
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఆడేందుకు రావడం... గాయపడ్డామంటూ తొలి రౌండ్లోనే వైదొలగడం... ఇలా పరిపాటైన ఆటగాళ్లకు వింబుల్డన్ నిర్వాహకులు గట్టిషాకే ఇచ్చారు. అలా వచ్చి ఇలా వెనుదిరిగితే పూర్తి ప్రైజ్‌మనీ ఇవ్వమని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ (వింబుల్డన్) స్పష్టం చేసింది. ఈసారి కొత్తగా ‘ఫిఫ్టీ– ఫిఫ్టీ’ నిబంధనను తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొందరు ప్లేయర్లు ముందస్తు గాయాలతోనే ఆడేందుకు వస్తారు. గాయమైందని అర్ధాంతరంగా నిష్క్రమిస్తారు.
ప్రతిష్టాత్మక విం బుల్డన్‌లో తొలిరౌండ్‌లో పోరాడి ఓడినా... ఆడక ఓడినా పెద్ద మొత్తం (రూ. 33 లక్షలు)లోనే ప్రైజ్‌మనీ వస్తుంది. దీన్ని చేజిక్కించుకునేందుకు జిమ్మిక్కులతో వచ్చే ప్లేయర్లకు ఫిఫ్టీ–ఫిఫ్టీ నిబంధనతో ఇక బ్రేక్ పడనుంది. అలాంటి వారికి కేవలం సగం సొమ్మే ఇస్తారు. గతేడాది ఏకంగా 7 తొలిరౌండ్ మ్యాచ్‌లు అనుచిత గాయాల కారణంతో అర్ధాంతరంగానే ఆగిపోయాయి. దీనిపై స్టార్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment