మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా అదరగొట్టింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాణా ఏకంగా 8 వికెట్లు (25.3-4-77-8) పడగొట్టింది. మహిళల క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు. రాణాకు ముందు మహిళల టెస్ట్ క్రికెట్‌లో ఆష్లే గార్డ్‌నర్ (8/66), నీతూ డేవిడ్ (8/53) ఎనిమిది వికెట్ల ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో (205), స్మృతి మంధన (149) సెంచరీతొ చెలరేగారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. స్నేహ్ రాణా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మారిజన్ కాప్ (74), సూన్ లుస్ (65) మాత్రమే రాణించారు.
ఫాలో ఆన్ ఆడుతూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సూన్ లుస్ (109) సెంచరీతో చెలరేగగా.. లారా వొల్వార్డ్ట్ 93 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment