india women cricket team
-
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఓడిన మన అమ్మాయిల జట్టు.. వన్డేల్లోనూ వరుసగా రెండో మ్యాచ్ ఓడి సిరీస్ కోల్పోయింది. శుక్రవారం మెకాయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(70), తేజల్ హసబ్నిస్(63) టాప్ స్కోరర్లగా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో మాట్ బ్రౌన్, నికోలా హాన్కాక్, నాట్ తలా రెండు వికెట్లు సాధించగా.. తైలా, పర్సన్స్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 219 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 40.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఆసీస్ ఓపెనర్ డార్క్(105) ఆజేయ శతకంతో చెలరేగింది.చదవండి: LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు.. -
తొలి వన్డే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియా-ఎ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల-ఎ జట్టు ఓటమితో ఆరంభిచింది. హర్రప్ పార్క్, మాకే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు.. 47 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ ఓపెనర్ క్యాటీ మాక్ అద్భుతసెంచరీతో చెలరేగింది. 126 బంతులు ఎదుర్కొన్న మాక్.. 11 ఫోర్లతో 129 పరుగులు చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ మెక్‌గ్రాత్(56) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్, మణి మిన్ను తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(82) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ పేసర్ మాటిలన్ బ్రౌన్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 16న జరగనుంది. కాగా ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌ను ఆసీస్-ఎ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. -
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్‌కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్‌సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్‌సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్‌కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఒత్తిడిలో భారత్
ముంబై: వన్డే సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సమరానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. వాంఖేడె మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. తొలి మ్యాచ్‌ను గెలిచిన ఆసీస్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. నిజానికి ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ భారీస్కోరే చేసింది. కానీ బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు లోపాలపై దృష్టి పెట్టిన టీమ్ మేనేజ్మెంట్ వీటిని అధిగమించి ఆ్రస్టేలియాను నిలువరించాలనే లక్ష్యంతో ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి జరిగే మ్యాచ్ ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. చదవండి: Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కౌంటర్ ఇచ్చిన కమిన్స్! -
ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 428 పరుగులకు ఆలౌట్
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. 410/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు అదనంగా మరో 18 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (111 బంతుల్లో 67 ; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(49) పరుగులతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఎకిలిస్టోన్ తలా మూడు వికెట్లు సాధించగా.. కట్లే క్రాస్, నెట్ స్కైవర్, చార్లీ డిన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. కాగా ఇది టెస్టుల్లో భారత మహిళల జట్టుకు రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. Moment when Jemimah Rodrigues completed her maiden FIFTY 🤩🔥#CricketTwitter #INDvENG pic.twitter.com/oIahFzW157 — Female Cricket (@imfemalecricket) December 14, 2023 -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
-
కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! హర్మన్‌పై సీరియస్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో దురుసగా ప్రవర్తించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అంపైర్ ఔట్ ఇచ్చాడానే కోపంతో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టి హర్మన్ పెవిలియన్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం కూడా అంపైర్లపై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసింది. "ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో" అంటూ హర్మన్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా.. చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ వ్యవహిరించిన తీరును బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుబట్టింది. కాగా ఈఎస్పీఈన్ రిపోర్టు ప్రకారం.. బంగ్లాదేశ్‌తో పోస్ట్ సిరీస్ ఫోటోలు దిగడానికి కూడా హర్మన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఈఎస్పీఈన్తో సుల్తానా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో ఏమి జరిగిందో మనందరికి తెలుసు. అది తన వ్యక్తిగత సమస్య. కానీ సహచర (బంగ్లాదేశ్) ఆటగాళ్లతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. కనీసం జాయింట్ ఫోటోగ్రాఫ్ దిగేందుకు కూడా ఆమె నిరాకరించింది. అది మంచి పద్దతి కాదు. నేను కూడా నా జట్టు ఆటగాళ్లను తీసుకుని ఫోటో సెక్షన్ నుంచి వెళ్లిపోయాను. క్రికెట్ అనేది గౌరవం క్రమశిక్షణతో కూడిన ఆట. ఈ మ్యాచ్‌లో ఉన్న వారు చాలా అనుభవజ్ఞులైన అంపైర్లు. చాలా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్లుగా పనిచేశారు. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారు తీసుకున్న నిర్ణయాలు అంతిమంగా పరిగణించబడతాయి" అని వాఖ్యనించింది. చదవండి: IND vs WI: వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! వీడియో వైరల్ Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్
ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని మేఘనా సింగిల్ తీసి రోడ్రిగ్స్‌కు స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత రోడ్రిగ్స్ మరో పరుగు తీసి స్కోర్లను సమం చేసింది. ఈ సమయంలో స్ట్రైక్‌లోకి వెళ్లిన మేఘనా సింగ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో సాధించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కోపంతో ఊగిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేశారు. అంపైర్ వెంటనే ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్‌తో సంప్ట్ప్ను పడగొట్టి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!'
టీమిండియా మహిళా జట్టు ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే సిరీస్‌లు ఆడుతోంది. గతేడాది డిసెంబర్లో రమేశ్ పవార్‌ను ఎన్సీఏకు పంపించినప్పటి నుంచి మహిళల హెడ్‌కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో భారత మహిళల జట్టు కోచ్ లేకుండానే టి20 వరల్డ్‌కప్ ఆడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను కూడా కోచ్ లేకుండానే ఆడుతుంది. సరైన వ్యక్తి కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహిళల జట్టుకు కొత్త కోచ్ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాన కోచ్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటివరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. కీలకమైన మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన మీడియా సమావేశంలో పాల్గొంది. మంధాన మాట్లాడుతూ.. ''సరైన ప్రధాన కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. జట్టు కోసం సుధీర్ఘంగా సేవలు అందించే కోచ్‌ను ఎంపిక చేయాలనేది బోర్డు ఉద్దేశం. ఆటగాళ్ల నుంచి చూస్తే మాకు కోచ్ లేకపోవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నాణ్యమైన క్రికెట్ ఆడినంత కాలం కోచ్ లేకపోయినా టీమిండియా మహిళా జట్టుకు గెలిచే సత్తా ఉంటుంది. ప్రధాన కోచ్ లేకపోయినప్పటికి ఇతర కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారి సూచనలు తీసుకుంటూ ముందు సాగుతున్నాం. వారిచ్చే సూచనలు మాకు ఉపయోగపడుతున్నాయి. మా చుట్టూ ఏం జరుగుతుందనేది జట్టుగా మాకు ముఖ్యం కాదు. మైదానంలో ఎలా ఆడుతున్నామన్నదే కీలకం. ఈ సిరీస్ ముగిసేలోగా జట్టు ప్రధాన కోచ్ విషయమై బీసీసీఐ నుంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. ప్రధాన కోచ్‌గా ఎవరొచ్చినా వారి సూచనలు, సలహాలు తీసుకొని జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ తెలిపింది. చదవండి: Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది' దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! -
'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ అనగానే మొదటగా వచ్చే పేరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. పురుషులు క్రికెట్ ఆధిపత్యంలో మహిళల క్రికెట్ కెప్టెన్ సంగతి మరిచిపోతున్నాం. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మహిళల టి20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23న జరగనున్న తొలి సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది భారత మహిళల జట్టు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. 150 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన వేళ మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ హర్మన్‌ప్రీత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''గూగుల్‌కు వెళ్లి ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎవరు అని వెతికితే హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం.#IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్ చేసి చక్కదిద్దుకుందాం.'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది. నిజమే టీమిండియా మహిళల క్రికెట్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈసారి మహిళల జట్టు టి20 వరల్డ్‌కప్ కొట్టాలని కోరుకుందాం. యువీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా యువరాజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సేమ్ వీడియోను షేర్ చేశాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో మినహా మిగతా అన్నింటిలోనూ విజయాలు సాధించింది. సోమవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు ఎంటరైంది. If we’ve created this problem, we also have the power to fix it. Let’s do it for women’s cricket! 🏏💪🏻 Use this hashtag: #IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit to spread the word and make a difference! 🇮🇳 pic.twitter.com/JMn5Cw7Cel — Yuvraj Singh (@YUVSTRONG12) February 21, 2023 -
ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్
ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్ టీ20 ప్రపంచకప్-2023 సెమీఫైనల్లో భారత మహిళల జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరడం వరుసగా ఇది మూడో సారి. ►భారత్ -ఐర్లాండ్ మధ్య జరుగుతున్నకీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ స్కోర్: 54/2 వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ►6 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో గాబీ లూయిస్(27), డెలానీ(13) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అమీ హంటర్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరగా.. ప్రెండర్గాస్ట్ను రేణుక సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. అదరగొట్టిన స్మృతి మంధాన.. ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ ఐర్లాండ్‌తో జరగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 143 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 87 పరుగులు చేసిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన..ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఔటయ్యంది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన లారా డెలానీ బౌలింగ్‌లో నాలుగో బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్(13) పెవిలియన్‌కు చేరగా.. ఆరో బంతికి రిచా ఘోష్ డకౌట్‌గా ఔటయ్యంది. క్రీజులో క్రీజులో మంధాన(69)తో పాటు జెమీమా రోడ్రిగ్స్(11) పరుగులతో ఉంది. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను స్మృతి అందుకుంది. 14 ఓవర్లు ముగిసే భారత్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మంధాన(53)తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 62 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. లారా డెలానీ బౌలింగ్‌లో పెవిలియన్‌కే చేరింది. క్రీజులో స్మృతి మంధాన,హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 63/1 ► పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(27), షఫాలీ వర్మ(13) పరుగులతో ఉన్నారు. ►3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(5) పరుగులతో ఉన్నారు. ►మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక భారత్ కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. రాధాయాదవ్ స్థానంలో దేవిక వైద్య తుది జట్టులోకి వచ్చింది. కాగా ఈ మెగా టోర్నీల్లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఐర్లాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. తుది జట్లు: ఐర్లాండ్: అమీ హంటర్, గాబీ లూయిస్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐమర్ రిచర్డ్సన్, లూయిస్ లిటిల్, లారా డెలానీ(కెప్టెన్), అర్లీన్ కెల్లీ, మేరీ వాల్డ్రాన్(వికెట్ కీపర్), లేహ్ పాల్, కారా ముర్రే, జార్జినా డెంప్సే భారత్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ చదవండి: IND vs AUS: కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్ కెప్టెన్ చేసి ఉంటేనా.. వెంటనే! -
ఇంగ్లండ్‌తో భారత్ కీలకపోరు.. గెలిస్తే సెమీస్‌కు!
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే గ్రూపు-2 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్ -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ వ్యచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆమె కోలుకోకపోవడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్మృతి ఆడలేదు. మరోవైపు భుజం నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తొలి మ్యాచ్‌లో ఆడేది లేనిది ఆదివారం తెలుస్తుంది. చదవండి: దిగ్గజ ఆల్‌రౌండర్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ స్నేహ్ రాణా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టిన స్నేహ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన దీప్తి శర్మ, రేణుక సింగ్ ఒక్కో స్థానం పడిపోయి వరుసగా మూడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్స్టోన్ 763 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికాకు చెందిన నొన్కులుకో లాబా 753 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో స్థానంలో, షఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టాప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన తాహిలా మెక్‌గ్రాత్ 803 పాయింట్లతో కొనసాగుతుంది. టి20 ర్యాంకింగ్స్‌లో తాహిలా 800 పాయింట్లు అందుకోవడం ఇదే తొలిసారి.ఇంతకముందు చార్లెట్ ఎడ్వర్డ్స్ జూన్ 2009లో 843 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు అందుకుంది. చదవండి: డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది -
ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు
టీమిండియా మహిళా క్రికెటర్లు విశాల్ 'ఎనిమి' సినిమాలోని 'టమ్ టమ్(Tum Tum)' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న టీమిండియా మహిళా బృందం టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టి20 ట్రై సిరీస్‌లో ఆడుతుంది. అయితే గురువారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్ సహా దీప్తి శర్మ, స్నేహ్ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వీడిమోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'స్లేయింగ్ ది ట్రెండ్' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ముక్కోణపు టోర్నీ విజేతగా ఆతిథ్య దక్షిణాఫ్రికా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) చదవండి: ఆస్ట్రేలియా సాధన షురూ.. -
ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్.. దుమ్మురేపిన ఇండియా అమ్మాయిలు ( ఫొటోలు)
-
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
భారత మహిళల జట్టుతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమెకు డిప్యూటీగా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. అదే విధంగా మాజీ ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌కు ఆస్ట్రేలియా జట్టు తరపున చోటు దక్కింది. కాగా గతంలో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన గార్త్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతోంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొట్టిన గార్త్‌కు జాతీయ జట్టు తరపున చోటు దక్కింది. మరోవైపు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి' -
ఏడోసారి ఆసియా కప్ గెలిచిన భారత మహిళా జట్టు
-
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’... హర్మన్‌ప్రీత్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది. ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల (1999) తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ అమ్మాయిలు సిరీస్ గెలిచారు. -
Womens Asia Cup 2022: చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో భారత్ పోరు..
మహిళల ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. షెల్లాట్ వేదికగా శుక్రవారం పాక్-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ మధ్యహ్నాం 1:00 గంటకు ప్రారంభం కానుంది. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడ మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హర్మాన్ సేన పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ భీకర ఫామ్‌లో ఉంది. అదే విధంగా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడాతమ స్థాయికి తగ్గట్టు రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ అద్భుతమైన బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్‌ను పాక్ ఎంత వరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ప్రత్యర్ధి జట్టు విషయంకు వస్తే.. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో పసికూన థాయ్‌లాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. భారత్ విజయాల జోరుతో బరిలోకి దిగుతుండగా.. పాక్ మాత్రం ఓటమి బాధతో బరిలోకి దిగనుంది. ఇక బౌలింగ్ పరంగా పాకిస్తాన్ పర్వాలేదనిపిస్తున్నప్పటికి.. బ్యాటింగ్‌లో మాత్రం ఓపెనర్ సిద్రా అమీన్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించడం లేదు. తుది జట్లు(అంచనా) భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దయాళన్ హేమలత, దీప్తి శర్మ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్/, రేణుకా సింగ్ పాకిస్తాన్: మునీబా అలీ (వికెట్ కీపర్), సిద్రా అమీన్, బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, డయానా బేగ్, తుబా హసన్, నష్రా సంధు -
ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి దుమ్మురేపింది. తన టీ20 కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను మంధాన సాధించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె 111 పరుగులు సాధించింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఆమె రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరువైంది. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన సత్తా చాటింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు ఈ భారత స్టార్ ఓపెనర్ చేరుకుంది. కాగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసి భారత విజయంలో మంధాన కీలక పాత్ర పోషించింది. అదే విధంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగు స్ధానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. చదవండి: CSA T20 League: దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్ -
కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్మెంట్'.. ఫొటోలు వైరల్
భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అదే విధంగా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వెటరన్ క్రికెటర్ వేదా టీమిండియా తరపున 48 వన్డేలు, 76 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. వేదా 2017 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా భాగంగా ఉంది. కాగా గత కొంత కాలంగా భారత జట్టుకు వేదా దూరంగా ఉంది. View this post on Instagram A post shared by Arjun Hoysala (@arjunhoysala) చదవండి: Asia Cup 2022: ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..!
మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ భాగమైంది. ఇక ఓవరాల్‌గా దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్ టోర్నీను నిర్వహించారు. కాగా అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కాగా ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు అన్నీ బర్మింగ్‌హామ్ వేదికగానే జరగనున్నాయి. ఇక కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించల మూడు హాట్ ఫేవరెట్ జట్లును పరిశీలిద్దాం. ఆస్ట్రేలియా ప్రస్తుతం మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం చెలాయిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించే ఫేవరట్ జట్లలో ఆస్ట్రేలియాకు తొలి స్థానం ఇవ్వవచ్చు. అదే విధంగా మహిళల టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసీస్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఐదు టైటిల్స్‌ను లానింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా ఆస్ట్రేలియా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో బ్రెత్ మూనీ, కెప్టెన్ లానింగ్, మెక్‌గ్రాత్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మేఘనా స్కాట్, జానెసన్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇంగ్లండ్ ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే జట్లులో ఇంగ్లండ్ ఒకటి. అయితే ఈ లీగ్‌లో రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ.. ఫైనల్లో మాత్రం ఈ రెండు జట్లు ఢీకోనే అవకాశం ఉంది. మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఫైనల్లోను ఇంగ్లండ్, ఆసీస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్ రెగ్యూలర్ కెప్టెన్ హీథర్ నైట్ అందుబాటుపై సంద్ఘిదం నెలకొంది. ఒక వేళ ఈ టోర్నీకి ఆమె దూరమైతే ఇంగ్లండ్‌కు గట్టి ఎదరుదెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే ఇంగ్లండ్ మాత్రం ఆల్ రౌండర్ నాట్ స్కివర్, వెటరన్ కేథరీన్ బ్రంట్, యంగ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి వారితో బలంగా కన్పిస్తోంది. భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ రేసులో ఉన్న మరో జట్టు భారత్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లకు భారత్ నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ పరిచిన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం తమ సత్తా చాటాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. ఇక భారత్ కూడా బ్యాటింగ్,బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఓపెనింగ్ జోడీ షఫాలీ వర్మ,స్మృతి మంధాన చేలరేగితే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లనే ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ప్రతిష్టాత్మక క్రీడల్లో నామమాత్రపు విజయాలు కాకుండా పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Axar Patel- Six in Final Over List: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? 💬 💬 We are aiming for Gold Medal at the Commonwealth Games: #TeamIndia vice-captain @mandhana_smriti. 👍 👍#B2022 pic.twitter.com/7Tsovu3Y12 — BCCI Women (@BCCIWomen) July 22, 2022 -
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పల్లెకెలె వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మేఘనా సింగ్,దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో కాంచన 47 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(94),షఫాలీ వర్మ (71) పరుగులతో చెలరేగారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు.. తొలి క్రికెటర్‌గా
ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్‌గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్ ఆడారు. చదవండి: Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా -
హమ్మయ్య.. మొత్తానికి భారత్ గెలిచింది
న్యూజిలాండ్ పర్యటనలో వరుస నాలుగు ఓటమిల తర్వాత.. ఐదో వన్డే గెలిచి భారత మహిళల జట్టు వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఓవల్ వేదికగా జరగిన అఖరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విజయంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(66), సోఫియా డివైన్(34),లారెన్ డౌన్(30) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), హర్మన్ ప్రీత్ కౌర్(63), మిథాలీ(57) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్‌కి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
‘నాలుగు’లోనూ తప్పని ఓటమి
New Zealand Women Vs India Women 4th Odi, 2022: 50 ఓవర్ల మ్యాచ్ వర్షంతో 20 ఓవర్లకు మారినా భారత మహిళల జట్టు రాత మాత్రం మారలేదు. న్యూజిలాండ్ చేతిలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మిథాలీ రాజ్ బృందం మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకొని పరాజయ అంతరాన్ని 0–4కు పెంచింది. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కివీస్ 63 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. వాన కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా కెర్ (33 బంతుల్లో 68 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సుజీ బేట్స్ (26 బంతుల్లో 41; 7 ఫోర్లు), సాటర్త్‌వైట్ (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సోఫీ డివైన్ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) కూడా ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందిం చారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. రిచా ఘోష్ (29 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, మిథాలీ రాజ్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. అమేలియా కెర్, హేలీ జెన్సన్ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. చివరిదైన ఐదో వన్డే గురువారం ఇక్కడే జరుగుతుంది. రిచా పోరాటం వృథా మూడో వన్డే ఆడిన జట్టులో ఐదు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. హర్మన్‌కౌర్‌పై ఎట్టకేలకు వేటు వేసిన మేనేజ్మెంట్ అనూహ్యంగా స్మృతిని కాకుండా దీప్తి శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడం విశేషం. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మన టీమ్‌కు ఏదీ కలిసి రాలేదు. వరుసగా తొలి మూడు ఓవర్లలో షఫాలీ వర్మ (0), యస్తిక (0), పూజ (4) అవుటయ్యారు. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడుతున్న స్మృతి (13) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోవడంతో భారత్ స్కోరు 19/4కు చేరింది. ఈ దశలో మిథాలీ, రిచా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రిచా వరుస బౌండరీలతో చెలరేగిపోయింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన ఆమె తాను ఆడిన తొలి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టింది. ఒక దశలో వరుసగా నాలుగు ఓవర్లలో ఆమె ఒక్కో సిక్స్ చొప్పున బాదడం విశేషం. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న రిచా భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేసింది. 2008లో రుమేలీ ధార్ 29 బంతుల (శ్రీలంకపై) రికార్డును రిచా సవరించింది. అయితే వరుస ఓవర్లలో రిచా, మిథాలీ వెనుదిరగడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించగా... 32 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు పడ్డాయి. -
భారత్–న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లన్నీ అక్కడే... ఎందుకంటే..
Ind W Vs NZ W Series: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన వేదికల విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కోవిడ్ కారణంగా సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు మూడు వేదికలను తగ్గించి ఒకే వేదికకు మార్చారు. ఈ టూర్లో భాగంగా కివీస్‌లో భారత మహిళలు ఒక టి20, 5 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌లను నేపియర్, నెల్సన్, క్వీన్స్‌టౌన్‌లో నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించగా... ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు క్వీన్స్టౌన్లోనే జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ పోరు కోసం భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9న టి20 మ్యాచ్... ఫిబ్రవరి 11, 14, 16, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి -
టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!
ముంబై: క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా పురుషుల, మహిళా క్రికెటర్లు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేయనున్నట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మిథాలీ సేన జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయలుదేరుతాయనేది నిజమే అయినా.. ఇరు జట్లు ఒక ఫ్లైట్‌లో మాత్రం వెళ్లవట. టీమిండియా పురుషుల జట్టుకోసం ప్రత్యేక చార్టడ్ విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ మహిళా జట్టును మాత్రం కమర్షియల్ ప్లైట్‌లో పంపనున్నట్లు సమాచారం. దీంతో బీసీసీఐ టీమిండియా మహిళా క్రికెట్‌పై వివక్ష చూపింస్తుదంటూ వార్తలు వస్తున్నాయి. కాగా బీసీసీఐ కూడా ఇంతవరకు పురుషులు, మహిళల జట్లు ఒకే విమానంలో వెళుతున్నట్లు అఫిషీయల్‌గా ఎక్కడా అనౌన్స్ చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు. అంతేగాక జూన్ 2న లండన్‌కు వెళ్లనున్న టీమిండియా పురుషుల జట్టును ఈ బుధవారం క్వారంటైన్లోకి పంపించనున్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో మహిళా క్రికెటర్లకు మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలిసింది. బీసీసీఐ ఇలా టీమిండియా మహిళల జట్టుపై వివక్ష చూపడం ఇది తొలిసారి కాదని.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ సమయంలోనే టీ20 వుమెన్స్ చాలెంజ్ నిర్వహించాలని భావించారు. అయితే మొదట నాలుగు టీమ్‌లతో నిర్వహించాలని భావించినా చివరకు ఏదో మొక్కుబడిగా మూడు జట్లను ఏర్పాటు చేసి లీగ్‌ను పూర్తి చేశారు. ఇక 2020 ఏడాదిలో కరోనా సమయంలో మొదట టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈసీబీ బయెబబూల్‌లో నిర్వహించడానికి సిద్ధంగా లేదనే కారణం చెప్పి ఆ టోర్నీని రద్దు చేసింది. ఇంకా విచిత్రమేంటంటే.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న పురుషుల జట్టులోని సభ్యులందరికి ఇంటివద్దే కరోనా పరీక్షలు జరిగేలా ఏర్పాటు చేస్తామని పేర్కొన్న బీసీసీఐ మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం మీ టెస్టులు మీరే చేసుకోవాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. టీమిండియా పురుషుల జట్టుకు ఇస్తున్న గౌరవం మహిళల జట్టుకు బీసీసీఐ ఎందుకు ఇవ్వలేకపోతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
బోణి కొట్టిన భారత్
లక్నో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్ గోస్వామి (4/42), గైక్వాడ్ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్ గోస్వామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. -
అనవసర మార్పులు వద్దు
న్యూఢిల్లీ: ప్రేక్షకాదరణ కోసమంటూ మహిళల క్రికెట్‌కు పనికిరాని మార్పులు చేయొద్దని భారత సీనియర్ పేసర్ శిఖా పాండే సూచించింది. మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కేందుకు బంతి బరువు తగ్గించడం, పిచ్ పొడవును 20 గజాలకే పరిమితం చేయాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పురుషుల ఆటలతో మహిళల ఆటల్ని పోల్చవద్దన్న ఆమె అనవసర మార్పులతో మహిళా క్రికెట్ సామర్థ్యాన్ని తక్కువ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ‘మహిళా క్రికెట్‌ను ఆకర్షణీయం చేసేందుకు వినిపిస్తోన్న మార్పులన్నీ నిరుపయోగమైనవని నా అభిప్రాయం. ఆటకు ఆదరణ కల్పించాలంటే మంచి మార్కెటింగ్ అవసరం అంతేగానీ పిచ్ పొడవు తగ్గించకూడదు. మేం బంతిని బలంగా బాదలేమనే ఉద్దేశంతో బంతి బరువు తగ్గించాలనుకోవడం సరికాదు. ఇటీవల మహిళా క్రికెట్లో పవర్‌హిట్టింగ్ పెరగడం అందరూ చూస్తున్నారు. పురుష అథ్లెట్లకు సమానమని అనిపించుకునేందుకు ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం మహిళా స్ప్రింటర్ 100 మీటర్ల పరుగును 80 మీటర్లే పరుగెత్తాలనుకోదు. ఇది అంతే. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయాలి. మా మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మాలో సత్తా ఉందని వారు నమ్ముతున్నారు. మీరు కూడా మమ్మల్ని నమ్మండి’ అని శిఖా కోరింది. -
అమ్మాయిలు అజేయంగా...
మెల్బోర్న్: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్ గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండిమా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 113 పరుగులు చేసింది. భారత్ 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ (4/23)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత్ 8 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం సంపాదించింది. స్పిన్ మ్యాజిక్... టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు ఉపక్రమించింది. మూడో ఓవర్ తొలి బంతికే స్పిన్నర్ దీప్తి శర్మ లంక ఓపెనర్ థిమాషినిని అవుట్ చేసింది. ఆ తర్వాత జయాంగని, హర్షిత కొంచెంసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే హర్షితను బౌల్డ్ చేసి స్పిన్నర్ రాజేశ్వరి ఈ జోడిని విడగొట్టింది. అనంతరం మరో స్పిన్నర్ రాధా యాదవ్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. మరో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఒక వికెట్ తీసింది. మొత్తం శ్రీలంక కోల్పోయిన తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే రావడం విశేషం. ఆడుతూ... పాడుతూ... 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి మెరిసింది. లంక బౌలర్ల భరతం పట్టింది. ఏడు బౌండరీలు కొట్టింది. మరోవైపు స్మృతి (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) కూడా తన జోరు కొనసాగించింది. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించాక స్మృతి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్)తో షఫాలీ రెండో వికెట్‌కు 47 పరుగులు జత చేసింది. హర్మన్‌ప్రీత్, షఫాలీ అవుటయ్యాక... జెమీమా (15 నాటౌట్; ఫోర్), దీప్తి శర్మ (15 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 28 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇనింగ్స్: థిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి శర్మ 2; జయాంగని (సి) శిఖా పాండే (బి) రాధా యాదవ్ 33; హర్షిత (బి) రాజేశ్వరి 12; హన్సిమ (సి) వేద (బి) రాధా యాదవ్ 7; హాసిని (సి) తానియా (బి) రాధా యాదవ్ 7; శశికళ సిరివర్దనె (సి) వేద (బి) రాజేశ్వరి 13; నీలాక్షి డిసిల్వా (సి) హర్మన్ (బి) పూనమ్ 8; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) రాధా యాదవ్ 1; దిల్హారీ (నాటౌట్) 25; సత్య (బి) శిఖా పాండే 0; ప్రబోధని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–48, 4–58, 5–75, 6–78, 7–80, 8–104, 9–104. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–16–1; శిఖా పాండే 4–0–35–1; రాజేశ్వరి 4–1–18–2; పూనమ్ యాదవ్ 4–0–20–1; రాధా యాదవ్ 4–0–23–4. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 47; స్మృతి (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17; హర్మన్‌ప్రీత్ (సి) హన్సిమ (బి) శశికళ 15; జెమీమా (నాటౌట్) 15; దీప్తి శర్మ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 116 వికెట్ల పతనం: 1–34, 2–81, 3–88. బౌలింగ్: ప్రబోధని 4–0–13–1; శశికళ 4–0–42–1; సత్య సాందీపని 1–0–11–0; జయాంగని 2–0–21–0; దిల్హారీ 3–0–18–0; థిమాషిని 0.4–0–7–0. -
అదిరే ఆరంభంతో...
పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్ ఘనవిజయంతో టి20 ప్రపంచకప్‌కు తెరలేపింది. పేస్‌తో శిఖా పాండే, గూగ్లీలతో పూనమ్ మన మహిళల జట్టుకు అద్భుత గెలుపు అందించారు. పూనమ్ యాదవ్ సిడ్నీ: ఆసీస్ మహిళల జట్టు భారత్ కంటే ఎంతో మెరుగైంది. మరెంతో పటిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురే లేని జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్. ఇప్పుడు జరిగేది వారి సొంతగడ్డపైనే! దీంతో ప్రత్యర్థులకు డిఫెండింగ్ చాంపియన్ అంటే ఒకింత ‘కంగారూ’. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్‌కు దిగితే తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ను 6 పరుగులలోపే అవుట్ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో అయితే... మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ అదిరే ఆరంభానికి ఆసీస్ చెదిరిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/19) బౌలింగ్ వారిపట్ల సింహ స్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా! శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (46 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు) రాణించింది. జెస్ జొనసెన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హీలీ (35 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. పూనమ్ యాదవ్ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. శిఖా (3/14) నిప్పులు చెరిగింది. రాణించిన దీప్తి షఫాలీ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున 4 ఓవర్లలో 41 పరుగులు చేశాక స్మృతి (10), షఫాలీ, హర్మన్‌ప్రీత్ (2) స్వల్పవ్యవధిలో అవుటయ్యారు. దీంతో ఏడో ఓవర్ ముగియకముందే భారత్ స్కోరు 47/3. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 26) షాట్ల జోలికి వెళ్లకుండా దీప్తి శర్మతో కలిసి పరుగుల పోరాటం చేసింది. దీంతో మరో వికెట్ పడకుండా భారత్ 15.5వ ఓవర్లలో వందకు చేరుకుంది. అయితే మరుసటి బంతికే జెమీ మా... కిమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ దశలో దీప్తికి వేద (9 నాటౌట్) జతయ్యింది. హీలీ శ్రమ వృథా ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్ ఇలా ఏ రకంగా చూసిన భారత్ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్‌కు కష్టమైందేమీ కాదు. అలాగే 5.3 ఓవర్లదాకా ఆస్ట్రేలియా స్కోరు 32/0. ఇక గెలిచేందుకు 101 చేస్తే సరిపోతుంది. కానీ మూనీ (6)ని శిఖా పాండే అవుట్ చేశాకా ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్ హీలీ పోరాటం చేస్తున్నా... గార్డ్నర్ (34) అండగా నిలిచినా... లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వాళ్లిద్దరిని పెవిలియన్‌కు చేర్చిన పూనమ్ యాదవ్ తన స్పిన్ ఉచ్చును బిగించడంతో ఆసీస్ చెదిరిపోయింది. పూనమ్‌కు తోడు శిఖా పాండే నిప్పులు చెరుగుతుంటే ఆసీస్ ఇన్నింగ్స్ కూలిపోయింది. లానింగ్ (5), హేన్స్ (6), పెర్రీ (0), జొనసెన్ (2), అన్నబెల్ (2), కిమిన్స్ (4), స్ట్రానో (2), షట్ (1 నాటౌట్) ఇలా ఏ ఒక్కరు నిలువలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) అన్నబెల్ (బి) పెర్రీ 29; మంధాన ఎల్బీడబ్ల్యూ (బి) జెస్ జొనసెన్ 10; జెమీమా ఎల్బీడబ్ల్యూ (బి) కిమిన్స్ 26; హర్మన్‌ప్రీత్ (స్టంప్డ్) హీలీ (బి) జెస్ జొనసెన్ 2; దీప్తి శర్మ నాటౌట్ 49; వేద కృష్ణమూర్తి నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు)132. వికెట్ల పతనం: 1–41, 2–43, 3–47, 4–100 బౌలింగ్: స్ట్రానో 2–0–15–0, పెర్రీ 3–0–15–1, షట్ 4–0–35–0, జెస్ జొనసెన్ 4–0–24–2, కిమిన్స్ 4–0–24–1, గార్డ్నర్ 3–0–19–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) పూనమ్ 51; మూనీ (సి) గైక్వాడ్ (బి) శిఖా 6; లానింగ్ (సి)భాటియా (బి) గైక్వాడ్ 5; హేన్స్ (స్టంప్డ్) భాటియా (బి) పూనమ్ 6; గార్డ్నర్ (సి) అండ్ (బి) శిఖా 34; పెర్రీ (బి) పూనమ్ 0; జెస్ (సి) భాటియా (బి) పూనమ్ 2; అన్నబెల్ (స్టంప్డ్) భాటియా (బి) శిఖా 2; కిమిన్స్ రనౌట్ 4; స్ట్రానో రనౌట్ 2; షట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–32, 2–55,3–67, 4–76, 5–76, 6–82, 7–101, 8–108, 9–113, 10–115. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–17–0, రాజేశ్వరీ గైక్వాడ్ 4–0–31–1, శిఖా పాండే 3.5–0–14–3, అరుంధతి 4–0–33–0, పూనమ్ 4–0–19–4. -
భారత్‌ను గెలిపించిన పూనమ్
బ్రిస్బేన్: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శిఖా పాండే (16 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, దీప్తి శర్మ (21) మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేయగలిగింది. లీ ఆన్ కిర్బీ (41 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హేలీ మాథ్యూస్ (25) రాణించారు. పూనమ్ యాదవ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి ఓవర్లోనే పూనమ్ 2 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించింది. -
భారత్ క్లీన్‌స్వీప్
గయానా: భారత మహిళల జట్టు ఆఖరి టి20లోనూ జయభేరి మోగించింది. తద్వారా వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 61 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), కెప్టెన్ స్మృతి మంధాన (7) విఫలం కాగా, జెమీమా రోడ్రిగ్స్ (56 బంతుల్లో 50; 3 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (48 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్, అనీసా మొహమ్మద్, ఆలియా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 73 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ కైషోన నైట్ (22), షెమైన్ క్యాంప్బెల్లి (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు అనూజ పాటిల్ (2/3), రాధా యాదవ్ (1/10), పూనమ్ (1/15), పూజ (1/14), హర్లీన్ డియోల్ (1/13) ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను సమష్టిగా దెబ్బతీశారు. -
50 చేసినా... మనమే గెలిచాం
ప్రావిడెన్స్ (గయానా): విండీస్ గడ్డపై భారత్ మహిళల జట్టు విజయగర్జన కొనసాగుతోంది. ఇప్పటికే ఎదురులేని విజయాలతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ నాలుగో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టును కంగుతినిపించింది. చిత్రంగా కేవలం 50 పరుగులే చేసినా... ప్రపంచ చాంపియన్ జట్టుపై టీమిండియా గెలుపొందడం విశేషం. వర్షంతో ఈ 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 9 ఓవర్లలో 7 వికెట్లకు 50 పరుగులు చేసింది. పూజ పది పరుగులే టాప్ స్కోర్! హేలీ మాథ్యూస్ 3, అఫీ, షెనెటా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన విండీస్ 5 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. హేలీ 11, హెన్రీ 11, మెక్లీన్ 10 పరుగులు చేశారు. విండీస్ గెలిచేందుకు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా... అనూజ వేసిన ఆఖరి ఓవర్లో విండీస్ 7 పరుగులే చేసి 2 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్ (2/8) రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ (1/8), రాధా యాదవ్(1/8)లకు ఒక్కో వికెట్ దక్కింది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో ఉన్న భారత్... గురువారం ఆఖరి మ్యాచ్‌ను ఇదే వేదికపై ఆడనుంది. -
భారత మహిళలదే టి20 సిరీస్
ప్రావిడెన్స్ (గయానా): మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన భారత మహిళల టి20 క్రికెట్ జట్టు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 59 పరుగులే చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ (4–2–6–2), దీప్తి శర్మ (4–0–12–2) రెండేసి వికెట్లు తీయగా... అనూజా పాటిల్, పూజా వస్త్రకర్, హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. విండీస్ జట్టులో చెడీన్ నేషన్ (11), చినెల్లి హెన్రీ (11) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (0), స్మృతి మంధాన (3), హర్మన్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... జెమీమా రోడ్రిగ్స్ (51 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు), దీప్తి శర్మ (7 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. -
సూపర్ షఫాలీ
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మళ్లీ మెరిసింది. వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఫలితంగా ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళలు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. షెడీన్ నేషన్ (32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... భారత స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. 104 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన (28 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడైన ఆటకు భారత్ 10.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. విండీస్‌పై తొలి టి20లోనూ షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసిన సంగతి విదితమే. మూడో టి20 మ్యాచ్ ఈనెల 14న గయానాలో జరుగుతుంది. -
స్మృతి, జెమీమా అర్ధ సెంచరీలు
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (112 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కింగ్ (38) రాణించింది. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమై... ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగిన స్మృతి మంధాన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఆటకు తోడు జెమీమా రోడ్రిగ్స్ (92 బంతుల్లో 69; 6 ఫోర్లు) కూడా అండగా నిలవడంతో జట్టు విజయం సులువైంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించడం విశేషం. స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... స్టెఫానీ టేలర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. -
అర్థం చేసుకున్నందుకు సంతోషం : మిథాలీ
ప్రావిడెన్స్ : క్రికెట్లోని పరిస్థితులను అర్థం చేసుకున్నందుకు సంతోషకరమని టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ట్వీట్ చేసింది. గురువారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ గర్ల్ హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అ6యితే టీ20 ఫార్మాట్‌కు ఆమె పనికి రాదని, చాలా నెమ్మదిగా ఆడే మిథాలీని టీ20ల నుంచి పక్కకు పెట్టాలని కామెంట్ చేసిన అభిమానులే.. తాజా మ్యాచ్‌లో ఆమె ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘క్రికెట్లో స్లో వికెట్, కఠిన పరిస్థితులను అభిమానులు అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో కూడా మంచి పరిస్థితులుంటాయని అనుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. You are a LEGEND... Many Congratulations 👏👏👏👏 pic.twitter.com/4oAXBttY4Q — Harsh Vardhan Bolia (@bolia_harsh) November 16, 2018 బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పై మిథాలీ నిలకడగా ఆడుతూ 4 ఫోర్ల సాయంతో 56 బంతుల్లో 51 పరుగులు చేసింది. ఈ కీలక ఇన్నింగ్స్‌కు తోడు స్పిన్నర్లు రాణించడంతో భారత్, ఐర్లాండ్‌పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గప్టిల్‌ను అధిగమించిన మిథాలీ... మిథాలీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటికే రోహిత్‌ను అధిగమించి భారత తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శనతో.. పురుషుల జట్టులో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గఫ్తిల్(2271)ను అధిగమించింది. 85 టీ20 మ్యాచ్‌ల్లో ఈ హైదరాబాదీ బ్యాట్స్‌వుమెన్ 37.43 సగటుతో 2,283 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 4వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ బేట్స్ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ప్లేయర్ టేలర్ (2691), ఇంగ్లండ్ క్రికెటర్ ఎడ్వర్డ్స్(2605), మిథాలీ కన్నా ముందున్నారు. -
ఆసీస్‌తో సిరీస్ కళ్లు తెరిపించింది: మిథాలీ
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ భారత జట్టులోని లోపాలను బయటపెట్టిందని మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అవసరముందని తెలిపింది. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై భారత్ 0–3తో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. మంగ ళవారం మీడియా సమావేశంలో మిథాలీ మాట్లాడుతూ ‘గతేడాది ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచాకే భారత ‘ఎ’ జట్టును తయారు చేశాం. వాళ్లు రాటుదేలేందుకు సమయం పడుతుంది. ఇపుడు అంతర్జాతీయ జట్లతో ఆడుతున్న అనుభవం వాళ్లకు అక్కరకొస్తుంది. సత్తాగల క్రీడాకారిణులు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా విదేశీ జట్లతో ఆడినపుడే పరిణతి చెందుతారు. మరో రెండేళ్లలో పరిస్థితిలో తప్పకుండా మార్పుంటుంది’ అని చెప్పింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌పై స్పందిస్తూ... ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా ఉందని తొలి మ్యాచ్‌లోనే తమకు అర్థమైందని చెప్పింది. దక్షిణాఫ్రికా పర్యటనలో గెలిచిన సిరీస్‌ను, సొంతగడ్డపై ఓడిన సిరీస్‌తో పోల్చడం తగదని వివరించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో రేపటినుంచి జరుగనున్న టి20 ముక్కోణపు టోర్నీ పోటాపోటీగా సాగుతుందని తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా క్రికెటర్ల కాంట్రాక్టు ఫీజుల పెంపుపై మిథాలీ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడైతే మహిళల ఐపీఎల్ అవసరం లేదని చెప్పింది. దేశవాళీ మహిళల క్రికెట్లో బలమైన జట్లు ఉన్నప్పుడే లీగ్ విజయవంతమవుతుందని భారత సారథి పేర్కొంది. -
భారత మహిళలదే సిరీస్
ఐర్లాండ్‌పై విజయం న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును 2-1తో గెలుచుకుంది. దీంతో మూడు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. ఎఫ్ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా గురువారం డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్ 18వ నిమిషంలో యెండల సౌందర్య తొలి గోల్ సాధించింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే సునీత ఫీల్డ్ గోల్‌తో ఆకట్టుకుంది. కొద్దిసేపటికి ప్రత్యర్థి నికోలా ఇవాన్ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ద్వితీయార్థంలో రెండు జట్లు పోటాపోటీ ఆటతీరు కనబరిచాయి. దీంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. -
వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా
విశాఖపట్టణం: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. గురువామిక్కడ జరిగిన చివరి వన్డేలో లంకను 95 పరగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలి రాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ(104) సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటయింది. పూనమ్ యాదవ్ 4, రానా 2, గయాక్వాద్ 2 వికెట్లు తీశారు. గోస్వామి ఒక వికెట్ దక్కించుకుంది. వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటుతామని మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ మిథాలీరాజ్ 'సాక్షి'తో చెప్పింది. -
ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి
విశాఖపట్టణం: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ వన్డేల్లో ఐదో సెంచరీ సాధించింది. శ్రీలంకతో ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఈ ఘనత సాధించింది. 109 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 148వ వన్డే ఆడుతున్న ఈ హైదరాబాదీ అమ్మాయి 49.33 సగటుతో 4791 పరుగులు సాధించింది. ఇందులో 5 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. 8 టెస్టులాడిన మిథాలి రాజ్ 52 సగటుతో 572 పరుగులు చేసింది. ఇందులో సెంచరీ, 3 అర్థ సెంచరీలున్నాయి. -
10 ఓవర్లు.. 3 మెయిడెన్లు.. 4 వికెట్లు
విశాఖపట్నం: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-0 గెల్చుకుంది. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 47.1 ఓవర్లలో 140 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసింది. 10 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. తొలి వన్డేలో 8 ఓవర్లలో 4 మెయిడెన్లు వేసి 4 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం విశేషం. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 39.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మంధన 51, రౌత్ 38, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులతో రాణించారు. ఇదే వేదికపై ఆదివారం జరిగిన తొలి వన్డేలోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.