
ఆఖరి ఓవర్లో మెరిపించి, సూపర్ ఓవర్లో గెలిపించిన ఎకిల్‌స్టోన్
బెంగళూరుపై యూపీ వారియర్స్ అద్భుత విజయం
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయానికి ఓవర్ దూరంలో ఉంది. 6 బంతుల్లో 18 పరుగులు యూపీ వారియర్స్‌కు క్లిష్టమైన సమీకరణం. కానీ సోఫీ ఎకిల్‌స్టోన్... ఓటమి అంచున ఉన్న యూపీ వారియర్స్‌కు ఊపిరి పోసింది. 0, 6, 6, 4, 1లతో 17 పరుగులు బాదింది. ఆఖరి బంతి క్రాంతి గౌడ్ ఆడగా... సోఫీ రనౌటైంది. అయితే 17 పరుగుల రాకతో స్కోరు సమమైంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రలో తొలి సూపర్ ఓవర్‌కు పిచ్ సిద్ధమైంది.
ముందుగా ఆర్‌సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్లో యూపీ 8 పరుగులు చేసింది. 6 బంతుల్లో 9 పరుగులు ఆర్‌సీబీ హిట్టర్లు రిచా ఘోష్, స్మృతి మంధానలకు సులువు! కానీ సోఫీ స్పిన్ ఉచ్చుతో ఆర్‌సీబీ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేసింది. బౌండరీ కాదు కదా... కనీసం ఒక బంతికి రెండు పరుగులైనా ఇవ్వకుండా 0, 1, 0, 1, 1, 1లతో 4 పరుగులే ఇచ్చింది. అంతే సోఫీ ‘సూపర్’స్టార్ అయ్యింది. యూపీ విజేతగా నిలిచింది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎలీస్ పెరీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. డానీ వ్యాట్ హాగ్ (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించింది. హెన్రీ, దీప్తి శర్మ, తాలియా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం యూపీ వారియర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకిల్‌స్టోన్ (19 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), దీప్తి శర్మ (13 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), శ్వేత (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) దంచేశారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (బి) దీప్తిశర్మ 6; డానీ వ్యాట్ (సి) శ్వేత (బి) తాలియా 57; పెరీ (నాటౌట్) 90; రిచా (సి అండ్ బి) హెన్రీ 8; కనిక (రనౌట్) 5; వేర్‌హమ్ (రనౌట్) 7; కిమ్ గార్త్ (రనౌట్) 2; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లలో) 180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. వికెట్ల పతనం: 1–23, 2–117, 3–126, 4–136, 5–158, 6–180. బౌలింగ్: హెన్రీ 4–0–34–1, గ్రేస్ హారిస్ 1–0–11–0, దీప్తి శర్మ 4–0–42–1, సోఫీ 4–0–29–0, సైమా 1–0–8–0, క్రాంతి 3–0–26–0, తాలియా 3–0–30–1.
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (బి) రేణుక 24; వృందా (సి) స్మృతి (బి) రేణుక 14; దీప్తి (సి) రిచా (బి) స్నేహ్ రాణా 25; తాలియా (స్టంప్డ్) రిచా (బి) స్నేహ్ రాణా 0; శ్వేత (సి) రిచా (బి) పెరీ 31; గ్రేస్ (సి) స్నేహ్ రాణా (బి) కిమ్ 8; ఉమా (సి) వేర్‌హమ్ (బి) స్నేహ్ రాణా 14; హెన్రీ (బి) కిమ్ 8; సోఫీ (రనౌట్) 33; సైమా (రనౌట్) 14; క్రాంతి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–30, 2–48, 3–50, 4–72, 5–93, 6–123, 7–123, 8–134, 9–161, 10–180. బౌలింగ్: రేణుక 4–0–36–2, కిమ్ గార్త్ 4–0–40–2, స్నేహ్ రాణా 3–0–27–3, ఎక్తాబిస్త్ 3–0–26–0, పెరీ 2–0–10–1, వేర్‌హమ్ 4–0–40–0.
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో...
Comments
Please login to add a commentAdd a comment