doha
-
ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు.. దోహా వేదికగా ఘట్టం
టెల్ అవీవ్: కాల్పుల విమరణ ఒప్పందంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సయోధ్య కుదరడంతో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. దోహ ఈ ఘట్టానికి వేదికైంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డంకిగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు గాజా(Gaza)లో ఉన్న బంధీల విడుదలకు ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం ఇజ్రాయెల్హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఒకవైపు హమాస్ చివరి నిమిషంలో కొర్రీలు వేస్తోందంటూ ఇజ్రాయెల్ మండిపింది. ఆపై కాసేపటికే తమకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఒప్పందంపై ఉత్కంఠ నెలకొంది. అయితే మధ్యవర్తుల తాజా దౌత్యంతో ఈ ఉత్కంఠకు తెర పడింది. ఒప్పందం చివరి దశకు చేరిన విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఒప్పందంపై తొలుత ఇజ్రాయెల్ వార్ కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే శనివారం వరకు కేబినెట్ ఆమోద ముద్ర పడకపోవచ్చని సమాచారం. ఆదివారం నుంచి ఇరు వర్గాల మధ్య డీల్ అమల్లోకి వస్తుందంటూ ఖతార్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ స్టార్ పురస్కారం లభించింది. ఇది వంటకాలకు సంబంధించి.. పాక ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో మిచెలిన్ స్టార్ల లభించిన రెస్టారెంట్లు లేవు విదేశాల్లో ఉన్న భారతీయ రెస్టారెంట్లే ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నాయి. తాజాగా దోహాలో జరిగిన మిచెలిన్ గైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతీయ రెస్టారెంట్ జమావర్ దోహాకి ఈ మిచెలిన్ స్టార్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు రెస్టారెంట్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వాటిలో మన భారతీయ రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తమ రెస్టారెంట్ కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు ఈ తండ్రికూతుళ్ల ద్వయం దినేష్ , సంయుక్తలు. ఈ రెస్టారెంట్ పేరుని కాశ్మర్లోని 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శాలువాల పేరుని ఎంచుకున్నారు ఆ తండ్రి కూతుళ్లు. అత్యాధునిక హంగులతో ఉండే ఈ రెస్టారెంట్లో ఢిల్లీ, కేరళకు సంబంధించిన ప్రసిద్ధ వంటకాలతో సహా వివిధ అద్భుత రుచులతో కూడిన వంటకాలను సర్వ్ చేస్తారు . ఈ జమావర్ రెస్టారెంట్‌ని మొదటిసారిగా 2001లో ది లీలా ప్యాలెస్ బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రసిద్ధ ఐదు భారతీయ నగరాల్లో బ్రాంచ్‌లుగా విస్తరించారు. ఆ తర్వాత 2016లో లండన్, 2021లో దోహాలలో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించారు. అయితే జమావర్ లండన్ కూడా ఈ ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారాన్ని దక్షించుకోవడం విశేషం. కాగా, దోహా జమావర్ రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ ఇన్‌స్టాగ్రాంలో "ఇది తమ టీం సమిష్ట కృషి, అంకిత భావానికి నిదర్శనం. మా కష్టాన్ని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించినందుకు మిచెలిన్ గైడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు". అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు చెఫ్ సురేందర్ . ఇక సంయుక్త నాయర్ కూడా ఇది కేవలం మా జమావర్ దోహకే గర్వకారణం కాదు. ఆ ప్రాంతంలో భారతీయ ఆహారానికి దక్కిన గొప్ప గౌరవం అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మిచెలిన్ స్టార్ అంటే..అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు ఈ పురస్కారాని ఇస్తారు. మొత్తం ఐదు ప్రమాణాలలను పరిగణలోనికి తీసుకుని ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత, రుచుల సామరస్యం, సాంకేతికతలలో నైపుణ్యం, వంటకాలను ప్రెజెంట్ చేసే చెఫ్ నైపుణ్యం, ముఖ్యంగా మెనూలో వంటకాల వైవిధ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రాన్స్‌కి చెందిన మిచెలిన్ గైడ్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఇలా 1900 సంవత్సరం నుంచి అందజేస్తోంది. View this post on Instagram A post shared by Samyukta Nair (@samyuktanair) (చదవండి: బిడ్డకు తల్లైనా అంతే అందంగా హీరోయిన్! ‘చందమామ’ సీక్రెట్ ఇదే!) -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఈ నెల నవంబర్ 22,23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో తొలిసారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకలో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశంలో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారతదేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణతో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్), సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నారు నిర్వాహకులు. ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు తదితరులు. (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన) -
హమాస్‌పై ఖతార్ కీలక నిర్ణయం.. నోటీసులు జారీ
హమాస్ గ్రూప్‌ను బహిష్కరించడానికి అంగీకరించినట్లు ఖతార్ వెల్లడించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హమాస్ నేతలను బహిష్కరించాలని ఖతారకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం సూచించింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్ అందుకు అంగీకారం తెలిపి.. హమాస్‌కు నోటీసులు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రచురిస్తోంది.ఇటీవలి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్ గ్రూపు తిరస్కరించిన నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఖతార్‌కు తెలియజేసింది. “ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలను పదేపదే తిరస్కరిస్తోంది. హమాస్ నేలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదు. కాల్పల విరమణను తిరస్కరించిన హమాస్‌ను బహిష్కరించాని మేం ఖతార్‌కు స్పష్టం చేశాం’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు.. అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్ హమాస్‌ను బహిష్కరించటాన్ని హమాస్ నేతలు ఖండించారు.అమెరికా, ఈజిప్ట్‌తో పాటుగా ఖతార్ దేశాలు.. గాజాలో హింసను అంతం చేయడానికి పలుసార్లు హమాస్-ఇజ్రాయెల్ చర్చలకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన చర్చల్లో హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని హమాస్ తేల్చిచెప్పింది. -
అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం!
దెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ దళాల చేతిలో ఇటీవల హత్యకు గురైన యాహ్యా సిన్వర్ స్థానంలో చీఫ్‌గా ప్రస్తుతానికి ఎవరినీ నియమించరాదని హమాస్ నిర్ణయించింది. ఇకపై ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు ఐదుగురు సభ్యుల కమిటీ నాయకత్వం వహించనుంది. ఈ కమిటీ దోహా కేంద్రంగా పని చేస్తుంది. అగ్ర నేతలందరినీ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో 2025 మార్చిలో జరిగే గ్రూప్ తదుపరి ఎన్నికల దాకా చీఫ్‌గా ఎవరినీ నియమించరాదని హమాస్ నాయకత్వం భావించినట్టు తెలుస్తోంది.యాహ్యా సిన్వర్ మరణానికి ఏడాది ముందునుంచే అజ్ఞాతంలోకి గడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కీలక నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటూ వస్తోంది. ఇందులో గాజాకు ఖలీల్ అల్ హయా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబారిన్, విదేశాల్లోని పాలస్తీనియన్లకు ఖలీద్ మషాల్ ప్రతినిధులుగా ఉన్నారు. నాలుగో సభ్యుడు హమాస్ షూరా అడ్వైజరీ కౌన్సిల్ అధిపతి మహ్మద్ దర్వీష్.ఐదో సభ్యుడైన హమాస్ పొలిటికల్ బ్యూరో కార్యదర్శి పేరును భద్రతా కారణాల రీత్యా బయట పెట్టడం లేదని సంస్థ పేర్కొంది. వీరంతా ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నారు. యుద్ధ సమయంలో ఉద్యమాన్ని, అసాధారణ పరిస్థితులను, భవిష్యత్ ప్రణాళికలను నియంత్రించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.ఇరాక్‌లో ఐఎస్ గ్రూప్ కమాండర్ హతం బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ లీడర్, మరో ఎనిమిది మంది సీనియర్ నేతలను తమ బలగాలు చంపేశాయని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్–సుడానీ మంగళవారం ప్రకటించారు. సలాహుద్దీన్ ప్రావిన్స్‌లోని హమ్రిన్ కొండప్రాంతంలో బలగాలు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో జస్సిమ్ అల్–మజ్రౌయి అబూ అబ్దుల్ ఖాదర్ అనే ఐఎస్ గ్రూప్ కమాండర్ హతమయ్యాడన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మిగతా వారి వివరాలను ప్రకటిస్తామన్నారు. అంతర్జాతీయ సంకీర్ణ బలగాలిచ్చిన సమాచారం, మద్దతు తో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ తెలిపింది. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించింది.చదవండి: హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి -
యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.చదవండి: ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ -
విదేశాలకు ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సరీ్వసులు నడిపేందుకు రెడీ అయింది. ముంబై నుంచి దోహాకు తొలి అంతర్జాతీయ సర్వీ సు మార్చి 28న ప్రారంభం కానుంది. వారంలో నాలుగు నాన్–స్టాప్ ఫ్లైట్స్ నడుపనుంది. 2022 ఆగస్ట్ 7న ఆకాశ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ రకం 23 విమానాలు ఉన్నాయి. 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు 2024 జనవరిలో ఆర్డర్ ఇచి్చంది. -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్‌కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్‌కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్‌ను కనిపెట్టిందిలా.. -
దోహా డైమండ్ లీగ్ మీట్: నీరజ్ చోప్రాకు అగ్ర స్థానం... పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దోహా వేదికగా జరిగిన తొలి సిరీస్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మెరిశాడు. ఎనిమిది మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ మీట్లో నీరజ్ చోప్రా బల్లెంను 88.67 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు కూడా అర్హత సాధించాడు. జావెలిన్ ఈవెంట్లో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85.50 మీటర్లు. నీరజ్ ఈ దూరాన్ని తొలి ప్రయత్నంలోనే నమోదు చేశాడు. ఆ తర్వాత నీరజ్ 86.04 మీటర్లు, 85.47 మీటర్లు, 84.47 మీటర్లు, 86.52 మీటర్లు నమోదు చేశాడు. ఐదో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా; 85.88 మీటర్లు) రెండో స్థానంలో... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 88.63 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. ఇదే మీట్లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో పోటీపడిన భారత అథ్లెట్ ఎల్డోజ్ పాల్ 15.84 మీటర్ల దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్‌లో మొత్తం 14 సిరీస్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్‌లో గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహిస్తారు. -
ISSF Shotgun World Cup 2023 Doha: పృథ్వీరాజ్‌కు కాంస్యం
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది. -
LLC 2023: గంభీర్ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్! ఎవరున్నా అంతే!
Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2023లో భాగంగా ఇండియా మహరాజాస్- ఆసియా లయన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండియా కెప్టెన్ గౌతం గంభీర్ పట్ల లయన్స్ సారథి షాహిద్ ఆఫ్రిది వ్యవహరించి తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దోహా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసియా లయన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మిస్బా ఉల్ హక్ అద్భుత అర్ధ శతకం(73)కి తోడు ఓపెనర్ ఉపుల్ తరంగ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్రిది బృందం 6 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ గౌతం గంభీర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. కాగా గంభీర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌కు బంతి తాకింది. ఇండియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అబ్దుల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి తరలించేందుకు గౌతీ ప్రయత్నించాడు. అయితే, బాల్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి తర్వాత హెల్మెట్‌కు తగిలింది. అయితే, బంతి మరీ అంత బలంగా తాకకపోవడంతో గౌతీ- మహ్మద్ కైఫ్ పరుగు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో గౌతీ దగ్గరికి వెళ్లిన ఆఫ్రిది.. బాల్ హెల్మెట్‌కు తాకిన విషయం గురించి ఆరా తీశాడు. సమస్య ఏమీ లేదు కదా! అన్నట్లు గౌతీతో వ్యాఖ్యానించగా.. అదేమీ లేదని అతడు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, బిగ్ హార్ట్ అంటూ ఆఫ్రిదిని పొగుడుతూ క్యాప్షన్ జతచేయడం పట్ల గంభీర్ ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఓ ఆటగాడిగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు.. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మైదానం లోపల, వెలుపలా గంభీర్- ఆఫ్రిది మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ వీడియో నెట్టింట ఇలా చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గంభీర్ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ మురళీ విజయ్ 25, మహ్మద్ కైఫ్ 22 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ ఇండియా మహరాజాస్‌పై విజయం సాధించింది. చదవండి: Rohit Sharma: రోహిత్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లితో పాటు ఆ జాబితాలో! అజారుద్దీన్ తర్వాత.. NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ 'Big-hearted' Shahid Afridi inquires if Gautam Gambhir is ok after that blow ❤️#Cricket pic.twitter.com/EqEodDs52f — Cricket Pakistan (@cricketpakcompk) March 10, 2023 -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
ఫైనల్లో అర్జెంటీనా.. జనసంద్రంతో నిండిన వీధులు (ఫొటోలు)
-
FIFA WC: ఆఖరి ఛాన్స్! క్రొయేషియా తక్కువేమీ కాదు! అదే జరిగితే మెస్సీ కూడా రొనాల్డోలాగే..
Argentina Vs Croatia- Lionel Messi- Doha: మెస్సీ మరోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేరుస్తాడా? మోడ్రిచ్ వరుసగా రెండోసారి తమ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లగలడా? ఒకరు ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని తన జట్టుకు బలంగా నిలవగా... మరోవైపు సమష్టితత్వాన్నే నమ్ముకొని ముందుకు సాగిపోయిన టీమ్ మళ్లీ అంచనాలను తలకిందులు చేయగలదా? ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ-2022లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. సంచలనాలు కొత్త కాదు రెండుసార్లు విజేత అర్జెంటీనా, గత వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ క్రొయేషియా మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 2014 వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా ఫైనల్ చేరగా, మోడ్రిచ్ నాయకత్వంలోనే 2018లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. అంచనాలు ఇప్పటికీ అర్జెంటీనాకు అనుకూలంగానే ఉండగా... క్రొయేషియాకు సంచలనాలు కొత్త కాదు. చెరోసారి.. అయితే! ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌లో లీగ్ దశలో ముఖాముఖిగా తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా 1–0తో నెగ్గగా... 2018లో క్రొయేషియా 3–0తో గెలిచింది. నాకౌట్ దశలో మాత్రం తొలిసారి ఈ రెండు జట్లు ‘ఢీ’కొంటున్నాయి. స్టార్ ముందుండి నడిపిస్తుండగా... తన కెరీర్లో వరల్డ్‌కప్ లేని లోటును పూరించేందుకు, అభిమానుల దృష్టిలో మరో మారడోనాగా మారేందుకు మెస్సీకి ఇది చివరి చాన్స్. 35 ఏళ్ల వయసులో కూడా అతని అద్భుత ప్రదర్శన జట్టును సెమీస్ వరకు తీసుకొచ్చింది. సమకాలీన మేటి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు సాధ్యం కానిది సాధించగలిగే అవకాశం మెస్సీ ముంగిట నిలిచింది. నిజానికి మెక్సికో, ఆస్ట్రేలియాలపై చేసిన గోల్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాహుల్ మొలినాకు మెస్సీ ఇచ్చిన రివర్స్ పాస్ మొత్తం వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలిచాయి. అయితే మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లు అంతంతమాత్రంగానే రాణించారు. అల్వారెజ్, ఫెర్నాండెజ్, మ్యాక్ అలిస్టర్ ఫర్వాలేదనిపించినా ప్రపంచ స్థాయి ప్రదర్శన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఆటలో ఆశించిన వేగం, కొత్తదనం కనిపించకపోయినా నడిచిపోయింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా కానీ సెమీస్ వేదికపై కాస్త ఏమరుపాటుగా ఉన్నా క్రొయేషియా మ్యాచ్‌ను లాగేసుకోగలదు. మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లను కోచ్ స్కలోని ఎంత సమర్థంగా వాడుకుంటాడనేది కీలకం. గోల్‌కీపర్ మార్టినెజ్‌పై అదనపు బాధ్యత ఉంది. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ మెరుపు నైపుణ్యంతో టోర్నీని శాసిస్తున్న తీరు చూస్తే... ఒకవేళ మ్యాచ్ పెనాల్టీల వరకు వెళితే మాత్రం మార్టినెజ్ అత్యద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పోరాటతత్వమే బలంగా... బ్రెజిల్‌పై క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత చివరి వరకు ఓటమిని అంగీకరించని తమ పోరాటస్ఫూర్తి గుర్తించి క్రొయేషియా కోచ్ డాలిచ్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. గణాంకాల్లో అది కనిపించకపోయినా అదే వారి విజయ రహస్యమనేది వాస్తవం. సుదీర్ఘ సమయం పాటు బంతిని తమ అదుపులో ఉంచుకోగల మిడ్‌ఫీల్డర్లు మోడ్రిచ్, కొవాసిచ్, బ్రొజొవిచ్ జట్టు ప్రధాన బలం. దీనిని బద్దలు కొట్టాలంటే మెస్సీకి కూడా అంత సులువు కాదు. మ్యాచ్ సమంగా ఉన్న స్థితిలో దీనిని క్రొయేషియా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో క్రొయేషియా ఆడిన గత 9 నాకౌట్ మ్యాచ్‌లలో 8 అదనపు సమయం వరకు వెళ్లాయి. ఆపై పెనాల్టీల ద్వారానే ఈ టోర్నీలో జపాన్‌పై, బ్రెజిల్‌పై జట్టు విజయం సాధించింది. అయితే అర్జెంటీనాతో పోలిస్తే జట్టులో దూకుడు తక్కువ. కెనడాపై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు 2 ఫీల్డ్ గోల్స్ మాత్రమే చేయగలిగింది. 2018 ఫైనల్లో ఆ జట్టు ఫ్రాన్స్‌కు తొలి 65 నిమిషాల్లోనే 4 గోల్స్ సమర్పించుకుంది. అంటే ఆరంభంలో ప్రత్యర్థి దాడి చేయగలిగితే క్రొయేషియా మళ్లీ కోలుకునే అవకాశాలు తక్కువ. అయితే గోల్‌కీపర్ లివకోవిచ్ ఈసారి కూడా అడ్డుగోడగా నిలవాలని టీమ్ కోరుకుంటోంది. గతంలో ఐదుసార్లు కాగా ప్రపంచకప్‌లో ఆరోసారి ఫైనల్ బెర్త్‌పై అర్జెంటీనా గురి పెట్టింది. గతంలో అర్జెంటీనా సెమీఫైనల్ చేరిన ఐదు పర్యాయాలు విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత పొందింది. క్రొయేషియా గెలిస్తే అర్జెంటీనాపై క్రొయేషియా గెలిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన నాలుగో యూరోప్ జట్టుగా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) మాత్రమే ఈ ఘనత సాధించాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Flashback ⏪ to when #ARG and #HRV met at the 2018 #FIFAWorldCup. These sides have met twice before on the big stage. Who will prevail tomorrow? pic.twitter.com/SHMSt84o1A — FIFA World Cup (@FIFAWorldCup) December 12, 2022 -
FIFA: మొరాకో సంచలనం.. స్పెయిన్‌కు షాక్! చెత్త రికార్డు.. టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup 2022 Morocco Vs Spain- దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 2010 విజేత స్పెయిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో జట్టు మొండి పట్టుదలతో ఆడి ఏడో ర్యాంకర్ స్పెయిన్‌ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ప్రిక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ గోల్స్ చేయలేకపోయాయి. దాంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా మూడు షాట్లను లక్ష్యానికి పంపించలేకపోయారు. షూటౌట్లో ఇలా సరాబియా తొలి షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా... సోలెర్ రెండో షాట్‌ను.. బుస్క్వెట్స్ మూడో షాట్‌ను మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో నేర్పుతో నిలువరించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు పెనాల్టీ షూటౌట్లలో ఓడిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో ఈనెల 10న క్వార్టర్ ఫైనల్లో మొరాకో తలపడుతుంది. మొరాకో ఘనత ► ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికా దేశం మొరాకో. గతంలో కామెరూన్ (1990లో), సెనెగల్ (2002లో), ఘనా (2010లో) ఈ ఘనత సాధించాయి. చదవండి: Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup 2022: బ్రెజిల్ గర్జన
దోహా: తమ నంబర్‌వన్ ర్యాంక్‌కు తగ్గ ఆటతో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఈ మెగా ఈవెంట్లో 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్రెజిల్ తరఫున వినిసియస్ (7వ ని.లో), నెమార్ (13వ ని.లో), రిచార్లీసన్ (29వ ని.లో), లుకాస్ పక్వెటా (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున 79వ నిమిషంలో పాయిక్ సెంగ్హో ఏకైక గోల్ సాధించాడు. ఈనెల 9న జరిగే క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషి యాతో బ్రెజిల్ తలపడతుంది. ఏడో నిమిషంలో రఫిన్హా ఇచ్చిన పాస్ ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లను దాటుకుంటూ వినిసియస్ జూనియర్ వద్దకు రాగా అతను గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను నెమార్ గోల్ చేయడంతో ఆధిక్యం 2–0కు చేరింది. మరోవైపు కొరియన్లు కూడా గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో వాంగ్ హిచన్ కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ లెఫ్ట్కార్టర్లో ఎంతో ఎత్తు నుంచి దూసుకొచ్చింది. కానీ బ్రెజిల్ గోల్‌కీపర్ అలీసన్ ఎడంవైపునకు హైజంప్ చేసి కుడిచేతి పంచ్‌తో బయటికి పంపాడు. ఇలా కొరియా స్కోరు చేయాల్సిన చోట అలీసన్ అడ్డుగోడ కట్టేశాడు. 29వ నిమిషంలో రిచార్లీసన్ కొరియా డిఫెండర్లను బోల్తా కొట్టించిన తీరు అద్భుతం. ‘డి’ ఏరియాకు ముందు బంతిని హెడర్‌తో నియంత్రించిన రిచార్లీసన్ కాలితో దగ్గరే ఉన్న మార్కిన్హస్కు పాస్ చేయగా... అతను దాన్ని రఫిన్హాకు అందించాడు. ఈలోపే రిచార్లీసన్ ‘డి’ ఏరియాలోని గోల్‌పోస్ట్ ముందుకు దూసుకొచ్చాడు. రఫిన్హా వెంటనే బంతిని పాస్ చేయడంతో రిచార్లీసన్ గోల్ చేశాడు. ఇదంతా ఏడు సెకన్లలోనే జరిగిపోయింది. ఇలా అరగంటలోపే బ్రెజిల్ ఎదురే లేని ఆధిక్యం సంపాదించింది. కాసేపటికి మళ్లీ 36వ నిమిషంలో నెమార్, రిచార్లీసన్ పాస్‌లతో బంతి కొరియా ‘డి’ ఏరియాలోకి వచ్చింది. అక్కడ వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లు కూడా వచ్చినప్పటికీ కొరియన్ డిఫెండర్లు ఈ నలుగురిని కాచుకున్నారు. అయితే అనూహ్యంగా ఆఖరుగా ‘డి’ ఏరియాలోకి ప్రవేశించిన లుకాస్... బంతి అధీనంలో ఉన్న వినిసియస్ జూనియర్‌కు చేతితో సైగ చేశాడు. వెంటనే అతను కొరియన్ డిఫెండర్ల తలపై నుంచి బంతిని లుకాస్‌కు చేరవేశాడు. అతను కొరియన్ల కాళ్ల సందుల్లోంచి బంతి ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఇలా తొలి అర్ధభాగంలోనే 4–0తో మ్యాచ్‌ను ఏకపక్షంగా లాగేసిన బ్రెజిల్ రెండో అర్ధభాగంలోనూ జోరు కొనసాగించింది. 5 వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నెమార్ నిలిచాడు. గతంలో మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), షాకిరి (స్విట్జర్లాండ్), పెరిసిచ్ (క్రొయేషియా) ఈ ఘనత సాధించారు. 2 వరుసగా ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరిన రెండో జట్టు బ్రెజిల్. గతంలో జర్మనీ (1986 నుంచి 2014 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఓవరాల్‌గా 14వసారి బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి జర్మనీ (14 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. 26 ఈసారి ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 26 మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించింది. మొత్తం ఎంపిక చేసిన 26 మంది ఆటగాళ్లకు ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించిన తొలి జట్టుగా బ్రెజిల్ నిలిచింది. 2 గత 60 ఏళ్లలో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లోని తొలి అర్ధభాగంలోనే నాలుగు అంతకంటే ఎక్కువ గోల్స్ సాధించిన రెండో జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. గతంలో నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ జట్టు మాత్రమే (2014 సెమీఫైనల్లో బ్రెజిల్‌పై ఐదు గోల్స్) ఈ ఘనత సాధించింది. -
FIFA WC: 8 స్టేడియాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే! ఫైనల్, ముగింపు వేడుకలు అక్కడే!
FIFA World Cup Qatar 2022- ALL 8 Stadiums: జగమంత సాకర్ కుటుంబాన్ని ఒక్క చోట కూర్చోబెట్టే టోర్నీ ఫుట్‌బాల్. అరబ్ ఇలాకాలో తొలి సాకర్ సమరం ఇదే కావడంతో ఖతర్ తమ సంప్రదాయాన్ని, సాంస్కృతిక ప్రాభవాన్ని ప్రతిబింబించేలా స్టేడియాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో 974 స్టేడియం ఈ మెగా ఈవెంట్ ముగియగానే కనుమరుగుకానుంది. ఈ నేపథ్యంలో 974తో పాటు మిగిలిన ఏడు స్టేడియాలకు సంబంధించిన విశేషాలు మీకోసం. వేలమంది ఈలల్ని... దిక్కులన్నీ పిక్కటిల్లే గోలల్ని... తట్టుకునేలా స్టేడియాల్ని ముస్తాబు చేసింది ఖతర్. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)ల్లో ఫుల్ చార్జింగ్‌తో స్టేడియాలన్నీ చుట్టేయొచ్చు. ‘కిక్’ ఇచ్చే ఈ ఎనిమిది స్టేడియాలు దగ్గర దగ్గరలోనే ఉండటం మరో విశేషం. అవన్నీ కూడా దోహా చుట్టుపక్కలే. ఇంకా చెప్పాలంటే ఒకే రోజు (24 గంటల వ్యవధిలో) 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా... అన్నింటిని చూసేయొచ్చంటే అతిశయోక్తి కాదు! ఎందుకంటే గంటల తరబడి సాగే క్రికెట్ కాదిది. గంటన్నరలో ముగిసే ఫుట్‌బాల్ కదా! photo courtesy : Twitter అల్ బైత్ స్టేడియం ►నగరం: అల్ ఖోర్ – సీట్ల సామర్థ్యం: 60 వేలు ►మ్యాచ్‌లు: ఆరంభ సమరం, వేడుకలు, ►సెమీఫైనల్ దాకా జరిగే పోటీలు ఇది భిన్నమైన ఆకృతితో నిర్మించిన స్టేడియం. గల్ఫ్ సంచార ప్రజలు ఉపయోగించే గుడారాలే దీనికి ప్రేరణ. స్టేడియం కూడా భారీ టెంట్ (షామియానా)ల సమూహంగా కనిపిస్తుంది. ఖతర్ భూత, వర్తమానాన్ని ఆవిష్కరించేలా... హరిత అభివృద్ధికి ఆధునిక నమూనాలా ... స్టేడియాన్ని నిర్మించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. photo courtesy : Twitter అహ్మద్ బిన్ అలీ స్టేడియం ►నగరం: ఉమ్ అల్ అఫాయ్ – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 29 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఖతర్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ప్రత్యేకించి స్టేడియం ముఖద్వారం ఇసుక తిన్నెల అలల్ని తలపిస్తుంది. చుట్టూరా ఉన్న కట్టడాలు స్థానిక వృక్షజాలం, జంతుజాల అందాల్ని వర్ణించినట్లుగా ఉంటాయి. photo courtesy : Twitter అల్ జనౌబ్ స్టేడియం ►నగరం: అల్ వక్రా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 21 కిలో మీటర్ల దూరంలో దక్షిణ వక్రా నగరంలో దీన్ని నిర్మించారు. ఖతర్ సంప్రదాయ బోట్లను ప్రతిబించించేలా స్టేడియం పైకప్పు నిర్మాణం ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 40 వేల సామర్థ్యమున్న స్టేడియాన్ని తర్వాత్తర్వాత కుదిస్తారు. ఇతర స్పోర్ట్స్ ప్రాజెక్టుల కోసం విరాళంగా ఇస్తారు. photo courtesy : Twitter ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, మూడో స్థానం ప్లే ఆఫ్ చాన్నాళ్ల క్రితమే 1976లో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2005లో పూర్తిగా నవీకరించారు. 2006లో ఈ స్టేడియంలోనే ఆసియా క్రీడలు నిర్వహించారు. ఆ పాత మైదానం నుంచి అధునాతన స్టేడియంగా ఎన్నో సదుపాయాల నెలవుగా దీన్ని విస్తరించారు. అక్వాటిక్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మ్యూజియం ఇలా ఒకటేమిటి అన్ని హంగులకూ ఈ స్టేడియం పెట్టిందిపేరు. photo courtesy : Twitter ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ►నగరం: అల్ రయ్యాన్ ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ దోహాకు అత్యంత చేరువలో 12 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్టేడియం ఉంది. ప్రపంచశ్రేణి యూనివర్సిటీ క్యాంపస్‌ల మధ్యలో దీన్ని నిర్మించారు. డైమండ్ బిళ్లల ఆకారంలో ఉండే ఈ స్టేడియంపై సూర్యరశ్మి ఎక్కడ పడితే అక్కడ (డైమండ్ బిళ్లలపై పడే సూర్యరశ్మి) మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ సిటీలో ఉన్న ఈ స్టేడియంలోని సగం టికెట్లను వర్సిటీ జట్లు, విద్యార్థుల కోసమే రిజర్వ్ చేశారు. photo courtesy : Twitter లుసాయిల్ స్టేడియం ►నగరం: లుసాయిల్ ►సీట్ల సామర్థ్యం: 80 వేలు ►మ్యాచ్‌లు: ఫైనల్‌దాకా సాగే మ్యాచ్‌లన్నిటికీ లుసాయిల్ ప్రధాన స్టేడియం. దోహాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ ఆఖరికి ఫైనల్ మ్యాచ్(డిసెంబరు 18), ముగింపు వేడుకలనూ ఇక్కడే నిర్వహిస్తారు. టోర్నీ దిగ్విజయంగా ముగిసిన అనంతరం దీన్ని కమ్యూనిటీ సెంటర్‌గా మార్చేస్తారట! పాఠశాలలు, షాప్‌లు, కేఫ్, స్పోర్ట్స్, ఆరోగ్య కేంద్రాలను ఇందులో నిర్వహిస్తారు. photo courtesy : Twitter 974 స్టేడియం ►నగరం: దోహా ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరువలో ఉంటుంది ఈ స్టేడియం. గల్ఫ్ కోస్తా ప్రాంతంలోని ఆకాశహర్మ్యాల మధ్య షిప్పింగ్ కంటెయినర్స్‌తో నిర్మించారు. మొత్తం 974 కంటెయినర్లను వినియోగించడంతో పాటు ఖతర్ ఐఎస్డీ (ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డయలింగ్) కోడ్ కూడా 974 కావడంతో ఆ నంబర్‌నే స్టేడియానికి పేరుగా పెట్టారు. ఈ మైదానానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని పూర్తిగా పడగొడితే ఇందులోని మెటిరీయల్ వృథాకాకుండా పునర్వినియోగానికి అంతా పనికొస్తుందట! photo courtesy : Twitter అల్ తుమమ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూపు దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ అల్ తుమమ స్టేడియం అరబ్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ ఐకాన్. సంప్రదాయ ఖాఫియా నుంచి ప్రేరణతో రూపొందించారు. ఖాఫియా అంటే టోపీ. దాని ఆకారంలోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. డిజైన్, అద్దిన రంగులు, దిద్దిన సొబగులన్నీ ఓ పే...ద్ద టోపీలాగే ఉంటుంది. అరబ్ సాంస్కృతిక చరిత్రకు దర్పణంలా కనిపిస్తుంది. -యెల్లా రమేశ్ చదవండి: Rahul vs Pant: అతడు ‘ఆల్‌రౌండర్’.. తుది జట్టులో తనే ఉండాలి.. బౌలింగ్ ఆప్షన్ దొరుకుతుంది: భారత దిగ్గజం Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ -
FIFA WC: రికార్డు బద్దలు కొట్టినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో అర్జెంటీనా ముందడుగు వేసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు పోలాండ్‌ను 2-0తో మట్టికరిపించింది. గ్రూప్- సీ టాపర్‌గా నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో రౌండ్ ఆఫ్ 16లో భాగంగా అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఆ రెండు గోల్స్ దోహా వేదికగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో గ్రూప్-సీలో భాగమైన అర్జెంటీనా- పోలాండ్ తలపడ్డాయి. ఈ క్రమంలో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. అయితే, సెకండాఫ్‌లో అలెక్సిస్ మాక్ అలిస్టర్, జూలియన్ అల్వరెజ్ గోల్స్ సాధించడంతో మెస్సీ బృందం విజయం ఖరారైంది. ఇదిలా ఉంటే గ్రూప్-సీలోని మరో మ్యాచ్‌లో మెక్సికో సౌదీ అరేబియాను 2-1తో ఓడించింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఆరు పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్- సీ టాపర్‌గా నాకౌట్‌కు చేరగా.. రెండో స్థానంలో ఉన్న పోలాండ్ ఓడినప్పటికీ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా- ఆస్ట్రేలియాను, పోలాండ్- డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఎదుర్కోనున్నాయి. రికార్డు బద్దలు కొట్టినా.. స్టార్ ఫుట్‌బాలర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనల్ మెస్సీకి ఇది 999వ మ్యాచ్. అంతేకాదు.. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో 22వది. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ఒక్క లోటు మాత్రం.. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ఈవెంట్లో మెస్సీ ఇప్పటి వరకు ఎనిమిది గోల్స్ చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్-2022లో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్ కొట్టిన మెస్సీ.. మెక్సికోతో మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు గోల్ సాధించలేకపోయాడు. పోలాండ్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచలేకపోయాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నాకౌట్‌కు చేరుకోవడంతో ఈ లోటు తీరినట్లయింది. చదవండి: Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి! 🙌 See you both in the Round of 16! 🫶@Argentina | @LaczyNasPilka | #FIFAWorldCup pic.twitter.com/iu1vuwkH75 — FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్
FIFA World Cup 2022- Group G- Brazil Vs Switzerland- దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ వరుసగా రెండో విజయం సాధించి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0 గోల్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. ఆట 83వ నిమిషంలో కేస్మిరో చేసిన గోల్ బ్రెజిల్‌ను గెలిపించింది. ఈ గెలుపుతో బ్రెజిల్ ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి 2002లో ఆసియా వేదికపైనే జరిగిన ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో సెర్బియాపై 2–0తో నెగ్గిన బ్రెజిల్ జట్టుకు ఈ మ్యాచ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే పలుమార్లు స్విట్జర్లాండ్ ‘డి’ ఏరియాలోకి బ్రెజిల్ ఆటగాళ్లు వెళ్లినా ఫినిషింగ్ చేయలేకపోయారు. దాంతో తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలోనూ బ్రెజిల్ దూకుడుగానే ఆడింది. చివరకు 66వ నిమిషంలో వినిసియస్ కొట్టిన షాట్ స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో బ్రెజిల్ ఆటగాళ్లు సంబరం చేసుకున్నారు. ఏడు నిమిషాల ముందు గోల్ చేసి అయితే ‘వీఏఆర్’ రీప్లేలో ఆఫ్‌సైడ్‌గా తేలడంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత బ్రెజిల్ ఆటగాళ్లు నిరాశపడకుండా ఉత్సాహంతోనే ఆడారు. చివరకు నిర్ణీత సమయం ముగియడానికి ఏడు నిమిషాల ముందు గోల్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యాచ్ మొత్తంలో బ్రెజిల్ ఐదుసార్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టగా... స్విట్జర్లాండ్ ఒక్క షాట్ కూడా బ్రెజిల్ గోల్పోస్ట్పైకి సంధించలేకపోయింది. చదవండి: Ruturaj Gaikwad: రుతు విధ్వంసకర ఇన్నింగ్స్! గొప్ప, చెత్త రికార్డు.. రెండూ మనోళ్లవే కదా! ఇక సెమీస్‌లో.. అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Round of 16 ✅ Casemiro was the difference maker today for Brazil 🇧🇷#FIFAWorldCup | #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 -
కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా..
దోహా: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో ఖతర్-ఈక్వెడార్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంచెం అటు ఇటు అయినా ఊహించని పరిణామాలు ఎదురయ్యేవని మ్యాచ్ తిలకించడానికి వెళ్లిన అభిమానులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా దోహాలో స్టేడియం వద్ద వరల్డ్‌కప్ ఫ్యాన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చారు. దీంతో ప్రవేశద్వారాలను మూసివేశారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. అభిమానులు రక్షణ గీత దాటకుండా పోలీసులు లాఠీలు, కవచాలు పట్టుకుని నిలువరించారు. దీంతో ఫ్యాన్ జోన్ సమీపంలో జనం భారీగా గూమిగూడి ఊపిరికూడా సరిగ్గా పీల్చుకోలేని విధంగా కిక్కిరిసిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లలో మ్యాచ్‌ను వీక్షించారు. అయితే మ్యాచ్ సమయంలో తాము నరకం చూసినట్లు స్టేడియం వద్దకు వెళ్లిన ఇరాక్ అభిమాని హతె ఎల్ బెరారీ పేర్కొన్నాడు. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నానని మ్యాచ్ కోసమే ఖతర్ వచ్చినట్లు చెప్పాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వాపోయాడు. చనిపోయేవారు.. 'జనం చనిపోయేవారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇలాంటి భారీ సమూహంలో పరిస్థితి అటూ ఇటూ అయితే వాళ్లు తట్టుకోలేరు. దేవుడి దయ వల్ల నేను కాస్త పొడుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడలేదు. కానీ కొంతమంది చిన్నారులను చూసినప్పుడు వాళ్లను పైకి ఎత్తుకోమని తల్లిదంద్రులకు చెప్పాను. పిల్లలు ఈ పరిస్థితిలో ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. నా కుటుంబం మ్యాచ్ తిలకించడానికే వచ్చింది. కానీ నేను వాళ్లను చేరుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు.' అని అభిమాని వివరించాడు. ఆ ఘటన గుర్తుకొచ్చింది.. లాంజ్ ఏంజెలెస్‌కు చెందిన మరో అభిమాని లూయిస్ రేయ్స్ కూడా భయానక పరిస్థితిని వివరించాడు. కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియాలో తొక్కిసలాటలో 150 మంది చనిపోయిన ఘటన తనకు గుర్తుకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉండని, జనం నలిగిపోయారని వివరించాడు. ఒక్క అడుగు ముందుకు గానీ, వెనక్కి గానీ వేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, భయటకు వెళ్లిపోమని తన కుమారుడికి చెప్పినట్లు తెలిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అరెస్టయ్యారా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ వరల్డ్‌కప్ కన్సర్ట్ సందర్భంగా శనివారం రాత్రి కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్ జట్టు ఈక్వెడార్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి మ్యాచ్‌లో ఆతిథ్యజట్టు ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు... -
144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఒక మెగా టోర్నీ జరుగుతుంటే దాని చుట్టూ అంచనాలు ఉండడం సహజం. సాకర్ సమరంలో పోటీ పడే ప్రతీ జట్టు అంతిమలక్ష్యం ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ను సాధించడమే. విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్‌లో వరల్డ్ చాంపియన్‌గా ఎవరు అవతరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఖతార్ లాంటి చిన్న దేశానికి ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆ దేశానికి పెద్ద పండగ లాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలతో దోహాకు చెందిన ఒక వ్యక్తి వ్యాపారం మొదలెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ను పోలిన 144 ఫేక్ ట్రోఫీలను తయారు చేసి అమ్మాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్రోఫీని ఇలా బహిరంగ మార్కెట్లో తయారు చేసి అమ్మాలంటే అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా తయారు చేసినందుకే సదరు వ్యక్తి నుంచి 144 ఫేక్ ట్రోఫీలను సీజ్ చేసినట్లు దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ తన ట్విటర్లో ప్రకటించింది. ''మాకు పక్కా సమాచారం అందాకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నాం. వారి వద్ద 144 ఫేక్ ట్రోఫీలు ఉన్నాయి. వాటిన్నింటిని సీజ్ చేశాం. అనుమతి లేకుండా ట్రోఫీలు తయారు చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.'' అంటూ తెలిపింది. ఇక నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న సాకర్ సమరంలో తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వేడార్ మధ్య జరగనుంది. మొత్తంగా 32 జట్లు పోటీ పడుతుండగా.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోనున్నాయి. ప్రతీ గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో ప్రతీ జట్టు రౌండ్ రాబిన్ పద్దతిలో మూడు సింగిల్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు మొత్తంగా 16 జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎనిమిది జట్లు క్వార్టర్స్‌కు, ఆపై సెమీస్‌లో నాలుగు జట్లు తలపడతాయి. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు డిసెంబర్ 18న లుసైల్‌లోని లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. The Economic and Cyber Crimes Combating Department, in cooperation with the Intellectual Property Protection Committee, seized 144 counterfeit cups similar to the FIFA World Cup Qatar 2022™, for violation of Law number 10/2021 on hosting FIFA World Cup Qatar 2022™. #MOIQatar pic.twitter.com/ysRXlhmo2S — Ministry of Interior (@MOI_QatarEn) November 2, 2022 చదవండి: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్ -
ఛీ.. ఛీ ఇదేం ఎయిర్ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు
దోహ ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియాకి చెందిన ఐదుగురు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది. సదరు మహిళా ప్రయాణికులు 2020లో ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నప్పుడూ ఘోర పరాభవాన్ని చవి చూశారు. దీంతో సదరు మహిళలు ఆ ఖతార్ ఎయిర్ వేస్‌పై దావా వేయాలని సన్నద్ధమవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అక్టోబోర్ 2020లో ఖతార్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వెళ్లినప్పుడూ ఆ మహిళలు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే...అక్కడ ఖతార్‌లో పెళ్లికాకుండా గర్భం దాల్చితే వారిని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తుంది. ఐతే ఆ రోజు ఈ మహిళలు దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఖాతర్ ఎయిర్వేస్లో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో దోహా ఎయిర్పోర్ట్ బాత్రూంలో ఒక నవజాత శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు సదరు మహిళలను తుపాకితో బెదిరించి బలవంతగా అంబులెన్స్‌లో టార్మాక్‌కు తీసుకెళ్లి బలవంతంగా గైనాకలజిస్ట్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రయాణికురాలు నర్సు మాట్లాడుతూ... ఆ ఘటన తర్వాత మళ్లీ ఈ ఎయిర్వేస్లో ప్రయాణించలేదని, చాలా మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. సదరు మహిళా ప్రయాణికులు ఆ ఎయిర్‌పోర్ట్‌పై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఖతార్ అధికారులు ఈ విషయమై ఆ మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేసి సదరు అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...) -
Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్ ఆడుతోంది చూడండి
కతార్‌లోని దోహాలో వీధి బాలికల ఫుట్‌బాల్ ఉత్సవం జరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వీధి బాలికలు తమ పేదరికాన్ని, దురదృష్టాన్ని, కష్టాలను, ఆకలిని దాటి తామేంటో నిరూపించుకోవడానికి కసిదీరా బంతిని కాలితో తంతున్నారు. మన దేశం నుంచి టీమ్ వెళ్లింది. వారిలో 9 మంది చెన్నై వీధి బాలికలు. కెప్టెన్ కూడా. ‘గెలవడం ఓడటం కాదు... మేము కూడా దేశంలో భాగమే అని చెప్పగలుగుతున్నాం’ అంటున్నారు వారు. ఇటీవల ఇదే అంశం పై ‘ఝుండ్’ సినిమా వచ్చింది. ఇది నిజం ఝుండ్. కతార్‌లోని దోహాలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్. అక్టోబర్ 6 నుంచి 15 వరకు. దాని పేరు ‘స్ట్రీట్ చైల్డ్ వరల్డ్ కప్ 2022’. 25 దేశాల వీధి బాలికలు ఈ కప్ కోసం హోరాహోరీ ఆడుతున్నారు. మన దేశం నుంచి టీమ్ వెళ్లింది. ఎవరెవరి తో తలపడుతున్నదో తెలుసా? అమెరికా, మెక్సికో, జింబాబ్వే, పెరు, బంగ్లాదేశ్. వీటన్నింటిని దాటితే అక్టోబర్ 15న ఫైనల్స్. గెలుస్తారో లేదో తర్వాతి సంగతి. కాని చెన్నైలోని మురికివాడలకు చెందిన అమ్మాయిలు ఫుట్‌బాల్ నేర్చుకుని, ప్రతిభ చూపి, విమానం ఎక్కి, విదేశి గడ్డ మీద, విదేశీ టీమ్‌లతో– వాళ్లూ వీధి బాలికలే– తలపడటం ఉందే... అదే అసలైన గెలుపు. మిగిలింది లాంఛనం. 2010లో లండన్‌లో వీధి బాలల ఫుట్‌బాల్ మొదలయ్యింది. పేదరికం వల్ల, అయినవారు లేకపోవడం వల్ల, ఇళ్ల నుంచి పారిపోవడం వల్ల దిక్కులేని వారిగా ఉన్న వీధి బాలలు నేరస్తులుగా, డ్రగ్ ఎడిక్ట్లుగా మారకుండా వారికి ఆరోగ్యకరమైన ఒక వ్యాపకం ఉండేందుకు ‘స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్’ అనే సంస్థ ఈ ఫుట్‌బాల్ తర్ఫీదును మొదలెట్టింది. అది క్రమంగా ఇవాళ 25 దేశాలకు పాకింది. వీధి బాలలతో మొదలైన ఫుట్‌బాల్ వీధి బాలికలకు చేరింది. మన దేశంలో అనేక నగరాలలో వీధి బాలికల ఫుట్‌బాల్ టీమ్స్ ఉన్నాయి. వీటన్నింటి నుంచి 12 మంది సభ్యుల నేషనల్ జట్టును తయారు చేసి దోహాకు పంపారు. ఈ జట్టులో చెన్నైకు చెందిన ‘కరుణాలయ’ అనే వీధి బాలికల సంస్థకు చెందిన 9 మంది బాలికలు ఉన్నారు. కెప్టెన్ కూడా చెన్నై నుంచే. వీరంతా దోహాలో ఇప్పుడు మ్యాచ్‌లు ఆడుతున్నారు. మన దేశం నుంచి వెళ్లిన వీధిబాలికల జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. సంధ్య అనే అమ్మాయి చెన్నైలోని కూరగాయల మార్కెట్లో దిక్కులేక తిరుగుతుంటే కరుణాలయలో చేర్చారు. అక్కడే ఉండి చదువుకుంటోంది. ఇప్పుడు ఫుట్‌బాల్ మేటి ఆటగత్తె అయ్యింది. ‘నేను జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు. కరుణాలయ వాళ్లు నా పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారని విన్నానుగాని జట్టులో చోటు దొరుకుతుందని అనుకోలేదు. తీరా విమానం ఎక్కాక తెలిసింది నేనే ఈ జట్టుకు కెప్టెన్ అని’ అని సంబరపడుతోంది ఆమె దోహ నుంచి ఇంటర్వ్యూ ఇస్తూ. జట్టులో ఉన్న మరో ప్లేయర్– 17 ఏళ్ల ప్రియకు తల్లిదండ్రులెవరో తెలియదు. ఎలాగో కరుణాలయకు చేరి అక్కడే ఉంటోంది. ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం పొందిన ప్లేయర్‌గా ఆమె ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పగా ఉంది. వీరిద్దరే కాదు జాతీయ జట్టుకు ఎంపికైన ఈ చెన్నై ‘కరుణాలయ’ బాలికల్లో పవిత్ర, దివ్య, దర్శిని, గోల్‌కీపర్ సదా... వీరందరివీ ఇలాంటి కథలే. అయితే ఈ వరల్డ్ కప్‌కు ఆషామాషీగా వెళ్లారా మనవాళ్లు? కాదు. ఆరు నెలలుగా సాధన చేస్తున్నారు. కరుణాలయ ఉన్న తొండియర్పేట్ నుంచి పెరంబూర్‌లో ఉన్న గ్రౌండ్ వరకూ రోజూ వెళ్లి ప్రాక్టీసు చేశారు. అల్డ్రోయ్ అనే వ్యక్తి వీరికి కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ టీమ్‌తో ఒక మేనేజర్, ఒక సహాయకురాలు, కోచ్ వెళ్లారు. ‘దోహాలో అంతా క్రమశిక్షణ. ఉదయం ఐదింటికల్లా మేమంతా లేచి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి ఏడున్నర ఎనిమిది నుంచి మ్యాచ్‌లకు సిద్ధమైపోతున్నాం’ అని చెప్పారు ఈ బాలికలు ఫోన్ ఇంటర్వ్యూలో. అయితే వీరు ఈ సంతోషం పొందడం వెనుక నిర్వాహకుల శ్రమ చాలా ఉంది. ఏమంటే వీరికి సరైన చిరునామాలు లేవు, తల్లిదండ్రుల వద్ద సరైన పత్రాలు లేవు. అందువల్ల వీరి పాస్‌పోర్టులు చాలా కష్టమయ్యాయి. కాని సాధించారు. ‘ఝుండ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇలాగే వీధి బాలలకు సాకర్ నేర్పిస్తే వరల్డ్ కప్‌కు పాస్‌పోర్ట్‌ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరి కథ వింటే ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఈ బాలికలు గెలిచి వచ్చినా ఓడి వచ్చినా వీరు వచ్చి చెప్పే అనుభవాలు ఎందరో వీధి బాలికల మనసులో స్ఫూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు. దోహాలో మన టీమ్ -
తమ బిడ్డను కరిచిందని ఏకంగా 29 కుక్కలని....
Barbaric Act": Killing Of 29 Dogs: ఖతర్‌లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఖతర్‌లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థలోని 29 కుక్కలపై సాయుధ బలగాల బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఆ కుక్కలలో ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలోని కుక్కుల పై కాల్పులు జరిపారు. దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ పాస్ ప్యాక్టరీకి సమీపంలోని కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చోరబడ్డారని పేర్కొంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది . ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు వారు పేర్కొన్నారని వెల్లడించింది. ఈ భయానక ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం తోపాటుఆందోళనను రేకెత్తించింది. జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఇది ఖతర్ సమాజానికి కళంకం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో గల్ఫ్ ప్రాంతం ఈ విషయంలో అభివృద్ధి చెందాలని, మరొకరు తపాకీలను ఇంట్లో పెట్టుకుని ఇలాంటికి వాడుతున్నారా! అంటూ ...విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు) -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్‌ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్‌లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జోడీ
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్) –లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 86 నిమిషాల్లో 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–బీట్రిజ్ (బ్రెజిల్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా6–4, 6–3తో మోనికా నికెలెస్కూ (రొమేనియా)–వెరా జ్వొనరేవా (రష్యా)లపై విజయం సాధించారు. -
Afg Vs Ned: అఫ్గన్ అద్భుత విజయం.. పాపం నెదర్లాండ్స్ వైట్‌వాష్..
Afg vs Ned ODI Series: నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో అఫ్గనిస్తాన్ అదరగొట్టింది. దోహా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో మంచి స్కోరు నమోదు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు స్కాట్ ఎడ్వర్డ్స్(54 పరుగులు), కొలిన్ ఆక్‌మన్(81) అద్భుత ఆరంభం అందించినా.. మిడిలార్డర్ మాత్రం ఘోరంగా విఫలమైంది. వీరిద్దరు అవుట్ కాగానే.. వరుసగా 0, 3,8, 13,4,2,1,0,1 స్కోర్లకే బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక అఫ్గన్ బ్యాటర్ నజీబుల్లాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మొదటి వన్డేలో 36 పరుగులు, రెండో వన్డేలో 48 పరుగులతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ మూడో వన్డేలో 75 పరుగుల తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో. Video: AfghanAtalan have always conveyed a message of love, spirit, and determination. Watch them celebrate their series win over the Netherlands. #AfghanAtalan | #AFGvNED pic.twitter.com/84f5U4xBD9 — Afghanistan Cricket Board (@ACBofficials) January 26, 2022 -
ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించగా... డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన శ్రీజ సింగిల్స్ తొలి రౌండ్లో 11–4, 11–7, 12–10తో సితీ అమీనా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–అర్చన కామత్ (భారత్) జోడీ 11–5, 11–3, 11–6తో సోనమ్ సుల్తానా–సాదియా (బంగ్లాదేశ్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ–అర్చన ద్వయం 10–12, 7–11, 12–10, 13–15తో డు హై కెమ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Asian TT Championship: కాంస్య పతకం ఖాయం!
Asian TT Championship 2021: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆచంట శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్, సానిల్ షెట్టి, మానవ్ ఠక్కర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 3–1తో ఇరాన్ జట్టును ఓడించింది. కాగా శరత్ కమల్ రెండు మ్యాచ్‌ల్లో, సత్యన్ ఒక మ్యాచ్‌లో నెగ్గగా... హర్మీత్ ఓడిపోయాడు. భారత విజయం ఖాయం కావడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Koneru Humpy: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
వారెవ్వా పంకజ్.. పాక్ ఆటగాడిపై నెగ్గి.. 24వ టైటిల్!
Pankaj Advani Wins 6 Red Snooker World Cup In Doha: భారత స్టార్ పంకజ్ అద్వానీ వారం రోజుల వ్యవధిలో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గత గురువారం ఆసియా స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పంకజ్ దోహాలో మంగళవారం ముగిసిన 6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7–5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్)పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. కాగా అతడి కెరీర్లో ఇది 24 వ వరల్డ్ టైటిల్ కావడం విశేషం. చదవండి: PBKS vs RR: పరాజయానికి పంజాబ్ పిలుపు -
తాలిబన్లతో భారత రాయబారి భేటి
సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత భారత్‌తో సంబంధాల విషయంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్ మధ్య చర్చలు విశేషంగా నిలిచాయి. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాలిబన్ల అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ మీట్లో భారత్ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అఫ్గన్ మట్టిని భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏంతమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది. భారత్‌తోవాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు -
20 ఏళ్ల తర్వాత అఫ్గన్‌కు: కాబోయే అధ్యక్షుడు.. ఎవరీ అబ్దుల్ ఘనీ?!
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అఫ్గన్ ప్రజల నిరసన జ్వాలలు కొనసాగుతున్నప్పటికీ లెక్కచేయక అధికారం చేపట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాలిబన్లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గనిస్తాన్‌కు కాబోయే తదుపరి అధ్యక్షుడు అనే వార్తలు వెలువడుతున్నాయి. 2001లో తాలిబన్ నాయకత్వం నుంచి తొలగించబడి, దేశం విడిచి వెళ్లిపోయిన అబ్దుల్ మళ్లీ మంగళవారం కాందహార్‌లో అడుగుపెట్టారు. ఒకప్పుడు తాలిబన్ లీడర్‌గా ఓ వెలుగు వెలిగిన అబ్దుల్ ఎందుకు అఫ్గన్‌ను వీడాల్సి వచ్చింది? పాకిస్తాన్లో అరెస్టై, సుమారు 8 ఏళ్ల పాటు నిర్బంధ జీవితం గడిపిన ఆయన ఎవరి చొరవతో బయటపడ్డారు? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం.. ►అఫ్గనిస్తాన్‌లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లో 1968లో అబ్దుల్ ఘనీ బరాదర్ జన్మించారు. 1980లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా అఫ్గన్ ముజాహిదీన్ తరఫున పోరాడారు. ►1989లో సోవియట్ సేనలు దేశాన్ని వీడిన తర్వాత మహ్మద్ ఒమర్‌తో కలిసి కాందహార్‌లో మదర్సాను స్థాపించిన అబ్దుల్ ఘనీ.. 1994లో తాలిబన్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో 1996లో తాలిబన్ అధికారం చేపట్టింది. కాగా తాలిబన్ ఉద్యమ సహచరులుగా ఉన్న అబ్దుల్- ఒమర్ ఆ తర్వాత బంధువులుగా మారారు. ఒమర్ సోదరిని అబ్దుల్ పెళ్లి చేసుకున్నారు. ►తాలిబన్ పాలనలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అబ్దుల్.. న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత అఫ్గన్ పరిస్థితులపై అమెరికా జోక్యంతో దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని కేవలం పాకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ మాత్రమే గుర్తించిన విషయం తెలిసిందే. ►అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2010లో పాకిస్తాన్‌లోని కరాచీలో అబ్దుల్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను దోహా(ఖతార్)కు తరలించారు. ►ఖతార్‌లో ఉన్న సమయంలో అబ్దుల్ అమెరికా, అఫ్గన్ శాంతిదూతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆ సమావేశాలకు హాజరైన జల్మే ఖలిజాద్ అబ్దుల్ నమ్మదగ్గ వ్యక్తి అని, అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో నిర్బంధ జీవితం నుంచి అబ్దుల్‌కు విముక్తి లభించింది. ►ఈ క్రమంలో 2020లో అమెరికాతో తాలిబన్లకు కుదిరిన చారిత్రాత్మక దోహా ఒప్పందంపై అబ్దుల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై అబ్దుల్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ►అదే విధంగా.. తాలిబన్లను అఫ్గన్ సైన్యంగా, రాజకీయ శక్తిగా గుర్తించిన చైనా ఆహ్వానం మేరకు తొమ్మిది మంది తాలిబన్ నేతల బృందంతో కలిసి అబ్దుల్ 2021లో డ్రాగన్ దేశంతో చర్చలు జరిపారు. ►ఇక అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తాలిబన్లు ఆదివారం అఫ్గన్‌ను ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో అబ్దుల్ వారిని ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘‘తాలిబన్ ఫైటర్లూ.. మున్ముందు అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాధించాల్సి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. ►అంతేగాక, ఆదివారమే ఖతార్ నుంచి అఫ్గన్ చేరుకున్న అబ్దుల్.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాలిబన్ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఆ సమయంలో అబ్దుల్ ఖతార్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు. -వెబ్‌డెస్క్ చదవండి: Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ! -
జులై 29న దోహాలో ఓపెన్ హౌజ్
దోహా: ఖతార్ లో ఇండియన్ ఎంబసీలో 2021 జులై 29న ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నారు. ఖతార్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక (లేబర్), కాన్సులర్ (దౌత్య) సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. జులై 29 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. భారత దౌత్య అధికారులు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశానికి నేరుగా రాలేకపోయిన వారు జులై 29వ తేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 00974 50411241 ఫోన్ ద్వారా అయినా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ ఐడీ ID: 830 1392 4063 పాస్‌కోడ్‌లను 121700 ఉపయోగించి జూమ్ సమావేశంలో జాయిన్ కావొచ్చు. వీటితో పాటు labour.doha@mea.gov.in కు మెయిల్ ద్వారా కూడా సమస్యలను విన్నవించుకోవచ్చు. -
దోహాలో 2030 ఆసియా క్రీడలు
మస్కట్ (ఒమన్): ఆసియా క్రీడలను రెండోసారి నిర్వహించే అవకాశాన్ని ఖతర్ రాజధాని దోహా దక్కించుకుంది. 2030 ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) సమావేశంలో ఓటింగ్ ద్వారా 2030, 2034 ఆసియా క్రీడల ఆతిథ్య నగరాలను ఎంపిక చేశారు. 2030 ఆసియా క్రీడల నిర్వహణ కోసం దోహా... సౌదీ అరేబియా రాజధాని రియాద్ పోటీపడ్డాయి. ఓటింగ్‌లో రియాద్‌ను వెనక్కినెట్టి దోహా ఆతిథ్య హక్కులను సంపాదించింది. రియాద్‌కు 2034 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కులు కట్టబెట్టామని ఓసీఏ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా (కువైట్) ప్రకటించారు. గతంలో 2006లో దోహా తొలిసారి ఆసియా క్రీడలను నిర్వహించింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో... 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి–నగోయా నగరాల్లో జరుగుతాయి. -
వరుస రాకెట్ దాడులతో వణికిన కాబూల్
కాబూల్: ఆప్గానిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం ఉదయం వరుస రాకెట్ లాంఛర్ దాడులతో వణికిపోయింది. వరుసగా 23 రాకెట్లు దూసుకొచ్చాయని ఆప్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియాన్ ధృవీకరించారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు, 31 మంది గాయపడ్డట్లు తారిఖ్ ప్రకటించారు. ఈ దాడికి తాలిబన్లు కారణం అని ఆయన ఆరోపించారు. కాబూల్ లోని సెంట్రల్,ఉత్తర ప్రాంతాలలో దాడి జరిగింది. ఈ ప్రదేశం అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం ఈ దాడి చేసింది తాలిబన్లు అని ప్రకటించగా, తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముబాహిద్ ఖండించాడు. గత కొంతకాలంగా కాబూల్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని వారాల క్రితం రెండు యూనివర్శిటీపై దాడి జరిగింది. అటు తరువాత జరిగిన మరో దాడిలో దాదాపుగా 50 మంది ప్రజలను కాల్చి చంపారు. ప్రతిసారి దాడులు చేసింది తాలిబన్లు లేదా వారు పోషిస్తున్నజిహద్ శక్తులేనని ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తాలిబన్లు మాత్రం దాడులు చేస్తోందని మా సంస్థలు కాదని, ఇలా చేసే వారు మా పేరును వాడుకుంటున్నారని చెప్తుతున్నారు. మేము ప్రజలపై దాడులు చేయమని అంటున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ జరుగుతుందని,దానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసామని, దానికే కట్టుబడి ఉన్నామని తాలిబన్లు వాదిస్తున్నారు. కాగా, ఇటీవల విద్యాసంస్థలపై దాడులు చేసింది భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అని తనకు తానే ప్రకటించుకుంది. ఈ రోజు(శనివారం) దాడి చేసింది పాకిస్థాన్ ప్రేరిత ఉగ్ర సంస్థ హక్కానీ నెట్వర్క్ అని తాలిబన్ ప్రకటించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లోఉగ్రవాదుల చేసిన మారణహోమం తాలుకూ వివరాలను ప్రకటించారు. తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1,250 పేలుళ్లు జరిపారని అందులో 1,210 మంది పౌరులు మరణించగా, 2,500 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ప్రకటించారు. మరోవైపు శనివారం ఉదయం రెండు చిన్న "స్టిక్కీ బాంబు" పేలుళ్లు సంభవించాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిలో ఒకటి పోలీసు కారును ఢీకొట్టింది ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
గిఫ్ట్‌గా హనీమూన్ ట్రిప్.. జైలులోనే ప్రసవం
ముంబై: పెళ్లై సంతోషంగా గడుపుతున్న జంటకు హనీమూన్ ట్రిప్ పేరిట ఎర వేసిందో సమీప బంధువు. తన సొంతలాభం కోసం, వారి ప్రయాణ ఖర్చులు భరించి, జైలుపాలు చేసింది. దీంతో ఏడాదికి పైగా ఎడారి దేశంలోని జైళ్లలో మగ్గుతున్న ఆ జంటను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారికి బాసటగా నిలిచారు. అక్రమ కేసు నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. ముంబైకి చెందిన ఒనిబా, షరీఖ్‌లు దంపతులు. సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితాల్లోకి సమీప బంధువైన తబుస్సుమ్ రియాజ్ ఖురేషీ అనే మహిళ ప్రవేశించింది. పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్లలేదు గనుక ఖతార్ ట్రిప్‌ను బహుమతిగా ఇస్తానని, అక్కడికి వెళ్లి సంతోషంగా గడపాలంటూ చెప్పింది. దీంతో తొలుత ఈ గిఫ్ట్‌ను నిరాకరించిన సదరు దంపతులు, ఆ మహిళ ఒత్తిడి పెంచడంతో సరేనన్నారు. బ్యాగులు ప్యాక్‌చేసుకుని ఖతార్‌కు పయనమయ్యారు. అయితే, దురుద్దేశంతోనే ఒనిబా, షరీఖ్‌లకు ఈ బహుమతి ఇచ్చిన తబస్సుమ్, వారికి తెలియకుండా, లగేజీలో 4 కిలోల హషిష్(డ్రగ్స్) ప్యాకెట్‌ను పెట్టింది. దోహాలో ఉన్న తమ స్నేహితుల కోసం ఈ ప్యాక్ పంపిస్తున్నానని నమ్మబలికింది. తెలిసిన వ్యక్తే గనుక వారు కూడా ఆమెను నమ్మి ప్యాకెట్ తెరచిచూడలేదు. (చదవండి: పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆపై) ఈ క్రమంలో జూలై 6, 2019న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే, ఖతార్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఈ జంటకు 10 ఏళ్ల శిక్ష విధించడంతో పాటు, కోటి రూపాయల జరిమానా విధించింది. దీంతో ఈ ఏడాది కాలంగా ఒనిబా, షరీఖ్‌లు అక్కడి జైళ్లో జీవితం గడుపుతున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన ఎన్సీబీ, ఈ డ్రగ్స్ కేసుతో ఒనిబా దంపతులకు సంబంధం లేదనే నిర్ధారణకు వచ్చింది. చండీగఢ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన, తబస్సుమ్ అనుచరుడు నిజాం కరాను అక్టోబరు 14న అరెస్టు చేసిన ఎన్సీబీ, విచారణలో భాగంగా ఒనిబా, షరీఖ్‌ల కేసును ఛేదించింది. (ఆన్లైన్ క్లాసులు: కూతురిని పెన్సిల్‌తో పొడిచి) పథకం ప్రకారమే తబస్సుమ్ వారిద్దరిని ఖతార్ ట్రిప్పునకు పంపిందన్న నిజాం వాంగ్మూలంతో ఆమెపై కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తబస్సుమ్ ప్రస్తుతం పరారీలో ఉంది. ఇదిలా ఉండగా.. ఒనిబా తండ్రి షకీల్ అహ్మద్ గతేడాది సెప్టెంబరులో ఎన్సీబీకి లేఖ రాశారు. తన కూతురు, అల్లుడిని విడిపించాల్సిందిగా కోరారు. ఇక ప్రస్తుతం ఈ కేసులో నిజానిజాలు బయటపడినందున వారి అభ్యర్థనను మన్నించిన ఎన్సీబీ, ఖతార్ అధికారులను సంప్రదించి ఈ కేసు విషయమై చర్చించి, ఒనిబా దంపతులను విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా ఖతార్‌లో అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చిన ఒనిబా, ఈ ఏడాది మార్చిలో జైళ్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. -
దోహా చర్చల్లో మనం
అంతర్జాతీయ వాతావరణం ఎలావుందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, మారిన పరిస్థితులకు తగినట్టు విధానాలు సవరించుకోనట్టయితే వెనకబడిపోవటం ఖాయం. ఈ సంగతిని మన దేశం ఆల స్యంగానైనా గ్రహించి అఫ్ఘానిస్తాన్ శాంతి చర్చల్లో పాలుపంచుకుంది. ఖతార్‌లోని దోహాలో అఫ్ఘాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఆదివారం నుంచి జరుగుతున్న చర్చల్లో మన దేశంతో పాటు 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఫిబ్రవరిలో అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదర డానికి రెండేళ్లముందు నుంచే వారిద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. అప్పటినుంచీ ఇందులో పాలుపంచుకోమని అమెరికా మన దేశాన్ని కోరుతోంది. 2001లో తమ గడ్డపై ఉగ్రదాడి తర్వాత భూగోళంలో ఏ మూలనున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని అమెరికా ప్రకటించి అఫ్ఘానిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. వరస దాడులతో తాలిబన్లు నష్టాన్ని చవిచూసిన మాట వాస్తవమే. బిన్‌లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది. ముల్లా ఒమర్‌ను కూడా హతమార్చింది. కానీ ఆ క్రమంలో అమెరికా కూడా భారీగా నష్టపోయింది. వేలాదిమంది సైనికులు బలయ్యారు. మరిన్ని వేలమంది గాయపడ్డారు. వేలాది కోట్ల డాలర్లు వెచ్చించినా ఈ యుద్ధం అంతమయ్యే జాడలు కనబడలేదు. ఈ పరిస్థితుల్లోనే 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ తాను గెలిస్తే అమెరికా సేనల్ని వెనక్కి తీసుకొ స్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దిశగా ఆయన అడుగులేశారు. తాలిబన్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, అందువల్ల వారితో సర్దుకుపోవాలని మన దేశానికి అప్పటినుంచీ ఆయన చెబుతున్నారు. కానీ గతంలో వారితో వున్న చేదు అనుభవాలరీత్యా మన దేశం అందుకు సిద్ధపడలేదు. తాలిబన్లు పాకిస్తాన్ ప్రాపకంలో పని చేస్తారన్నది బహిరంగ రహస్యం. 90వ దశకంలో వారు అఫ్ఘాన్‌ను చెరబట్టినప్పుడు కశ్మీర్లో వారు సాగించిన హత్యాకాండ, సృష్టించిన విధ్వంసం ఎవరూ మరిచిపోరు. తాలిబన్లు 1999లో మన ఎయిరిండియా విమానం హైజాక్ చేసి ఇక్కడి జైళ్లలో వున్న తమ సహచరులు ముగ్గుర్ని విడిపించు కున్నారు. ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు అమెరికా ఏదో విధంగా ఆ దేశం నుంచి బయటపడటం కోసం, అది సాధ్యమైనంత గౌరవప్రదంగా వుండటం కోసం తాపత్రయపడి తాలిబన్లతో ఒప్పందం చేసుకుంది. వారితో చర్చించేది లేదని భీష్మించుకుని కూర్చున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని సైతం ఒప్పించింది. ఆయన వద్దంటున్నా జైళ్లలో వున్న తాలిబన్ శ్రేణు లను విడిపించింది. ఆ ఒప్పందం తర్వాత కూడా గత ఆరునెలల్లో తాలిబన్లు స్త్రీలు, పిల్లలతోసహా 1,300మంది పౌరుల ప్రాణాలు తీశారని, అఫ్ఘాన్ జవాన్లు 3,560మంది వారి దాడుల్లో మరణించారని ఘనీ లెక్కలు చెప్పినా లాభం లేకపోయింది. ప్రస్తుత దోహా చర్చల్లో ఘనీ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొదట్లో ఈ చర్చలను గట్టిగా వ్యతిరేకించి, అందులో పాలుపంచుకోవడానికి నిరాకరించిన మన దేశం సహజంగానే ఇప్పుడు ‘బయటి దేశం’గా మిగిలింది. అయితే ఆలస్యంగానైనా ఇది మంచి నిర్ణయం. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో మన దేశం చురుగ్గా పాలుపంచుకుంది. పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది. ఔషధాలు, నిత్యావసరాలు అందించంలో మొదటినుంచీ ముందుంది. కానీ ఘనీ ప్రభుత్వం అవసరమైనంతగా బలపడలేదు. దేశంలోని కొన్ని నగరాలకూ, పట్టణాలకూ ప్రభుత్వం పరిమితంకాగా... విశాల గ్రామీణ ప్రాంతాలు మొదటినుంచీ పూర్తిగా తాలిబన్ల నియం త్రణలో వున్నాయి. పాకిస్తాన్ జైల్లో పదేళ్లుగా బందీగావున్న తాలిబన్ సహ సంస్థాపకుడు ముల్లా అబ్దల్ ఘనీ బరాదర్‌ను పాక్ పాలకులు ఒప్పించి, అమెరికాతో రాజీ కుదుర్చుకోవడానికి సిద్ధపడే షరతుపై 2018లో విడిచిపెట్టారు. అప్పటినుంచీ తాలిబన్లపై పాక్ పట్టు పెరిగింది. ఆ కారణంతోనే మన దేశం ఈ శాంతి చర్చలకు దూరంగా వుంది. కానీ అక్కడ తాలిబన్లు ప్రధాన పాత్రవహించే ప్రభుత్వానికి దూరంగా వుండటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం వుండదన్న అవగాహనతో చివరకు మన దేశం ఈ సమావేశంలో పాల్గొంది. అలా పాల్గొన్నప్పుడే భవిష్య అఫ్ఘాన్ ఎలావుండాలన్న అంశంలో మన వాదన వినిపించడానికి, తగినంతగా ప్రభావితం చేయడానికి అవకాశం వుంటుం దన్న నిపుణుల సూచన కొట్టిపారేయదగ్గది కాదు. అయితే తాలిబన్ల తాజా ప్రకటనల తీరు చూస్తే వారిలో మార్పు వచ్చిందంటున్న మాటలు ఎంతవరకూ సరైనవన్న సందేహాలు తలెత్తుతాయి. కాల్పుల విరమణ ప్రకటించాలన్న అఫ్ఘాన్, అమెరికాల వాదనను వారు ఒప్పుకోవడం లేదు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి మూల కారణమేమిటో చర్చించకుండా కాల్పుల విరమణ అంటే ఎలా అని తాలిబన్ ప్రతినిధులు ప్రశ్నిస్తు న్నారు. గత అయిదారురోజులుగా సాగుతున్న చర్చంతా ప్రధాన చర్చలకు ప్రాతిపదిక ఏర్పర్చడం కోసమే. కాల్పుల విరమణపై ఈ ప్రాథమిక చర్చల్లోనే ప్రతిష్టంభన ఏర్పడటం అనేక సందేహాలు కలిగిస్తోంది. అఫ్ఘాన్‌లో వున్న వివిధ మిలిటెంటు సంస్థల్లో తాలిబ¯Œ ప్రధానమైనది. ఇతరులతో పోలిస్తే తాలిబన్ల బలం అధికమే అయినా అది కూడా అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతోంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా అది పాకిస్తాన్ ప్రాపకంతోనే అడుగులేస్తుంది. ఉన్నకొద్దీ అఫ్ఘాన్‌లో తన పలుకుబడి మరింత పెంచుకుంటుంది. మహిళల హక్కులపై, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుపై తాలిబన్లు ఇంతవరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఉదారవాదులుగా ముద్రపడ్డ షేర్ మహమ్మద్ అబ్బాస్, ముల్లా బరాదర్లను చివరి నిమిషంలో తప్పించి ఛాందసవాది మలావీ హక్కానీని చర్చలకు పంపడంలోనే ఇలాంటి అంశాల్లో తాలిబన్ల వైఖరేమిటో చెబుతోంది. తమ గడ్డను ఉగ్రవాదుల అడ్డాగా మారనీయబోమని తాలిబన్లు అంటున్నారు. ఉన్నంతలో ఇదొక్కటే మనకు అనుకూలమైన అంశం. కనీసం తాలిబన్లను దీనికైనా కట్టుబడి వుండేలా చేయగలిగితే, వారిని తటస్తులుగా ఉంచగలిగితే ఉన్నంతలో అది మేలే. -
దోహా చేరుకున్న తాలిబన్ నేతలు
ఇస్లామాబాద్: అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాలిబన్ నేతల బృందం ఖతార్ రాజధాని దోహాకు చేరుకుంది. ఫిబ్రవరిలో దోహాలో అమెరికా– తాలిబన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఈ చర్చలు కొనసాగింపు. ఈ చర్చల కోసం అమెరికా అటు అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ఆధారంగా అఫ్గాన్ భవితవ్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, మిలిషియాలను నిరాయుధులను చేయడం, పునరావాసం కల్పించడం వంటి అనేక కీలకాంశాలు ఈ చర్చలపై ఆధారపడి ఉన్నాయి. గత వారం చర్చల కొనసాగింపునకు సంబంధించి అఫ్గాన్ అధ్యక్షుడితో యూఎస్ సెక్యూరిటీ సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్ మంతనాలు జరిపారు. మరోవైపు తాలిబన్లను చర్చలకు ఒప్పించేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే ఈ చర్చలు జరగాల్సిఉండగా, ఖైదీల విడుదలపై ఎటూ తేలకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. చర్చలకు ముందే ఇరుపక్షాలు హింసను విడనాడాలని యూఎస్, అఫ్గాన్ ప్రభుత్వాలు చెబుతుండగా, తర్వాతే కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని తాలిబన్లు అంటున్నారు. -
జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోలో వరుస పెట్టుబడులను సాధించిన రిలయన్స్ తాజాగా జియో ఫైబర్‌లో పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా దోహా ఆధారిత ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తో చర్చలు జరుపుతోంది. (రిలయన్స్ రికార్డుల దూకుడు) జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచే మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (ఇన్విట్)లో 1.5 బిలియన్ డాలర్ల (11200 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ రడీ అవుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కోసం సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, మోయిల్స్ అండ్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నేతృత్వంలోని కన్సార్షియం, రిలయన్స్‌లో 25, 215 కోట్ల రూపాయల పెట్టబడులు పెట్టింది. 2019లో రిలయన్స్ జియో ఇన్ ఫో కామ్ నుంచి ఫైబర్ బిజినెస్ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ డీమెర్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత 7లక్షల కిలోమీటర్ల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా11లక్షల కిలోమీటర్ల పరిధికి విస్తరించాలని ఉన్న జియో డిజిటల్ ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది. -
భారత వెయిట్‌లిఫ్టర్ రాఖీ హల్దర్‌కు కాంస్యం
దోహాలో జరిగిన ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచింది. రాఖీ మొత్తం 218 కేజీలు (స్నాచ్‌లో 85 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 123 కేజీలు) బరువెత్తింది. ఈ క్రమంలో రాఖీ 214 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ సీనియర్ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ స్థాయి అర్హత టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఖతర్ కప్‌లో ఓవరాల్‌గా భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్రినుంగా రజతం సాధించారు. -
ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు రజతం
దోహా: ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత స్టార్ షూటర్ సౌరభ్ చౌదరి.. ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ రజత పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన సౌరభ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ పసిడి పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ గెలుచుకున్నాడు. ఫైనల్ పోరులో కిమ్ సాంగ్ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్ 221.8 పాయింట్లతో కాంస్య సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్‌తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంతోనే సంతృప్తి చెందాడు. ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, అభిషేక్ వర్మ కూడా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. -
గురి తప్పింది... కల చెదిరింది
దోహా (ఖతర్): దురదృష్టం అంటే ఇదేనేమో! ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో కనీసం ఐదో స్థానంలో నిలిచినా... టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయమయ్యే స్థితిలో భారత ట్రాప్ షూటర్ కైనన్ షెనాయ్ తీవ్ర ఒత్తిడికిలోనై పూర్తిగా గురి తప్పాడు. 25 షాట్ల తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ షూటర్ కేవలం 13 పాయింట్లే స్కోరు చేసి తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. మూడు ఒలింపిక్ బెర్త్‌లు ఉన్న ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో కువైట్ నుంచి ముగ్గురు... ఖతర్, భారత్, చైనీస్ తైపీ నుంచి ఒక్కొక్కరు బరిలోకి దిగారు. ఫైనల్లో కువైట్ షూటర్లు అల్రïÙద్ తలాల్ (42 పాయింట్లు), అల్‌ముదాఫ్ ఖలీల్ (38 పాయింట్లు), నాసిర్ మెక్లాద్ (29 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. ఒక విభాగంలో గరిష్టంగా ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే ఒలిం పిక్ బెర్త్ లభిస్తుంది. గతంలోనే కువైట్‌కు ఈ విభాగంలో ఒక ఒలింపిక్ బెర్త్ లభించింది. దాంతో ఈసారి వారికి ఒక బెర్తే దక్కింది. మిగతా రెండు బెర్త్‌లు నాలుగో స్థానంలో నిలిచిన యాంగ్ కున్ పి (చైనీస్ తైపీ–26 పాయింట్లు), ఐదో స్థానంలో నిలిచిన మొహమ్మద్ అల్ రుమాహి (ఖతర్–18 పాయింట్లు)లకు లభించాయి. 52 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ 122 పాయింట్లు స్కోరు చేసి నాసిర్ మెక్లాద్ (122)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కానీ ఫైనల్ కొచ్చేసరికి కైనన్ పూర్తిగా నిరాశపరిచాడు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌కే చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ 118 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టాప్–6లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. ఆసియా జోన్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీ కాబట్టి భారత ట్రాప్ షూటర్లకు మరో చాన్స్ లేకుండా పోయింది. ఇక టీమ్ విభాగంలో కైనన్ షెనాయ్, మానవ్‌జిత్, పృథీ్వరాజ్‌లతో కూడిన భారత బృందం 357 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒకవేళ అనీశ్ పదో స్థానంలో నిలిచినా అతనికి కూడా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లభించేది. అయితే ఈ ఈవెంట్ టీమ్ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సాధించింది. ఇదే వేదికపై జరుగుతున్న జూనియర్స్ విభాగంలో భారత్‌కు రెండో రోజు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. -
నియా అలీకి స్వర్ణం...
దోహా: పోటీల చివరిరోజు ఏడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్, ఇద్దరు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల నియా అలీ స్వర్ణం సాధించింది. ఆమె 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. మహిళల లాంగ్‌జంప్‌లో మలైకా మిహాంబో (జర్మనీ–7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా–3ని:29.26 సెకన్లు)... పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా–86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్టెగి (ఉగాండా–26ని:48.36 సెకన్లు)... మహిళల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. -
శివపాల్ సింగ్ విఫలం
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత ఆటగాడు శివపాల్ సింగ్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. శివపాల్ సింగ్ ఈటెను 78.97 మీటర్ల దూరం విసిరి గ్రూప్ ‘ఎ’లో పదో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 30 మంది బరిలోకి దిగగా... శివపాల్ సింగ్ 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. డిఫెండింగ్ చాంపియన్ జొహనెస్ వెటెర్ (జర్మనీ–89.35 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. పురుషుల 20 కిలోమీటర్ల నడక ఫైనల్లో భారత అథ్లెట్ ఇర్ఫాన్ గంటా 35 నిమిషాల 21 సెకన్లలో గమ్యానికి చేరి 36వ స్థానంలో నిలిచాడు. తొషికాజు (జపాన్–1గం:26ని.34 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో దలీలా (అమెరికా–52.16 సెకన్లు) కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచింది. పురుషుల హైజంప్‌లో ముతాజ్ ఇసా బర్షిమ్ (ఖతర్–2.37 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మహిళల డిస్కస్ త్రోలో వైమి పెరెజ్ (క్యూబా–69.17 మీటర్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో స్టీవెన్ గార్డ్నర్ (బహమాస్–43.48 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. -
షాట్‌పుట్‌లో తజీందర్కు నిరాశ
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో మరో భారత స్టార్ నిరాశపరిచాడు. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత స్టార్, ప్రస్తుత ఆసియా చాంపియన్, ఆసియా క్రీడల చాంపియన్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’లో పోటీపడిన తజీందర్ ఇనుప గుండును 20.43 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో, గతేడాది ఆసియా క్రీడల్లో తజీందర్ షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. అయితే అదే ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో 16 మంది... గ్రూప్ ‘బి’లో 18 మంది క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. టాప్–12లో నిలిచిన వారు శనివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా తజీందర్ 18వ స్థానంలో నిలిచాడు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఎనిమిది మంది... గ్రూప్ ‘బి’ నుంచి నలుగురు ఫైనల్‌కు చేరారు. 20.90 మీటర్లను ఫైనల్‌కు చేరే కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. ముగిసిన బ్రిటన్ నిరీక్షణ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో బ్రిటన్ స్ప్రింట్ (100 లేదా 200 మీటర్లు) విభాగంలో నిరీక్షణ ముగిసింది. 36 ఏళ్ల విరామం తర్వాత బ్రిటన్‌కు 200 మీటర్ల విభాగంలో ఈ మెగా ఈవెంట్లో తొలి పసిడి పతకం లభించింది. మహిళల 200 మీటర్ల విభాగంలో దీనా యాషెర్ స్మిత్ విజేతగా నిలిచి బ్రిటన్ ఖాతాలో స్వర్ణాన్ని చేర్చింది. ఆమె 21.88 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. బ్రిట్నీ బ్రౌన్ (అమెరికా–22.22 సెకన్లు) రజతం, ముజింగా కామ్బుండ్జి (స్విట్జర్లాండ్–22.51 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ‘ఏం చెప్పాలో తెలియడంలేదు. ఈ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. స్ప్రింట్ స్వర్ణం కోసం కల కన్నాను. ఇప్పటికి ఇది నిజమైంది’ అని 23 ఏళ్ల దీనా వ్యాఖ్యానించింది. -
అవినాశ్ జాతీయ రికార్డు
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మరో భారత అథ్లెట్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమో దు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు. మూడో హీట్‌లో పాల్గొన్న అతను 8 నిమిషాల 25.23 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఏడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అవినాశ్ 8 నిమిషాల 28.94 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. జాతీయ రికార్డును సవరించినా తొలుత అవినాశ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మొత్తం 44 మంది అథ్లెట్స్ మూడు హీట్స్‌లో పాల్గొనగా... 15 మంది ఫైనల్‌కు అర్హత పొందారు. అవినాశ్ ఓవరాల్‌గా 20వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే రేసు జరుగుతున్న సమయంలో అవినాశ్ దారికి అడ్డంగా రెండుసార్లు ఇథియోపియా అథ్లెట్ టెకెలె నిగేట్ వచ్చాడు. దాంతో అవినాశ్ ప్రమే యం లేకుండా అతని వేగం తగ్గిపోయింది. రేసు ముగిశాక ఈ విషయంపై నిర్వాహకులకు భారత బృందం అప్పీల్ చేసింది. నిర్వాహకులు వీడియో ఫుటేజీని పరిశీలించి అవినాశ్ తప్పు లేదని నిర్ధారించారు. అవినాశ్‌కు 16వ అథ్లెట్‌గా ఫైనల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అన్ను రాణికి 8వ స్థానం మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత అమ్మాయి అన్ను రాణి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా ఈటెను 61.12 మీటర్ల దూరం (రెండో ప్రయత్నంలో) విసిరింది. కెల్సీ (ఆ్రస్టేలియా–66.56 మీటర్లు) స్వర్ణం... షియింగ్ లియు (చైనా–65.88 మీటర్లు) రజతం... హుయ్‌హుయ్ లియు (చైనా–65.49 మీటర్లు) కాంస్యం నెగ్గారు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అన్ను జావెలిన్‌ను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
బోల్ట్ ‘వరల్డ్’ రికార్డును బ్రేక్ చేశారు..
దోహా: సుమారు తొమ్మిది సంవత్సరాలపాటు అతని ముందు గాలికూడా జొరబడలేని వేగంతో అత్యధిక ప్రపంచ చాంపియన్ పతకాలూ గెలుచుకున్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ అయ్యింది. అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్ అలిసన్ ఫెలిక్స్.. బోల్ట్ వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4/400 మీటర్ల మిక్స్డ్ రిలేలో స్వర్ణం పతకం సాధించడంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ ఫిలెక్స్ 12 స్వర్ణ పతకాలను సాధించి కొత్త రికార్డుకు నాంది పలికారు. అంతకుముందు ఈ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 11 పసిడి పతకాలు సాధించగా దాన్ని ఫెలిక్స్ సవరించారు. 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్ రెండో లెగ్ నుంచి పోరును ఆరంభించారు. అయితే ఈ టైటిల్‌ను గెలిచే క్రమంలో అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకండ్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇది సరికొత్త వరల్డ్ రికార్డుగా నమోదైంది. ఇలా 4/400 మిక్స్డ్ రిలేలో అమెరికా జట్టు వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం రెండోసారి. ఇక్కడ జమైకా, బెహ్రయిన్ జట్లను వెనక్కునెట్టి టైటిల్‌ను అందుకున్నారు. ఇక ఫెలిక్స్ ఓవరాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనలో మహిళల 200 మీటర్ల రేసులో మూడు స్వర్ణాలు గెలుచుకోగా, 400 మీటర్ల రేసులో ఒక పసిడిని అందుకున్నారు. 4/100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణ పతకాలను ఫెలిక్స్ సాధించారు. ఇక 4/400 మీటర్ల మహిళల రిలేలో నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు. తాజాగా 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్‌కు ఇది స్వర్ణం. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫెలిక్స్‌కు మొదటి స్వర్ణం కావడం విశేషం. -
గోల్డ్ గెలిచినా.. జాతీయ గౌరవం లేదు!
దోహా: సాధారణంగా ప్రధాన ఈవెంట్లలో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆ దేశ జాతీయ గీతంతో గౌరవాన్ని ఇస్తారు. అదే సమయంలో సదరు అథ్లెట్ జాతీయ జెండాను తన ఒంటిపై వేసుకోవడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న రష్యాకు చెందిన పోల్ వాల్టర్ అంజెలికా సిదోరోవా పసిడి పతకం సాధించినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో సిదోరోవా 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి స్వర్ణాన్ని సాధించారు. అయినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవానికి దూరంగా ఉండిపోయింది. కనీసం పతకం సాధించిన తర్వాత జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకోవడానికి కూడా నోచుకోలేదు. ఇక్కడ రజత, కాంస్య పతకాలు సాధించిన వారు మాత్రం తమ జాతీయ జెండాలతో మైదానమంతా కలియ తిరిగితే సిదోరోవా మాత్రం కేవలం చప్పట్లతోనే సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు కారణంగా రష్యన్ అథ్లెట్లపై గత నాలుగేళ్లుగా డోపింగ్ ఆరోపణలు చుట్టముట్టడమే. అప్పట్నుంచి రష్యన్ అథ్లెట్లపై నిషేధాన్ని వాడా పెంచుకుంటూ పోతుంది. అయితే ప్రస్తుత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రష్యన్ అథ్లెట్లు బరిలోకి దిగడానికి అనుమతి ఇచ్చినా వారి జాతీయ జెండాలను దూరం పెట్టాలని నిబంధనతో పాటు పతకాలు సాధించిన క్రమంలో ఆ దేశం జాతీయ గీతాన్ని సైతం ఆలపించరాదనే నియమాన్ని పెట్టింది. ఈ క్రమంలోనే సిదోరోవా పసిడితో మెరిసినా ఆమెకు తటస్థ అథ్లెట్‌గానే మిగిలిపోయింది. ఈ పోల్ వాల్ట్ పోరులో అమెరికాకు చెందిన శాండి మోరిస్ రజతం సాధించగా, గ్రీస్ దేశానికి చెందిన ఏకాతెరిణి స్టిఫనిది కాంస్యం సాధించారు. దీనిపై సిదోరోవా మాట్లాడుతూ.. ‘స్వర్ణం అనేది స్వర్ణమే. నేను పసిడిని సాధించినందుకు సంతోషంగా ఉన్నా. నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అయినా స్వర్ణం సాధించడం చాలా ఆనందాన్ని కల్గిస్తుంది’ అని అన్నారు. -
భారత్‌కు నిరాశ
దోహా: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్ తరఫున పెద్ద సంచలనమేమీ నమోదు కాలేదు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత 4గీ400 మిక్సడ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో భారత్ 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ఈ మెగా టోర్నీలో ప్రవేశపెట్టిన మిక్సడ్రిలేలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ అనస్, వీకే విస్మయ, జిస్నా మాథ్యు, నిర్మల్ నోహ్ ఫైనల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. హీట్స్‌లో 3 నిమిషాల 16.14సెకన్ల టైమింగ్‌తో రాణించిన భారత బృందం ఫైనల్లో అంతకన్నా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ పతకానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఈ పోటీల్లో అమెరికా జట్టు 3 నిమిషాల 09:34 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని, జమైకా బృందం 3నిమిషాల 11:78 సెకన్లతో రజతాన్ని, బహ్రెయిన్ జట్టు 3నిమిషాల 11:82 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నాయి. నేడు జరగనున్న జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’, ‘బి’ ఈవెంట్లో భారత్ నుంచి అన్నూ రాణి (రా.గం 7:00 క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’; రా.గం 8:30; క్వాలిఫికేషన్ గ్రూప్ ‘బి’), మహిళల 200మీ. హీట్స్‌లో అర్చన సుసీంత్రన్ (రా.గం. 7:35), 400మీ. హీట్స్‌లో అంజలి దేవీ (రా.గం. 8:50)తలపడతారు. పోల్‌వాల్ట్ కొత్త తార సిదొరోవా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల పోల్‌వాల్ట్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ఆథరైజ్ న్యూట్రల్ అథ్లెట్ (ఏఎన్ఏ) తరఫున బరిలోకి దిగిన రష్యా అథ్లెట్ ఏంజెలికా సిదొరోవా విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఈవెంట్లో చివరి వరకు పోరాడిన అమెరికా అమ్మాయి సాండీ మోరిస్ వరుసగా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో మోరిస్, సిదోరోవా మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఫైనల్లో భాగంగా ఐదు ప్రయత్నాల్లో పోటీపడిన వీరిద్దరూ సమంగా నిలిచారు. చివరగా 4.95మీ. ఎత్తున్న బార్‌ను లంఘించడంలో విజయవంతమైన సిదోరోవా చాంపియన్‌గా నిలిచింది. 4.95మీ. ఎత్తును దూకలేకపోయిన సాండీ మోరిస్ రజతంతోనే సంతృప్తిపడింది. బ్రిటన్‌కు చెందిన కాటరీనా స్టెఫానిది మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. 2017 లండన్ క్రీడల్లోనూ సాండీ రన్నరప్‌గా నిలిచింది. -
‘విస్మయ’ పరిచారు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలను పెట్టుకున్న మహిళల 100మీ. పరుగులో ద్యుతీ చంద్, 400మీ. హర్డిల్స్‌లో కొత్త ఆశలు రేపిన జబీర్ నిరాశపరచగా... వీకే విస్మయ అనూహ్య పరుగుతో 4x400మీ. మిక్స్డ్ రిలేలో భారత బృందం పతక ఆశలను చిగురింపజేసింది.హీట్స్‌లో సీజన్ బెస్ట్ ప్రదర్శనతో భారత్ మిక్స్డ్ రిలే ఈవెంట్లో ఫైనల్‌కు చేరడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును కొట్టేసింది. దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల సత్తాపై అనుమానాలు తలెత్తుతోన్న సమయంలో 4x400మీ. మిక్స్డ్ రిలేలో జాతీయ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొహమ్మద్ అనస్, వెల్లువ కొరోత్ విస్మయ, జిస్నా మ్యాథ్యూ, టామ్ నిర్మల్ నోహ్లతో కూడిన భారత బృందం ఒకే దెబ్బతో ఫైనల్ బెర్తు, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. రెండో హీట్‌లో పాల్గొన్న భారత్ 3 నిమిషాల 16.14 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ సీజన్లో భారత్‌కిదే ఉత్తమ ప్రదర్శన. తొలుత పోటీని అనస్ ప్రారంభించగా... అనస్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న విస్మయ చిరుతలా పరుగెత్తింది. తర్వాత జిస్నా పరుగులో కాస్త వెనుకబడినా... చివరగా నిర్మల్ వేగంగా పరుగెత్తి భారత్‌ను రేసులో నిలిపాడు. అందరిలో విస్మయ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రతీ హీట్‌లో టాప్–3లో నిలిచిన వారితో పాటు, అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన మిగతా రెండు జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక గం.1.05లకు 4్ఠ400 మీ. మిక్స్డ్ రిలే ఫైనల్ జరుగుతుంది. నిరాశపరిచిన ద్యుతీ మహిళల 100మీ. పరుగులో సెమీస్ బెర్తు ఖాయమనుకున్న తరుణంలో భారత ఏస్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్లోనే అధ్వాన ప్రదర్శనతో అవకాశాన్ని చేజార్చుకుంది. పోటీల రెండోరోజు శనివారం మహిళల 100మీ. హీట్స్‌లో ద్యుతీచంద్ 11.48 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఎనిమిది మంది పాల్గొన్న మూడో హీట్స్‌లో ఏడో స్థానంతో... ఓవరాల్‌గా 37వ స్థానంతో పోటీల నుంచి ని్రష్కమించింది. సెమీస్‌కు అర్హత సాధించిన వారిలో చివరి అత్యుత్తమ టైమింగ్ 11.31 సెకన్లు కాగా... ద్యుతీ ఇదే వేదికగా ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపి యన్íÙప్లో 11.28సె. టైమింగ్ నమోదు చేసింది. కానీ ఈ మెగా టోరీ్నలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. జమైకా స్ప్రింటర్ షెల్లీ ఫ్రేజర్ అందరికన్నా ముందుగా 10.80 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని హీట్స్‌లో అత్యుత్తమ స్ప్రింటర్‌గా నిలిచింది. ముగిసిన జబీర్ పోరాటం పురుషుల 400మీ. హర్డిల్స్‌లో భారత ఆశాకిరణం ముదారి పిళ్లై జబీర్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. హీట్స్‌లో 49.62సె. టైమింగ్‌తో సెమీస్‌కు అర్హత సాధించిన జబీర్... సెమీస్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచలేకపోయాడు. తాను పాల్గొన్న మూడో సెమీస్ హీట్స్‌లో జబీర్ 49.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రతీ హీట్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితో పాటు, మిగిలిన వారిలో మెరుగైన టైమింగ్ ఉన్న ఇద్దరు కలిపి మొత్తం 8 మంది ఫైనల్‌కు సాధించారు. -
పేస్ట్‌గా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ టైప్‌లో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. పసిడిని వివిధ రూపాలుగా మార్చి అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తూ చిట్టచివరకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం దోహా నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడి నుంచి రూ.36.99 లక్షల విలువైన 1164.9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం రూ.33 వేల వరకు ఉంది. అదే ఖతర్, దుబాయ్ తదితర దేశాల్లో రూ.26వేలకే లభిస్తోంది. దీంతో బంగారం అక్రమ రవాణా చేస్తే ఒక్కో ట్రిప్‌లో కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల లాభం ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనేక మంది కీలక సూత్రధారులు క్యారియర్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తున్నారు. అయితే ఇటీవలి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వరుసగా పట్టుకుంటున్న కేసులతో ఎక్కువగా ‘గోల్డ్ పేస్ట్’ స్మగ్లింగ్ పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెచ్చాడిలా... కేరళకు చెందిన ఓ వ్యక్తిని అక్కడి కీలక సూత్రధారులు క్యారియర్‌గా మార్చుకున్నారు. కమీషన్ లేదా విమానం టికెట్లు ఇస్తూ తాము అందించే బంగారాన్ని భారత్‌కు చేర్చే బాధ్యతలు నిర్వర్తించే వారిని క్యారియర్లుగా పిలుస్తారు. వీరికి సూత్రధారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. కేవలం దళారుల సూచనల మేరకు ఈ అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ఎవరికి ఇవ్వాలనేది చెప్పరు. కేవలం క్యారియర్లను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ఫలానా చోట ఉండమంటారు. వీరి ఫొటోలను దళారులు వాట్సాప్ ద్వారా ఇక్కడి రిసీవర్లకు పంపుతారు. దీంతో వీరిని గుర్తించే రిసీవర్లు బంగారం తీసుకొని టిప్స్ ఇస్తుంటారు. కేజీకి పైగా బంగారం ఖరీదు చేసిన స్మగ్లర్లు దోహాలో ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలకు అందించారు. దాన్న పౌడర్‌గా ఆపై పేస్ట్‌గా మార్చిన ఆ దుకాణదారులు ప్రత్యేకంగా ప్యాక్ చేసి అందించారు. దీన్ని ఓ ప్రత్యేకమైన వస్త్ర సంచిలో ఉంచిన కేరళవాసి లోదుస్తుల్లో దాచుకొని తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ఇతగాడు ‘గ్రీన్ చానెల్’ ద్వారా బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరి వద్ద అయితే ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉండవో వారు ఈ చానెల్లో బయటకు వెళ్లిపోతారు. అలాంటి వస్తువులు, బంగారం తీసుకొచ్చిన వాళ్లు రెడ్ చానెల్లోకి వెళ్లి ఆయా వస్తువుల్ని డిక్లేర్ చేయడంతో పాటు పన్ను చెల్లించి వస్తారు. గ్రీన్ చానెల్లో బయటకు వస్తున్న కేరళ వాసి వ్యవహారాన్ని శంషాబాద్ కస్టమ్స్ అధికారులు అనుమానించారు. ఆపి తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాచిన సంచిలో ఉన్న 1900 గ్రాముల పేస్ట్ దొరికింది. దీన్ని ప్రాసెసింగ్ చేసిన అధికారులు 1164.9 గ్రాముల బంగారంగా మార్చారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకొచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
దుబాయి, దోహాలో ప్రవాసీ భారతీయ దివస్
దుబాయి : మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన 1915 జనవరి 9ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2003 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలోని దుబాయి ఇండియన్ కాన్సులేట్, ఖతార్‌లోని దోహా ఇండియన్ ఎంబసీల ఆధ్వర్యంలో ఈనెల 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించారు. ఇందులో అధికారులతో పాటు పలువురు తెలంగాణ ప్రవాసీలు పాల్గొన్నారు. -
‘ప్రజా సంకల్పయాత్ర’కు సంఘీభావంగా పాట
దోహా : జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా దోహాలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాటను విడుదల చేశారు. దోహా ఖతార్ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొండపాటి శశి కిరణ్ మాట్లాడుతూ.. మహమద్అలీ చాలా చక్కగా,పాట రాశారని, ఈ పాట ద్వారా ప్రజలను చైతన్య పరిచి, జగనన్నను 2019 లో ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు, మహమ్మద్ అలీ పార్టీకు చేస్తున్న సేవ అభినందనీయమని, ఇంకా మరెన్నో పాటలు రాయాలని ఆశించారు. జననేత జగనన్న మీద టీడీపీ ఒక ఆరోపణ చేస్తూనే ఉందని అదే ఏమిటంటే జగన్ లక్ష కోట్లు దోచుకున్నకున్నాడని.. అది వాస్తవం అని... ఆ లక్ష కోట్లు ఏంటంటే లక్షల హృదయాలు, కోట్లాదిమంది ప్రజల ప్రేమను ఆయన దోచుకున్నారని, అదే తన ఆస్థిగా భావించి, ఆ లక్షల కోట్ల లోనే, నిత్యం ఉంటూ, వాళ్ల బాధలను వింటున్నారని తెలిపారు. కో కన్వీనర్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈ పాటను చాలా చక్కగా రచించిన మహమ్మద్ అలీకి అభినందనలు తెలిపారు ,ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశాభావం వ్యక్తo చేసారు . సేవాదళ్ ఇంచార్జి విల్సన్ బాబు మాట్లాడుతూ.. ఖతార్ కమిటి నిర్మించిన పాటను ప్రజా సంకల్పయాత్రలో అన్నీ నియోజక వర్గాలలో చేరువ చేయడానికి పార్టీ పెద్దలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు, మైనారిటీ ఇన్చార్జ్ దర్బార్ బాషా మాట్లాడుతూ ,మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణతో 2019 లో జగనన్న సీఎం అవ్వడం తధ్యమన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
ఖతార్ : ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ధ్వంద వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయిన్ ఖాలిద్, రావు గారి విల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న దోహా ఖాతర్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రకు హోదా 10 ఏళ్లు అవసరమని ఒక నాయకుడు చెప్పాడని, పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకేటేశ్వర స్వామి సాక్షిగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారన్నారు. ఇక చంద్రబాబు అయితే 10 కాదు 15 ఏళ్లు కావాలన్నాడని, అధికారంలోకి రాగానే ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మాట మార్చడాని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని తెలిపారు. దోహా ఖతార్ యూత్ ఇంచార్జ్ మనీష్ మాట్లాడుతూ.. హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అన్నారు. హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దీంతో గల్ఫ్ బాట పట్టే కష్టాలు తీరుతాయన్నారు. మన హక్కును సాధించేవరకు జననేత జగన్‌తో కలిసి పోరాటం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు షేక్ జాఫర్, గిరిధర్, ప్రధాన సలహాదారులు ఎస్ ఎస్ రావు, విల్సన్ బాబు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వర్ధనపు ప్రకాష్ బాబు, నల్లి నాగేశ్వరరావు, సహాయ కోశాధికారి భార్గవ్, బీసీ సభ్యుడు పిల్లి మురళి కృష్ణ, స్పోర్ట్స్ సభ్యుడు నేతల జయరాజు, సోషల్ మీడియా సభ్యుడు జేటి శ్రీను, మరియు యం. రాజు, మోహన్ రెడ్డి, పవన్ రెడ్డి, నాగరాజు, కె. అరుణ్ తదితరులు పాల్గోన్నారు. -
‘ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి’
దోహా ఖతార్ : ప్రత్యేక హోదాతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహా ఖతార్ విభాగం పేర్కొంది. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఎస్ ఎస్. రావు గారి విల్లా, ఆయిన్ ఖాలిద్ ప్రాంతములో నేడు పార్టీ యూత్ ఇన్ఛార్జీ మనీష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ వివరాలను గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కన్వీర్ శశికిరణ్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, పూటకో మాట మారుస్తున్న అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. ఇక ఇన్ఛార్జీ మనీష్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమని పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, రాయితీలు వచ్చి ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, తద్వారా గల్ఫ్ వలసల బారిన పడకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుందని ఆయన చెప్పారు. అందుకే వైఎస్ జగన్ పోరాటానికి ఏపీ యువత మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ జాఫర్, ప్రధాన సలహాదారులు ఎస్ ఎస్ రావు, విల్సన్ బాబు, గావర్ని0గ్ కౌన్సిల్ సభ్యులు వర్ధనపు ప్రకాష్ బాబు, నల్లి నాగేశ్వరరావు, సహాయ కోశాధికారి భార్గవ్, బిసి సభ్యుడు పిల్లి మురళి కృష్ణ, స్పోర్ట్స్ సభ్యుడు నేతల జయరాజు, సోషల్ మీడియా వింగ్ సభ్యుడు ఇంజేటి శ్రీను, మరియు యం. రాజు, మోహన్ రెడ్డి, పవన్ రెడ్డి, నాగరాజు, కె. అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
దోహలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
దోహా : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖతార్ రాజధాని దోహలో దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 400 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజానేత జగన్మోహన్ రెడ్డికి ఖతార్‌లో ఉన్న తెలుగు వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని, వారి ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధిస్తున్నామన్నారు. కె. శివప్రసాద్ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఏర్పడే నూతన కమిటీ సభ్యులు తమ శక్తి కొలది పార్టీ అభ్యున్నతికి పని చేస్తూ ఖతార్‌లో ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖతార్ తెలుగుకళాసమితి వ్యవస్ధాపకులు కె. శివప్రసాద్, జాఫర్ హుస్సేన్, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్. సాంబశివ రావు, పారిశ్రామకవేత్త సామాజిక సేవకులు ఆర్. సూర్యప్రకాష్ రావు, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు, వర్ధనపు ప్రకాష్, ఎస్. షాహాబుద్దీన్, ఎన్. నాగేశ్వరరావు, ఎన్. జయరాజు, మట్ట రాజు, ఎం. సందేష్ కుమార్, ఎం.బి. ప్రశాంత్, జి. చంటి, బి. గిరిధర్, తదితరులు పాల్గొన్నారు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్ తొలి రౌండ్లో పంకజ్ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్ సలూమీ (యెమెన్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో పోటీపడిన పంకజ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కే చెందిన అలోక్ కుమార్, లక్ష్మణ్ రావత్ కూడా నాకౌట్ తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. -
పక్షి ఢీ.. తప్పిన పెను ప్రమాదం!
సాక్షి, చెన్నై : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహాకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన విమానాన్ని కొంత సమయానికే ఓ పక్షి ఢీకొట్టింది. ఏదో సమస్య తలెత్తిందని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (2:15 గంటలకు) ఇండిగో విమానం చెన్నైకి చేరినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆ విమానంలోని 134 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు. గురువారం వేకువ జామున 4:30 గంటలకు మరో విమానాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్ధం చేసింది. ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఆ విమానంలో దోహాకు బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వేరే విమానంలో ప్రయాణించే ఏర్పాట్లు చేశామన్నారు. -
మళ్లీ ప్రపంచాన్ని గెలిచాడు....
తాము ఎంచుకున్న ఆటలో ఒక్కసారైనా ప్రపంచ చాంపి యన్‌గా నిలవాలని క్రీడాకారులు కలలు కంటారు. అలాంటిది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 17 సార్లు ప్రపంచ టైటిల్ సాధిస్తే ఆ ఘనత అసాధారణం. భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ అలాంటి ఘనతనే సాధించాడు. ప్రపంచ టైటిల్ అంటే తనకు మంచినీళ్లప్రాయంలా మారిందని నిరూపిస్తూ ఈ బెంగళూరు ఆటగాడు ఆదివారం మరోసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. దోహా: గత ఏడాది ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (150 అప్ ఫార్మాట్) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6–2 (0–155, 150–128, 92–151, 151–0, 151–6, 151–0, 150–58, 150–21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. రసెల్‌తో జరిగిన ఫైనల్లో పంకజ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఫ్రేమ్‌ను రసెల్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దక్కించుకున్నాడు. అయితే రెండో ఫ్రేమ్‌లో పంకజ్ తేరుకొని స్కోరును సమం చేశాడు. మూడో ఫ్రేమ్‌ను కోల్పోయిన ఈ భారత స్టార్ నాలుగో ఫ్రేమ్ నుంచి తన జోరును ప్రదర్శించాడు. రసెల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ 5–2తో రూపేశ్ షా (భారత్)పై, రసెల్ 5–1తో పీటర్ గిల్‌క్రిస్ట్ (ఇంగ్లండ్)పై గెలిచారు. సోమవారం ఇదే వేదికపై లాంగ్అప్ ఫార్మాట్లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. ఈ ఫార్మాట్లోనూ పంకజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. లాంగ్అప్ ఫార్మాట్ పోటీలు ముగిశాక ఈనెల 15న విజేతలకు ట్రోఫీలను అందజేస్తారు. తాజా విజయంతో పంకజ్ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్–2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్–2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
అక్కడ అప్రమత్తంగా ఉండండి: భారత్
దుబాయ్: ఖతర్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది. టెర్రరిజానికి ఖతర్ మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ పలు గల్ఫ్ దేశాలు ఆ దేశంతో తమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఖతర్‌తో రవాణా సంబంధాలను కూడా తాము తెగదెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్, ఈజిప్టు దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటించాలనుకునే ఖతర్‌లోని భారతీయులు తమ ప్రయాణప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఖతర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, భారతీయుల రక్షణ, భద్రత వంటి అంశాలపై ఆ దేశ అధికారిక వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
ఖతార్ సంచలన నిర్ణయం: కఫాలా రద్దు
దోహా: గల్ఫ్ దేశం ఖతార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధునిక బానిసత్వంగా భావించే ‘కఫాలా’ పని వ్యవస్థను సమూలంగా రద్దు చేసింది. డిసెంబర్ 13(మంగళవారం) నుంచే ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తామని ఖతార్ కార్మికశాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలి ప్రకటించారు. కార్మిక చట్టం నంబర్ 21, 2015 ఆధారంగా కఫాలాను రద్దుచేశామని, ఇకపై తమ దేశంలో పనిస్తోన్న, పనిచేయగోరే విదేశీ కార్మికులను ‘కాంట్రాక్టు కార్మికులు’గా గుర్తిస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో ఖతార్‌లో పనిచేస్తోన్న భారతీయులు సహా మొత్తం 21 లక్షల మంది విదేశీ కార్మికులకు మేలు జరగనుంది. ఏమిటీ కఫాలా?: ఖతార్ సహా సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఒమన్, యూఏఈల్లో 'కఫాలా' వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం.. ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. పనిలో చేరాక కార్మికుల వీసాలు యజమానుల అధీనంలో ఉంటాయి. దీంతో యజమానుల అనుమతి లేకుండా కార్మికులు పని మారేందుకు వీలుండదు. యజమాని ఎంత ఇబ్బంది పెట్టినా అతడి దగ్గరే పడి ఉండాలి. భరించలేక పారిపోతే మాత్రం జైలు, జరిమానా వంటి శిక్షలు తప్పవు. ఇళ్లలో పనిమనుషులు కఫాలా వ్యవస్థ వల్ల దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకీ సంచలన నిర్ణయం?: కార్మికుల విషయంలో, మరీ ముఖ్యంగా విదేశీ కార్మికులపై ఉక్కుపాదంలాంటి చట్టాలకు నెలవైన ఖతార్.. కఫాలా వ్యవస్థను రద్దు చేయడానికి బలమైన కారణం ఫుట్‌బాల్ వరల్డ్‌కప్! అవును. 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీని ఖతార్ నిర్వహించనుంది. ఆ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్ల ఖర్చుతో కొత్త స్టేడియాలు, ఇతర నిర్మాణాలను చేపట్టనుంది. ఈ క్రమంలో భారత్ నుంచేకాక పలు దేశాల నుంచి కార్మికులను పనిలో కుదుర్చుకోవాలనుకుంది. అయితే ‘కఫాలా’ విధానానికి భయపడి చాలా మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు ఖతార్‌లో పనిచేసేందుకు విముఖత ప్రదర్శించారు. అంతర్జాతీయ సమాజం కూడా ఆ(కఫాలా)విధానాన్ని తూర్పారపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఖతార్ తన కార్మిక విధానాలను మార్చుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు గత ఏడాది ప్రకటించారు. ఆ విధాన నిర్ణయాలకు కొనసాగింపుగా సోమవారం ‘కఫాలా’ విధాన్ని రద్దుచేశారు. కొత్త(కాంట్రాక్టు) విధానంలోనూ ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని, ఈ మేరకు అంతర్జాతీయ సమాజం నుంచి సలహాలు కూడా స్వీకరిస్తామని మంత్రి అల్ జఫాలి చెప్పారు. -
నడిరోడ్డుపై పెద్దపులి!
దోహా: రోడ్డుపై వెళ్తుంటే అకస్మాత్తుగా పెద్దపులి ఎదురైతే ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. ఖతర్ రాజధాని దోహాలో ఓ రోడ్డుపై మంగళవారం సరిగ్గా ఇదే జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్న వారికి పులి ఎదురైంది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు కంగారు పడటంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో రావటంతో ఖతర్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులో నుంచి పులి రోడ్డుపైకి దూకినట్లగా ఆ ఫోటేజీలో కనిపిస్తోంది. దీంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పులిని తరలిస్తున్న సమయంలో రోడ్డుపైకి దూకినట్లు భావిస్తున్నారు. దీనిపై.. ఇటీవల ఖతర్‌లోని సంపన్న కుటుంబాలకు పులులను పెంచుకోవటం ఓ హాబీగా మారిందని సోషల్ మీడియాలో మిమర్శలు వస్తున్నాయి. తరువాత ఆ పులిని సురక్షితంగా పట్టుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ పులి యజమాని ఎవరనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. -
లెగ్గింగ్ లు 'ఖతర్'నాక్
లెగ్గింగ్ లెగ్గింగే. లెగ్గింగ్ ప్యాంట్ కాదంటే కాదు. మా దేశంలో లెగ్గింగ్ లు వేసుకోకూడదు అంటోంది గల్ఫ్ దేశం ఖతర్. 2022 లో ఖతర్ రాజధాని దోహాలు ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలు జరగబోతున్న నేపథ్యంలో ఇస్లామిక్ దేశం ఖతర్ లో ఎలాంటి దుస్తులు ధరించాలో చెబుతూ అక్కడి అధికారులు ఒక పెద్ద ప్రచార ఉద్యమం ప్రారంభించారు. చెడ్డీలు, బికినీలు, నడుము, కాళ్లను ఇష్టారాజ్యంగా చూపించడం, లెగ్గింగ్ ల వంటి బిగుతైన దుస్తులను ధరించవద్దన్నదే ఆ ప్రచారోద్యమ సారాంశం. ముఖ్యంగా ప్రపంచ కప్ ఫుట్ బాల్ కి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. 'నడిరోడ్డులోనే ముద్దులు పెట్టుకోవడాలు, కౌగిలించుకోవడాలు, స్లీవ్ లెస్ లు, మినీస్కర్టులు మా దేశంలో చెల్లవు గాక చెల్లవు'అంటున్నారు ఖతర్ అధికారులు. మొత్తం శరీరం కప్పుకుని ఉండటమే మాకు మర్యాద అంటున్నారు. రోమ్ లో ఉంటే రోమన్ల లా ఉండాలి. అలాగే ఖతర్ లో ఉంటే ఖతర్ లా ఉండాలి తప్ప 'ఖతర్నాక్' గా ఉండొద్దు అంటున్నారు ఖతర్ అధికారులు.