై మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే అభివృద్ధి, విక్రయ–జీపీఏ ఒప్పందాలకు కట్టే స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అంశాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 మెమోలు జారీ చేశారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూ యాజమాని, డెవలపర్ మధ్య జరిగే ఒప్పందాలు, నిర్మాణం తర్వాత విక్రయ–జీపీఏ (సేల్ కం జీపీఏ అగ్రిమెంట్లు)ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ కట్టించుకునే విషయంలో చాలాకాలం నుంచి కొన్ని అనుమానాలు, అస్పష్టతలు ఉన్న విషయం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిష్కరించేందుకు పలు ఆదేశాలిచ్చారు. -
ఆన్లైన్ సేల్స్ అదరహో!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53% మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65% మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుం టే.. 68% మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. -
‘రియల్’ రంగంలో నయా ట్రెండ్
సాక్షి, అమరావతి: ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటి వరకు 2 బీహెచ్‌కే (రెండు బెడ్ రూములు, కిచెన్)3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల స్థానంలో కొత్తగా అరగది వచ్చి చేరింది. ఇప్పుడు కొత్తగా 2.5 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు కావాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. కోవిడ్ తర్వాత కొనుగోలుదారులు పిల్లల ఆన్లైన్ క్లాసులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్ కావాలని అడుగుతుండటంతో దీనికి అనుగుణంగా బిల్డర్లు ప్రత్యేకంగా ఒక అర గదిని కూడా నిర్మిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ స్టడీ రూమ్ కాన్సెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పుడే ప్రవేశించిందని బిల్డర్లు చెబుతున్నారు. స్టడీ రూమ్ కాన్సెప్ట్‌కు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు విశాఖలో పలువురు బిల్డర్లు 2.5 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. కోవిడ్ తర్వాత విశాఖ, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో మార్కెట్ ఇంకా పుంజుకోవాల్సి ఉందని తెలిపారు. నగర శివార్ల వైపు చూపు.. నగరంలో విశాలమైన ఇంటిని తీసుకోవడానికి బడ్జెట్ సరిపోకపోవడంతో కొనుగోలుదారులు దృష్టి నగర శివార్ల వైపు మళ్లుతోంది. దీంతో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి పట్టణ శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అన్ని వస్తువులు ఆన్లైన్లో లభిస్తుండటంతో కొనుగోలుదారులు తక్కువ బడ్జెట్లో విశాలమైన ఇంటి కోసం నగర శివార్ల వైపునకు చూస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. విశాఖలో ఒక చదరపు అడుగు అపార్ట్మెంట్ ధర రూ.7,000 –10,000 వరకు ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ వంటి చోట్ల రూ.4,000–5,000 వరకు ధర పలుకుతోంది. అచ్యుతాపురం, పరవాడ, అగనంపూడి, ఆనందపురం, తగరపువలస వంటి శివారు ప్రాంతాలకు వెళితే చదరపు అడుగు రూ.4,000 లోపే దొరుకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు విశాఖ క్రెడాయ్ చైర్మన్ బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలో అయితే పోరంకి, తాడిగడప, గొల్లపూడి, కుంచనపల్లి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయని బిల్డర్లు పేర్కొంటున్నారు. గృహ రుణాల వడ్డీ రేట్లు కారు చౌకగా ఉండటం కూడా కొనుగోళ్లకు ఊతమిస్తోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. -
ఇళ్లకు డిమాండ్ కల్పించండి
కేంద్ర బడ్జెట్ 2021–22లో ఇళ్లకు డిమాండ్ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనానికి తోడు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలను ఫిబ్రవరి 1న బడ్జెట్లో భాగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా వడ్డీ రాయితీని కొనసాగించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మౌలికరంగ హోదా కల్పించాలని, ఈ రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయాలంటూ క్రెడాయ్ బెంగాల్ శాఖా పలు డిమాండ్లు వినిపించింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వినియోగించే సిమెంట్ తదితర ముడి సరుకుల కోసం చెల్లించిన జీఎస్టీని అద్దె ఆదాయంలో సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. దీనివల్ల ద్వంద్వ పన్నులను నిరోధించడంతోపాటు.. దేశంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్‌ను పెంచినట్టు అవుతుందంటూ పారిశ్రామిక మండలి సీఐఐ సైతం కేంద్రానికి సూచించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రియల్ ఎసేŠట్ట్కు తిరస్కరించడం వల్ల డెవలపర్ల నిధులు బ్లాక్ (నిలిచిపోతాయని) అవుతాయని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ప్రాజెక్టుల పూర్తికి గాను రూ.25,000 కోట్ల నిధుల సాయాన్ని (స్ట్రెస్డ్ ఫండ్) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఫర్ చేసిన విషయం గమనార్హం. అలాగే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 43(సీఏ) కింద రిజిస్ట్రేషన్, ఒప్పంద విలువ (సర్కిల్)ల మధ్య అంతరాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 2021 జూన్ 30 వరకు ఇవి అమలు కానున్నాయి. మద్దతుగా నిలవాలి.. ‘‘మానవ చరిత్రలోనే 2020 ఎంతో అసాధారణమైనది. సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వాటాను అందిస్తున్న రియల్ ఎస్టేట్‌కు రంగాన్ని మరింత పెంచి పోషించాల్సి ఉంది. దాంతో వచ్చే పదేళ్లలో ఈ రంగం పెద్ద ఎత్తున దూసుకుపోతుంది’’ అంటూ క్రెడాయ్ పశ్చిమబెంగాల్ శాఖ ప్రెసిడెంట్ సుశీల్ మెహతా పేర్కొన్నారు. చౌక గృహ రుణంపై చెల్లిస్తున్న వడ్డీలో వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా, దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలి. ఇంటి రుణంలో అసలుకు చెల్లించే మొత్తాలను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చూపించుకునేందుకు అనుమతిస్తుండగా.. ఇలా సెక్షన్ 80సీ కింద కాకుండా ప్రత్యేకంగా రూ. 1.5లక్షలపై పన్ను ఆదాకు అవకాశమివ్వాలి. వాహనాల విలువ క్షీణతపై ప్రయోజనాలు కావాలి ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ వాహనాల వినియోగంతో తరిగిపోయే విలువపై పన్ను ప్రయోజనాలు కల్పించాలంటూ ఆటోమొబైల్ పరిశ్రమ కేందాన్ని కోరింది. మరో వారంలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు వాహనాల తరిగే విలువను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేసింది. వాహన డీలర్లు వార్షికంగా 0.1 శాతం టీసీఎస్ (మూలం వద్దే పన్ను వసూలు)ను పక్కన పెట్టడం అన్నది ఆర్థికంగా వాహన రిటైల్ పరిశ్రమపై ఎంతో భారాన్ని మోపుతుందంటూ, దీన్ని తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) కోరింది. ఖరీదైన కార్లవైపూ చూడాలి.. మరోవైపు.. ఖరీదైన కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, లంబోర్గిని బడ్జెట్లో లగ్జరీ వాహనాలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరాయి. అధిక పన్నుల కారణంగా ఖరీదైన కార్ల విభాగం వృద్ధి చెందలేకపోతున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ ఖరీదైన లగ్జరీ శ్రేణి కార్లపై పన్నులను తగ్గించడానికి బదులు పెంచే చర్యలకు వెళితే డిమాండ్‌ను దెబ్బతీయడమే కాకుండా, గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి కోలుకోకుండా చేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. -
కరోనా ఖేల్..‘రియల్’ కుదేల్
దేవేందర్ (నల్లగొండ) మూడేళ్ల క్రితం రియల్ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. మొదట్లో చిన్నాచితకా ప్లాట్లు అమ్మి కమీషన్ తీసుకొనేవాడు. ఏడాది కిందట ఇద్దరు మిత్రులతో కలిసి ఎకరంన్నర భూమికొని, రూ.2కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ శివార్లలో వెంచర్ వేశాడు. ఫిబ్రవరిలో ఒక రియల్టర్ రూ.3కోట్లకు గంపగుత్తగా అమ్మాలని అడిగాడు. కానీ ఇంకా రేటొస్తుందన్న ఆశతో అమ్మలేదు. ఇప్పుడు కరోనా వారి ఆశల్ని వమ్ముచేసింది. అప్పులు, పెట్టుబడిలో సగానికే అమ్ముతామన్నా కొనేవారు లేరు. వెంచర్ వెక్కిరిస్తోంది. అప్పుపై వడ్డీ పెరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆరు నెలల క్రితం రూ.300 కోట్లతో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. భారీగా ప్రచారం చేసింది. మార్చి వరకు సగానికిపైగా విల్లాలకు బుకింగ్స్ వచ్చాయి. మిగిలిన సగం విల్లాల కోసం తక్కువ ధరకు కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దాదాపు మూలనపడింది. పెట్టుబడి పెట్టిన సంస్థతో పాటు విల్లాలు బుక్‌చేసిన వారు సందిగ్ధంలో పడ్డారు. చదవండి: ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు రాష్ట్రంలోని వేలాది రియల్ ప్రాజెక్టుల భవితవ్యం డోలాయమానంలో పడింది. లాక్డౌన్ ఎత్తివేశాక కూడా రియల్‌బూమ్ పుంజుకుంటుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా వైరస్ ’రియల్’రంగాన్ని కుదేలుచేసింది. 11ఏళ్ల క్రితం ఏర్పడిన సంక్షోభాన్ని గుర్తుకుతెస్తోంది. కరోనా ప్రభావం లేకముందు రాష్ట్రంలో ఎకరా కోట్ల రూపాయలు పలికిన భూమి ఇప్పుడు పదింతలు తగ్గించి అమ్ముతామన్నా కొనే నాథుడే లేడు. హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వెలసిన వెంచర్లు, బడా కమ్యూనిటీ ప్రాజెక్టులు, విల్లాల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన బడా రియల్టర్లు, అప్పులు తెచ్చి లాభార్జన కోసం ఈ వ్యాపారంలోకి దిగిన మధ్యతరగతి వర్గాలు, ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మందికి భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఇప్పట్లో ఈ రంగం గాడినపడే అవకాశం లేకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలోపడ్డారు. అసలే మాంద్యం.. ఆపై కరోనా పిడుగు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గతేడాది జూన్ నుంచే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం 2019లోనే 30శాతం మేర ఈ వ్యాపారంపై ప్రభావం చూపడంతో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. ప్రముఖ సంస్థల అధ్యయనం ప్రకారం 2019లో రెసిడెన్షియల్ రంగం కూడా దెబ్బతింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలు 20శాతం పడిపోయాయి. చదవండి: కరోనా రహితంగా11 జిల్లాలు హైదరాబాద్‌లో అయితే నిర్మాణంలో ఉన్న వేలాది గృహ యూనిట్లు అమ్ముడుపోలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఎంతగా అంటే రాష్ట్రంలో ప్రతి నెలా రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.500కోట్ల ఆదాయం వచ్చేది. నెలకు 1.5లక్షల వరకు లావాదేవీలు జరిగేవి. ఈ మొత్తం లావాదేవీల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలే 75 శాతం ఉండేవి. కానీ మార్చి 22, జనతా కర్ఫ్యూ తర్వాత ఇవన్నీ స్తంభించిపోయాయి. నెలలో కనీసం వెయ్యి లావాదేవీలు కూడా జరగలేదు. ఇప్పుడు రియల్ రంగం కుదేలు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖకు పనిలేకుండా పోయిందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. 2008లో కుప్పకూలి.. 2015లో నిలబడి.. 2008లో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. నాటి పరిస్థితులు కరోనా వైరస్లాగా కుదేలు చేయకపోయినా ఓ రకంగా నష్టాల్లోకి నెట్టాయి. వాస్తవానికి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 90వ దశకం ద్వితీయార్థం నుంచే ప్రారంభమైంది. క్రమంగా విస్తరిస్తూ 2004 నుంచి భారీగా పుంజుకుని 2008 నాటికి ఉచ్ఛస్థితికి చేరుకుంది. అయితే అప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో రియల్ రంగం నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఇందుకు ప్రధాన కారణం వెల్లువలా ఈ రంగంలోకి వచ్చిన పెట్టుబడులు, పెరిగిన అంచనాలు మాత్రమే. దాదాపు ఏడేళ్ల పాటు ఒడిదుడుకులు ఎదుర్కొని తిరిగి 2015 నాటికి కోలుకుంది. అటు తరువాత ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. ఏటా 90లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ నిర్మాణాలు జరుగుతుంటాయి. గత మూడేళ్లలో 25లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టిన పలు రియల్ సంస్థలు వాటిని లీజుకు ఇచ్చేశాయి కూడా. దీంతో నగరంలో లక్షల మందికి ఉపాధి లభించింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, రాయదుర్గం, గోపనపల్లి, నార్సింగి లాంటి ప్రాంతాల్లో రియల్ దూకుడు పెరిగింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ శివార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఈ రంగం భారీగా పుంజుకుంది. వేల కోట్ల రూపాయలు చేతులు మారడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా ఈ వ్యాపారం పాకింది. నాలుగైదేళ్లుగా దాదాపు రాష్ట్రమంతా రియల్ వ్యాపారం మూడు వెంచర్లు, ఆరు ఫ్లాట్లుగా విలసిల్లింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. చదవండి: లాక్డౌన్ కచ్చితంగా పొడిగిస్తాం అక్టోబరు నాటికి బూమ్.. కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలైంది. తేరుకోవడానికి సమయం పడుతుంది. ఇప్పటికే బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అక్టోబరు నాటికి మళ్లీ బూమ్ వస్తుంది. – వీవీఎల్ శేఖర్, ఎండీ– శ్రీ సీఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ చిన్న వెంచర్లకు మార్కెట్ ఉండదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు ప్లాట్ కొనలేడు. సంపన్నులకు ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. అయితే చిన్న వెంచర్లు వేసేవారికి ఇబ్బందే. మార్కెట్ ఉండదు. మరో ఏడాదిపాటు ఇబ్బందులు తప్పవు. – కె.నానాజి (రియల్టర్) ఆరేడు నెలలు ఇంతే.. ఇప్పుడు కూలీలెవరూ లేరు. నిర్మాణ పనులు జరగట్లేదు. లాక్డౌన్ ఎత్తివేశాక మళ్లీ రియల్ రంగం ఊపందుకుంటుది. చిన్న సెగ్మెంట్లలో కొంత గజిబిజి ఉంటుంది. కానీ ప్రైమ్ ప్రాజెక్టులు కరోనా తర్వాత కూడా ఇబ్బంది పడవనేది నా అభిప్రాయం. – కె.మధుసూదన్‌రెడ్డి, ఎండీ, డ్వెల్టన్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వాల ప్రోత్సాహం చాలా అవసరం ప్రపంచంలోని అన్ని రంగాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్లాలి. ఎవరైనా మే 7వరకు వేచి ఉండాల్సిందే. ఆ తరవాత 3 – 4 వారాల్లో అన్ని పనులు ప్రారంభమవుతాయి. అప్పటివరకు ప్రాజెక్టులు కొంత జాప్యమవుతాయి. ఇప్పటికే రెరా లాంటి సంస్థలు కొన్ని విషయాల్లో డెడ్‌లైన్ గడువు పొడిగించాయి. లాక్డౌన్ ఎత్తివేసిన 3 నెలల్లో రియల్ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఈ రంగం కోలుకోవాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం చాలా అవసరం. రుణాలు ఇవ్వడం, వడ్డీలు తగ్గించడం వంటి పాజిటివ్ నిర్ణయాలు ఈ రంగానికి టానిక్‌లా పనిచేస్తాయి. – సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, కన్వీనర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్యానెల్, సీఐఐ, తెలంగాణ -
రుణం తగ్గింది.. రుణ పరపతి పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైంది కాదని, ఒడిదుడుకులు సర్వసాధారణమని మరోమారు వెల్లడైంది. అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన ఇండియా సంచిక లో వెల్లడించిన వివరాల ప్రకారం గత ఐదేళ్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి అప్పులివ్వడం తగ్గిపోయింది. అయితే, రుణ మొత్తం తగ్గి నా రుణ పరపతి పెరిగిందని, ఈ మొత్తంలో 100 శాతం వృద్ధి కనిపించిందని ఆ లెక్కలు చె బుతున్నాయి. 2015 నుంచి యేటా పెద్ద మొ త్తంలో రుణాలు తీసుకుంటున్న యూనిట్ల సం ఖ్య తగ్గిపోతోందని, దీంతో పరపతి పెరుగుతోందని, అంటే దేశంలో నానాటికీ భారీ వెంచ ర్లు పెరిగిపోతున్నాయని అర్థమవుతోంది. గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే..: గత ఐదేళ్లలో దేశంలోని రియల్ సంస్థలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను ఫోర్బ్స్ వెల్లడించింది. దీని ప్రకారం ఏటా రుణాలు పెరగ్గా.. 2019లో మాత్రం తగ్గిపోయా యి. 2015 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1,506 రియల్ఎస్టేట్ యూనిట్లకు 1.48 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. అంటే ప్రతి యూనిట్‌కు కనీసం రూ.98 కోట్ల పెట్టుబడిని రుణాల ద్వారా సమీకరించారన్నమాట. అదే 2016, 2017, 2018లో రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య వరుసగా తగ్గిపోగా, రుణ మొత్తం మాత్రం ఏటేటా పెరిగిపోయింది. ఇక 2019లో కూడా రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య తగ్గిపోగా, 2015 తో పోలిస్తే రుణమొత్తం తగ్గిపోయింది. 2018తో పోలిస్తే ఈ రుణమొత్తం 33 శాతం తగ్గిపోయి 1.27 లక్షల కోట్లకే పరిమితమైంది. మూడోవంతు రుణమొత్తం తగ్గిపోయినా 2019లో రియల్ రుణపరపతి యూనిట్‌కు రూ.198 కోట్లకు ఎగబాకడం గమనార్హం. కరోనా దెబ్బకు కుదేలు కరోనా దెబ్బ దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంపై తీ వ్ర ప్రభావాన్ని చూపబోతోంది!. ఎన్రాక్ ప్రాపర్టీస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం..దేశవ్యాప్తంగా 2020 మొదటి త్రైమాసికంలో 45,200 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 42 శాతం,గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం తక్కువ. ఇందుకు కరోనానే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే, మొదటి త్రైమాసికం వ్యాపారంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే మార్కె ట్లే మొత్తం అమ్మకాల్లో 84 శాతం జరిపాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో 15.62 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇందులో సింహభాగం ఢిల్లీ, ముంబైలలోనేనని తెలిపింది. ఇప్పటికే ఈ నగరాల్లో పెం డింగ్ ప్రాజెక్టులు ఎక్కువయ్యాయని, మళ్లీ ఇక్కడే మిగులు కనిపించడం ఆందోళనకరమని ఈ సర్వేలో తేలింది.