స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024
హ్యాట్రిక్ సెంచరీలు మిస్
ఈ మ్యాచ్‌లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్‌ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కేది.
మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.
నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment