
ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ బౌలర్లు విజృంభించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. తొలుత ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన దీప్తి.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సైకా ఇషాకిని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం విశేషం. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment