UP Warriorz
-
WPL 2025: అనాబెల్ ఆల్‌రౌండ్ షో.. మరో బంతి మిగిలి ఉండగానే..
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals Women) జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. వడోదర వేదికగా బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz)పై నెగ్గింది. అనాబెల్ సదర్లాండ్(Annabel Sutherland) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.ఢిల్లీ ప్లేయర్లలో ఓపెనర్ కిరణ్ నవగిరె (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందివ్వగా... శ్వేత సెహ్రావత్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్) హెన్రీ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ 2 వికెట్లు తీసింది.అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69; 12 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనాబెల్ (41 నాటౌట్; 4 ఫోర్లు), మరిజాన్ కాప్ (29 నాటౌట్; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేశారు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్ తలా ఒక వికెట్ తీశారు. బెంగళూరులో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్-2025 ఆరో మ్యాచ్: యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్👉వేదిక: కొటాంబి స్టేడియం, వడోదర👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్👉యూపీ స్కోరు: 166/7 (20)👉ఢిల్లీ స్కోరు: 167/3 (19.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనాబెల్ సదర్లాండ్ (రెండు వికెట్లతో పాటు 35 బంతుల్లో 41 పరుగులు నాటౌట్).ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్: మళ్లీ నంబర్‌వన్‌గా శుబ్‌మన్ గిల్అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ రెండోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో 2023 నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తొలిసారి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్న గిల్ తాజాగా రెండోసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 796 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులతో ఓవరాల్‌గా 259 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన గిల్‌ను మళ్లీ నంబర్‌వన్ ప్లేయర్‌గా చేసింది. ఇన్నాళ్లు ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ (761 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (727 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతుండగా... శ్రేయస్ అయ్యర్ (679 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ (680 పాయింట్లు) తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. -
డబ్ల్యూపీఎల్ చివరి దశ మ్యాచ్‌లకు శ్రీలంక స్టార్ దూరం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో యూపీ వారియర్స్ జట్టుకు ఆడుతున్న శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ చమరి అటపట్టు చివరి దశ మ్యాచ్‌లకు దూరం కానుంది. మార్చి 4 నుంచి 18 వరకు న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు చమరి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ తర్వాత చమరి యూపీ వారియర్స్ జట్టును వీడి న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చమరి 28 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ మాత్రం డబ్ల్యూపీఎల్ పూర్తి సీజన్ ఆడుతుంది. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అమెలియా కెర్ పోటీపడటం లేదు. -
WPL 2025: గార్డ్నర్ ఆల్‌రౌండ్ ‘షో’
వడోదర: ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోరు చేసినా గెలువలేకపోయిన గుజరాత్ జెయింట్స్... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్, డియాండ్ర డాటిన్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. స్పిన్నర్ ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా... ఆష్లీ గార్డ్నర్, పేసర్ డియాండ్ర 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లీ గార్డ్నర్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (4–0– 16–2) చక్కని స్పెల్ వృథా అయ్యింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. దీప్తి ఒక్కరే మెరుగ్గా... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (15), వృందా (6) పెవిలియన్ చేరారు. ఈ దశలో ఉమా ఛెత్రి (27 బంతుల్లో 24; 4 ఫోర్లు), దీప్తి శర్మ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో 73 పరుగుల వద్ద ఉమా, పరుగు వ్యవధిలో ప్రియా స్పిన్ మ్యాజిక్కు తాలియా (0), గ్రేస్ (4) అవుటవ్వడంతో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడిన దీప్తి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. కానీ తర్వాత 16 పరుగుల వ్యవధిలో మళ్లీ 3 వికెట్లు కూలడంతో యూపీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దూకుడుగా ఆడి... కష్టమైన లక్ష్యం కాకపోయినా... ఓపెనర్ బెత్ మూనీ (0), వన్‌డౌన్ బ్యాటర్ హేమలత (0) డకౌట్లతో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4 ఓవర్లలో జట్టు స్కోరు 15/2. పవర్‌ప్లేలో మిగిలినవి రెండే ఓవర్లు. సైమా ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో ఆష్లీ గార్డ్నర్ 2 సిక్స్‌లు, వొల్వార్ట్ మరో సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారింది. వోల్వార్ట్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... ధనాధన్ షోతో గార్డ్నర్ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. జట్టు స్కోరు 86 వద్ద ఆమె నిష్క్రమించినా... హర్లీన్ డియోల్ (30 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), డియాండ్ర జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (ఎల్బీడబ్ల్యూ) (బి) డాటిన్ 15; వృందా (బి) గార్డ్నర్ 6; ఉమా (సి) ప్రియా (బి) డాటిన్ 24; దీప్తి (సి) గార్డ్నర్ (బి) ప్రియా 39; తాలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రియా 0; గ్రేస్ (బి) ప్రియా 4; శ్వేత (బి) గార్డ్నర్ 16; అలానా కింగ్ (నాటౌట్) 19; సోఫీ (బి) కశ్వీ 2; సైమా (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–22, 2–22, 3–73, 4–74, 5–78, 6–101, 7–111, 8–117, 9–143. బౌలింగ్: సయాలీ 2–0–20–0, డియాండ్రా 4–0– 34–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–39–2, కశ్వీ 4–0– 15–1, తనూజ 2–0–10–0, ప్రియా 4–0– 25–3. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: వొల్వార్ట్ (బి) సోఫీ 22; బెత్ మూనీ (సి) తాలియా (బి) గ్రేస్ హారిస్ 0; హేమలత (బి) సోఫీ 0; ఆష్లీ గార్డ్నర్ (సి) నవ్‌గిరే (బి) తాలియా 52; హర్లీన్ (నాటౌట్) 34; డియాండ్ర (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–57, 4–86. బౌలింగ్: గ్రేస్ హారిస్ 1–0–1–1, సోఫీ 4–0– 16–2, క్రాంతి గౌడ్ 2–0– 15–0, సైమా 1–0– 20–0, దీప్తి శర్మ 4–0–32–0, అలానా కింగ్ 3–0–38–0, తాలియా 3–0–21–1. -
WPL 2025: యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 136.57 స్ట్రయిక్‌రేట్‌తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లోని మిగతా మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్‌లు అందుకున్న ఐదో ప్లేయర్‌గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్‌లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
ఆర్సీబీలోకి ఆసీస్ స్టార్ ప్లేయర్లు..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతుండగా... కొన్ని జట్లు గాయపడిన ప్లేయర్ల స్థానాలను భర్తీ చేసుకున్నాయి. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అలీసా హీలీ (ఆ్రస్టేలియా) కాలి పాదం గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆమె స్థానాన్ని వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ చినెల్లి హెన్రీతో భర్తీ చేసుకుంది. ఇప్పటివరకు 62 అంతర్జాతీయ టి20లు ఆడిన జమైకన్ ఆల్‌రౌండర్ 22 వికెట్లు తీయడంతో పాటు 473 పరుగులు చేసింది. రూ.30 లక్షల ప్రాథమిక ధరతో ఆమెను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ టోర్నీకి దూరమవడం బాధాకరమని హీలీ చెప్పింది. ఆమె ఇటీవల మహిళల యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియాకు సారథిగా వ్యవహరించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB Women) ఫ్రాంచైజీ రెండు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో 35 ఏళ్ల వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (న్యూజిలాండ్), కేట్ క్రాస్ (ఇంగ్లండ్)లిద్దరూ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను ఆ్రస్టేలియా ప్లేయర్లు హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్లతో భర్తీ చేసుకుంది. వీళ్లిద్దరిని చెరో రూ. 30 లక్షల ఫీజుతో తీసుకున్నట్లు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14 నుంచి వడోదరలో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ పోటీలు జరుగుతాయి.ఆర్సీబీ మహిళల జట్టుస్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్, కనికా అహుజా, డాని వ్యాట్, ప్రేమ రావత్,జోషిత విజె, రాఘవి బిస్త్ ,, జాగ్రవి పవార్.యూపీ జట్టుచినెల్లి హెన్రీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, రాజేశ్వరి గయాక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, సైమా ఠాకోర్, పూనమ్ ఖేమ్నార్, చౌమరి సుల్తానా, చౌమరి సుల్తానా.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
WPL 2024: గుజరాత్‌ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ జెయింట్స్‌కు విశాఖ బౌలర్ షబ్నమ్ షకీల్ బ్రేక్ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. షబ్నమ్ దెబ్బకు వారియర్జ్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరుపు అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగినా వారియర్జ్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా వారియర్జ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లారా వాల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షబ్నమ్ దెబ్బకు ఆదిలోనే తడబడిన వారియర్జ్ దీప్తి శర్మ రాణించినా ఓటమిపాలైంది. వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్ రేసులో ముందుంజలో ఉంది. సత్తా చాటిన విశాఖ అమ్మాయి.. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన షబ్నమ్ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్ డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్ టీమ్ రూ. 10 లక్షలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ నాట్ సివర్ బ్రంట్‌ను తొలి వికెట్‌గా అవుట్ చేసిన షబ్నమ్... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. గత ఏడాదే అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో షబ్నమ్ సభ్యురాలిగా ఉంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్.. చివరి 12 బంతుల్లో 7 బౌండరీలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 11) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు లారా వాల్వార్డ్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (42 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దయాలన్ హేమలత 0, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఆష్లే గార్డ్నర్ 15, భారతి ఫుల్మలి 1, కేథరీన్ బ్రైస్ 11, తనుజా కన్వర్ 1, షబ్నమ్ 0 పరుగులకు ఔటయ్యారు. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2, రాజేశ్వరీ గైక్వాడ్, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడిన మూనీ.. గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మూనీ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ.. ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 12 బంతుల్ని ఎదుర్కొన్న మూనీ.. ఏకంగా 7 ఫోర్లతో విరుచుకుపడింది. 19వ ఓవర్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు రాబట్టిన మూనీ.. చివరి ఓవర్లో ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది. మూనీ ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదల్చడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ, యూపీ వారియర్జ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
ఢిల్లీని ఓడించిన దీప్తి
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉర్రూతలూగించిన మ్యాచ్ జరిగింది. గెలుపు దిశగా పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దీప్తిశర్మ (4/19) అద్భుత బౌలింగ్‌తో ఓడించింది. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు కాగా... ఒక దశలో 18 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద విజయానికి 12 బంతుల్లో 15 పరుగుల దూరంలో ఉంది. అయితే 11 బంతుల్లో 6 వికెట్లను కోల్పోయిన ఢిల్లీ గెలుపు వాకిట బొక్కబోర్లా పడింది. యూపీ వారియర్స్ ఆఖరి దాకా పోరాడి పరుగు తేడాతో గెలిచింది. 19వ ఓవర్ వేసిన దీప్తి 3 వికెట్లు తీసి 5 పరుగులే ఇవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆమె శ్రమను నీరుగార్చకుండా చివరి ఓవర్లో బౌలింగ్‌కు దిగిన గ్రేస్ హారిస్ (2/8) ఐదు బంతులేసి రెండు వికెట్లు తీసింది. దీంతో పాటు మరో రనౌట్ కూడా చేసిన యూపీ విజయాన్నందుకుంది. ఉత్కంఠ రేపిన ఈ పోరు అందర్ని మునివేళ్లపై నిలబెట్టింది. మొదట యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తిశర్మ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మళ్లీ ఒంటరి పోరాటం చేసింది. క్యాపిటల్స్ బౌలర్లు రాధా యాదవ్, టైటస్ సాధు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (46 బంతుల్లో 60; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తర్వాత వచ్చిన వారు చెత్తషాట్లతో ఓటమిని మూల్యంగా చెల్లించారు. జెమీమా (17), షఫాలీ (15), అలైస్ క్యాప్సీ (15) రెండంకెల స్కోర్లు చేశారంతే! ఎవరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
ముంబై ఘనవిజయం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఈ పోరులో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తిక భాటియా (9), హేలీ మాథ్యూస్ (4) నిరాశ పరిచినప్పటికీ తర్వాత వచ్చిన టాపార్డర్ బ్యాటర్ నటాలీ సీవర్ బ్రంట్ (31 బంతుల్లో 45; 8 ఫోర్లు) ధాటిగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టింది. అనంతరం అమెలియా కెర్ (23 బంతుల్లో 39; 6 ఫోర్లు), సజీవన్ సజన (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) స్కోరు వేగాన్ని పెంచారు. చమరి ఆటపట్టు 2 వికెట్లు తీసింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలింగ్‌కు యూపీ ఏ దశలోనూ ఎదురునిలువలేకపోయింది. ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను 15 పరుగుల స్కోరు వద్దే కోల్పోయింది. కెప్టెన్ అలీసా హీలీ (3), కిరణ్ నవ్‌గిరే (7), చమరి ఆటపట్టు (3) నిరాశపరిచారు. క్రీజులోకి వచ్చిన 11 మందిలో గ్రేస్ హారిస్ (15), శ్వేత సెహ్రావత్ (17) మినహా ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో దీప్తి శర్మ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ (3/27) యూపీని దెబ్బ తీయగా, నాట్ సీవర్ 2 వికెట్లు పడగొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన గుజరాత్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), యాష్లే గార్డ్నర్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు 100 దాటింది. అంతకుముందు లారా వొల్వార్ట్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (16 బంతుల్లో 16; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (24 బంతుల్లో 18; 1 ఫోర్) వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. యూపీ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం యూపీ వారియర్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (33 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి యూపీ విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
ముంబైకి వారియర్స్ చెక్!
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్స్ నిలువరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేసింది. దీంతో 7 వికెట్లతో గెలిచిన వారియర్స్ ఈ సీజన్లో బోణీకొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్ యస్తిక భాటియా (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. కెపె్టన్ నట్సీవర్ బ్రంట్ (19; 2 ఫోర్లు), అమెలియా కెర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయారు. అనంతరం యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే, కెపె్టన్ అలిసా హీలీ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు) చెలరేగారు. ఇద్దరు తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగులు జోడించి గెలిచేందుకు అవసరమైన పునాదిని మెరుపు వేగంతో వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కిరణ్‌తో పాటు తాహ్లియా మెక్‌గ్రాత్ (1), కెపె్టన్ హీలీ నిష్క్రమించారు. కానీ తర్వాత వచ్చిన గ్రేస్ హారిస్ (17 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తిశర్మ (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. -
మంధాన క్రేజ్.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్
WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ సోఫీ డివైన్(1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. Captain Smriti Mandhana on fire. 🔥pic.twitter.com/vfvhMozwsk — Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024 ఈ నేపథ్యంలో రెండో ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్, ఫోర్‌తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్ తొలి బంతికే మెగ్రాత్ బౌలింగ్‌లో వ్రిందా దినేశ్‌కు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఆమె తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్ కీపర్ రిచా ఘోష్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. Brilliant half-century for Sabbhineni Meghana in front of a massive crowd! Can she power @RCBTweets to a match-winning total? Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/geoj3JWH61 — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 Richa Gosh reaches her maiden FIFTY for #RCB 💪🔥 Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/9QtU8s27Hk — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్ కాగా.. సోఫీ మొలినెక్స్ 9, శ్రెయాంక పాటిల్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హ్యారిస్, తహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. Smriti Mandhana was impressed with Home Crowd 😂❤️ ❤️#RCB pic.twitter.com/4vbwccmhDG — RCB Xtra. (@Rcb_Xtra) February 24, 2024 -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఇంగ్లండ్ బౌలర్ ఇసీ వాంగ్ ఈ ఫీట్‌ను సాధించింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ దెబ్బతీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ దెబ్బతో యూపీ వారియర్జ్ ఓటమి ఖరారైపోయింది. ఇక డబ్ల్యూపీఎల్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా.. ఐపీఎల్లో మాత్రం ఇప్పటివరకు 21సార్లు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇక 2008 తొలి సీజన్లో సీఎస్కే బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అత్యధికంగా అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ తీయగా.. యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. Historic moment in WPL, Take a bow Issy Wong. pic.twitter.com/eIHNFEioSk — Johns. (@CricCrazyJohns) March 24, 2023 చదవండి: పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్ -
సివర్ జోరు... వాంగ్ హోరు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ లో ఆరంభ అంచనాలను నిజం చేస్తూ ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశ చివర్లో కాస్త తడబడినా... తమ స్థాయిని ప్రదర్శిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం శుక్రవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 72 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో నాట్ సివర్ బ్రంట్ చెలరేగగా, బౌలింగ్ ఇసీ వాంగ్ లీగ్‌లో తొలి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నాట్ సివర్ (38 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా... అమేలియా కెర్ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు) చివర్లో దూకుడుగా ఆడింది. అనంతరం యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కిరణ్ నవ్‌గిరే (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెపె్టన్ అలీసా హీలీ పుట్టిన రోజునాడు ఓటమిని ఎదుర్కొన్న యూపీ టోర్నీని మూడో స్థానంతో ముగించగా... ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడుతుంది. సివర్ దూకుడు... ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాట్ సివర్ ఆట చుక్కానిలా నిలిచింది. వరుసగా నాలుగు కీలక భాగస్వామ్యాలతో ఆమె జట్టుకు భారీ స్కోరును అందించడంలో సఫలమైంది. తొలి బంతికే ఫోర్‌తో యస్తిక భాటియా (18 బంతుల్లో 21; 4 ఫోర్లు) ఆటను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత యస్తికను అంజలి శర్వాణి వెనక్కి పంపించింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలసింది. హేలీ తనదైన శైలిలో ధాటిగా ఆడలేక విఫలం కాగా, ఎకెల్‌స్టోన్ చక్కటి బంతికి హర్మన్‌ప్రీత్ (14) అవుటైంది. అయితే మరో ఎండ్‌లో మాత్రం సివర్ తన జోరు కొనసాగించింది. పార్శవి ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన ఆమె 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 2 ఓవర్లలో ముంబై 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టడం విశేషం. టపటపా... కిరణ్ నవ్‌గిరే ఇన్నింగ్స్ మినహా యూపీ ఆటలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఇషాక్ ఓవర్లో కిరణ్ 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడమై హైలైట్. కీలక ప్లేయర్లు అలీసా హీలీ (11), తాలియా మెక్‌గ్రాత్ (7), గ్రేస్ హారిస్ (14) విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. వాంగ్ దెబ్బకు యూపీ ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) నవ్‌గిరే (బి) అంజలి 21; హీలీ మాథ్యూస్ (సి) నవ్‌గిరే (బి) పార్శవి 26; నాట్ సివర్ (నాటౌట్) 72; హర్మన్‌ప్రీత్ (బి) ఎకెల్‌స్టోన్ 14; అమేలియా కెర్ (సి) అంజలి (బి) ఎకెల్‌స్టోన్ 29; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–104, 4–164. బౌలింగ్: హారిస్ 3–0–20–0, అంజలి 3–0–17–1, రాజేశ్వరి 4–0–36–0, ఎకెల్‌స్టోన్ 4–0–39–2, దీప్తి శర్మ 4–0–39–0, పార్శవి చోప్రా 2–0–25–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) హర్మన్ (బి) వాంగ్ 11; శ్వేత (సి) మాథ్యూస్ (బి) ఇషాక్ 1; తాలియా (రనౌట్) 7; నవ్‌గిరే (సి) సివర్ (బి) వాంగ్ 43; హారిస్ (సి) వాంగ్ (బి) సివర్ 14; దీప్తి శర్మ (సి) కలిత (బి) మాథ్యూస్ 16; సిమ్రన్ (బి) వాంగ్ 0; ఎకెల్‌స్టోన్ (బి) వాంగ్ 0; అంజలి (బి) కలిత 5; రాజేశ్వరి (ఎల్బీ) (బి) ఇషాక్ 5; పార్శవి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 110. వికెట్ల పతనం: 1–8, 2–12, 3–21, 4–56, 5–84, 6–84, 7–84, 8–94, 9–104, 10–110. బౌలింగ్: నాట్ సివర్ 3–0–21–1, సైకా ఇషాక్ 2.4–1–24–2, వాంగ్ 4–0–15–4, అమేలియా 3–0–25–0, మాథ్యూస్ 3–0–21–1, అమన్‌జోత్ 1–0–2–0, కలిత 1–0–2–1. -
స్కివర్ విధ్వంసం.. యూపీ ముందు భారీ లక్ష్యం
మహిళల ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జూలు విదిలించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో నాట్ స్కివర్(72 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కేర్(29), మాథ్యూస్(26) పరుగులతో రాణించారు. స్కివర్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు,2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక యూపీ బౌలర్లలో ఎకిలిస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా, అంజిలి శార్వాణి, ప్రసవి చోప్రా తలా వికెట్ సాధించారు. తుది జట్లు: ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్జ్ ఢీ.. గెలిస్తే ఫైనల్‌కు
మహిళల ప్రీమియర్ లీగ్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్ ఆఖరి మ్యాచ్‌కు దూరమైన యూపీ వారియర్జ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి వచ్చింది. మరోవైపు ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 26న జరగనున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. తుది జట్లు: ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఈరోజు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో అలీసా హీలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. హర్మన్‌తో పాటు హీలీ మాథ్యూస్, యస్తిక భాటియా, స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్ , పూజా వస్త్రాకర్ రూపంలో టాప్ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సైకా ఇషాఖ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ తహిలా మెక్‌గ్రాత్, సోఫియా ఎకెల్‌స్టోన్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చదవండి: ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా! పాపం ముంబై!
WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచింది. పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్’గా నిలిచి ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్సీ క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లానింగ్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్ (31 నాటౌట్; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు The first-ever team to make it to the 𝗙𝗜𝗡𝗔𝗟 of #TATAWPL 🙌 The @DelhiCapitals are ready to roar 🔥🔥 pic.twitter.com/LZclWYNH8J — Women's Premier League (WPL) (@wplt20) March 22, 2023 -
లీగ్‌లో ఆఖరి మ్యాచ్.. ఢిల్లీతో యూపీ వారియర్జ్...
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెనర్ దేవికా వైద్య, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది. వాళ్ల స్థానంలో యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్. యూపీ వారియర్స్: అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, సొప్పదండి యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్. 🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
Womens Premier League 2023:ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
మెక్‌గ్రాత్, హ్యారిస్ విధ్వంసం.. ఉత్కంఠ సమరంలో యూపీ వారియర్జ్ విజయం
డబ్ల్యూపీఎల్-2023లో మరో ఉత్కంఠ సమరం జరిగింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం మొదలైన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ సూపర్ విక్టరీ సాధించి, ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. తద్వారా లీగ్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో వారియర్జ్ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేయగా.. తహీల మెక్‌గ్రాత్ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), గ్రేస్ హ్యారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చారు. ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలుండగానే వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్లో ఐదో బంతిని ఎక్లెస్టోన్ బౌండరీకి తరలించడంతో వారియర్జ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వారియర్జ్‌ను తహీల మెక్‌గ్రాత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో, గ్రేస్ హ్యారిస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించారు. ఈ సీజన్లో జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 59) మెరిసి వారియర్జ్‌ను ఇన్నే వికెట్ల తేడాతో గెలిపించిన హ్యారిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
హేమలత, గార్డ్నర్ మెరుపు అర్ధశతకాలు.. గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 20) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేసింది. గార్డ్నర్, హేమలత జోరు చూసి ఓ దశలో జెయింట్స్ స్కోర్ సునాయాసంగా 200 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ.. రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ నమోదైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న గార్డ్నర్ ఎడాపెడా షాట్లు బాది భారీ స్కోర్‌కు దోహదపడింది. సోఫీ డంక్లే (23), లారా వోల్వార్డ్ (17) తొలి వికెట్‌కు 41 పరుగులు (4.1 ఓవరల్లో) జోడించి శుభారంభాన్ని అందించగా.. హర్లీన్ డియోల్ (4), అశ్వనీ కుమారి (5) విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్షవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అంజలీ సర్వాని, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌల్ చేసిన దీప్తి శర్మ భారీగా పరుగులు (49) సమర్పించుకుంది. కాగా, ప్రస్తుత లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. వారియర్జ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ అందుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూపీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హేలీ మాథ్యూస్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. దేవికా డ్రైవ్ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. ఇక్కడే హర్మన్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేదే. అందుకే క్యాచ్ అందుకోగానే హర్మన్ కూడా చాలాసేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్లో తిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. Cheer on Hayley and Harry as they take on the UP Warriors in the #WPL2023 season! 🏏🔥 Use the hashtags #OneFamily, #MumbaiIndians, #AaliRe, and #MIvUPW to show your support for the Mumbai Indians 💙#CricketGaliyara #CricketTwitter #cricketnews pic.twitter.com/Ua4SjQBV2p — Cricket Galiyara (@cricketgaliyara) March 18, 2023 చదవండి: Deepthi Sharma: చరిత్రలో నిలిచిపోయే రనౌట్.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి -
ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమెలియా కెర్ రెండు వికెట్లు తీయగా.. నట్ సివర్, హేలీ మాథ్యూస్, ఇసీ వాంగ్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్ విజయంతో ఆర్సీబీ వుమెన్ ప్లేఆఫ్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్ రన్‌రేట్ కలిగి ఉండడమే దీనికి కారణం. Take a bow @Sophecc19 🙌🏻🙌🏻She finishes in style with a SIX & powers @UPWarriorz to a thrilling win! 👏👏Scorecard ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/pwR2D2AoLZ— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
చరిత్రలో నిలిచిపోయే రనౌట్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్టన్నింగ్ రనౌట్లతో మెరిసింది. మాములుగానే తాను ఫీల్డ్‌లో ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే బంతి ఆమె చేతి నుంచి వెళ్లడం అసాధ్యం. అయితే పరుగులు సేవ్ చేయడమో లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లను రనౌట్ చేయడమో జరుగుతుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు రనౌట్లతో మెరవడం విశేషం. అయితే ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన తీరుకు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆఖరి ఓవర్‌ను దీప్తి శర్మనే వేసింది. ఓవర్ నాలుగో బంతిని ఇసీ వాంగ్ లాంగ్‌ఆఫ్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన వాంగ్ రెండో పరుగుకు పిలుపునిచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న దీప్తి శర్మకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ తను మరోలా ఆలోచించింది. స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇసీ వాంగ్‌ను రనౌట్ చేయాలనుకొని డైరెక్ట్ త్రో వేసింది. అంతే వాంగ్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీప్తి శర్మ కాన్ఫిడెంట్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. Right On Target 🎯 ft. Deepti Sharma#CricketTwitter #WPL2023 #MIvUPW pic.twitter.com/LkGcz9ubKt — Female Cricket (@imfemalecricket) March 18, 2023 చదవండి: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన -
యూపీ వారియర్జ్ విజృంభణ.. ముంబై ఇండియన్స్ 127 ఆలౌట్
ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ బౌలర్లు విజృంభించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. తొలుత ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన దీప్తి.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సైకా ఇషాకిని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం విశేషం. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి -
యూపీ వారియర్జ్‌కు సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఏంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అయితే పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మైనస్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం ఒకరిద్దరిపైనే ఆధారపడింది. కెప్టెన్ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్ నవగిరే, తాహిలా మెక్‌గ్రాత్‌లు రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan. Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX — Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
హమ్మయ్య,.. మొత్తానికి ఆర్సీబీ గెలిచింది
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ వుమెన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా గెలవగా.. రిచా ఘోష్ 31 నాటౌట్, హెథర్‌నైట్ 24 పరుగులు చేశారు. ఆఖర్లో కనికా అహుజా ఔట్ అయినప్పటికి రిచా ఘోష్ జట్టును గెలిపించింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, దేవికా వైద్య తలా ఒక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. హారిస్ గ్రేస్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్ నవగిరె 22 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా శోభన, సోఫీ డివైన్లు చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్ ఫలితాలపై మాత్రమే ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. యూపీ వారియర్జ్ 135 ఆలౌట్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ తొలిసారి చెలరేగింది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాణించారు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన కనబరచడంతో యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ ఇన్నింగ్స్ ఆది నుంచి ఒడిదొడుకుల మధ్యే సాగింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. సోఫీ డివైన్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే దేవికా వైద్య (0) ఎల్బీగా వెనుదిరిగింది. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ అలీస్సా హేలి (1) కూడా ఔటయింది. మేగన్ స్కాట్ వేసిన రెండో ఓవర్లో ఆఖరి బంతికి తహిలా మెక్‌గ్రాత్ (2) రిచా గోష్ కు క్యాచ్ ఇచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కిరణ్ నవ్గిరె (26 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడానికి యత్నించింది. కానీ ఆశా శోభన యూపీకి షాకిచ్చింది. ఆమె వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి నవ్గిరె.. వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆశా వేసిన 9వ ఓవర్ తొలి బంతికి సిమ్రాన్ షేక్ (2) కూడా కనికకు క్యాచ్ ఇచ్చింది. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి యూపీ ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. యూపీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా హరీస్ (32 బంతులలో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం నిలకడగా ఆడింది. దీప్తి శర్మ (19 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి ఆమె యూపీ ఇన్నింగ్స్ ను నడిపించింది. యూపీ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది హరీస్ చలవే. దీప్తి శర్మతో కలిసి హరీస్ 42 బంతుల్లోనే 69 పరుగులు జోడించింది. అర్థ సెంచరీ పూర్తి చేసుకుని భారీ స్కోరు మీద కన్నేసిన ఈ జోడిని ఎలీస్ పెర్రీ విడదీసింది. ఆమె వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి దీప్తి.. భారీ షాట్ ఆడబోయి శ్రేయాంక పాటిల్ చేతికి చిక్కింది. అదే ఓవర్లో మూడో బంతికి హరీస్ కూడా రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. దీంతో యూపీ ఏడో వికెట్ కోల్పోయింది. పెర్రీనే వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి శ్వేతా సెహ్రావత్ (6) క్లీన్ బౌల్డ్ అయింది. చివరి ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్.. రెండో బంతికి అంజలి శర్వని (8) ని ఔట్ చేయగా.. తర్వాత బంతికే ఎకిల్‌స్టోన్ (12) రనౌట్ అయింది. పలితంగా యూపీ.. 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో పెర్రీ మూడు వికెట్లు తీయగా, ఆశా శోభన, సోఫీ డివైన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్ చెరొక వికెట్ తీశారు -
WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ ఇవాళైనా
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన స్మృతి మంధాన సేన ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ఆర్సీబీ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. మరోవైపు యూపీ వారియర్జ్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి.. మరో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై యూపీ వారియర్జ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఎల్లిస్ పెర్రీ మినహా మిగతావారు పెద్దగా రాణించడం లేదు. స్మృతి మంధాన అయితే అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతూ వస్తోంది. ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. రిచా ఘోష్, సోఫీ డివైన్, హెథర్ నైట్లు బ్యాట్ ఝులిపించలేకపోతున్నారు. ఇక యూపీ వారియర్జ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ అలిస్సా హేలీ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అయితే ఆమె మినహా మిగతావారు రాణించకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఆర్సీబీ వుమెన్ తుదిజట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, కనికా అహుజా యూపీ వారియర్జ్ తుదిజట్టు: అలిస్సా హీలీ(కెప్టెన్/వికెట్ కీపర్), దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్‌గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటములకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన స్మృతి మంధాన.. ''గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే జరుగుతుంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికి.. ఆ తర్వాత వికెట్లు కోల్పోతున్నాం. ఇది మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తోంది. మా గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడంతోనే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాం. ఈ ఓటములకు పూర్తి బాధ్యత నాదే. ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాపార్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు కఠినంగా అనిపించింది. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంటుంది.. కానీ నా నమ్మకం ఏంటంటే ఒక్కరమే ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే'' అని చెప్పుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్స్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫి డివైన్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో ఎసెల్‌స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హేలీ (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించగా.. దేవికా వైద్య 36 పరుగులతో సహకరించింది. Stay strong, captain! Let’s turn it around. 🙌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/LRvv9pXaAi — Royal Challengers Bangalore (@RCBTweets) March 10, 2023 చదవండి: Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది.. 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు -
WPL 2023: ఆర్సీబీపై యూపీ వారియర్స్ ఘన విజయం.. వికెట్ నష్టపోకుండా
► 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ అద్భుత బ్యాటింగ్ లైనప్‌తో సత్తా చాటింది. ఓపెనర్లు హీలీ (47 బంతుల్లో 96, 4x18, 6x1), వైద్య (31 బంతుల్లో 36, 4x5), రాణించడంతో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ► యూపీ వారియర్స్ వికెట్ నష్టపోకుండా విజయం దిశగా దూసుకెళ్తోంది. 11 ఓవర్లు ముగిసే సమయానికి 115 పరుగులు చేసింది. క్రీజులో వైద్య (29), హీలీ (79) పరుగులతో ఉన్నారు. మరో 24 పరుగులు చేస్తే యూపీ వారియర్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(17), హీలీ(48) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు యూపీ స్కోర్: 32/0 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(13) హీలీ(19) పరుగులతో ఉన్నారు. 4 వికెట్లతో చెలరేగిన ఎక్లెస్టోన్.. 138 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. 138 పరుగులకే ఆలౌటైంది. యూపీ వారియర్స్ స్పిన్నర్ సోఫి ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తిశర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఇక బెంగళూరు బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ(52), సోఫీ డివైన్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ►15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), రిచా ఘోష్ ఉన్నారు. ►11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), నైట్ ఉన్నారు. ►6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(33), పెర్రీ(22) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 29 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ మంధాన.. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులో పెర్రీ, డివైన్ ఉన్నారు. ►3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(25), మంధాన(4) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తో కీలక మ్యాచ్‌లో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దమైంది. వరుసగా మూడు పరాజయాలను చవిచూసిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: IND vs AUS: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్, జడ్డూ! వీడియో వైరల్ -
గుజరాత్ కెప్టెన్ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్/వికెట్‌కీపర్ బెత్ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్ మొత్తానికే దూరమైంది. దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్ట్తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్ మూనీని బేస్ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న వొల్వార్ట్.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్ జెయింట్స్ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ లక్ష్మీ యాదవ్ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్ యాజమాన్యం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.. -
లానింగ్, జొనసెన్ చెలరేగగా...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనసెన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. లానింగ్ అర్ధ సెంచరీ తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్ ఐదో ఓవర్లో లానింగ్ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్ కొడితే లానింగ్ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్ లానింగ్ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్ (16; 2 ఫోర్లు), లానింగ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 మార్క్ దాటింది. మెక్‌గ్రాత్ ఒంటరి పోరాటం కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్ టాపార్డర్ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. కెప్టెన్ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు), శ్వేత (1), కిరణ్ నవ్‌గిరే (2) ‘పవర్ ప్లే’లోనే పెవిలియన్కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా ఒంటరిపోరాటం చేసింది. దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన జొనసెన్ స్పిన్ బౌలింగ్‌తో యూపీని చావుదెబ్బ తీసింది. మెక్‌గ్రాత్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్‌గిరే (బి) తాహ్లియా 17; మరిజన్ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్‌స్టోన్ 16; జెమిమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) ఎకిల్‌స్టోన్ (బి) షబ్నిమ్ 21; జొనసెన్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. బౌలింగ్: షబ్నమ్ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్ 2–0–31–1, తాహ్లియా మెక్‌గ్రాత్ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–41–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్ 1; కిరణ్ నవ్‌గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్ 0; తాహ్లియా మెక్‌గ్రాత్ నాటౌట్ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్ 23; సిమ్రన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. బౌలింగ్: మరిజన్ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్ జొనసెన్ 4–0–43–3, నోరిస్ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగులతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. తాహిలా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 పరుగులు నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం వృథా అయినా ఆకట్టుకుంది. ఆమె మినహా మిగతావారు విఫలమయ్యారు. జెస్ జొనాన్సెన్ మూడు వికెట్లు తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. 16 ఓవర్లలో యూపీ వారియర్జ్ 113/4 16 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 47 పరుగులు, వైద్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 24 బంతుల్లో 99 పరుగులు కావాలి. 12 ఓవర్లలో యూపీ వారియర్జ్ 84/4 12 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 34 పరుగులు, వైద్య 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన దీప్తి శర్మ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగింది. 8 ఓవర్లలో యూపీ వారియర్జ్ స్కోరు 51/3 8 ఓవర్ల ఆట ముగిసేసరికి యూపీ వారియర్జ్ మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ 11, దీప్తి శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 72 బంతుల్లో 161 పరుగులు కావాలి. ► 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ కష్టాల్లో పడింది. క్యాప్స్ బౌలింగ్‌లో సెహ్రావత్(1 పరుగు) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ధాటిగా ఆడుతున్న కెప్టెన్ అలిసా హేలీ(24 పరుగులు) జాన్సెన్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత గతమ్యాచ్ హీరో కిరణ్ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం యూపీ వారియర్జ్ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ టార్గెట్ 212 వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. భారీ స్కోరుగా దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిది. అలిస్ క్యాప్సీ 21, జెమీమా రోడ్రిగ్స్ 10 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 16 పరుగులు చేసిన కాప్ వెనుదిరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 55 పరుగులతో ఆడుతుంది. 9 ఓవర్లలో 87/1 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 53 పరుగులు, కాప్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఒపెనర్ షఫాలీ వర్మ 17 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. 3 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/0 మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 15, షఫాలీ వర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న యూపీ వారియర్జ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాలు సాధించిన ఇరుజట్లు తొలిసారి తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఏంచుకుంది. అయితే మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఓడించడం యూపీ వారియర్జ్‌కు సవాలే. అయితే యూపీ వారియర్జ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(వికెట్ కీపర్, కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
స్పాన్సర్స్ ఎవరూ లేక, ధోని పేరును బ్యాట్‌పై రాసుకుని ఇరగదీసింది
మహిళల ఐపీఎల్ (WPL) 2023 సీజన్ మొదటి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడంతో కాస్త బోర్‌గా ఫీలైన అభిమానులకు నిన్న (మార్చి 5) రాత్రి గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలుసిసలైన టీ20 మజాను అందించింది. చివరి నిమిషం వరకు రసవత్తరంగా సాగి ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు), ఆష్లే గార్డెనర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరే (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ ఎక్లెస్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో యూపీ వారియర్జ్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ పక్క వికెట్లు పడుతున్నా కిరణ్ ఒక్కరే జట్టు భారాన్ని అంతా మోయగా.. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో గ్రేస్, సోఫీ జోడీ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి తమ జట్టుకు అపురూపమైన విజయాన్నందించారు. వీరిలో ముఖ్యంగా గ్రేస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 18వ ఓవర్లో 20 పరుగులు, 19వ ఓవర్లో 14 పరుగులు, చివరి ఓవర్లో 25 పరుగులు పిండుకుని వారియర్జ్‌కు బోణీ విజయాన్నందించింది. కాగా, ఈ మ్యాచ్‌లో వారియర్జ్ బ్యాటింగ్ సందర్భంగా కనిపించిన ఓ ఆసక్తికర సీన్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించింది. వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును తన బ్యాట్‌పై రాసుకుని బరిలోకి దిగింది. ధోని అంటే పడిచచ్చిపోయే కిరణ్.. స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో ఇలా చేసి ఎంఎస్డీపై అభిమానాన్ని చాటుకుంది. ఎంఎస్డీ7 అని రాసివున్న బ్యాట్‌తో బరిలోకి దిగిన కిరణ్.. ధోని తరహాలోనే విధ్వంసం సృష్టించి, తన జట్టు గెలుపుకు బలమైన పునాది వేసింది. కిరణ్ బ్యాట్‌పై ఎంఎస్డీ7 అని రాసి ఉండటాన్ని లైవ్‌లో కామెంటర్లు ప్రస్తావించడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. కిరణ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎవరికీ తెలియని కిరణ్.. రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ధోని పేరు పుణ్యమా అని ప్రస్తుతం ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతుంది. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కిరణ్ నవ్గరేను ప్రతేక్యంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన 28 ఏళ్ల కిరణ్ ప్రభు నవ్గరే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేశవాలీ టోర్నీల్లో గతంలో మహారాష్ట్ర, ప్రస్తుతం నాగాలాండ్‌కు ఆడుతున్న నవ్గరే.. వుమెన్స్ టీ20 చాలెంజ్‌లో వెలాసిటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టీ20ల్లో 150కి పైగా వ్యక్తిగత స్కోర్ సాధించిన ఏకైక భారత బ్యాటర్ కిరణ్ రికార్డుల్లోకెక్కింది. మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ-2022లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ అజేయమైన 162 పరుగులు సాధించి, మహిళల క్రికెట్లో డాషింగ్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. -
‘గ్రేట్’ హారిస్...
ముంబై: పురుషుల లీగ్‌కు ఏమాత్రం తీసిపోని మ్యాచ్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు వన్నెలద్దింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ ‘హిట్టర్’ గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖరి ఓవర్ మెరుపులతో మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. 170 లక్ష్యం ఛేదించే క్రమంలో యూపీ ఒకదశలో 105/7 స్కోరుతో ఓటమికి దగ్గరైంది. ఈ దశలో సోఫీ ఎకిల్‌స్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో హారిస్ ధనాధన్ ‘గ్రేట్’ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. అబేధ్యమైన 8వ వికెట్‌కు ఈ ఇద్దరు 4.1 ఓవర్లలో 70 పరుగులు జోడించి యూపీని గెలిపించారు. ఆఖరి ఓవర్లో యూపీకి 19 పరుగుల కావాల్సి ఉండగా.. అనాబెల్ వేసిన ఈ ఓవర్లో గ్రేస్ వరుసగా 6, వైడ్, 2, 4, వైడ్, 4, 6లతో ఏకంగా 24 పరుగులు పిండుకుంది. దీంతో యూపీ 3 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించగా, సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. కిమ్ గార్త్ (5/36) యూపీని బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (సి) శ్వేత (బి) సోఫీ 24; సోఫియా (బి) దీప్తి 13; హర్లిన్ (సి) తాలియా (బి) అంజలి శర్వాణి 46; అనాబెల్ సదర్లాండ్ (సి) అంజలి (బి) సోఫీ 8; సుష్మ (సి) శ్వేత (బి) తాలియా 9; గార్డ్నర్ (స్టంప్డ్) హీలీ (బి) దీప్తి 25; హేమలత (నాటౌట్) 21; స్నేహ్ రాణా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–34, 2–38, 3–50, 4–76, 5–120, 6–142. బౌలింగ్: రాజేశ్వరి 4–0–30–0, అంజలి శర్వాణి 4–0–43–1, దీప్తి 4–0–27–2, సోఫీ 4–0–25–2, తాలియా 2–0–18–1, దేవిక 2–0–24–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి అండ్ బి) గార్త్ 7; శ్వేత (సి) మాన్సి (బి) గార్త్ 5, కిరణ్ నవ్‌గిరే (సి) సుష్మ (బి) గార్త్ 53; తాలియా (సి) హేమలత (బి) గార్త్ 0; దీప్తి (బి) మాన్సి 11; గ్రేస్ హారిస్ (నాటౌట్) 59; సిమ్రన్ (బి) గార్త్ 0; దేవిక (సి) హేమలత (బి) అనాబెల్ 4; సోఫీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–19, 3–20, 4–86, 5–88, 6–88, 7–105. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–36–5, తనూజ 4–0–29–0, గార్డ్నెర్ 4–0–34–0, అనాబెల్ 3.5–0–41–1, స్నేహ్ రాణా 2–0–16–0, మాన్సి 2–0–15–1. ♦ డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్ శుభారంబం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో యూపీ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో యూపీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు బ్యాటర్ గ్రేస్ హారిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ వేసిన సదర్లాండ్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను హారిస్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు ఎదుర్కొన్న హారిస్ 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు కిరణ్ నవ్‌గిరే(53)పరుగులతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ ఐదు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. గార్త్ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ►18 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(36), ఎకిలిస్టోన్(9) పరుగులతో ఉన్నారు. యూపీ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాలి. ►17 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(23), ఎకిలిస్టోన్(3) పరుగులతో ఉన్నారు. ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్ వరుస క్రమంలో యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో హ్యారిస్, వైద్యా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ ఐదు వికెట్లు పడగొట్టింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. 9 ఓవర్లకు యూపీ స్కోర్: 60/3 9 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కిరణ్ నవ్‌గిరే(40), దీప్తి శర్మ(8) పరుగులతో ఉన్నారు. 26 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో యూపీ 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హీలీతో పాటు శ్వేతా సెహ్రావత్, మెక్‌గ్రాత్ వికెట్లను యూపీ కోల్పోయింది. కాగా తొలి మూడు వికెట్లను కూడా గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ పడగొట్టింది. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. యూపీ టార్గెట్ 170 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. ► 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), హేమలత (1)పరుగులతో ఉన్నారు. ► 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), గార్డనర్(18) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/3 ►9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్, సుష్మా వర్మ పరుగులతో ఉన్నారు. ►38 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మేఘన.. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో పెవియలన్కు చేరింది. ►34 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డాంక్లీ.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యంది. క్రీజులో హర్లీన్ వచ్చింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 30/0 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో సబ్బినేని మేఘన(20), డాంక్లీ(10) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌లో డివై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ రెగ్యూలర్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా దూరమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు స్నేహ్ రానా సారథ్యం వహించనుంది. తుది జట్లు: యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ గుజరాత్ జెయింట్స్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహిళల ఐపీఎల్ 2023.. యూపీ వారియర్జ్ కెప్టెన్ ఎవరంటే..?
Alyssa Healy: మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా తమ సారధుల పేర్లను ప్రకటిస్తున్నాయి. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధనను ప్రకటించగా.. తాజాగా యూపీ వారియర్జ్ తమ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అలైసా హీలీ నియమితురాలైంది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్, యూపీకి చెందిన దీప్తి శర్మను ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే యూపీ వారియర్జ్ మేనేజ్మెంట్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అలైసా వైపు మొగ్గు చూపింది. రెగ్యులర్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా సారధిగా వ్యవహరించిన 32 ఏళ్ల అలైసా.. ఆ జట్టు గెలిచిన 5 టీ20 వరల్డ్‌కప్‌ల్లో, 2022 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఉంది. అలైసా తన ఓవరాల్ కెరీర్లో ఆసీస్ తరఫున 139 టీ20లు, 94 వన్డేలు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 శతకాలు, 30 అర్ధశతకాల సాయంతో 5400కు పైగా పరుగులు సాధించింది. అలైసా.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. యూపీ వారియర్జ్ జట్టు: అలైసా హీలీ (కెప్టెన్), సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహీలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, గ్రేస్ హ్యారిస్, లారెన్ బెల్ (విదేశీ ప్లేయర్లు), దీప్తి శర్మ, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్, పర్షవీ చోప్రా, స్వేతా సెహ్రావత్, ఎస్ యషశ్రీ,, కిరణ్ నవ్‌గిరే, దేవిక వైద్య, లక్ష్మీ యాదవ్, షేక్ సిమ్రన్ హెడ్ కోచ్: జోన్ లూయిస్ (ఇంగ్లండ్) అసిస్టెంట్ కోచ్: అన్జు జైన్ బౌలింగ్ కోచ్: ఆష్లే నోఫ్కీ మెంటార్: లీసా స్తాలేకర్ యూపీ వారియర్జ్ తొలి మ్యాచ్: మార్చి 5న గుజరాత్ జెయింట్స్‌తో -
WPL 2023: డబ్ల్యూపీఎల్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే!
Women's Premier League- 2023- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి అమ్మాయిల మెరుపులు మొదలవుతాయి. దీనికి సంబంధించిన మొత్తం 22 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను మంగళ వారం విడుదల చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. ఫైనల్ 26న జరుగుతుంది. ఈ సీజన్లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 11 చొప్పున బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో నిర్వహిస్తారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2. ఢిల్లీ క్యాపిటల్స్ 3. యూపీ వారియర్స్ 4. గుజరాత్ జెయింట్స్ 5. ముంబై ఇండియన్స్ చదవండి: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
ధోని, కోహ్లి వల్ల కూడా కాలేదు.. అరుదైన రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్
Deepti Sharma: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా ఈ టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంతకు ఏంటా రికార్డు అంటే..? రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాటర్ అయిన దీప్తి శర్మ.. వరుసగా 50కి పైగా (2016-21 మధ్యలో 54) వన్డేలు, 50 టీ20లు (2020-23) ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. భారత పురుష క్రికెటర్లు, అత్యంత ఫిట్‌గా ఉండే విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనికి సైతం సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. భారత్ తరఫున ఏ పురుష క్రికెటర్‌కు కాని మహిళా క్రికెటర్‌కు కాని సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన పేరిట లిఖించుకుని శభాష్ అనిపించుకుంది. 25 ఏళ్ల దీప్తి ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 2 టెస్ట్‌లు, 80 వన్డేలు, 87 టీ20లు ఆడింది. ఇందులో 152 టెస్ట్ పరుగులు, 1891 వన్డే పరుగులు, 914 టీ20 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో 5 టెస్ట్ వికెట్లు, 91 వన్డే వికెట్లు, 96 టీ20 వికెట్లు దీప్తి ఖాతాలో ఉన్నాయి. దీప్తి ఇప్పటివరకు వన్డేల్లో ఓ సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు, టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసింది. వన్డేల్లో ఓసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు, టీ20ల్లో ఓ సారి 4 వికెట్ల ఘనత దీప్తి ఖాతాలో ఉన్నాయి. కాగా, నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మహిళల తొట్టతొలి ఐపీఎల్ మెగా వేలంలో దీప్తి రికార్డు ధరను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూపీ వారియర్జ్ దీప్తిని 2.6 కోట్టు వెచ్చించి సొంతం చేసుకుంది. యూపీ వారియర్జ్ తరఫున దీప్తినే అత్యధిక ధర పలికిన ప్లేయర్ కావడం విశేషం. ఓవరాల్‌గా చూస్తే వేలంలో అత్యధిక ధర రికార్డును టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన సొంతం చేసుకుంది. మంధనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. మంధనను దక్కిన మొత్తం పాకిస్తాన్లో జరిగే పీఎస్ఎల్లో స్టార్ ఆటగాళ్లకు లభించే మొత్తంతో పోలిస్తే రెండింతలకు ఎక్కువ. పీఎస్ఎల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు లభించే 1.2 కోట్లే అత్యధికం.