వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
ఈ టోర్నమెంట్‌లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే… ఓపెనర్లు మేఘన, సోఫీ భారీ స్కోర్ చేయడం లేదు. హర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజయం మాత్రమే సాధించిన గుజరాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరం.
గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్‌నర్, దయలాన్ హేమలత, అన్నబెల్ సథర్‌లాండ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి.
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్
Comments
Please login to add a commentAdd a comment