భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్‌గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్‌ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్‌గా ఉండింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..
భారత్- 603/6
ఆస్ట్రేలియా- 575/9
ఆస్ట్రేలియా- 569/6
ఆస్ట్రేలియా- 525
న్యూజిలాండ్- 517/8
కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్‌ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్‌ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో మరిన్ని హైలైట్స్..
2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది.
292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు.
Comments
Please login to add a commentAdd a comment