
భారత మహిళలదే సిరీస్
ఐర్లాండ్‌పై విజయం
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును 2-1తో గెలుచుకుంది. దీంతో మూడు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను ఖాయం చేసుకుంది.
ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా గురువారం డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్ 18వ నిమిషంలో యెండల సౌందర్య తొలి గోల్ సాధించింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే సునీత ఫీల్డ్ గోల్‌తో ఆకట్టుకుంది. కొద్దిసేపటికి ప్రత్యర్థి నికోలా ఇవాన్ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ద్వితీయార్థంలో రెండు జట్లు పోటాపోటీ ఆటతీరు కనబరిచాయి. దీంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.