Sneh Rana
-
WPL 2025: రిటైన్ చేసుకున్న భారత్ ప్లేయర్లు వీరే
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలానికి ముందు ఐదు జట్లు కూడా తమ ప్రధాన ప్లేయర్లను అట్టి పెట్టుకున్నాయి. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లతో పాటు మెగ్ లానింగ్, మరిజాన్ కాప్, అమెలియా కెర్, అనాబెల్ సదర్లాండ్లను కూడా ఆయా టీమ్‌లు అట్టి పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్‌లకు గత సీజన్లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా... ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ. 15 కోట్లు చేశారు. ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్‌లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్‌లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు. రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు. గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్, అమన్‌దీప్, అమన్‌జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక. యూపీ వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళ స్పిన్నర్ స్నేహ రాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన రానా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రెండు కీలక వికెట్లతో సత్తాచాటింది.ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రానా 10 వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేసింది. ఈ క్రమంలో స్నేహ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టెస్టు క్రికెట్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా స్నేహ రాణా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో స్నేహ రాణా కంటే ముందు భారత మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జులాన్ 10 వికెట్లు సాధించింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత మహిళా స్పిన్నర్ స్నేహనే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది.ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్ ముందు కేవలం 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా ఉంచింది. అంతకముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. Edged and taken!Shubha Satheesh takes a sharp low catch at first-slip 👌👌South Africa lose their 8th wicket.Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/LDYR5uCeme— BCCI Women (@BCCIWomen) July 1, 2024 -
ఎనిమిది వికెట్లతో చెలరేగిన టీమిండియా బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా అదరగొట్టింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాణా ఏకంగా 8 వికెట్లు (25.3-4-77-8) పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు. రాణాకు ముందు మహిళల టెస్ట్ క్రికెట్లో ఆష్లే గార్డ్నర్ (8/66), నీతూ డేవిడ్ (8/53) ఎనిమిది వికెట్ల ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో (205), స్మృతి మంధన (149) సెంచరీతొ చెలరేగారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. స్నేహ్ రాణా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మారిజన్ కాప్ (74), సూన్ లుస్ (65) మాత్రమే రాణించారు. ఫాలో ఆన్ ఆడుతూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సూన్ లుస్ (109) సెంచరీతో చెలరేగగా.. లారా వొల్వార్డ్ట్ 93 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. -
ఆస్ట్రేలియాతో వన్డే.. భారత స్టార్ బౌలర్‌కు గాయం!
ఆస్ట్రేలియాతో మ్యాచ్ మధ్యలోనే భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా మైదానాన్ని వీడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ప్లేయర్ పూజా వస్త్రాకర్‌ను ఢీకొట్టిన ఆమె తలనొప్పి కారణంగా ఫీల్డ్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్‌ను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది బీసీసీఐ మేనేజ్మెంట్. కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో విజయం సాధించి చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి వన్డేను ఆసీస్ గెలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శనివారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇతర స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రెయాంక పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. పేస్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు ఒక వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వద్ద ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ బంతిని గాల్లోకి లేపగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న స్నేహ్ రాణా.. పూజా వస్త్రాకర్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో తలకు దెబ్బ తగలడంతో స్నేహ్ రాణా నొప్పితో విలవిల్లాడింది. ఈ క్రమంలో తీవ్ర తలనొప్పితో బాధపడిన ఆమెను స్కానింగ్‌కు పంపించగా.. హర్లిన్ డియోల్ ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అయితే, రాణా తిరిగి రావడంతో ఆమె అవసరం లేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో గాయపడటానికి ముందు నాలుగు ఓవర్లు బౌల్ చేసిన స్నేహ్ రాణా.. తిరిగి వచ్చిన తర్వాత తన కోటాలో మిగిలిన మిగిలిన ఆరు ఓవర్లు పూర్తి చేసి ఓ వికెట్ ఖాతాలో వేసుకుంది. కాగా ఐసీసీ నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్/బౌలర్ కన్కషన్(తలకు దెబ్బ తగలడం/బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసేలా గాయపడటం) కారణంగా దూరమైతే వారి స్థానంలో అవే నైపుణ్యాలున్న ప్లేయర్‌ను బరిలోకి దించాలి. అయితే, ఆల్‌రౌండర్‌తో సదరు ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేస్తే బ్యాటర్ ప్లేస్‌లో వేస్తే బ్యాటింగ్, బౌలర్ ప్లేస్‌లో వస్తే బౌలింగ్ మాత్రమే చేయాలి. ఇక్కడ స్నేహ్ రాణా స్పిన్నర్ కాగా.. హర్లిన్ డియోల్ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇక ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచా ఘోష్ అద్భుత అర్ధ శతకంతో మెరిసింది. దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 136 పరుగులకు ఆలౌట్ అయింది. మారిజన్నే కాప్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, కిమ్ గార్త్, హర్లిన్ డియోల్, స్నేహ్రాణా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. -
సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న హర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. దాంతో, గుజరాత్ జట్టు 53 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత.. ఓపెనర్ లారా వోల్వార్డట్, అష్లే గార్డ్నర్ గుజరాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమె కీలక మ్యాచ్‌లో రాణించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గుజరాత్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్ డియోల్, అష్లీ గార్డనర్, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్ గార్త్, తనూజా కన్వర్లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్ గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి 🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants. Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa — Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023 -
ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ నిలువరిస్తుందా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే… ఓపెనర్లు మేఘన, సోఫీ భారీ స్కోర్ చేయడం లేదు. హర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజయం మాత్రమే సాధించిన గుజరాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరం. గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అన్నబెల్ సథర్లాండ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్ -
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి ఆర్సీబీ ఆటతీరు మారడం లేదు. వరుసగా మూడో ఓటమితో లీగ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసింది. 202 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 66 పరుగులు, హెథర్‌నైట్ 11 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ రాణించినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడం.. మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి ఎదురైంది. గుజరత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. అన్నాబెల్ సదర్లాండ్ రెండు, మాన్సీ జోషీ ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. 14 ఓవర్లలో ఆర్సీబీ 118/2 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 51 పరుగులతో, రిచా ఘోష్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 24, సోఫీ డివైన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ఆర్సీబీ 74/1 9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 16, సోఫీ డివైన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ స్మృతి మంధాన(18) రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అష్లే గార్డనర్ బౌలింగ్‌లో మాన్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. టార్గెట్ 202.. ధీటుగా బదులిస్తున్న ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసిది. సోఫీ డివైన్ 18 బంతుల్లో 31, మంధాన 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచికొట్టిన గుజరాత్.. ఆర్సీబీ టార్గెట్ 202 ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శ్రేయాంక్ పాటిల్ బౌలింగ్ బాగా వేయడంతో గుజరాత్ స్కోరు కాస్త తగ్గింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. దంచికొడుతున్న గుజరాత్.. 14 ఓవర్లలో 136/3 ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 42, దయాలన్ హేమలత ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. 18 బంతుల్లోనే అర్థశతకం.. గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకుంది. ప్రీతీ బోస్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో డంక్లీ వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకున్న డంక్లీ 18 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. డంక్లీ 54, హర్లీన్ డియోల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సబ్బినేని మేఘన స్కౌట్ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం గుజరాత్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీ వుమెన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యి పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భోణీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లలో గుజరాత్ జెయింట్స్ కాస్త ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా స్నేహ్ రాణానే కెప్టెన్‌గా గుజరాత్‌ను నడిపించనుంది. ఆర్సీబీ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగాన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ గుజరాత్ జెయింట్స్(ప్లేయింగ్ XI): స్నేహ్ రాణా(కెప్టెన్) సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), అష్లీగ్ గార్డనర్, దయాళన్ హేమలత, కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్