ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని మేఘనా సింగిల్ తీసి రోడ్రిగ్స్‌కు స్ట్రైక్ ఇచ్చింది.
ఆ తర్వాత రోడ్రిగ్స్ మరో పరుగు తీసి స్కోర్లను సమం చేసింది. ఈ సమయంలో స్ట్రైక్‌లోకి వెళ్లిన మేఘనా సింగ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో సాధించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
కోపంతో ఊగిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది.
ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేశారు. అంపైర్ వెంటనే ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్‌తో సంప్ట్ప్‌ను పడగొట్టి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment