
పల్లెకెలె వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మేఘనా సింగ్,దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇక శ్రీలంక బ్యాటర్లలో కాంచన 47 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(94),షఫాలీ వర్మ (71) పరుగులతో చెలరేగారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది.
చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!