Shafali Verma
-
షఫాలీ విధ్వంసకర శతకం వృథా.. బెంగాల్ ప్రపంచ రికార్డు
బీసీసీఐ దేశవాళీ సీనియర్ మహిళల వన్డే టోర్నీ(Senior Women’s One-Day)లో సోమవారం నాటి మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తద్వారా లక్ష్య ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. హరియాణా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఈ ఘనత చోటు చేసుకుంది.కాగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 5 వికెట్లతో హరియాణాపై నెగ్గింది. ముందుగాబ్యాటింగ్ చేసిన హరియాణా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. షఫాలీ ఊచకోతహరియాణా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ (115 బంతుల్లో 197; 22 ఫోర్లు, 11 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించింది. షఫాలీకి సోనియా (61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రీమా (58; 8 ఫోర్లు), త్రివేణి (46; 5 ఫోర్లు) అండగా నిలిచారు.తనుశ్రీ సర్కార్ ధనాధన్ సెంచరీఅనంతరం బెంగాల్ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బెంగాల్ ఓపెనర్లు ధారా గుజ్జార్, సస్తి మొండల్ కేవలం 9.1 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజ్జార్ 49 బంతుల్లో 69, మొండల్ 29 బంతుల్లో 52 పరుగులు బాదారు. ఇక ఆల్‌రౌండర్ తనుశ్రీ సర్కార్(Tanusree Sarkar) ఆకాశమే హద్దుగా చెలరేగి.. 83 బంతుల్లోనే 113 రన్స్ రాబట్టింది. ప్రియాంక బాల 81 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.కాగా 2019లో కాంటర్బరీ టీమ్ 309 పరుగుల లక్ష్యాన్ని విధించగా ... నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 312 పరుగులు చేసి గెలిచిన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. బెంగాల్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తనుశ్రీ సర్కార్ (83 బంతుల్లో 113; 20 ఫోర్లు) శతకం సాధించింది. చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేదు.ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్ -
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.పూజ వస్త్రకర్‌కు 4 వికెట్లుభారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q— BCCI Women (@BCCIWomen) July 9, 2024 స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024 -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్‌గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్‌ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్‌గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్‌ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్‌ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్‌లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్‌ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్‌ప్రీత్ బృందం సఫారీపై సూపర్‌గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్‌కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్‌కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్‌ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్‌లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్‌గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్‌లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టీమిండియా ఓపెనర్ల సెంచరీలు
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికా వుమన్స్ టీమ్‌తో ఇవాళ (జూన్ 28) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధన (149), షఫాలీ వర్మ (165) సెంచరీల మోత మోగించారు. స్మృతి. షఫాలీ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్మృతి, శుభ సతీష్ (15) ఔట్ కాగా.. షఫాలీ, జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో డి క్లెర్క్, డెల్మి టక్కర్ తలో వికెట్ పడగొట్టారు.భీకర ఫామ్‌లో స్మృతి..సౌతాఫ్రికాతో సిరీస్‌లలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరివీర భయంకర ఫామ్‌లో ఉంది. వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ 90 ప్లస్ స్కోర్ చేసిన మంధన.. తాజాగా టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది. మంధనకు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. స్మృతితో పాటు సెంచరీ చేసిన షఫాలీ వర్మకు టెస్ట్‌ల్లో ఇది తొలి సెంచరీ.మ్యాచ్ హైలైట్స్..టెస్ట్‌ల్లో స్మృతి మంధనకు రెండో సెంచరీ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా)టెస్ట్‌ల్లో షఫాలీ వర్మకు తొలి సెంచరీప్రస్తుత భారత మహిళల క్రికెటర్లలో స్మృతి మంధనవే అత్యధిక సెంచరీలు (2)మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు) -
మెరిసిన షఫాలీ: భారత్‌దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టి20 సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
భారత మహిళల జట్టు యువ బ్యాటర్ షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో మలేషియాపై షఫాలీ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించింది. తద్వారా ఏషియన్ గేమ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక హాఫ్ సెంచరీని షఫాలీ కేవలం 31 బంతుల్లోనే సాధించింది. ఓవరాల్‌గా 39 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. అయినప్పటికీ మలేషియా కంటే భారత్ ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో.. ఉమెన్ ఇన్ బ్లూ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా తొలుత భారత్‌ను బ్యాటింగ్ అహ్హనించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్‌గా వెనుదిరిగింది. భారత్ స్కోర్ 59/1 ఉండగా వర్షం మొదలైంది. ఆతర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన భారత్ నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ పాటు పాటు రోడ్రిగ్స్(47 నాటౌట్), రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ దుమ్మురేపారు. ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. చదవండి: Gambhir-SRK Viral Photo: షారుఖ్ ఖాన్‌తో ఫొటో.. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు..: గంభీర్ పోస్ట్ వైరల్ .@TheShafaliVerma was a class act with the bat in the 19th #AsianGames quarter-final 🏏💥 React to her 🔥innings in one emoji 💬#SonySportsNetwork #Hangzhou2022 #TeamIndia #Cheer4India #IssBaarSauPaar pic.twitter.com/v7TVVeKB9K — Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2023 -
బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ!
నాలుగు నెలల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌ల పర్యటనలో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాపై భారత జట్టు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. భారత్ కోణంలో చూస్తే పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువ క్రీడాకారిణులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నిలిచింది. సీనియర్ స్పిన్నర్లు రాధ యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్ లేకపోవడంతో తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనూషకు ఇది మంచి చాన్స్. ఆమె తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఎంపికైన పేసర్ మోనికా పటేల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. భారత మహిళల జట్టు కోచ్‌గా అమోల్ మజుందార్ ఎంపిక దాదాపు ఖాయమైనా...అధికారిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అతను కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్–19 జట్టు, ఇటీవల ఆసియా కప్ గెలిచిన అండర్–23 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, బారెడ్డి అనూష -
'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్‌లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్‌లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్‌గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా View this post on Instagram A post shared by Shafali Verma (@shafalisverma17) -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్‌ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్‌ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్‌బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్‌లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్‌లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్‌లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్‌లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడారు. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్‌లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్‌ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్‌నిచ్చిన ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్‌మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్‌లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్‌లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్‌లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్‌ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
షఫాలీ, లానింగ్ ధనాధన్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పరుగుల హోరెత్తుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. ఢిలీక్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) చెలరేగారు. బౌలింగ్‌లో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీస్కోరు చేసింది. మహిళల టి20 క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. షఫాలీ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు)... లానింగ్ 30 బంతుల్లో (10 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో మరిజన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (23 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెర్రీ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు), హీథెర్‌నైట్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. తారా నోరిస్ 5, అలైస్ క్యాప్సీ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) హీథెర్‌నైట్ 72; షఫాలీ (సి) రిచా (బి) హీథెర్‌నైట్ 84; మరిజన్ కాప్ (నాటౌట్) 39; జెమీమా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–162, 2–163. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, మేగన్ 4–0–45–0, ప్రీతి 4–0– 35–0, పెర్రీ 3–0–29–0, సోఫీ డివైన్ 1–0–20–0, శోభన 2–0–29–0, హీథెర్‌నైట్ 3–0–40–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) శిఖా (బి) క్యాప్సీ 35; సోఫీ డివైన్ (సి) షఫాలీ (బి) క్యాప్సీ 14; పెర్రీ (బి) నోరిస్ 31; దిశ (సి) క్యాప్సీ (బి) నోరిస్ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్ 2; హీథెర్‌నైట్ (సి) లానింగ్ (బి) నోరిస్ 34; కనిక (సి) షఫాలీ (బి) నోరిస్ 0; శోభన (సి) రాధ (బి) శిఖా 2; మేగన్ (నాటౌట్) 30; ప్రీతి బోస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–41, 2–56, 3–89, 4–90, 5–93, 6–93, 7–96, 8–150. బౌలింగ్: శిఖా పాండే 4–0–35–1, మరిజన్ కాప్ 4–0–36–0, జొనసెన్ 4–0–28–0, అలైస్ క్యాప్సీ 2–0–10–2, రాధ యాదవ్ 2–0–24–0, తారా నోరిస్ 4–0–29–5. -
ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ మినహాయించి ప్రతి ఓవర్లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ మ్యాచ్‌లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ టోటల్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్‌కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. -
లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్-2023 రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేసిన 210 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది. విధ్వంసం సృష్టించిన షఫాలీ వర్మ, లానింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకు ఓపెనర్లు షఫాలీ వర్మ, లానింగ్ అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా షఫాలీ వర్మ అయితే బౌలర్లను ఊచ కోత కోసింది. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసింది. ఇక లానింగ్ కూడా 43 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసింది. అదే విధంగా ఆఖరిలో మారిజానే కాప్ కూడా బ్యాట్ ఝులిపించింది. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు సాధించింది. చదవండి: డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్! 6️⃣4️⃣6️⃣ @TheShafaliVerma is dealing in boundaries here in Mumbai 😎🎆 Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/vXl5rOEgSh — Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023 Shafali Verma scores a delightful maiden 5️⃣0️⃣ for the @DelhiCapitals 🤩#TATAWPL #CheerTheW #RCBvDC pic.twitter.com/ZedyhvWZDI — JioCinema (@JioCinema) March 5, 2023 -
ఆసీస్ బ్యాటర్‌పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రైజింగ్ స్టార్ షఫాలీ వర్మ తన సహానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ బెత్ మూనీపై కోపంతో షఫాలీ ఊగిపోయింది. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్‌లో.. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ మూనీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫాలీ వర్మ జారవిడిచింది. అనంతరం 12 ఓవర్లో శిఖాపాండే బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా మూనీ షాట్ ఆడింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షఫాలీ ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో షాఫాలీ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మూనీ వైపు వేలు చూపిస్తూ వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో షఫాలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: PSL 2023: పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్ Aggression of Shafali Verma. #INDWvsAUSW #ShafaliVerma pic.twitter.com/msTWcMrAx5 — Naveen Sharma (@iamnaveenn100) February 23, 2023 -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
WPL 2023: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది. వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్టార్లు యాష్లే గార్డ్నర్, నటాలీ సివర్ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్‌లు హర్మన్ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్‌కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ 18 మంది చొప్పున తీసుకున్నాయి. టాప్–10 జాబితాలో వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్–10 జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. త్రిషకు మొండిచేయి సీనియర్ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్‌లో అవకాశం దక్కింది. అయితే అండర్–19 ప్రపంచకప్‌లో రాణించిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్ డబ్ల్యూపీఎల్ వేలంను నిర్వహించింది. వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్‌బాష్ లీగ్, ‘హండ్రెడ్’ లీగ్‌లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్‌పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన యాష్లే గార్డ్నర్పై కూడా టీమ్‌లు ఆసక్తి చూపించాయి. వారికి కూడా తక్కువేం కాదు ఆసీస్ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్ లానింగ్‌లకు కూడా మంచి విలువ దక్కింది. గుర్తింపు ఉన్నా ఇక.. మహిళల టి20 క్రికెట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. హర్మన్ విషయంలో మాత్రం ►భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోసం గుజరాత్ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు. ►అసోసియేట్ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్ తారా నోరిస్ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. ►యూఏఈకి చెందిన మనిక గౌర్ కోసం గుజరాత్ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. స్మృతి తర్వాత వేలంలో టాప్–10 ►యాష్లే గార్డ్నర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►నటాలీ సివర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు ►జెమీమా రోడ్రిగ్స్ - రూ. 2 కోట్ల 20 లక్షలు ►బెత్ మూనీ -రూ. 2 కోట్లు ►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు ►పూజ వస్త్రకర్ -రూ. 1 కోటి 90 లక్షలు ►రిచా ఘోష్ -రూ. 1 కోటి 90 లక్షలు ►సోఫీ ఎకిల్‌స్టోన్- రూ. 1 కోటి 80 లక్షలు ►హర్మన్‌ప్రీత్ - రూ. 1 కోటి 80 లక్షలు – సాక్షి క్రీడా విభాగం చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం