హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ ఎంతంటే? | WPL 2025 Final: Harmanpreet Kaurs heroics help Mumbai set 150 target | Sakshi
Sakshi News home page

హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ ఎంతంటే?

Published Sat, Mar 15 2025 9:47 PM | Last Updated on Sat, Mar 15 2025 9:47 PM

WPL 2025 Final: Harmanpreet Kaurs heroics help Mumbai set 150 target

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.

ఆమెతో పాటు నాట్‌ స్కివర్‌(30) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జానెసన్‌, చరణి, కాప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్‌ ఒ‍క్క వికెట్‌ సాధించారు.

తుది జట్లు
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీప‌ర్‌), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీప‌ర్‌), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి
చదవండి: IPL 2025: ఇషాన్ కిష‌న్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement