prize money
-
రూ. 12 కోట్లు ఇస్తున్నారు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది. 2024 సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు హెచ్ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. » మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్రాజ్ సింగ్ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను అందజేస్తారు. » ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్జీత్ సింగ్ అవార్డును... ‘డిఫెండర్ ఆఫ్ ద ఇయర్’కు పర్గత్ సింగ్ అవార్డు, ‘మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’కు అజిత్‌పాల్ సింగ్ అవార్డును... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’కు ధన్‌రాజ్ పిళ్లై అవార్డును బహూకరిస్తారు. » భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ (1975) టైటిల్ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్ జట్లతో పాటు జూనియర్ ఆసియాకప్ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు. » బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైరైన పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ పాఠక్‌లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు. » డిఫెండర్ అవార్డు కోసం సంజయ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు. » మిడ్‌ఫీల్డర్ అవార్డు కోసం జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్ నామినేట్ అయ్యారు. » ఫార్వర్డ్ అవార్డు కోసం లాల్రెమ్సియామి, అభిషేక్, సుఖ్జీత్, నవ్‌నీత్ కౌర్ బరిలో ఉన్నారు. æ అండర్–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్‌డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు. »అండర్–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్ పురస్కారం కోసం అర్‡్షదీప్ సింగ్, అమిర్ అలీ, శర్దానంద్ తివారి, అరిజీత్ సింగ్ బరిలో ఉన్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్‌కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.విజేతకు భారీ ప్రైజ్మనీఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.సెమీఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్‌మనీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్ట్‌లకు కూడా భారీ ప్రైజ్‌మనీ లభించనుంది. సెమీస్‌లో ఓడిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది.ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు రూ. 3.04 కోట్లు ($3,50,000) లభిస్తాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సుమారు రూ. 1.22 కోట్లు ($1,40,000) లభిస్తాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు రూ. 60 కోట్లు ($6.9 మిలియన్లు) కేటాయించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.అజేయ భారత్ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.రెండోసారిఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ సాధించిన రెండో టైటిల్ కూడా భారత్‌పైనే (ఫైనల్స్) కావడం గమనార్హం. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు. -
Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఈమెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి.ఇక ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శుక్రవారం వెల్లడించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ఖరారు చేసింది. చివరగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 53 శాతం అధికం కావడం గమనార్హం.విజేతకు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 2.24 మిలియర్ డాలర్లు (సుమారు రూ. 20 కోట్లు) నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా రన్నరప్‌కు 1.12 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 12 కోట్లు), సెమీ ఫైనలిస్ట్‌లు ఒక్కొక్కరికి 560,000 డాలర్లు(సుమారు రూ.5 కోట్లు) లభించనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్‌లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్‌మనీ కేటాయించింది.గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు(సుమారు. 3 కోట్లు) అందనుంది. అదేవిధంగా ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1. 2 కోట్లు) దక్కించుకోనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్? -
గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డీ గుకేశ్‌కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్‌లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.ఐపీఎల్ వేలంలో కూడా..ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట. -
ఒక్కొక్కరికి రూ. 1 కోటీ 30 లక్షలు!
ప్రపంచ క్రికెట్లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్‌కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం! చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’ -
పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీ
దుబాయ్: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్‌కప్ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్ చాంపియన్‌కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్ కప్ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. గత ప్రపంచకప్ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి. ‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. -
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
యూరో కప్ విజేతగా స్పెయిన్.. ప్రైజ్ మనీ ఎన్ని వందల కోట్లంటే?
దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్-2024కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది.ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?యూరో కప్ విజేత స్పెయిన్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంతంటే?రన్నరప్ ఇంగ్లండ్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది. గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్ 16 మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర. గోల్డెన్ బూట్ విజేతలు వీరే..యూరో కప్-2024 గోల్డన్ బూట్ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్ చేసి సంయుక్తంగా గోల్డన్ బూట్ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్ ఫిల్డర్ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు. -
టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024కు శుభం కార్డ్ పడింది. జూన్ 29(శనివారం) భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోరులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండో సారి జగజ్జేతగా నిలిచింది. దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.టీ20 వరల్డ్‌కప్ విజేతకు ఎన్ని కోట్లంటే?టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది. సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు దక్కాయి. అదే విధంగా సూపర్-8కు చేరుకున్న మొత్తం 8 జట్లకు రూ.3.17 కోట్లు ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు అందనున్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల నగదు బహుమతి లభించనుంది. -
భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. ఎన్ని కోట్లంటే?
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 మిలియన్ల పౌండ్ల(రూ.534 కోట్లు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) గురువారం ప్రకటించింది. అదేవిధంగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒక్కో విజేతకు 2.7 మిలియన్ల పౌండ్లు (సుమారు రూ.29.60 కోట్లు) దక్కనున్నాయి. 2023లో ఫ్రైజ్‌మనీతో పోలిస్తే ప్రస్తుతం ప్రైజ్‌మనీ విలువ 11.9శాతం అదనం. టోర్నీ ఫస్ట్ రౌండ్లో ఓడిన ఆటగాడికి 60 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది. -
International Cricket Council: టి20 ప్రపంచకప్ విజేతకు రూ.20.35 కోట్లు
న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్‌మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. సెమీఫైనల్స్‌తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి. -
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రైజ్‌మనీ: విజేతకు ఇన్ని కోట్లా..?
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 3) వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఈసారి రికార్డు స్థాయిలో భారీ పారితోషికం లభించనుంది. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది.టోర్నీ విజేతకు ప్రపంచకప్ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడే రెండు జట్లకు చెరి రూ. 6.54 కోట్లు.. సూపర్-8లో ఇంటిముఖం పట్టే నాలుగు జట్లకు రూ. 3.17 కోట్లు.. 9, 10, 11, 12 స్థానల్లో నిలిచే జట్లకు రూ. 2.5 కోట్లు.. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచే జట్లకు తలో రూ. 1.87 కోట్లు లభించనున్నాయి.ఇదే కాకుండా టోర్నీలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు ఆయా జట్టుకు రూ. 25.8 లక్షల రూపాయలు లభించనున్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఈస్థాయిలో పారితోషికం గతంలో ఎన్నడూ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. 28 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల్లో మొత్తం తొమ్మిది వేదికల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇదో భారీ టోర్నీ. -
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కేకేఆర్.. ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్కు రూ.13 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్‌కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్‌కు చెరో రూ. 10లక్షల ప్రైజ్‌మనీ లభించింది.⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో16 మ్యాచ్‌లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. తుది పోరులో మాత్రం ఆసీస్ జోరు ముందు చిత్తు అయింది. ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై భారత పతాకాన్ని రెపాలపాడాలంచాలనకున్న రోహిత్ సేన ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు వరల్డ్‌కప్‌ను తమ ఇంటిపేరుగా మార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఛాంపియన్స్, రన్నరప్ జట్లకు ఇచ్చే ఫ్రైజ్మనీపై ఓ లుక్కేద్దాం. విజేతకు ఎంతంటే? వన్డే వరల్డ్‌కప్ ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌మనీ రూపంలో 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 2 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం 16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు)చొప్పున అందింది. అదే విధంగా గ్రూపు దశ నుంచి వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్ డాలర్లు (82 లక్షల 92 వేల 950 రూపాయలు) చొప్పున లభించింది. అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి ఆయా జట్లకు 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి. చదవండి: CWC 2023: నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్ -
అలా వెళ్లి.. ఇలా రూ. 2.5 కోట్లు గెల్చుకున్నాడు
చండీగఢ్: ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా అనే ఆశతో లాటరీ టికెట్ కొంటూ ఉంటారు చాలామంది. ఆ తరువాత దానిసంగతి మర్చిపోతూ ఉంటారు కూడా. కానీ ఇలా లాటరీ కొన్నాడో లేదో అలా జాక్‌పాట్ వరించింది ఒక పెద్దాయన్ను. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్‌ని ఆ అదృష్టం వరించింది. ఇంట్లోని వారి కోసం మెడిసిన్ కొనడానికి దుకాణానికి వెళ్లాడు. స్తూ వస్తూ ఒక లాటరీ టికెట్ కూడా కొని జేబులో వేసుకున్నాడు. బహుశా అంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వస్తుందని అస్సలు ఊహించ ఉండడు. ఇలా ఇంటికి వెళ్లాడో లేదో రూ. 2.5 కోట్ల లాటరీని మొదటి బహుమతిగా గెల్చుకున్నారంటూ సమాచారం అందిందింది. టికెట్ కొన్న దాదాపు నాలుగు గంటల తర్వాత తనకు రూ. 2.5 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేది కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పాడు బోసి నవ్వులతో శీతల్ సింగ్. వ్యవసాయ పనులు చేసుకునే సింగ్ ఇద్దరు పిల్లల. వారు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, తాను పదిహేనేళ్ల నుంచి లాటరీ టికెట్లు వ్యాపారంలో ఉన్నానని లాటరీ టికెట్ల దుకాణదారుడు చెప్పాడు. ఇప్పటివరకు తన దగ్గర టికెట్లు కొన్నవారిలో ముగ్గురు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని తెలిపాడు. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఇంత తక్కువా..?
విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇటీవలికాలంలో ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రజాదరణ పెరిగిందనే చెప్పాలి. పాశ్యాత్య దేశాల్లో సైతం క్రికెట్‌కు విపరీతంగా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజ్ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం క్రికెట్‌కు అన్యాయమే జరుగుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ బాగా వెనుకపడి ఉంది. ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫుట్‌బాల్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్‌మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్ విన్నర్ (అర్జెంటీనా) ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలు (42 మిలియన్ యూఎస్ డాలర్లు) అయితే.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ విజేతకు 33 కోట్ల రూపాయలు (4 మిలియన్ యూఎస్ డాలర్లు) మాత్రమే దక్కుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో రెండు క్రీడల మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంతో క్రికెట్ అభిమానులు బాగా ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంత డబ్బు సంపాధిస్తున్నా క్రికెట్‌పై ఎందుకు ఇంత చిన్నచూపు అని వారు ప్రశ్నిస్తున్నారు. అనాదిగా క్రికెట్‌పై ఈ వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధరణ విషయంలో ఫుట్బాలర్లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికందే పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. ఇకనైనా క్రికెటర్ల వ్యక్తిగత పారితోషికం, జట్టుకు అందే ప్రైజ్‌మనీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ మొత్తం 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుతుంది. ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 22) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఈసారి భారీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. మొత్తం ప్రైజ్‌మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. పై పేర్కొన్న మొత్తంలో వరల్డ్‌కప్ విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుతుంది. ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ అందనుండటం ఐసీసీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
ఆసియా ఛాంపియన్స్‌గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
ఆసియాకప్-2023 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. 8వ సారి ఆసియాకప్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంకను దెబ్బతీయగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇక ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్‌మనీ ఎంత? మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు ఎవరికి లభించిందో వంటి ఆసక్తికర విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే ? ఈ ఏడాది ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ లక్ష యాభై వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ1.24 కోట్లు) లభించింది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన లంకకు 75,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ.62 లక్షలు) నగదు బహుమతి దక్కింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. ఇందుకు గాను కుల్దీప్ 15,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ. 12 లక్షలు) ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో కుల్దీప్ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లో 6 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌కు అవార్డు దక్కింది. ఈ అవార్డు రూపంలో అతడికి రూ. 4లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అయితే సిరాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు వచ్చిన ప్రైజ్‌మనీని ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్‌మెన్‌కు కానుకగా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(302) ఉండగా.. వికెట్ల లిస్ట్‌లో శ్రీలంక పేసర్ మతీషా పతిరానా(11) నిలిచాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ -
గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 88.17 మీటర్ల అద్భుతమైన త్రో మెన్స్ జావెలిన్ త్రోలో బంగార పతకాన్నిసాధించి భారత్‌కు తొలిస్వర్ణాన్ని అందించి మరోసారి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా నీరజ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఈవెంట్లో 88.17 మీటర్ల త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో నిలిచి, గోల్డెన్ బోయ్‌గా మరోసారి తన ప్రత్యకతను నిరూపించుకున్నాడు నీరజ్ చోప్రా. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జెనా , డిపి మను వరుసగా 84.77 మీ 84.14 మీటర్ల త్రోతో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన WAC 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్లో 25 ఏళ్ల స్టార్ నీరజ్ తన సొంత రికార్డును తానే చెరిపేసి రజత పతకాన్ని స్వర్ణంగా మార్చుకున్నాడు. This is Neeraj Chopra, Olympic Gold Medalist. After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her. Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e — Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023 1. Pakistanis tweeting 10x about lack of facilities should have tweeted atleast once way before. 2. Arshad Nadeem had world class training in Germany just like Neeraj. 3. Enjoy Neeraj Chopra inviting Arshad under 🇮🇳 as he didn't have 🇵🇰#NeerajChoprapic.twitter.com/wqRxCACMIC — Johns (@JohnyBravo183) August 27, 2023 -
క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్‌ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్‌లలో టోర్నీ ప్రైజ్‌మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా -
జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2023 ప్రైజ్‌మనీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. జూలై 3 నుంచి 16 వరకు జరిగే ఈ టోరీ్నలో ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 24 కోట్ల 43 లక్షలు) చొప్పున లభిస్తాయి. గత ఏడాది సింగిల్స్ విజేతలకు 20 లక్షల పౌండ్లు చొప్పున అందజేశారు. ఈసారి 3 లక్షల 50 వేల పౌండ్లు ఎక్కువగా ఇవ్వనున్నారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిన క్రీడాకారులకు 55 వేల పౌండ్లు (రూ. 57 లక్షల 18 వేలు) దక్కుతాయి. క్వాలిఫయింగ్‌లో తొలి రౌండ్లో ఓడితే 12 వేల 750 పౌండ్లు (రూ. 13 లక్షల 25 వేలు), రెండో రౌండ్లో ఓడితే 21 వేల 750 పౌండ్లు (రూ. 22 లక్షల 61 వేలు), మూడో రౌండ్లో ఓడితే 36 వేల పౌండ్లు (రూ. 37 లక్షల 42 వేలు) లభిస్తాయి. మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కానుంది. జూలై 3 నుంచి 16 వరకు జరగనున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..
IPL 2023 Winner CSK: మహేంద్ర సింగ్ ధోని మంత్రజాలం ఐపీఎల్లో మరోసారి అద్భుతంగా పని చేసింది. తనకే సాధ్యమైనరీతిలో సాధారణ ఆటగాళ్లతోనే జట్టును నడిపించిన అతను ఐదో ట్రోఫీతో సగర్వంగా నిలిచాడు. ఐపీఎల్-2023 ఫైనల్లో 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అక్కడక్కడా తడబడినా చివరకు సీఎస్కే గెలుపు సొంతం చేసుకుంది. Photo Credit : IPL Twitter మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో అతను 3 పరుగులే ఇచ్చాడు. దాంతో గుజరాత్ గెలుస్తున్నట్లుగా అనిపించింది. అయితే తర్వాతి రెండు బంతులను జడేజా 6, 4గా మలచి సూపర్ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలవాలని భావించిన గుజరాత్ టైటాన్స్ చివరకు రన్నరప్‌గా సంతృప్తి చెందింది. సాధారణంగా 215 పరుగుల లక్ష్యం అసాధ్యంగా కనిపించినా... వర్షం అంతరాయంతో ఓవర్లు తగ్గడం, చేతిలో 10 వికెట్లు ఉండటం కూడా చెన్నైకి మేలు చేసింది. చివరిదిగా భావిస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగా... ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తన కెరీర్లో ఆరో టైటిల్‌తో ఘనమైన ముగింపునిచ్చాడు. Photo Credit : IPL Twitter మొత్తం ప్రైజ్‌మనీ: ►రూ. 46 కోట్ల 50 లక్షలు Photo Credit : IPL Twitter ►విజేత జట్టుకు: రూ. 20 కోట్లు ►రన్నరప్ జట్టుకు: రూ. 13 కోట్లు ►మూడో స్థానం: రూ. 7 కోట్లు -(ముంబై ఇండియన్స్) ►నాలుగో స్థానం: రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్) Photo Credit : IPL Twitter ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) ►శుబ్‌మన్ గిల్ (890 పరుగులు; 17 మ్యాచ్‌లు) సెంచరీలు: 3, అర్ధ సెంచరీలు: 4 ►ఐపీఎల్ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ నెగ్గిన పిన్న వయస్కుడిగా గిల్ (23 ఏళ్ల 263 రోజులు) గుర్తింపు పొందాడు. ►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు Photo Credit : IPL Twitter పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) ►మొహమ్మద్ షమీ (28 వికెట్లు; 17 మ్యాచ్‌లు) ►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు Photo Credit : IPL Twitter ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ: ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్- రూ. 10 లక్షలు) ►సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: గ్లెన్ మాక్స్వెల్ (ఆర్సీబీ- రూ. 10 లక్షలు) ►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: రషీద్ ఖాన్ (రూ. 10 లక్షలు) ►ఫెయిర్ ప్లే అవార్డు:ఢిల్లీ క్యాపిటల్స్ ►సీజన్లో అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ది సీజన్ : ఫాఫ్ డుప్లెసిస్ (రూ. 10 లక్షలు) ►బెస్ట్ పిచ్, గ్రౌండ్ ఆఫ్ ది సీజన్: ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (రూ. 50 లక్షలు) చదవండి: 550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 5️⃣INALLY THE CELEBRATIONS! 🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/I8fl6siQ2e — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
ఐపీల్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే ..
-
టీమ్ ఇండియాకి గుడ్ న్యూ,స్ WTC ప్రైజ్ మనీ ఎంతంటే...
-
డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ
డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ రూపంలో దక్కనున్నాయి. ఈ డబ్ల్యూటీసీ సీజన్ సైతం గత సీజన్లో లాగే 3.8 మిలియన్ డాలర్ల పర్స్ విలువ కలిగి ఉంది. తొలి స్థానంలో నిలిచే జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు 800,000 డాలర్లు, మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు, ఐదో ప్లేస్‌లో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు, ఆ తర్వాత ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ షేర్ చేయబడుతుంది. చదవండి: కేఎస్ భరతా.. ఇషాన్ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్‌కీపర్ ఎవరు..? -
ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం
దేశవాలీ టోర్నీల విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశీయ టోర్నీల్లో విజేతలతో పాటు అన్ని జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్లో అధికారికంగా ప్రకటించారు. దేశవాలీ టోర్నీల ప్రైజ్‌మనీ పెంచుతున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని జై షా తెలిపారు. రంజీ ట్రోఫీ సహా మహిళల దేశవాలీ వన్డే, టి20 టోర్నీల్లో ఇచ్చే ప్రైజ్‌మనీలో భారీ పెంపుదల తెచ్చింది. రంజీ ట్రోఫీ విజేత జట్టకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీని రూ. 5కోట్లకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ. కోటి అందించనున్నారు. ఇక దులీప్ ట్రోఫీ విజేతకు రూ. కోటి, రన్నరప్‌కు రూ 50 లక్షలు, విజయ్ హజారే ట్రోఫీ విజేతకు రూ. కోటి.. రన్నరప్‌కు రూ.50 లక్షలు, దేవదర్ ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతకు రూ. 80 లక్షలు.. రన్నరప్‌కు రూ.40 లక్షలు అందించనున్నారు. ఇక దేశవాలీ మహిళల వన్డే ట్రోఫీ(సీనియర్) విజేతకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 లక్షల ప్రైజ్‌మనీని రూ.50 లక్షలకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 25 లక్షలు ఇవ్వనుంది. ఇక మహిళల టి20 ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు ఇవ్వనుంది. I’m pleased to announce an increase in prize money for all @BCCI Domestic Tournaments. We will continue our efforts to invest in Domestic Cricket – which is the backbone of Indian Cricket. Ranji winners to get ₹5 crores (from 2 cr), Sr Women winners ₹50 lacs (from 6 lacs)🇮🇳 pic.twitter.com/Cgpw47z98q — Jay Shah (@JayShah) April 16, 2023 -
ఈ ఒక్కపని చేస్తే చాలు రూ. 16 లక్షలు గెలిచే ఛాన్స్.. డోంట్ మిస్!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసిన చాట్‌జీపీటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న చాట్‌జీపీటీ యూజర్లకు 'ఓపెన్ఏఐ' (OpenAI) కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, చాట్‌జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందిస్తామని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 16 లక్షల కంటే ఎక్కువే. ఈ కొత్త ప్లాట్ఫామ్లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రోగ్రామర్స్ లేదా ఎథికల్ హ్యాకర్స్ చాట్‌జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో తక్కువ బహుమతి 200 డాలర్లు కాగా (రూ. 16,000 కంటే ఎక్కువ), గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే, కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పనే అనిచెబుతున్నారు. అయితే గతంలో సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్‌జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్‌ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. -
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్‌ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
సంచలనం: ఒక్కడికే కనీవినీ ఎరుగని లాటరీ ప్రైజ్‌మనీ!!
లాటరీ చరిత్రలోనే అదొక సంచలనం. కనివినీ ఎరుగని రీతిలో లాటరీ ప్రైజ్ దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఎంతో తెలుసా? మన కరెన్సీలో అక్షరాల పదహారున్నర వేల కోట్ల రూపాయలకు పైనే. అమెరికా లాటరీ గేమ్ పవర్బాల్లో.. కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆ విజేత ఎవరనే విషయాన్ని కాలిఫోర్నియా లాటరీ అధికారులు ఎట్టకేలకు చెప్పారు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో అంట. కానీ, అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు అధికారులు. నవంబర్ నెలలో పవర్‌బాల్ జాక్‌పాట్ అతనికి దక్కగా.. తద్వారా చరిత్రలోనే కనివిని ఎరుగని లాటరీ ప్రైజ్మనినీ దక్కించుకున్నాడతను. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. విజేత వివరాలను వెల్లడించొచ్చు. కానీ, అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి. పేరు చెప్పొచ్చు. ఆ టికెట్‌ను ఎక్కడ కొన్నాడనే విషయమూ చెప్పొచ్చు. టికెట్ కొన్న తేదీ.. గెల్చుకున్న తేదీ.. ఎమౌంట్ వివరాలను కూడా చెప్పొచ్చు. కానీ, అతని అడ్రస్ గిడ్రస్ లాంటి నేపథ్య వివరాలు మాత్రం వెల్లడించకూడదు. ప్రైజ్‌మనీ అనౌన్స్ చేసిన ఏడాదిలోపే ఎప్పుడైనా ఆ వ్యక్తి ముందుకొచ్చి ప్రైజ్ మనీ తీసేసుకోవచ్చు. కానీ, కాస్ట్రో మాత్రం అందుకు ఆసక్తిగా లేడట. మరి గోప్యంగా అయినా తీసుకుంటాడా? అనేది వేచిచూడాలి. Video Credits: NBC News ఇక జాక్పాట్కొట్టిన విషయం తెలిసిన వెంటనే షాక్‌కు, అదే సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు క్యాస్ట్రో ఒక ప్రకటన విడుదల చేశాడు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో గతంలో 1.6 బిలియన్ డాలర్లు(పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైనే..) గెల్చుకున్నారు ఎవరో. కానీ, ఆ ప్రైజ్‌మనీని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదంట. అమెరియా సంయుక్త రాష్ట్రాల్లోని.. 45 రాష్ట్రాల్లో పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ గేమ్ బాగా పాపులర్. టికెట్ ధర ఎంతో తెలుసా? కేవలం 2 డాలర్లు మాత్రమే(మన కరెన్సీలో 170 రూ. దాకా ఉంటుంది). అలా చూసుకున్నా ఎడ్విన్ క్యాస్ట్రో ఎంత లక్కీనో కదా!. పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ లాటరీ గేమ్ ఆడాలి. ఇదిలా ఉంటే భారత్‌లోనూ గుర్తింపు ఉన్న లాటరీ ఏజెన్సీల ద్వారా ఈ టికెట్ కొనుగోలు చేసుకుని ఆడొచ్చు. లక్షల్లో ఎవరో ఒకరికి చాలా చాలా అరుదుగా దక్కుతుంది ప్రైజ్ మనీ. అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టే వాళ్లు మాత్రం ఎడ్విన్ కాస్ట్రోలాగా.. కోట్లల్లో ఒక్కడు ఉంటాడేమో!. -
తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జొకోవిచ్ మెల్బోర్న్కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది. జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు. మెల్బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతంటే ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సిట్సిపాస్కిది రెండోసారి సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్ 7 ఏస్‌లు 15 3 డబుల్ ఫాల్ట్‌లు 3 36 విన్నర్స్ 40 22 అనవసర తప్పిదాలు 42 2 బ్రేక్ పాయింట్లు 1 10 నెట్ పాయింట్లు 12 112 మొత్తం పాయింట్లు 94 చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా! ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు 🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT — #AusOpen (@AustralianOpen) January 29, 2023 Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0 — #AusOpen (@AustralianOpen) January 29, 2023 -
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహించనున్న ఎస్ఏ టి20 లీగ్‌లో మొత్తం ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించారు. టోర్నీలో 7 కోట్ల ర్యాండ్ లు (రూ. 33 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద మొత్తం. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటుండగా... ఆరు టీమ్‌లనూ ఐపీఎల్‌కు చెందిన యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రా యల్స్, జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేర్లతో జట్లు బరిలోకి దిగుతాయి. చదవండి: AUS-W vs IND-W: ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి.. -
FIFA WC: సెమీస్ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. విశ్వవిజేతగా అవతరించేది ఏ జట్టు అన్న విషయం మరో వారం రోజుల్లో తేలనుంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మెగా ఈవెంట్ గత నెల 20న ఖతర్ వేదికగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి అర్హత సాధించిన 32 జట్లు 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడాయి. ఇక బ్రెజిల్, పోర్చుగల్ వంటి మేటి జట్లు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగగా.. మొరాకో సంచలన విజయంతో సెమీస్ వరకు చేరింది. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో పాటు రన్నరప్ క్రొయేషియా, స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో రౌండ్ ఆఫ్ 16 నుంచి సెమీస్ వరకు కీలక మ్యాచ్‌లలో జట్ల ప్రయాణం, తదుపరి షెడ్యూల్, ప్రైజ్‌మనీ తదితర అంశాలు గమనిద్దాం. 8 గ్రూప్‌లు ►గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్. ►గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్. ►గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా. ►గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా. ►గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా. ►గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో. ►గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్. ►గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా. రౌండ్ 16కు చేరిన జట్లు ఇవే ►నెదర్లాండ్స్ ►అమెరికా ►అర్జెంటీనా ►ఆస్ట్రేలియా ►జపాన్ ►క్రొయేషియా ►బ్రెజిల్ ►దక్షిణకొరియా ►ఇంగ్లండ్ ►సెనెగల్ ►ఫ్రాన్స్ ►పోలాండ్ ►మొరాకో ►పోర్చుగల్ ►స్పెయిన్ ►స్విట్జర్లాండ్ నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్లు ►అమెరికాపై 3-1 తేడాతో నెదర్లాండ్స్ విజయం.. ఆస్ట్రేలియాపై 2-1తో అర్జెంటీనా గెలుపు.. తద్వారా గ్రూప్- ఏ నుంచి నెదర్లాండ్స్, గ్రూప్- సి నుంచి అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరింది. ►జపాన్‌పై విజయంతో క్రొయేషియా క్వార్టర్ ఫైనల్‌కు చేరగా.. కొరియాను మట్టికరిపించి(4-1) బ్రెజిల్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో క్వార్టర్స్‌లో బ్రెజిల్, క్రొయేషియా తలపడ్డాయి. నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో సమంగా ఉండగా పెనాల్టీ షూటౌట్లో 4-1తో క్రొయేషియా గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. ►సెనెగల్పై విజయంతో ఇంగ్లండ్, పోలాండ్‌పై విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. ఇక ఇంగ్లండ్‌తో పోరులో 2-1తో పైచేయి సాధించిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. స్పెయిన్‌పై విజయంతో క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్న మొరాకో.. స్విట్జర్లాండ్‌ను ఓడించి తమతో పోటీకి దిగిన పోర్చుగల్‌ను ఓడించింది. తద్వారా 92 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా రికార్డు సృష్టించింది. మిగిలిన షెడ్యూల్ ►డిసెంబరు 14న మొదటి సెమీ ఫైనల్ అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా ►డిసెంబరు 15న రెండో సెమీ ఫైనల్ ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో ►డిసెంబరు 17న మూడో స్థానం కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ►డిసెంబరు 18న ఫైనల్ ప్రైజ్‌మనీ వివరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్ నిలిచింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్‌లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అదే విధంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకుగాను కరన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు, రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ లభించిందో ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన భారత్, న్యూజిలాండ్‌కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందింది. అదే విధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది. చదవండి: T20 WC 2022 Final: పాకిస్తాన్‌ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్ -
T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి 1992 సీన్‌ను బాబర్ ఆజం సేన రిపీట్ చేస్తుందా లేక ఇంగ్లండ్ దాటికి తోకముడిచి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా ఇదే మొత్త లభించనుంది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్, పాకిస్తాన్లలో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది. ►సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు ) ►ఫస్ట్రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు) ►ఫస్ట్రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు) అయితే టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఐపీఎల్లో కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లకు వరల్డ్‌కప్ ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ పెద్దగా పట్టించుకోరు.. ఐపీఎల్ ద్వారా కోట్లు వస్తుంటే దేశానికి ఆడాలని ఏ ఆటగాడికి పెద్దగా అనిపించదు.'' అంటూ పేర్కొన్నారు. చదవండి: T20 WC 2022: బాబర్ కుడివైపు, బట్లర్ ఎడమవైపు.. -
Boxing World Championships 2023: స్వర్ణ పతకం సాధిస్తే రూ. కోటీ 63 లక్షలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరగనున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ప్రకటించారు. మే 1 నుంచి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను మొత్తం 52 లక్షల డాలర్ల (రూ. 425 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నామని సోమవారం ఇక్కడ నిర్వహించి మీడియా సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన బాక్సర్‌కు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 63 లక్షలు), రజతం నెగ్గిన బాక్సర్‌కు 1 లక్ష డాలర్లు (రూ. 81 లక్షలు), కాంస్యం సొంతం చేసుకున్న ఇద్దరు బాక్సర్లకు 50 వేల డాలర్ల (రూ. 40 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన క్రెమ్లెవ్ ఒకవేళ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్‌ను తొలగిస్తే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. -
T20 WC 2022: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంతంటే!
ICC Men's T20 World Cup 2022- Prize Money Details: పురుషుల టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటించింది. విజేత, రన్నరప్‌లతో పాటు సెమీ ఫైనలిస్టులు, సూపర్-12 దశలో విజయాలు నమోదు చేసిన జట్లు, సూపర్-12 స్టేజ్‌లో నిష్క్రమించిన జట్లు, తొలి రౌండ్ విజేతలు, మొదటి రౌండ్లోనే వెనుదిరిగిన టీమ్‌లకు ఎంత మొత్తం అందనుందో తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్ జరుగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీగా లభించనుందని పేర్కొంది. ఇక రన్నరప్ 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 16 జట్లు.. ఆసీస్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, భారత్ , పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ, ఇంగ్లండ్ నేరుగా సూపర్-12కు అర్హత సాధించగా.. మరో ఎనిమిది జట్లు క్వాలిఫైయర్స్ ఆడనున్నాయి. గతేడాది దారుణ వైఫల్యం మూటగట్టుకున్న మాజీ చాంపియన్ వెస్టిండీస్ సహా శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ క్వాలిఫైయర్స్‌లో తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్-2022 ప్రైజ్‌మనీ వివరాలు(లభించే మొత్తం డాలర్లలో) ►విజేత- 1,600,000 డాలర్లు ( భారత కరెన్సీలో సుమారుగా 13 కోట్ల ఐదు లక్షలు) ►రన్నరప్- 800,000 డాలర్లు (దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు) ►సెమీ ఫైనల్లో ఓడిన 2 జట్లు- 800,000 డాలర్లు(ఒక్కో జట్టుకు 400,000 డాలర్లు- సుమారు 3,26,20,220 రూపాయలు) ►సూపర్-12 దశలో గెలిచిన జట్లు- 1,200,000 డాలర్లు(ఒక్కో మ్యాచ్‌కు 40,000 డాలర్లు) ►సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు ) ►ఫస్ట్రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు) ►ఫస్ట్రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు) చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్‌కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేత వాగ్దేవి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఈ షోలో సందడి చేశారు. చదవండి: ‘ఆ బుక్ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్ తీస్తున్నాం’ కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తీక్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్‌లు ఫైనల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. శ్రీనివాస్, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం కూడా ఆమె అందుకుంది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మని, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల రూపాయలు బహుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలాగే సింగర్ కార్తీక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్‌ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత వినోదంగా సాగింది. -
పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు
ఐపీఎల్ 15వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జాస్ బట్లర్ నిలిచాడు.17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన బట్లర్.. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అంతేకాదు బట్లర్ ఈ సీజన్లో నాలుగు సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్తాన్ రాయల్స్‌కు బట్లర్ బ్యాటింగే ప్రధాన బలం అని చెప్పొచ్చు. అయితే బట్లర్ పరుగుల విషయంలోనే కాదు.. ప్రైజ్‌మనీ అందుకోవడంలోనూ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ మొత్తంలో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్ వాటిద్వారా రూ.95 లక్షల ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకొని ఔరా అనిపించాడు. PC: IPL Twitter ఐపీఎల్ 15వ సీజన్ అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లేయర్ పురస్కారాలతో రూ. 60 లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ స్టేజ్‌లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ. 7లక్షలు సాధించాడు. వివిధ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో 28 లక్షలు కైవసం చేసుకున్నాడు. కాగా రాజస్థాన్ బట్లర్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ ఫైనల్ చేరిందంటే అదంతా బట్లర్ చలువే. ఫైనల్లో బట్లర్ 39 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడం.. ఆ తర్వాత ప్రధాన బ్యాటర్లంతా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన రాజస్తాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' RuPay On-The-Go 4s of the Final between @gujarat_titans and @rajasthanroyals is Jos Buttler.#TATAIPL @RuPay_npci #RuPayOnTheGoFours #GTvRR pic.twitter.com/1bfGPK2dOc — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా..
ఐపీఎల్-2022లో భాగమైన పిచ్ క్యూరేటర్లు,గ్రౌండ్స్మెన్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటెరీ జై షా తెలిపారు. కాగా ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడియాల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించబడినందున.. ఒక్కో స్టేడియానికి రూ. 12.5 లక్షలు కేటాయించారు. మరో వైపు లీగ్ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన నాలుగు వేదికల క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ. 25 లక్షలు అందజేయనున్నారు. లీగ్ దశలో మ్యాచ్‌లు అన్నీ మహరాష్ట్రలోనే జరిగాయి. బ్రబౌర్న్,వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, ఎంసీఎ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరిగాయి. ఒక్కో స్టేడియానికి రూ. 25 లక్షలు రివార్డుగా అందనుంది. "ఐపీఎల్-2022లో అద్భుతమైన మ్యాచ్‌లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో 6 వేదికలలో పనిచేసిన మా క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ తెర వెనుక రియల్ హీరోలు" అని జై షా ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు -
'సాక్షి ప్రీమియర్ లీగ్' విజేతలకు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’(ఎస్పీఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎస్పీఎల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫైనల్లో విజేతలుగా నిలిచిన ఎంఎల్ఆర్ఐటి(సీనియర్స్ విభాగం) , గౌతమ్ జూనియర్ కాళాశాల(జూనియర్స్ విభాగం) జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌గా నిలిచిన వాగ్దేవి, కెఎల్ఎన్ జట్లకు రూ. 15 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అదే విధంగా జూనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రిషబ్ బిమల్, సీనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ దక్షిత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సూర్యతేజలను మెమెంటోలతో సత్కరించారు.కాగా సాక్షి మీడియా గ్రూఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్పీఎల్ నిర్వహణపై పలువురు ప్రశంసల జల్లు కుపించారు. 'విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చాలని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమంగా రాణిస్తారు. ఎస్పీఎల్ లీగ్ నిర్వహించడం అభినందనీయం' -ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 'ఎస్పీఎల్ అభినందనీయం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 649 జట్లతో రాష్ట్ర స్థాయిలో ఎస్పీఎల్ నిర్వహించడం గొప్ప విషయం. అందుకు మా కాలేజీ ఆతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియా గ్రూఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్థతలు' - మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి కళాశాలల సెక్రటరీ -
ప్రైజ్‌మనీ విషయంలో ఐసీసీ కీలక చర్చలు..!
అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే పురుష, మహిళా క్రికెట్ జట్ల ప్రైజ్‌మనీకి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే పురుష, మహిళా క్రికెట్ జట్ల ప్రైజ్‌మనీలో అంతరాన్ని తగ్గించే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్డైస్ సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో విజేతకు 1.32 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుండగా, 2019 పురుషుల వన్డే ప్రపంచకప్ విజేతకు ఏకంగా 4.8 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. పురుష జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే మహిళా క్రికెట్ జట్ల లభించే మొత్తం మూడో వంతు కూడా లేకపోవడంతో గత కొంతకాలంగా మహిళా క్రికెటర్లు నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో భాగంగా పురుష, మహిళా క్రికెట్ జట్లకు సమాన ప్రైజ్‌మనీ అందించే అంశాన్ని ఐసీసీ అపెక్స్ కమిటీ పరిశీలిస్తుందని జెఫ్ అలార్డైస్ తెలిపారు. చదవండి: WC 2022: అదరగొట్టిన వ్యాట్.. 6 వికెట్లతో రాణించిన సోఫీ.. ఆసీస్‌తో పోరుకు సై -
ఉక్రెయిన్ సైన్యానికి నా ప్రైజ్‌మనీ: స్వితోలినా
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. -
బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ప్రైజ్‌మనీలో 'బిగ్' సర్ప్రైజ్
Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్ సీజన్-5 మరో మూడు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం టైటిల్ పోరులో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే సన్నీ-షణ్నూకే అవకాశాలు ఎక్కువ. టైటిల్ రేస్ కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుందన్నది పలువురి అభిప్రాయం. ఇక ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే దాన్ని పక్కన పెడితే, బిగ్‌బాస్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్-5 విజేతకు డబుల్ బొనాంజ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ విన్నర్‌కి గాను ఈసారి 50లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కుతుందని సమాచారం. ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్‌మనీ అన్నది అత్యధికం. కానీ ఈసారి తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 50 లక్షల ప్రైజ్‌మనీకి అదనంగా పాతిక లక్షల విలువైన ఫ్లాట్ కూడా అందించనున్నట్లు సమాచారం. మరికొందరేమో ప్రైజ్‌మనీలో సగాన్ని తగ్గించి ఫ్లాట్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా ఎవరు నిలవనున్నారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ.. క్లిక్ చేసి బుక్కయ్యింది!
నగరి(చిత్తూరు జిల్లా): కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ వచ్చిందంటూ అమాయకులకు వలవేసి రూ.లక్షలకు లక్షలు కాజేసే నైజీరియన్‌ను చిత్తూరు జిల్లా నగరి సీఐ మద్దయ్య ఆచారి శనివారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘమిత్ర రక్షింద (28)కు ఏడు నెలల క్రితం రూ.2.50 కోట్ల ప్రైజ్ తగిలిందని మెసేజ్ వచ్చింది. వివరాలకు క్లిక్ చేయండని ఓ లింక్ వచ్చింది. ఆశతో క్లిక్ చేయగా ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. కోవిడ్ సమయంలో సేవలకు గాను శాంసంగ్ ఎలక్ట్రానిక్ యూకే కంపెనీ ఆమెను ఎంపిక చేసిందని హిందీలో చెప్పాడు. ప్రైజ్ మనీ రావాలంటే.. రూ.3,500 చెల్లించాలన్నాడు. రూ.కోట్లు వస్తాయన్న ఆశతో ఆ మొత్తాన్ని ఆమె చెల్లించింది. రెండు రోజుల తరువాత ఫోన్ చేసిన ప్రైజ్‌మనీ తేవడంలో సమస్యలున్నాయని.. దానిని పరిష్కరించడానికి ఒక రోజులోపు రూ.15,500 చెల్లించాలని.. లేకుంటే డబ్బులు రావన్నాడు. దీంతో రక్షింద ఆ మొత్తం కూడా చెల్లించింది. ఫారిన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీగా మార్చడానికి సొమ్ము చెల్లించాలని, ఆర్బీఐ క్లియరెన్స్ అనీ, కస్టమ్స్ క్లియరెన్స్ అనీ, డబ్బులు తెచ్చే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో సమస్య ఉందని, హైదరాబాద్‌లో సమస్య ఎదురైందని, తిరుపతి ఎయిర్ పోర్టులో అనుమతించలేదని, భాకరాపేటలో పోలీసులు అనుమతించడం లేదని ఇలా పలు కారణాలు చెబుతూ పలు దఫాలుగా వెంటనే డబ్బు పంపాలనడంతో అమాయకత్వం, అత్యాశతో రక్షింద సొమ్ము చెల్లించేది. ఇలా బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించింది. డబ్బు చెల్లించినా ప్రైజ్ మనీ రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. సాంకేతికతతో ఛేదించిన పోలీసులు ఆమెకు వచ్చిన మెసేజిలు, ఫోన్‌కాల్స్‌ను ఆధారం చేసుకుని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మోసగాడు ఢిల్లీలో ఉంటున్నట్టు గుర్తించి.. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లింది. నైజీరియన్ నివాసాన్ని కనుగొని అక్కడి పోలీసుల సహకారంతో అతడి ఇంటికి చేరుకున్నారు. నేరస్తుడు ఇనుప గేట్లు వేసుకొని ఇంట్లో దాక్కోవడంతో గ్యాస్ కట్టర్ సాయంతో వాటిని కట్‌చేసి నైజీరియన్‌ను పట్టుకున్నారు. నిందితుడు నైజీరియాకు చెందిన అంతర్జాతీయ నేరస్తుడు నికోలస్ మగ్లర్ అలియాస్ జార్జిగా తేలింది. అతడు 2015లో నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చి.. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఈ విధంగా సుమారు 90 మంది నుంచి నగదు కాజేసినట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుణ్ణి తీసుకుని శనివారం రాత్రి ఢిల్లీ నుంచి నగరికి బయలుదేరారు. -
T20 WC 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే..
T20 World Cup 2021: Prize Money won by each participating team in the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుగా నీరాజనాలు అందుకున్నా.. తీరని లోటుగా ఉన్న పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుని కలను నిజం చేసుకుంది. ఇక న్యూజిలాండ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం న్యూజిలాండ్ జట్టుకిది మూడోసారి. కివీస్ 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2021 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం. ఆసీస్‌కు ఎంతంటే... ►ఈ మెగా ఈవెంట్లో మొత్తం ప్రైజ్‌మనీ- 5.6 మిలియన్ డాలర్లు(42 కోట్ల రూపాయలు). ►ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు). ►ఇక సూపర్ 12 దశలో భాగంగా లీగ్ మ్యాచ్‌లలో ఐదింటికి నాలుగు గెలిచిన ఆరోన్ ఫించ్ బృందానికి చాంపియప్గా అందుకున్న ఈ మొత్తంతో పాటు రూ. 1.2 కోట్ల మేర అదనంగా ముట్టింది. మొత్తంగా ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ 13.1 కోట్ల రూపాయలు. ►రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు). సూపర్ 12 రౌండ్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌కు కూడా 1.2 కోట్ల రూపాయలు ఇందుకు అదనంగా లభించాయి. సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే.. ►గ్రూపు-1 నుంచి ఇంగ్లండ్, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 3 కోట్ల రూపాయలు. ►ఇక సూపర్ 12లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌కు అదనంగా దక్కిన మొత్తం 4.5 కోట్ల రూపాయలు. ►అదే విధంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌కు దక్కిన మొత్తం... 4.2 కోట్ల రూపాయలు. సూపర్ 12 దశకు అర్హత సాధించిన జట్లకు.. ►టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల మేర అందింది. ►ఉదాహరణకు.. టీమిండియాకు ఈ మెగా ఈవెంట్లో దక్కిన మొత్తం... 1.42 కోట్ల రూపాయలు. సూపర్ 12 చేరినందుకు రూ. 52 లక్షలు.. అదే విధంగా మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున 90 లక్షల రూపాయలు దక్కుతాయి. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన జట్లకు ఇలా.. ►పపువా న్యూగినియా, నమీబియా తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అయితే, సూపర్ 12 అర్హత సాధించే క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నమీబియా, స్కాట్లాండ్ ముందుకు వెళ్లగా... ఒమన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఆ ఘనత సాధించలేకపోయాయి. ►ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఒక్కో జట్టుకు... అర్హత సాధించినందుకు రూ. 30 లక్షలు.. ఒక్కో విజయానికి 30 లక్షల చొప్పున అందాయి. ►ఉదాహరణకు.. శ్రీలంక క్వాలిఫైయర్స్ ఆడి.. సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో దసున షనక బృందానికి మొత్తంగా 2.02 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఎలాగంటే.. సూపర్ 12 దశకు క్వాలిఫై అయినందుకు 52 లక్షలు, అందులో రెండు విజయాలకు 60 లక్షలు.. ఇక క్వాలిఫైయర్స్‌లో మూడింట గెలిచినందుకు 90 లక్షల రూపాయలు.. మొత్తంగా రూ. 2.02 కోట్లు. చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్ మాత్రం.. చాలా గర్వంగా ఉంది.. -
IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం. అవార్డు ప్లేయర్ గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు రాజస్తాన్ రాయల్స్ 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ హర్షల్ పటేల్ 10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ షిమ్రోన్ హెట్మెయిర్ 10 లక్షలు మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు కేఎల్ రాహుల్ 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వెంకటేశ్ అయ్యర్ 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రవి బిష్ణోయి 10 లక్షలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 10 లక్షలు ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ 10 లక్షలు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 20 కోట్లు రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 12.5 కోట్లు మూడోస్థానం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్లు నాలుగో స్థానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8.75 కోట్లు చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని -
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ICC Announces T20 World Cup Prize Money: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) ఆదివారం ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు 12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ రూపంలో లభిస్తుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు(నాలుగు లక్షల డాలర్లు) వరకు వస్తుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న మొత్తం 16 జట్లు 5.6 మిలియన్ డాలర్లను పంచుకోనున్నాయి. 2016 వరల్డ్‌కప్ వలె సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ ఇవ్వనుంది. సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు దక్కనుంది. ఈ రౌండ్ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. సూపర్ 12 నుంచి ఇంటిముఖం పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందజేయనుంది. దీని కోసం ఐసీసీ మొత్తంగా 560000 డాలర్లను ఖర్చు చేయనుంది. ఇక రౌండ్ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి. ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను ఐసీసీ కేటాయించింది. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు రౌండ్ వన్‌లో పోటీ పడబోతున్నాయి. ఇక సూపర్ 12లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడనున్నాయి. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... -
హర్రర్ సినిమాలు చూసే దమ్ముందా?.. రూ.లక్ష సొంతం!!
Horror Movies Challange: నయనతార నటించిన మయూరి(మాయా) సినిమా గుర్తుందా?. తాను తీసిన హర్రర్ సినిమాను ఒంటరిగా, భయపడకుండా చూస్తే.. నగదు బహుమతి ఇస్తానంటూ అందులో డైరెక్టర్ క్యారెక్టర్ ఓ ప్రకటన ఇస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు హార్ట్-పల్స్బీట్ను పరిశీలిస్తుంటారు కూడా. దాదాపు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో అలాంటి ప్రకటననే జారీ చేసింది ఓ కంపెనీ. కాకపోతే అది మనదేశంలో కాదులేండి. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారో.. దానిని చూడడానికి అంతే కష్టపడేవాళ్లు అంతేమంది ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ.. హర్రర్ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్ మనీ ఇస్తుందట. అమెరికాలోని ఫైనాన్స్‌బజ్ అనే ఫైనాన్స్ కంపెనీ ఈ నొటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్ హర్రర్ సినిమాల్ని పదిరోజుల్లో చూసేయాలి. అదీ రేప్పేయకుండా.. భయంతో వణికిపోకుండా!. చాలెంజ్‌లో గెలిస్తే 1,300 డాలర్లకిపైగా(దాదాపు లక్ష దాకా) ప్రైజ్‌మనీ ఇస్తారు. అయితే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్ పెట్టారు. త్వరలో హాలీవుడ్లో కొన్ని హర్రర్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తరుణంలో హైబడ్జెట్.. లోబడ్జెట్ హర్రర్ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్‌బజ్ ఈ ప్రయత్నాన్ని చేస్తోంది. లిస్ట్‌లో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్-2, క్యాండీమ్యాన్, ఇన్సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సిన్స్టర్, గెట్ అవుట్, ది పర్గే, హలోవీన్(2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె’ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఇక ఒంటరిగా ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఫిట్‌బిట్ సాయంతో హార్ట్, పల్స్ రేట్‌ను మానిటర్ చేయబోతున్నారు. ఏమైనా తేడాలు అనిపిస్తే.. ఆ వ్యక్తిని సినిమా చూడడం ఆపేయమని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక ఈ ఫిట్‌బిట్‌ను ఫైనాన్స్‌బజ్ కంపెనీ వాళ్లే అందిస్తారు. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్ డబ్బును కూడా చెల్లిస్తున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగానికి పెట్టిన పేరేంటో తెలుసా.. ‘హర్రర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’. చదవండి: మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్లు -
యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత యూఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుకున్న బ్రిటన్ మహిళగా ఎమ్మా రికార్డు క్రియేట్ చేసింది. అయితే గ్రాండ్‌స్లామ్ విజేతలకు ప్రైజ్‌మనీ ఎంత అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ విజేతలకు నిర్వాహకులు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 57 లక్షల డాలర్లు (సుమారు రూ.422 కోట్లు). గత ఏడాది కంటే 4 లక్షల డాలర్లు ఎక్కువగా పెంచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. ప్రైజ్‌మనీ వివరాలు: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 25 లక్షల డాలర్లు (రూ.18 కోట్లు), రన్నరప్‌కు 12 లక్షల డాలర్లు (రూ.9 కోట్లు), సెమీఫైనలిస్ట్‌లకు 6 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు), క్వార్టర్ ఫైనలిస్ట్‌లకు 4లక్షల డాలర్లు (రూ.3 కోట్లు), రౌండ్16 ఆటగాళ్లకు (రూ.2 కోట్లు), రౌండ్ 32 ఆటగాళ్లకు (సుమారు రూ.1 కోటి 30 లక్షలు), రౌండ్ 64 ఆటగాళ్లకు (రూ.84 లక్షలు) , రౌండ్ 128(రూ.55 లక్షలు)గా నిర్ణయించారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ గెలిస్తే 6 లక్షల డాలర్లు (సూమారు రూ.5 కోట్లు), రన్నరప్‌కు 3 లక్షల డాలర్లు (సూమారు రూ.2 కోట్లు), సెమీఫైనలిస్ట్‌లకు 1 లక్ష 64 వేల డాలర్లు (రూ.1 కోటి 24 లక్షలు), క్వార్టర్ ఫైనలిస్ట్‌లకు (రూ.68 లక్షలు), రౌండ్16 ఆటగాళ్లకు (రూ.39 లక్షలు), రౌండ్ 32 ఆటగాళ్లకు( రూ.24 లక్షలు), రౌండ్ 64 ఆటగాళ్లకు (రూ.14 లక్షలు)గా నిర్ణయించారు. చదవండి: CPL 2021 Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా -
కోటి రూపాయలను తలదన్నే కథ
ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల టీచర్ హిమానీ బుందేలాకు ‘కెబిసి 13’ సీజన్లో కోటి రూపాయలు వచ్చాయి. ఈ సీజన్‌కు తొలి విజేత ఆమే. చూపు లేకపోయినా ఆమె కోటి గెలిచింది. అది కాదు సంగతి. 15 ఏళ్ల వయసులో పూర్తిగా చూపు కోల్పోయినా జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకోవడంలో హిమానీ ‘దృష్టికోణం’ ఎంతో ముఖ్యమైనది. ‘నాకు దృష్టి లేదు నిజమే. దృష్టి కోణం ఉంది’ అని అంటున్న హిమాని మనకు ప్రసాదిస్తున్న దృష్టికోణం ఏమిటి? ఆగస్టు 30, 31 తేదీల్లో ప్రసారమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 13 ఎపిసోడ్స్ మీరు చూశారా? ఆ ఎపిసోడ్స్‌లో విశేషం ఏమిటంటే హిమానీ బుందేలా కోటి రూపాయల ప్రైజ్ గెలిచింది. ఆ తర్వాత 7 కోట్ల ప్రశ్న వరకూ వెళ్లింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉండేసరికి గేమ్‌ను క్విట్ చేసి కోటి రూపాయలతో ఇల్లు చేరింది. క్లుప్తంగా ఆ రెండు ఎపిసోడ్ల సారాంశం ఇది. కాని ఇది చెప్పడానికి ఈ కథనం రాయడం లేదు. హిమానీ బుందేలాను పరిచయం చేయడానికి రాస్తున్నాము. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13’లో కోటి రూపాయలను గెలిచిన తొలి విజేత, ఇప్పటి వరకూ అన్ని సీజన్లలో కోటి రూపాయలు గెలిచిన తొలి అంధ విజేత కూడా హిమానీ బుందేలానే. కాని ఈ విజయం ఆమెకు అదాటున రాలేదు. ఇప్పుడు ఆమె జీవిస్తున్న జీవితం కూడా అదాటున రాలేదు. చాలామంది ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆమె నవ్వు నుంచి రాలిపడే నక్షత్రాల్లాంటివి మన నవ్వులో ఎందుకు లేవు అని తరచి చూసుకోవాల్సి ఉంది. అమితాబ్‌తో హిమాని, గాయకుడు జుబిన్‌తో హిమానీ ఐదుగురిలో ఒక్క అమ్మాయి హిమానీ బుందేలాది ఆగ్రా. ఐదుగురు సంతానంలో ఆమె పెద్దది. తండ్రి విజయ్‌సింహ్ ప్రయివేటు ఉద్యోగి. తల్లి సరోజ్ గృహిణి. పిల్లలను చదివించుకోవడమే ఆ తల్లిదండ్రులకు పెద్ద విషయం. ఈ సంగతి గ్రహించిన హిమానీ తొమ్మిది, పది తరగతులు చదివేప్పటి నుంచే ఇంట్లో ట్యూషన్లు మొదలెట్టింది. ఆమె పాఠాలు చెప్పే తీరు హుషారుగా ఉండేది. అందుకని పిల్లలు ఆమె దగ్గర ట్యూషన్ కోసం పరిగెత్తే వారు. అయితే హిమానీకి ముందు నుంచి కంటి సమస్య ఉంది. రెటినా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అందుకని ఆమెను ఆడొద్దని, పరిగెత్త వద్దని, గట్టి దెబ్బ తగిలి ఒళ్లు అదిరేలా చూసుకోవద్దని చెప్పేవారు. దాంతో హిమానీ భయం భయంగా ఉండేది. కాని భయపడుతున్నట్టే జరిగింది. టెన్త్ క్లాస్‌లో ఉండగా ఆమె సైకిల్ మీద వెళుతూ ప్రమాదానికి లోనయ్యి రోడ్డు మీద పడిపోయింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తగ్గ సాగింది. డాక్టర్లు పరీక్షించి రెటీనా పూర్తిగా కదిలిపోయిందని చెప్పారు. సర్జరీలు చేయాలన్నారు. ఇది 2012లో. మూడు సర్జరీలు అయ్యాయి. చూపు కొద్దిగా వచ్చింది. ఇంకా బాగా వస్తుందేమోనని నాలుగో సర్జరీ చేశారు. కాని ఫెయిల్ అయ్యింది. చూపు పూర్తిగా పోయింది. 15 ఏళ్ల ఉత్సాహపూరితమైన అమ్మాయి హిమానీ. ఇప్పుడు పూర్తిగా అంధురాలిగా మారింది. ఏం చేయాలి? ఆరు నెలలు హిమానీ నవ్వు మర్చిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు తీవ్రమైన బెంగలో పడిపోయారు. ఇక హిమానీ జీవితంలో ఏదీ చేయలేదని నిరాశలో కూరుకుపోయారు. కాని హిమానీ మెల్లమెల్లగా తన శక్తుల్ని కూడగట్టుకుంది. ట్యూషన్లు తిరిగి మొదలెట్టింది. ఒకప్పుడు ఈ ‘అక్క’ చూసి పాఠాలు చెప్పేది. ఇప్పుడు ఎలా చెబుతుంది? అయినా సరే పిల్లలు ఆమె దగ్గరకు వచ్చేవారు. పిల్లల చేతే పాఠాలు చదివించి వారికి ఆ పాఠాలు విడమర్చేది. ఎక్కడా ఏ కన్ఫ్యూజనూ ఉండేది కాదు. ఆమె మేథమెటిక్స్‌లో దిట్ట. ఆ లెక్కలు కూడా నోటి మాటగా వివరించేది. కనపడకపోయినా నోట్స్ మీద రాసి చూపించేది. ట్యూషన్లు తిరిగి మొదలయ్యాయి. చదువు కూడా కొనసాగించాలనుకుంటే అంధ విద్యార్థి కనుక ఇంటర్ సీటు ఇవ్వడానికి ఏ కాలేజీ ముందుకు రాలేదు. లక్నోలోని ‘డాక్టర్ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్ యూనివర్సిటీ’లో దివ్యాంగ విద్యార్థులను మామూలు విద్యార్థులతో కలిపి చదివిస్తారని తెలిసి అక్కడకు వెళ్లి అడ్మిషన్ తీసుకుంది. ‘అంత వరకూ జీవితంలో చూపు కోల్పోతాననే భయం ఉండేది. చూపు కోల్పోయాక ఇక భయం దేనికి. జీవితాన్ని హాయిగా జీవించాలి అనుకున్నాను. లోపాన్ని, వెలితిని పక్కకు పెట్టి సంతోషంగా జీవించాలనే దృష్టికోణం నాకు అలవడింది’ అంటుంది హిమానీ. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి కేంద్రీయ విద్యాలయలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంది. ‘మా ఇంట్లో నాదే తొలి ప్రభుత్వ ఉద్యోగం’ అంటుందామె. కౌన్ బనేగా కరోడ్‌పతిలో... హిమానీకి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకునేది. ప్రిపేర్ అయ్యేది. కాని ఈ సీజన్లో మాత్రం ఆమెకు చాన్స్ వచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న అమితాబ్ ఎవరి దగ్గరకూ రాకపోయినా ఆమెను చేయి పట్టుకుని నడిపించి హాట్సీట్లో కూచోబెట్టాడు. మంచినీళ్లు ఆఫర్ చేశాడు. అంతే కాదు కోటి రూపాయలు వస్తే ఎంతో సంతోషించాడు. ఆ ఎపిసోడ్‌లోనే హిమానీ తనకు గాయకుడు జుబిన్ నోటియాల్ ఇష్టమని చెప్తే జుబిన్ ముంబై నుంచి ప్రత్యేకంగా ఆగ్రా వచ్చి ఆమెను ఇంట్లో కలిసి గొప్ప సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇవాళ ఆమె స్ఫూర్తి హిమానీ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా మారింది. కంటి ఎదుట పూర్తిగా చీకటే ఉన్నా ఆమె ఆత్మవిశ్వాసంతో నవ్వుతో అనుకున్నది సాధించడం అందరూ మెచ్చుకుంటున్నారు. ‘నా బహుమతి మొత్తం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్ ఏర్పాటుకు వెచ్చిస్తాను’ అని హిమానీ చెప్పింది. జీవితంలో కోటి రూపాయలు సంపాదించే అవకాశం చాలామందికి రావచ్చు. కాని జీవితం అంధకారమై భవిష్యత్తు ఒక ప్రశ్నగా మారినప్పుడు దానికి సమాధానం చెప్పగలగడం అనేక కోటిరూపాయలను తలదన్నడంతో సమానం అవుతుంది. హిమానీ నిజంగా ఈ కాలపు ఒక గొప్ప సమాధానం. -
WTC Final: విజేతకు భారీ ప్రైజ్‌మనీ
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత, రన్నరప్‌లు అందుకోబోయే ప్రైజ్ మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రోజ్ బౌల్ సౌతాంప్టన్ వేదికగా జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌లో విజేతకు భారత కరెన్సీ ప్రకారం రూ. 11.72 కోట్లు అందనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 5.85 కోట్ల ప్రైజ్ మనీ లభించనున్నట్లు పేర్కొంది. ఏదైనా కారణం చేత మ్యాచ్ డ్రాగా ముగిసినట్లైతే, ప్రైజ్ మనీని ఇరు జట్లకు సమంగా పంచనున్నట్లు ఐసీసీ వివరించింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుని జోరు మీదున్న న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు సవాల్ విసురుతుంది. మరోవైపు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా సైతం అదగొట్టి, టైటిల్ పోరుకు సై అంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(94 బంతుల్లో 121 నాటౌట్) శతక్కొట్టగా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్(85), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(54) అదిరిపోయే అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఇషాంత్(3/36), మహ్మద్ సిరాజ్(2/22)లు సైతం బంతితో రాణించారు. చదవండి: అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి.. -
రండి.. వ్యాక్సిన్ వేసుకోండి.. 840 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకోండి
లాస్ ఏంజెల్స్: సాధారణంగా పండగలకు ఆఫర్లు ప్రకటించడం మనకు తెలిసిందే. ప్రస్తుతం కరోనా దెబ్బకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రైజ్‌మనీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును గెలుచుకోండంటూ.. తమ రాష్ట్ర ప్రజలకు అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఎందుకంత భారీగా బహుమతిని ప్రకటించడం అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియా వచ్చే నెల 15న కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయనున్న నేఫథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ భారీ బహుమతిని ఇవ్వనున్నట్లు రాష్ట్ర గవర్నర్ గవిన్ ప్రకటించారు. అక్కడ 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలినవారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించేందుకు ఈ ప్రైజ్‌మనీ ఆఫర్‌ను ప్రకటించారు. దీనికి కనీస అర్హతగా తొలిడోసు టీకా వేసుకుని ఉండాలని షరతు పెట్టారు. ఈ లక్కీ డ్రాకు ఇప్పటికే టీకాలు వేయించుకున్న వ్యక్తులు కూడా అర్హులని స్పష్టం చేశారు. జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన బహుమతి కూపన్లు ఇస్తారట. ఇదే తరహాలో ఒహాయో, కొలరాడో, ఒరెగాన్ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించాయి. చదవండి: బ్రేక్‌ఫాస్ట్ కోసం బిల్లులు.. పోలీసుల దర్యాప్తు -
BCCI: అనుకున్నాం... కానీ ఇవ్వలేకపోయాం
న్యూఢిల్లీ: గతేడాది కరోనా కారణంగా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రతిష్టాత్మకమైన రంజీ టోర్నీ రద్దయింది. మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టుల రూపంలో దేశవాళీ ఆటగాళ్లకు చెప్పలేనంత ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మనసు చేసుకుంది. ఆయా టోర్నీలను కోల్పోయిన పురుషులు, మహిళా క్రికెటర్లకు పరిహారం అందజేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే బోర్డు కృషి మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగలేదు. ఆచరణలో విఫలమైంది. ఏడాది పూర్తయినా కానీ ఇంకా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు, అమ్మాయిలకు ఎలాంటి పరిహారభత్యం అందలేదు. మహిళల టి20 ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్న అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్ల చెల్లింపుల విషయం కూడా బయటికొచ్చింది. దీనిపై బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఆటగాళ్ల జాబితాలను ఇప్పటివరకు బీసీసీఐకి పంపలేదని, వారి తాత్సారం వల్లే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు పరిహారం అందజేయలేకపోయామని చెప్పారు. ‘ఎవరు ఆడేవాళ్లు. ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఎవరు రిజర్వ్ ఆటగాళ్లు అన్న వివరాలేవీ రాష్ట్ర సంఘాలు పంపలేదు. అందుకే చెల్లించలేకపోయాం’ అని అరుణ్ అన్నారు. -
ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్‌మనీ చెల్లించలేదు
ముంబై: టీమిండియా మహిళల జట్టుపై బీసీసీఐ వివక్ష చూపించిందంటూ వారం క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌కు పర్యటనకు టీమిండియా పురుషులు జట్టు, మహిళల జట్టు ఏకకాలంలో బయల్దేరాల్సి ఉంది. అయితే ఇరు జట్లు ఒకే ఫ్లైట్‌లో వెళ్లరని.. మహిళల జట్టుకోసం మరో చార్టడ్ ఫ్లైట్ సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఖండించిన బీసీసీఐ మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ లాంటి సీనియర్ క్రికెటర్లతో మాట్లాడించింది. బీసీసీఐ మాపై ఎలాంటి వివక్ష చూపించలేదని.. మాకు చార్టడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు. తాజాగా జీతాల చెల్లింపు విషయంలో బీసీసీఐ మరోసారి వివక్ష చూపిస్తుందంటూ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పురుషుల జట్టులో ఆటగాళ్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించలేదని సమాచారం. విషయంలోకి వెళితే.. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ 5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.36 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చింది. అయితే ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్‌మనీని మహిళా క్రికెటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్‌కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్ కరెన్సీలో రూ. 24లక్షలు). దీనివల్ల మహిళ క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే పురుష క్రికెటర్లు ఒక సిరీస్ ఆడిన వారానికే వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి చేరతాయి.. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. ఇదే విషయమై ఫిమేల్ క్రికెట్ ఫెడరేషన్ సభ్యులు స్పందించారు. ''బీసీసీఐకి పురుష క్రికెటర్లపై ఉన్న ప్రేమ మహిళల క్రికెటర్లపై ఎందుకు లేదు. ఏడాది క్రితం ఐసీసీ ఇచ్చిన ప్రైజ్‌మనీని ఇప్పటివరకు ఆటగాళ్లకు చెల్లించలేదు. దీనికి వివక్ష అనకుండా ఇంకేం అంటారో మీరే చెప్పిండి. సమయానికి ఆ డబ్బు అందించి ఉంటే కరోనా, లాక్డౌన్ సమయాల్లో వారికి ఎంతగానో ఉపయోగపడేవి. కాగా ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చదవండి: షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్ తల్లికి సాయం టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
వ్యాక్సిన్ వేసుకున్నారా? ఇలా చేస్తే 5 వేలు మీ సొంతం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ వ్యాక్సినేషన్ క్యాంపైన్ నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన వాళ్లకి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు భారత ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇంట్లో ఉండే 5000 రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అసలు ఏం చేయాలి.. సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసిన వాళ్ల ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం కూడా ఇలానే వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఫోటో తీసుకోని ప్రభుత్వం తెలిపిన వెబ్సైట్లో మన ఫోటోను షేర్ చేయాలి. మన ఫోటోతో పాటు ట్యాగ్ లైన్ కూడా రాసి పంపిస్తే చాలు. ఆ ట్యాగ్ కూడా వ్యాక్సిన్ ప్రయోజనాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం సంబంధించి ప్రజలను ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. ఇలా వచ్చిన ఫోటోలలో ప్రతీ నెల 10 మందిని ప్రభుత్వం ఎంపిక చేసి వారికి అక్షరాల ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్‌ను అందివ్వనున్నారు. ఎలా చేయాలి.. మీరు ముందుగా myGov.in పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ట్యాబ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసించుకోవాలి. అనంతరం మీ వివరాలని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. తర్వాత మీరు వ్యాక్సిన్ వేసుకునేటప్పటి ఫోటోతో పాటు టాగ్ లైన్‌ని జత చేసి పంపితే చాలు. చదవండి: వైరల్: ఓం కరోనా ఫట్,ఫట్,ఫట్ స్వాహా!.. Recently took the #COVIDVaccine? Here's your chance to inspire millions to get #vaccinated too! Share your vaccination picture with an interesting tagline & stand a chance to win ₹5,000! Visit: https://t.co/rD28chyxrV @PMOIndia @MoHFW_India @PIB_India @MIB_India pic.twitter.com/DHoB3PKCwn— MyGovIndia (@mygovindia) May 19, 2021 -
ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పాలి. మొన్నటి వరకు ఐస్ బకెట్ ఛాలెంజ్, ఫ్లిప్ ఛాలెంజ్‌లంటూ రకరకాల పేర్లతో ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇందులో కొన్ని సెలబ్రిటీలను సైతం ఆకట్టుకొని వారిని కూడా పాల్గొనేలా చేశాయి. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడం, ఇలాంటి ఛాలెంజ్‌లు నెటిజన్లను ఆకట్టుకోవడంతో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మరో కొత్త ఛాలెంజ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్‌లో డబ్బులు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ అంత సులువని మాత్రం అనుకోకండి. ఛాలెంజ్‌లో పాల్గొంటే..మనీ మీ సొంతం చాలెంజ్ ఏమనగా.. పాములతో ఉన్న ఓ బాత్ టబ్‌లో 30 సెకండ్లు గడిపితే ఏకంగా రూ.7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు ఈ ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. ఇదొక్కటే కాదండోయ్ ఈ లిస్ట్‌లో మరిన్ని మన కోసం ఉన్నాయి. ఒక గాజు బాక్సులో డబ్బులను పెట్టి అందులో పెద్ద సైజు బొద్దింకలను వేశాడు. వాటిని తాకకుండా ఎంత డబ్బు తీసుకుంటే అంత మనదేనంటూ మరో ఛాలెంజ్ విసిరాడు. సాలీడులను శరీరంపై పారించడం, భరించలేని వాసన వస్తున్న కుళ్లి పోయిన కాయగూరల టబ్‌లో పడుకోవడం లాంటి చిత్ర విచిత్రమైన ఛాలెంజ్‌లతో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడమే కాకుండా, ఏకంగా రెండు కోట్లకుపైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. టై చేయాలనుకునే వారు చేయండి. పాములంటే భయపడే వాళ్లు మాత్రం ఈ ఛాలెంజ్‌కు జర దూరంగా ఉండండి. ( చదవండి: ఈ సెక్యూరిటీ గార్డ్ పని చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే! ) -
కప్ కొడితే కాసుల పంట...
న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) ఈ మెగా ఈవెంట్ ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి 30 లక్షల డాలర్ల (రూ. 22 కోట్ల 51 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఓవరాల్‌గా యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రైజ్‌మనీ 5 కోట్ల 34 లక్షల డాలర్లు (రూ. 400 కోట్లు) కావడం విశేషం. ఈ మొత్తం కాకుండా... కరోనా కారణంగా అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు ఆగిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు సహాయం నిమిత్తం 76 లక్షల డాలర్లను (రూ. 57 కోట్లు) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) క్రీడాకారుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తొలి రౌండ్లో ఓడిన వారికి ఐదు శాతం ప్రైజ్‌మనీ పెంచారు. గత సంవత్సరం 58 వేల డాలర్లు ఇవ్వగా... ఈసారి తొలి రౌండ్లో వెనుదిరిగిన వారికి 61 వేల డాలర్లు (రూ. 45 లక్షల 77 వేలు) లభిస్తాయి. కరోనా కారణంగా ఈసారి యూఎస్ ఓపెన్ టోర్నీని నేరుగా మెయిన్ ‘డ్రా’తో మొదలుపెట్టనున్నారు. క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలేదు. ప్రైజ్‌మనీ వివరాలు సింగిల్స్ విజేత (పురుషులు, మహిళలు) 30 లక్షల డాలర్లు∙(రూ. 22 కోట్ల 51 లక్షలు) రన్నరప్ 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 25 లక్షలు) సెమీఫైనల్ – 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు) క్వార్టర్ ఫైనల్ – 4 లక్షల 25 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 18 లక్షలు) -
వెల్డన్... వింబుల్డన్
లండన్: కరోనాతో ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దయింది. కానీ ఈ మెగా టోర్నీ కోసం గంపెడాశలతో సిద్ధమైన ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? వారి ఆర్థిక వ్యయప్రయాసల సంగతేంటి? ఇదే కోణంలో ఆలోచించిన ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ తమ ప్రతిష్టను పెంచే నిర్ణయం తీసుకుంది. మెయిన్ ‘డ్రా’ సహా క్వాలిఫయింగ్ ఈవెంట్ ఆడగలిగే అర్హతలున్న ఆటగాళ్లకు కొంత ప్రైజ్‌మనీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం కోటీ 66 వేల పౌండ్లతో (రూ. 95 కోట్లు) నిధిని కేటాయించింది. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ఈ ప్రైజ్ మనీ వితరణ ఉంటుంది. క్వాలిఫయింగ్ ర్యాంకు అర్హత ఉన్న 224 ప్లేయర్లకు 12,500 పౌండ్లు (రూ.11 లక్షల 88 వేలు) చొప్పున, మెయిన్ ‘డ్రా’లో ఆడగలిగే 256 మంది క్రీడాకారులకు 25 వేల పౌండ్లు (రూ. 23 లక్షల 77 వేలు) చొప్పున, 120 మంది మెయిన్ ‘డ్రా’ డబుల్స్ ఆటగాళ్లకు 6,250 పౌండ్లు (రూ.5 లక్షల 94 వేలు) చొప్పున ఇవ్వనున్నారు. వీల్‌చైర్ ఆటగాళ్లకు 6,000 (రూ. 5 లక్షల 70 వేలు) చొప్పున, క్వాడ్ వీల్‌చైర్ ఆటగాళ్లకు 5,000 పౌండ్లు (రూ. 4 లక్షల 75 వేలు) చొప్పున అందజేస్తారు. -
టాయిలెట్ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు
వాషింగ్టన్ డీసీ : చంద్రుడిపై శాశ్వతంగా తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఆ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్టెమిస్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024లొ చంద్రుడిపై శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఈ మిషన్ లక్ష్య. శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటే అందులో టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి. భూమిపై ఉపయోగించే టాయిలెట్‌ను అక్క ఉపయోగించలేము. కారణం, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే. దీంతొ టాయిలెట్ నిర్మాణం నాసా వినూత్న పోటీని పెట్టింది. చంద్రునిపై టాయిలెట్ రూపకల్పన చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సవాలు చేసింది. మంచి డిజైన్ తయారుచేసి ఇచ్చిన వారికి నగదు బహుమతి కూడా ఇవ్వనుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా టాయిలెట్ ను డిజైన్ చేసిన వాళ్లకు 35వేల డాలర్ల(దాదాపు 26.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల వ్యక్తులు ఆగష్టు 17నాటికి డిజైన్లను పంపించాలని నాసా పేర్కొన్నది. 18 ఏళ్లు దాటిన వారు జట్టుగా లేదా వ్యక్తిగా ఈ డిజైన్ చేయవచ్చు. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఈ పోటీలో పాల్గొనాలంటే వారి డిజైన్లలను సమర్పించడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు నమోదు చేసుకోవాలి. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) భూమిపై మాదిరిగా గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై లేదు. అందువలన ప్రతిదీ అంతరిక్షంలో తిరుగుతుంది. అందుకే ఈ పని నాసాకు సవాలుగా మిగిలిపోయింది. అందుకే ఈ పోటీని పెట్టింది. భారీ నగదు బహుమతి ఉండడంతో కచ్చితంగా వేలకొద్ది డిజైన్లు నాసా దగ్గరకు వస్తాయి. అంతరిక్షంపై అవగాహన ఉండే వాళ్లకు ఇదో సువర్ణావకాశం. నాసా కోసం టాయిలెట్ డిజైన్ చేసి లక్షల్లో బహుమతి పొందొచ్చు. -
ఆ ప్రైజ్‌మనీ ఇవ్వలేదింకా...
కోల్‌కతా: రంజీ ట్రోఫీ రన్నరప్‌గా నిలిచిన బెంగాల్ జట్టుకు ఇంకా ఆ ప్రైజ్‌మనీ విడుదల కాలేదు. రూ. కోటి రావాల్సి ఉంది. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు అవిõÙక్ దాలి్మయా చెప్పారు. మార్చి రెండో వారంలో ఈ టోర్నీ ముగియగా సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. శుక్రవారం బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆన్లైన్ సెషన్ నిర్వహించగా... ఓ ఆటగాడు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఈ సంగతి మీడియాకు తెలిసింది. దీనిపై బెంగాల్ ఆటగాడొకరు మాట్లాడుతూ ‘ఇది ఫిర్యాదుగా భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మాకూ తెలుసు. కానీ మూడు నెలలు పూర్తయినా ఆ మొత్తం రాకపోవడం నిరాశగా ఉంది’ అని అన్నాడు. క్యాబ్ అధ్యక్షడు అవిõÙక్ స్పందిస్తూ ఈ విషయంలో అసోసియేషన్ చురుగ్గా పనిచేస్తోందని, దీనికి సంబంధించిన వ్యవహారాలు, అంతర్గత ఆడిట్ త్వరలోనే పూర్తి చేసి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపిస్తామని, రావాల్సిన ప్రైజ్‌మనీని త్వరలోనే విడుదల చేసేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. అయితే విజేతగా నిలిచిన సౌరాష్ట్రకు కూడా ఇటీవలే ప్రైజ్‌మనీని విడుదల చేసినట్లు తెలిసింది. -
ఈసారి విజేతకు రూ. 28 కోట్లు
లండన్: వన్డే క్రికెట్ ప్రపంచకప్‌నకు సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ కోటి డాలర్లు (రూ. 70 కోట్లు). విజేత జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 28 కోట్లు) లభిస్తాయి. రన్నరప్ జట్టు 20 లక్షల డాలర్లు (రూ. 14 కోట్లు) సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 61 లక్షలు) చొప్పున అందజేస్తారు. లీగ్ దశలో ఒక్కో విజయానికి 40 వేల డాలర్ల (రూ. 28 లక్షలు) చొప్పున ఇస్తారు. లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లకు లక్ష డాలర్ల (రూ. 70 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. మే 30 నుంచి జూలై 14 వరకు 46 రోజులపాటు ఇంగ్లండ్‌లోని 11 వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. 2015 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి విజేత, రన్నరప్ జట్లకు 2 లక్షల 50 వేల డాలర్ల చొప్పున ఎక్కువ ప్రైజ్‌మనీ లభించనుంది. -
ప్రపంచకప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
లండన్: ఇంగ్లండ్-వేల్స్ వేదికగా మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2019 కు సర్వం సిద్దమైంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగియడంతో కొందరు ఆటగాళ్లు కుటుంబంతో సమయం గడుపుతుండగా మరికొందు ప్రపంచకప్ కోసం నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సారి ప్రపంచకప్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే స్వదేశంలో జరగనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను తక్కువ అంచనావేయలేని పరిస్థితి ఇదిలా ఉండగా ఈసారి కప్ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకుపైగానే. అలాగే రన్నరప్‌కు రెండు మిలియన్ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతాయి. లీగ్ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. ఇక లీగ్ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది. మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. 45 మ్యాచులు రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరగనున్నాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. లీగ్‌దశ ముగిసేసరికి ఎవరైతే తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఒక సెమీఫైనల్, 11న ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మరో సెమీఫైనల్ జరుగుతుంది. ఇక చివరగా జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్‌లో తుదిపోరు ఉండనుంది. ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఇదివరకు 1975, 1979, 1983, 1999లో ప్రపంచకప్ వేడుకలు నిర్వహించాయి. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడ ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే ఆసీస్ జట్టు అత్యదికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వెస్టిండీస్, భారత్ రెండేసిసార్లు, పాక్, శ్రీలంక జట్లు చెరోసారి ఛాంపియన్లుగా నిలిచాయి. ఇక్కడ నిర్వహించిన టోర్నీల్లో వెస్టిండీస్ 1975, 1979ల్లో రెండు సార్లు, ఇండియా 1983లో, ఆస్ట్రేలియా 1999లో చెరోసారి కప్ గెలుచుకున్నాయి -
‘26/11’ సమాచారమిస్తే రూ.35 కోట్ల రివార్డు
వాషింగ్టన్: పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన వారి వివరాలు అందించిన వారికి రూ. 35.39 కోట్ల (50 లక్షల డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కుట్రకు పాల్పడిన, వారికి తోడ్పడిన లేదా వారిని ప్రేరేపించిన వారి వివరాలతోపాటు ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారానైనా నిర్భయంగా వెల్లడించవచ్చని పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలను కోరింది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ (ఆర్‌ఎఫ్‌జే) కార్యక్రమం కింద ఈ మొత్తం అందిస్తామని ప్రకటించింది. అలాగే కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ముంబైలో ఉగ్రదాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. దాడి జరిగి పదేళ్లు అయినా సూత్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు. దాడికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఆర్‌ఎఫ్‌జే ఆఫీసర్‌ను సంప్రదించవచ్చని అమెరికా సూచించింది. లేదా సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద కానీ, యూఎస్ కాన్సులేట్ వద్ద కానీ సమాచారాన్ని అందించవచ్చని పేర్కొంది. సా...గుతున్న ‘ముంబై’ విచారణ లాహోర్: 26/11 దాడులు జరిగి పదేళ్లు పూర్తయినా పాకిస్తాన్లో ఈ దాడుల సూత్రధారులకెవ్వరికీ శిక్ష పడలేదు. 2009 నుంచి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది. విచారణను రెండు నెలల్లో ముగించాలని 2015లోనే ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా ఇప్పటికీ కేసు విచారణలో పురోగతి లేదు. పైగా తరచుగా న్యాయమూర్తులను మార్చడం, ఓ దర్యాప్తు అధికారి హత్య తదితరాల కారణంగా ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ తొమ్మిదేళ్లుగా సాగుతోంది. -
జీవితాన్నే మార్చిన ఐడియా..
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. బెంగళూరు కుర్రాడు సమయ్ గోధిక ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు.. ఎందుకంటే పదహారేళ్ళ ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఐడియా కోట్ల రూపాయల బహుమతి తెచ్చి పెట్టింది మరీ. ఎలాగంటారా... ‘బ్రేక్ త్రూ జూనియర్ చాలెంజ్ ’పేరుతో నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో సమయ్ తొలి స్థానంలో నిలిచాడు. జీవ, భౌతిక శాస్త్రాల్లో కొత్త, వినూత్న ఐడియాలను సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా 3 నిముషాల వీడియో తీసి పంపడం ఈ పోటీ లక్ష్యం. సమయ్.. 24 గంటల మనిషి జీవితంలో గడియారానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఆలోచనను వీడియోగా పంపారు. మెచ్చిన న్యాయ నిర్ణేతల బృందం సమయ్కు రెండు లక్షల యాభై వేల డాలర్ల (రూ.1.8 కోట్ల) బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా సమయ్ సైన్స్ టీచర్ ప్రమీల మీనన్‌కి రూ.36 లక్షలు, పాఠశాలలో పరిశోధనశాల ఏర్పాటుకు రూ.కోటి అందించారు. ఇంతకీ సమయ్ దేని గురించి వీడియో పంపాడో తెలుసా.. మన జీవగడియారానికి పార్కిన్సన్స్ వ్యాధికి ఉన్న సంబందంపై వీడియో రూపొందించి పంపాడు. -
యూఎస్ ఓపెన్ విజేతకు రూ. 26 కోట్లు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ. 26 కోట్లు) ఎగరేసుకుపోవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 363 కోట్లు). ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ! గత మూడేళ్లుగా నగదు బహుమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇచ్చిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెనే. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్‌మనీ ‘సరిసమానం’ చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది. -
‘నన్ను చంపినవారిని పట్టించండి’
మాస్కో: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డీగో మారడోనాకు చిర్రెత్తుకొచ్చింది. అర్జెంటీనా- నైజీరీయా మ్యాచ్ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన ఈ దిగ్గజం.. స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పోందిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే మారడోనా గుండె పోటుతో మరణించాడంటూ కొందరు పుకార్లు సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హల్ చల్ చేశారు. అవికాస్త వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. స్పందించిన దిగ్గజం.. ‘మరణ వార్త’పై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు. చనిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కొందరు కల్పించారు అని మండిపడ్డారు. ఇక అంతటితో ఆగకుండా తనను చంపిన వారిని(చనిపోయినట్టు మెసేజ్ చేసినవారిని) పట్టించినవారికి పది వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మారడోనా వ్యక్తిగత న్యాయవాది తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంజీనా- నైజీరియా మ్యాచ్ సందర్భంగా మారడోనా ప్రవర్తించిన తీరు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ ప్రేక్షకులను గేలి చేస్తూ చేతితో అసభ్యకర సంజ్ఞలు చేయండపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మారడోనాపై కోపంగానే కోందరు ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కడప విద్యార్థికి గూగుల్ ప్రైజ్ మనీ
కడప కల్చరల్ : ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ గూగుల్‌లో ఓ లోపాన్ని కనుగొన్న వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోపాల్‌సింగ్, ఆ సమాచారాన్ని గూగుల్ సంస్థకు తెలియజేశాడు. తప్పును తమకు వెంటనే తెలియజేసినందుకు గూగుల్ యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించి గోపాల్‌సింగ్‌ను అభినందించింది. స్థానిక కేఎస్ఆర్ఎం కళాశాలలో నాలుగో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న గోపాల్‌సింగ్ గుగూల్లోని ఓ ప్రత్యేకమైన లోపాన్ని కనుగొన్నారు. ఇందుకు గూగుల్ ప్రతినిధులు ఆయనకు 3133.70 డాలర్లు (రూ. 2.10 లక్షలు) నగదును బహుమతిగా ప్రకటించారు. ఈ లోపం ద్వారా గూగుల్‌తో పాటు ఆ సంస్థతో టైఅప్ అయిన కంపెనీల రహస్యాలను ఇతరులు చౌర్యం చేసే ప్రమాదం ఉందని, దాన్ని తాను గుర్తించి గూగుల్‌కు తెలియజేసినట్లు గోపాల్‌సింగ్ తెలిపారు. -
...ఈసారి అలా కుదరదు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఆడేందుకు రావడం... గాయపడ్డామంటూ తొలి రౌండ్లోనే వైదొలగడం... ఇలా పరిపాటైన ఆటగాళ్లకు వింబుల్డన్ నిర్వాహకులు గట్టిషాకే ఇచ్చారు. అలా వచ్చి ఇలా వెనుదిరిగితే పూర్తి ప్రైజ్‌మనీ ఇవ్వమని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ (వింబుల్డన్) స్పష్టం చేసింది. ఈసారి కొత్తగా ‘ఫిఫ్టీ– ఫిఫ్టీ’ నిబంధనను తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొందరు ప్లేయర్లు ముందస్తు గాయాలతోనే ఆడేందుకు వస్తారు. గాయమైందని అర్ధాంతరంగా నిష్క్రమిస్తారు. ప్రతిష్టాత్మక విం బుల్డన్లో తొలిరౌండ్లో పోరాడి ఓడినా... ఆడక ఓడినా పెద్ద మొత్తం (రూ. 33 లక్షలు)లోనే ప్రైజ్‌మనీ వస్తుంది. దీన్ని చేజిక్కించుకునేందుకు జిమ్మిక్కులతో వచ్చే ప్లేయర్లకు ఫిఫ్టీ–ఫిఫ్టీ నిబంధనతో ఇక బ్రేక్ పడనుంది. అలాంటి వారికి కేవలం సగం సొమ్మే ఇస్తారు. గతేడాది ఏకంగా 7 తొలిరౌండ్ మ్యాచ్‌లు అనుచిత గాయాల కారణంతో అర్ధాంతరంగానే ఆగిపోయాయి. దీనిపై స్టార్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. -
భారత విద్యార్థికి 66 లక్షల బహుమతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన క్విజ్ పోటీలో లక్ష డాలర్ల (దాదాపు రూ. 66 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. బ్రౌన్ యూనివర్సిటీలో ప్రజారోగ్యం, ఆర్థిక శాస్త్రం కోర్సు తొలి ఏడాది చదువుతున్న ధ్రువ్ గౌర్ అనే యువకుడు జియోపార్డీ కాలేజ్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన ఈ పోటీలో బహుమతి గెలుపొందాడు. మరో 14 మందితో కలిసి పోటీలో పాల్గొన్న అతను శుక్రవారం విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతను ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ అనే మరో క్విజ్ పోటీలో పాల్గొనేందుకూ అర్హత సాధించాడు. జార్జియా రాష్ట్రానికి చెందిన ధ్రువ్ గతంలోనూ అనేక పోటీలు, ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చాటాడు. అత్యంత తెలివైన వాళ్లయిన 14 మందిని ఓడించి తాను ఈ పోటీలో గెలుస్తానని తొలుత అస్సలు అనుకోలేదంటూ ధ్రువ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. -
క్యాచ్ పట్టి..జాక్‌పాట్ కొట్టాడు
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన హోరాహోరి టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురవగా.. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన ఓ అభిమానికి కాసుల వర్షం కురిసింది. ఇరు జట్లు 500పైగా పరుగులు నమోదు చేసి అభిమానులను హోరెత్తించగా.. రాస్ టేలర్ సిక్సర్ ఓ అభిమానికి ఏకంగా జాక్‌పాట్ తగిలేలా చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్లో టేలర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ బంతిని స్టాండ్స్‌లో నిల్చోన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్ అనే 20 ఏళ్ల యువకుడు ఒంటిచేత్తో పట్టేశాడు. ఈ క్యాచ్‌కు ముగ్ధులైన స్థానిక శీతల పానియాల కంపెనీ ఈ అభిమానికి రూ.24 లక్షలు( 50 వేల న్యూజిలాండ్ డాలర్లను) బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా స్టాండ్స్‌లోకి ఆటగాళ్లు కొట్టిన బంతుల్ని క్యాచులు అందుకోవటం అభిమానులకు ఎంతో సరదా. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ రకమైన వినోదం చూస్తూనే ఉంటాం. ఇలా తన సరదా కోసం ప్రయత్నిస్తే వెతుకొంటూ బహుమానం రావడంతో మిచెల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ‘నేను లెఫ్ట్ హ్యాండ్ కానప్పటికి ప్రయత్నించా. అనుకోకుండా బంతి నాకు చిక్కింది. అనంతరం అందరు నాపై పడ్డారు.’ అని విద్యార్థి అయిన మిచెల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిచినప్పటికి మిచెల్‌కు బహుమానం రావడంతో కివీస్ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ క్యాచ్‌పై రాస్ టేలర్ సైతం అతన్ని ప్రశంసిస్తూ గ్లోవ్స్, మ్యాచ్ బంతిని బహుమానంగా ప్రకటించాడు. Congratulations Mitch on a great catch and 50k 💰 Enjoy my gloves and the match ball… https://t.co/2F4G9sJaXz — Ross Taylor (@RossLTaylor) 16 February 2018 -
క్యాచ్ పట్టాడు.. జాక్‌పాట్ కొట్టాడు
-
బిగ్‌బాస్ షో ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో అతితక్కువ కాలంలోనే అభిమానుల మనసును చూరగొంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆషోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్‌లో ఎక్కువ మందికి బిగ్బాస్షో కనెక్ట్ అయింది. మొదట14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ షో 70రోజుల పాటు జరగనుంది. ఇందులో పాల్గొనే శనివారం పోటీలో విన్నర్ గెలుచుకొనే డబ్బు మొత్తాన్ని ప్రకటించారు. షోలో గెలిచిన వారికి రూ.50లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు. గెలుచుకున్న డబ్బును ఏం చేస్తారంటూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న ఒక్కొక్కరు తన అభిప్రాయాలను వెల్లడించారు. ధనరాజ్ తన శ్రీమతికి ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా, కత్తి మహేష్ మాత్రం గెలిచిన మొత్తాన్ని తన భార్య చేతిలో పెడతానంటూ సమాధానమిచ్చాడు. -
ప్రొ కబడ్డీ లీగ్–5 విజేతకు రూ.3 కోట్లు
మొత్తం ప్రైజ్‌మనీ రూ.8 కోట్లు న్యూఢిల్లీ: తొలి సీజన్ నుంచి అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి ప్రైజ్‌మనీ కూడా భారీగా పెరిగింది. గత సీజన్లో రూ.6 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఈసారి రూ. 8 కోట్లకు పెరిగింది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్‌కు రూ. కోటీ 80 లక్షలు లభిస్తాయి. మూడో స్థానం పొందిన జట్టుకు రూ. కోటీ 20 లక్షలు అందజేస్తారు. ‘అత్యంత విలువైన ఆటగాడు’ అవార్డు పొందిన వారికి రూ.15 లక్షలు దక్కుతాయి. ఓవరాల్‌గా లీగ్‌లో 12 జట్ల మధ్య 138 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈనెల 28న హైదరాబాద్‌లో మొదలయ్యే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడుతుంది. అక్టోబరు 28న ఫైనల్ జరుగుతుంది. -
ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులకు ‘శాట్స్’ నగదు బహుమతిని అందజేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన రాష్ట్ర క్రీడాకారులు రంజిత్, నందినిలకు శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు రూ. 1.25 లక్షల చెక్‌ను అందజేశారు. మొత్తం 8 దేశాలు తలపడిన ఈ టోర్నీలో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, పీఈటీలు పరమేశ్, సోని పాల్గొన్నారు. -
రంజీ జట్టుకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణిస్తోన్న హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం లభించనుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో జట్టులోని సభ్యులకు తలా లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి రూ. 50,000 ఇవ్వనున్నారు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ రాణిస్తే దానికి తగిన ప్రోత్సాహకం ప్రకటిస్తామని హెచ్‌సీఏ తెలిపింది. -
హైదరాబాద్‌కు మూడో స్థానం
బెంగళూరు: ఐపీఎల్ తరహాలో దేశంలో జరిగే లూయిస్ ఫిలిప్ కప్ గోల్ఫ్ లీగ్‌లో బరిలోకి దిగిన తొలి సీజన్లోనే ఎన్స్పోర్ట్స్ హైదరాబాద్ జట్టు ఆకట్టుకుంది. కేజీఏ గోల్ఫ్ కోర్స్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచింది. టేక్ చెన్నై జట్టు విజేతగా నిలువగా... కపిల్‌దేవ్‌కు చెందిన దేవ్ చండీగఢ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. చౌరాసియా, చిక్కరంగప్ప అమోఘంగా రాణించడంతో టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు రూ.36 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. ఎన్స్పోర్ట్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ప్రకాశ్ చౌహాన్, గగన్‌జీత్ భుల్లర్ ఆకట్టుకున్నారు. మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగిన ఈ లీగ్‌లో ఆడిన తొలి సీజన్లో సంతృప్తికర ఫలితాన్ని సాధించామని హైదరాబాద్ జట్టు యజమాని ఎన్.శ్రీధర్‌రెడ్డి అన్నారు. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
► 10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు ► ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోకి ► వీనస్ ఇంటికి... సెరెనా ముందుకు పారిస్: కెరీర్ గ్రాండ్‌స్లామ్‌పై గురి పెట్టిన సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా ఈ నంబర్‌వన్ ప్లేయర్ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో 10 కోట్ల డాలర్ల (రూ. 674 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 9 కోట్ల 96 లక్షల 73 వేల 404 డాలర్ల ప్రైజ్‌మనీతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో అతని ఖాతాలో అదనంగా 3 లక్షల 27 వేల 471 డాలర్లు జమయ్యాయి. దాంతో జొకోవిచ్ కెరీర్ ప్రైజ్‌మనీ 10 కోట్ల 875 డాలర్లకు చేరింది. ఓవరాల్ కెరీర్ ప్రైజ్‌మనీ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్-9 కోట్ల 80 లక్షల 11 వేల 727 డాలర్లు), రాఫెల్ నాదల్ (స్పెయిన్-7 కోట్ల 82 లక్షల 23 వేల 403 డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-4, 6-1, 7-5తో 14వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. వర్షం కారణంగా మంగళవారం మూడో సెట్లో నిలిచిపోయిన ఈ మ్యాచ్ బుధవారం కొనసాగింది. జొకోవిచ్ మూడు, నాలుగు సెట్లలో గెలిచి వరుసగా 28వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బెర్డిచ్ 6-3, 7-5, 6-3తో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై, 12వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4-6, 6-2, 6-2, 6-3తో గుల్బిస్ (లాత్వియా)పై, 13వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 6-2, 6-7 (2/7), 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచారు. సెమీస్‌లో వావ్రింకా: మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-2, 6-1, 7-6 (9/7)తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై గెలిచాడు. బాసిన్‌స్కీ జోరు: మహిళల సింగిల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ (అమెరికా)లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టాప్ సీడ్ సెరెనా 6-1, 6-1తో 18వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తుగా ఓడించగా... ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ వీనస్‌పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 7-6 (7/4), 6-3తో 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) 7-5, 7-5తో 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై సంచలన విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ‘మిక్స్డ్’ క్వార్టర్స్‌లో సానియా జంట మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 6-7 (6/8), 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలీజా కార్నెట్-ఐసెరిక్ (ఫ్రాన్స్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న (భారత్) -మెర్జియా (రుమేనియా)... పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంటలకు క్వార్టర్ ఫైనల్లో పరాజయాలు ఎదురయ్యాయి. -
హెచ్ఐఎల్ ప్రైజ్‌మనీ రూ. 5.70 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగో అంచె హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ప్రైజ్‌మనీని నిర్వాహకులు రూ. 5.70 కోట్లకు పెంచారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2.50 కోట్లు, రన్నరప్‌కు 1.75 కోట్లు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 75 లక్షలు అందజేస్తారు. ఈ టోర్నమెంట్ ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆరు నగరాల్లో జరగనుంది. ‘కోల్ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’కు ఇచ్చే నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) రూ. 50 లక్షలకు పెంచింది. ‘కోల్ ఇండియా గోల్ ఆఫ్ ద మ్యాచ్’ ఆటగాడికి రూ. 50 వేలు చెల్లిస్తారు. -
ఫేస్ బుక్ సెల్ఫీ ఎంత పనిచేసింది!
మెల్ బోర్న్: గుర్రపు పందెంలో గెల్చుకున్న సొమ్మును 'ఫేస్ బుక్'లో పోగొట్టుకుంది ఓ ఆస్ట్రేలియా మహిళ. ఎఫ్ బీలో పోస్టు చేసిన సెల్ఫీయే ఆమె డబ్బు పోవడానికి కారణమైంది. అదేలాగంటే... చాంటెలె అనే మహిళ పెర్త్ అస్కట్ రేసుకోర్స్ లో మెల్న్ బోర్న్ కప్ పోటీలను వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై 20 డాలర్లు పందెం కాసింది. రేసులో గెలవడంతో ఆమెకు 825 డాలర్లు వచ్చాయి. ఆనందంతో రేసు టికెట్ తో సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ సెల్ఫీకి క్యాప్షన్ కూడా పెట్టింది. 15 నిమిషాల తర్వాత పందెంలో గెలిచిన సొమ్ము కోసం నిర్వాహకులను సంప్రదించింది. అప్పటికే ఎవరో నగదు తీసుకెళ్లిపోయారని చెప్పడంతో చాంటెలె మొదట అవాక్కయింది. తర్వాత రియలైజ్ అయింది. ఫేస్ బుక్ లో తాను పోస్ట్ చేసిన సెల్ఫీలోని టికెట్ పై ఉన్న బార్ కోడ్ ను కత్తిరించి సొమ్ముకు తీసుకున్నారని తెలుసుకుంది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎవరో ఈ పని చేసివుంటారని చాంటెలె పేర్కొంది. 'నా ఫోటోతో రేసులో గెలిచిన మొత్తాన్ని తెలివిగా కాజేశారు. నా ఫేస్ బుక్ లోని స్నేహితులే ఈ పని చేశారని నాకు తెలుసు. ప్రైజ్ మనీతో ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుదామనుకున్న నా ఆశపై నీళ్లు చల్లారు' అని చాంటెల్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది. -
ప్రైజ్‌మనీ అంటూ రూ.4 లక్షలకు టోపీ
షాద్‌నగర్ (మహబూబ్ నగర్) : ప్రైజ్ మనీ వచ్చిందని ఓ అమాయకుడిని మోసం చేసి లక్షలు దండుకున్న ఉదంతం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యూసుఫ్‌కు ఇటీవల 92347880001 నంబరు నుంచి ఆకాష్ వర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. 'కంగ్రాచులేషన్స్.. మీకు లక్కీ డిప్లో రూ.25 లక్షలు ప్రైజ్ వచ్చింది... ఆ డబ్బు కావాలంటే మేం సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు జమ చేయాల్సి ఉంటుంది' అని చెప్పాడు. ప్రైజ్ మనీ ఆనందంలో యూసుఫ్ ఆ వ్యక్తి చెప్పినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతను చెప్పిన సమయం ప్రకారం, తెలియజేసిన వ్యక్తుల పేరుతో రూ.4 లక్షలు జమ చేశాడు. అనంతరం ప్రైజ్‌మనీ ఎంతకీ రాకపోయేసరికి యూసఫ్ పదే పదే ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. చివరికి ఆన్లైన్లో ఒక చెక్కును యూసఫ్‌కు పంపించాడు. అది డూప్లికేట్ చెక్కు అని, ఒరిజినల్ చెక్కు కావాలంటే మరో రూ.1.70 లక్షలు ఖాతాలో జమ చేయాలని ఫోన్ చేశాడు. దీంతో యూసుఫ్ మోసపోయిన విషయం గమనించి శుక్రవారం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు. -
'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్ లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేసింది. కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నిలో ఆమె ఆడడం లేదు. మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడింది. కేరళ మూలాలు ఉన్న 23 ఏళ్ల పల్లికల్ 2011లో నేషనల్ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి ఆమె జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది. కేరళలో ఆడడాన్ని ఇష్టపడతానని, జాతీయ టోర్నిల్లో ఆడకపోవడం బాధగా ఉందని 18వ ర్యాంకులో కొనసాగుతున్న పల్లికల్ వాపోయింది. -
ఆనంద్, కార్ల్సన్ గేమ్ డ్రా
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ (భారత్) ‘డ్రా’ చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్‌కు పలుమార్లు గెలిచే అవకాశాలు వచ్చినా వ్యూహాల్లో తప్పిదాలతో చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. తెల్లపావులతో ఆడిన ఆనంద్ 53 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఆనంద్, కార్ల్సన్లతోపాటు ఈ టోర్నీలో ఫాబియానో కరువానా (ఇటలీ), అనీష్ గిరి (నెదర్లాండ్స్), వెస్లీ సో (అమెరికా), వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), మాక్సిమ్ లెగ్రేవ్ (ఫ్రాన్స్), మమెదైరోవ్ (అజర్బైజాన్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్) బరిలో ఉన్నారు. లక్ష యూరోల ప్రైజ్‌మనీతో పది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఈనెల 26న ముగుస్తుంది. -
పేరు పెట్టండి.. బహుమతి పొందండి
తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హస్త కళల అభివృద్ధి సంస్థకు పేరును, లోగోను సూచించి తగిన బహుమతి పొందాలని ఆ సంస్థ ఎం.డి. శైలజారామయ్యర్ సూచించారు. లేపాక్షి దేవాలయం ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉండటంతో ఆ పేరు, లోగో వారికే చెందుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థకు సంస్కృతీసంప్రదాయాలు, వారసత్వం ఉట్టిపడే పేరును సూచించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశా రు. ఈ నెల 15లోగా పేరు, లోగోను సూచిస్తూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. అత్యుత్తమైన మూడింటికి రూ. 15వేల చొప్పున నగదు అందించనున్నట్లు చెప్పారు. వివరాలకు 040 - 27616461 సంపద్రించాలని, aphdcltd@ yahoo.comకు మెయిల్ పంపాలని కోరారు. -
ప్రొ కబడ్డీ విజేత జైపూర్ పాంథర్స్
- ఫైనల్లో 35-24తో ముంబై పై గెలుపు - అభిషేక్ జట్టుకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ పోరులో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపింది. ఆదివారం ముంబై లోని ఎన్ఎస్సీఐ స్టేడియుంలో జరిగిన ఫైనల్లో 35-24 తేడాతో యు ముంబ జట్టును చిత్తు చేసి విజేతగా నిలిచింది. వునీందర్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, రాజేశ్ నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయుంలో కీలకపాత్ర పోషించారు. ముంబై కెప్టెన్ అనూప్ కువూర్ (11 రైడ్ పాయింట్లు) ఊహించినట్లే తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చాడు. అయితే జైపూర్ జట్టు డిఫెండింగ్ ద్వారా 13 పాయింట్లు సాధించి తవుకు తిరుగులేదని నిరూపించింది. తొలి అర్ధభాగం ఆరంభంలో జైపూర్ పాంథర్స్, ముంబై మధ్య హోరాహోరీ పోరు సాగింది. 4-2తో ముంబై ఆరంభంలో ఆధిక్యంలో ఉన్నా... ఆ తర్వాత పాంథర్స్ పుంజుకుని 8-6తో సత్తా చాటింది. ద్వితీయూర్ధంలోనూ జైపూర్ పాంథర్స్ అదే జోరును కొనసాగించి చాంపియున్‌గా నిలిచింది. వుూడో స్థానం కోసం జరిగిన పోరులో పాట్నా పైరేట్స్ 29-22తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేతగా నిలిచిన జైపూర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్‌వునీ దక్కింది. రన్నరప్ ముంబై రూ. 25 లక్షలు, సెమీ ఫైనలిస్టులు పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు రూ. 12.5 లక్షల చొప్పున సొంతం చేసుకున్నాయి. -
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు 215 కోట్లు
వచ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు నగదు బహుమతిని భారీగా పెంచారు. చాంపియన్ జట్టు 215 కోట్ల రూపాయల్ని సొంతం చేసుకోనుంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో కంటే ఈ నగదు బహుమతి 17 శాతం ఎక్కువ. ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా ఈ మేరకు ప్రకటించింది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు 154 కోట్లు ఇవ్వనున్నారు. ఇక మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 135 కోట్లు, టోర్నీలో పాల్గొనే 32 జట్లకు తలా 9 కోట్ల రూపాయల చొప్పున అందజేయనున్నారు. ప్రపంచ కప్‌నకు బ్రెజిల్ ఆతిథ్యమివ్వనుంది. -
కార్ల్సెన్కు రూ. 9.90 కోట్లు
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవం సోమవారం జరిగింది. కొత్త చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)కు రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని అందజేశారు. కేవలం 10 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత కార్ల్సెన్కు ఆలివ్ ఆకులతో కూడిన దండను మెడలో వేసి... బంగారు పూతతో కూడిన ట్రోఫీని, రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీ చెక్నూ అందజేశారు. అనంతరం రన్నరప్ విశ్వనాథన్ ఆనంద్‌కు వెండి పళ్లెంతోపాటు రూ. 6 కోట్ల 3 లక్షల ప్రైజ్‌మనీని బహూకరించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్జినవ్ వరుసగా కార్ల్సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వైఫల్యం చెందినప్పటికీ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను తమ బ్రాండ్అంబాసిడర్గా కొనసాగిస్తామని ఐటీ శిక్షణ సంస్థ ‘నిట్’ స్పష్టం చేసింది.