
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ తుపాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రీజులోకి వచ్చిన పెర్రీ.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించింది. బౌండరీల వర్షంతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దైంది. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పెర్రీ.. 9 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది.
ఆమెతో పాటు డేనియల్ వ్యాట్-హాడ్జ్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసింది. వ్యాట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం కేవలం 6 పరుగులకే పరిమితమైంది. యూపీ బౌలర్లలో హెన్రీ, దీప్తిశర్మ, తహీలా మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన పెర్రీ..
ఇక ఈ మ్యాచ్‌లో విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా పెర్రీ రికార్డులకెక్కింది. పెర్రీ ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్‌లలో 800 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్(782) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో లానింగ్ అల్‌టైమ్ రికార్డును పెర్రీ బ్రేక్ చేసింది.
చదవండి: కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
Friday Evening it’s an Ellyse Perry’s Show! 😎
Monday Evening it’s an Ellyse Perry’s Show! 🥵
She. Is. Unstoppable. 🛐#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #RCBvUPW
pic.twitter.com/iWQFlTKXTb— Royal Challengers Bengaluru (@RCBTweets) February 24, 2025