సాక్షి, హైదరాబాద్: దేశంలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైంది కాదని, ఒడిదుడుకులు సర్వసాధారణమని మరోమారు వెల్లడైంది. అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన ఇండియా సంచిక లో వెల్లడించిన వివరాల ప్రకారం గత ఐదేళ్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి అప్పులివ్వడం తగ్గిపోయింది. అయితే, రుణ మొత్తం తగ్గి నా రుణ పరపతి పెరిగిందని, ఈ మొత్తంలో 100 శాతం వృద్ధి కనిపించిందని ఆ లెక్కలు చె బుతున్నాయి. 2015 నుంచి యేటా పెద్ద మొ త్తంలో రుణాలు తీసుకుంటున్న యూనిట్ల సం ఖ్య తగ్గిపోతోందని, దీంతో పరపతి పెరుగుతోందని, అంటే దేశంలో నానాటికీ భారీ వెంచ ర్లు పెరిగిపోతున్నాయని అర్థమవుతోంది.
గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే..: గత ఐదేళ్లలో దేశంలోని రియల్ సంస్థలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను ఫోర్బ్స్ వెల్లడించింది. దీని ప్రకారం ఏటా రుణాలు పెరగ్గా.. 2019లో మాత్రం తగ్గిపోయా యి. 2015 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1,506 రియల్‌ఎస్టేట్ యూనిట్లకు 1.48 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. అంటే ప్రతి యూనిట్‌కు కనీసం రూ.98 కోట్ల పెట్టుబడిని రుణాల ద్వారా సమీకరించారన్నమాట. అదే 2016, 2017, 2018లో రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య వరుసగా తగ్గిపోగా, రుణ మొత్తం మాత్రం ఏటేటా పెరిగిపోయింది. ఇక 2019లో కూడా రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య తగ్గిపోగా, 2015 తో పోలిస్తే రుణమొత్తం తగ్గిపోయింది. 2018తో పోలిస్తే ఈ రుణమొత్తం 33 శాతం తగ్గిపోయి 1.27 లక్షల కోట్లకే పరిమితమైంది. మూడోవంతు రుణమొత్తం తగ్గిపోయినా 2019లో రియల్ రుణపరపతి యూనిట్‌కు రూ.198 కోట్లకు ఎగబాకడం గమనార్హం.
కరోనా దెబ్బకు కుదేలు
కరోనా దెబ్బ దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంపై తీ వ్ర ప్రభావాన్ని చూపబోతోంది!. ఎన్‌రాక్ ప్రాపర్టీస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం..దేశవ్యాప్తంగా 2020 మొదటి త్రైమాసికంలో 45,200 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 42 శాతం,గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం తక్కువ. ఇందుకు కరోనానే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే, మొదటి త్రైమాసికం వ్యాపారంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే మార్కె ట్లే మొత్తం అమ్మకాల్లో 84 శాతం జరిపాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో 15.62 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇందులో సింహభాగం ఢిల్లీ, ముంబైలలోనేనని తెలిపింది. ఇప్పటికే ఈ నగరాల్లో పెం డింగ్ ప్రాజెక్టులు ఎక్కువయ్యాయని, మళ్లీ ఇక్కడే మిగులు కనిపించడం ఆందోళనకరమని ఈ సర్వేలో తేలింది.
రుణం తగ్గింది.. రుణ పరపతి పెరిగింది!
Published Sun, Apr 19 2020 1:38 AM | Last Updated on Sun, Apr 19 2020 8:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment