టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు.
‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.
మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment