
వరుసగా మూడో విజయం
5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
యూపీ వారియర్స్ అవుట్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. గుజరాత్ జెయింట్స్ గెలుపుతో యూపీ వారియర్స్ జట్టు అధికారికంగా ‘ప్లే ఆఫ్’ రేసు నుంచి దూరమైంది. గుజరాత్‌తో పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (57 బంతుల్లో 92; 15 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... మరో ఓపెనర్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. జెయింట్స్ బౌలర్లలో మేఘనా సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, డియాండ్రా డాటిన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించి గెలిచింది.
హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, బెత్ మూనీ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లో 85 పరుగులు జత చేశారు. చివర్లో డాటిన్ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్‌నర్ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ జెయింట్స్ విజయానికి కారణమయ్యాయి.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరగలిగే స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశగా తమ చివరిదైన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్’ రేసులో నిలవాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) డాటిన్ 92; షఫాలీ (సి) లిచ్‌ఫీల్డ్ (బి) మేఘన 40; జొనాసెన్ (బి) డాటిన్ 9; జెమీమా (సి) గార్డ్‌నర్ (బి) మేఘన 4; అనాబెల్ (సి) డాటిన్ (బి) మేఘన 14; కాప్ (నాటౌట్) 7; బ్రైస్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–83, 2–108, 3–119, 4–141, 5–171. బౌలింగ్: డాటిన్ 4–0–37–2, కాశ్వీ 3–0–32–0, తనూజ 4–0–31–0, మేఘన 4–0–35–3, గార్డ్‌నర్ 2–0–18–0, ప్రియ 2–0–21–0
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) అనాబెల్ (బి) మిన్ను మణి 44; హేమలత (సి) లానింగ్ (బి) శిఖా 1; హర్లీన్ (నాటౌట్) 70; ఆష్లీ గార్డ్‌నర్ (సి) మిన్ను మణి (బి) శిఖా 22; డాటిన్ (సి) జెమీమా (బి) జొనాసెన్ 24; లిచ్‌ఫీల్డ్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 0; కాశ్వీ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–4, 2–89, 3–128, 4–162, 5–162. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–1–29–0, శిఖా పాండే 4–0–31–2, అనాబెల్ సదర్లాండ్ 4–0–45–0, టిటాస్ సాధు 2–0–17–0, మిన్ను మణి 2–0–15–1, జొనాసెన్ 3.3–0–38–2.
Comments
Please login to add a commentAdd a comment