వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది.
షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్ డియోల్, అష్లీ గార్డనర్, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్ గార్త్, తనూజా కన్వర్‌లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్‌రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్
గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్‌నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి
🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants.
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa
Comments
Please login to add a commentAdd a comment