Irland
-
టీమిండియా వుమెన్స్ భారీ విజయం
రాజ్‌కోట్: ఐసీసీ చాంపియన్‌షిప్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ మహిళలు భారీ విజయం సాధించారు. రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలోఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది.రోడ్రిగ్స్(102) సెంచరీతో కదం తొక్కగా, హర్లీన్ డియోల్(89), మంధనా(73), ప్రతీకా రావల్(67)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. దాంతో భారత్ 351 పరుగుల లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచింది.అనంతరం బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కౌల్టర్ రిలీ(80) మాత్రమే ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలవడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత మహిళ జట్టులోని బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లతో రాణించగా,టిటిస్ బాదు, సాయలి తలో వికెట్ సాధించారు. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికె ట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జ ట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగనుంది. -
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను గణంగా నిర్వహించారు . డబ్లిన్ నగరంలో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు మరియు నలభై మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరుపుటకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 900 మంది హాజరయ్యారు. ఈ వేడుకలో అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు మేజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రి రుచికరమైన వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు, దాతలు సిల్వెని శ్రీనివాస్, ప్రభోద్ మేకల, కోలన్ కమలాకర్ రెడ్డి, జగన్ మేకల, సాగర్ సిద్ధం, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి యాలుక, షరీష్ బెల్లంకొండ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్ అల్లే, వెంకట్ తిరుకోవలురు, సుమంత్ చావా, ప్రవీణ్లాల్, రామకృష్ణ కాటేపల్లి, రాజా రెడ్డి, బాచి రెడ్డి, నగేష్ పొల్లూరు, శశిధర్ మర్రి, శ్రీధర్ రాపర్తి, రవి కిరణ్ కుంచనపల్లి, బలరాం కొక్కుల, సునీల్ పాక, శంకర్ బెల్లంకొండ, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ కార్ఫె, శ్రీనివాస్ అల్లంపల్లి, పటేల్ శ్రీనివాస్, శ్రీనివాస్ వెచ్చ, దయాకర్ కొమురెల్లి, సంతోష్ పల్లె, శ్రీధర్ యమసాని, నరేందర్ గూడ, సంపత్ రాజ్, భాను సామ, భాను ప్రకాష్ నడుకుడ, భాను బొబ్బల, కృష్ణ మోహన్ రెడ్డి, గోపి కల్లూరి, అరవింద్ కరింగుల, ఓం ప్రకాష్, రామ బొల్లగొని, రాకేష్ ఆకుల, విజేయేందర్ సంతపూరు, మధు పోలం, మహేష్ అలిమెల్ల, కళ్యాణ్ కుసుమ, వినోద్ నీలం, శంకర్ కురుగుంట్ల, లింగమూర్తి, ప్రకాష్ గుండవేని, అరుణ్ కథేరీ, సంతోష్ పారేపల్లి, శ్రీధర్ మేడిశెట్టి, వెంకట్ మంచుకొండ, సాయినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొసనం, వెంకట్ రామిడి, సురేష్ వసుకుల, విద్యనాథ్ మాదారపు, ఉపేందర్ గార్లపాటి, అనిల్ దుగ్యాల, వీరకుమార్ తిక్క, ప్రకాష్ గందె, రవికాంత్ దూలం, త్రినేష్ అందుర్తి, భువనేశ్వర్ రెడ్డి, సంకీర్త్ రెడ్డి .(చదవండి: యూకేలో రీడింగ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనం) -
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!
ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్‌లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది. మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే.. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్‌లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఐలాండ్లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. -
కాలం చెల్లిన వృద్ధి నమూనా
ఆర్థిక వృద్ధి రేటుపై ప్రపంచానికి మితిమీరిన వ్యామోహం ఉంది. దీనివల్ల పర్యావరణానికి సంబంధించిన క్రమశిక్షణ కనుమరుగైపోయింది. ఆర్థిక వృద్ధి రేటు ఒక్కటి మెరుగ్గా ఉంటే చాలు, ‘అంతా బాగానే ఉంది’ అనే స్థితి అదే వస్తుందనే నమ్మకానికి అనుగుణంగా మనల్ని మలిచారు. కానీ ఈ పేరుతో సహజ వనరుల దోపిడీ ఎంత జరుగుతున్నదో మనం విస్మరిస్తున్నాం. నిజానికి ‘సహజ వనరులు, పర్యావరణ సేవలు’ అనేవి పరిశ్రమలకు ఉచితంగా అందిస్తూ చాలా వస్తువుల ఖర్చును సమాజమే పరోక్షంగా భరిస్తున్నది. పైగా ఇప్పటి ఆర్థిక విధానాలన్నీ సంపద ఒక్కచోట పోగయ్యేలా మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే వాతావరణ ఉపద్రవానికి దారితీస్తున్న ఆర్థిక రూపకల్పనకు మరమ్మతు చేయగలిగిన నాయకత్వం ప్రపంచానికి అవసరం. ఐర్లండ్ అధ్యక్షుడు మైఖేల్ డేనియల్ హిగ్గిన్స్, ఆర్థిక పురోగతిపై మితిమీరిన వ్యామోహాన్ని తీవ్రంగా విమర్శించారు. చాలామంది ఆర్థికవేత్తలు ఎడతెగని వృద్ధి కథనంలో చిక్కుకుపోయి ఉన్నారనీ, సంకుచితంగా నిర్వచించిన సామర్థ్యం, ఉత్పాదకత, శాశ్వతమైన వృద్ధి ఫలితంగా పర్యావరణానికి సంబంధించిన క్రమశిక్షణ కనుమరుగైందనీ, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న జీవావరణ విపత్తుకు అదే కారణమనీ ఆయన పేర్కొన్నారు. ఇది, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ముందు ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ దశాబ్దం క్రితం చేసిన ప్రసంగంలో చెప్పిన విషయాన్ని నాకు మళ్లీ గుర్తుకు తెస్తోంది. ‘వాతావరణ ఉప ద్రవానికి దారితీస్తున్న ఆర్థిక రూపకల్పనను మరమ్మతు చేయగలిగిన నాయకత్వం ప్రపంచానికి అవసరం’ అని ఆయన అన్నారు. మరో మాటల్లో చెప్పాలంటే, ఆయన కూడా, ప్రపంచాన్ని ఆకస్మికమైన, కోరుకోలేని మార్పులకు సన్నిహితంగా ప్రమాదకరంగా తీసుకెళు తున్న ఆర్థిక వృద్ధి నమూనాను మరమ్మతు చేయాల్సిన అవసరముందని మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ హెచ్చరికను ఎవరూ వినిపించుకోలేదు. వాతావర ణాన్ని తట్టుకోగల విధానాలను చేపట్టవలసిన ఆవశ్యతకతపై అంత ర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసినప్పటికీ, మార్పు తేగలిగేలా చేపట్టాల్సిన విధానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. చివరకు వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) తాజా సంశ్లేషణాత్మక నివేదిక కూడా అందరూ జీవించదగిన, స్థిరమైన భవిష్యత్తును పదిలపర్చే అవకాశాల గవాక్షం వేగంగా మూసుకు పోతోందని స్పష్టంగా చెబుతోంది. అయినా జంట బ్రెట్టన్ వూడ్స్ సంస్థలు లేదా విదేశీ సంస్థాగత మదుపుదారులు, వేళ్లమీద లెక్కించదగిన క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇంకా మేల్కొనలేదు. మార్పు ఎంత ఎక్కువగా అవసరమో, మరింత ఎక్కువగా పరిణామాలు అలాగే ఉన్నాయి. ప్రధాన స్రవంతి ఆలోచనను సవాలు చేసేలా సముచిత ప్రశ్న లను ఎప్పుడు లేవనెత్తినా, ఆర్థిక సమాజం నుంచి వచ్చే సామూహిక స్పందన ఏమిటంటే, ఆర్థికాన్ని అర్థం చేసుకోని వ్యక్తుల ఊహగా వాటిని పేర్కొంటూ ఆ బలమైన స్వరాలను కొట్టి వేస్తుంటారు. కార్పొరేట్ మీడియా స్పష్టంగానే ఈ అభిప్రాయాన్ని చాటిచెప్పడాన్ని ఇష్టపడుతుంటుంది. నిజానికి ముఖ్యమైన వార్తాపత్రికలలో ప్రచురి తమైన కథనాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇంకా అత్యధిక వృద్ధి వైపు తరలివెళ్లడం వైపు వాదనను బహిరంగంగా మళ్లించే విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యావేత్తలు, బ్యాంకులకు చెందిన ప్రధాన ఆర్థిక వేత్తలు పత్రికల స్థలాన్ని ఆక్రమించడం పెరుగుతున్నట్లు కనబడుతుంది. ఇవి సాధారణ సమర్థనలను కలిగి ఉంటాయి. కానీ ప్రపంచం ఎదుర్కొంటున్న మనుగడకి సంబంధించిన ప్రమాదం రీత్యా వారి స్వరంలో కొంతైనా మార్పు ఉండాలని నేను ఆశించాను. మీడియాలో ఒక వర్గానికీ, వీధుల్లోని విద్యావంతులకూ ఇది సాధారణ వ్యవహారమే. దీనికి ప్రధానంగా మన సామూహిక ఆలోచనలో పాతుకుపోయిన ‘టిఐఎన్ఏ’ (దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్– ప్రత్యామ్నాయం అనేది లేదు) భావనే కారణం. మనం దీన్ని ఇష్ట పడినా లేకున్నా చెప్పాల్సింది ఏమంటే– ‘అంతా బాగానే ఉంది’ అనే స్థితికి ఆర్థిక వృద్ధి దారి తీస్తుందనే నమ్మకానికి అనుగుణంగా మనం మల్చబడ్డాము. దిగజారే వాతావరణ పరిస్థితులకు కూడా ఆర్థిక వృద్ధి రక్షకురాలిగా ఆవిర్భవిస్తుంది అనే సాధారణ ఆలోచన ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఎందుకంటే పర్యావరణ విధ్వంసంలోనూ, సహజవన రుల క్షీణతలోనూ, వాతావరణ విపత్తులోనూ మనం చూస్తున్న ఆదాయ అసమానత్వ విస్ఫోటనంలోనూ, ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మనకు చెప్పడాన్ని ఆర్థికవేత్తలు మానుకున్నారు. ఇవన్నీ కాలం చెల్లిపోయిన ఆర్థిక సూత్రాల ఫలితమే. కానీ అభివృద్ధి అనే సంతోషంలో మనం వాటిని విస్మరిస్తున్నాం. తరం తర్వాత తరం గ్రహిస్తున్న ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలకు కాలే జీలలో, యూనివర్సిటీలలో చెబుతూ వస్తున్న బోధనలే సంపూర్ణ బాధ్యత వహిస్తున్నాయని ఐరిష్ అధ్యక్షుడు భావిస్తున్నారు. ఆర్థిక శాస్త్రాన్ని ఎలా బోధిస్తున్నారు, ఎలా ప్రశ్నిస్తున్నారు అనే అంశం అతి ముఖ్యమైనది అంటున్న ఆయన, ‘ఆర్థిక శాస్త్ర బోధనలో విధానాల బహుళత్వానికి వీలు కల్పించడం అంటే విద్యార్థుల ప్రాథమిక హక్కు లను, నిజానికి పౌరుల హక్కుల్ని లేకుండా చేయడమే’ అని చెప్పారు. ఈ రచయిత కూడా, వృద్ధిని ప్రజాకేంద్రకంగా మార్చేందుకు, ఆర్థిక అధ్యయనాలకు సామాజికంగా, పర్యావరణపరంగా ప్రాసంగి కతను చేకూర్చడం కోసం, పైవిధమైన ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడు గుతూ వచ్చాడు. కానీ ప్రజలకు, భూమండలానికి సంబంధించినంత వరకు ఆర్థిక శాస్త్రంపై పునరాలోచన చేసే దిశగా మన ప్రధాన స్రవంతి చొరవ చేపట్టడం చివరిసారిగా ఎప్పుడు జరిగింది? మొత్తం వ్యవస్థ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఉచిత సహజ పెట్టుబడితో పాటు (అంటే సహజ వనరులు, పర్యావరణ సేవలు అని అర్థం) ప్రభుత్వం నుంచి కూడా పరిశ్రమలు భారీ స్థాయిలో లాభా లను పొందుతున్నాయి. అసలైన మూల్యాన్ని పరోక్షంగా భారీ స్థాయిలో సమాజం భరించాక ధరలు స్థిరపడు తున్నాయి. మనం కొంటున్న డాలర్ ఆహారం ధర నిజానికి మూడురెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారం ధర చౌకగా ఉండాలని కోరుకుంటు న్నాము కాబట్టి మనం దాన్ని ప్రశ్నించము. ఐక్యరాజ్యసమితి తరఫున ‘ది ఎకనమిక్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ’ (టీఈఈబీ) ఇటీవల ఓ అధ్యయనం చేసింది. దక్షిణాసియాలో వరి, గోధుమతో సహా ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రాథమిక ఉత్పత్తి, ప్రాసెసింగ్ రంగాలు, అలాగే అమెరికాలో పశువుల పెంపకం వంటి వివరాలను ఇది పరిశీలించింది. ప్రతి యేటా వీటి కోసం 7.3 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులను మింగేస్తున్నారని తెలిపింది. ఇదంతా కూడా అధిక వృద్ధి రేటు అన్వేషణ పేరుతో జరుగుతోంది. మనం మౌలిక వసతులపై ఉచితాలు, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, గుణాత్మక సడలింపు (అదనపు డబ్బును ముద్రించడం). భారీ ఎత్తున పన్ను రాయితీలు, బ్యాంకుల బకాయిల రద్దు వంటివాటిని చూసినట్ల యితే, ఆర్థిక సమతూకం సంపన్నులకు సేవ చేయడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని తెలుస్తుంది. ప్రయోజనాలు కింది దాకా ప్రయాణించాయన్న ఊహ కూడా చాలావరకు నిరాధారమైనదే. ఉదా హరణకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ జరిపిన అధ్యయనం 50 సంవత్సరాల కాలంలో (1965–2015), 18 సంపన్న దేశాల్లో పన్ను రాయితీలు ఆర్థికాభివృద్ధిపై, నిరుద్యోగంపై ఏమంత గణనీయ ప్రభావం చూపలేదని తెలిపింది. సులభంగా చెప్పాలంటే, ప్రభుత్వ ఖజానా నుంచి అత్యంత సంపన్న వర్గాల జేబుల్లోకి ఆదాయాన్ని పంపిణీ చేయడంలోనే ఈ పన్ను రాయితీలు విజయం సాధించాయి. ప్రపంచ సంపదలో 48 శాతాన్ని 1 శాతం అగ్రశ్రేణి వర్గం సొంతం చేసుకుందని క్రెడిట్ స్విస్ సంస్థ అంచనా వేస్తుండగా, బహుళ జాతీయ సంస్థల లాభాల్లో 40 శాతం ప్రతి సంవత్సరం పన్నులు లేని దేశాలకు తరలిపోతున్నాయని అంచనా వేశారు. ఈ మొత్తం 2019లోనే 1 ట్రిలి యన్ డాలర్లుగా ఉండేది. గత దశాబ్దంలో వాల్ స్ట్రీట్ బ్యాంకులుసంపాదించిన మరొక ట్రిలియన్ డాలర్ల లాభాలను కూడా దీనికి జోడించండి. అసమర్థ ఆర్థిక వ్యవస్థ ఒకేచోట సంపదను కూడగట్టడంలో సాయపడిందని తెలుస్తుంది. ఆర్థిక వృద్ధి నమూనాకు కాలం చెల్లిపోయింది. ముంచుకొస్తున్న వాతావరణ విపత్తు గురించిన భయం, ప్రపంచాన్ని వృద్ధిపై తప్పని సరి వ్యామోహాన్ని వదులుకునేలా చేస్తుందని ఆశిద్దాము. దేవీందర్ శర్మ, వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు. -
Ireland vs New Zealand: ఐర్లాండ్ ఓడినా... వణికించింది!
డబ్లిన్: అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది. కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల భారీస్కోరు చేసింది. గప్టిల్ (126 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా, నికోల్స్ (54 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గట్టి ప్రత్యర్థి తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోని ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (103 బంతుల్లో 120; 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (106 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల సెంచరీలతో ఓ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేశారు. చివరి బంతికి 3 పరుగుల కావాల్సి వుండగా, ‘బై’ రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. -
మాజీ లవర్‌ను ఇరికించాలని.. తనే ఇరుక్కుంది!
ప్రేమించుకున్న వాళ్లు విడిపోతే.. కొంతమంది ఎవరి దారి వారు చూసుకుంటారు! అయితే మరికొంత మాత్రం తమ ప్రేమ విషయంలో మనస్పర్థలు తలెత్తితే అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తారు. అయితే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన మాజీ ప్రేమికుడిని వేధింపులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఐర్లాండ్‌కు చెందిన 20ఏళ్ల కర్టనీ ఎయిన్స్ వర్త్ అనే ఓ అమ్మాయి, లూయిస్ జాలీని ప్రేమించింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే అప్పటి నుంచి తన మాజీ ప్రేమికుడి మీద పగ పెంచుకుంది కర్టనీ. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని భావించిన కర్టనీ.. 30 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. తనకు తానే చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపించుకుంది. అనంతరం వాటిని లూయిస్ పంపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రియుడిపై పగతో వేధించాలని కర్టనీనే పలు మెయిల్ ఐడీలతో 30 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు తేల్చారు. ఆమె ఫిర్యాదు కారణంగా లూయిస్ ఉద్యోగం కూడా కోల్పోవల్సి వచ్చింది. పోలీసులు కర్టనీని అరెస్ట్ చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. లూయిస్ ఏ తప్పు చేయలేదని కర్టనీ కావాలని అతన్ని వేధింపులకు గురి చేసి ఉద్యోగం కోల్పోయేలా చేసినందుకు కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది. -
4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ..
కింగ్స్టన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మూడు వన్డేల సిరీస్‌లో విండీస్1-0తో అధిక్యంలో నిలిచింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే జస్టిన్ గ్రీవ్స్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ షాయ్ హోప్, నికోలస్ పూరన్ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ సెకెండ్ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 4 పరుగల వ్యవధిలోనే విండీస్ మూడు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పొలార్డ్, బ్రూక్స్ వెస్టిండీస్‌ను అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో విండీస్ 269 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో బ్రూక్స్ 93 పరుగులు చేయగా, పొలార్డ్ 69 పరుగులు సాధించాడు. ఐర్లాండ్ బౌలరల్లో మార్క్ అదైర్, క్రెగ్ యంగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆదిలోనే ఒపెనర్ విలియం ఫోర్ట్ ఫీల్డ్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ బాల్బిర్నీ, ఆండీ మెక్‌బ్రైన్ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ సమయంలో మంచి ఊపు మీద ఉన్న మెక్‌బ్రైన్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టెక్టర్ కూడా అద్భుతంగా ఆడాడు. బాల్బిర్నీ, టెక్టర్ కలిసి 103 పరుగుల భాగస్తామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో బాల్బిర్నీ, టెక్టర్ వికెట్లను ఐర్లాండ్ వరుస క్రమంలో కోల్పోయింది. అనంతరం ఐరీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 49.1ఓవర్లలో ఐర్లాండ్ 245 పరుగులకు ఆలౌటైంది. ఐరీష్ బ్యాటర్లలో బాల్బిర్నీ(71), టెక్టర్(53) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్, జోషప్ చెరో మూడు వికెట్లు సాధించారు. చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్రెడీ పెళ్లైన టెన్నిస్ స్టార్‌తో నటి వివాహం -
‘వరల్డ్ కప్ సూపర్ లీగ్’ వచ్చేసింది...
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తరహాలో వన్డేల్లో కూడా పాయింట్ల పద్ధతిలో టోర్నీ తీసుకురావాలని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తోంది. గతంలోనే ప్రకటించి కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గినా... ఇప్పుడు టోర్నీ జరగడం ఖాయమైంది. ఈ నెల 30నుంచి ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ ’ పేరుతో జరిగే ఈ ఈవెంట్... టి20ల మెరుపులతో ప్రభ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా నిలబెట్టగలదని ఐసీసీ ఆశిస్తోంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిర్వహణపై సందేహాలు ఉండటంతో కొంత కాలం క్రితం ఈ టోర్నీపై ప్రణాళిక రూపొందించి కూడా ఐసీసీ వెనక్కి తగ్గింది. కోవిడ్–19 నేపథ్యంలో పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. అయితే 2023 ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ అక్టోబర్–నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. టోర్నీ ఎప్పటినుంచి... జూలై 30 నుంచి ఇంగ్లండ్–ఐర్లాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్ కప్ సూపర్ లీగ్ మొదలవుతుంది. ఇందులో భాగంగా జులై 30, ఆగస్టు 1, ఆగస్టు 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. పాల్గొనే జట్లు మొత్తం 13 టీమ్‌లు సూపర్ లీగ్‌లో ఆడతాయి. ర్యాంకింగ్ ప్రకారం టాప్–12 జట్లతో పాటు 2015–17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ 13వ జట్టు. టోర్నీ ఫార్మాట్ వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో (ఇంకా కటాఫ్ తేదీ ఖరారు కాలేదు) ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి. తర్వాత ఏమిటి... పాయింట్లపరంగా టాప్–7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్ టాప్–7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్ దక్కుతుంది. మిగిలిన జట్లు ఏం చేస్తాయి... నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్ జట్లతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్–2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. మూడో కంటికే ‘నోబాల్’ వన్డేలు, టి20ల్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రను మరింత తగ్గించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో అడుగు వేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఫ్రంట్ ఫుట్ నోబాల్‌లను పర్యవేక్షించే అ«ధికారం పూర్తిగా థర్డ్ అంపైర్లకే అప్పజెప్పారు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లే నో బాల్‌ను ప్రకటిస్తారు. అయితే కొన్నాళ్ల క్రితం భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో అదనంగా మూడో అంపైర్ కూడా ఒక కన్నేసి ఉంచేలా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సాంకేతికంగా అది సరైనదిగా అనిపించడంతో ఇప్పుడు పూర్తిగా ‘మూడో కంటి’కే ఈ నిర్ణయాధికారం కట్టబెట్టారు. ఇకపై ఫీల్డ్ అంపైర్లు ఫ్రంట్ ఫుట్ నోబాల్ ప్రకటించడానికి వీల్లేదు. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. -
‘ఇక మేము అందరితో సమానమే’
ఐర్లాండ్: యునైటైడ్ కింగ్డమ్లో స్వలింగ వివాహలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం పెళ్లికి సిద్ధమయ్యారు. యూకేలో ‘గే’ వివాహాలపై నిషేధం ఎత్తివేసిన అనంతరం స్వలింగ వివాహం చేసుకోబోతున్న మొదటి జంటగా వీరు నిలవబోతున్నారు. బహిరంగంగా వారు పెళ్లి ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. వివరాలు... నగరంలో హెల్త్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న రాబిన్ (26) బ్రైటన్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న షారిన్ ఎడ్వర్డ్ (27) 2005 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. స్వలింగ వివాహాలు నేరమంటూ నార్త్ ఐర్లాండ్ ప్రావిన్స్ నిషేధం విధించడంతో గత కోన్నేళ్లుగా దూరంగా ఉంటున్నామని యువతులు తెలిపారు. బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో చట్టపరంగా ఒక్కటి కాబోతున్నట్టు ఒక ఇంటర్య్యూలో ఆనందం వ్యక్తంచేశారు. ‘మేము గత కోన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అందుకే ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప చరిత్ర సృష్టించాలనుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా రాబిన్, ఎడ్వర్డ్ వ్యాఖ్యానించారు. గే వివాహాలను నేరంగా పనిగణించిన ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం బ్రిటన్ కేంద్ర ప్రభుత్వం చొరవతో రద్దయిందని, ఇది తమ అదృష్టమన్నారు. ‘ఇకపై మేము కూడా అందరితో సమానమే’ అని యువతులు మరోసారి సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ఐర్లాండ్ ప్రావిన్స్‌లో సిట్టింగ్ ప్రభుత్వం లేనందున ప్రజల కోరిక మేరకు బ్రిటీష్ కేంద్ర ప్రభుత్వం ‘గే’ వివాహాలపై నిషేదాన్ని ఎత్తివేసింది. -
సెల్ఫీ తీసుకుంటూ భారత విద్యార్థి మృతి
లండన్: ఐర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మొహెర్ కొండ అంచుల్లో సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ జారిపడి భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాధితుడు డబ్లిన్‌లో చదువుకుంటున్న ఓ భారత సంతతి విద్యార్థి అని మాత్రమే తెలిసిందని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ విద్యార్థి ఎత్తైన మొహెర్ కొండ అంచులకు చేరుకుని, తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి పట్టుతప్పి కిందపడిపోయాడు. తోటి పర్యాటకుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ సాయంతో అతడిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారత్‌లో ఉన్న అతడి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కశ్మీర్ సమస్యకు ఐర్లాండ్ తరహా పరిష్కారం
లండన్: కశ్మీర్ సమస్య పరిష్కారానికి బ్రిటన్–ఐర్లాండ్‌లు అనుసరిస్తున్న కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమలుచేయాలని కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సూచించారు. కశ్మీర్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని భారత్, పాకిస్తాన్‌లు అర్థం చేసుకోవాలన్నారు. సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ లండన్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఫరూక్ మాట్లాడారు. ‘సమస్య పరిష్కారానికి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిఒక్కరూ ఆమోదించబోరని అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్‌లు అర్థం చేసుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కావొచ్చు. కానీ భారత్, పాకిస్తాన్ కశ్మీర్లో కనీసం 80 శాతం మంది ఆ నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి’ అని చెప్పారు. యూకేలో భాగమైన ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ల మధ్య 1920ల్లో కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ పౌరులు పాస్‌పోర్ట్ లేకుండా రెండో దేశంలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు. -
అయ్యో.. ఐర్లాండ్ : భారత్ ఘన విజయం
అగ్రశ్రేణి జట్టుగా తమ స్థాయిని ప్రదర్శిస్తూ భారత జట్టు అలవోకగా ఐర్లాండ్ ఆట కట్టించింది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా నెగ్గిన కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ఆమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఏ విభాగంలోనూ సరితూగలేని ఐర్లాండ్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా రికార్డు విజయంతో టీమిండియా టి20 సిరీస్‌ను ఏకపక్షంగా ముగించింది. ముందుగా రాహుల్, రైనా దూకుడుతో బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో కదం తొక్కి... ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగింది. ఐర్లాండ్‌తో ‘సన్నాహకం’ ముగిసిన తర్వాత మంగళవారం నుంచి ఇంగ్లండ్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది. డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మరోసారి కుల్దీప్ (3/16), చహల్ (3/21) ప్రత్యర్థిని పడగొట్టారు. సెంచరీ భాగస్వామ్యం... భారత జట్టు అనుకున్నట్లుగానే నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, ధోని, భువనేశ్వర్, బుమ్రా స్థానాల్లో రాహు ల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కౌల్ భారత్ తరఫున టి20ల్లో ఆడిన 75వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ను కాదని రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (9) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే రాహుల్, రైనా కలిసి ఐర్లాండ్‌ను ఆడుకున్నారు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్ సిక్సర్లతో చెలరేగగా, రైనా కూడా తనదైన శైలిలో జోరుగా ఆడాడు. సిమీ సింగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాహుల్, ఆ తర్వాత రాన్‌కిన్ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కెవిన్ ఓబ్రైన్ తన తొలి బంతికే రాహుల్‌ను అవుట్ చేయడంతో సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే రోహిత్ (0) కూడా ఔటయ్యాడు. అనంతరం 34 బంతుల్లో రైనా హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. రైనాను కూడా ఓబ్రైన్ వెనక్కి పంపించిన తర్వాత వచ్చిన మనీశ్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) దూకుడుగా ఆడలేకపోయాడు. అయి తే హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించింది. ఆఖరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. వరుస కట్టి... భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. రెండో బంతికే స్టిర్లింగ్ (0)ను అవుట్ చేయడంతో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. తొలి మ్యాచ్‌లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి అండ్ బి) కెవిన్ ఓబ్రైన్ 70; కోహ్లి (సి) డాక్రెల్ (బి) ఛేజ్ 9; రైనా (సి) డాక్రెల్ (బి) కెవిన్ ఓబ్రైన్ 69; రోహిత్ (సి) స్టిర్లింగ్ (బి) కెవిన్ ఓబ్రైన్ 0; మనీశ్ పాండే (నాటౌట్) 21; పాండ్యా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–22; 2–128; 3–128; 4–169. బౌలింగ్: సిమీ సింగ్ 2–0 –32–0; రాన్‌కిన్ 3–0–33–0; ఛేజ్ 4–0–42–1; థాంప్సన్ 1–0–17–0; డాక్రెల్ 4–0–30–0; స్టిర్లింగ్ 2–0–19–0; కెవిన్ ఓబ్రైన్ 4–0–40–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) రైనా (బి) ఉమేశ్ 0; షెనాన్ (సి) రాహుల్ (బి) కౌల్ 2; పోర్టర్‌ఫీల్డ్ (బి) ఉమేశ్ 14; బల్బిర్నీ (బి) చహల్ 9; విల్సన్ (బి) కుల్దీప్ 15; కెవిన్ ఓబ్రైన్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 0; సిమీ సింగ్ (ఎల్బీ) (బి) చహల్ 0; థాంప్సన్ (బి) చహల్ 13; డాక్రెల్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 4; రాన్‌కిన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కుల్దీప్ 10; ఛేజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–30; 5–32; 6–36; 7–44; 8–56; 9–68; 10–70. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–2; సిద్ధార్థ్ కౌల్ 2–0–4–1; హార్దిక్ పాండ్యా 2–0–10–1; చహల్ 4–0–21–3; కుల్దీప్ 2.3–0–16–3. ► టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంకపై (2017లో) 93 పరుగుల విజయాన్ని భారత్ సవరించింది. డ్రింక్స్ తీసుకెళ్తున్న ధోని అరంగేట్రం చేసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌తో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ -
పసికూనలపై పంజా.. టీ20 సిరీస్ భారత్‌దే
డబ్లిన్ : పసికూన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ సునాయాసంగా గెలుచుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావించిన ఐర్లాండ్ సిరీస్‌లో కోహ్లి సేన తన స్థాయికి తగ్గట్లు ప్రదర్శన ఇచ్చింది. శుక్రవారం డబ్లిన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత్ విసిరిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఐర్లాండ్ ఏ దశలోనూ గట్టిగా నిలబడలేదు. 12.3 ఓవర్లలో 70 పరుగులకే ఆతిథ్యజట్టు చాపచుట్టేసింది. స్పిన్ ద్వయం చాహల్-కుల్దీప్లు అద్భుతమైన ప్రదర్శనతో ఐర్లాండ్ భరతంపట్టారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు నేలకూల్చగా, ఉమేశ్ యాదవ్‌కు 2, కౌల్, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 70(36 బంతుల్లో 6సిక్సర్లు, 3 ఫోర్లు), సురేశ్ రైనా 69(45 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లు) పరుగులతో చెలరేగారు. చివర్లో హార్దిక్ పాండ్యా 9 బంతుల్లోనే 32 పరుగులు రాబట్టాడు. ఐర్లాండ్ బౌలర్లలో ఒబ్రెయిన్ 3, చేజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. -
‘మాతో అంత ఈజీ కాదు’
డబ్లిన్ : గత విజాయాలు తలుచుకుంటూ సంబరపడటం, భవిష్యత్ సిరీస్‌ల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందే అవసరం తమకు లేదని టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న చహల్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీసుల్లో టీమిండియా గెలిచింది అది గతమని, వచ్చే సంవత్సరం ప్రపంచకప్ ఉంది అది భవిష్యత్తు వీటిలో దేని గురించి ఆలోచించమని, కేవలం ప్రస్తుత మ్యాచ్ గురించే ఆలోచిస్తూ ప్రణాళికలు రూపోందిస్తామని ఈ మణికట్టు స్పిన్నర్ తెలిపాడు. ఇంగ్లండ్‌లో తన తొలి పర్యటన కావడంతో కొంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, తాను ఆడేది ఎన్నో మ్యాచ్ అని చూడనని, ఆడే ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడే ప్రపంచకప్ గురించి ఆలోచించటంలేదని, ఆ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా ఎన్నో సిరీస్‌లు ఆడుతుందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు తాము ఆడేది చిన్న జట్టా లేక పెద్ద జట్టా అని ఆలోచించదని, ఆడే ప్రతీ మ్యాచ్ ఆస్వాదించాలని కోరుకుంటాం అని చహల్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌పై ‘ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ భారీ స్కోర్లు సాధించింది కానీ భారత్‌పై అది సాధ్యం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లతో పోల్చితే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లకు భిన్నమైన పిచ్‌లు ఆతిథ్య జట్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ స్పిన్నర్లు కూడా వికెట్లు సాధిస్తారు. కానీ అదీ మాకు ఎంతో అనుకూలం. మణికట్టు మాయతో ప్రతీ సారీ మ్యాచ్‌లు గెలిపించలేము, కానీ ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లదే ట్రెండ్. మామూలు స్పిన్నర్లతో పోల్చితే మణికట్టు స్పిన్నర్లలో వైవిధ్యం ఉంటుంది. అందుకే తమను బ్యాట్స్‌మెన్ సరిగా అంచనా వేయక వికెట్ పారేసుకుంటారు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల మ్యాచ్‌లు గ్రౌండ్లు చాలా చిన్నవి, కానీ మాకు చిన్న స్వామి స్టేడియంలో ఆడిన అనుభవంతో మా పని తేలకవుతుంది. మేము మరో రెండు మూడు నెలలు ఇంగ్లడ్లోనే గడపాల్సిఉంది. ఇంగ్లండ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంద’ ని చాహల్ పేర్కొన్నాడు. -
‘ఇంగ్లిష్’ క్రికెట్‌కు రెడీ!
ఇంగ్లండ్ గడ్డపై నాలుగేళ్ల తర్వాత కీలక టెస్టు సిరీస్‌కు ముందు టి20, వన్డేలలో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చేందుకు భారత్ సన్నద్ధమైంది. పర్యటనలో భాగంగా అసలు పరీక్షకు ముందు ఐర్లాండ్‌తో టి20ల్లో తలపడనుంది. 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ బరిలోకి దిగుతున్న టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. డబ్లిన్: దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత జట్టు తొలిసారి తమ పూర్తి స్థాయి జట్టుతో మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి మ్యాచ్ జరుగనుంది. జట్టు బలాబలాలు, ఫామ్ దృష్ట్యా చూస్తే భారత్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టి20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తుది జట్టులో ఎవరు? భారత జట్టు తమ ఆఖరి టి20 అంతర్జాతీయ మ్యాచ్ గత మార్చిలో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడింది. అయితే ఆ టోర్నీ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి, ధోని, భువనేశ్వర్, బుమ్రా ఇప్పుడు తిరిగొచ్చారు. ఈ నలుగురు కూడా తుది జట్టులో ఖాయం. అయితే తాజా ఫామ్ ప్రకారం చూస్తే ధోని వచ్చినా దినేశ్ కార్తీక్‌కు బ్యాట్స్‌మన్‌గా స్థానం దక్కవచ్చు. లోకేశ్ రాహుల్ కూడా టీమ్‌లో ఉండే అవకా శం ఉంది. కాబట్టి మనీశ్ పాండేకు చోటు కష్టం. టి20ల్లో అద్భుత రికార్డు ఉన్నా... తాజా కూర్పులో రైనాకు కూడా స్థానం అనుమానంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో కూడిన బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఇక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు చహల్, కుల్దీప్లను కోహ్లి కచ్చితంగా తుది జట్టులో ఎంచుకోవచ్చు. ఇద్దరు పేసర్ల స్థానాల్లో భువీ, బుమ్రాలు తప్పనిసరి. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉండి పునరాగమనం చేసిన ఉమేశ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి తప్పదు. సిద్ధార్థ్ కౌల్ అవకాశం కోసం కొంత కాలం వేచి చూడక తప్పదు. సీనియర్లదే భారం... ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా పది రోజుల క్రితమే స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌లతో ఆడిన ఐర్లాండ్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన ఐర్లాండ్ అదే జట్టును ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ గ్యారీ విల్సన్, వెటరన్లు పోర్టర్ ఫీల్డ్, కెవిన్ ఓబ్రైన్లపై ఆ జట్టు ఆధారపడుతోంది. ఓపెనర్ స్టిర్లింగ్‌కు కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లో డాక్రెల్, థాంప్సన్ కీలకం. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ స్పిన్నర్ సిమి సింగ్ తొలిసారి తన సొంత దేశానికి ప్రత్యర్థిగా ఆడనుం డటం విశేషం. టి20ల్లో ఒక మ్యాచ్ లో విండీస్‌పై మినహా మిగతా అన్ని విజయాలు చిన్న జట్లపైనే సాధించిన ఐర్లాండ్ పటిష్ట టీమిండియాకు ఎంతవరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఆహ్లాదకర వాతావరణంలో... ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత భారత జట్టు సోమవారం తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొంది. లండన్ మహానగర శివార్లలో ఉన్న మర్చంట్ టేలర్స్ స్కూల్‌ను అందుకు వేదికగా ఎంచుకుంది. ఇంగ్లండ్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన వేదికల్లోని శిక్షణా సౌకర్యాలకు దూరంగా కాస్త ప్రశాంతంగా సాధన చేసేందుకు కోహ్లి సేన ఇక్కడకు వచ్చింది. 800కు పైగా విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో ఎక్కువ మంది భారత ఉపఖండం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. 285 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పచ్చిక బయళ్లు, రెండు వైపుల సరస్సులతో అద్భుతంగా ఉన్న ఈ స్కూల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడాన్ని ఆటగాళ్లు అమితంగా ఆస్వాదించారు. గతంలో ఈ స్కూల్లో కోచింగ్ ఇచ్చిన దిగ్గజ బ్యాట్స్‌మన్ గార్డన్ గ్రీనిడ్జ్ అక్కడే ఉండే భారత ఆటగాళ్లతో ముచ్చ టించాడు. సెలవులు గడిపేందుకు తన కొడుకుతో కలిసి వచ్చిన మాజీ పేసర్ నెహ్రా కూడా టీమిండియా బౌలర్లకు ప్రాక్టీస్‌లో సూచనలిచ్చాడు. ►100 భారత్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు గెలిచి, 35 ఓడింది. 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, కార్తీక్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా/ఉమేశ్. ఐర్లాండ్: విల్సన్ (కెప్టెన్), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్రెల్, మెకార్తీ, ఛేజ్. -
పక్కా భారతీయుడు!
భారత సంతతికి చెందిన ఐర్లండ్ ప్రధాని లియో వారడ్కర్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడొకరు ‘పక్కా భారతీయుడు’ అని నిందాపూర్వకంగా అభివర్ణించడం ఇంగ్లండ్‌లో వివాదానికి దారితీసింది. ఐర్లండ్ భూభాగం(దీవి)తో కలిసి ఉన్న ఉత్తర ఐర్లండ్ బ్రిటన్‌లో అంతర్భాగం. ఈ ప్రాంతంలో పర్యటనకు వెళ్లే ముందు వారడ్కర్ అక్కడి అధికారులకు ఆయన తన ప్రయాణం గురించి తెలియజేయకపోవడంతో ఆగ్రహించిన బ్రిటిష్ లార్డ్ కిల్క్లూనీ(జాన్ డేవిడ్ టేలర్) ఇలా ట్విటర్లో వ్యాఖ్యానించాక, వ్యతిరేక స్పందన రావడంతో తన మాటలు ఉపసంహరించుకున్నారు. సోమవారం ఉత్తర ఐర్లండ్ సందర్శించిన వారడ్కర్ ప్రొటొకాల్ పాటించలేదని మొదట విమర్శలు వెల్లువెత్తాయి. ఐరిష్ ప్రధానిని భారతీయుడని ముద్రవేయడంతో ‘అసంతృప్తి, అపార్థాల’కు దారితీయడంతో తన మాటలు వాపసు తీసుకుంటున్నట్టు కిల్క్లూనీ తెలిపారు. వారడ్కర్ తండ్రి మహరాష్ట్రీయుడు, తల్లి ఐరిష్ దేశీయురాలు. ముంబైలో పుట్టిన ఆయన తండ్రి అశోక్ వైద్యవిద్య పూర్తిచేసుకుని ఐర్లండ్ వచ్చి స్థిరపడ్డారు. ఐర్లండ్ క్రైస్తవ కాథలిక్ కుటుంబంలో జన్మించిన తల్లి మిరియం నర్సుగా శిక్షణ పొంది ఓ ఆస్పత్రిలో అశోక్‌తో కలిసి పనిచేస్తుండగా వారి పరిచయం పెళ్లికి దారితీసింది. తల్లిదండ్రులు లియోను కాథలిక్‌గానే పెంచారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక తాను ఓ ఇంటర్వ్యూలో స్వలింగ సంపర్కుడైన ‘గే’ అని ప్రకటించుకున్నారు. ‘‘అంటే నన్ను స్వలింగసంపర్కునిగానే చూడకండి. అదొక్కటే వాస్తవం కాదు. నేను సగం భారతీయుడైన డాక్టర్ ,రాజకీయవేత్తను కూడా ’’ అంటూ ఆధునిక ఐరోపా సంస్కృతికి ప్రతినిధిగా మాట్లాడారు. ఆయన జీవిత భాగస్వామి మాథ్యూ బ్యారట్ కూడా వైద్యుడే. ఇలాంటి నేపథ్యమున్న లియోను పక్కా భారతీయుడని వర్ణించడంతో లార్డ్ కిల్క్లూనీపై విమర్శల వర్షం కురిసింది. హౌస్ లార్డ్స్ మరో సభ్యుడైన కరణ్ బిలిమోరియా ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘లియో తల్లి ఐరిష్ మహిళ. అతను ఐర్లండ్లోనే పుట్టాడు. ఆయన స్థానికుడు కాకపోతే మరెవరు?’’అని ప్రశ్నించారు. ప్రసిద్ధ కోబ్రా బీర్ కంపెనీ స్థాపకుడైన బిలిమోరియా హైదరాబాద్‌లో పుట్టిపెరిగారు. వారడ్కర్తో పాటు భారత మూలాలున్న మరో నేత ఆంటోనియా కోస్టా ప్రస్తుతం మరో ఐరాపా దేశం పోర్చగల్ ప్రధాని. ఇంకా భారత సంతతికి చెందిన నేతలు అనేక దేశాలకు అధ్యక్ష, ప్రధాని పదవులు చేపట్టారు. సింగపూర్ తాత్కాలిక అధ్యక్షునిగా అనేకసార్లు చేసిన జేవై పిళ్లై దేశాధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా సింగపూర్ తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టిన జేవై పిళ్లై కూడా భారత సంతతికి చెందిన ఉన్నతాధికారి. 1981-85 మధ్య ఈ దేశాధ్యక్షునిగా పనిచేసిన సీవీ దేవేన్ నాయర్ కేరళలో పుట్టి పదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి సింగపూర్ వచ్చి స్థిరపడ్డారు. సింగపూర్ మూడో అధ్యక్షుడిగా పనిచేసిన నాయర్ 1979లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1953లో బ్రిటిష్ గయానా చీఫ్ మినిస్టర్‌గా ఎన్నికైన చెడ్డీ జగన్ ఉత్తర భారతంలో మూలాలున్న కుటుంబంలో పుట్టారు. ఆయన 1961-64 మధ్య అదే పదవి నిర్విహించి, 1992-97 మధ్యకాలంలో దేశాధ్యక్షునిగా ఉన్నారు. జగన్ పార్టీ పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీకే చెందిన భారత్ జగ్దేవ్ కూడా భారత హిందీ ప్రాంత మూలాలున్న నేత. ఆయన 1999-2011 మధ్య రెండు సార్లు గయానా అధ్యక్షునిగా పనిచేశారు. వెస్టిండీస్‌లోని మరో దేశం ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షునిగా 1995-2001 కాలంలో పనిచేసిన బాసుదేవ్ పాండే పూర్వీకులు నేటి బిహార్ ప్రాంతం నుంచి బ్రిటిష్ పాలనలోని కరీబియా ప్రాంతంలోని చెరుకు తోటల్లో పనిచేయడానికి వెళ్లారు. దక్షిణ ట్రినిడాడ్‌లో పుట్టిన మరో భారతీయ సంతతి నేత కమలా ప్రసాద్ బిసేసార్ కూడా ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షునిగా 2010-2015 మధ్య పనిచేశారు. హరియాణా మూలాలున్న జాట్ కుటుంబంలో జన్మించిన మహేంద్రపాల్ చౌధరీ పసిఫిక్ మహాసముద్రదేశమైన ఫిజీ ప్రధానిగా 1999-2000 మధ్య కొద్దికాలం పనిచేశారు. తర్వాత జరిగిన సైనిక తిరుగబాటులో ఆయన అధికారం కోల్పోయారు. మలేషియా అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పనిచేసిన మహతీర్ మహ్మద్ మలయాళీయే ఆగ్నేయాసియా దేశమైన మలేషియా అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పదవిలో ఉన్న మహతీర్ మహ్మద్ పూర్వీకులు కేరళ నుంచి వలసపోయారు. ఆయన 1981 నుంచి 2003 వరకూ పదవిలో కొనసాగారు. హిందూ మహాసముద్రంలోని మారిషస్ అధ్యక్షునిగా, ప్రధానిగా అనేకసార్లు కొనసాగిన అనిరూధ్ జగన్నాథ్ పూర్వీకులు కూడా ఇండియా నుంచి వలసవెళ్లినవారే. ఆయన 1982లో దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2003-2008, 2008-20012 మధ్యకాలంలో ఆయన అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో ఆరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యాక ఈ ఏడాది ఆరంభంలో కొడుకు ప్రవీంద్కు పదవి అప్పగిచ్చేందుకు రాజీనామా చేశారు. భారతీయ మూలాలున్న మరో నేత రామ్‌సేవక్ శంకర్ దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్ నాలుగో అధ్యక్షునిగా 1988-90 మధ్య పనిచేశారు. హిందీ ప్రాంతాల నుంచి వలసపోయిన భారత సంతతి జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఈ డచ్ వలస దేశంలో సైనిక తిరుగుబాటులో శంకర్ పదవీచ్యుతులయ్యారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక టైటానిక్.. ఒక కర్పాథియా..
మనకు టైటానిక్ గురించి తెలుసు.. జాక్, రోజ్ల అజరామరమైన ప్రేమ కథ గురించి తెలుసు.. మరి మనకు కర్పాథియా గురించి తెలుసా? ఆ నౌకా సిబ్బంది హీరోచిత గాథ గురించి తెలుసా? తెలీదా.. అయితే.. తెలుసుకుందాం రండి.. టైటానిక్.. దాదాపుగా అందరం చూసిన సినిమానే.. ఇందులో ఆ నౌక భారీ మంచు ఖండాన్ని ఢీకొని మునిగిపోతుంది.. 2,224 మందికిపైగా సిబ్బంది, ప్రయాణికులతో బయల్దేరిన టైటానిక్‌లో 1,500 మందికిపైగా సముద్రంలో మునిగి చనిపోయారు.. మరి మిగిలినవాళ్లు ఎలా బతికారు? ఆర్ఎంఎస్ కర్పాథియా వల్ల.. ఆ నౌకలోని సిబ్బంది వల్ల.. 1912, ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది.. ఆ సమయంలో కర్పాథియా న్యూయార్క్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తోంది.. ప్రమాద స్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ నుంచి ప్రమాదానికి సంబంధించిన సిగ్నల్ వచ్చింది.. దీన్ని ట్రాక్ చేసిన కర్పాథియా సిబ్బంది.. హుటాహుటిన రంగంలోకి దిగారు. మంచు ఖండాలతో ప్రమాదకరంగా ఉన్న ఆ మార్గంలో ప్రయాణించి.. అక్కడికి చేరుకున్నారు. వెళ్లే సమయానికే టైటానిక్ మునిగిపోయింది. అయినప్పటికీ.. బతికున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న లక్ష్యంతో సుమారు 4 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. 705 మంది ప్రయాణికులను కాపాడారు. టైటానిక్ తన తొలి, చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఏప్రిల్ 10తో 106 ఏళ్లు అయిన సందర్భంగా.. కర్పాథియా సహాయక చర్యలకు సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అవే ఇవీ.. తానూ టైటానిక్‌లాగే.. టైటానిక్‌కు సంబంధించిన వందల మంది ప్రయాణికులను కాపాడిన కర్పాథియా నౌక కూడా తర్వాతి కాలంలో టైటానిక్‌లాగే మునిగిపోయింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో.. అంటే 1918, జూలై 17న ఐర్లాండ్ సముద్ర జలాల్లో ఉండగా.. జర్మన్ సబ్‌మెరైన్ దీనిపైకి టార్పెడోలు ప్రయోగించడంతో పేలుడు ధాటికి సముద్రంలో మునిగిపోయింది. -సాక్షి, తెలంగాణ డెస్క్ -
అదరగొట్టిన యువ భారత్
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా గురువారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు అదరగొట్టి 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (74),వాషింగ్టన్ సుందర్(62)లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా, రికీ భూయి(39),జీషన్ అన్సారీ (36) ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ 50.0ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. అనంతరం 269 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు టెక్టార్(1), దోహ్నీ(4)లు నిష్ర్కమించడంతో ఐర్లాండ్ కష్టాల్లో పడింది. ఆ తరువాత డెన్నిసన్(20), గారీ మెక్ క్లింటాక్(17)లు అవుట్ కావడంతో ఐర్లాండ్ 46 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విలియమ్ మెక్ క్లింటాక్(58),టక్కర్(57)లు రాణించినా ఐర్లాండ్ ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఈ జోడీ ఐదో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం మినహా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. దీంతో ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. భారత బౌలర్లలో రాహుల్ బాథమ్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
భారత్‌కు చుక్కెదురు
సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓటమి ఫ్లోరెంట్ ‘హ్యాట్రిక్’ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్: ఊహించినట్లుగానే బెల్జియం స్ట్రయికర్ల దాడుల ముందు భారత డిఫెన్స్ మూగబోయింది. ఆరంభంలో చూపిన అలసత్వం నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్‌కు ఫైనల్ బెర్త్ దూరమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెల్జియం 4-0తో భారత్‌పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించింది. వాన్ అబెల్ ఫ్లోరెంట్ (2వ, 41వ, 53వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్ చేయగా, కొసిన్స్ టాంగే (8వ ని.లో) ఒక గోల్ సాధించాడు. భారత డిఫెన్స్ బలహీనంగా ఉండటంతో తొలి క్వార్టర్లో బెల్జియం ఆటగాళ్లు మెరుపు వేగంతో ఆడారు. షార్ట్ పాస్‌లతో బంతిని ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకుని అదను చూసి దెబ్బకొట్టారు. వాళ్ల వేగాన్ని అందుకోవడంలో విఫలమైన భారత్ 8 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. లెఫ్ట్ ఫ్లాంక్లో టామ్ బూన్ అందించిన బంతిని డి-సర్కిల్లో ఫ్లోరెంట్ రివర్స్ షాట్‌తో గోల్‌గా మల్చాడు. తర్వాత జస్జీత్ కాలికి బంతి తగలడంతో లభించిన తొలి పెనాల్టీని స్ట్రయికర్ టాంగే నేర్పుగా గోల్‌గా మల్చాడు. ఇక స్కోరును సమం చేసేందుకు భారత్ చేసిన కౌంటర్ అటాక్‌ను ప్రత్యర్థి గోలీ సమర్థంగా తిప్పికొట్టాడు. మూడో క్వార్టర్లో భారత్‌కు రెండు పెనాల్టీలు లభించినా... రూపిందర్ వృథా చేశాడు, రెండుసార్లు బంతిని వైడ్‌గా కొట్టడంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. ఇక నాలుగో క్వార్టర్లో భారత్ ఎదురుదాడులు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయింది. 48వ నిమిషంలో బెల్జియంకు మూడో పెనాల్టీ లభించినా వృథా అయ్యింది. 52వ నిమిషంలో నాలుగో పెనాల్టీ కార్నర్‌ను ఫోర్లెంట్ గోల్‌గా మల్చడంతో బెల్జియం 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో పాక్‌పై నెగ్గింది. దీంతో పాక్ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. -
ఐర్లండ్‌లో ఘనంగా 'ఉగాది వేడుకలు'
ఐర్లండ్: మన్మద నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఐర్లండ్‌లోని ఐర్లండ్ తెలుగు సమాజం అధ్వర్యంలో 'ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. డబ్లిన్‌లోని హిలీక్స్ హాల్లో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో 500మంది వరకు తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు సినీగాయనీ, సునీత, సింపూలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వారి పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడర్ రాధిక లోకేష్ హాజరయ్యారు. మన్మద నామ సంవత్సర ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి ఐర్లండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీధర్ వైకుంఠం, నిర్వహకులు సత్యప్రకాష్ చవడవరపు, మహేష్ అలిమెల్లి, అరవింద్ కరింగుల, రామకృష్ణ మదమంచి, శ్రీనివాస్ కోసనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
టాయిలెట్ పాడైనందుకు రూ. కోటి పరిహారం!
లండన్: ఓ వృద్ధురాలు తన ఇంట్లోని టాయిలెట్ లో జారిపడినందుకు 28 వేల యూరోలు (రూ.99 లక్షలు) నష్ట పరిహారం పొందింది. ఐర్లాండ్ లో ఇసాబెలా సుల్లివాన్ అనే వృద్ధురాలు తన ఇంటి టాయిలెట్ లో జారిపడటంతో కోర్టును ఆశ్రయించింది. తన ఇంట్లో టాయిలెట్ ను అమర్చే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే జారిపడినట్లు ఫిటిషన్ లో స్పష్టం చేసింది. దాంతో కుడి మోకాలికి తీవ్రంగా గాయమైనట్లు తెలిపింది.' కాంట్రాక్టర్ ఇంటి బాత్ రూంలోని టాయిలెట్ పనులు సరిగా చేయలేదు. టాయిలెట్ పనులు చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ కారణంగానే నేను జారిపడిపోయాను' అంటూ పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన సర్క్యూట్ సివిల్ కోర్టు 28,000 యూరోలను ఆమెకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. టాయిలెట్ సరిగా లేకపోయిన కారణంగా ఆమె గాయమై బాధపడినందుకు 25,000 యూరోలు చెల్లించాలని, టాయిలెట్ పనులు తిరిగి చేయడానికి 2,500 యూరోలతోపాటు, అదనంగా మరో 350 యూరోలు చెల్లించాలని కోర్టు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. -
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
-
చివరి మ్యాచ్ ‘డ్రా’
చన్‌చన్‌దేవి రెండు గోల్స్ భారత్, ఐర్లాండ్ మహిళల హాకీ సిరీస్ డబ్లిన్: ఎఫ్ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహాల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌ను టీమిండియా 2-2తో ‘డ్రా’గా ముగించింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ క్రీడాకారిణి చన్‌చన్‌దేవి రెండు గోల్స్ చేసింది. అనా ఒ ఫ్లాంగన్ ఐర్లాండ్‌కు రెండు గోల్స్ అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఏడో నిమిషంలో ఐర్లాండ్ ప్లేయర్ ఒ ఫ్లాంగన్ గోల్ చేయగా, 31వ నిమిషంలో చన్‌చన్‌దేవి (భారత్) స్కోరును సమం చేసింది. రెండో అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే పెనాల్టీ కార్నర్‌ను చక్కని గోల్‌గా మలిచిన చన్‌చన్‌దేవి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. కానీ 64వ నిమిషంలో ఒ ఫ్లాంగన్ రెండో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో, రెండో మ్యాచ్‌లో 2-1తో నెగ్గింది. -
భారత మహిళలదే సిరీస్
ఐర్లాండ్‌పై విజయం న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును 2-1తో గెలుచుకుంది. దీంతో మూడు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. ఎఫ్ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా గురువారం డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్ 18వ నిమిషంలో యెండల సౌందర్య తొలి గోల్ సాధించింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే సునీత ఫీల్డ్ గోల్‌తో ఆకట్టుకుంది. కొద్దిసేపటికి ప్రత్యర్థి నికోలా ఇవాన్ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ద్వితీయార్థంలో రెండు జట్లు పోటాపోటీ ఆటతీరు కనబరిచాయి. దీంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. -
ఐర్లాండ్‌పై భారత మహిళల గెలుపు
బెల్జియం చేతిలో పురుషుల జట్టు ఓటమి న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చాంపియన్స్ చాలెంజ్-1 ట్రోఫీకి సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. మెగాన్ ఫ్రేజర్ 4వ నిమిషంలోనే నమోదు చేసిన గోల్‌తో తొలి అర్ధభాగంలో 1-0 ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. ఆ ఒక్క గోల్‌తోనే సరిపెట్టుకుంది. రెండో అర్ధభాగంలో పూనమ్ రాణి (37వ నిమిషం), రీతూ రాణి (61వ) సునితా లక్రా (68వ)లు వరుస గోల్స్ సాధించి భారత్‌కు విజయాన్నందించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం జరగనుంది. పోరాడి ఓడిన పురుషుల జట్టు.. ప్రపంచకప్‌కు సన్నాహకంగా యూరప్‌లో పర్యటిస్తున్న పురుషుల జట్టుకు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో పోరాడి ఓడింది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను టామ్ బూన్ గోల్‌గా మలచడంతో ఖాతా తెరిచిన బెల్జియంను ఆ తరువాత భారత ఆటగాళ్లు సమర్థవంతంగా నిలువరించారు. 58వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌పాల్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే మరుసటి నిమిషం (59వ)లోనే బూన్ మరో గోల్ నమోదు చేసి బెల్జియంకు ఆధిక్యాన్నందించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. -
న్యూజిలాండ్ జోరు
ఐర్లాండ్‌పై 42 పరుగులతో గెలుపు టి20 మహిళల ప్రపంచకప్ సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ లో న్యూజిలాండ్ హవా కొనసాగిస్తూ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (51 బంతుల్లో 68; 10 ఫోర్లు), ఫ్రాన్సెస్ మెక్ కే (49 బంతుల్లో 51; 6 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్ఉమన్ మెక్ గ్లాషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించి కివీస్‌కు భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బోణి గ్రూప్ ‘ఎ’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై అలవోకగా నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు హంటర్ (2/13), ఫార్రెల్ (2/19), ఓస్బార్న్ (2/20) దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. అనంతరం ఆసీస్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. ఎలీస్ పెర్రీ (41 నాటౌట్), జెస్ కెమెరాన్ (27 నాటౌట్) రాణించారు. బుధవారం జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు ఆడుతుంది. -
రాణించిన పూనమ్, మిథాలీ
ఐర్లాండ్‌పై భారత్ గెలుపు మహిళల టి20 ప్రాక్టీస్ మ్యాచ్ సావేర్ (బంగ్లాదేశ్): మహిళల టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు), మిథాలీ రాజ్ (34 బంతుల్లో 42; 7 ఫోర్లు), మంధనా (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) రాణించారు. మెక్‌కార్టీ, టైస్, ఓ రిలే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. షిల్లింగ్టన్ (43 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. శిఖా పాండే 3, సోనియా 2 వికెట్లు పడగొట్టారు. -
‘ఆరెంజ్’ ఓ రేంజ్లో...
నెదర్లాండ్స్ సిక్సర్ల హోరు ఐర్లాండ్‌పై అద్వితీయ విజయం సూపర్-10కు అర్హత శుక్రవారం మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఇలాంటి స్థితిలో మరో మ్యాచ్ ఏదైనా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కూడా అద్భుతాలు జరిగాయి. పసికూనల పోరు అంటే ఆషామాషీ కాదని ఐర్లాండ్, నెదర్లాండ్స్ నిరూపించాయి. మూడు పదుల సిక్సర్లతో మ్యాచ్‌లో విరుచుకుపడ్డాయి. అద్భుత ఆటతీరుతో నెదర్లాండ్స్ విజయం దక్కించుకోగా... ఐర్లాండ్ భారీ స్కోరూ చిన్నదైపోయింది. ఓవరాల్‌గా ఈ టి20 మ్యాచ్ పంచిన రికార్డు వినోదంతో సిల్హెట్ స్టేడియం దద్దరిల్లింది. సిల్హెట్: ఐర్లాండ్‌తో గ్రూప్ ‘బి’ మ్యాచ్... 14.2 ఓవర్లలో 190 పరుగుల విజయలక్ష్యం... ఓవర్‌కు దాదాపు 13.38 పరుగులు చేయాలి! ఇదీ నెదర్లాండ్స్ జట్టు సూపర్-10కు అర్హత సాధించాలంటే చేయాల్సిన పరుగుల స్థితి. సాధారణంగానే టి20ల్లో ఇది భారీ లక్ష్యం. ఇక 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి అంటే ఎంత పెద్ద జట్టయినా మ్యాచ్‌కు ముందే ఒక రకమైన అపనమ్మకం. కానీ ‘ఆరెంజ్ సేన’ అలాంటి లక్ష్యాన్ని లెక్క చేయలేదు. ఏ దశలోనూ వెనుకంజ వేయకుండా ఆడి టి20 చరిత్రలోనే ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డులు చెరిపేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టెఫాన్ మైబర్గ్ (23 బంతుల్లో 63; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), టామ్ కూపర్ (15 బంతుల్లో 45; 1 ఫోర్, 6 సిక్స్‌లు), వెస్లీ బారెసి (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పీటర్ బోరెన్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌తో కదంతొక్కారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. పాయింటర్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పోర్టర్‌ఫీల్డ్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెవిన్ ఓబ్రైన్ (16 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాయ్స్ (25 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఐర్లాండ్ భారీ స్కోరుకు బాటలు పరిచారు. నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు బోరెన్, మైబర్గ్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మైబర్గ్ 3, బోరెన్ 1 సిక్స్ బాదడంతో 25 పరుగులు వచ్చాయి. కుసాక్ వేసిన నాలుగో ఓవర్లో మైబర్గ్ మరో 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. పవర్‌ప్లేలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తూ వీరిద్దరూ 6 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. 7.4 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగులు దాటడం కూడా రికార్డే. ఈ దశలో 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ కొంత వెనుకంజ వేసింది. ఆ వెంటనే ఒక పరుగు వద్ద టామ్ కూపర్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను జాయ్స్ వదిలేయడం ఐర్లాండ్‌ను ముంచింది. తర్వాత డాక్రెల్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన కూపర్ మ్యాచ్‌ను లాక్కున్నాడు. కూపర్ అవుటైనా, బారెసి తన జోరును కొనసాగించి 13.5 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్‌గా బారెసి కొట్టిన సిక్సర్‌తో డచ్ సేన సూపర్-10కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొట్టిన 19 సిక్సర్లు కొత్త ప్రపంచ రికార్డు. 18 సిక్సర్లతో ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఇన్నింగ్స్‌లో 162 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. గతంలో 13.2 ఓవర్లు ఆడినప్పుడు ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు 175 (దక్షిణాఫ్రికా) మాత్రమే. పాపం జింబాబ్వే... సిల్హెట్: చిగుంబురా (21 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించడంతో గ్రూప్ ‘బి’ మరో మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్లతో యూఏఈపై నెగ్గింది. ముందుగా యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్వప్నిల్ పాటిల్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జింబాబ్వే 13.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఈ గెలుపుతో జింబాబ్వే సూపర్-10పై ఆశలు పెంచుకుంది. తర్వాతి మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ నాలుగేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో జింబాబ్వే (+0.957), ఐర్లాండ్ (-0.701)లను వెనక్కినెట్టిన నెదర్లాండ్స్ (+1.109) సూపర్-10కు అర్హత సాధించింది. -
ఆకట్టుకున్న ఐర్లాండ్
సిల్హెట్: వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్ టి20 ప్రపంచ కప్ ప్రధాన టోర్నీకి మరింత చేరువైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఐర్లాండ్ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. సిల్హెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులు చేసింది. అన్వర్ (30), అంజద్ అలీ (20), జావేద్ (19) రాణించారు. స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రియాన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 14.2 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో డక్‌వర్త్ విధానంలో విజేతను నిర్ణయించారు. ఎడ్ జాయస్ (43), పోర్టర్‌ఫీల్డ్ (33 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు. అసదుల్లా 2 వికెట్లు పడగొట్టాడు. జాయస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్ ‘ఎ’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు అఫ్ఘానిస్థాన్ x నేపాల్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి బంగ్లాదేశ్ x హాంకాంగ్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
ఐర్లాండ్ సంచలనం
చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఐర్లాండ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఈ మెగా టోర్నీలోని ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు; 2 సిక్స్), చిగుంబురా (13 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్స్) రాణించారు. 14 పరుగులకే తొలి వికెట్ పడగా ఓపెనర్ మసకద్జా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వేగంగా ఆడిన టేలర్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో చిగుంబురా ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. డాక్రెల్, మెక్ బ్రైన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (34 బంతుల్లో 60; 9 ఫోర్లు; 1 సిక్స్), పోర్టర్‌ఫీల్డ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆరో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది స్టిర్లింగ్ జోరును ప్రదర్శించాడు. దీంతో 8.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేరాయి. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. చివర్లో ఉత్కంఠ అయితే రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులతో పటిష్టంగానే కనిపించిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. పేసర్ పన్యంగరా (4/37) రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ ప్రారంభమైంది. 15వ ఓవర్లో తను రెండు వికెట్లు తీశాడు. అప్పటికి 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో బరిలోకి దిగిన కెవిన్ ఓబ్రియాన్ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్) తన సహజశైలిలో ఆడగా 12 బంతుల్లో లక్ష్యం ఏడు పరుగులకు వచ్చింది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు రావాల్సి ఉండగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక చివరి బంతికి ఒక్క పరుగు అవసరం. బంతి బ్యాట్స్‌మన్‌కు చిక్కకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నేరుగా వికెట్లను గిరాటేసేందుకు టేలర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. విజయానికి కావాల్సిన సింగిల్‌ను ఐర్లాండ్ సాధించడంతో మ్యాచ్ ముగిసింది. -
ఐర్లాండ్‌కు నిరాశ
కింగ్స్టన్: తొలిసారిగా ఓ టెస్టు ఆడే దేశంపై సిరీస్ గెలవాలనే ఐర్లాండ్ ఆశలు గల్లంతమయ్యాయి. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో ఐర్లాండ్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ను ఐర్లాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైంది. శుక్రవారం సబీనా పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫ్లెచర్ (15 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలెక్స్ కుసాక్కు నాలుగు వికెట్లు దక్కా యి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టును విండీస్ బౌలర్లు వణికించారు. స్యామీ మూడు వికెట్లు తీయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించాడు. కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇదే వేదికపై ఆదివారం ఇరు జట్లు ఏకైక వన్డే మ్యాచ్ ఆడనున్నాయి.