WPL 2025
-
ఐదేసిన అమేలియా కెర్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ యూపీ వారియర్జ్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. అమేలియా కెర్ ఐదు వికెట్లతో విజృంభించడంతో వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారియర్జ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా వాల్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. గ్రేస్ హ్యారిస్ (28), కెప్టెన్ దీప్తి శర్మ (27), వృందా దినేశ్ (10), ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్ డకౌట్లు కాగా.. చిన్నెల్ హెన్రీ 6, ఉమ్రా ఛెత్రీ ఒక పరుగు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్‌తో పాటు హేలీ మాథ్యూస్ (2), నాట్ సీవర్ బ్రంట్ (1), పరుణిక సిసోడియా (1) వికెట్లు తీశారు. వారియర్జ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగులు (8 ఓవర్లలో) జోడించారు. హ్యారిస్, వాల్ క్రీజ్‌లో ఉండగా.. వారియర్జ్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో వారియర్జ్ కష్టాల్లో పడింది. హ్యారిస్, వాల్ ఔటయ్యాక వారియర్జ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోయింది. సెకండ్ డౌన్లో వచ్చిన దీప్తి శర్మ చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆఖర్లో ఎక్లెస్టోన్ ఓ మోస్తరుగా బ్యాట్‌ను ఝులిపించడంతో వారియర్జ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.ఈ సీజన్లో వారియర్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. -
మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో జెయింట్స్ ఘన విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ (59 బంతుల్లో 96 నాటౌట్; 17 ఫోర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోగా, హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం వారియర్స్ 17.1 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. షినెల్ హెన్రీ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్రేస్ హారిస్ (30 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కాశ్వీ, తనూజ చెరో 3 వికెట్లు తీశారు. వాజ్‌పేయి ఇకానా స్టేడియంలో ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కాగా...సొంత మైదానంలో యూపీ చిత్తుగా ఓడింది. తొలి ఓవర్లోనే హేమలత (2) వికెట్ కోల్పోయినా... మూనీ, హర్లీన్ రెండో వికెట్‌కు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముఖ్యంగా మూనీ బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరును అందించింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. యూపీ బౌలర్లంతా సమష్టిగా విఫలం కాగా...ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాకు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు! ఛేదనలో వారియర్స్ మరీ పేలవంగా ఆడింది.ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి డాటిన్ దెబ్బ కొట్టగా...పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 29/4కు చేరింది. ఆ తర్వాత ఏ దశలోనూ యూపీ కోలుకోలేకపోయింది. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ ఆడుతుంది.చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం -
‘ప్లే ఆఫ్స్’కు ఢిల్లీ క్యాపిటల్స్
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంత ప్రేక్షకుల్ని మళ్లీ నిరాశపర్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు గడ్డపై వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. తద్వారా ఈ వేదికపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూసిన స్మృతి మంధాన సేన ప్లేఆఫ్స్ రేసుకు దాదాపు దూరమైంది. మరో వైపు లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. శనివారం జరిగిన పోరులో మెగ్‌లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ 9 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి (8) పేలవంగా ఆడి నిష్క్ర మించగా, ఎలైస్ పెరీ (47 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 33; 2 సిక్స్‌లు)తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. ప్రత్యర్థి బౌలర్లలో శిఖా పాండే, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ మెగ్‌లానింగ్ (2) సింగిల్ డిజిట్‌కే అవుటవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (43 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా బెంగళూరు బౌలింగ్‌ను దంచేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ (38 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి వీరవిహారం చేసిన షఫాలీ అబేధ్యమైన రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించింది. జెస్, షఫాలీ ఇద్దరు కూడా 30 బంతుల్లోనే ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి)లానింగ్ (బి) శిఖా 8; డానీవ్యాట్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ 21; పెర్రీ నాటౌట్ 60; రాఘ్వీ బిస్త్ (స్టంప్డ్) బ్రైస్ (బి) శ్రీచరణి 33; రిచాఘోష్ (సి) లానింగ్ (బి) శ్రీచరణి 5; కనిక (సి) షఫాలీ (బి) శిఖా 2; జార్జియా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–9, 2–53, 3–119, 4–125, 5–128. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–18–1, శిఖా పాండే 4–0–24–2, జెస్ జొనాసెన్ 3–0–33–0, అనాబెల్ 4–0–27–0, శ్రీచరణి 4–0–28–2, మిన్నుమణి 1–0–14–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెర్రీ (బి) రేణుక 2; షఫాలీ నాటౌట్ 80; జెస్ జొనాసెన్ నాటౌట్ 61; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 151. వికెట్ల పతనం: 1–5. బౌలింగ్: రేణుక 4–1–28–1, కిమ్‌గార్త్ 3–0–25–0, ఎలిస్ పెర్రీ 2–0–24–0, జార్జియా 3–0–21–0, స్నేహ్ రాణా 1.3–0–22–0, ఏక్తాబిస్త్ 1–0–15–0, రాఘ్వీ బిస్త్ 1–0–11–0. -
WPL 2025: స్మృతి మంధాన విఫలం.. దంచికొట్టిన ఎలిస్ పెర్రీ.. కానీ!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.గత మూడు మ్యాచ్‌లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది.సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్- హాడ్జ్(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.డబ్ల్యూపీఎల్-2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.ఆర్సీబీ వుమెన్స్మృతి మంధాన (కెప్టెన్), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
ఢిల్లీ ‘టాప్’ షో
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్ల సమష్టి కృషికి ఓపెనర్లు మెగ్ లానింగ్, షఫాలీ వర్మ మెరుపులు తోడవడంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (16 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (22; 4 ఫోర్లు), సివర్ బ్రంట్ (18), అమేలియా కెర్ (17), అమన్‌జ్యోత్ కౌర్ (17) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్, మిన్ను మణి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 14.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. షఫాలీ అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మెగ్ లానింగ్ లాంఛనాన్ని పూర్తి చేసింది. ముంబై బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ ఏకైక వికెట్ పడగొట్టింది. జెస్ జొనాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో 6 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 విజయాలు, 2 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ పట్టిక రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) సారా (బి) శిఖ 11; హేలీ మాథ్యూస్ (సి) షఫాలీ వర్మ (బి) అనాబెల్ 22; సివర్ బ్రంట్ (సి అండ్ బి) జెస్ జొనాసెన్ 18; హర్మన్‌ప్రీత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జెస్ జొనాసెన్ 22; అమేలియా కెర్ (సి) అనాబెల్ (బి) మిన్ను 17; సజన (సి) లానింగ్ (బి) మిన్ను 5; అమన్‌జ్యోత్ (నాటౌట్) 17; కమలిని (బి) జెస్ జొనాసెన్ 1; సంస్కృతి గుప్తా (సి) జెమీమా (బి) మిన్ను 3; కలిత (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–35, 2–35, 3–73, 4–83, 5–100, 6–101, 7–104, 8–115, 9–123. బౌలింగ్: మరిజానె కాప్ 3–0–16–0; శిఖ పాండే 4–1–16–1; జెస్ జొనాసెన్ 4–0–25–3; అనాబెల్ సదర్లాండ్ 4–0–21–1; టిటాస్ సాధు 2–0–24–0; మిన్ను మణి 3–0–17–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (నాటౌట్) 60; షఫాలీ వర్మ (సి) అమేలియా కెర్ (బి) అమన్‌జ్యోత్ 43; జెమీమా రోడ్రిగ్స్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 124. వికెట్ల పతనం: 1–85; బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–26–0; సివర్ బ్రంట్ 2–0–27–0; హేలీ మాథ్యూస్ 2–0–16–0; అమేలియా కెర్ 2–0–20–0; అమన్‌జ్యోత్ కౌర్ 2–0–12–1; సంస్కృతి గుప్తా 1.3–0–14–0; కలిత 1–0–9–0. -
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో ఇవాళ (ఫిబ్రవరి 28) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జెస్ జోనాస్సెన్ (4-0-25-3), మిన్నూ మణి (3-0-17-3), శిఖా పాండే (4-1-16-1), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-21-1) చెలరేగడంతో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ముంబై ఇన్నింగ్స్‌లో 22 పరుగులే అత్యధికం. హేలీ మాథ్యూస్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తలో 22 పరుగులు చేశారు. నాట్ సీవర్ బ్రంట్ 18, అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్ తలో 17 పరుగులు (నాటౌట్) చేశారు. ఓపెనర్ యస్తికా భాటియా 11 పరుగులు చేసింది. సజీవన్ సజనా 5, జి కమలిని 1, సంస్కృతి గుప్త 3 పరుగులు చేశారు. జింటమణి కలిత డకౌటైంది. ఈ సీజన్లో అద్భుత విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాటర్లెవరూ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు మంచి ఆరంభమే లభించినా.. ఆమె పెద్ద స్కోర్ చేయలేకపోయింది. విదేశీ ప్లేయర్లు హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కెర్ రెండంకెల స్కోర్లు చేసినా బంతులు వృధా చేశారు. ఈ మ్యాచ్‌లో ముంబై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్‌కు హర్మన్, బ్రంట్‌ల మధ్య నెలకొల్పబడిన 38 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌కు అత్యధికం. ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. టిటాస్ సాధు ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. ఆమె 2 ఓవర్లలో 24 పరుగులిచ్చింది.కాగా, ముంబై ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ముంబైతో పోలిస్తే ఢిల్లీ రన్‌రేట్ బాగా తక్కువగా ఉంది. ముంబై రన్‌రేట్ 0.780గా ఉండగా.. ఢిల్లీ రన్‌రేట్ మైనస్‌లో (-0.223) ఉంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే చేసింది. ఆర్సీబీ లాగే యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ తలో 5 మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
RCB Vs GG: మళ్లీ ఓడిన బెంగళూరు
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి విజయాలు అందుకున్న ఆర్సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది. మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...రాఘ్వీ బిస్త్ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), జార్జియా వేర్హామ్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్ (4) విఫలం కాగా... ఎలైస్ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్‌కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్నర్, లిచ్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్ ఓవర్లో గార్డ్నర్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) హర్లీన్ (బి) తనూజ 10; డానీ వ్యాట్ (ఎల్బీ) (బి) డాటిన్ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్నర్ 0; రాఘ్వీ (రనౌట్) 22; కనిక (సి అండ్ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్హామ్ (నాటౌట్) 20; గార్త్ (సి) మూనీ (బి) డాటిన్ 14; స్నేహ్ రాణా (నాటౌట్) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్: డాటిన్ 4–0–31–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–22–1, కాశ్వీ గౌతమ్ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) వేర్హామ్ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్) రిచా (బి) రేణుక 11; హర్లీన్ (సి) పెరీ (బి) వేర్హామ్ 5; గార్డ్నర్ (సి అండ్ బి) వేర్హామ్ 58; లిచ్‌ఫీల్డ్ (నాటౌట్) 30; డాటిన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, కిమ్ గార్త్ 2–3.–0–19–0, స్నేహ్ రాణా 4–0–23–0, ప్రేమ రావత్ 1–0–19–0, వేర్హామ్ 3–0–26–2, ఎలైస్ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే పరిమితం
డబ్ల్యూపీఎల్ 2025 ఎడిషన్‌లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఎల్లిస్ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది. ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ 4, రిచా ఘోష్ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్ (22), జార్జియా వేర్హమ్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్ గార్త్ (14) రెండంకెల స్కోర్ చేసింది. స్నేహ్ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్ (4-0-17-1), తనూజా కన్వర్ (4-0-16-2), కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. -
యూపీ జట్టులో చేరిన ఆసీస్ యువ బ్యాటర్
డబ్ల్యూపీఎల్ 2025 (WPL-2025) సీజన్ కోసం యూపీ వారియర్జ్ (UP Warriorz) ఆసీస్ యువ బ్యాటర్ జార్జియా వాల్‌తో (Georgia Voll) ఒప్పందం కుదర్చుకుంది. స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ప్లేయర్ చమారీ ఆటపట్టు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు (మార్చి 4 నుంచి శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది) లీగ్ నుంచి వైదొలగడంతో వారియర్జ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో ఆటపట్టు స్థానాన్ని వాల్ భర్తీ చేస్తుందని వారియర్జ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. వాల్‌ను వారియర్జ్ 30 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. వాల్ చేరికతో వారియర్జ్ బ్యాటింగ్ విభాగం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా తరఫున ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వాల్.. మూడు ఫార్మాట్లలో ఆకట్టుకుంది. 21 ఏళ్ల వాల్ తన రెండో వన్డేలోనే సెంచరీ చేసి సత్తా చాటింది. వాల్ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 3 వన్డేలు, 3 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడింది. వాల్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లో వాల్ పలు 90 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. ఇటీవల ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డుల్లో వాల్ ఉత్తమ దేశవాలీ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది.కాగా, ప్రస్తుత డబ్ల్యూపీఎల్ ఎడిషన్‌లో యూపీ వారియర్జ్ చెప్పుకోదగ్గ ప్రదర్శలు చేయడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే గెలుపొందింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో వారియర్జ్ ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది. అంతకుముందు వారియర్జ్ ఆర్సీబీపై సూపర్ ఓవర్లో సంచలన విజయం సాధించింది. దీనికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. వారియర్జ్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలడనుంది. ఈ మ్యాచ్ మార్చి 3న జరుగనుంది. నిన్నటి మ్యాచ్‌లో వారియర్జ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై ఈ సీజన్లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది.ఐపీఎల్ 2025 సీజన్లో యూపీ వారియర్జ్ పూర్తి జట్టు..కిరణ్ నవ్‌గిరే, బృందా దినేష్, దీప్తి శర్మ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హారిస్, ఉమా చెత్రీ (వికెట్‌కీపర్), చినెల్ హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకోర్, క్రాంతి గౌడ్, గౌహెర్ సుల్తానా, చమారి అటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్, అలానా కింగ్, అంజలి సర్వాణి, అరుషి గోయెల్, పూనమ్ ఖేమ్నార్ -
శివమెత్తిన సివర్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్లతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. నాట్ సివర్ బ్రంట్ (75 నాటౌట్; 3 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై సూపర్ ఓవర్లో నెగ్గిన యూపీ వారియర్స్... ఈ మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితమైంది. గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), దినేశ్ వృందా (30 బంతుల్లో 33; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. కెప్టెన్ దీప్తి శర్మ (4), కిరణ్ నవగిరె (1), తాలియా మెక్‌గ్రాత్ (1), షినెల్ హెన్రీ (7) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో సివర్ బ్రంట్ 3 వికెట్లు... షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సివర్ బ్రంట్ (44 బంతుల్లో 75 నాటౌట్; 13 ఫోర్లు), హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. యూపీ బౌలర్లు సైమా, షినెల్ హెన్రీ, సోఫీ ఎకిల్‌స్టోన్ ఓవర్లలో సివర్ మూడు బౌండరీల చొప్పున కొట్టింది. రెండో వికెట్‌కు హేలీ, సీవర్ 133 పరుగులు జోడించి ముంబై జట్టుకు అలవోక విజయాన్ని అందించారు. సివర్ బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ ఆడనుంది. -
ముంబై బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన యూపీ
డబ్ల్యూపీఎల్-2025లో ఇవాళ (ఫిబ్రవరి 26) ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. ముంబై బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా తలో 2, హేలీ మాథ్యూస్, అమెలియా కెర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. యూపీ ఇన్నింగ్స్‌లో గ్రేస్ హ్యారిస్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వృంద దినేశ్ (33) ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్వేతా సెహ్రావత్ (19), ఉమా ఛెత్రీ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్‌గిరే (1), కెప్టెన్ దీప్తి శర్మ (4), తహ్లియా మెక్‌గ్రాత్ (1), చిన్నెల్ హెన్రీ (7), సోఫీ ఎక్లెస్టోన్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సైమా ఠాకోర్ డకౌట్ కాగా.. క్రాంతి గౌడ్ (5) అజేయంగా నిలిచింది.ఈ మ్యాచ్‌లో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే గ్రేస్ హ్యారిస్, వృంద దినేశ్ చలువే. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. యూపీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే స్పల్ప వ్యవధిలో వీరు ఔట్ కావడంతో యూపీ ఇన్నింగ్స్ పతనం మొదలైంది. మధ్యలో శ్వేతా సెహ్రావత్, ఉమా ఛెత్రీ కొద్ది సేపు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో యూపీ 100 పరుగుల మార్కును దాటగలిగింది.అనంతరం ముంబై ఛేదనను నిదానంగా ప్రారంభించింది. తొలి 2 ఓవర్లలో ఆ జట్టు వికెట్లేమీ నష్టపోనప్పటికీ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్నెల్ హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్ తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సీజన్లో యూపీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన ముంబై మూడో ప్లేస్‌లో ఉంది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించిన గుజరాత్ చివరి స్థానంలో కొనసాగుతుంది. -
సూపర్ ఓవర్లో ఓటమి.. పెర్రీకి సారీ చెప్పిన మంధన
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ ఓవర్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఎల్లిస్ పెర్రీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పెర్రీతో పాటు డానీ వ్యాట్ హాడ్జ్ (57) కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.ఛేదనలో సోఫీ ఎక్లెస్టోన్ (19 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో (ఇన్నింగ్స్ చివర్లో) ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్జ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. కిమ్ గార్త్ అద్బుతంగా బౌలింగ్ చేసి వారియర్జ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం 4 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఎక్లెస్టోన్ సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేసింది. అద్భుతమైన టచ్‌లో ఉన్న పెర్రీని సూపర్ ఓవర్లో బరిలోకి దించకుండా స్మృతి మంధన పెద్ద తప్పు చేసింది. పెర్రీకి బదులు తనే బరిలోకి దిగడంతో సొంత అభిమానుల నుంచే ట్రోలింగ్‌ను ఎదుర్కొంది.ఓటమి అనంతరం మంధన పెర్రీకి క్షమాపణలు చెప్పింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ కోసం మ్యాచ్ గెలవలేకపోయినందుకు బాధగా ఉందని అంది. జట్టు మొత్తం పెర్రీకి సారీ చెప్పాలని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించినప్పటికి ఇలాంటి ఫలితం రావడంతో బాధాకరమని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్రీ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నిర్మించింది. గాయంతో బాధపడుతూనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లోనూ రాణించి ఓ వికెట్ తీసింది. పెర్రీ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడటం నిజంగానే బాధాకరం. ఇదే మ్యాచ్‌లో పెర్రీ డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్ స్కోరర్‌గా అవతరించింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. జట్టు నుంచి సహకారం లేకపోతే ఫలితాలు ఇలానే వస్తాయని అభిమానులు అంటున్నారు.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అద్భుతంగా ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోరును ప్రదర్శించింది. అయితే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి పెర్రీ అద్బుతంగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమెనే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుంది. పెర్రీ అద్భుత ప్రదర్శనల కారణంగానే ఈ సీజన్లో ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మంధన విఫలమవుతున్నా పెర్రీ ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచింది. -
ఢిల్లీ అలవోకగా...
బెంగళూరు: ఈ సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.డాటిన్ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్ కాప్, శిఖా పాండే, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనాసెన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆరంభంలోనే దెబ్బ... మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్ (5), లిచ్‌ఫీల్డ్ (0)లను అవుట్ చేసిన మరిజాన్ కాప్ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్ మూని (10), కాశ్వీ గౌతమ్ (0)లను అవుట్ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.కాసేపటికి కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్ కుదేలైంది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. ధనాధన్... సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్ మెగ్‌లానింగ్ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్నర్ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్ డియోల్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ కాప్ 5; లిచ్‌ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్ కాప్ 0; ఆష్లీ గార్డ్నర్ (బి) టిటాస్ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్ 26; తనూజ (రనౌట్) 16; భారతి (నాటౌట్) 36; సిమ్రన్ (సి) లానింగ్ (బి) అనాబెల్ 5; మేఘన (బి) జెస్ జొనాసెన్ 0; ప్రియా మిశ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్ కాప్ 4–1–17–2, టిటాస్ సాధు 2–0–15–1, అనాబెల్ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్ జొనాసెన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్నర్ 44; జెస్ జొనాసెన్ (నాటౌట్) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్ (సి) బెత్ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్ కాప్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్నర్ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1. -
WPL 2025: రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
మహిళల ఐపీఎల్లో (WPL-2025) ఇవాళ (ఫిబ్రవరి 25) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీ.. గుజరాత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఢిల్లీ బౌలర్లు శిఖా పాండే (3-0-18-2), మారిజన్ కాప్ (4-1-17-2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-20-2), టిటాస్ సాధు (2-0-15-1), జెస్ జొనాస్సెన్ (3-0-24-1) తలో చేయి వేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కరే చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. భారతి ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో భారతితో పాటు డియాండ్రా డొటిన్ (26), తనూజా కన్వర్ (16), బెత్ మూనీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హర్లీన్ డియోల్ 5, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 0, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 3, కశ్వీ గౌతమ్ 0, సిమ్రన్ షేక్ 5, మేఘనా సింగ్ 0 పరుగులకు ఔటయ్యారు. ప్రియా మిశ్రా ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది.కాగా, ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్ గతం తరహాలోనే పేలవంగా ఆడుతుంది. ఈ సీజన్లో జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ గత రెండు సీజన్లను ఇదే తరహాలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముగించింది. ఈ సీజన్లో గుజరాత్ యూపీ వారియర్జ్‌పై విజయం సాధించి.. ఆర్సీబీ, ముంబై ఇండయన్స్ చేతుల్లో ఓడింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ముంబై (0.610), యూపీ (0.167), ఢిల్లీ (-0.826) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా తలో నాలుగు పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. అయితే వీటితో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.619) అధికంగా ఉంది. -
‘సూపర్’ సోఫీ...
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయానికి ఓవర్ దూరంలో ఉంది. 6 బంతుల్లో 18 పరుగులు యూపీ వారియర్స్‌కు క్లిష్టమైన సమీకరణం. కానీ సోఫీ ఎకిల్‌స్టోన్... ఓటమి అంచున ఉన్న యూపీ వారియర్స్‌కు ఊపిరి పోసింది. 0, 6, 6, 4, 1లతో 17 పరుగులు బాదింది. ఆఖరి బంతి క్రాంతి గౌడ్ ఆడగా... సోఫీ రనౌటైంది. అయితే 17 పరుగుల రాకతో స్కోరు సమమైంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో తొలి సూపర్ ఓవర్‌కు పిచ్ సిద్ధమైంది.ముందుగా ఆర్సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్లో యూపీ 8 పరుగులు చేసింది. 6 బంతుల్లో 9 పరుగులు ఆర్సీబీ హిట్టర్లు రిచా ఘోష్, స్మృతి మంధానలకు సులువు! కానీ సోఫీ స్పిన్ ఉచ్చుతో ఆర్సీబీ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేసింది. బౌండరీ కాదు కదా... కనీసం ఒక బంతికి రెండు పరుగులైనా ఇవ్వకుండా 0, 1, 0, 1, 1, 1లతో 4 పరుగులే ఇచ్చింది. అంతే సోఫీ ‘సూపర్’స్టార్ అయ్యింది. యూపీ విజేతగా నిలిచింది.సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎలీస్ పెరీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. డానీ వ్యాట్ హాగ్ (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించింది. హెన్రీ, దీప్తి శర్మ, తాలియా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం యూపీ వారియర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకిల్‌స్టోన్ (19 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), దీప్తి శర్మ (13 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), శ్వేత (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) దంచేశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (బి) దీప్తిశర్మ 6; డానీ వ్యాట్ (సి) శ్వేత (బి) తాలియా 57; పెరీ (నాటౌట్) 90; రిచా (సి అండ్ బి) హెన్రీ 8; కనిక (రనౌట్) 5; వేర్హమ్ (రనౌట్) 7; కిమ్ గార్త్ (రనౌట్) 2; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లలో) 180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. బౌలింగ్: హెన్రీ 4–0–34–1, గ్రేస్ హారిస్ 1–0–11–0, దీప్తి శర్మ 4–0–42–1, సోఫీ 4–0–29–0, సైమా 1–0–8–0, క్రాంతి 3–0–26–0, తాలియా 3–0–30–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (బి) రేణుక 24; వృందా (సి) స్మృతి (బి) రేణుక 14; దీప్తి (సి) రిచా (బి) స్నేహ్ రాణా 25; తాలియా (స్టంప్డ్) రిచా (బి) స్నేహ్ రాణా 0; శ్వేత (సి) రిచా (బి) పెరీ 31; గ్రేస్ (సి) స్నేహ్ రాణా (బి) కిమ్ 8; ఉమా (సి) వేర్హమ్ (బి) స్నేహ్ రాణా 14; హెన్రీ (బి) కిమ్ 8; సోఫీ (రనౌట్) 33; సైమా (రనౌట్) 14; క్రాంతి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–30, 2–48, 3–50, 4–72, 5–93, 6–123, 7–123, 8–134, 9–161, 10–180. బౌలింగ్: రేణుక 4–0–36–2, కిమ్ గార్త్ 4–0–40–2, స్నేహ్ రాణా 3–0–27–3, ఎక్తాబిస్త్ 3–0–26–0, పెరీ 2–0–10–1, వేర్హమ్ 4–0–40–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో... -
చరిత్ర సృష్టించిన పెర్రీ.. తొలి ప్లేయర్‌గా రికార్డు
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ తుపాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రీజులోకి వచ్చిన పెర్రీ.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించింది. బౌండరీల వర్షంతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దైంది. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పెర్రీ.. 9 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది.ఆమెతో పాటు డేనియల్ వ్యాట్-హాడ్జ్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసింది. వ్యాట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం కేవలం 6 పరుగులకే పరిమితమైంది. యూపీ బౌలర్లలో హెన్రీ, దీప్తిశర్మ, తహీలా మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన పెర్రీ..ఇక ఈ మ్యాచ్‌లో విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా పెర్రీ రికార్డులకెక్కింది. పెర్రీ ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్‌లలో 800 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్(782) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో లానింగ్ అల్‌టైమ్ రికార్డును పెర్రీ బ్రేక్ చేసింది. చదవండి: కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు! Friday Evening it’s an Ellyse Perry’s Show! 😎Monday Evening it’s an Ellyse Perry’s Show! 🥵She. Is. Unstoppable. 🛐#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #RCBvUPWpic.twitter.com/iWQFlTKXTb— Royal Challengers Bengaluru (@RCBTweets) February 24, 2025 -
వారియర్స్ X చాలెంజర్స్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఘనవిజయంతో సీజన్లో బోణీ కొట్టిన యూపీ వారియర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సోమవారం చిన్నస్వామి స్టేడియంలో తలపడుతుంది. సొంత అభిమానుల మద్దతు మధ్య జరుగనున్న పోరులో సత్తా చాటాలని స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ భావిస్తుంటే... గెలుపు జోరును కొనసాగించాలని యూపీ వారియర్స్ చూస్తోంది. తాజా సీజన్లో ఆర్సీబీ మూడు మ్యాచ్‌లాడి 2 విజయాలు, 1 పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ వారియర్స్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, 2 పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. స్మృతి, డానీ వ్యాట్, ఎలీస్ పెర్రీ, రాఘవి బిస్త్, రిచా, కనిక, జార్జియాతో కూడిన ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్మృతి సూపర్ ఫామ్ ఆ జట్టుకు కలిసి రానుంది. స్మృతి ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో (అంతర్జాతీయ, డబ్ల్యూపీఎల్ కలిపి) 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్‌లో రేణుక, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్ జోషిత కీలకం కానున్నారు. మరోవైపు దీప్తి శర్మ సారథ్యంలోని యూపీ వారియర్స్ జట్టులో నిలకడ లోపించింది. కెప్టెన్ దీప్తి శర్మతో పాటు కిరణ్ నవగిరె, వృందా దినేశ్, తాలియా మెక్‌గ్రాత్, శ్వేత సెహ్రావత్, గ్రేస్ హ్యారిస్, ఉమ ఛెత్రి కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది.గత మ్యాచ్‌లో భీకర హిట్టింగ్తో విజృంభించిన షినెల్ హెన్రీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో యువ మీడియం పేసర్ క్రాంతి గౌడ్‌తో పాటు స్పిన్నర్ గ్రేస్ హ్యారిస్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న బెంగళూరుపై పైచేయి సాధించాలంటే యూపీ వారియర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిన అవసరముంది. -
హ్యాట్రిక్‌తో మెరిసిన ఆస్ట్రేలియా బౌలర్
మహిళల ఐపీఎల్లో (WPL-2025) ఆస్ట్రేలియా బౌలర్, యూపీ వారియర్జ్ (UP Warriorz) ఆల్‌రౌండర్ గ్రేస్ హ్యారిస్ (Grace Harris) హ్యాట్రిక్‌తో (Hat Trick) మెరిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 22) జరిగిన మ్యాచ్‌లో గ్రేస్ ఈ ఘనత సాధించింది. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా చివరి ఓవర్లో (20) గ్రేస్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ ఓవర్లో గ్రేస్ తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసింది. తొలుత నికీ ప్రసాద్, ఆతర్వాత వరుసగా అరుంధతి రెడ్డి, మిన్నూ మణిలను ఔట్ చేసింది. హ్యాట్రిక్‌తో కలిసి గ్రేస్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టింది.డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా గ్రేస్ రికార్డు సృష్టించింది. డబ్ల్యూపీఎల్ తొలి హ్యాట్రిక్‌ను లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ ఇస్సీ వాంగ్ సాధించింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ వాంగ్ ఈ ఘనత సాధించింది. అనంతరం 2024 ఎడిషన్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ బౌలర్ దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. లీగ్‌లో నమోదైన మూడు హ్యాట్రిక్స్‌లో రెండు యూపీ బౌలర్లే సాధించడం విశేషం.ఇదిలా ఉంటే, గ్రేస్‌తో (2.3-0-15-4) పాటు క్రాంతి గౌడ్ (4-0-25-4) కూడా చెలరేగడంతో ముంబైపై యూపీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. చిన్నెల్ హెన్రీ సుడిగాలి అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. చిన్నెల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటైంది. హాఫ్ సెంచరీ మార్కును 18 బంతుల్లో చేరుకున్న చిన్నెల్.. సోఫీ డంక్లీతో కలిసి లీగ్‌లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును షేర్ చేసుకుంది. యూపీ ఇన్నింగ్స్‌లో చిన్నెల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. తహ్లియా మెక్‌గ్రాత్ 24, కిరణ్ నవ్‌గిరే 17, దీప్తి శర్మ 13, శ్వేత సెహ్రావత్ 11, సోఫీ ఎక్లెస్టోన్ 12 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. మారిజన్ కాప్, అరుంధతి రెడ్డి తలో రెండు, శిఖా పాండే ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 178 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. జెమీమా రోడ్రిగెజ్ (56) అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు షఫాలీ వర్మ (24), నికీ ప్రసాద్ (18), శిఖా పాండే (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ఎడిషన్‌లో యూపీకి ఇది తొలి విజయం. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో తలో రెండు గెలిచిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టేబుల్ టాపర్లుగా ఉన్నాయి. -
మహిళల ప్రీమియర్ లీగ్‌లో డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
అమన్‌జ్యోత్ మెరుపులు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్‌జ్యోత్ కౌర్ ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. మొదట ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్‌జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్‌జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్‌జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్‌జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్‌జ్యోత్ 3–0–22–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్‌ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్‌జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0. -
WPL 2025: అనాబెల్ ఆల్‌రౌండ్ షో.. మరో బంతి మిగిలి ఉండగానే..
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals Women) జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. వడోదర వేదికగా బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz)పై నెగ్గింది. అనాబెల్ సదర్లాండ్(Annabel Sutherland) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.ఢిల్లీ ప్లేయర్లలో ఓపెనర్ కిరణ్ నవగిరె (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందివ్వగా... శ్వేత సెహ్రావత్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్) హెన్రీ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ 2 వికెట్లు తీసింది.అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69; 12 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనాబెల్ (41 నాటౌట్; 4 ఫోర్లు), మరిజాన్ కాప్ (29 నాటౌట్; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేశారు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్ తలా ఒక వికెట్ తీశారు. బెంగళూరులో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్-2025 ఆరో మ్యాచ్: యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్👉వేదిక: కొటాంబి స్టేడియం, వడోదర👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్👉యూపీ స్కోరు: 166/7 (20)👉ఢిల్లీ స్కోరు: 167/3 (19.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనాబెల్ సదర్లాండ్ (రెండు వికెట్లతో పాటు 35 బంతుల్లో 41 పరుగులు నాటౌట్).ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్: మళ్లీ నంబర్‌వన్‌గా శుబ్‌మన్ గిల్అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ రెండోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో 2023 నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తొలిసారి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్న గిల్ తాజాగా రెండోసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 796 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులతో ఓవరాల్‌గా 259 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన గిల్‌ను మళ్లీ నంబర్‌వన్ ప్లేయర్‌గా చేసింది. ఇన్నాళ్లు ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ (761 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (727 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతుండగా... శ్రేయస్ అయ్యర్ (679 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ (680 పాయింట్లు) తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. -
డబ్ల్యూపీఎల్ చివరి దశ మ్యాచ్‌లకు శ్రీలంక స్టార్ దూరం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో యూపీ వారియర్స్ జట్టుకు ఆడుతున్న శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ చమరి అటపట్టు చివరి దశ మ్యాచ్‌లకు దూరం కానుంది. మార్చి 4 నుంచి 18 వరకు న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు చమరి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ తర్వాత చమరి యూపీ వారియర్స్ జట్టును వీడి న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చమరి 28 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ మాత్రం డబ్ల్యూపీఎల్ పూర్తి సీజన్ ఆడుతుంది. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అమెలియా కెర్ పోటీపడటం లేదు. -
ముంబై ఇండియన్స్ బోణీ
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో పోరులో విజయాన్ని అందుకొని పాయింట్ల ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)పై ఘన విజయం సాధించింది. గుజరాత్‌కు ఈ టోర్నిలో ఇది రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే కొద్దిగా ప్రభావం చూపగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (3/16) రాణించగా...అమెలియా కెర్, నాట్ సివర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. నాట్ సివర్ బ్రంట్ (39 బంతుల్లో 57; 11 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ జట్టు తలపడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సంస్కృతి గుప్తా (బి) నాట్ సివర్ 1; వోల్వార్ట్ (సి) సజన (బి) షబ్నమ్ 4; హేమలత (సి) కెర్ (బి) హేలీ 9; ఆష్లీ గార్డ్నర్ (సి) సంజన (బి) నాట్ సివర్ 10; హర్లీన్ (సి) హేలీ (బి) కౌర్ 32; డాటిన్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 7; కాశ్వీ (సి) భాటియా (బి) హేలీ 20; సిమ్రన్ (సి) కెర్ (బి) హేలీ 3; తనూజ (సి) సంస్కృతి గుప్తా (బి) కెర్ 13; సయాలీ (నాటౌట్) 13; ప్రియ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–6, 2–14, 3–16, 4–28, 5–43, 6–67, 7–79, 8–103, 9–103, 10–120. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–1–17–1, నాట్ సివర్ 4–0–26–2, హేలీ మాథ్యూస్ 4–0–16–3, అమేలియా కెర్ 4–0–22–2, పరుణిక 2–0–20–0, అమన్‌జోత్ కౌర్ 2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) హర్లీన్ (బి) తనూజ కన్వర్ 17; యస్తిక (సి) వోల్వార్ట్ (బి) ప్రియ 8; నాట్ సివర్ (బి) ప్రియ 57; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) కాశ్వీ 4; కెర్ (ఎల్బీ) (బి) కాశ్వీ 19; సజన (నాటౌట్) 10; కమలిని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–55, 4–100, 5–114. బౌలింగ్: ఆష్లీ గార్డ్నర్ 3–0–21–0, తనూజ 3–0–25–1, డియాండ్ర డాటిన్ 3.1–0–19–0, ప్రియ మిశ్రా 4–0–40–2, కాశ్వీ గౌతమ్ 3–0–15–2. -
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
ముంబై ఇండియన్స్ వుమెన్(Mumbai Indians Women)తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) బ్యాటర్లు విఫలమయ్యారు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2025(WPL) ఎడిషన్‌లో భాగంగా ముంబై- గుజరాత్ మధ్య మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తోంది.కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్.. ముంబై జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ(1), లారా వొల్వర్ట్(4) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దయాళన్ హేమలత(9), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్(10) కూడా నిరాశపరిచారు.ఆదుకున్న హర్లీన్ డియోల్ ఈ క్రమంలో హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసిన హర్లీన్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మిగతావాళ్లలో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన డియాండ్రా డాటిన్ ఏడు పరుగులకే నిష్క్రమించగా.. కశ్వీ గౌతమ్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది. హేలీ మాథ్యూస్‌కు మూడు వికెట్లుఇక లోయర్ ఆర్డర్లో సిమ్రన్ షేక్ 3, తనూజా కన్వర్ 13, సయాలీ సత్ఘరే 13(నాటౌట్), ప్రియా మిశ్రా(2) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో 120 పరుగులు చేసిన గుజరాత్ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రైటార్మ్ మీడియం పేసర్ నట్ సీవర్- బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నం ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి గెలుపు కోసంకాగా ఫిబ్రవరి 14న డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వుమెన్ జట్టు ఎదుర్కొన్న గుజరాత్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అనంతరం యూపీ వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గెలుపుబాట పట్టిన గుజరాత్ జెయింట్స్.. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి నామమాత్రపు స్కోరు చేసింది. ఇక సీజన్లో తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై.. విజయమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్ బరిలో దిగింది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. అరంగేట్ర చాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన(ముంబై) నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతేడాది స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ గెలిచింది.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ జెయింట్స్ వుమెన్ వర్సెస్ ముంబై వుమెన్ తుదిజట్లుగుజరాత్ జట్టులారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.ముంబై జట్టుయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
అండర్-19 టీమిండియా స్టార్ క్రికెటర్ జి.కమలిని(G Kamalini) సరికొత్త రికార్డు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్(WPL) చరిత్రలో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ వుమెన్ తరఫున ఈ తమిళనాడు క్రికెటర్ మంగళవారం(ఫిబ్రవరి 18) డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టింది. ఓటమితో మొదలుపెట్టిన ముంబైకాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 14) డబ్ల్యూపీఎల్-2025 ఎడిషన్ మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్లో తొలుత గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజేతగా నిలవగా.. శనివారం నాటి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ కాప్యిటల్స్ చేతిలో ఓడిపోయింది.అనంతరం ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఆ తర్వాత సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఎదుర్కొన్న బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్- ముంబై తలపడుతున్నాయి.ఇద్దరు ప్లేయర్ల అరంగేట్రంవడోదరలోని కొటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వుమెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. సైకా ఇసాక్ స్థానంలో పరుణిక సిసోడియా(Parunika Sisodia) జట్టులోకి వచ్చినట్లు తెలిపిన హర్మన్.. కమలినికి కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు పేర్కొంది.ఈ క్రమంలో కమలిని అత్యంత చిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. పదహారేళ్ల 213 రోజులు వయసులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మహిళల టీ20 లీగ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల మలేషియా వేదికగా ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో కమలిని సభ్యురాలు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన కమిలిని ఈ మెగా టోర్నమెంట్లో రెండు అర్ధశతకాలతో మెరిసింది. మరోవైపు.. పరుణిక సిసోడియా కూడా వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్. టోర్నీ మొత్తంలో కలిపి పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఒకేసారి అరంగేట్రం చేయడం విశేషం.డబ్ల్యూపీఎల్‌లో చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు👉జి.కమలిని(ముంబై ఇండియన్స్)- 16 ఏళ్ల 213 రోజుల వయసులో- గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం- 2025👉షబ్నం షకీల్(గుజరాత్ జెయింట్స్)- 16 ఏళ్ల 263 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2024👉పార్శవి చోప్రా(యూపీ వారియర్స్)- 16 ఏళ్ల 312 రోజుల వయసులో ముంబై ఇండియన్స్ మీద- 2023👉వీజే జోషిత(ఆర్సీబీ)- 18 ఏళ్ల 205 రోజుల వయసులో గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం-2025👉అలిస్ కాప్సే(ఢిల్లీ క్యాపిటల్స్)- 18 ఏళ్ల 206 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2023.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ముంబై తుదిజట్లుముంబైయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.గుజరాత్లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 141 పరుగులకు ఢిల్లీ ఆలౌట్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.రేణుకా సింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను ఔట్ చేసి ఢిల్లీకి షాకిచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ లానింగ్(17), రోడ్రిగ్స్ ఔటయ్యాక ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది.ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వేర్హామ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఏక్తా బిస్త్ తలా రెండు వికెట్లు సాధించారు. ఢిల్లీ బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సారా బ్రైస్(23), అన్నాబెల్ సదర్లాండ్(19) రాణించారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన(కెప్టెన్), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్ -
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ జట్టులోకి స్టార్ ప్లేయర్లు
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓ మార్పుతో బరిలోకి దిగింది.ప్రేమ రావత్ స్ధానంలో స్పిన్నర్ ఏక్తా బిస్త్ తుది జట్టులోకి వచ్చింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులు చేసింది. నికీ ప్రసాద్, కాప్సే స్ధానాల్లో మారిజాన్ కాప్,జెస్ జోనాసెన్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన(కెప్టెన్), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్ -
WPL 2025: గార్డ్నర్ ఆల్‌రౌండ్ ‘షో’
వడోదర: ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోరు చేసినా గెలువలేకపోయిన గుజరాత్ జెయింట్స్... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్, డియాండ్ర డాటిన్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. స్పిన్నర్ ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా... ఆష్లీ గార్డ్నర్, పేసర్ డియాండ్ర 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లీ గార్డ్నర్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (4–0– 16–2) చక్కని స్పెల్ వృథా అయ్యింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. దీప్తి ఒక్కరే మెరుగ్గా... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (15), వృందా (6) పెవిలియన్ చేరారు. ఈ దశలో ఉమా ఛెత్రి (27 బంతుల్లో 24; 4 ఫోర్లు), దీప్తి శర్మ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో 73 పరుగుల వద్ద ఉమా, పరుగు వ్యవధిలో ప్రియా స్పిన్ మ్యాజిక్కు తాలియా (0), గ్రేస్ (4) అవుటవ్వడంతో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడిన దీప్తి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. కానీ తర్వాత 16 పరుగుల వ్యవధిలో మళ్లీ 3 వికెట్లు కూలడంతో యూపీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దూకుడుగా ఆడి... కష్టమైన లక్ష్యం కాకపోయినా... ఓపెనర్ బెత్ మూనీ (0), వన్‌డౌన్ బ్యాటర్ హేమలత (0) డకౌట్లతో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4 ఓవర్లలో జట్టు స్కోరు 15/2. పవర్‌ప్లేలో మిగిలినవి రెండే ఓవర్లు. సైమా ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో ఆష్లీ గార్డ్నర్ 2 సిక్స్‌లు, వొల్వార్ట్ మరో సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారింది. వోల్వార్ట్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... ధనాధన్ షోతో గార్డ్నర్ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. జట్టు స్కోరు 86 వద్ద ఆమె నిష్క్రమించినా... హర్లీన్ డియోల్ (30 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), డియాండ్ర జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (ఎల్బీడబ్ల్యూ) (బి) డాటిన్ 15; వృందా (బి) గార్డ్నర్ 6; ఉమా (సి) ప్రియా (బి) డాటిన్ 24; దీప్తి (సి) గార్డ్నర్ (బి) ప్రియా 39; తాలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రియా 0; గ్రేస్ (బి) ప్రియా 4; శ్వేత (బి) గార్డ్నర్ 16; అలానా కింగ్ (నాటౌట్) 19; సోఫీ (బి) కశ్వీ 2; సైమా (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–22, 2–22, 3–73, 4–74, 5–78, 6–101, 7–111, 8–117, 9–143. బౌలింగ్: సయాలీ 2–0–20–0, డియాండ్రా 4–0– 34–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–39–2, కశ్వీ 4–0– 15–1, తనూజ 2–0–10–0, ప్రియా 4–0– 25–3. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: వొల్వార్ట్ (బి) సోఫీ 22; బెత్ మూనీ (సి) తాలియా (బి) గ్రేస్ హారిస్ 0; హేమలత (బి) సోఫీ 0; ఆష్లీ గార్డ్నర్ (సి) నవ్‌గిరే (బి) తాలియా 52; హర్లీన్ (నాటౌట్) 34; డియాండ్ర (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–57, 4–86. బౌలింగ్: గ్రేస్ హారిస్ 1–0–1–1, సోఫీ 4–0– 16–2, క్రాంతి గౌడ్ 2–0– 15–0, సైమా 1–0– 20–0, దీప్తి శర్మ 4–0–32–0, అలానా కింగ్ 3–0–38–0, తాలియా 3–0–21–1. -
అస్సలు ఇది ఔటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)- 2025లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది.ముంబై నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రనౌట్‌పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదస్పదమైంది. సోషల్ మీడియా వేదికగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.అసలేం జరిగిందంటే?ఢిల్లీ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్పిన్నర్ సజనా వేసిన వేసిన బంతిని ఢిల్లీ బ్యాటర్ అరుందతి రెడ్డి కవర్స్ మీదగా షాట్ ఆడింది. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ వెనక్కి పరుగెత్తి క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేసింది.కానీ బంతికి కిందకు సరైన సమయంలోకి చేరకపోవడంతో క్యాచ్‌ను అందకులేకపోయింది. వెంటనే బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేసింది. వికెట్ కీపర్ బాటియా దానిని అందుకొని వికెట్లను గిరాటేసింది. అప్పటికే అరుందతి రెండో పరుగు పూర్తి చేసుకుని స్టైకర్ ఎండ్‌వైపు వచ్చేసింది. కానీ స్టంప్స్‌ను వికెట్ కీపర్ గిరాటేయడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రిప్లేలో తొలుత వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌కు తాకించినప్పుడు లైట్లు వెలిగాయి. అప్పటికి ఆమె ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. కానీ బెయిల్స్ పడేటప్పటికి మాత్రం అరుందతి క్రీజులోకి వచ్చినట్లు కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించింది. దీంతో ముంబై ప్లేయర్లు షాక్ అయ్యారు. అంతకుముందు కూడా ఈ మ్యాచ్‌లో ఇటువంటి సంఘనటనలు రెండు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు.రూల్స్ ఏమి చెబుతున్నాయి..నిబంధన 29.1 ప్రకారం.. అంపైర్ రిప్లేలను పరిశీలిస్తున్నప్పుడు బ్యాటర్ క్రీజులోకి వచ్చేసారి జింగ్ బెయిల్స్ స్టంప్స్ నుంచి పైకి లేచేయా లేదా అన్నది మొదటి ఫ్రేమ్‌గా పరిగణించాలి. రెండో ఫ్రేమ్‌లో బెయిల్స్ పూర్తిగా స్టంప్స్‌తో సంబంధం కోల్పోయో లేదో చూడాలి.చివరగా లైట్లు వెలిగినా బెయిల్స్ విడిపోయినప్పుడు మాత్రమే దానిని రనౌట్‌గా భావించాలి. బెయిల్స్ పడకుండా ఉంటే మాత్రం దానిని ఔట్‌గా పరిగణించరు. ఇప్పుడు ఢిల్లీ-ముంబై మ్యాచ్‌లో ఇదే జరిగింది. వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌ను తాకించినా.. బ్యాటర్ వచ్చే సమయానికి బెయిల్స్ కిందపడలేదు. అందుకే థర్డ్ అంపైర్‌గా ఔట్‌గా ప్రకటించారు. pic.twitter.com/C1XfOSlj5I— Lolzzz (@CricketerMasked) February 15, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది
వడోదర: లక్ష్యఛేదనలో ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...అయితే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారడంతో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఆపై డ్రామా సాగింది... ఆఖరి బంతి దాకా సాగిన రనౌట్/నాటౌట్ హంగామా ఢిల్లీనే గట్టెక్కించింది. కలిత వేసిన 20వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులు రాగా, ఐదో బంతికి నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ తొలి పరుగు పూర్తి చేసింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో ఆమె పడిన డైవ్‌తో బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలడంతో రెండో పరుగొచ్చింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడింది. డబ్ల్యూపీఎల్‌లో శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ గెలిచేందుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. సీవర్, హర్మన్ దంచేసినా... ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (0), యస్తిక (11) సహా ఆఖరి వరుస బ్యాటర్లు షబ్నమ్ (0), సైకా ఇషాక్ (0) వరకు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. వన్‌డౌన్‌లో నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరే ముంబైని ఆదుకున్నారు. వాళ్లిదరు మెరిపించడంతో ఒకానొక దశలో ముంబై 10.3 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించాక ధాటిగా ఆడుతున్న కెపె్టన్ హర్మన్ అవుటైంది. తర్వాత వచ్చినవారెవరూ బాధ్యత కనబర్చలేదు. కానీ సీవర్ బ్రంట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి ఆఖరిదాకా అజేయంగా పోరాడింది. అదరగొట్టిన షఫాలీ ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్తో కెపె్టన్ మెగ్ లానింగ్ (15)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభమిచ్చింది. ఆరో ఓవర్ ఐదో బంతికి షఫాలీ జోరుకు హేలీ కళ్లెం వేయగా, మరుసటి ఓవర్లో లానింగ్‌ను షబ్నమ్ అవుట్ చేసింది. తర్వాత జెమీమా (2), అనాబెల్ సదర్లాండ్ (13), అలైస్ క్యాప్సి (16)లు విఫలమవడంతో ఢిల్లీ ఆట పడుతూలేస్తూ సాగింది. ఈ దశలో నికీ ప్రసాద్, సారా బ్రైస్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ ఆరో వికెట్‌కు వేగంగా 31 పరుగులు జతచేయడంతో ఢిల్లీ గెలుపుదారిలో పడింది. స్వల్పవ్యవధిలో సారా, శిఖాపాండే (2) నిష్క్రమించినా ఆఖరి బంతి దాకా పోరాడిన ఢిల్లీ టెయిలెండర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) శిఖాపాండే 11; హేలీ (సి) లానింగ్ (బి) శిఖాపాండే 0; సీవర్ బ్రంట్ నాటౌట్ 80; హర్మన్‌ప్రీత్ (సి) నికీ (బి) అనాబెల్ 42; అమెలియా రనౌట్ 9; సజన (సి) బ్రైస్ (బి) అనాబెల్ 1; అమన్‌జ్యోత్ (బి) క్యాప్సి 7; సంస్కృతి (సి) లానింగ్ (బి) మిన్నుమణి 2; కలిత రనౌట్ 1; షబ్నిమ్ రనౌట్ 0; సైకా ఇషాక్ (బి) అనాబెల్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–105, 4–129, 5–133, 6–146, 7–156, 8–159, 9–160, 10–164. బౌలింగ్: శిఖా పాండే 4–0–14–2, అలైస్ క్యాప్సి 2–0– 25–1, అరుంధతి 4–0– 40–0, మిన్నుమణి 4–0–23–1, అనాబెల్ 3.1–0–34–3, రాధా యాదవ్ 2–0–26–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) షబ్నమ్ 15; షఫాలీ (సి) అమన్‌జ్యోత్ (బి) హేలీ 43; జెమీమా (సి) హర్మన్‌ప్రీత్ (బి) అమెలియా 2; అనాబెల్ (బి) సీవర్ బ్రంట్ 13; క్యాప్సి (సి) షబ్నమ్ (బి) అమెలియా 16; నికీ ప్రసాద్ (సి) అమెలియా (బి) కలిత 35; సారా బ్రైస్ (సి) కలిత (బి) హేలీ 21; శిఖా పాండే రనౌట్ 2; రాధా యాదవ్ నాటౌట్ 9; అరుంధతీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–66, 4–76, 5–109, 6–140, 7–147, 8–163. బౌలింగ్: షబ్నమ్ 4–0–18–1, సైకా 3–0–43–0, సీవర్ బ్రంట్ 4–0–38–1, హేలీ మాథ్యూస్ 4–0–31–2, అమెలియా కెర్ 4–0–22–2, కలిత 1–0–10–1. శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణా బెంగళూరు: డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఆమె బరిలోకి దిగలేదు. శ్రేయ స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడుగుజరాత్ X యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చెలరేగిన నాట్ స్కివర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ అదరగొట్టింది.ఇన్నింగ్స్ ఆరంభంలోనే హీలీ మాథ్యూస్ వికెట్‌ను ముంబై కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకుంది. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపించింది.స్కివర్-బ్రంట్ 59 బంతుల్లో 13 ఫోర్లతో 80 పరుగులు చేయగా.. హర్మాన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేసింది. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో సదర్లాండ్ మూడు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే రెండు, క్యాప్సీ, మిన్నీ మణి తలా వికెట్ సాధించారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ NAT SCIVER-BRUNT SHOW IN WPL80* off just 59 balls without much support from the other end, crazy innings under immense pressure from one of the best players of this generation! pic.twitter.com/byJWFKVXcm— Daddyscore (@daddyscore) February 15, 2025 -
WPL 2025: ముంబై వర్సెస్ ఢిల్లీ.. యువ సంచలనం అరంగేట్రం
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా రెండో మ్యాచ్‌లో వడోదరగా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌తో భారత మహిళల జట్టు అండర్-19 కెప్టెన్ నికీ ప్రసాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డబ్ల్యూపీల్ అరంగేట్రం చేసింది. ఇటీవల జరిగిన మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో 17 ఏళ్ల నికీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆమె సారథ్యంలోనే భారత్ విశ్వవిజేతగా నిలిచింది.మరోవైపు స్కాట్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సారా జెన్నిఫర్ బ్రైస్ కూడా ఢిల్లీ తరపున డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టింది. అదేవిధంగా హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా తన 150వ మ్యాచ్ ఆడనుంది. హర్మాన్ ముంబై సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ -
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్‌పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్‌పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్ డైమండ్‌పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే! -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
WPL 2025: గుజరాత్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.గార్డ్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్నర్ఈ మ్యాచ్‌లో గార్డ్నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్‌కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.ఆతర్వాత 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్‌గిరే (యూపీ), ఇవాళ గార్డ్నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిక్సర్ల సునామీఈ మ్యాచ్‌లో గార్డ్నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్లో సోఫీ డివైన్ కూడా గుజరాత్‌పై 8 సిక్సర్లు కొట్టింది. -
ఆర్సీబీకి భారీ షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా.. తాజాగా స్టార్ స్పిన్నర్ ఆశా శోభన కూడా తప్పుకొంది.ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్‌తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్ ఆల్‌రౌండర్ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్-2025 మొత్తానికి దూరమైంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్ ఈ సీజన్లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి ఆమె దూరమైంది.గత సీజన్లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.మరోవైపు.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ముంబై ఇండియన్స్‌లోకి పరుణిక సిసోడియాడబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్‌లో చేరింది.కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ వుమెన్స్, ఆర్సీబీ వుమెన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్‌లు జరుగుతాయి. -
WPL 2025: యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 136.57 స్ట్రయిక్‌రేట్‌తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లోని మిగతా మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్‌లు అందుకున్న ఐదో ప్లేయర్‌గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్‌లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
గుజరాత్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఫ్రాంచైజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కెప్టెన్‌ను మార్చి కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. బెత్ మూనీ (Beth Mooney) (ఆస్ట్రేలియా) స్థానంలో ఆష్లే గార్డ్నర్ను (Ashleigh Gardner) (ఆస్ట్రేలియా) నూతన సారధిగా నియమిస్తున్నట్లు జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించింది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తున్నట్లు మేనేజ్మెంట్ పేర్కొంది. జెయింట్స్ గత రెండు సీజన్లలో (2023, 2024) చిట్ట చివరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచిన జెయింట్స్.. 2024 సీజన్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.గత రెండు సీజన్లలో జెయింట్స్ ప్రదర్శన బాగా లేనప్పటికీ.. గార్డ్నర్ మాత్రం వ్యక్తిగతంగా రాణించింది. గార్డ్నర్ డబ్ల్యూపీఎల్ మొత్తంలో 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్‌గా నియమించడం పట్ల గార్డ్నర్ సంతోషం వ్యక్తం చేసింది. జట్టును ముందుండి నడిపించడానికి ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించింది. తమ జట్టులో భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవమని తెలిపింది. తదుపరి సీజన్లో జెయింట్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. జట్టులో యువ మరియు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో పాటు భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. ఈసారి తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది.జెయింట్స్ కెప్టెన్‌గా గార్డ్నర్ నియామకంపై ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. గార్డ్నర్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. గార్డ్నర్ను టఫ్ కాంపిటీటర్తో పోల్చాడు. గార్డ్నర్కు ఆటపై అవగాహన, వ్యూహాత్మక చతురత మరియు ప్లేయర్లను ప్రేరేపించే సామర్థ్యం ఉందని కొనియాడాడు. తదుపరి సీజన్లో గార్డ్నర్ జెయింట్స్‌ను విజయవంతంగా ముందుండి నడుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.తాజా మాజీ కెప్టెన్ మూనీ గురించి మాట్లాడుతూ.. ఆమె జట్టులో అంతర్గత నాయకురాలిగా కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూనీ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపాడు. కెప్టెన్‌గా మూనీ సేవలను కొనియాడాడు. ఇకపై మూనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నాడు.కాగా, డిసెంబర్లో జరిగిన వేలంలో జెయింట్స్ భారత ఆల్ రౌండర్ సిమ్రాన్ షేక్‌తో సహా నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సేవలను నిలుపుకుంది. -
ఆర్సీబీలోకి ఆసీస్ స్టార్ ప్లేయర్లు..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతుండగా... కొన్ని జట్లు గాయపడిన ప్లేయర్ల స్థానాలను భర్తీ చేసుకున్నాయి. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అలీసా హీలీ (ఆ్రస్టేలియా) కాలి పాదం గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆమె స్థానాన్ని వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ చినెల్లి హెన్రీతో భర్తీ చేసుకుంది. ఇప్పటివరకు 62 అంతర్జాతీయ టి20లు ఆడిన జమైకన్ ఆల్‌రౌండర్ 22 వికెట్లు తీయడంతో పాటు 473 పరుగులు చేసింది. రూ.30 లక్షల ప్రాథమిక ధరతో ఆమెను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ టోర్నీకి దూరమవడం బాధాకరమని హీలీ చెప్పింది. ఆమె ఇటీవల మహిళల యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియాకు సారథిగా వ్యవహరించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB Women) ఫ్రాంచైజీ రెండు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో 35 ఏళ్ల వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (న్యూజిలాండ్), కేట్ క్రాస్ (ఇంగ్లండ్)లిద్దరూ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను ఆ్రస్టేలియా ప్లేయర్లు హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్లతో భర్తీ చేసుకుంది. వీళ్లిద్దరిని చెరో రూ. 30 లక్షల ఫీజుతో తీసుకున్నట్లు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14 నుంచి వడోదరలో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ పోటీలు జరుగుతాయి.ఆర్సీబీ మహిళల జట్టుస్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్, కనికా అహుజా, డాని వ్యాట్, ప్రేమ రావత్,జోషిత విజె, రాఘవి బిస్త్ ,, జాగ్రవి పవార్.యూపీ జట్టుచినెల్లి హెన్రీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, రాజేశ్వరి గయాక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, సైమా ఠాకోర్, పూనమ్ ఖేమ్నార్, చౌమరి సుల్తానా, చౌమరి సుల్తానా.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి