రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు | Win Rs 10,000 Daily Rs 50,000 Weekly Mumbai Railway Turns Train Tickets into Lottery for Better Compliance | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు

May 8 2025 2:49 PM | Updated on May 8 2025 3:21 PM

Win Rs 10,000 Daily Rs 50,000 Weekly Mumbai Railway Turns Train Tickets into Lottery for Better Compliance

టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్‌సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.

ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.

టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్‌లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.

ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్‌లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్‌ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.

ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement