
మహిళల ప్రీమియర్ లీగ్- 2025 ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. శనివారం బ్రౌబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.
ఈ ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.
కాప్ ఒంటరి పోరాటం..
అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. ఓ దశలో ఢిల్లీని కాప్ ఒంటి చేత్తో గెలిపించేలా కన్పించింది.
కానీ ఆఖరిలో కాప్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారు అయింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. ఇక ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఎంత ప్రైజ్‌మనీ దక్కింది ఆరెంజ్? ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం.
ముంబైకి ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈ టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 3 కోట్లు నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా 523 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. అందుకు గాను 5 లక్షలు నగదు బహుమతి ఆమెకు దక్కింది. పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన అమీలియా కేర్‌కు కూడా రూ.5 లక్షలు నగదు లభించింది.
ప్రైజ్ మనీ వివరాలు..
విజేత- ముంబై ఇండియన్స్- రూ. 6 కోట్లు
రన్నరప్-ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లు
ఆరెంజ్ క్యాప్ విజేత- స్కివర్ బ్రంట్-రూ. 5 లక్షలు
పర్పుల్ క్యాప్ విజేత- కేర్- రూ. 5లక్షలు
మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్- స్కివర్ బ్రంట్(523 పరుగులు, 12 వికెట్లు)-రూ. 5 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-అమన్‌జోత్ కౌర్-రూ. 5 లక్షలు
సీజన్‌లో అత్యధిక సిక్సర్లు- ఆష్లీ గార్డనర్ (18 సిక్సర్లు)- రూ.5 లక్షలు
చదవండి: హ్యాట్సాఫ్ హర్మన్
Comments
Please login to add a commentAdd a comment