‘మేక్ ఇన్ ఇండియా’కి పదేళ్లు
ఈ దిశగా గొప్ప విజయం సాధించాం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ/సిడ్నీ: భారత్‌లో తయారీ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు 2014 సెపె్టంబర్ 25న ప్రారంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతోపాటు. తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
వ్యాపార సులభతర నిర్వహణ, అవినీతిని ఉపేక్షించకపోవడం, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాలపై దృష్టి సారించడం ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) విజయవంతం అయ్యేలా చేసినట్టు ప్రకటించారు. ఇది దేశంలో స్థానిక, విదేశీ పెట్టుబడులు ఇతోధికం కావడానికి సాయపడినట్టు చెప్పారు. భారీ పెట్టుబడుల ప్రణాళికలను చూస్తున్నామంటూ.. వీటి రాకతో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ పాత్ర మరింత పెరుగుతుందని సిడ్నీ పర్యటనలో ఉన్న గోయల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితం..
స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల సెంటిమెంట్ బలహీనంగా ఉన్న తరుణంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు చేపట్టినట్టు మంత్రి గోయల్ గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట కొంత క్షీణించింది. బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొనేవారు. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పొందేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. ఒకటే దేశం ఒకటే పన్ను – జీఎస్‌టీ, ఐబీసీ, పారదర్శకంగా గనుల వేలం తదితర ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసేపేత నిర్ణయాలతో అది సాధ్యపడింది’’అని మంత్రి గోయల్ వివరించారు.
స్థిరమైన, స్పష్టమైన విధానాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడేలా చేసినట్టు చెప్పారు. ఈ చర్యలతో వ్యాపార సులభతర నిర్వహణలో భారత్ స్థానం 14 స్థానాలు మెరుగుపడి 190 దేశాల్లో 63కు చేరినట్టు తెలిపారు. 2020లో పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించి, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత నాటి చర్యల ఫలితాలను చూస్తున్నాం. భవిష్యత్‌పై ఉత్సాహంతో ఉన్నాం. మొబైల్స్ తయారీలో ఎంతో పురోగతి సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్స్ తయారీ కేంద్రంగా ఉన్నాం’’అని వివరించారు. టెక్స్‌టైల్స్, సిరామిక్స్, ఆట»ొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో దేశీ సామర్థ్యాలు నుమడించాయన్నారు.
దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా సాయపడినట్టు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్‌సీ సంక్షోభాల్లోనూ దేశ జీడీపీలో తయారీ రంగం వాటా యాథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్పారు.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణ
అంతరిక్షం, బొగ్గు తవ్వకం, ఈ–కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీ ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇందులో 90 శాతం ఆటోమేటిక్ మార్గంలోనే వచి్చందన్నారు.
ఆర్‌బీఐ దృష్టికి రియల్టర్ల నిధుల సమస్యలు
రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళతానని మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో (మున్సిపాలిటీలు) మాట్లాడతానని భరోసా ఇచ్చారు. రెరా చట్టం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచి్చనట్టు చెప్పారు. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల పరంగా వాటా.. ఇలా రియల్ ఎస్టేట్ రంగం గొప్ప పాత్ర పోషిస్తోందని మంత్రి మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment