
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెనర్ దేవికా వైద్య, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది.
వాళ్ల స్థానంలో యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్.
యూపీ వారియర్స్: అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, సొప్పదండి యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k