దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మరో భారత అథ్లెట్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమో దు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు. మూడో హీట్‌లో పాల్గొన్న అతను 8 నిమిషాల 25.23 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఏడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అవినాశ్ 8 నిమిషాల 28.94 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. జాతీయ రికార్డును సవరించినా తొలుత అవినాశ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
మొత్తం 44 మంది అథ్లెట్స్ మూడు హీట్స్‌లో పాల్గొనగా... 15 మంది ఫైనల్‌కు అర్హత పొందారు. అవినాశ్ ఓవరాల్‌గా 20వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే రేసు జరుగుతున్న సమయంలో అవినాశ్ దారికి అడ్డంగా రెండుసార్లు ఇథియోపియా అథ్లెట్ టెకెలె నిగేట్ వచ్చాడు. దాంతో అవినాశ్ ప్రమే యం లేకుండా అతని వేగం తగ్గిపోయింది. రేసు ముగిశాక ఈ విషయంపై నిర్వాహకులకు భారత బృందం అప్పీల్ చేసింది. నిర్వాహకులు వీడియో ఫుటేజీని పరిశీలించి అవినాశ్ తప్పు లేదని నిర్ధారించారు. అవినాశ్‌కు 16వ అథ్లెట్‌గా ఫైనల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
అన్ను రాణికి 8వ స్థానం
మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత అమ్మాయి అన్ను రాణి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా ఈటెను 61.12 మీటర్ల దూరం (రెండో ప్రయత్నంలో) విసిరింది. కెల్సీ (ఆ్రస్టేలియా–66.56 మీటర్లు) స్వర్ణం... షియింగ్ లియు (చైనా–65.88 మీటర్లు) రజతం... హుయ్‌హుయ్ లియు (చైనా–65.49 మీటర్లు) కాంస్యం నెగ్గారు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అన్ను జావెలిన్‌ను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment