హమాస్ గ్రూప్‌ను బహిష్కరించడానికి అంగీకరించినట్లు ఖతార్ వెల్లడించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హమాస్ నేతలను బహిష్కరించాలని ఖతారకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం సూచించింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్ అందుకు అంగీకారం తెలిపి.. హమాస్‌కు నోటీసులు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రచురిస్తోంది.
ఇటీవలి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్ గ్రూపు తిరస్కరించిన నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఖతార్‌కు తెలియజేసింది. “ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలను పదేపదే తిరస్కరిస్తోంది. హమాస్ నేలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదు. కాల్పల విరమణను తిరస్కరించిన హమాస్‌ను బహిష్కరించాని మేం ఖతార్‌కు స్పష్టం చేశాం’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు.. అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్ హమాస్‌ను బహిష్కరించటాన్ని హమాస్ నేతలు ఖండించారు.
అమెరికా, ఈజిప్ట్‌తో పాటుగా ఖతార్ దేశాలు.. గాజాలో హింసను అంతం చేయడానికి పలుసార్లు హమాస్-ఇజ్రాయెల్ చర్చలకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన చర్చల్లో హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని హమాస్ తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment